వలస గ్రహణం పట్టిన మన ప్రాజెక్టులు


Sun,September 25, 2011 11:24 PM

1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు ఈ వలసవాదులు. కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించడం, పొరుగు రాష్ట్రాలతో లాలూచీపడడం-కోర్టుల ఎదుట తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అసమర్థంగా వాదించడం ఇవన్నీ ఆ కుట్రలోని భాగాలే.ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టడానికి అప్పటి ప్రభుత్వం నమూనాలు తయారు చేసిందని కేసీఆర్ ప్రసంగంలో విన్నాను. వాటి వివరాలు తెలియజేయగలరని కోరుతున్నాను.

-విక్రం రాజ్, భీంగల్, నిజామాబాద్


కేసీఆర్ చెప్పింది, మీరు విన్నది నూటికి నూరు పాళ్లు నిజం. నాటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన, తలపెట్టిన, అమలు చేసిన అనేక భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్ని ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక గల్లంతయినయి, కొన్ని కుదించబడ్డయి, కొన్ని పెండింగ్‌లో పెట్టబడినయి. ఈ పరిస్థితిని గమనించిన బచావత్ ట్రిబ్యునల్ తన నివేదికలో ఈ మాటల్ని పొందుపరిచింది.
Had there been no division of that state (Hyderabad) there were better chances for the residents of this area to get irrigation facilities in Mahabubnagar district. We are of the opinion that this area should not be deprived of the benefit of irrigation on account of reorganisation of states.
(హైదరాబాద్ రాష్ట్రం విభజించబడకపోయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు అధికంగా దక్కే అవకాశాలుండేవి. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ మూలంగా ఈ ప్రాంతం సాగునీటి లబ్ధికి దూరం కాకూడదని మా అభివూపాయం) ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన కారణంగా భారీగా నష్టపోయిందనడానికి పై మాటలే నిదర్శనం.హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాటిలో కొన్నింటిని ప్రారంభించినా సమైక్య రాష్ట్రంలో అడ్రస్ లేకుండా గల్లంతయిన ప్రాజెక్టుల వివరాలు ఇవి.
1) తుంగభద్ర ఎడమగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు 2)భీమా ప్రాజెక్టు (ఇప్పుడు కడ్తున్న ‘భీమా’ ప్రాజెక్టు భీమాపై కాదు) 3) అప్పర్ కృష్ణా కుడిగట్టుకాలువ పొడిగింపు ప్రాజెకు ్ట4) గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు 5) ఇచ్చంపల్లి ప్రాజెక్టు 6) దేవనూర్ ప్రాజెక్టు 7) రాజోలిబండ మళ్లింపు పథకం. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపాంతరం చెంది తక్కువ నీటి వినియోగంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రథమదశ, ద్వితీయ దశ, వరదకాలువగామారిపోయింది.
నిజాం ప్రభుత్వంలో 1946లో ప్రారంభమైన రాజోలిబండ ఆనికట్ (Ancut), ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక పూర్తయింది. దీనిదో విషాదగాథ. 1944లో నిజాం ప్రభుత్వం, మదరాసు ప్రభుత్వం ఉమ్మడిగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటికే మదరాసు ప్రభుత్వంలో చెలామణిలో ఉన్న కేసీ కాలువతో పాటుగా కొత్తగా కట్టబోయే ఆర్డీఎస్ కాలువ సమానంగా నీళ్లు పంచుకోవాలి. ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక ఈ వేళ కేసీ కాలువకు అధికారికంగా 39.9 టీఎంసీలు, ఆర్డీఎస్ కు 17.1 టీఎంసీలు దక్కాయి. ఇందులో కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు పోను, తెలంగాణకు ఆర్‌డీఎస్ ద్వారా దక్కిన నీరు 15.90 టీఎంసీలు. కానీ వాస్తవానికి ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడూ 6-7 టీఎంసీలు దాటి మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ తూములను పగులగొట్టి, అక్రమంగా కేసీ కాలువ ఆయకట్టు దారులు కేసీ కాలువలకు ఆర్డీఎస్ నీటిని దోచుకుంటున్నా ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చున్న విషయం తెలిసిందే.

మిగిలిన ప్రాజెక్టుల వైనం ఇది:తుంగభద్ర ఎడమగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు
1947లో నైజాం ప్రభుత్వం తుంగభద్ర ఎడమకాలువను పొడిగించాలని తద్వారా 19.2 టీఎంసీల వినియోగంతో గద్వాల ఆలంపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా)లోని 1,20,000 ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించింది. 1 నవంబర్ 1956కు ముందు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేర్చడానికి అంగీకరించలేదన్న కారణంగా బచావత్ ట్రిబ్యునల్ ఈ కాలువకు కేటాయింపులు చేయలేదు. ఫలితంగా ఈ పొడిగింపు కార్యక్షికమం ఆగిపోయింది. తుంగభద్ర ఎడమకాలువ కర్ణాటక ప్రభుత్వం వరకే పరిమితమైంది.

అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కుడిగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు
తుంగభద్ర ఎడమకాలువ పొడిగింపు చర్యకు అదనంగా ఆలంపూర్, గద్వాల ప్రాంతానికి (నడిగడ్డ) అప్పర్ కృష్ణ ప్రాజెక్టు (ఆలమట్టి) ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పరచాలని, ఇందుకోసం 54.4 టీఎంసీల నీటిని వినియోగించాలని హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడమటుంచి, కనీసం రెండవ పంచవర్ష ప్రణాళికలో చోటు దక్కించుకోలేని కారణంగా ఈ ప్రాజెక్టుకు కూడా నీటి కేటాయింపులు జరిపేందుకు ట్రిబ్యునల్ ఒప్పుకోలేదు. ఫలితం-ఈ ప్రాజెక్టు కూడా రూపుదాల్చలేదు.

భీమా ప్రాజెక్టు
నాటి హైదరాబాద్ ప్రభుత్వం గుల్బర్గా జిల్లా (ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది)లో భీమా ప్రాజెక్టును కృష్ణాకు ముఖ్యమైన ఉపనదియైన భీమాపైన గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఉపయోగపడేలా తలపెట్టింది. 100.70 టీఎంసీల నీటి వినియోగంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 3,80,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు రూపుదాల్చి ఉంటే ఉపయోగపడి ఉండేది. దురదృష్టవశాత్తు బచావత్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టును కూడా పైన చెప్పిన రెండు ప్రాజెక్టుల మాదిరిగా తిరిస్కరించింది. నిర్ధారిత సమాయానికి ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడం ఒక కారణమైతే ప్రణాళిక సంఘం రెండవ పంచవర్ష ప్రణాళికలో చేర్చకపోవడం మరో కారణం.
ఏమైతేనేం బంగారం లాంటి మూడు ప్రాజెక్టులు తుంగభద్ర ఎడమకాలువ పొడిగింపు, అప్పర్ కృష్ణ కుడికాలువ పొడిగింపు, భీమ ప్రాజెక్టులను హైదరాబాద్ రాష్ట్రం అంతర్థానమై ఆంధ్రవూపదేశ్‌లో విలీనమైన కారణంగా.. తెలంగాణ ప్రాంతం మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా కోల్పోయింది-174 టీఎంసీల కృష్ణా నికర జలాలు. అందులోనూ గ్రావిటీ మార్గంగా మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి ఉండేవి. ఈరోజున మహబూబ్‌నగర్ జిల్లా వలసకు గురయ్యే జిల్లాకు మారుగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల మాదిరిగా అన్నపూర్ణయై కళకళలాడుతూ ఉండేది.


ఈ మూడు ప్రాజెక్టులను తెలంగాణకు ఇవ్వలేని తమ అశక్తతకు బదులు గా ట్రిబ్యునల్ కంటి తుడుపు చర్యగా ‘జూరాలా’ ప్రాజెక్టును అనుమతించి, దానికి ప్రత్యేకంగా 17.84 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ఎదుట వాదించిన మన తరఫు వకీలు మరింత సమర్థవంతంగా వాదిం చి ఉంటే మనకీ అన్యాయం జరిగేది కాదని తెలంగాణవాదులు భావిస్తున్నా రు. దీనికి కారణం బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో వెలిబుచ్చిన ఈ అభివూపాయం.
The council of Andhra Pradesh claimed relief under section 108(2) of the state Re organisation act, 1956 only and did not agree that Andhrapradesh was entitled to the relief under section 107 and 108 (1) of the act or under any other provision of law
‘ఆంవూధవూపదేశ్ తరఫు వకీల్’ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 1956 లోని సెక్షన్ 108(2) కింద మాత్రమే తమకు ఉపశమనం కలిగించాలని వాదించాడే తప్ప సెక్షన్ 107 కాని 108 (1) కింద కాని మరే ఇతర న్యాయసూవూతాల ఆధారంగా తమకు ఉపశమనం కలిగించాలని వాదించలేదు. ఆనాటి పాలకుల అభిమతానికనుగుణంగానే వకీలు కిమ్మనకుండా ఉండిపోయాడని అనుకోవలసి వస్తుంది.
ఇక గోదావరి నదిపైన ప్రాజెక్టుల విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరం. దయనీయం. 330 టీఎంసీల వినియోగంతో 20 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు, 175 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గోదావరి బహుళార్థ సాధక ప్రయోజక ప్రాజెక్టును హైదరాబాద్ ప్రభుత్వం సవివర అధ్యయనాలు కొనసాగించి, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డిపిఆర్) 1954లో కేంద్రానికి సమర్పించింది. కేవలం నిధుల కొరత కారణంగా ఈ ప్రాజెక్టును రాష్ట్రం ప్రారంభించలేదు.

నేడో రేపో ప్రాజెక్టు మొదలవుతుందని అందరూ ఆశిస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలకు ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఉపయోగపడటం వలసవాదులు జీర్ణించుకోలేక, కేంద్రంలో పనిచేస్తున్న ఓ అత్యంత బలశాలియైన ఉన్నతాధికారి అండదండలతో ఈ ప్రాజెక్టును అడ్డగించడానికి కుతంవూతాలు, కుట్రలు పూనారు. ప్రాజెక్టుపై సాంకేతిక వివరణల సాకుతో, ఆర్థిక వనరుల లేమి కారణంతో ‘సాగదీత’ పద్ధతిని అవలంబించి ప్రాజెక్టును సకాలంలో మంజూరు చేయకుండా అడ్డుపడడం జరిగింది. ఈ లోగా చాటు మాటున మహారాష్ట్ర ప్రభుత్వానికి ‘ఉప్పు’ అందించి, అంతర్ రాష్ట్ర నదీ జలాల వివా ద చట్టం 1956 ప్రకారం గోదావరి జలాలలో వాటాలు కేటాయించాకే గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు చేపట్టవలసి ఉంటుందని మహారాష్ట్ర ప్రభు త్వం చేత కేంద్రానికి అర్జీ పెట్టించడంలో కేంద్రంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి కృతకృత్యుడయ్యాడు. గోదావరి జలాల వివాదం పరిష్కార నిమిత్తం ట్రిబ్యునల్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తరువాత అనేక మార్పులు చేర్పులు జరిగి గోదావరి బహుళార్థక ప్రాజెక్టు సైజును కుదించి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా అవతరింపజేసింది ప్రభుత్వం.


వలసవాదుల కుతంవూతాలకు, కుట్రలకు బలైపోయిన మరో ప్రాజెక్టు దేవనూరు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం విద్యుత్ ఉత్పాదన. ఎడమ కాలువ ద్వారా రెండుచోట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు దేవనూరు జలాశయంలో నిలుచేసిన నీటిని ఓ పద్ధతి ప్రకారం విడుదల చేసి తద్వారా నిజాం సాగర్ ఆయకట్టులో మరో 50 వేల ఎకరాలకు నీరు అందివ్వాలన్నది ప్లాన్. దీనితో పాటు దేవనూరు నుంచి 150 క్యూసెక్కుల నీటిని జంటనగరాల తాగునీటి సరఫరా కోసం ఉపయోగించాలన్నది మరో లక్ష్యం. ప్రాజెక్టు రిపోర్టులు అన్నీ సిద్ధమయి, ప్రాజెక్టు ప్రారంభం కావడమే మిగిలింది. ప్రాజెక్టు మూలంగా కర్ణాటకలో ముంపుకు గురయ్యే భూములకు నష్టపరిహారం డబ్బు కూడా రెడీగా ఉంది. ఆ దశలో రాష్ట్రం వద్ద ఉన్న వనరులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే గోదావరి బహుళార్థ ప్రాజెక్టు మొదపూట్టడంలో జాప్యం జరుగుతుందన్న ఓ బలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి గోదావరి ప్రాజెక్టులో ఆసక్తి ఉన్న అప్పటి తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖా మంత్రి చేతనే ‘మాకీ ప్రాజెక్టు అవసరం లేదు’ అని కర్ణాటకకు రాయించగలిగిన శక్తిమంతులు ఈ వలసవాదులు. ఫలితంగా దుష్ట వలసవాదుల కుతంవూతాలచవూటంలో ఇరుక్కున్న తెలంగాణ అమాయక అమాత్యులు అటు గోదావరి ప్రాజెక్టును, ఇటు దేవనూరును చేజార్చుకున్నారు.

కాలక్షికమేణ ‘దేవనూరు’ సింగూరుగా రూపాంతరం చెందింది. అది వేరే కథ. ఇదిలా ఉంటే ఇచ్చంపల్లిది మరో కథ. మొదటి నుంచి ఇచ్చంపల్లిని కల్పవల్లిగాఅభివర్ణించడం జరిగింది. పొరుగు రాష్ట్రాలు ముంపు కారణంగా దీన్ని వ్యతిరేకించడం, పోలవరం ఇచ్చంపల్లి రెంటికీ ఒకే మాదిరి సమస్యలున్నా ప్రభుత్వానికి పోలవరంపైన ప్రేమలో ఓ వందోవంతైనా ఇచ్చంపల్లిపై లేకపోవడంతో ‘పోలవరాన్ని’ ముందుకు నడిపిస్తూ ఇచ్చంపల్లిని మాత్రం నడి సంద్రంలో ముంచింది వలసవాద ప్రభుత్వం.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే 1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు ఈ వలసవాదులు. కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించడం, పొరుగు రాష్ట్రాలతో లాలూచీపడడం-కోర్టుల ఎదుట తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అసమర్థంగా వాదించడం ఇవన్నీ ఆ కుట్రలోని భాగాలే. ఈ దుర్మార్గం నాటి నుంచి నేటికీ కొనసాగుతోంది. దీనికి ఏకైక పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
ఇదీ సంగతి
వరదలు-నియంవూతణ
ప్రతి ఏడూ మన దేశ విస్తీర్ణంలోని ఎనిమదోవంతు అంటే సుమారు నాలుగు కోట్ల హెక్టార్ల భూమి (10 కోట్ల ఎకరాలు) వరద తాకిడికి గురవుతుందని అంచనా. వరదల మూలంగా భారీగా ప్రాణనష్టం, పశు, పంట నష్టం జరుగుతోందన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న వరద నియంవూతణ చర్యలను రెండు కేటగిరిలలో విభజించవచ్చు.
ఒకటి నిర్మాణపరమైన చర్యలు, (Structural measures) రెండు నిర్మాణేతర చర్యలు (Non Structural measures). వరద నీటికి ఆశ్రయమివ్వడానికి జలాశయాలు, చెరువులు, సరస్సుల నిర్మాణంతో పాటు వరదల నుంచి రక్షణ కోసం కరకట్టల నిర్మాణం, నదీ, కాలువ గర్భాలను అభివృద్ధి పరచడం, చెరువులలో పూడికలు తీయడం వగైరా వంటివి నిర్మాణ పరమైన చర్యలు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఎత్తై వేదికలు ఏర్పాటు చేయడం, వరద ప్రమాద సూచికలు జారీచేసే ఏర్పాటు, వరదల బీమా పథకం, వరద విపత్తునెదుర్కొనేందుకు సిబ్బందికి శిక్షణ, సమాయత్త పరచడం వగైరా వంటివి నిర్మాణేతర చర్యలు.ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ప్రజల భాగస్వామ్యం, సహకారం లేకుండా వరద నియంవూతణ ప్లాన్లు విజయవంతం కావు. అడవులను కాపాడటం, చెరువులను కబ్జా నుంచి రక్షించడం, జల సంరక్షణ కార్యక్షికమాలు చేపట్టి నీటి కట్టడాలను దేవాలయాలుగా భావించడం జరిగితేనే వరదలను కొంత మేరకు నియంవూతిచవచ్చు. విషయమేమంటే ‘వరదలను నివారించలేం-కొంత మేరకు నియంవూతించవచ్చు-వరదతో సహజీవనం కొనసాగించక తప్పదు’ అన్న కఠిన సత్యాన్ని మనం జీర్ణించుకోవాలి.

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Published: Fri,September 14, 2012 11:18 PM

అధికారికంగా విమోచన దినోత్సవం

జతీయ జెండాకున్న ప్రాధాన్యం అందరికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ జాతీయ పతాకాన్ని వారి సార్వభౌమిక అధికారానికి చిహ్నంగా భావిస్తుం

Published: Mon,September 10, 2012 12:10 AM

రెండు కోర్టులు, మూడు కేసులు

తెలంగాణతో ముడిపడి ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టుల్లో ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటో తెలియజేస్తారా? -బారు మధుసూదనశర్మ, హిమాయత్‌

Published: Sun,September 2, 2012 11:43 PM

బలవంతునిదే రాజ్యం

బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ కేటాయించిన నీరు రాకుండా ఆయా రాష్ట్రాలు అడ్డుకుంటే ట్

Published: Sun,August 26, 2012 11:45 PM

పోలవరం - పాలమూరు

ఈ మధ్య ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల్లో ఇందిరమ్మ బాట సందర్భంగా పర్యటిస్తూ గోదావరిలో వరదలొస్తూ వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సమువూదంల

Published: Thu,August 23, 2012 12:24 AM

ఒడువని తెలంగాణ తండ్లాట

భారత దేశ చరివూతలోనే విశిష్టమైనదైన, ప్రపంచాన్ని ఆకర్షించిన హైదరాబాద్ విమోచన ఉద్యమం ఇంకా ఏదో రూపంలో రగులుతూనే ఉన్నది. అయితే అప్పటి ప

Published: Sun,August 19, 2012 11:19 PM

కోర్టే శరణ్యం-అన్యధా నాస్తి

శ్రీశైలం నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంపై కోర్టు స్టే విధించింది కదా! మరేమైంది? నీటి విడుదల ఆగిందా? ఇది తెలంగాణ ప్రజల విజయంగా భా

Published: Mon,August 13, 2012 12:02 AM

చక్రబంధంలో పోలవరం

నాలుగువేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ఖమ్మంలో శుక్రవా

Published: Mon,August 6, 2012 11:38 PM

పుట్టెడు దుఃఖంలో పుట్టంగండి

పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతులకు నోచుకుందని, అది కూడా తూతూమంవూతంగా చేపట్టారని, సిస్టర్న్‌కు ఏదైనా జరగరానిది జరిగితే కొంపలు మునుగుతా

Published: Mon,July 30, 2012 01:48 AM

శ్రీశైలంలోనూ ప్రభుత్వానికి చెంపదెబ్బ

శ్రీశైలం నీటి విడుదల విషయంలో విజయం సాధించాం.ఈ విజయం వివరాలు చెప్పండి? జీవో మార్చిస్తామని లగడపాటి ప్రకటన గుప్పిస్తున్నాడు. దానిని గ

Published: Sun,July 22, 2012 11:13 PM

కోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం

ఈమధ్య తెలంగాణ ఇంజనీర్లు, మరికొందరు కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తరలించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్య

Published: Sun,July 15, 2012 11:12 PM

జనం నోళ్లు కొడుతున్న పరిక్షిశమలు

జీవో146, జీవో 94 గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జీవో 23 ద్వారా ఉదయసముద్రం నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని సీమాం ధ్ర

Published: Sun,July 8, 2012 11:49 PM

సాగర్ నీటి దోపిడీ

అకస్మాత్తుగా డెల్టా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ

Published: Sun,July 1, 2012 11:52 PM

మా నీళ్లు మాకు దక్కనీయరా..?

తెలంగాణ నుంచి సీమాంవూధలోనికి ప్రవహిస్తున్న నదులు, వాటి ఉపనదులు ఏమిటి? వాటి నదీ పరీవాహక ప్రాంతాలు, జిల్లాలు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో

Published: Mon,June 25, 2012 12:00 AM

రాయల తెలంగాణ ఎవరి కోసం?

రాయల తెలంగాణ ఏర్పడాలనే వాదన వింటున్నాం. రాయల తెలంగాణ అంటే ఏమిటి? అలాంటిది వాదనకు గల కారణాలు, అవకాశాలు ఏమి టి? రాయల తెలంగాణలో నీటి

Published: Sun,June 17, 2012 11:38 PM

ప్రాంతీయ స్పృహతోనే వివక్ష అంతం

జూన్ 9 నాడు కేసీఆర్ పరకాల బహిరంగసభలో మాట్లాడుతూ ‘జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న

Published: Mon,June 11, 2012 12:42 AM

జనం నోళ్లు కొట్టి పరిశ్రమలకు నీళ్లు..!

తాగడానికి నీళ్లు లేక ఒక పక్క గిలగిల కొట్టుకుంటూ ఉంటే, కృష్ణా నది నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు నీటి కేటాయింపులు చేస్తూ ఈ జీవో లేమిటి

Published: Sun,June 3, 2012 11:50 PM

జలయజ్ఞంపై సీబీ‘ఐ’

జలయజ్ఞం పూర్తిగా జలగల యజ్ఞంగా మారిందని, కాగ్ తీవ్రంగా ఆక్షేపించిందని తెలిసింది. కోట్లకొద్దీ ప్రజాధనం గుత్తేదారులు, ఇతర ప్రజావూపతిన

Published: Tue,May 29, 2012 12:02 AM

పట్నం దూప తీరే మార్గం ఏది?

గండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఎల్లంపెల్లిని ఎందుకు నానబెడ్తున్నది? ‘ప్రాణహిత-చే ప్రాజెక్టు అంతర్భాగమైన హ

Published: Mon,May 21, 2012 02:57 AM

నీటికోసం నిరసన దీక్ష

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కావాలనే సీమాంధ్ర పాలకులు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే ప్రయత్నం చే

Published: Sun,May 13, 2012 11:58 PM

అభీ దిల్లీ దూర్ హై

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవర

Published: Fri,August 31, 2012 05:49 PM

శుష్కవాదాలు-శూన్యహస్తాలు

ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాస్తూ అందులో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట మన వాళ్లు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయారని, తత్ఫలితంగా త

Published: Mon,April 30, 2012 12:07 AM

నదుల అనుసంధానం-తెలంగాణకు నష్టం

నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా వింటున్నాం. ఏ నదులను అనుసంధానిస్తారు.దానివల్ల తెలంగాణకు ఏం లాభం? వివరించండి? - రావుల బ్రహ్మయ

Published: Mon,April 23, 2012 01:51 AM

చిన్న ప్రాజెక్టులంటే చిన్న చూపు

పెద్ద ప్రాజెక్టుల గురించే మీరు చెప్పుతున్నారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, బావుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

Published: Mon,April 16, 2012 05:16 AM

ఆధునీకరణలోనూ పక్షపాతమే..

సదర్మట్,అప్పర్ మానేరు,మూసీ,డిండీ ప్రాజెక్టుల గురించి వివరించండి. -లక్ష్మినర్సింహాడ

Published: Mon,April 9, 2012 12:03 AM

గొంతెండిపోతంది సారూ..

గోదావరి పక్కనే ఉన్నా మా గొంతు లెండిపోతున్నయి సారూ- మా బతుకులిట్లా తెల్లారవలసిందేనా కనీసం గుక్కెడు నీల్లకయినా మేం నోచుకోలేదా? చెప్ప

Published: Mon,April 2, 2012 12:11 AM

పోలవరం బంగారం- లెండి వెండి

ఇదిగో అదిగో అని ఎంతకాలం నుంచో ఊరిస్తూ వస్తున్న లెండి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంత జాప్యానికి కారణాలు ఏమిటి? పోలవరంపైన పా

Published: Mon,March 26, 2012 01:56 AM

పెనుగంగకు మోక్షమెప్పుడు?

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గురించి నా చిన్నతనం నుంచి వింటున్నాను. మా ఆదిలాబాద్ జిల్లాకు లాభించే ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చ

Published: Sun,March 18, 2012 11:45 PM

కంతనపల్లి కోసం ఉద్యమిద్దాం

కంతనపల్లి ప్రాజెక్టు పూర్తిచేయనిదే, దేవాదుల ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంటుందని పేపర్‌లో చదివాను ఇది ఎట్లా? దేవాదుల ఇదివరకే కొంత భాగం

Published: Sun,March 11, 2012 11:39 PM

ఆ పార్టీలు దొందు-దొందే

చంద్రబాబు ప్రభుత్వంలోనే తెలంగాణ బాగా అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం వాళ్లు, లేదూ మా రాజశేఖర్‌డ్డి జమానాలోనే బాగా ప్రాజెక్టులు స

Published: Sun,March 4, 2012 11:31 PM

నత్తనడకన ఎత్తిపోతలు..

చేటుపల్లి హన్మంతడ్డి ఎత్తిపోతలు ఏనదిపై ఎక్కడ కడుతున్నరు? కొమురం భీం, కోయిల్‌సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నయా? నెట్టం

Published: Sun,February 26, 2012 11:59 PM

సింగూరు దీనగాథ

భవిష్యత్తులో అక్కంపల్లి సింగూరుగా మారుతుందని, ఎల్లంపల్లి సింగూ రుగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలంగాణ ఇంజనీర్లు అంటూ ఉండ టం విన్న

Published: Mon,February 20, 2012 02:01 AM

వివాదాల(నాగార్జున) సాగరం

నాగార్జునసాగర్ డ్యాంను ఇప్పుడున్న చోట కాకుండా ఎగువన కట్టవలసి ఉండెనని మా పెద్దలు చెప్తూ ఉంటరు. అలా చేయకుండా కావాలని కిందకి తీసుకు

Published: Mon,February 13, 2012 12:29 AM

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!

ఎ)కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా? బి)జలవనరులను

Published: Mon,February 6, 2012 12:40 AM

ఎస్‌ఎల్‌బీసీ - ఎఎంఆర్ ప్రాజెక్టులు

పోతిడ్డిపాడు, కెసీ కాలువకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు కడప, కర్నూలు జిల్లాలో సాగుకు ఉపయోగపడినప్పుడు, ఎస్‌ఎల్‌బీసీ ఎం

Published: Mon,January 23, 2012 12:07 AM

డిండీ ఎత్తిపోతల పథకం

డిండీ ఎత్తిపోతల పథకం అమలవుతే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందుతుందని విన్నాను. నిజమా? వివరించండి

Published: Mon,January 9, 2012 12:00 AM

జూరాల-పాకాల

కృష్ణా నీటిని జూరాలనుంచి పాకాల దాక ఎటువంటి లిఫ్ట్ (ఎత్తిపోతల పథకం) లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు.

Published: Mon,December 26, 2011 12:10 AM

బాబ్లీపైన కిమ్మనరేం?

మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మితమవుతున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నీటి పంపకంలో ఏమైనా నష్టం ఉన్నదా? తెలంగాణ

Published: Sun,December 18, 2011 11:06 PM

ఎత్తిపోతలకు సొంత విద్యుత్తు

గోదావరినదిపైన ఎన్నో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని మీరు అంటున్నారు. మరి వీటన్నింటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ప

Published: Sun,December 11, 2011 11:56 PM

‘ప్రాణహిత-చేవెళ్ల ’ తెలంగణ మణిహారం

ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇ

Published: Sat,December 10, 2011 06:17 PM

ఇచ్చంపల్లి-దేవాదుల-కంతనపల్లి

ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇక మరిచిపోవలసిందేనా? ప్రత్యామ్నాయంగా ఏ ప్రాజెక్టును చేపట్టారు? వివరాలు తెలపండి. -జి. హర్షవర్ధన్, నర్సంపేట

Published: Mon,November 14, 2011 12:02 AM

తెలంగాణ ప్రాజెక్టులు-పాలకుల వివక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ ప్రాజెక్టులకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఇచ్చిన బడ్జెట్‌ను కూడా పూర్తిగా వినియోగ

Published: Mon,November 7, 2011 04:45 PM

పోలవరం-గోల గరం

పోలవరం కట్టాలని ఒకరు, వద్దని మరొకరు, తక్కువ ఎత్తుతో కట్టాలని వేరొకరు. తెలంగాణకే ‘పోలవరం’ లాభం అని ఇంకొకరు ఇలా రకరకాలుగా మాట్లాడుతు

Published: Sun,October 30, 2011 10:59 PM

దుమ్ముగూడెం ఎందుకు వద్దు?

కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు అని ఆ మధ్యన మీరు ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో పర్యటించినప్పుడు విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించినట్టు

Published: Sun,October 23, 2011 11:14 PM

కంచే చేను మేస్తే...?

మీరు రాసిన వ్యాసాలు, ఇస్తున్న ఉపన్యాసాలు విన్నాక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల దారుణ వివక్ష చూపెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది

Published: Mon,October 17, 2011 12:20 AM

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ

Published: Sun,October 9, 2011 11:06 PM

తెలంగాణ ఎందుకు వెనుకబడింది?

తెలంగాణ వెనుకబడిన ప్రాంతమా? తెలంగాణ బంగారు తునక ఎట్లా అవుతుంది? -మంత్రి కరుణ, హైదరాబాద్ ఏదైనా దేశం లేక రాష్ట్రం లేక ప్రాంతం అభివ

Published: Mon,October 3, 2011 04:39 PM

మన నీళ్లు మనకు దక్కుతాయా?

జలవనరుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి?మన నీళ్లు మనకు దక్కకపోవడానికి కారణం?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనకు జలవనరుల

Published: Mon,September 19, 2011 12:08 AM

అనుమతి లేకున్నా పోలవరం నిర్మాణం

పోలవరం ప్రాజెక్టును ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో కడుతున్నారు కదా! దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు

Published: Fri,September 23, 2011 12:46 PM

రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవర

Published: Mon,September 12, 2011 06:05 PM

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

‘తెలంగాణ ఎత్తు మీద ఉండటం మూలాన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నీళ్లు రావు’ అని సీమాంవూ

Published: Mon,September 12, 2011 06:09 PM

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్? -గొట్టిపర్తి యాదగిరి,

Published: Mon,September 12, 2011 06:10 PM

శ్రీశైలం ఎవరిది ?

-ఆర్. విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశ

Published: Mon,September 12, 2011 06:12 PM

నీళ్లు నిజాలు

వారం వారం జలవిజ్ఞానం బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటుంది. జలజలా గోదారి ధవళేశ్వరం ఆనకట్టవుతుంది. ముక్కారు పంటలు కాలువలకు కాలడ్డం