బలవంతునిదే రాజ్యం


Sun,September 2, 2012 11:43 PM

బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ కేటాయించిన నీరు రాకుండా ఆయా రాష్ట్రాలు అడ్డుకుంటే ట్రిబ్యూనల్ ఏం చేస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో నీరు వచ్చే మార్గమేమిటి? -జి. అర్జున్ హుజూర్‌నగర్, నల్లగొండ జిల్లావివిధ రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తూ , రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కార నిమిత్తం నిర్ణయాలు చేస్తూ ట్రిబ్యూనల్ తీర్పును వెల్లడిస్తున్నది. ఆ తీర్పును అంతర్‌రాష్ట్ర జల వివాద చట్టం 1956 సెక్షన్ 6 అనుసరించి కేంద్ర ప్రభుత్వం గెజిట్(అధికార పత్రం)లో ప్రచురిస్తుంది. ఆ తీర్పుకు ఆయా ప్రభుత్వాలు బద్ధులై ఉండవలసి ఉంటుంది. అదే చట్టం సెక్షన్ 6(ఎ) ప్రకారం కేంద్రం అధికార పత్రంలో, ఆ తీర్పు అమలుకు అవసరమయ్యే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రకటించవచ్చు. ఉదాహరణకు తుంగభద్ర రిజర్వాయర్ నుంచి ఏయే ప్రయోజనాలకు ఎంతెంత నీటిని వాడాలో కేటాయిస్తూ ట్రిబ్యూనల్ తీర్పు చెప్పింది. ట్రిబ్యూనల్ నిర్ణయాలను అమలు చేసే అధికారం తుంగభద్ర బోర్డుకున్నది. అయితే బోర్డు అధికారులు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలను సక్రమంగా అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలు సహకరించవలసి ఉంటుంది. ఎన్నోసార్లు, స్థాని క సమస్యల వల్ల తీర్పు అమలుకాకపోవడం, బాధిత రాష్ట్రం బోర్డుకు ఫిర్యా దు చేయడం, బోర్డు తిరిగి సమస్య సృష్టించిన రాష్ట్రాన్ని వేడుకోవడం, ఫలితం రాకపోతే కేంద్రానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. అంటే ట్రిబ్యూనల్ తీర్పును అమలుచేసే యంత్రాంగం ఉన్నప్పటికినీ రాష్ట్రాలు సహకరించకపోతే న్యా యం జరగదు అన్నది వాస్తవం.

బచావత్ ట్రిబ్యూనల్ 75 శాతం విశ్వసనీయత ఆధారంగా కృష్ణా జలాల పరిమాణాన్ని 2060 టీఎంసీలుగా అంచనా వేసి - మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 800టీఎంసీలు కేటాయించింది.దరిమిలా 70 టీఎంసీల RETURN FLOWS లభిస్తాయని అంచనా వేసి మహారాష్ట్రకు 25 టీఎంసీలు, కర్ణాటకకు 34 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 11 టీఎంసీలను కేటాయించడం జరిగింది. ఈవిధంగా నికర జలాల మొత్తం 2130 టీఎంసీలలో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్ 811 టీఎంసీలు లభించాయి. ఇకపోతే ట్రిబ్యూనల్ రెండు స్కీంలు, స్కీం- ఎ, స్కీం- బీ లను ప్రతిపాదించింది. స్కీం-ఎ ప్రకారం మహారాష్ట్రకు వచ్చేనీటిలో 585 టీఎంసీలు మించకుండా, ఆతర్వాత వచ్చే నీటిలో కర్ణాటక తన వాటా 734టీఎంసీలకు మించకుండా వాడుకోవచ్చు. ఆతర్వాత ఎన్నినీళ్లు వచ్చినా వాటిని ఆంధ్రవూపదేశ్ వాడుకోవచ్చు. స్కీం-బీ ప్రకారం వచ్చేనీటిని దామాషా పద్ధతి ప్రకారం అదనంగా వచ్చినా, లోటు ఏర్పడ్డా మూడు రాష్ట్రాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. అన్నిరాష్ట్రాలు ఒప్పుకుం ఏ స్కీం అయినా అమలులోకి వస్తుంది. వ్యూహాత్మకంగా మన రాష్ట్రం స్కీం-ఏ తప్ప ఇంకోదాన్ని ఇష్టపడలేదు. ఫలితంగా స్కీం-ఏ అమలులోకి వచ్చింది. తత్ఫలితంగా 811 టీఎంసీలకు పైగా అనుభవించే నీటిని మిగులు జలాలుగా పరిగణించి వాటిని అనుభవించే (స్వేచ్ఛ హక్కు కాదు) హక్కుని మాత్రమే ట్రిబ్యూనల్ మనకు ఇచ్చింది.

స్కీం-ఎ ప్రకారం ఏదేనా సంవత్సరం 585 టీఎంసీల లోపే నీరు వస్తే కేవలం మహారాష్ట్ర అనుభవిస్తున్నది. ఆంధ్రవూపదేశ్ కర్ణాటకకు నీళ్లురావు. అట్లాగే 1319 టీఎంసీలలోపు వస్తే 585 టీఎంసీల దాకా మహారాష్ట్ర, మిగ తా నీటిని వినియోగించుకునే హక్కు కర్ణాటకకున్నది. 1319 టీఎంసీలకు పైబడి వస్తే తప్ప ఆంధ్రవూపదేశ్ నీటికి నోచుకోదు. ఏదైనా సంవత్సరం 1319 టీఎంసీల లోపే నదిలోకి నీరు వస్తే ఆంధ్రవూపదేశ్ కర్ణాటకకు నీరడిగితే కర్ణాటక వీల్లేదని ఖరాఖండిగా చెప్పవచ్చు. చట్టపరంగా పై రాష్ట్రాల మీద కోర్టు లో ఫిర్యాదు చేసే అవకాశం లేదు. కేవలం మానవతా దృక్పథంతో తప్ప పై రాష్ట్రాలు తమకు లభించిన వాటాలో నీరు ఇవ్వాలన్న నియమమేమీలేదు. వచ్చే చిక్కెక్కడంటే ఆయారాష్ట్రాలు తమకు కేటాయించిన నీటికన్నా ఎక్కువ వాడుకుంటే దాన్ని ఆపడం ఎట్లా? అసలు తమకు కేటాయించిన నీరే వాడుకుంటున్నారా? లేక ఎక్కువ వాడుకుంటున్నారా? ఎలా తెలుసుకోవడం? ఇప్పుడున్న వ్యవస్థలో ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందో నిక్కచ్చిగా, నిజాయితీగా సమాచారం ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలేదు. అసలు అనుమతులు లేకుండా మరోరాష్ట్రం వాళ్లు ప్రాజెక్టును సందర్శించే అవకాశమేలేదు. ఎన్ని చట్టాలు చేసినా రాష్ట్రాలు పరస్పరంగా వాడుకునే సంప్రదాయం లేదు. మనరాష్ట్రమేకాదు, అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇంతే. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల గుండా నదులు ప్రవహిస్తున్న కేసుల్లో పొరుగురాష్ట్రాల మధ్య ఎక్కడా సఖ్యత లేదు. కేరళ-తమిళనాడుల మధ్య, తమిళనాడు-కర్ణాటకల మధ్య, కర్ణాటక -ఆంధ్రవూపదేశ్ మధ్య, తమిళనాడు- ఆంధ్రవూపదేశ్‌ల మధ్య, ఆంధ్రవూపదేశ్‌కు అటు మహారాష్ట్రతోనూ ఒడిషాతోనూ, ఛత్తీస్‌గఢ్‌తోనూ నీటి కలహాలు ఉన్నాయి. కేవలం కేంద్రవూపభుత్వం కోరితే అదికూడా ఇతర రాష్టాలకు తెలియకుండా చేయకూడదనే షరతులపైనే రాష్ట్రాలు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతున్నది.

ఆయా రాష్ట్రాలు తమకున్న హక్కుల పరిధుల్లోనే నీటిని వినియోగించుకునేందుకు గాను కేంద్రం ఒక చెక్ పెట్టింది. ఏదైనా ప్రాజెక్టు రిపోర్టు వచ్చినప్పుడు అది అంతర్ రాష్ట్ర నది అయినప్పుడు, ప్రాజెక్టు వినియోగం ఆరాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఇదివరకు వాడుకున్న ప్రాజెక్టులకు పోను మిగులు ఉన్నదా లేదా అన్న విషయం కేంద్ర జలసంఘం తేలుస్తుంది. మిగు లు జలాల ఆధారంగా మనం తలపెట్టిన ప్రాజెక్టులు నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, గాలేరు, నగరి, హంద్రీనీవా, వెలిగొండ దేన్ని కూడా కేంద్రం ఆమోదించకపోవడానికి గల ఏకైక కారణం మనకు సంక్రమించిన నికర జలాల పరిమాణం మొత్తాన్ని ఇదివరకే వినియోగించుకొని ఉండటం. అయితే ఇక్కడో చిక్కు ఉన్నది. కేంద్రం అనుమతించకపోతే కేంద్రం నుంచి నిధులు రావు. అంటే రాష్ట్రం తమ నిధులతోనే ప్రాజెక్టులు నిర్మించుకుంటే అవి అనధికార ప్రాజెక్టులు అవుతాయి. వాటి ద్వారా నీటి వినియోగం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఆపే మార్గం కానీ శక్తిగానీ కేంద్రానికి లేదు. అంటే మహారాష్ట్రలోనూ, కర్ణాటకలోనూ మనం కట్టుకుంటున్న మాదిరిగానే అనధికార ప్రాజెక్టులను తమ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించుకుంటే, వాటికి నీటిని తరలిస్తే కేంద్రం చేయగలిగేదేమి లేదు. మొన్నటి దాక కృష్ణా బేసిన్‌లో వర్షాలు లేవు. సహజంగానే మహారాష్ట్ర పరిస్థితిని మనం ఎక్కువగా పరిగణనలోకి తీసుకోం. మనకు పొరుగున ఉన్న కర్ణాటక గురించి మాత్రమే పట్టించుకోకుంటాం. ఆలమట్టి, నారాయణపురం నిండితే జూరాలకు నీళ్లు వదుల్తారు. అట్లాగే మహారాష్ట్ర భీమా ప్రాజెక్టు నిండితే భీమా నుంచి కృష్ణాకు నీళ్లు వస్తా యి. తుంగభద్ర నిండితే శ్రీశైలంలోకి డెరెక్ట్‌గా నీరొస్తుంది. శ్రీశైలంలోకి రావాలంటే అటు జూరాల, ఇటు తుంగభవూదలు నిండాలి.

మహారాష్ట్ర కర్ణాటకలు తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నాయా, లేక అనధికార ప్రాజెక్టుల ద్వారా ఎక్కువగా వాడుకుంటున్నాయా? మనకు నీరు రాకపోవడానికి ఎగువన పరీవాహక ప్రాంతంలో తగినంత వర్షం పడలేదా లేక వరద వచ్చి కూడా పై రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటి పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో వాడుకుంటున్నాయా? అనే విషయంలో నిజానిజాలు తేల్చడానికి బచావత్ ట్రిబ్యూనల్ ఎలాంటి నిఘా సంస్థను ఏర్పాటు చేయలేదు. ఇందులో ట్రిబ్యూనల్ తప్పులేదు. మన రాష్ట్రానిదే తప్పు. మనకు అత్యాశ. జరిగిందేమిటంటే బచావత్ ట్రిబ్యూనల్ మూడు రాష్ట్రాల మధ్య నీటిని కేటాయించే క్రమంలో రెండు స్కీంలను స్కీం-ఎ ని, స్కీం-బీ ని ప్రతిపాదించింది. స్కీం-ఎ నే మనం అంగీకరించాం. స్కీం బీ ప్రకారం కృష్ణా నదిలో 75 శాతం సంవత్సరాల్లో 2060 టీఎంసీల కంటే తక్కువ వస్తుందన్నది అంచనా. అలా 2060 టీఎంసీల కంటే ఎక్కువగా వచ్చినప్పుడు ఆ నీటిని మనం మిగులు జలాలుగా, 2060 టీఎంసీల కన్నా తక్కువ వచ్చినప్పుడు దాన్ని లోటుగా పరిగణిస్తుంటాం. స్కీం-బీ ప్రకారం మూడు రాష్ట్రాలు కూడా మిగులు, లేక లోటు పరిస్థితుల్లో దామాషా పద్ధతిని మిగులు లేక లోటును భరించాలి. అయితే స్కీం-బీ అమలుకు కృష్ణా వ్యాలీ అథారిటీని ఏర్పాటు చేయాలి. అదిమూడు రాష్ట్రాలలో కేటాయించిన నీటిని వినియోగించుకునేట్టుగా బాధ్యత వహిస్తుంది. ఆనాటి పరిస్థితి ఏమిటంటే.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు రెండు కూడా నికర జలాలను పూర్తిగా వాడుకునే పరిస్థితిలో లేవు. తగిన డ్యాంలు రిజర్వాయర్ల నిర్మాణం కాలేదు. కనుక మిగులు జలాలను ఎలాగు ఉపయోగించుకోలేదు. ఆ సదవకాశాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో మనం స్కీం-ఎ కావాలన్నాం.

బచావత్ ట్రిబ్యూనల్ కాల పరిమితి 2000 వేల సంవత్సరం ‘మే’నెలకు ముగిసింది. అప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఏర్పడింది. ఆ ట్రిబ్యూనల్ వారు మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచడంలో నిమగ్నులయ్యారు. అంతేకాక తమ తీర్పును అమలు చేసేందుకు ఒక అమలు మండలిని ఏర్పాటు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. తాత్కాలిక లాభాలకు ఆశపడి మనం స్కీం-బీ వద్దన్నం. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర, కర్ణాటక తమకు కేటాయించిన నీటి కన్న ఎక్కువ వాడుకుంటూ ఉంటే తెలుసుకునే మార్గంలేదు. నియంవూతించే యంత్రాంగమూ లేదు. ఆపే శక్తిలేదు. ఆధారాలుంటే కోర్టులను అశ్రయించడం తప్ప మరోగతిలేదు.ఇటీవల చోటుచేసుకున్న తుంగభద్ర కుడి గట్టు దిగువకాలువ పరిస్థితి గమనిద్దాం. దిగువకాలువ 1690 క్యూసెక్కుల నీటిని మోసుకు వెళుతుంది. అందులో బళ్లారి జిల్లాల్లో1030 క్యూసెక్కుల వినియోగం కాగా మిగతా 660 క్యూసెక్కులు కర్నూలుకు వెళ్ళాలి.అలా చూడవలసిన బాధ్యత కేంద్రం పర్యవేక్షణలో ఏర్పడిన తుంగభద్ర బోర్డుది. జరిగేది ఏమంటే మోకా రెగ్యులేటర్ (బళ్లారి జిల్లా) తలుపులను బళ్లారి జిల్లా రైతాంగం బలవంతంగా దించేసి నీటిని తమవైపు అక్రమంగా తరలించారు.ఆంధ్రవూపదేశ్‌కు 160 క్యూసెక్కుల నీటిని రెండు తలుపులు తెరవడం ద్వారా మళ్ళించగలిగారు అధికారులు. కర్నూలు జిల్లా కలెక్టర్, బళ్ళారి జిల్లాకపూక్టర్‌తో మాట్లాడారు. బోర్డు అధికారులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

కర్ణాటక రైతాంగం తరుఫున ప్రాతినిధ్యం వహించిన బళ్ళారి ఎమ్మెల్యే శ్రీరాములును చూసి కర్ణాటక పోలీసులు భయపడ్డారు. జరగవలసిన నష్టం జరిగిపోయింది. కర్నూలు జిల్లా మంత్రులు ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక మీనమేషాలు లెక్కబెట్టారు. దీంతో ఆంధ్రవూపదేశ్ (రాయలసీమ)నీటిని కర్ణాటక దొంగిలించింది. అయినా అడ్డుకోవడం సాధ్యపడలేదు. ఇదే తంతు ఎగువకాలువలోనూ జరుగుతున్నది. కర్ణాటక సరిహద్దులు దాటి అనంతపురంలోకి నీరు వెళ్ళాలి. కాని నీటిని కర్ణాటక అక్రమంగా వాడుకుంటున్నది. ఆపేశక్తి ఎవరికీ లేదు. అందుకే సమాంతర కాలువ కావాలని ఆంధ్రవూపదేశ్ పట్టుబట్టినా కర్ణాటక ఒప్పుకోలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ అంగీకరించలేదు. అంటే కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ కన్నా బలమైనశక్తి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆర్‌డీఎస్ రాజోలిబండ, తూముల సంగతి కూడా ఇలాంటిదే. ఎగువన ఉన్న కర్నూలు రైతులు బైరెడ్డి నాయకత్వాన షట్టర్లు పగలగొట్టి నీటిని పాలమూరు వైపునకు రాకుండా సుంకేశులకు మళ్ళించుకోలేదా? కారణం తెలంగాణ కంటే సీమ నాయకులకు బలముంది. ఈ రోజు తుంగభద్ర నీరు రాకుంటే గగ్గోలు పెడుతున్నారు. తమదాక వస్తే గాని తెలియదు. ఏదేమైనా బలవంతుడిదే రాజ్యం. ఎగువన ఉంటే సహజంగానే భౌగోళికంగా లబ్ధి చేకూరుతుంది. కాని ఎగువన ఉన్నా, దిగువన ఉన్నా బలవంతుడెప్పుడూ బలహీనుడి కన్నా వెలుగుతాడు. పోతిడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలించుకుపోయిన నీటిని ఎలాంటి హక్కులేకున్నా సీమావాసులు అనుభవించడం లేదా? లేని హక్కులను ఉన్నాయని దబాయిస్తూ డెల్టా రైతాంగం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం లేదా! కోస్తావాళ్లు బలవంతులు కాబట్టి నేడో రేపో శ్రీశైలం, సాగర్ నీటిని దోచేస్తారు. ఎంత దౌర్భగ్య పరిస్థితి తెలంగాణది. అసమర్థ నాయకులు అమాయక ప్రజ లు, గులాంగిరీ చేసే అధికారులు ఉన్నంత కాలం తప్పదు ఈ నరకయాతన. ఈ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ కవితా సూక్తులు గుర్తుకు చేసుకుందాం. ‘బలవంతులు దుర్బలజాతిని బానిసలు కావించారు.. ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం’?

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Featured Articles