జూరాల-పాకాల


Mon,January 9, 2012 12:00 AM

కృష్ణా నీటిని జూరాలనుంచి పాకాల దాక ఎటువంటి లిఫ్ట్ (ఎత్తిపోతల పథకం) లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు. నిజమేనా?

-చెలమల్లు గిరివూపసాద్, మియాపూర్, హైదరాబాద్


తెలంగాణ వస్తే జూరాలనుంచి పాకాల వరకు తక్కువ ఖర్చుతో కాలువ తీయవచ్చని అందరూ అంటుంటారు. కానీ అది సాధ్యం కాదని వ్యతిరేకులు వాదిస్తారు. ఈ కాలువ తీయడం సాధ్యమేనా? దీనివల్ల తెలంగాణకు ఎంతవరకు లాభం?

-కీర్తి కాంత్


శ్రీశైలం ఎడమగట్టు కాలువనుంచి డిండి ఎత్తిపోతల పథకం గురించి వివరించండి? జూరాల నుంచి పాకాల వరకు వరద కాలువ గ్రావిటీ మార్గంగా తవ్వే వీలుంటుందని కేసీఆర్ చెప్పారు. దాని గురించి కూడా తెలుపండి .

-కోమటిడ్డి జనార్ధన్‌డ్డి , నల్లగొండ


ముగ్గురు పాఠకులు జూరాల నుంచి పాకాల స్కీం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత చూపుతున్నారు. ఈ స్కీం గురించి కేసీఆర్ తన ప్రసంగాలలో ఉటంకించడమే దీనికి కారణం కావచ్చు. డిండి లిఫ్ట్ గురించి కూడా ఓపాఠకుడు అడిగారు. ఈ పథకం గురించి మున్ముందు తెలియజేస్తాను. ప్రస్తుతం ‘జూరాల-పాకాల’ స్కీం గురించి తెలుసుకుందాం. అనేక సభలలో కేసీఆర్ ఈ పథకం గురించి మాట్లాడటం కరెక్టే. అయితే ఇలాంటి పథకమేదీ ఇంతవరకు ప్రభుత్వం రికార్డుల్లో లేదు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు ఈ పథకానికి రూపకల్పన చేసి ఏదో ఓ సందర్భంగా కేసీఆర్‌కు చెప్పడం జరిగింది. జూరాల నుంచి వరద జలాలను పాకాల చెరువుకు గ్రావిటీ మార్గంగా మళ్లించవచ్చు అన్న ప్రతిపాదన కేసీఆర్‌కు బాగా నచ్చింది. ఆ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వానికి సమర్పించమని ఫోరం సభ్యులను కేసీఆర్ కోరారు. జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున వరద జలాలను 30 రోజులపాటు ఈ పథకం స్వీకరిస్తుంది.జూరాల జలాశయం పూర్తి స్థాయి (FRL)31.516 మీటర్లు కాగా 315 మీటర్ల పూర్తి సరఫరా స్థాయి(FSL)తో ఒక కాలువతో ఈ నీటిని 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జంట సొరంగాలలో విడుదల చేస్తుంది. ఒక్కొ సొరంగం వ్యాసం 15 మీటర్లుగా నిర్ధారించారు. 90 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ సొరంగంలో ఈ నీటిని కొత్తగా నిర్మించ తలపెట్టిన ‘మధ్య డిండీ జలాశయం’లోకి వదుల్తాయి. మధ్య డిండి పూర్తి జలస్థాయి 292 మీటర్లు. నీటి నిలువ సామర్థ్యం 11 టీఎంసీలు. మధ్య డిండీ జలాశయం నుంచి ఒక కాలువ 25 మీ (FSL) 260 కి.మీ. దూరం ప్రయాణం చేసి ఆ వరదనీటిని పాకాల జలాశయం చేరుస్తుంది. పాకాల పూర్తి జలస్థాయి 252.92 మీటర్లు. పాకాల జలాశయం నిలువనీటి సామర్థ్యం3.4టీఎంసీలు. ఇక్కడ గమనించవలసిందేమంటే జూరాల జలాశయం పూర్తి జలస్థాయి 31.516 మీటర్లు. మధ్య డిండి(కొత్త జలాశయం) పూర్తి జల స్థాయి 292 మీటర్లు. పాకాల జలాశయం (FRL) 252.92 మీటర్లు. కనుక వరదనీరు గ్రావిటీ మార్గంగా (వాలు మార్గంగా) ఎక్కడా ఎత్తిపోతలు లేకుండా, ప్రవహించే అవకాశముంది. ఈ నీటిని తీసుకెళ్లే వాహకాలు- తొలుత ఒక కాలువ, జంట సొరంగాలు, చివరగా ఒక కాలువ.

రెండు కాలువల నిడివి 25 కి.మీ. సొరంగాల నిడివి 90 కి.మీ. అంటే 375 కి.మీ. ప్రయాణం చేస్తే తప్ప జూరాల నీరు పాకాలలోకి చేరదన్నమాట. ఇకపోతే ముఖ్యమైన విషయం మరొకటుంది. 30రోజులపాటు జూరాలలో వరద జలాలు రోజుకు రెండు టీఎంసీల చొప్పున వెరసి 60 టీఎంసీల నీరు లభ్యమవుతుందని ఈ పథకం అం చనాపస్తుతం జూరాల నుం చి 17.4 టీఎంసీల నికర జలాలను జూరాల కాలువకు, 20 టీఎంసీల నికర జలాలను భీమాప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది. మరో 22 టీఎంసీల మిగులు జలాలను నెట్టంపాడుకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటివరకు జూరాలనుంచి కేవలం 59.4 టీఎంసీల నీటిని మాత్రమే డైరెక్టుగా వినియోగించడానికి అనుమతి ఇచ్చింది. జూరాల నీటిని రాజోలిబండ కాలువలకు నీటిని వదుల్తున్నా దానికి ఇంతవరకు ఎలాంటి ప్రత్యేకమైన కేటాయింపులు చేసినట్టు లేదు. అంటే జూరాల కోసం కేటాయించిన 17.4 టీఎంసీల నీటితోనే సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేటాయింపులు పోను, మిగతా నీటిని శ్రీశైలంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా 19 టీఎంసీల నికర జలాలు శ్రీశైలం కుడి కాలువ, 15 టీఎంసీలు మద్రాసు తాగునీటి కోసం తెలుగు గంగకు విడుదల చేయడానికి అనుమతి ఉంది.శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశాక విడుదల చేసిన నికర జలాలు నాగార్జున సాగర్ జలాశయం చేరుతాయి. ఇక మి గులు జలాల విషయానికి వస్తే శ్రీశైలం నుంచి వెలిగొండ, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి పథకాల కోసం 205.5 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. అంటే మరోమాటలో చెప్పాలంటే జూరాల, శ్రీశైలం రెండు జలాశయాలనుంచి 227.50 టీఎంసీల మిగులు జలాలు వినియోగానికి ఇప్పటికే ప్రణాళికలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూరాల నుంచి పాకాల కోసం 60 టీఎంసీల మిగులు జలాలు లభ్యం కాగలవా అన్నది అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోవలసిన ప్రధాన అంశం. ఇంతేగాక ఇదివరకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇదే రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు ప్రభుత్వానికి పరిశీలనార్థం సమర్పించడం జరిగింది. దానికి 70 టీఎంసీల మిగులు జలాలు కావాలి. అంటే కొత్తగా జూరాలనుంచి తలపెట్టిన రెండు పథకాల కోసం 130 టీఎంసీల మిగులు జలాల అవసరం ఏర్పడుతున్నది. ఇదివరకే ప్రభుత్వం కమిట్ అయిన 227.50 టీఎంసీల మిగులు జలాలకు అదనంగా మరో 130 టీఎంసీల మిగులు జలాల లభ్యత గురించి సీరియస్‌గా అధ్యయనం చేయడం తప్పనిసరి అవుతుంది.
ఇదిలా ఉంటే కృష్ణా మిగులుజలాల విషయంలో పై రాష్ట్రాలు అంటే కర్ణాటక, మహారాష్ట్రలు తమకు వాటా ఉందని ఎప్పటినుంచో పేచీలు పెడుతున్నాయి. లోగడ కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు పంచిన బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాల పంపకాల విషయం తదుపరి ట్రిబ్యునల్‌కు వదిలేసి అప్పటిదాక మిగులు జాలాల వినియోగంపై ఆంధ్రవూపదేశ్‌కు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది.ఈ తీర్పుపైన రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ముఖ్యంగా కర్ణాటక వీలైన ప్రతిసారి ఆంధ్రవూపదేశ్ తనకు సంక్రమించిన సేచ్ఛను హక్కుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని సుప్రీంకోర్టులో అర్జీలు పెట్టుకుంది. సుప్రీంకోర్టు ఆంధ్రవూపదేశ్‌కు మిగులు జలాలపై ఎలాంటి హక్కులు లేవని పునరుద్ఘాటించింది. కొత్తగా ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల మొత్తాన్ని 25 టీఎంసీలుగా నిర్ధారించి అందులో 145 టీఎంసీలను ఆంధ్రవూపదేశ్‌కు, 105 టీఎంసీలను కర్ణాటకకు, 35 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది. ఆంధ్రవూపదేశ్‌కు కేటాయించిన145 టీఎంసీలలో 25 టీఎంసీలను తెలుగుగంగకు, 120 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ స్టోరేజి కోసం నిర్ధారించడం జరిగింది. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆంధ్రవూపదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాలు అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశాయి. ఏదేమైనా మిగులు జలాల విషయంలో ఆంధ్రవూపదేశ్ వాటా ఎంతో నిర్ధారణ కావ డం కష్టం. వాటాయే తేలనప్పుడు ఇప్ప టి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిగులు జలాల ఆధారిత పథకాలకు నీరందే అవకాశం స్పష్టంగా కనిపించనప్పుడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా జూరాల-పాకాల కానీ, జూరాల-పాలమూరు లిఫ్ట్ స్కీంలు కానీ ఆచరణకు నోచుకుంటాయని నాకనిపించడం లేదు. జూరాల-పాకాల స్కీం కోసం సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఫోరం ఇంజనీర్లు అంచనా వేశారుయగావిటీతో ఈ పథకం ఎంత ప్రయోజనకారి అయినా సాంకేతికంగా ఎంత అనువుగా ఉన్నా లబ్ధి-వ్యయ నిష్పత్తుల కారణంగాఎంత అనుకూలంగా ఉన్నా మిగులు జలాల లభ్యత విషయంలో స్పష్టత వచ్చేవరకు ఈ పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కూడా భావించడం కష్టమే.

నికర జలాలు, మిగులు జలాలు కాకుండా నదులలో వరద జలాలు లభ్యమవుతాయి. అయితే అవి తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో ఉధృతితో లభించడం వల్ల వాటిని ఒడిసి పట్టుకోవడం, వినియోగించుకోవడం సాంకేతికంగా సాధ్యం కాదు. అలాంటి వరదజలాలకు విశ్వసనీయత చాలా తక్కువ.కనుక వరద జలాలను ఆధారంగా పథకాలను రచించడం కుదరదు. యాభై శాతం విశ్వసనీయత ఆధారంగా లభించే జలాలను నమ్ముకొని రచించే పథకాలనే ప్రణాళికా సంఘం ప్రస్తుతం అంగీకరించడం లేదు. అనేక రాష్ట్రాలు దేశంలో ఉన్న కరువు పీడిత క్షేత్రాలకు ఉపయోగపడేందుకు అనువుగా యాభైశాతం డిపెండబులిటీని అంగీకరించాలని కేంద్రంపై వత్తిడి చేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రణాళికాసంఘం సాగునీటి ప్రాజెక్టుల విషయం లో ఇప్పుడనుసరిస్తున్న 75 శాతం విశ్వసనీయతను సడలించి 50 శాతం అంగీకరించవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తక్కువ విశ్వసనీయత కలిగిన వరదజలాలపై ఆధారపడి రూపొందించే ప్రాజెక్టులను అంగీకరించదు. ఈ నేపథ్యంలో జూరాల-పాకాల లాంటి స్కీంలు తెలంగాణకు ఎంత ఉపయోగపడే విధంగా ఉన్నా, అమలుకు నోచుకోవడం సాధ్యపడక పోవచ్చు. అందులోనూ ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ ప్రయోజనాలను గండికొట్టే విధంగా ఉన్నాయి. బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ సమైక్య ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను బేసిన్‌కు ఆవల ఉన్న రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నది. కనుక ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడకుండా అటు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, ఇటు ‘జూరాల పాకాల’ గ్రావిటీ స్కీం గానీ అమలు కావు. మనం వత్తిడి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు దాన్ని ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతుందే తప్ప ఈ స్కీంలకు అనుకూలంగా పరిశీలించదు. అయినా ప్రయత్నిస్తే తప్పులేదు. జూరాల-పాకాల పథకాన్ని రూపొందించే ప్రక్రియలో ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించాలన్న ఇంజనీర్ల ఫోరం వారి కృషి అభినందనీయమే. వచ్చిన చిక్కల్లా ఈ వలసవాదుల ఆధిపత్యపు నీడన నడుస్తున్న ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను తెలంగాణకు తరలించే ప్రక్రియకు అంత సులువుగా ఒప్పుకుంటుందా! ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ఈ ప్రాజెక్టు వెలుగుచూడక పోవచ్చు.

సాగునీటి సంఘాలు
ప్రపంచవ్యాప్తంగా సాగునీటి నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పజెప్పడం ద్వారా నీటి వినియోగం సక్రమంగా జరుగుతుందని గుర్తించారు. కాలువలు బాగుం తమ ఆర్థికస్థితి మెరుగుపడుతుందని తెలిసిన రైతులు వాటి మరమ్మత్తులు, పరిరక్షణ పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. 173లో అమల్లోకి వచ్చిన ఉత్తర భారత కాలువ మురుగునీటి చట్టం, 176లో రూపొందిన బెంగాల్ నీటి పారుదల చట్టం, 179లో తయారైన బాంబే నీటిపారుదల చట్టాన్ని పరిశీలించినా ఇవన్నీ కూడా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న అనేక రాష్ట్రాల చట్టాలు చూస్తే అధికారాలన్నీ నీటిపారుదల శాఖ చేతుల్లోనే ఉన్నాయి. రైతులు పూర్తిగా సాగునీటి అధికారుల పైనే ఆధారపడుతున్నారు. 1976లో మహారాష్ట్ర సాగునీటి చట్టం నీటిపారుదల నిర్వహణలో రైతుల భాగస్వామ్యాన్ని సూత్రవూపాయంగా అంగీకరించింది. నీటి సంఘం సభ్యులకు నిర్ణీత ఘనపరిమాణంలో నీరు సరఫరా చేసేందుకు చట్టం అనుమతించింది. రైతుల భాగస్వామ్యానికి చక్కని ఉదాహరణ గుజరాత్ రాష్ట్రం. ‘ఉకై’ ప్రాజెక్టులో మోహినీ సహకార సంఘం చాలా కాలంగా చక్కగా పని చేస్తున్నది. మన రాష్ట్రంలో ఆంధ్రవూపదేశ్ రైతుల సాగునీటి నిర్వహణ చట్టం 1997లో అమల్లోకి వచ్చింది. ఫలితంగా 10,292 సాగునీటి సంఘాలు అవతరించాయి. భారీ ప్రాజెక్టులకు సంబంధించిన 172 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కూడా ఏర్పడ్డాయి. ఈ నీటి సంఘాలకు జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలను మరిపిస్తాయి. అవే పార్టీలు డబ్బు, మద్యం పంచడాలు.. అంతామామూలే. ఏదేమైనా ఈ సాగునీటి సంఘాలు సంతృప్తికరంగానే తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని కొందరంటుంటే, పదవులు పొందడానికే ఈ సంఘాలు ఉపయోగపడుతున్నాయి తప్ప రైతుల సమస్యలు ఏవీ పరిష్కరించబడటంలేదని మరి కొందరు అభివూపాయపడుతున్నారు.

-ఆర్ విద్యాసాగర్‌రావు,
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర