నష్టపోయిన ప్రాంతానికే పరిహారం


Mon,June 30, 2014 07:18 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర్పడగా నే మొదట దెబ్బతిన్నది పోచంపాడు ప్రాజెక్టు. రాష్ట్రానికి ఒక భారీ ప్రాజెక్టు ఉండాలని అప్పడి జవహర్‌లాల్ నెహ్రూ పాలసీ. హైదరాబాద్ రాష్ట్రానికి పోచంపాడు పెద్ద ప్రాజెక్టు. కానీ సీమాంవూధతో కలవగానే నాగార్జునసాగర్‌ను పెద్ద ప్రాజెక్టు చేసి పోచంపాడును రహస్యంగా చంపేశారు. తగ్గించారు. నిధులు ఇవ్వక ఏడిపించారు. నీళ్లు రాకుండా పక్క రాష్ట్రాలు చేసే ప్రయత్నాలను పోతే పోనీ అని ప్రతిఘటించకుండా తెలంగాణకు అన్యాయాలు చేశారు. నాగార్జునసాగర్ లోనైనా తెలంగాణకు న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. తెలంగాణ జిల్లాల్లో పారే కాలువల నిర్మాణం కావాలని ఆలస్యం చేశారు. ముందు కోస్తాలో, డెల్టాలో మూడు పంటలకు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఒక్క పంటకు కూడా నీరివ్వని దుర్మార్గం దశాబ్దాల పాటు కొనసాగించారు. దీని గురించి మాట్లాడమంటే కుహనా మేధావులు కొందరు నీరు పల్లమెరుగు అని తెలియదా? తెలంగాణ ఎత్తుగడ్డ అందుకే నీళ్లు మీకు రావు అని హేళనగా నవ్వుతూ వాదిస్తారు. మరి కృష్ణా గోదావరి నదులు ఇతర నదులు తెలంగాణ నుంచే ఎందుకు పారుతున్నాయి? నదులు పారుతున్న ప్రాంతాల్లో పక్కనున్న పొలాలకు నీరివ్వడానికి ఏ ఎత్తుగడ్డ అడ్డు వచ్చింది? ఒకవేళ నీరు పల్లమెరుగు అని నీళ్లన్నీ వదిలేస్తే సమువూదంలో కలిసి పోవలసిందే కదా, మరి ఆనకట్టలు ఎందుకు కడుతున్నారు? ఒకవేళ కోస్తాంధ్ర పల్లంలో ఉండి నీటికి కొదవలేకపోతే, తెలంగాణ వస్తే మా జిల్లాలలకు నీళ్లు రానేరావనే వాదం ఎక్కడనించి పుట్టింది? ఇంజినీర్లు, రాజకీయ నాయకులు మేధావులనబడే వారు పక్కనున్న ప్రాంతానికి ఇంత ద్రోహం చేయడం, తరువాత అంతా సమైక్యం కలిసి ఉండాలని ఉత్త ఖాళీ నీతి బోధలు చేయడం ఎవరూ ఊహించలేరు. మరొక మేధావి అతను పార్టీ నాయకుడో, ఎన్జీవోనో లేక మరేదో ఆయనకే తెలియదు. మాజీ పరిపాలనాధికారినరి చెపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాం గ సమాఖ్య లక్షణానికి వ్యతిరేకమని తప్పుడు వ్యాఖ్యానా లు చేస్తుంటాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్టపోయేది సీమాంధ్ర అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమిటి? అక్రమంగా ఇన్నాళ్లూ చేసుకుంటున్న లాభాలు రావనా? లేక న్యాయంగా వారికి రావలసింది రాకుండా పోతుందనా? న్యాయంగా తమకు వచ్చేది ఇది రాకుండా పోయేది ఇది అని ఇంతవరకు ఒక్క సీమాంధ్ర నిపుణుడు కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే పోయేదేమీ లేదు కనుక. హైదరాబాద్ లేకుండాపోయిందన్న దుగ్ధ తప్ప. దాదాపు అక్రమంగా వంద టీఎంసీ జలాలను తరలించుకుపోవడానికి సీమాంధ్ర ముఖ్యమంవూతులు,నోరుమూసుకున్న తెలంగాణ సేద్యపు నీటి మంత్రులు, సీమాంధ్ర పక్షపాత, తెలంగాణ వ్యతిరేక ఇంజినీర్లు, వారికి సాయం చేసే ఇతర ప్రభుత్వోద్యోగులు చేసిన అక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిలిచిపోతాయి. దీన్ని నష్టమనీ అందుకు నష్టపరిహారం ఇవ్వాలని ఎవరూ అడగడానికి వీలుండదు. నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి కాని నష్టం చేసిన వారికి కాదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్టపోయేది సీమాంధ్ర అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమిటి? అక్రమంగా ఇన్నాళ్లూ చేసుకుంటున్న లాభాలు రావనా? లేక న్యాయంగా వారికి రావలసింది రాకుండా పోతుందనా? న్యాయంగా తమకు వచ్చేది ఇది రాకుండా పోయేది ఇది అని ఇంతవరకు ఒక్క సీమాంధ్ర నిపుణుడు కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే పోయేదేమీ లేదు కనుక. హైదరాబాద్ లేకుండాపోయిందన్న దుగ్ధ తప్ప.


తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రవూపదేశ్‌ను ఏర్పాటు చేశాక గత 57 ఏళ్లలో సీమాంవూధులు కేవలం బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణ భూముల అమ్మకం ద్వారా ఈ ప్రాం తాన్ని దోచుకున్న సంపదే నాలుగున్నర లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)కు టీఆర్‌ఎస్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు సీమాంధ్ర పాలకుల తప్పుడు పరిపాలన, కావాలని సాగించిన నిధులు నీళ్ల మళ్లింపు కారణంగా తెలంగాణలో ఇరిగేషన్, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడి రూ.4.53లక్షల కోట్లు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో తెలిపారు. గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఈ నివేదిక గుర్తు చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌ల ద్వారా రాజ్యంగబద్ధంగా, బచావత్ ట్రిబ్యూనల్ కేటాయింపుల ప్రకారం నీటి పంపకాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను కేటాయించాలి. తాగు నీటిని సాగునీటిని పంచడంలో తెలంగాణకు విశాలాంవూధలో అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఫజల్ కమిషన్ కూడా హెచ్చరించింది. తెలంగాణలో కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించాలన్న సూచనను పాటించకపోగా ఉన్న ప్రాజెక్టులకు నీరందకుండా తరలించుకుపోయారు. సమైక్యపాలనలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు చేస్తున్న లక్షలాది చెరువులను నాశనం చేశారు.1976లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యూనల్ కూడా కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని గుర్తించింది. కృష్ణాలో తెలంగాణకు కేటాయించిన 298 టీఎంసీలు, గోదావరిలో కేటాయించిన 900 టీ ఎంసీ జలాలు అందకుండా కుట్రలు చేశారు. తమకు కేటాయించిన నీటికన్నా అదనంగా నదుల నీటిని సీమాంవూధకు తరలించుకుపోయారు.


తెలంగాణ తీవ్రంగా నష్టపోయిన మరో రంగం ప్రభుత్యోద్యోగాలరంగం. ప్రభుత్వవిభాగాలలోని నియామకాలలో తెలంగాణకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు లభించలేదు. విశాలాంధ్ర ఏర్పడగానే మొదట పథకం ప్రకారం సీమాంధ్ర పాలకులు చేసిన దుర్మార్గం ఏమంటే తెలంగాణ ఉద్యోగులను ఏదో ఒక అర్హతను అనర్హతల సాకు చూపు తూ పక్కకుబెట్టి తమకు అనుకూలురైన పక్షపాతంతో కూడిన వారిని ఎంచుకొన్నారు, ఒక్కొక్క ఉద్యోగి తమ జిల్లాల నుంచి వందల మందిని తరలించి తమ వలస బలాన్ని పెంచుకున్నారు. కొన్ని రంగాలలో దీని ఫలితంగా 48 శాతం ఉండవలసిన తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కనీసం 25శాతం మించలేదు. తెలంగాణ ఉద్యోగులలో 30 శాతం మంది వారు సీమాంవూధులే ఉన్నారు, వీరు తెలంగాణకు భారమే కాకుండా, తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి వస్తుంది. సేద్యపు నీటి అన్యాయాలతో పాటు ఉద్యోగుల విషయంలో తెలంగాణ సాగిన అన్యాయాలకు వ్యతిరేకంగా 1969లో ఉద్యమం వచ్చింది. ముల్కీ నియమాలను సుప్రీంకోర్టు సమర్థించినా సీమాంధ్ర లాబీయింగ్ శక్తికి తుంగలో తొక్కారు. మొత్తం రెండున్నర లక్షల కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయాయని ఈ నివేదికలో అంచనా వేశారు. కేవలం 27 శాతం తెలంగాణ వారే ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే పెన్షనర్ల భారం 2072 కోట్లు ఉంటుంది వీరిలో అత్యధికులు సీమాంధ్ర వారే. వీరిని ప్రాంతీయవారీగా గుర్తించి వారి బాధ్యతను ఆయా ప్రాంతాలకు అప్పగించాలి.


విభిన్న ప్రభుత్వ ఉద్యోగరంగాలలో తెలంగాణ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడమే ఈ ఉద్యమానికి కారణం కనుక, ఇప్పుడున్న ఉద్యోగులను 52: 48 నిష్పత్తితో విభజిస్తే తెలంగాణలో 25 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. వీరు ఉన్నత స్థాయిలో ఉంటే వారికింద ఉండే తెలంగాణ ఉద్యోగులను కక్షగట్టి నాశనం చేస్తారు, ఈ పరిస్థితి న్యాయశాఖలో విపరీతంగా ఉంది. తెలంగాణ కేడర్ న్యాయాధికారులు. ఇటీవల హైకోర్టు జడ్జి నియామకాలు కూడా తెలంగాణకు అన్యాయాన్ని ప్రతిబింబిస్తున్న విష యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిల్లా స్థాయి న్యాయస్థానాలలో తెలంగాణ వారి సంఖ్య 25శాతం కూడా ఉండబోదని ఒక అంచనా. 52: 48 నిష్పత్తిలో కనుక ఉద్యోగుల పంపిణీ జరిగితే అది అన్యాయాల కొనసాగింపు అవుతుంది. కొత్తగా నియామకాలు జరిపేందు కు అనుమతించబోమనే సూత్రాన్ని సడలించి తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వవలసిన ఉంటుం ది. ఆంధ్రా కేడర్ వారిని ఆంధ్రాకు పంపించి, తెలంగాణ వారిని నియమించేందుకు అనుమతించకపోతే అంతులేని అన్యాయాలు తెలంగాణ వచ్చిన తరువాత కూడా తెలంగాణ న్యాయస్థానాల ద్వారా జరుగుతాయి.


హైకోర్టులు రెండు ఏర్పడాల్సిందే. లేకపోతే తెలంగాణ హైకోర్టు రూపుదిద్దుకునే అవకాశమే ఉండదు. నిజానికి శ్రీకాకుళం, చిత్తూరు వంటి జిల్లాల ప్రజలకు న్యాయం కోసం హైదరాబాద్‌కు రావడమే ఒక తీవ్రమైన అన్యా యం, అసాధ్యమైన విషయం. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌కే రావలసిన పరిస్థితిని కొనసాగించకపోవడం వల్లనే వారిని న్యాయం కలుగుతుంది. వారి కోసం విశాఖలో, గుంటూరులో, కర్నూలులో హైకో ర్టు బెంచీలు ఉండాలని ఇదివరకు నుంచే డిమాండ్ ఉంది. కాని పట్టించుకున్నవారే లేరు. ఇప్పడికైనా రాజధాని నగరం ఏదైనా ఒకటి రెండు ధర్మాసనాలను ఏర్పాటు చేయ డం అవసరం. కేసుల వ్యాపారం చేసే వారికి ఈ ఏర్పాటు నచ్చదు. బ్రోకర్ల లాబీయింగ్ బలంగానే ఉంటుంది. వారి ప్రయోజనాలకన్నా, న్యాయార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ముందుగా హైకోర్టు విభజన జరిగితే సీమాంవూధకు ఇటు తెలంగాణకు న్యాయం జరుగుతుంది.


విభజన తరువాత తెలంగాణకు స్థానిక అధికారులు కోటాలో కనీసం 60 మంది ఉండాలి. అంటే ఇంకా 50 శాతం మందికన్నా తక్కువగా ఉన్నారు. ఐఏఎస్ అధికారు ల్లో రాష్ట్రానికి 376 మందిని కేటాయిస్తే ఇందులో తెలంగాణ వాటా ప్రకారం తెలంగా ణ క్యాడర్‌కు 160 నుంచి 170 మంది ఉండాలి. కానీ 27 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 258 మంది ఐపీఎస్‌లలో తెలంగాణ కేడర్‌కు 20 మంది మాత్రమే ఉన్నారు. 149 మంది ఐఎఫ్‌ఎస్‌లలో 15 మంది మాత్రమే తెలంగాణ క్యాడ ర్ వారున్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్‌ను మార్చి ఇన్‌సైడర్ కోటా ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు జరిగిన తీవ్రమైన నష్టాలను పూరించడం సాధ్యం కాదు. అట్లా అని పరిహారం ఇవ్వబోమనడం న్యాయం కాదు. ఇకనైనా నష్టాలు జరగకుండా కాపాడుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ అన్యాయాలు కొనసాగితే తెలంగాణ నాయకులను ఈ ప్రాంత ప్రజలు క్షమించరు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

209

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా