పది జిల్లాల ప్రజలు పట్టరా?


Mon,June 30, 2014 07:19 PM

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని ప్రకటించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. రాష్ట్రపతికి ప్రధానికి లేఖ రాస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, సీమాం ధ్ర సమస్యలను పరిష్కరించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం న్యాయం కాదని విమర్శించారు. ఆ ఉత్తరాన్ని రాష్ట్రపతి, ప్రధానికి పంపగానే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని తెలంగాణ వ్యతిరేక మీడియా ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏరా ్పటు అయ్యే దాకా ఈ ప్రచారాలు నిజమో కాదో తెలియదు.
ఆర్టికల్-3 ప్రకారం కేవలం రాష్ట్రశాసనసభ అభివూపాయం కోసం మాత్రమే పునర్విభజన బిల్లును పంపాలి. గడువు తీరిన వెంటనే శాసనసభ అభివూపాయం ఏదైనా సరే రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలని పార్లమెంటును కోరవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదిస్తేనే తెలంగాణ ఏర్పడుతుంది. అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా కొత్త రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగితే జరగవచ్చు. కాని అది రాజ్యాంగ అవసరం కాదు.

సంప్రదాయాలను పాటించడం లేదనే విమర్శకు అర్థం లేదు. రాజ్యాంగ నియమాలు స్పష్టంగా లేనపుడు సంప్రదాయాలు తయారవుతాయి. ఆచారాలు సంప్రదాయాలు స్పష్టమైన శాసనాలను రాజ్యాంగాన్ని అధిగమించవు. రాష్ట్ర విభజనకు ముందు మెజారిటీ ప్రజల సమస్యల ను అర్థం చేసుకోవాలని సీఎం కోరారు. నిరంతరం మైనారిటీగా ఉన్న తెలంగాణ ప్రజలకు సమస్య మొదటి నుంచీ మెజారిటీ సీమాంధ్రదే. దానికి పరిష్కారం రాష్ట్ర విభజ న మాత్రమేనని ఉద్యమం సాగింది. విభజన పరిష్కారం, సమస్య కాదు. ఒక సమస్యకు పరిష్కారం బదులు మరి న్ని సమస్యలు సృష్టించారనే వాదాన్ని వినిపిస్తున్న వారు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, జయవూపకాశ్ నారాయణ్. రాష్ట్రాన్ని విభజించడాన్నే వ్యతిరేకించే వారి సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో వా రు చెప్పరు. ఎవరినీ సంప్రదించలేదని, తొందరపడ్డారని కూడా సీఎం నిందించారు. డిసెంబర్ 9కి ముందు ప్రతి పార్టీ ప్రతినిధిని సంప్రదించారు. అందరూ తెలంగాణను సమర్థించారు. ‘నిర్ణయించండి సమర్థిస్తాం’ అని చంద్రబాబు కూడా ప్రకటించారు. కిరణ్ కుమార్‌రెడ్డి యూ టర్న్ తీసుకున్న వారిలో చేరడం కొత్త వార్త.


కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఉన్న రాజధానిని ఇవ్వ డం ఇదివరకెన్నడూ జరగలేదు కనుక ఇవ్వకూడదని సీఎం వాదిస్తున్నారు. ఇందులో రెండు అవాస్తవాలు ఉన్నాయి. ఒకటి-తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాదు. 1956కు ముందే హైదరాబాద్ పేరుతో ఉన్న రాష్ట్రం. రెండు- ఆ రాష్ట్రంలో అప్పడికే హైదరాబాద్ రాజధానిగా భాసిల్లుతున్నది. తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకే ఇవ్వడంలో అపూర్వ ఘటనేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత హైదరాబాద్ రాజధాని అయిందనడానికి వీల్లేదు. సీమాంధ్ర విడిగా నిర్మించుకున్న రాజధానిని తెలంగాణకు ఇమ్మని అడగడం లేదు, ఇవ్వడం లేదు. అందరికీ తెలిసిన ఈ ప్రాథమిక వాస్తవాన్ని ముఖ్యమంత్రి మరో రకంగా చెప్పడం న్యాయం కాదు.


ఆంటోనీ కమిటీ నివేదిక రాకముందే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం సరి కాదని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చిందో లేదో ముఖ్యమంవూతి కి తెలిసి ఉండాలి. ఆ కమిటీ ముందుకు వచ్చిన అంశాలను సమస్యలను ఆందోళనలను మంత్రివర్గ కమిటీ పరిశీలిస్తుందని పదేపదే ప్రకటించారు.‘తెలంగాణ విషయాన్ని ఐటెమ్‌గా పరిగణించడం సమస్య తీవ్రతను గుర్తించకపోవడమే’ అని ముఖ్యమంత్రి అంటున్నారు! సమస్య తీవ్రతను గుర్తించడం ప్రధానంగానీ పేర్లతో రూపాలతో పనేమిటి? నానాటికి రగులుతున్న ఈ సమస్యను ఏదో ఒక రకంగా తీర్చండి అని అనేకసార్లు ఆయనే ప్రకటించారు. తీరా తీర్చిన తరువాత తీవ్రతను గుర్తించలేదని, ఆలస్యం అయిందని విమర్శించినవారే తొందరపడుతున్నారని అనడం విచి త్రం. కనీసం ఒక పుష్కరం నుంచి తెలంగాణ సమస్య సాగుతున్న విషయం ముఖ్యమంవూతికి తెలుసు. 2009 డిసెంబర్9 నాటికి తెలంగాణ ఏర్పాటు అనే పరిష్కారాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నదని అధిష్ఠానవర్గం ఆంతరంగికుడైన ముఖ్యమంవూతికి తెలియదా? తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాలకు పరిష్కారం రాష్ట్ర విభజన అని నిర్ణయించిన అధిష్ఠానవర్గం పట్ల న్యాయంగా సమంజసంగా ఉన్నారా అని ఆలోచించుకోవలసింది ముఖ్యమంవూతిగారే.


సీఎం తెలంగాణ వ్యతిరేక దాడులు ఈ విధంగా ఉంటే.., వైఎస్‌ఆర్ సీపీ నాయకు డు, అనేక 420 కేసులలో నిందితుడు. నిన్న మొన్న బెయిల్‌పై విడుదలైన జగన్మోహ న్ రెడ్డి ఇన్నాళ్లూ తాను తన తండ్రిగారూ సేవించి తరించిన సోనియాగాంధీపైనే విరుచుకుపడ్డారు. ఇంతవరకూ ఎవరికీ రాని కొత్త ఆలోచన ఈ యువ నేతకు వచ్చింది. 30 ఏళ్ల పాటు భారతదేశంలో ఉన్న సోనియాకు ఉన్న పౌరసత్వం రద్దుచేసి ఇటలీకి పొమ్మంటే వెళ్లిపోతారా? అటువంటిది అరవై సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉన్న వారు ఏ విధంగా వదిలిపోగలరు? అని చాలా గొప్పగా ప్రశ్నించారు. జగన్‌కు రెండు మౌలిక విషయాలు చెప్పిన వారెవరూ లేక ఈ విధంగా మాట్లాడి ఉంటారు. ఒకటి సోనియా గాంధీ ఇటలీలో పుట్టినా రాజీవ్ గాంధీని వివాహం చేసుకోవడం నిర్ణీతకాలం దేశంలో నివసించడం,రాజ్యాంగం ఏడో షెడ్యూలులో పేర్కొన్న భాషల లో ఒక్క భాషలోనైనా మాట్లాడే సామర్థ్యం సాధిస్తే పౌరసత్వం వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా సోనియా గాంధీకి పౌరసత్వాన్ని ఇచ్చారు. ఆమె ఓటరుగా నమోదైనారు.

వేరే దేశాల పౌరసత్వం తీసుకున్నపుడు వెంటనే భారత పౌరసత్వం రద్దవుతుంది. అదొక్కటే నిబంధన. ఆ పరిస్థితి లేనపుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఇప్పటి చట్టాల ప్రకారం వీల్లేదు. జగన్‌కు చెప్పేవారు సరిగా ఉండాలి. తానే నేరస్తుడిని కాదని నిరూపించుకోవలసిన పరిస్థితుల్లో ఉన్నారాయన. పౌరసత్వం చట్టాన్ని సవరించి ఆమె పౌరసత్వం రద్దు చేయడానికి చట్టం చేసినా అది వెనుక తేదీనుంచి అమలు చేయడం సాధ్యం కాదు. అది చట్ట విరుద్ధమవుతుంది, రాజ్యాంగ వ్యతిరేకమూ అవుతుంది. జగన్ ఇష్ట్ర పకారం పౌరసత్వాలు రద్దు చేయడం సాధ్యం కాదు. పౌరసత్వాలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేదు. ఆంధ్రవూపదేశ్ నుంచి విడిపోయినంత మాత్రాన తెలంగాణ దేశంలో అంతర్భాగం కాకుండా పోతుందా? పోతుందని జగన్‌కు ఎవరైనా చెప్పారా? జగన్ లోటస్ పాండ్‌ను వదిలేసి వెళ్లమని ఎవరైనా అంటారా?


సీమాంవూధలో బలపడాలంటే తెలంగాణను కేసీఆర్‌ను ఎంత బలంగా తిడితే అంత గా సీమాంవూధలో జనం జగన్‌కు, కిరణ్‌కు, చంద్రబాబుకు రాజకీయ సమర్థన లభిస్తుందని వారి నమ్మకం. తెలంగాణను వ్యతిరేకించడంలో కూడా ప్రయోజనాలున్నాయని సీమాంధ్ర రాజకీయనాయకులకు తెలుసు. తెలియాల్సిం ది ప్రజలకే. తెలంగాణను సీమాంవూధతో విలీ నం చేయ డం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. గుర్తింపును, సంస్కృతిని, సాహిత్యాన్ని నిలబెట్టుకోవడం, తన చరిత్ర నలిగిపోకుండా కాపాడుకోవడం కోసం పోరాటం సాగిం ది. దీన్ని సెంటిమెంట్ అనీ, ఆవేశం అనీ ఆలోచన అనీ అనవచ్చు. సెంటిమెంట్ అని తోసి పారేయడం మామూ లే, కాని ఆ సెంటిమెంటుకు ఒక పునాది ఉంది. చరిత్ర ఉంది. అరవై ఏళ్ళ పోరాటం ఉంది.


ప్రభుత్వం, సిబ్బంది, పోలీసులు చేతులు చాచి రారమ్మని ఆత్మీయంగా సభలకు ఆహ్వానించడంతెలంగాణ పోరాటాలకు లేదు. పాపం అటువంటి ఆర్జిత సేవలకు, సమర్పిత ఆందోళనలకు, ప్రోత్సాహిత ఉద్యమాలకు, సర్కారీ వారి పోషణకు తెలంగాణ వారు మొదటినుంచి దూరమే. అరెస్టులు లేని, ప్రతిఘటన ఉండని, గాయా లు, హక్కుల ఉల్లంఘనలు లేని ఉద్యమం కనిపించదు. నాటకీయ సానుకూల సామూహిక సహకార ప్రదర్శనలు తెలంగాణ ఉద్యమాల్లో కనిపించవు. తెలంగాణ నాయకుల మీద ప్రభుత్వ దమన నీతిమీద, వనరుల మళ్లింపు విధానాల మీద నిరంతరం పోరాడింది. తెలంగాణ ఏర్పాటుతో నైనా నెత్తుటి పోరాటాలు చేసే దశ సమసిపోతుందని ఆశించాలి. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం చూస్తే మన రాష్ట్రంలో ప్రజాభివూపాయ ప్రకటనకు ఎంత స్వేచ్ఛ ఉందో అనిపిస్తుంది. అయితే ఒక్కటే షరతు.. జై తెలంగాణ అనకూడదు.

విచివూతమేమంటే ఒకవైపు ముఖ్యమంత్రి, మెజారిటీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరో వైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, మధ్యలో సీమాంవూధకు తానే కాబోయే ముఖ్యమంవూతిననే ఆత్మవిశ్వాసంతో భారీ జన సభ నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ నేత ముగ్గురూ మూడు దారుల్లో పయనిస్తూ తెలంగాణ వ్యతిరేకతలో సమైక్యమై సాగుతున్నారు. తనకు వ్యతిరేకంగా టీడీపీ-కాంగ్రెస్ ముఠా కట్టాయంటారు వైఎస్ జగన్, జగన్‌కు కాంగ్రెస్‌కు మధ్య రహస్య ఒప్పందమేదో ఉందంటారు చంద్రబాబు. తెలంగాణ వ్యతిరేకతలో ముగ్గురూ ఒక్కటే.

పది జిల్లాల జనం రాకపోయినా ఫరవాలేదు. 13 జిల్లాల ఆధిక్యతే సమైక్యతా ప్రదర్శన అని కిరణ్, చంద్రబాబు,జగన్, జేపీ నమ్ముతున్నారా? ఏ ఒక్కరూ తెలంగాణ పది జిల్లాలు లేకుండా సమైక్యతేమిటనే ప్రాథమిక ప్రశ్న అడగరు. వారు చెప్పరు. చదువులు , పదవులు, ఆచార్య పీఠాలు కూడా ఈ ప్రాథమిక సందేహాన్ని లేవనెత్తకపోవడం అర్థం కాని వింత నాగరికత. నిజానిజాలు గమనించ వలసింది ప్రజలు. నాయకుల మాటలను నమ్మాలో లేదో తేల్చుకోవలసింది ప్రజ. ముఖ్యంగా సీమాంవూధలో బలం పెంచుకోవడానికి కూడా తెలంగాణ తన వ్యతిరేకులకు ఉపయోగ పడుతున్నది. దూషణ విధానంలోనైనా సరే తెలంగాణను నమ్మిన వారికి తెలంగాణ అన్యాయం చేయదు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

122

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా