రెండు కోర్టులు, మూడు కేసులు


Mon,September 10, 2012 12:10 AM

తెలంగాణతో ముడిపడి ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టుల్లో ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటో తెలియజేస్తారా?

-బారు మధుసూదనశర్మ, హిమాయత్‌నగర్, హైదరాబాద్


నీళ్లకు సంబంధించినంత వరకు తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రధాన కేసులు ప్రస్తుతం మూడు ఆక్టివ్‌గా విచారణలో ఉన్నాయి. ఒక టి హైకోర్టులో, రెండు సుప్రీంకోర్టులో. హైకోర్టులో ఉన్న కేసు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాల గురించి అయితే, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు బాబ్లీ బ్యారేజీ,పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినవి.

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నీటి మట్టాల కేసు
1996 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69 ప్రకా రం శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 834 అడుగులు. నాగార్జునసాగర్ జలాశయంలో కనీస నీటిమట్టం 510 అడుగులుండాలి. ఈ స్థాయికంటే దిగువన నీటిని తాగునీటి కోసం తప్ప విడుదల చేయరాదన్నది జీవో చెప్తున్న మాట. అయితే ఈజీవో ఆచరణలో ‘నామ్ కే వాస్తే’ గానే మిగిలిపోయింది.హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలను పరిశీలిస్తే ఏవో అతికొద్ది సంవత్సరాల్లో తప్ప అధిక శాతం సమయాల్లో కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం జీవో 69ని బేఖాతరు చేస్తూ నీటిని విడుదల చేయడం జరుగుతోంది. దీన్ని ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.ఈ సంవత్సరం కూడా ప్రభు త్వం ఎప్పటి మాదిరిగానే కృష్ణాడెల్టా నారుమళ్ల కోసం శ్రీశైలం జలాశయం, సాగర్ జలాశయాల నుంచి కనీస నీటి మట్టాలను పట్టించుకోకుండా నీటిని విడుదల చేయాలని నిర్ణయించి, ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభు త్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

హైకోర్టు స్పందించి ప్రభుత్వం తాము జారీ చేసిన జీవో 69కి విరుద్ధంగా తాగునీటి ప్రయోజనాలకు కాకుండా ఇతరత్రా నీటిని విడుదల చేయడాన్ని తప్పు పడుతూ రెండు జలాశయాల్లోనూ కనీస నీటి మట్టా ల (శ్రీశైలంలో 834 అడుగులు, సాగర్‌లో 510 అడుగులు) కన్న దిగువ స్థాయిలో నీటిని విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముప్ఫై ఏళ్లుగా అక్రమంగా కృష్ణా డెల్టాకు నియమ, నిబంధనలను తోసిరాజని ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్నా ఎన్నడూ స్పందించని తెలంగాణ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు నిరసనలు తెలపడం, ప్రభుత్వ చర్యలను విమర్శించడం, కోర్టులకెక్కడం, కోర్టు కూడా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వడం కోస్తాంధ్ర నాయకులకు మింగుడు పడలేదు. అనేక నిరసన కార్యక్షికమాలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేసి హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని వేసిన ‘ఇంప్లీడ్ పిటీషన్’కు మద్దతుగా ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని తీర్మా నం చేయడం జరిగింది. ప్రభుత్వం, విచక్షణ కోల్పోయి కోస్తాంధ్ర నాయకులను తృప్తిపరిచే విధంగా ఇటీవలే కోర్టులో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కౌంటర్ వేసింది.

ప్రభుత్వం వారు వేసిన కౌంటర్‌లోని ప్రధాన అంశాలు చర్చించేముందు జీవో 69కి ప్రభుత్వం చేసిన సవరణల గురించి తెలుసుకోవాలి. 2004లో వైఎస్‌ఆర్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినాక ముందుగా జీవో 107 ఒకదాన్ని జారీ చేసింది. అందులో శ్రీశైలం జలాశయంలో జీవో 69లో నిర్ధారించిన కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల స్థానంలో 854 అడుగులుగా మార్చడం జరిగింది. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల ను తరలించేందుకు అనువుగా ఈ జీవోను తెచ్చారు. అదే జీవోలో ప్రభుత్వం అవసరమైన సమయాల్లో శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగుల కనీస నీటిస్థాయి ఉండాలి. అత్యవసర సమయాల్లో నీటిని ఏ స్థాయి వరకైనా కిందికి దింపి ఏ ప్రయోజనం కోసమైనా విడుదల చేయవచ్చన్నది సారాంశం. ఈ జీవో 107, జీవో 69లో ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ జలాశయాల నీటి మట్టాల విషయాల్లో నిర్ధారించిన నిర్వహణ మార్గదర్శకాలకు భిన్నంగా ఉండడంతో, ప్రభుత్వం తన తప్పును గ్రహించి మరో జీవో 3ను విడుదల చేసింది.

అందులో జీవో 107లో నిర్ధారించిన నీటిమట్టం కనీసం గా 854 అడుగులు ఉండడంతో పాటు, అవసర సమయాల్లో 854 అడుగుల కంటే దిగువకు నీటిని విడుదల చేయాల్సి వచ్చినప్పుడు జీవో 69లో నిర్ధారించిన మార్గదర్శకాలు అమలు చేయాలని స్పష్టం చేయడం జరిగింది. అంటే 854 అడుగులకు 834 అడుగుల మధ్య ప్రభుత్వం డెల్టాకు సాగునీటిని వదిలినా, 834 అడుగుల కింద మాత్రం తాగునీటికి తప్ప విడుదల చేయకూడదన్నది జీవో 3 సారాంశం. మరోమాటలో చెప్పాలంటే శ్రీశైలం విషయంలో జీవో 107తో పాటు జీవో 69 చెలామణీ అవుతాయి. నాగార్జునసాగర్ విషయంలో జీవో 69మాత్రమే చెల్లుబాటవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లోజీవో 107, జీవో 69 రెండూ కూడా అమలులోనే ఉన్నాయని ఒకవైపు ఉద్ఘాటిస్తూనే, మరోవైపు తాము 834 అడుగుల కన్నా దిగువన ఉన్నప్పుడు కృష్ణాడెల్టా సాగునీటి కోసం నీటిని విడుదల చేయడం సక్రమమేనని, తమ అధికారులు చేసి న పనులు పూర్తిగా సమర్థనీయమేనని నొక్కివక్కానిస్తూ, ప్రజా శ్రేయస్సు, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని విన్నవించడం జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ చదవిన వారికెవరికైనా సర్కారు ఇంత గుడ్డిగా కేవలం కోస్తాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఇంత సాహసానికి ఒడిగడుతుందా! అని విస్మయం కలగకమానదు. విచారణ జరిగి, హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.

బాబ్లీ కేసు
తెలంగాణకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో అంటే జలాశయం బ్యాక్‌వాటర్‌లో మహారాష్ట్ర బాబ్లీ బ్యారేజీని అక్రమంగా కట్టడం, బాబ్లీకి ఎగువన మరో పదకొండు చిన్న చిన్న బ్యారేజీలు, డ్యాంలు నిర్మించడం బాబ్లీ నీటి తగాదాకు హేతువైంది. మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం శ్రీరాంసాగర్‌కు ఎగువన గోదావరి నదిలోని 60 టీఎంసీలను కట్టబోయే కొత్త ప్రాజెక్టుల కోసం వినియోగించుకోవచ్చు. శ్రీరాంసాగర్ మూలంగా మహారాష్ట్ర భూభాగంలో ముంపుకు గుర య్యే ప్రాంతం కట్టడాలకు పరిహారంగా ఆంధ్రవూపదేశ్ నష్టపరిహారం చెల్లిస్తుం ది. ఎలాంటి గొడవలు లేకుండా శ్రీరాంసాగర్ నిర్మాణమైంది. మహారాష్ట్రకు అంగీకరించిన మొత్తాన్ని చెల్లించడమైంది. మహారాష్ట్ర కొత్త ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టింది. ఆ నిర్మాణాల్లో భాగమే బాబ్లీయని, తమకు కేటాయించిన 60 టీఎంసీల మేరకే నిర్మాణాలు సాగుతున్నాయని మహారాష్ట్ర వాదన.

బాబ్లీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్ జలాశయంలోనే నిర్మించినా, అది తన భూభాగమేనని, బాబ్లీ అతి చిన్న ప్రాజెక్టని, కేవలం తాగునీటి కోసం కడ్తున్న ప్రాజెక్ట ని, 2.74 టీఎంసీల నీటిని మాత్రమే అది వినియోగించుకుంటుందని, శ్రీరాంసాగర్‌కు చెందిన 0.60 టీఎంసీల నీటిని మాత్రమే బాబ్లీ ద్వారా వాడుకోవడం జరుగుతుందని, ఆ మొత్తాన్ని ఆంధ్రవూపదేశ్‌కు తిరిగి వాపసు చేస్తామని మహారాష్ట్ర వాదిస్తోంది. శ్రీరాంసాగర్ జల పరిధిలో బాబ్లీ నిర్మించడం వల్ల 60 టీఎంసీల శ్రీరాంసాగర్ జలాల వరకు బాబ్లీ ద్వారా పంపు చేసుకునే అవకాశముందని, అదే గనుక జరిగితే శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, పైపెచ్చు మహారాష్ట్రకు కేటాయించిన 60 టీఎంసీల నీటిని ఇది వరకే వినియోగించుకోవడం జరిగిందని, బాబ్లీ, మరో 11 ప్రాజెక్టులను మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తోందని ఆంధ్రవూపదేశ్ వాదిస్తోంది. ఈ నీటి తగాదా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నది. ఆరేళ్ల కింద దాఖలైన ఈ పిటీషన్‌పై లోగడ సుప్రీంకోర్టు విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పటికే నిర్మించిన బాబ్లీ బ్యారేజీలో ‘గేట్లు’ అమర్చరాదన్నది మధ్యంతర ఉత్తర్వుల సారాంశం. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర బ్యారేజీకి తలుపులు బిగించింది. అయితే గేట్‌ను ఆపరేట్ మాత్రం చేయడం లేదు. బటన్ నొక్కితే చాలు గేట్లు పడడం, తెరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని ఆంధ్రవూపదేశ్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ‘గేట్లను తొలగించమంటారా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన రాష్ట్ర న్యాయవాదిని ప్రశ్నిస్తే ‘తొలగించమని’ గట్టిగా కోరక మన న్యాయవాది మీ ఇష్టం అని వింతైన సమాధానమిచ్చినట్టు సమాచారం. ఈ కేసు పునః విచారణ ఈ నెల 18వ తేదీన జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

పోలవరం
ఈ ప్రాజెక్టు నిర్మాణంపైన నెలకొన్న వివాదం ఆరేడేళ్లుగా సుప్రీంకోర్టులో నలుగుతూ ఉన్నది. పోలవరం కట్టొద్దని ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వా లు పిటీషన్లు వేశాయి. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన గిరిజన సంఘాలు, తెలంగాణవాదులు కూడా పోలవరానికి వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలు చేశా రు. పోలవరానికి వ్యతిరేకత కేవలం ముంపు కారణంగానే 2-4-1980 నాడు ఆంధ్రవూపదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఆనాటి మధ్యవూపదేశ్) ఒడిషా రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి అనువుగా 150 అడుగుల పూర్తి జలస్థాయిలో పోలవరం నిర్మాణం అయితే ముంపుకు సంసిద్ధతకు పొరుగు రాష్ట్రా లు తెలియజేశాయి. ఆ లెక్కన 299 గ్రామాలు ముంపుకు గురవుతాయని అందులో 276 గ్రామాలు ఆంధ్రవూపదేశ్‌వికాగా, పొరుగు రాష్ట్రాల గ్రామాలు 23అని ఆంధ్రవూపదేశ్ చెప్తోంది. ఆ సం ఖ్య కరెక్టా కాదా తేల్చడానికి ఉమ్మడి సర్వే ఏదీ జరగలేదు.

36 లక్షల క్యూసెక్కుల వరద కాస్త 50 లక్షల క్యూసెక్కులై కూర్చుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఈ పరిమాణం వల్ల పెరిగే ముంపు గురించి మాట్లాడడం లేదు. ఇదిలా ఉండగా మునిగే గ్రామాల్లో (276లో 207 గ్రామాలు ఖమ్మం జిల్లావి) అత్యధిక భాగం తెలంగాణవి కావడం, ముంపుకు గురయ్యే భూమి 1,50,000 ఎకరాలుండటం, నిరాక్షిశయుల య్యే వారు రెండు లక్షల దాకా గిరిజనులవ్వడంతో తెలంగాణవాదులు ‘పోలవరం’ డ్యాం ఎత్తు తగ్గించి, ఒకటికి బదులు చిన్న చిన్న డ్యాములు నిర్మించే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభు త్వం ఈ విన్నపాన్ని తిరస్కరించింది. ఇప్పుడు కడ్తున్న పోలవరం డిజైన్ మార్చేది లేదని మొండి పట్టు పట్టింది. పక్కరాష్ట్రాల ముంపు విషయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజాభివూపాయ సేకరణ జరపవలసిన అగత్యాన్ని పర్యావరణ చట్టం 1986 నొక్కిచెప్తోంది. ఆ చట్టం ప్రకారం వ్యవహరించని కారణంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘పర్యావరణ అనుమతిని’ పర్యావరణ ట్రిబ్యునల్ రద్దు చేసింది. కేంద్రం ఇచ్చిన అనుమతులు కూడా సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఆ అనుమతులే చెప్తున్నాయి. ఇదివరకే పోలవరం కాలువలపైన 4200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. మరో 4700 కోట్ల రూపాయలు ఖర్చ పెట్టేందుకు టెండ ర్లు ఖరాచు చేసే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ‘పోలవరం’ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

పోలవరం ఎలాగైనా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బోలెడు ఖర్చు చేశామని, అనుమతి ఇవ్వకపోతే చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని సుప్రీంకోర్టుపై బ్లాక్‌మెయిలింగ్ టెక్నిక్‌ను ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. ఇక కృష్ణా డెల్టా విషయంలో కూడా నీరు సకాలంలో విడుదల చేయకపోతే డెల్టా తీవ్రంగా నష్టపోతుందని,‘జాతీయ విపత్తు’గా పరిణమిస్తుందని ఏవేవో కుంటిసాకులు చెప్తోంది ఈ ప్రభుత్వం. కానీ బాబ్లీ విషయానికి వస్తే మాత్రం ‘గేట్లు తొలగించడం, తొలగించకపోవడం’ మీ ఇష్టం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై భారం వేస్తోంది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం చూపించే శ్రద్ధలో వీసమంతైనా తెలంగాణ పట్ల చూపించదు. అవును మరి, ‘పోలవరం’ వైష్ణవాలయం నిత్యం పూజలతో కళకళలాడుతూ ఉండాలి. ‘బాబ్లీ’-శివాలయం పూజల సంగతి దేవుడెరుగు అడిగే దిక్కుండదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Published: Fri,September 14, 2012 11:18 PM

అధికారికంగా విమోచన దినోత్సవం

జతీయ జెండాకున్న ప్రాధాన్యం అందరికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ జాతీయ పతాకాన్ని వారి సార్వభౌమిక అధికారానికి చిహ్నంగా భావిస్తుం

Published: Sun,September 2, 2012 11:43 PM

బలవంతునిదే రాజ్యం

బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ కేటాయించిన నీరు రాకుండా ఆయా రాష్ట్రాలు అడ్డుకుంటే ట్

Published: Sun,August 26, 2012 11:45 PM

పోలవరం - పాలమూరు

ఈ మధ్య ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల్లో ఇందిరమ్మ బాట సందర్భంగా పర్యటిస్తూ గోదావరిలో వరదలొస్తూ వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సమువూదంల

Published: Thu,August 23, 2012 12:24 AM

ఒడువని తెలంగాణ తండ్లాట

భారత దేశ చరివూతలోనే విశిష్టమైనదైన, ప్రపంచాన్ని ఆకర్షించిన హైదరాబాద్ విమోచన ఉద్యమం ఇంకా ఏదో రూపంలో రగులుతూనే ఉన్నది. అయితే అప్పటి ప

Published: Sun,August 19, 2012 11:19 PM

కోర్టే శరణ్యం-అన్యధా నాస్తి

శ్రీశైలం నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంపై కోర్టు స్టే విధించింది కదా! మరేమైంది? నీటి విడుదల ఆగిందా? ఇది తెలంగాణ ప్రజల విజయంగా భా

Published: Mon,August 13, 2012 12:02 AM

చక్రబంధంలో పోలవరం

నాలుగువేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ఖమ్మంలో శుక్రవా

Published: Mon,August 6, 2012 11:38 PM

పుట్టెడు దుఃఖంలో పుట్టంగండి

పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతులకు నోచుకుందని, అది కూడా తూతూమంవూతంగా చేపట్టారని, సిస్టర్న్‌కు ఏదైనా జరగరానిది జరిగితే కొంపలు మునుగుతా

Published: Mon,July 30, 2012 01:48 AM

శ్రీశైలంలోనూ ప్రభుత్వానికి చెంపదెబ్బ

శ్రీశైలం నీటి విడుదల విషయంలో విజయం సాధించాం.ఈ విజయం వివరాలు చెప్పండి? జీవో మార్చిస్తామని లగడపాటి ప్రకటన గుప్పిస్తున్నాడు. దానిని గ

Published: Sun,July 22, 2012 11:13 PM

కోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం

ఈమధ్య తెలంగాణ ఇంజనీర్లు, మరికొందరు కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తరలించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్య

Published: Sun,July 15, 2012 11:12 PM

జనం నోళ్లు కొడుతున్న పరిక్షిశమలు

జీవో146, జీవో 94 గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జీవో 23 ద్వారా ఉదయసముద్రం నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని సీమాం ధ్ర

Published: Sun,July 8, 2012 11:49 PM

సాగర్ నీటి దోపిడీ

అకస్మాత్తుగా డెల్టా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ

Published: Sun,July 1, 2012 11:52 PM

మా నీళ్లు మాకు దక్కనీయరా..?

తెలంగాణ నుంచి సీమాంవూధలోనికి ప్రవహిస్తున్న నదులు, వాటి ఉపనదులు ఏమిటి? వాటి నదీ పరీవాహక ప్రాంతాలు, జిల్లాలు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో

Published: Mon,June 25, 2012 12:00 AM

రాయల తెలంగాణ ఎవరి కోసం?

రాయల తెలంగాణ ఏర్పడాలనే వాదన వింటున్నాం. రాయల తెలంగాణ అంటే ఏమిటి? అలాంటిది వాదనకు గల కారణాలు, అవకాశాలు ఏమి టి? రాయల తెలంగాణలో నీటి

Published: Sun,June 17, 2012 11:38 PM

ప్రాంతీయ స్పృహతోనే వివక్ష అంతం

జూన్ 9 నాడు కేసీఆర్ పరకాల బహిరంగసభలో మాట్లాడుతూ ‘జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న

Published: Mon,June 11, 2012 12:42 AM

జనం నోళ్లు కొట్టి పరిశ్రమలకు నీళ్లు..!

తాగడానికి నీళ్లు లేక ఒక పక్క గిలగిల కొట్టుకుంటూ ఉంటే, కృష్ణా నది నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు నీటి కేటాయింపులు చేస్తూ ఈ జీవో లేమిటి

Published: Sun,June 3, 2012 11:50 PM

జలయజ్ఞంపై సీబీ‘ఐ’

జలయజ్ఞం పూర్తిగా జలగల యజ్ఞంగా మారిందని, కాగ్ తీవ్రంగా ఆక్షేపించిందని తెలిసింది. కోట్లకొద్దీ ప్రజాధనం గుత్తేదారులు, ఇతర ప్రజావూపతిన

Published: Tue,May 29, 2012 12:02 AM

పట్నం దూప తీరే మార్గం ఏది?

గండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఎల్లంపెల్లిని ఎందుకు నానబెడ్తున్నది? ‘ప్రాణహిత-చే ప్రాజెక్టు అంతర్భాగమైన హ

Published: Mon,May 21, 2012 02:57 AM

నీటికోసం నిరసన దీక్ష

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కావాలనే సీమాంధ్ర పాలకులు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే ప్రయత్నం చే

Published: Sun,May 13, 2012 11:58 PM

అభీ దిల్లీ దూర్ హై

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవర

Published: Fri,August 31, 2012 05:49 PM

శుష్కవాదాలు-శూన్యహస్తాలు

ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాస్తూ అందులో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట మన వాళ్లు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయారని, తత్ఫలితంగా త

Published: Mon,April 30, 2012 12:07 AM

నదుల అనుసంధానం-తెలంగాణకు నష్టం

నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా వింటున్నాం. ఏ నదులను అనుసంధానిస్తారు.దానివల్ల తెలంగాణకు ఏం లాభం? వివరించండి? - రావుల బ్రహ్మయ

Published: Mon,April 23, 2012 01:51 AM

చిన్న ప్రాజెక్టులంటే చిన్న చూపు

పెద్ద ప్రాజెక్టుల గురించే మీరు చెప్పుతున్నారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, బావుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

Published: Mon,April 16, 2012 05:16 AM

ఆధునీకరణలోనూ పక్షపాతమే..

సదర్మట్,అప్పర్ మానేరు,మూసీ,డిండీ ప్రాజెక్టుల గురించి వివరించండి. -లక్ష్మినర్సింహాడ

Published: Mon,April 9, 2012 12:03 AM

గొంతెండిపోతంది సారూ..

గోదావరి పక్కనే ఉన్నా మా గొంతు లెండిపోతున్నయి సారూ- మా బతుకులిట్లా తెల్లారవలసిందేనా కనీసం గుక్కెడు నీల్లకయినా మేం నోచుకోలేదా? చెప్ప

Published: Mon,April 2, 2012 12:11 AM

పోలవరం బంగారం- లెండి వెండి

ఇదిగో అదిగో అని ఎంతకాలం నుంచో ఊరిస్తూ వస్తున్న లెండి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంత జాప్యానికి కారణాలు ఏమిటి? పోలవరంపైన పా

Published: Mon,March 26, 2012 01:56 AM

పెనుగంగకు మోక్షమెప్పుడు?

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గురించి నా చిన్నతనం నుంచి వింటున్నాను. మా ఆదిలాబాద్ జిల్లాకు లాభించే ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చ

Published: Sun,March 18, 2012 11:45 PM

కంతనపల్లి కోసం ఉద్యమిద్దాం

కంతనపల్లి ప్రాజెక్టు పూర్తిచేయనిదే, దేవాదుల ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంటుందని పేపర్‌లో చదివాను ఇది ఎట్లా? దేవాదుల ఇదివరకే కొంత భాగం

Published: Sun,March 11, 2012 11:39 PM

ఆ పార్టీలు దొందు-దొందే

చంద్రబాబు ప్రభుత్వంలోనే తెలంగాణ బాగా అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం వాళ్లు, లేదూ మా రాజశేఖర్‌డ్డి జమానాలోనే బాగా ప్రాజెక్టులు స

Published: Sun,March 4, 2012 11:31 PM

నత్తనడకన ఎత్తిపోతలు..

చేటుపల్లి హన్మంతడ్డి ఎత్తిపోతలు ఏనదిపై ఎక్కడ కడుతున్నరు? కొమురం భీం, కోయిల్‌సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నయా? నెట్టం

Published: Sun,February 26, 2012 11:59 PM

సింగూరు దీనగాథ

భవిష్యత్తులో అక్కంపల్లి సింగూరుగా మారుతుందని, ఎల్లంపల్లి సింగూ రుగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలంగాణ ఇంజనీర్లు అంటూ ఉండ టం విన్న

Published: Mon,February 20, 2012 02:01 AM

వివాదాల(నాగార్జున) సాగరం

నాగార్జునసాగర్ డ్యాంను ఇప్పుడున్న చోట కాకుండా ఎగువన కట్టవలసి ఉండెనని మా పెద్దలు చెప్తూ ఉంటరు. అలా చేయకుండా కావాలని కిందకి తీసుకు

Published: Mon,February 13, 2012 12:29 AM

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!

ఎ)కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా? బి)జలవనరులను

Published: Mon,February 6, 2012 12:40 AM

ఎస్‌ఎల్‌బీసీ - ఎఎంఆర్ ప్రాజెక్టులు

పోతిడ్డిపాడు, కెసీ కాలువకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు కడప, కర్నూలు జిల్లాలో సాగుకు ఉపయోగపడినప్పుడు, ఎస్‌ఎల్‌బీసీ ఎం

Published: Mon,January 23, 2012 12:07 AM

డిండీ ఎత్తిపోతల పథకం

డిండీ ఎత్తిపోతల పథకం అమలవుతే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందుతుందని విన్నాను. నిజమా? వివరించండి

Published: Mon,January 9, 2012 12:00 AM

జూరాల-పాకాల

కృష్ణా నీటిని జూరాలనుంచి పాకాల దాక ఎటువంటి లిఫ్ట్ (ఎత్తిపోతల పథకం) లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు.

Published: Mon,December 26, 2011 12:10 AM

బాబ్లీపైన కిమ్మనరేం?

మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మితమవుతున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నీటి పంపకంలో ఏమైనా నష్టం ఉన్నదా? తెలంగాణ

Published: Sun,December 18, 2011 11:06 PM

ఎత్తిపోతలకు సొంత విద్యుత్తు

గోదావరినదిపైన ఎన్నో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని మీరు అంటున్నారు. మరి వీటన్నింటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ప

Published: Sun,December 11, 2011 11:56 PM

‘ప్రాణహిత-చేవెళ్ల ’ తెలంగణ మణిహారం

ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇ

Published: Sat,December 10, 2011 06:17 PM

ఇచ్చంపల్లి-దేవాదుల-కంతనపల్లి

ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇక మరిచిపోవలసిందేనా? ప్రత్యామ్నాయంగా ఏ ప్రాజెక్టును చేపట్టారు? వివరాలు తెలపండి. -జి. హర్షవర్ధన్, నర్సంపేట

Published: Mon,November 14, 2011 12:02 AM

తెలంగాణ ప్రాజెక్టులు-పాలకుల వివక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ ప్రాజెక్టులకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఇచ్చిన బడ్జెట్‌ను కూడా పూర్తిగా వినియోగ

Published: Mon,November 7, 2011 04:45 PM

పోలవరం-గోల గరం

పోలవరం కట్టాలని ఒకరు, వద్దని మరొకరు, తక్కువ ఎత్తుతో కట్టాలని వేరొకరు. తెలంగాణకే ‘పోలవరం’ లాభం అని ఇంకొకరు ఇలా రకరకాలుగా మాట్లాడుతు

Published: Sun,October 30, 2011 10:59 PM

దుమ్ముగూడెం ఎందుకు వద్దు?

కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు అని ఆ మధ్యన మీరు ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో పర్యటించినప్పుడు విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించినట్టు

Published: Sun,October 23, 2011 11:14 PM

కంచే చేను మేస్తే...?

మీరు రాసిన వ్యాసాలు, ఇస్తున్న ఉపన్యాసాలు విన్నాక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల దారుణ వివక్ష చూపెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది

Published: Mon,October 17, 2011 12:20 AM

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ

Published: Sun,October 9, 2011 11:06 PM

తెలంగాణ ఎందుకు వెనుకబడింది?

తెలంగాణ వెనుకబడిన ప్రాంతమా? తెలంగాణ బంగారు తునక ఎట్లా అవుతుంది? -మంత్రి కరుణ, హైదరాబాద్ ఏదైనా దేశం లేక రాష్ట్రం లేక ప్రాంతం అభివ

Published: Mon,October 3, 2011 04:39 PM

మన నీళ్లు మనకు దక్కుతాయా?

జలవనరుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి?మన నీళ్లు మనకు దక్కకపోవడానికి కారణం?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనకు జలవనరుల

Published: Sun,September 25, 2011 11:24 PM

వలస గ్రహణం పట్టిన మన ప్రాజెక్టులు

1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు

Published: Mon,September 19, 2011 12:08 AM

అనుమతి లేకున్నా పోలవరం నిర్మాణం

పోలవరం ప్రాజెక్టును ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో కడుతున్నారు కదా! దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు

Published: Fri,September 23, 2011 12:46 PM

రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవర

Published: Mon,September 12, 2011 06:05 PM

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

‘తెలంగాణ ఎత్తు మీద ఉండటం మూలాన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నీళ్లు రావు’ అని సీమాంవూ

Published: Mon,September 12, 2011 06:09 PM

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్? -గొట్టిపర్తి యాదగిరి,

Published: Mon,September 12, 2011 06:10 PM

శ్రీశైలం ఎవరిది ?

-ఆర్. విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశ

Published: Mon,September 12, 2011 06:12 PM

నీళ్లు నిజాలు

వారం వారం జలవిజ్ఞానం బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటుంది. జలజలా గోదారి ధవళేశ్వరం ఆనకట్టవుతుంది. ముక్కారు పంటలు కాలువలకు కాలడ్డం