శ్రీశైలం ఎవరిది ?


Mon,September 12, 2011 06:10 PM

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు చెందుతుంది-ఎందుకంటే శ్రీశైలం మా ప్రాంతంలో కట్టబడింది. పైపెచ్చు ఆ డ్యాం మూలంగా రాయలసీమ వాళ్లు చాలా మంది నిరాక్షిశయులయ్యారు అని అన్నారు. ఇది ఎంతవరకు నిజం?

-జి .వేదవతి, సికింవూదాబాద్neelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగం కనుక హైదరాబాద్ లేకుండా తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు అని తెలంగాణ వాదులు కరా ఖండిగా కేంద్రానికి చెప్పిన సందర్భంగా కౌంటర్‌గా మంత్రి వెంక హైదరాబాద్ తెలంగాణకు ఇస్తే మాకు శ్రీశైలం ఇవ్వవలసి ఉంటుందన్న వాదన తెరమీదకు తెచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వాదనకోసమే అలా మాట్లాడి ఉండొచ్చు. లేదా మంత్రి గారికి ఆ కోరిక ఉండొచ్చు. ఏదేమైనా శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రాజెక్టు-భారతదేశపు ప్రాజెక్టు- దానిపైన ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. అది జాతిసొత్తు ప్రజల సొత్తు ఆ ప్రాజెక్టును కృష్ణా నదిపైన నిర్మించారు. డ్యాంకు కుడిపక్క కర్నూలు జిల్లా ఎడమ పక్క మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు మూలంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పరిధిలో 27, అలంపూర్ పరిధిలో 29 గ్రామాలు, వనపర్తి పరిధిలో 11 గ్రామాలు, మొత్తం 67 గ్రామాలు, కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు పరిధిలో 32 గ్రామాలు, ఆత్మకూరు పరిధిలో 14 గ్రామాలు, కర్నూలు పరిధిలో 4 గ్రామాలు, మొత్తం 50 గ్రామాలు వెరసి 117 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇక ముంపుకు గురయిన భూమి విషయానికి వస్తే మహబూబ్‌నగ ర్ జిల్లాలోని 1546 ఎకరాల మాగాణి, 429 29 ఎకరాల మెట్ట, 7952 ఎకరాల బంజరు పోరంబోకు భూమి ఇలా మొత్తం 54 807 ఎకరాల భూమి కాగా కర్నూలు జిల్లాలోని 2028 ఎకరాల మాగాణి, 47029 ఎకరాల మెట్ట, 5294 ఎకరాల బంజరు పోరంబోకు భూమి వగైరా మొత్తం 52541 ఎకరాల వెరసి ఒక లక్షా ఏడు వేల 348 ఎకరాలు నీట మునగడం జరిగింది.ఈ వివరాలను బట్టి ఏం తెలుస్తోంది.

Srisailam-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఒకటి- మహబూబ్‌నగర్, కర్నూలు, జిల్లాలు శ్రీశైలంకు ఇరు పక్కలా ఉన్నాయని, రెండు -కర్నూలు జిల్లా కన్న మహబూబ్‌నగర్ జిల్లాలోనే అటు గ్రామాలు కానీ భూములు కానీ ఎక్కువగా ముంపునకు గురయ్యాయని. ఈ నేపథ్యంలో శ్రీశైలం రాయలసీమకే చెందుతుందనడంలో ఏ మాత్రం ఔచిత్యం ఉందో పాఠకులే అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులో రెండు విద్యుత్ కేంద్రాలున్నాయి. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం 900 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం 700 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. మొత్తం విద్యుత్ సామర్థ్యం 1670 మెగావాట్లు- ఇక నీటి వినియోగానికి వస్తే కొన్ని విచివూతమైన విషయాలు బయటపడతాయి.


శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం విద్యుదుత్పాదన. విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేయడం. అంటే నాగార్జునసాగర్‌కు ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుందన్న మాట. ఈ ప్రాజెక్టు నుండి నేరుగా సాగు కోసం నీటిని తరలించ కూడదని, కృష్ణానదీ జలాలను మూడు రాష్ట్రాలకు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌కు పంచిన బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. శ్రీశైలంలో నిలువ చేసిన నీరు శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసాక నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసిన అనంతరం అంతిమంగా సాగర్ ఆయకట్టు కృష్ణాడెల్టా ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రీశైలంలో ఆవిరి నష్టానికి 33 టి.ఎం.సి ల నీటిని ట్రిబ్యునల్ ప్రత్యేకంగా కేటాయించింది. శ్రీశైలం మాదిరిగానే మేము కూడా ‘ కోయినా ప్రాజెక్టు’ను విద్యుత్తు ఉత్పాదన కోసమే కట్టుకున్నాం.

కనుక మా ప్రాజెక్టుకు కూడా అదనంగా ఆవిరి నష్టం కోసం నీటిని కేటాయించవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ని అర్థిస్తే, మీరు విద్యుత్తు ఉత్పత్తి చేసాక ‘కోయినా’ నీటిని అరేబియా సమువూదంలోకి వదిలేస్తున్నారు. కాని ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసాక నీటిని నాగార్జునసాగర్ ద్వారా సాగు కోసం వినియోగిస్తున్నది. కనుక వారికి ఆవిరినష్టం కోసం 33 టి.ఎం.సి లను కేటాయించాం. మీకు అలా కేటాయించడం కుదరదు అని కరాఖండిగా చెప్పింది. దీనర్థం ఏమంటే శ్రీశైలం జలాశయంలో నిలువ చేసిన నీరు రెండు చోట్ల అంటే శ్రీశైలం దగ్గర, నాగార్జునసాగర్ వద్ద (నీటిని బట్టి) విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడమే కాకుండా సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాకు సాగుకు వినియోగింపబడాలన్న మాట. కానీ దురదృష్టం ఏమంటే మన ప్రభుత్వం అనేక గారడీలు మాయలు చేసి క్రమక్షికమంగా విద్యుత్తు కోసం ఉద్దేశింపబడ్డ శ్రీశైలాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది. ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించింది.

తొలుత మద్రాసుకు మంచినీళ్ల కోసం ఏర్పాటు చేసిన తెలుగుగంగను క్రమంగా సాగునీటి కాలువగా మార్చింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సైజును ఇటీవలి కాలంలో నాలుగైదు రెట్లు పెంచి వరదనీటి ముసుగులో శ్రీశైలం నీటిని భారీ ఎత్తున రాయలసీమకు తరలించే అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుగంగ ఎస్‌ఆర్‌బిసికి ఆదనంగా హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు, వీటి ద్వారా తరలించే నీటిని ఒడిసి పట్టుకోవడానికి అనేక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించింది. ఒక్క రాయలసీమకే నీరంతా పంపిస్తే బాగుండదని, ప్రకాశం జిల్లాకు పనికొచ్చే వెలిగొండను తెలంగాణకు పనికొచ్చే నెట్టంపాడు, కల్వకుర్తి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను కూడా చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం 227. 50 టి.ఎం.సి ల (పేరుకు) మిగులు జలాలనుపయోగించే సాగునీటి ప్రాజెక్టులను చేపట్టితే అందులో కోస్తాంవూధకు 43.50 టి.ఎం.సి లు తెలంగాణకు 77 టి.ఎం.సి లు రాయలసీమకు 107 టి.ఎం.సి లు చెందే విధంగా రూపకల్పన చేయడం జరిగింది.

227.50 టి.ఎం.సి ల నీరు ‘మిగులు జలాల’ని చెప్పుతున్నా అవి నికర జలాలే అన్న విషయం అందరికీ తెలుసు. అవి నికర జలాలే అయితే వాటిపైన ఆధారపడ్డ నాగార్జునసాగర్ ఆయకట్టుదారులు, కృష్టా డెల్టా ఆయకట్టుదారుల గతేమవుతుందో భగవంతునికే తెలియాలి. ఆ నీటితో ఉత్పత్తి చేయగల విద్యుత్తు ( రెండుచోట్ల) గోవిందా అయినా ప్రభుత్వం ఎన్నడూ ఆ సంగతి మాట్లాడిన పాపానపోలేదు. ఇదండీ శ్రీశైలం ప్రాజెక్టు దీనావస్థ. దౌర్జన్యంగా, బాహాటంగా నియమాలకు విరుద్ధంగా జరుగుతున్న నీటి దోపిడీ. ఇప్పుడర్థమైందా రాయలసీమ నాయకులకు శ్రీశైలం పైన ఎందుకంత ఆసక్తీ, ఆదుర్దో....
నదీ జలాలపై హక్కు రాజ్యాంగంలోని 246 అధికరణంలోని ఏడ వ షెడ్యూల్‌లో మూడు జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబి తా. కేంద్ర జాబితాలో పొందుపర్చిన విషయాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర జాబితాలోని విషయాలపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉమ్మడి జాబితాలోని విషయాల పై ఉభయులకు ఉంటాయి.

రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 17లో నీరు, నీటి సరఫరా, సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు, నీటి నిలువ, విద్యుచ్ఛక్తి ఉన్నాయి. అయితే ఇవి కేంద్ర జాబితా ఎంట్రీ 56 లోని విషయాలకు లోబడి ఉంటాయి. కేంద్ర జాబితాలోని ఎంట్రీ 56 లో అంతర్‌రాష్ట్ర నదుల, నదీలోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ ఉన్నాయి. అయితే ఇదినీటిపైన పార్లమెంటు చట్టం చేసిన పరిధికి లోబడే ఉంటాయి. తేలికైన మాట ల్లో చెప్పాలంటే తమ సరిహద్దులో పుట్టి, ప్రవహించే నదులపైన సంపూర్ణ అధికారం రాష్ట్రాలకుంటుంది. ఉదాహరణ: గుండ్లకమ్మ ఈ నదిపైన పూర్తి హక్కు ఆంధ్రవూపదేశ్‌కుంటుంది. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటిని ఉపయోగించే హక్కు మాత్రమే రాష్ట్రాలకుంటుంది.అది కూడా పొరుగు రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టు అయితేనే. ఉదాహరణకు, కృష్ణా నదిపైన నిర్మించిన జూరాల, గోదావరిపై నిర్మాణం తలపెట్టిన పోలవరం- జూరాలకు 17.84 టి.ఎం.సిల నీటి కేటాయింపు ఉంది.

కాని కట్టే డ్యాం మూలంగా ముంపుకు గురయ్యే కర్ణాటక గ్రామాల విషయంలో ఆ రాష్ట్రం అనుమతి తీసుకొని నష్ట పరిహారం చెల్లించాకే జూరాలను పూర్తిగా నింపడం జరుగుతోంది. పోలవరం విషయంలో నీటి కేటాయింపు సమస్యలేదు. సమస్య అంతా పొరుగు రాష్ట్రాలతో కలిగే ముంపు గురించే.ఈ జగడం సుప్రీంకోర్టులో ఉంది. నీటి విషయం ఉమ్మడి జాబితాలో ప్రస్తావించలేదు.

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర