తెలంగాణపై చీకటి నింపే మాటలు


Tue,October 1, 2013 02:19 AM

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మల్ పవర్‌స్టేషన్ నిర్మించి తెలంగాణ సింగరేణి బొగ్గు తరలించుకుపోయి తెలంగాణలో చీకట్లు నింపినట్టున్నాయి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.


ముఖ్యమంత్రి తాను సమైక్యాంధ్ర ముఖ్యమంవూతిని చెప్పుకున్నా అందుకు తగ్గట్టు వ్యవహరించడం లేదని స్వయానా రాష్ట్ర వ్యవహారా ల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేయవలసి వచ్చింది. ఉప ముఖ్యమం త్రి దామోదర రాజనర్సింహ ఆయన సీల్డు కవరు ముఖ్యమంత్రి ఆయన పోతే ఎంత ఉంటే ఎంత అని వ్యాఖ్యానించారు. ఎవరు అంగీకరించకపోయినా అంగీకరించినా కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి. సీల్డు కవరులోంచి వచ్చినా మిగతా కాంగ్రెస్ శాసనసభాపక్ష సభ్యుపూవరూ వ్యతిరేకించకపోవడం వల్ల ఆయన ఎన్నికను చెల్లని ఎన్నిక అనడం సాధ్యం కాదు. కాని నిజానికి ఆయన కనీసం సీమాంధ్ర నాయకుడు కూడా కాదు. కేవలం తన జిల్లాకు ప్రతినిధి, కాకపోతే ఆంధ్ర పక్షపాతాన్ని పదేపదే చాటుకోవడం వల్ల పూర్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనడం కష్టం. తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏంచేస్తావో చేస్కోపో అని అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తి ప్రకటించిన తెలంగాణ వ్యతిరేకి ఆయన. ఆ కారణం ఆధారంగానే తెలంగాణతో కలిసి ఉన్న ప్రాంతానికి ముఖ్యమంవూతిగా ఉండే అర్హత లేదని తెరాస విమర్శిస్తున్న ది. భయపక్షపాతాలు లేకుండా పాలిస్తానని అంతఃకరణ సాక్షిగా ప్రమాణం చేసిన కిరణ్ రాజ్యాంగ ప్రతిజ్ఞను ఉల్లంఘించినందుకు ఆనాడే పాలించే అర్హత కోల్పోయారని విమ ర్శ ఉంది కాని, ఇంతవరకు రాజ్యాంగ ప్రతిజ్ఞ ఉల్లంఘించిన వ్యక్తిని పదవి నుంచి దింపిన సంఘటన లేదు.


తాను సొంత బలంతో ఉన్నత పదవిలోకి వచ్చిన వ్యక్తిని ఆయన చెప్పుకోవడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంవూతినైనాననే నిజం ఆయన ఒప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి చెప్పినట్టు సీల్డు కవర్ లో పుట్టుకొచ్చిన ముఖ్యమంవూతుపూందరో ఉన్నారు. కేవలం కిరణ్ ఒక్కరే కాదు. హైదరాబాద్‌లో పుట్టిన వాణ్ని కనుక ఇక్కడి ప్రతినిధిని ఆయన చెప్పి నా హైదరాబాద్ మీద గానీ, తన కుటుంబం పుట్టిన చిత్తూరు మీద గానీ, తనకు జీవం ఇచ్చిన తెలంగాణ మీద గానీ ఆయనకు మమకారం లేకపోవ డం దురదృష్టకరం. మంత్రిగా అనుభవం లేకపోయినా పదవి ఇచ్చిన అధిష్ఠానం మీద, చేసిన ప్రమాణం మీద కూడా ఆయన అభిమానాన్ని చూపలేకపోతున్నారు. ఒక ప్రజలలో ఎంత విశ్వాసం ఉందో, ఏ ప్రజలలో విశ్వాసం ఉందో అనేది ప్రశ్నార్థకం. సమైక్యాంధ్ర నినాదాన్ని వల్లిస్తున్న వై.ఎస్. జగన్మోహనడ్డి, చంద్రబాబునాయుడు, తదితర అనేకమందిలో ఎవరిని సీమాంధ్ర ప్రజలు సమైక్యం కోసం పదవీ త్యాగానికి సిద్ధంగా ఉన్న త్యాగశీలిగా కిరణ్‌ను గుర్తిస్తారో లేదో తెలియదు. అవసరమైతే సీఎం పదవి వదిలేస్తా అని కిరణ్ కుమార్ అనడం విన్నాం. పదవి వదులుకోవడమే ఒక అవసరం గా మారినపుడు దాన్ని సమైక్య ఉద్యమం కోసం వాడుకునే ప్రయత్నం ఇదని అనుకోవాలి. రాజీనామాలు చేస్తామని పదేపదే బెదిరించే పలువురు ఎంపీలు మంత్రులు, నిజంగా రాజీనామా చేస్తే ఆమోదిస్తారేమోనని ఈ ప్రజావూపతినిధులు భయపడుతున్నారు.ఇక కిరణ్ కుమార్ రెడ్డి పదేపదే చెప్తున్న కొన్ని అంశాలు ఎంత అవాస్తవా లో జనానికి తెలియవలసి ఉంది. 1956లో నెహ్రూ ఆంధ్ర తెలంగాణల మధ్య గట్టిబంధం వేశారు ఈయన కనిపెట్టారు. ఇది పచ్చి అబద్ధం, విశాలాంధ్ర వాదం విస్తరణ వాదాన్ని ప్రతిఫలిస్తున్నదని విమర్శించింది నెహ్రూ యే అన్న విషయం పదేపదే జనం ముందుకు వచ్చింది. లాబీయింగ్‌కు లొంగి విధి లేక తెలంగాణను సీమాంవూధతో అన్యాయంగా విలీనం చేశారు. ఈ బంధం పటిష్టం కాదని ఆయనకు కూడా అనుమానం ఉండడం వల్లనే, కుదరకపోతే విడిపోవాలని కూడా నెహ్రూ చెప్పిన సంగతి తెలియదా? చరిత్ర తెలుసుకోవాలి.
మరొక మాట ఏమంటే ఈ బంధాన్ని ఇందిరా గాంధీ మరింత పట్టిష్టం చేశారని. నిజానికి ఒక దశంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించడానికి ఇందిర నిశ్చయించుకున్నారనీ.


కాని కోస్తాంధ్ర లాబీకి ఆ నిర్ణయం మార్చుకున్నారనీ ఆనాటి తెలంగాణ యోధుడు డాక్టర్ గోపాల కృష్ణ ఈ సంఘటన గురించి పూస గుచ్చినట్టు వివరించారు. బేగంపేట ఏయిర్ పోర్టులో తమను పిలిపించుకుని ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నట్టు చెప్పినా అది కానీయకుండా అడ్డుపడ్డారని డాక్టర్ గోపాల కృష్ణ చెప్పారు.
తెలంగాణ పేరు లేకుండా రాష్ట్రాన్ని జోన్లుగా విభజించడానికి చేసిన కుట్ర ఫలితం 371 డి. దీనివల్లనే తెలంగాణ మరింత ద్రోహానికి గురైంది. ఉల్లంఘించడానికి మాత్రమే చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వలె 371 డి కూడా ఏరక్షణలూ తెలంగాణకు అమలు కాకుండా చేసే భయంకరమైన దుర్మార్గం. దీనివల్ల కోస్తాంధ్ర జిల్లాల్లో తెలంగాణ వారుపూర్తిగా స్థానం కోల్పోయారు. మరొకవైపు హైదరాబాద్ లో కోస్తాంధ్ర అధికారులకు మినహాయింపులు ఇస్తూ బోయారు. విపరీతంగా ఉల్లంఘనల ద్వారా అనేక పర్యాయాలు 610 జీవోను, రాష్ట్రపతి ఉత్తర్వులను నిర్వీర్యం చేశారు. సీనియర్ అధికారి, నిష్పక్షపాతమైన నీతివంతుడు గిర్‌గ్లానీ 610 జీవో అమలు ఎంత ఘోరం గా ఉందో వివరించే సమగ్ర నివేదిక ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు వంటి తెదేపా ముఖ్యమంవూతులకు, కాంగ్రెస్ ముఖ్యమంవూతులకు ఈ రిపో ర్టు చెంపపెట్టు వంటిది. ఒక్కసారి గిర్‌గ్లాని రిపోర్టు చదివితే 371డి ద్వారా తెలంగాణకు ఎంత ద్రోహం ఎంత కాలం చేసారో చాలామందికి జ్ఞానోదయం అవుతుంది. 1994నుంచి 2000 వరకు తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనా లు దెబ్బతీస్తూ రాష్ట్రపతి ఉత్తర్వును ఉల్లంఘించిన చంద్రబాబు 2001లో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను వెనుక తేదీనుంచి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అది చంద్రబాబు తెలంగాణకు చేసిన తీరని అన్యా యం. 371డి తో తమకు న్యాయం జరగదని అర్థమైన తరువాతనే తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం మరో సారి ప్రభంజనమైంది.ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ఆంధ్రలను కలిపి ఉంచాలని సిఫార్సుచేసిందని అంటూ కిరణ్‌కుమార్ రెడ్డి రెండో ఎస్సార్సీ మాత్రమే పరిష్కారం అని కూడా తేల్చిచెప్పారు. ధార్ కమిషన్ 1948లో ఒకే భాష ఒక రాష్ట్రం సరైన విధానం కాదని తేల్చింది. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్, తెలుగు వ్యక్తి పట్టాభిరామయ్యతో కూడిన జెవిపి కమిటీలో దీన్ని సమర్థించా రు. ఫజల్ ఆలీ కమిషన్ తెలంగాణను విలీనం చేయరాదని చెప్పింది. తెలంగాణ వాసుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ విలీ నం చేస్తే అసెంబ్లీలో తెలంగాణ ప్రతినిధుల అభివూపాయం సేకరించి ఆమేరకు విడదీయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పింది. నెహ్రూ కూడా ఇది దృష్టిలో పెట్టుకునే తెలంగాణ కావాలనుకుంటే విడాకులు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజానీకం విలీనం వద్దన్నా, కొందరు నాయకులకు పదవుల ఎర చూపి అంగీకారాన్ని అన్యాయంగా పొందారు.


సీమాంవూధుల డబ్బుసంచులకు, లాబీయింగ్‌శక్తికి కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం ఆనాడు లొంగిపోయింది. తెలంగాణ మరొక పశ్చిమబెంగాల్‌గా మారి కమ్యూనిస్టుల కోట కాకుండా ఆపడం కోసం కాంగ్రెస్ నాయకత్వం విశాలాంధ్ర ప్రయోగాన్ని చేసిందని, ఇంతకన్నా బుద్ధి తక్కువ మరొకటి లేదని ఇన్నేళ్ల తరువాత పశ్చాత్తాప పడుతున్నదని తెలుసుకోవాలి. మొదటి ఎస్సార్సీ వద్దన్నా విలీనం చేసి రెండో ఎస్సార్సీ కావాలనడం ఎంతవరకు వివేకవంతమైన ఆలోచనో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలి. తెలంగాణ ఇస్తే ఇంకా దేశమంతా ఇటువంటి డిమాం డ్లు వస్తాయంటూనే, దేశంలో అనేకానేక రాష్ట్రాలను పునర్విభజించే రెండో ఎస్సార్సీ అడగడం ఎంత తెలివైందో విజ్ఞులు ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందలాది సంస్థానాలు, ఎన్నో ప్రాదేశిక మండలులు ఉన్నాయి. కనుక రాష్ట్రాల పునర్విభజన అవసరమైంది. కనుక ఆకారణంగా ఎస్సార్సీ వేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణ కోసం కమిషన్ వేసి దేశంలోని రాష్ట్రాలన్నీ అవసరం ఉన్నా లేకపోయినా అడిగినా అడగకపోయినా విభజించాలనుకుంటున్నారా? అసలు వీరు ఏమి అడుగుతున్నారో వీరికి అర్థమవుతున్నదా? 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తూ తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందన్న విషయం వీరికి ఎప్పుడు అర్థమవుతుంది?


కృష్ణ గోదావరి జలాలను సద్వినియోగం చేయాలంటే ఆరెండు నదులు ఒకే రాష్ట్రంలో ఉండడం మంచిదని ఫజల్ ఆలీ సూచించారని, కనుక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కిరణ్ వాదిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను సీమాంవూధులు తమ తెలివితేటలతో అపహరించే అవకాశం ఉందని కూడా ఫజల్ ఆలీ అనుమానించారు. తెలంగాణకు రావలసిన నదీ జలాల వాటాను ఇంత దారుణంగా సీమాంధ్ర పక్షపాత నాయకులు అధికారులు దోచుకుంటారని ఫజల్ అలీ వంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఊహించలేకపోయారు. సమన్యాయం చేయడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు సమైక్యం సమన్యాయం అని చెప్పుకునే అర్హతే లేదు. తెలంగాణకు ఈ రెండు నదులలో నిర్ణయించిన వాటా ప్రకారం నీటిని ఇవ్వాలన్నా, రాయలసీమ కోస్తాలకు వారికి నిర్ణయించిన వాటాకన్నా ఎక్కువ నీరు తరలించుకునే దొంగతనాలు కొనసాగకుండా ఆపాలన్నా, తెలంగాణ వూపజలకు రాజకీయ నాయకత్వం ఉండాల్సిందే, సీమాంధ్ర పక్షపాత ప్రభుత్వాల వల్ల తరతరాలనుంచి తెలంగాణ నష్టపోయింది. దొంగసొమ్ములో వాటాలు పోకుండా ఉండేందుకు తెలంగాణను దోచుకునే అవకాశం పోయినందుకు కొందరు నేతలు అవినీతిపరులతో నిండిపోయిన కొన్ని సీమాంధ్ర సంఘాలు బాధపడుతూ తరతరాలకు నష్టమవుతుందనే అవాస్తవ ప్రచారం చేస్తూ యువతరాన్ని రెచ్చగొడుతున్నారు.


ఈ కుహనా సమైక్య వాద నినాదానికి, అసలు సిసలు తెలంగాణ వ్యతిరేక ఉద్యమానికి వెన్నుదన్నుతానే అని ముఖ్యమంత్రి నిరూపించుకున్నారు. ఆయన చెప్పిన అంకెలన్నీ అబద్ధాలే. సీమాంధ్ర ఉద్యోగులు రూపొందించిన తప్పుడు లెక్కలు. నదుల నీటి విషయంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని జలవివాదాల ట్రిబ్యునల్‌లో సుప్రీంకోర్టులో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం సమంగా, న్యాయంగా వివరించలేదు. తెలంగాణకు న్యాయం జరగాలని కనీసం నిర్ణయం తీసుకోలేదు. పోతే పోతుంది అనే ధోరణిలో తెలంగాణకు ద్రోహం చేశారనే బాధ రగులుతున్నది. ప్రత్యేకంగా ఒక రాష్ట్రంగా ఉంటేనే రాజ్యాంగం ప్రకారం నదీజలాల కేటాయింపులో అన్యాయాల ను అంతపూరాష్ట్ర వేదికలమీద అడిగే అధికారం ఏ రాష్ట్రానికైనా ఉంటుంది అందుకే తెలంగాణ రాష్ట్రం అవసరం. తెలంగాణ వ్యతిరేక వ్యక్తుల పాలన ఒక్కరోజు కొనసాగినా తెలంగాణ కొన్ని వందల టిఎంసి జలాలను, వేల ఉద్యోగాలను, కోట్లనిధులను కోల్పోతుందని సీమాం ధ్ర నాయకులు తమ ప్రసంగాల ద్వారా చాటుతున్నారు.


పోలీసుల ద్వారా, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల ద్వారా సమ్మెచేయిస్తున్నారన్న ఆరోపణ నిజమే అయితే అంతకన్న రాజ్యాంగ ద్రోహం మరొక టి ఉండదు. అందుకు ప్రభుత్వమే నడుం కట్టడం తీవ్ర అన్యాయం. అర్థం పర్థంలేని సమ్మె విరమించాలని సీమాంధ్ర ఉద్యోగులతో చర్చించవలసిన ప్రభుత్వం ఆ పని చేయకుండా అన్నిరకాల ప్రభుత్వమే పక్కనుండి సమ్మె చేయించే పరిస్థితి ఒక విషాదం. అధిష్ఠానాన్ని ధిక్కరించినందుకు కాదు.

ఈ సమ్మెను చేయిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయింది. పదవికోసం కాకపోతే ఏ వ్యక్తీ ప్రభుత్వ ధర్మాన్ని రాజ్యాంగ బాధ్యతలను ఈ విధంగా ఫణం పెట్టడం జరగదు.
పోచంపాడును చంపి, శ్రీరాంసాగర్‌ను కుదించి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి తెలంగాణకు వచ్చే కాలువలను ఆలస్యం చేసి, తీరా తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే సమయానికి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కిరణ్ ప్రకటించడం ఆశ్చర్యకరం. అదీ హైకమాండ్ ముందు వివరించిన ముఖ్యమంత్రి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంతకుముందు ఎందుకన్నారు? ఆకారణంగా కిరణ్ ప్యాకేజీలను ఎవరు విశ్వసిస్తారు? రాజకీయ నాయకుడు విశ్వసనీయతను కోల్పోయినప్పుడే మరణిస్తాడు. పదవిలో ఉన్నా క్రెడిబిలిటీలేని వ్యక్తులకు జీవం ఉండదు. ఇప్పుడు కూడా సీమాంవూధకు నష్టం అంటున్నారే కాని తెలంగాణకు జరిగిన నష్టాన్ని గురించి మాట్లాడడం లేదు. వీరు వినియోగించే సమైక్యాంధ్ర పదం లో తెలంగాణ లేదు, ఎవరు రాసిచ్చిన స్క్రిప్టు బట్టీ పట్టినా తెలంగాణతో కూడిన రాష్ట్రం మాత్రమే సమైక్య రాష్ట్రం అవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం లో ఎక్కువగా సీమాంధ్ర వాదనలే ఉంటాయి. తెలంగాణలో పుట్టి పెరిగినా తనకు జన్మనిచ్చిన మట్టిని పట్టించుకోని వాడు ఆ మట్టి పుత్రుడు (సన్ ఆఫ్ సాయిల్) కాలేడు.


తెలంగాణ పట్ల ద్రోహబుద్ధి, పూర్తి వ్యతిరేకత ఇంకా ఎంతకాలం? జనబలం మీద కాకుండా ధనబలం మీద, కుల బలం మీద, అధిష్ఠాన దయమీద ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వారు దక్కిన పదవిని అన్ని ప్రాంతాల సమానమైన అభివృద్ధికి వినియోగించాలన్నదే ఉండవలసిన ఇంగితజ్ఞానం. పుట్టిన నేలకు మేలు చేయలేని వ్యక్తికి నాయకుడయ్యే యోగ్యత ఉండదు.


సూర్యుడికి, సూర్య కిరణాలకు తరతమ భేదం ఉండదు. ఉదయించిన ప్రతిచోటా కాంతి ఉంటుంది, సాయంకాలం తరువాత అంతటా చీకటే ఉంటుంది. వెన్నెల కిరణాలు తప్ప. కాని ఈ కిరణ్ కుమార్ గారి కిరణాలు తెలంగాణలో ప్రసరించడం లేదు ఎందుకు? తెలంగాణకు దినమంతా చీకటిచ్చి, వెలుగు కిరణాలు మాత్రం సీమాంవూధకు తరలిస్తారా? ఇటువంటి నాయకులు సీమాంధ్రకు మాత్రం వెలుగు ఇస్తారా?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

184

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా