కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం


Sat,June 6, 2015 12:18 AM

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న చెరువులు, పంచాయతీరాజ్‌శాఖ నిర్మించి తరువాత నీటిపారుదల శాఖకు బదిలీ చేసిన చెరువులు, పర్కోలేషన్ చెరువులు, అటవీ చెరువులు, ప్రైవేట్ చెరువులు, ఆనకట్టలు, చెక్‌డ్యాంలు.. గణన ప్రకారం మొత్తం 46,431 చెరువులున్నాయి. వాటిలో ప్రతి ఏటా ఇరవై శాతం
(9,627) ట్యాంకుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
తెలంగాణ ఆవిర్భవించి ఏడాది పూర్త యింది. ఈ ఏడాది కాలంలో నీటి పారుదల రంగం లో ఏం చేశామన్నది మనం ప్రజలకు చెప్పుకోవాలి.

సమైక్య పాలనలో మన నీళ్ళు మనకు కాకుండా పోయాయి.మనచెరువులు ధ్వంసమయ్యాయి. హైదారాబాద్ రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని కుదించబడ్డాయి. ఆంధ్రప్రాంత ప్రయోజనాలు కాపాడే యోచనతోనే తెలంగాణ ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది తప్ప తెలంగాణ కోణంలో ఏ ప్రాజెక్టు నిర్మించబడలేదన్నది పచ్చి నిజం. గోదావరి, కృష్ణానదీ జలాలను తమ ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు నిర్విరామంగా నిరాటంకంగా జరిగాయి.

తెలంగాణ ప్రాజెక్టు లు పక్కరాష్ర్టాల అవరోధాలు, అటవీశాఖ సమస్యలు, కేంద్ర జలసంఘం అభ్యంతరాల చిక్కుముడులతో సతమతమై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దాన పడిఉన్నాయి. ఇందుకు సజీవ సాక్షం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది అన్నది ప్రస్తుతాం శం. ముందుగా కృష్ణా, గోదావరి నదులలో మనరాష్ర్టానికి రావలసిన నీటి వాటాల గురించి తెలుసుకుం దాం. గోదావరిలో ప్రస్తుతం ఎలాంటి పేచీ లేదు. ఉన్నదల్లా కృష్ణా జలాలపైనే కనుక వాటి గురించి మాట్లాడుకుందాం.

కృష్ణా నదీజలాలు- తగాదాలు: బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పంచిన నికర జలాలు 811టీఎంసీలు. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు అని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ తరువాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను పంచింది. అందులో కూడా తెలంగాణకు స్వల్పంగా 9 టీఎంసీలే లభించాయి. తెలంగాణకు నీటి వాటా న్యాయబధ్ధంగా లభించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునళ్ల ఎదుట సమర్థవంతంగా వాదించనందువల్లే మనకీ దుర్గతి పట్టింది.

R-Vidyasagar-Rao

ఏ ట్రిబ్యునళ్ల ఎదుటకూడా మన వాదనను వినిపించే అవకా శం కలగలేదు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పంపిణీ చేయాలని మన ప్రభుత్వం గత జూలైలోనే కేంద్ర ప్రభుత్వానికి అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం-సెక్షన్(3) ప్రకా రం ఫిర్యాదు చేసింది. త్వరలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయడం కానీ లేక ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్తీకరణ చట్టం, 2013 ప్రకారం మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున ల్‌కు మన ఫిర్యాదు పరిశీలించమని కేంద్రం కోరే అవకాశం ఉన్నది.

బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపైన ప్రస్తుతం సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన ప్రభుత్వం కూడా అప్పీల్ చేయడం జరిగింది. తొలుత తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చుకోవాలా వద్దా అనే అంశంపైన ఇతర రాష్ర్టాల వాదనలు విన్నాక మనల్నికూడా చేర్చుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడటం శుభపరిణామం. సుప్రీంకోర్టు తీర్పు రెండు నెలల్లో రావొచ్చు.

మరో రెండేళ్ల కాలం పాటు పదవీకాలం పొడిగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి పంపకం, కొరత ఉన్న కాలంలో ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు నిర్ణయించే పనికోసమే ఏర్పాటయ్యిం ది. అయితే ఈ పని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జరగాలా లేక కేవలం తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్యనే జరగాలా అన్నది నిర్ణయించాల్సి ఉన్నది. ఏదేమైనా తెలంగాణకు సంక్రమించిన నీటిని కాపాడుకోవడం, గత అన్యాయాలను చెప్పి మరింత వాటా సంపాదించేందుకు ఈ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నది. సుప్రీం కోర్టులో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట మన వాదనలను వినిపించడం కోసం సమర్థులైన అడ్వొకేట్ వైద్యనాథన్‌ను, వారి వాదనలకు మద్దతుగా సాంకేతికంగా అవసరమైన నివేదికలు అందించేందుకు అనుభవజ్ణులైన ఐఐటీ ప్రొఫెసర్లు డాక్టర్ సుభాష్ చందర్,ఢిల్లీ, డాక్టర్ మోహన్,చెన్నైలను నియమించింది.


ఇదిలా ఉంటే కొత్త చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్ర నీటి సమస్యలను పరిష్కరించేందుకు కష్ణా, గోదావరి నీటి యాజమాన్య మండళ్లు ఏర్పాటు చేయ డం జరిగింది. అయితే విచిత్రం ఏమంటే ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పు ప్రకారమే ప్రాజెక్టులకు నీటిని పంచాల్సి న బాధ్యత ఈ బోర్డులకున్నది. కానీ స్వతంత్రంగా నీటి పంపకం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కనుకనే ఈ సంవత్సరకాలంలో అటు కృష్ణ మేనేజ్‌మెంట్ బోర్డు గానీ, గోదావరి మేనేజ్ మెంట్ బోర్డు గానీ ఎలాంటి నిర్ణయాలు చేయలేక నిర్వీర్యం గా ఉండిపోయాయి.
కృష్ణానదీ మేనేజ్‌మెంట్ బోర్డు: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగినట్లుగానే కృష్ణా నది నీటిని సీమాంధ్ర తరలించుకుపోయే ప్రయత్నాలను అడ్డుకొని తెలంగా ణ వాటాను సాధించుకున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014, సెక్షన్ 85ప్రకారం ఏర్పాటైన కృష్ణానది మేనేజ్‌మెంట్ బోర్డు తన పరిధిని దాటి నీటి పంపకాలు చేయడానికి పూనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభు త్వం పటిష్టంగా తన వాదనలు వినిపించి ఆంధ్ర పక్షపాతంగా సాగుతున్న నిర్ణయాలను మార్చి తెలంగాణ కు న్యాయం జరిగేటట్లు చేసింది. శ్రీశైలం నుంచి రాయలసీమలోని అక్రమ ప్రాజెక్టులకు నీటి తరలింపును అడ్డుకుంది తెలంగాణ ప్రభుత్వం. శ్రీశైలంలో +854 లెవల్ వరకు మాత్రమే వాడాలన్న వాదనను తిప్పికొట్టి, +834 అంతకు తక్కువ లెవల్ వరకు నీటిని విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకుని బోర్లపై ఆధారపడ్డ తెలంగాణ రైతులను ఆదుకునే వెసులు బాటు తెలంగాణకు ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వం బోర్డుకు స్పష్టం చేసింది.

కృష్ణా డెల్టాకు ట్రిబ్యునల్ ఆదేశాలకు భిన్నంగా ఇంతకు ముందువలే నాగార్జునసాగర్ నుంచి అక్రమంగా నీటిని విడుదల చేయకుం డా ఆపేసింది. తమ వాటాకు వచ్చిన నీటిని ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ తనకుందని మన ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రా పాలకుల అభ్యంతరాలను పక్కన పెట్టి మన వాటా నీటిని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రెండో పంటకు కొంతమేరకు ఇచ్చుకోగలిగాం.
సీలేరు ప్రాజెక్టుపై తమకే హక్కు ఉందన్న ఆంధ్రప్ర దేశ్ వాదన తప్పని, విభజన చట్టం ప్రకారం తమకు కూడా భాగస్వామ్యం ఉండాలని గోదావరి నది మేనే జ్‌మెంట్ బోర్డు ముందు చెప్పింది ప్రభుత్వం.

మిషన్ కాకతీయ: చెరువులు, కుంటలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. వాటి నిర్మాణం కాకతీయుల కాలం నాటి నుంచే జరిగింది. కొనసాగింపు గా, కుతుబ్ షాహీ, అసఫ్‌జాహీ పాలనలు కూడా ఎన్నో చెరువులు నిర్మించాయి.పాత చెరువులను కాపాడాయి.

వాటి నిర్వహణకు ఒక పాలనావ్యవస్థను ఏర్పాటు చేయబడింది. తెలంగాణ గ్రామాల్లోని సంక ట పరిస్థితులకు చాలావరకు పరిష్కారం ఈ చెరువుల పునరుధ్ధరణ వల్ల జరుగుతుంది. అందువల్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువుల పునరుధ్ధరణకు అత్యంత ప్రాధానమిచ్చింది.

ప్రభుత్వం చిన్న నీటి పారుదల వనరుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం అనే బృహత్తర కార్యక్రమం మిషన్ కాకతీయ, మన ఊరు-మన చెరువు అనే నినాదంతో తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల్లో చిన్న నీటిపారుదల రంగంలో కేటాయించబడ్డ 265 టీఎంసీలను నిలువచేసేందుకు చేపట్టడం జరిగింది.

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటిపారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న చెరువులు, పంచాయతీరాజ్‌శాఖ నిర్మించి తరువాత నీటిపారుదల శాఖకు బదిలీ చేసిన చెరువులు, పర్కోలేషన్ చెరువులు, అటవీ చెరువులు, ప్రైవేట్ చెరువులు, ఆనకట్ట లు, చెక్‌డ్యాంలు.. గణన ప్రకారం మొత్తం 46,431 చెరువులున్నాయి. వాటిలో ప్రతి ఏటా ఇరవై శాతం (9,627) ట్యాంకుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఇంతకు ముందు చిన్ననీటి పారుదల పర్యవేక్షణకు కేవలం అయిదు సర్కిల్లు, అరకొర సిబ్బందితో చెరువులు నిర్వీర్యమయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కృష్ణానది బేసిన్‌కు, గోదావరి నది బేసిన్‌కు ఒక చీఫ్ ఇంజనీర్ చొప్పున నియమించారు.

ప్రతి జిల్లాకు ఒక సర్కిల్ (సూపరిటెండింగ్ ఇంజనీర్)ను, ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒక డివిజన్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)ను, ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్-డివిజన్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)ను, ప్రతి మండలానికి ఒక సెక్షన్ ఆఫీసు(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)ను ప్రభుత్వం నియమించింది. మిషన్ కాకతీయకు ఈ వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తున్నది. ఇంజనీర్లకు సర్వే తదితర అంశాలకు అవసరమై నవి సమకూర్చింది. ఇంజనీర్లు కూడా ముఖ్యంగా యువ ఇంజనీర్లు తమ పూర్తిశక్తిని ధారపోసి మిషన్ కాకతీయ పనులను సకాలంలో పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనుభవజ్ఞులైన రెటైర్డ్ అసిస్టెంటు ఇంజనీర్లను కూడా తిరిగి నియమించుకున్నది ప్రభు త్వం. సెక్రటేరియేట్ ఉద్యోగులు కూడా తమవంతు కృషి చేస్తున్నారు.

కొత్తప్రాజెక్టుల రూపకల్పన: ప్రభుత్వం ఏర్పడ్డ వెం టనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి ఇంజనీర్లు, స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాను నియమించింది ప్రభు త్వం. దాంతోపాటు రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులతో కలిసి ఎన్నో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనకారిగా ప్రాజెక్టు ఉండేట్టు తయారుచేయడానికి ప్రతిపాదనలను తయారు చేయిస్తున్నది. నాలుగైదేళ్లుగా పట్టించుకోకుండా వదిలేసిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను కూడా త్వరితగతిన పూర్తి చేసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలను ఆదుకోవాలని కృషి చేస్తున్నది. జూరాల-పాకాల గ్రావిటీ ప్రాజెక్టు రూపకల్పన విషయమై డీపీఆర్ తయారు చేయమని డబ్ల్యూపీసీ ఓఎస్‌ను నియమించింది.

రీ-ఇంజనీరింగ్: ముంపు ప్రాంతాల బాధలు స్వయంగా తెలుసుకొని సానుకూలంగా స్పందించిన మన సీఎం ప్రాజెక్టుల్లో సాధ్యమైనంత తక్కువ ముంపు ఉండేట్టుగా వీలైన చోటల్లా ప్రాజెక్టుల డిజైన్ లు మార్చాలని సంకల్పించారు.

1171

Vidyasagar Rao

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు