నాటి ‘జనధర్మ’ నేటి అక్షర సత్యం


Sun,April 7, 2013 10:03 AM

ప్రభుత్వం మీద, తెలంగాణా ప్రాంతంలో నివసించే ఉద్యోగుల మీద అమితమైన బాధ్యతలున్నాయి. ఉభయ వూపాంతాల ప్రజల మధ్య రెచ్చిపోయిన విద్వేషానలాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? నాయకుల్ని జైల్లో వేయడం ఆంధ్రుల ఇళ్లకు సాయుధ పోలీసుల కాపలా కాయడం వంటి చర్య విద్వేషం నిర్మూలనకూ విశ్వాసం నెలకొల్పుటకు గాక మరింత ద్వేషానికే కారణం కావడం లేదా? పైగా ఇటీవల మంత్రి పదవులను అలంకరించిన వారి ప్రసంగాలు జనాన్ని కవ్వించేవిగానే ఉంటున్నా యి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రిబాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మర్రి చెన్నాడ్డి వంటి తెలంగాణా నాయకుడు, ఇటువంటి విచక్షణా రహితమైన దమనకాండను సాగించే పోలీసు వారిపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోగలదని ప్రకటించవలసి వచ్చిందంటే పోలీసుల హింసాకాండ ఏ స్థాయికి చేరుకున్నదో చెప్పనక్కరలేదు. ... (జనధర్మ సంపాదకీయం, తేదీ ఆగస్టు15, 1969, ఎం ఎస్ ఆచార్య సంపాదకీయాలు పుస్తకం పేజీ 140, 141 నుంచి)

సరిగ్గా మార్చ్‌కు వచ్చిన లక్షలాది ఉద్యమకారుల మీద లాఠీలు, బాష్పవాయుగోళాలు, జల ఫిరంగులు కురిపించి తెలంగాణ ఎంపీలను సైతం అరెస్టు చేసిన సందర్భంలో రాసినట్టే ఉన్న ఈ వాక్యాలు ఆగస్టు 15, 1969 నాడు వరంగల్ నుంచి తెలంగాణ గొంతుక వినిపించిన రాజకీయ వారపవూతిక జనధర్మలో సంపాదకుడు ఎం.ఎస్. ఆచార్య విసిరిన బాణాలు. అప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఇవే మాటలు మాట్లాడారు, వారి కింద పనిచేసిన పోలీసులు ఇదేరకంగా తెలంగాణ ఉద్యమ నాయకుల మీద అణచివేతలు అరెస్టులు కుట్ర లు సాగించారని ఈ సంపాదకీయం వివరిస్తుంది.

తెలంగాణా ఉద్యోగులకు దశాబ్దాలుగా అన్యాయాలేనా?
తెలంగాణాకు ఇవ్వబడిన రక్షణలలో ముల్కీలకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాల రిజర్వు ఒకటి. ఇందుకోసం ముల్కీ రూల్స్ అమలుకు వచ్చాయి. ముల్కీలకు రిజర్వు చేయబడిన ఉద్యోగులలో 40 శాతం మంది నాన్ ముల్కీలు, దొంగ ముల్కీలు నియామకమైనా 60 శాతం రూల్స్ ప్రకారం ముల్కీలకు లభించాయి. 12 సంవత్సరాలుగా లభిస్తున్నాయి. ఈ నాన్ ముల్కీల స్థానే ముల్కీలకే రావాలని ఆందోళన చేయగా ప్రభుత్వం ప్రతిపక్షాలు అంగీకరించాయి. ముల్కీ రూల్సు రాజ్యాంగ విరుద్ధమనే కోర్టు తీర్పును ఆంధ్ర ఉద్యోగులు పొందారు. ఏ ముల్కీ రూల్స్ ప్రకారం తమకు ఉద్యోగాల విషయములో రక్షణ ఉన్నదని ప్రాంతీయులు నమ్మారో అవి రాజ్యాంగ విరుద్ధమైనవైతే గత 12 సంవత్సరాలుగా అవి అమలులో ఎట్లా ఉన్నాయి.

ఈ 12 సంవత్సరాలలో ఏ ఆంధ్ర ఉద్యోగి కూడా కోర్టుకు వెళ్లలేదేమి? ముల్కీ నిబంధనలు 1964లో తిరిగి అయిదేళ్ల కాలం పొడిగించినప్పుడైనా కోర్టుకు వెళ్లలేదేమి? రక్షణలు ఒకవైపున వున్నా దొడ్డిదారిన ఉద్యోగాలు తమకు లభింప జేసినంతకాలం వీరు కోర్టుకు వెళ్లలేదా? ఈ రహస్యం బట్టబయలై ప్రజాందోళన ప్రారంభమై ప్రభుత్వం తానే నాన్ ముల్కీ లను కాళీ చేయించే స్థితి వచ్చినపుడు కోర్టు కు వెళ్లారా? ఇదంతా తమను మోసగించడానికే అనే దృఢాభివూపాయం ప్రజలకు ఏర్పడడం లో ఆశ్చర్యం లేదు. (జనధర్మ సంపాదకీయం)
తమకు అనుకూలంగా సాగినంత కాలం ఒప్పందాలను బతకనీయడం, ఒప్పందం అసలు ప్రయోజనాలు అమలు కాకతప్పదన్నపుడు కోర్టుకు వెళ్లి ఒప్పందం రాజ్యాంగ విరుధ్ధం అని తీర్పు పొందడం పైన జనధర్మ లేవనెత్తిన ప్రశ్నలు ఇవి.

రాజ్యాంగ విరుధ్దమైతే ముల్కీ ఇన్నాళ్లు ఏ విధంగా అమలైందని ఎం.ఎస్. ఆచార్య నిలదీసారు. ఈనాటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఆ మోసాల కు అంతు లేదు. ఇక్కడి ఉద్యోగులు, జనం అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. కొందరు కుహనా మేధావులు అవాస్తవాలను పుట్టించి వాటిని తమకు అనుగుణంగా అన్వయిస్తూ బలీయమైన తెలంగాణవాదాన్ని మోసంతో ఎదుర్కొనే ప్రయత్నం ఈనాడు కూడా అదే ధోరణిలో కొనసాగిస్తూనే ఉన్నారు. ముల్కీ ఒప్పందం ఎన్ని రూపాలు మారినా ఎన్ని కోర్టు మెట్లు ఎక్కి దిగినా మోసం రూపంలో మార్పు లేదు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయాల విషయంలో అంతులేదు.

అంతులేని ద్రోహాలు అపనమ్మకాలు
ఆంధ్ర తెలంగాణా మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని ఈ మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి చేయవలసిన ప్రయత్నం ఏదీ ప్రభు త్వం గానీ, నాయకులు గానీ చేయడం లేదు. ప్రజల్లో విశ్వాస పునరుద్ధరణ జరగనిదే ఏదీ పొసగదు. నాయకులను జైళ్లలో పెట్టినంత మాత్రాన ఉద్యమాందోళన పోదు. సంస్కృతీ సమైక్యతలకు సంబంధించిన సూత్రాలు ఎంత గొప్పవైనా ఉన్నతమైనవైనా వాటి చాటున తమకు ధ్రోహం తల పెట్టబడిందని నమ్మకం కలిగిన తరువాత ఉపయోగకరం కాజాలవు. (జనధర్మ సంపాదకీయం)
ప్రశాంతంగా సాగుతున్న మార్చ్ మీద నెత్తుటి మరకలు పూసింది కవాతులో జొరబడిన సీమాంధ్రకు చెందిన ద్రోహులని మఫ్టీలో ఉన్న పోలీసులే మీడియా వాహనాలను కూడా తగుల బెట్టారని జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.

ఈ వ్యవహారాలపైన విచారణ జరగా లి. ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకున్న ఈ అపనమ్మకాన్ని దూరం చేసే ప్రయత్నం చేయడం మాట అటుంచి అనుమానాలు మరింత పెంచే పనులే జరగడం 1969లోనే కాదు, 43 ఏళ్ల తరువాత ఈ రోజూ జరుగుతూ ఉండ డం ఈ నాటి తరం ఉద్యమకారులు, ఉద్యమనేతలు, వారిపైన నమ్మకం ఉంచి ఇంకా ఆశలు పెంచుకుంటున్న తెలంగాణ నాయకులు గమనించవలసిన కీలకమైన అంశం అని ఎం.ఎస్. ఆచార్య ఆనాడు రాసిన సంపాదకీయం ఈనాటి పరిణామాల నేపథ్యంలో హెచ్చరిస్తున్నది.

సమైక్యత అంటే ఇదేనా?
ప్రభుత్వం సమస్త సాయుధ పోలీసు బలగం అండన ఉన్నా తమకు రక్షణ లేదనే భీతాహంలో ఆంధ్ర కుటుంబాలవారు పడిపోయినప్పుడు, ఆంధ్ర ప్రాంతపు జైళ్ల లో తెలంగాణా నాయకులపై ఘోరాలు జరగవచ్చుననీ, చదవదలచిన విద్యార్థులకు ఆంధ్రవూపాంతము కళాశాలల పాఠశాలల్లో ఉస్మానియా విశ్వ విద్యాలయాధికారులు ఏర్పాటు చేసినప్పడికీ తమ పిల్లలకు అపాయము కలుగుతుందని ఇక్కడి ప్రజలు భీతాహ పడటంలో వింత ఏమీ లేదు. రాష్ట్రపతి పాలనను విధించడం, 1956 ఒప్పందం అనుసరించి ఇవ్వబడిన రక్షణలను అన్నింటినీ అమలు చేయడం, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయా లా వద్దా అనేది రిఫండం పెట్టటం వంటి చర్యలే ప్రజా విశ్వాస పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. రాష్ట్ర సమైక్యతకు పటిష్ట రూపం ఏర్పడి సుస్థిరము కావడమో లేక రెండు తెలుగు భాషా రాష్ట్రాలు ఏర్పడి ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధంలు సుదృఢం అవటమో ఇందువల్ల జరుగుతుంది. రిఫండం మొదటి ఫలితాన్నిచ్చైనా సరేసరి. లేక రెండో ఫలితమే అయితే సుహృద్భావ సంబంధాలు సుదృఢమయిన తరువాత కొంత కాలానికి రెండు తెలుగు రాష్ట్రాలు శాశ్వతముగా సమైక్యం కాగల వీలయినా కలుగుతుంది. (జనధర్మ సంపాదకీయం)

ఆనాటి అసహనం, తీవ్రద్వేషం ఈనాటికీ అంతే తీవ్రంగా ఉన్నాయా? ఇంకా పెరిగాయేమో అనిపిస్తుంది. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీని మూయించాలని సెప్టెంబర్ 30 రాత్రి ఒక కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహోదక్షిగులై మాట్లాడడమేమిటి? ప్రశాంతంగా రాజకీయపు పైపూతలు లేకుండా స్వచ్ఛంగా అహింసాయుతంగా లక్షలమందిని నడిపిన ప్రొఫెసర్ కోదండరాంపైన కుసంస్కారం అంటూ ఆ ఎంపీ వ్యాఖ్యానించడం తీవ్రమైన అసహనానికి ప్రతీక. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తెలంగాణ కోరితే తప్పా? అక్కడినుంచి మార్చ్‌కు బయలుదేరడమే నేరమా? అందుకు లాఠీ చార్జిలు రబ్బర్ బుల్లెట్లు ఎదుర్కోవాలా? తెలంగాణ కావాలంటే తప్పయి తే దాన్ని వ్యతిరేకించడం కూడా తప్పు కాకుం డా పోతుందా? ఆ తప్పుచేసిన విద్యార్థులున్న విశ్వవిద్యాలయాలను కూడా మూసివేయమంటారా? తెలంగాణ ఇస్తామని అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మూసేస్తారేమో ఎంపీ గారు వివరించాలి?

రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటే తెలుగువాళ్లను కలిపే మార్గం
మరొక వైపుయంవూతాంగం టివి ప్రసారాలు నిలిపివేయడం, సాంకేతిక సాకులు చూపుతూ రైళ్లు రద్దు చేయ డం, అరెస్టులు చేయడం, మార్చ్‌కు వెళ్లవలసిన దారిలో బారికేడ్లు, ముళ్లకంచెలు కట్టడం ఇవన్నీ ఉద్యమం పట్ల రాజకీయ వ్యతిరేకతనే కాకుండా ద్వేషా న్ని కురిపించే పనులు. ఈ మాటలు వినిపించినంత కాలం, ఈ పనులు జరుగుతున్నంత కాలం, రాష్ట్రంలో సమైక్యత లేదని స్పష్టమవుతున్నది. లేని సమైక్యత ఒక భ్రాంతిగా మిగిలిపోయింది అనే విషయం కేంద్రం గుర్తించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని 43 ఏళ్ల కిందట జనధర్మలో ఆచార్య కలం చెప్పిన మాట నేటికీ అత్యవసరమైన బాటే.

అక్షరయోధునికి అక్షర నివాళి
ఆయన ఆయుధం కలం. సరిగ్గా ఏళ్ల కిందట ఈరోజున అంటే అక్టోబర్ 3న జన్మించిన ఎం ఎస్ ఆచార్య, తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రిక కు వార్తలు రాసే విలేకరిగా పనిచేసినాడు. అప్పుడు ఆంధ్రపవూతికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టే వాడు. అదే ఆయన ఉద్య మం ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. నెల్లికుదురు గ్రామం లో తండ్రి ప్రసన్న రాఘవాచార్య దగ్గరికి వైద్యం కోసం వచ్చిన అజాత విప్తవ వీరుడు దేవులపల్లి వెంక జీవితం తనకు స్ఫూర్తి అని చెప్పినారు.

వావిలాల గోపాల కృష్ణయ్య తెనాలిలో స్వాతంవూత్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణా శిబిరం లో పాత్రికేయ వృత్తి మెలకువలునేర్చుకున్నారాయన. ఆయన ఆరంభించిన అక్షర సంగ్రామమే ఆచార్య చేత ఆ తరువాత జనధర్మ వారపవూతిక ప్రారంభింపజేసింది. ముప్ఫై ఏళ్ల తరువాత వరంగల్ వాణి దినపవూతిక ప్రచురణ మొదలు పెట్టారు. కలం ఆగిన తరువాత జులై 12, 1994న ఆయన ఊపిరి ఆగిపోయింది. అక్షర యోధునికి అక్షర నివాళి.

-ఆచార్య మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం

37

MADABHUSI SRIDHAR