తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు


Tue,August 27, 2013 12:48 AM

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా సమైక్యం అనే మాటను అర్థం తెలిసే వాడుతున్నారా అనే అనుమానం వస్తున్నది. ఏపీఎన్జీవోల యూనియన్ రాష్ట్ర విభజన గురించి ఉద్యమించడం, సమైక్యత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే వారి యూనియన్‌లో తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యోగులు లేరు. ఎప్పుడూ లేరు. ఇకముందూ ఉండరు. ఇంత అనైక్యతతో మొదలై కొనసాగుతున్న వారి సంఘం సమైక్యత గురించి సమ్మె చేయడం ఒక వింత రాజకీయం. తెలంగా ణ ఉద్యోగులు వారి న్యాయమైన డిమాండ్ కోసం పొరాడుతున్నప్పుడు వీరు వారికి అండగా నిలబడింది లేదు. నిజానికి రాష్ట్రం సమైక్యంగా లేదనడానికి తొలి ఉదాహరణ, రుజువు ఏదంటే ఇదిగో ఈ ఏపీఎన్జీవోల సంఘమే. తెలంగాణ ఉద్యమానికి మూల కారణం వీరే. తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాల పాప భారం మోస్తున్నది ఈ సంఘమే. కేవలం ఇకముందు తమ ఇష్టారాజ్యం సాగదన్న కడుపు మంటతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంగీకరించబోమని వీరు చేసే వాదనను ఎవరు సమంజసం అంటారు? మీడియా అడగవలసిన ప్రశ్న, జనం అడగాల్సిన సవాల్, ఆంధ్రవూపదేశ్ హైకోర్టు అడిగిం ది. సమ్మెను ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానుతో కూడిన ధర్మాసనం ఏపీఎన్జీవోల సంఘాన్ని నిలదీసింది.

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకే ఒక్క డిమాండ్‌తో సమ్మెకు వెళుతున్నట్లు ఏ పీఎన్జీవో సంఘం ఆగస్టు 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి సమ్మె నోటీసు ఇచ్చింది.. ఈ డిమాండ్ రాజకీయంతో కూడుకున్నది. విభజన నిర్ణయం కేంద్రం తీసుకున్నపుడు రాష్ట్రవూపభుత్వంపైన వీరు ఎందుకు సమ్మె చేస్తున్నట్టు? రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం పడుతుందంటూ సాకును చూపడం సమ్మెకు సరయిన కారణం కాబోదు. ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి తమ ఉద్యోగాలకు సంబంధించిన సర్వీస్ సమస్యలపైన కాకుండా రాష్ట్ర విభజనపైన ఢిల్లీ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న రాజకీయ నిర్ణయంపైన ఏపీఎన్జీవోలు సమ్మె చేయడం కచ్చితంగా న్యాయ విరుద్ధం, చట్టవ్యతిరేకం. ఇది ఏమాత్రం రాజ్యాంగ సమ్మతం కాదు. ప్రజాస్వామికం అంతకన్నా కాదు. తెలంగాణ ఏర్పాటు వల్ల వారికొచ్చిన నష్టం ఏమిటో చూపకుండా, ఆ నష్టం నివారించడానికి రాష్ట్రం ప్రభుత్వం ఏం చేయాలో చెప్పలేని ఉద్యోగులు దేనికోసం ఎవరి మీద సమ్మె చేస్తున్నట్టు? కిరణ్‌కుమార్ రెడ్డి చేతిలోగాని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో గాని పరిష్కారం లేనపుడు ఈ సమ్మెకు ముగింపు ఏ విధంగా సాధ్యం అవుతుంది? రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌తో సాగిన ఉద్యమానికి ప్రతిస్పందనగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటిస్తే కాదనే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర జిల్లాల ఎన్జీవోలకు ఎక్కడుంది? అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారని అడిగారు న్యాయమూర్తులు. లాయర్లు ఎపి ఎన్జీవోలను అడిగి చెప్పడానికి సమయం అడిగారు. తరువాతయినా వారికి చెప్పడానికి ఏముందో ఊహించవచ్చు. సమ్మె నోటీసులో రాజకీయ అంశాలు ప్రస్తావించారే గాని ఉద్యోగ సమస్యలేవీ లేవని న్యాయమూర్తులు ఆ పత్రాలు చదివిన తరువాత ప్రశ్నించారు. రాజకీయ అంశంపైన సమ్మె చేసే హక్కు ఉందా? ఎన్జీవోలను కార్మికులుగా పరిగణిస్తేనే పారిక్షిశామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చేసే అధికారం వస్తుంది. అయితే తమ ఉద్యో గ సంబంధమైన సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడం, సమ్మె చేయడం సరైంది కాదని ఎవరూ అనలేరు. న్యాయమైన హక్కులకోసం సమిష్టిగా నిలబడి పోరాడడం అందరి హక్కు. ఈ ప్రశ్నలను సీమాంధ్ర మీడి యా అడగదు. అడిగేవారిని స్టూడియో చర్చలకు పిలవదు. పత్రికల్లో రాయ రు. అయితే సమ్మె చేయడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో ఒకటి కాదు. ప్రజాస్వామిక రీతిలో కార్మికులే తమ సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కును పారిక్షిశామిక వివాదాల చట్టం ద్వారా ఇచ్చారు అని కోర్టు గుర్తు చేసింది. సర్వీసు సమస్యలపైన కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సమస్యల పై సమ్మె చేయాలంటే ముందుగా ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. రాజకీ య పార్టీల్లో చేరాలి. తరువాతే సమ్మె అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకుని ప్రజలకు సంబంధించిన పాలనలో భాగస్వాములు కావలసిన ఉద్యోగులు రాష్ట్రంలో పాలన ను ఎందుకు స్తంభింపచేస్తున్నారు? పాలనకు ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయమైన సమస్యలు ఉండి ఎన్ని వినతులు ఇచ్చి నా ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యోగులు కోర్టులో న్యాయం అర్థించవచ్చు. సమ్మె కూడా చేయడం చట్టబద్ధం కాకపోయినా న్యాయసమ్మతం అయ్యే అవకాశం ఉంది. కాని రాజకీయపరమైన నిర్ణయాలకు, రాజ్యాంగబద్ధంగా ఒక ప్రాంత ప్రజలు సాగించిన పోరాట ఫలితంగా వచ్చిన నిర్ణయాన్ని తమ సమ్మె ద్వారా నిరోధించాలనుకునే ప్రయత్నం చెల్లదు. అసలు ఇది సమస్యే కాదు. మరొకరి సమస్య పరిష్కారం తమ సమస్య అనుకుంటే ఆ సంకుచిత ఆలోచనకు పరిష్కారం సమ్మెల్లో కోర్టుల్లో ఉండదు. ఈ సమ్మె ఒక వర్గానికి వ్యతిరేకంగా సాగుతున్న దుర్మార్గ ప్రయత్నం. వీరి కరడు గట్టిన తెలంగాణ వ్యతిరేకత వల్ల వీరు సమైక్యం అనే పేరును ఆంధ్రప్రదేశ్ అనే పేరును వాడుకునే హక్కు నైతికంగా వీరికి లేదు. ఇటువంటి సమ్మెకు పరిష్కారాలు ఉండవు. వీరు సమ్మె నోటీసులో పేర్కొన్న సమస్యకు హైకోర్టులో కూడా పరిష్కారం ఉండదు. ఏపీఎన్జీవోలయినా మరొకరయినా వారికి భావవూపకటన స్వేచ్ఛ ఉండి తీరుతుంది. తెలంగాణను వ్యతిరేకించే హక్కు వారికి ఉంది. తెలంగాణను ద్వేషిం చే హక్కు కూడా ఉంది. ప్రజలకు దుర్మార్గంగా ఆలోచించే హక్కు కూడా ఉంది. అది కాదనలేని హక్కు. కాని నా దుర్మార్గపు ఆలోచన ఫలితాన్ని ఇవ్వాలని తమ దుర్మార్గం కొనసాగాలని, మేం ఇంకా తెలంగాణలో ఎన్జీవోల ప్రయోజనాలను తమ కులబలంతో ప్రాంత బలంతో తమతోపాటు వచ్చిన నాయకుల అండదండలతో కాలరాస్తామని, అందుకు సమ్మె చేస్తామని అంటే ఏ కోర్టూ అంగీకరించబోదు. కాని అందుకు సమ్మె చేయడం మాత్రం హక్కు కాదు. తమకు ఉద్యోగాలు కావాలని ప్రమోషన్లు కావాలని అడగవచ్చు అందుకు సమ్మె కూడా చేయవచ్చు. కాని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని సమ్మె చేయడం ఏమాత్రం సమంజసం కాదు, చట్టబద్ధం కాదు. ఆదివారం నాడో లేక సెలవు పెట్టుకునో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కార్యాలయంలో నాయకుల ముందు తెలంగాణ నిర్ణయాన్ని పునఃపరీక్షించాలని కోరుకోవచ్చు. లేదా తమ ను ఆశీర్వదించి నడిపిస్తున్న తెలంగాణ వ్యతిరేక మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌ను వినిపించవచ్చు కూడా. కాని పాలనను స్తంభింప చేస్తామనడం మాత్రం ఏమాత్రం న్యాయం కాదు.

అయినా తమ ప్రభుత్వం, మంత్రివర్గం, అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశంతో సహా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవ్వచ్చునని చెప్పినప్పుడు వీరంతా వారి ఇళ్ల ముందు ధర్మాలు ప్రదర్శనలు చేయవలసింది పోయి. వారి మౌనం అంగీకారం కాదా? నిలకడ చిత్తశుద్ధిలేని అవకాశ వాద రాజకీయపార్టీల వలె వీరు కూడా యూ టర్న్ తీసుకోవడం, వారి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణా మీద విష ద్వేషాలను వెదజల్లడం దారు ణం. తీరా కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత యూ టర్న్ చేసిన రాజకీయనాయకులపైన ధర్నాలు చేసే బదులు రాష్ట్ర పాలనను స్తంభింపచేసేందుకు సమ్మె చేయడం ఏ మాత్రం న్యాయం కాదు. తెలంగాణ ఎన్జీవోలు సమ్మె చేయవచ్చా అనే ప్రశ్న రావడం సహజం. జవా బు చెప్పవలసి ఉంది కూడా. తమ ఇష్టాయిష్టాలకు పట్టించుకోకుండా విలీనం చేసిన తరువాత 1956నుంచి అంటే ఆంధ్రవూపదేశ్ అనే పేరుతో సమైక్య రాష్ట్రం ఏర్పడిన మరునాటి నుంచి ఉద్యోగుల విషయంలోనే ఆంధ్ర రాయలసీమ ముఖ్యమంవూతులు తెలంగాణకు అన్యాయం చేసారు. వారికి రకరకాల అర్హత పరీక్షలు పెట్టి, వారి భాషను అవమానించి, కిందిస్థాయి ఉద్యోగులుగా మార్చి, రెండో శ్రేణి పౌరులుగా పరిగణించి వేధింపులకు గురిచేశారు. వారికి రక్షణలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను సిగ్గు ఎగుగ్గ లేకుండా రద్దు చేసి వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. నియామకాల్లో బదిలీల్లో, పదోన్నతులలో నిరంతరం వారిని వెనుకబడేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప వారి సమస్యలకు పరిష్కారం లేదనే విషయం అడుగడుగునా ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వ పాలనలో రుజువైంది. తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకే న్యాయం చేయకూడదనే దృఢ నిర్ణయంతో కుట్రలు చేసిన ఆంధ్ర రాయలసీమ ప్రభుత్వాలు, ఉద్యోగులు పై అధికారులు తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలనే కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కూడా కాలరాశారు. తెలంగాణ అభివృద్ధిని నిలిపివేసిన కోస్తాకు నీళ్లు నిధులు, ఖనిజాలను తరలించుకుపోయారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణకు చేసిన దారుణమైన అన్యాయాలను తెలంగాణ వారు మౌనంగా భరించారు. నిజాయితీ కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లాని రిపోర్టు చదివితే చాలు, తెలంగాణ ఉద్యోగులకు సీమాంధ్ర ప్రభుత్వాలు, వారి పక్ష పాత ఉద్యోగులు చేసిన అన్యాయాలకు కావలసినన్ని రుజువులు దొరుకుతాయి. ఈ అన్యాయాలన్నీ ఏకరువు పెడుతూ, ఈ సమస్యలను ఎవరూ పరిష్కరించలేదని, పరిష్కరించాలన్న ఆలోచన కూడా లేదని, కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక్కటే పరిష్కారమని వివరిస్తూ అనేక డిమాండ్ల వరుస తరువాత చివరన తెలంగాణా డిమాండ్ చేర్చి సమ్మె నోటీసు ఇచ్చారు. వారి సమస్యలపైన సానుభూతి కాని, వారి చేత సమ్మె విరమింప చేయాలనే చిత్తశుద్ధి కాని లేని సీమాంధ్ర ప్రభుత్వం వారిమీద పోలీసులను ప్రయోగించింది. అయినా వారు ఎదుర్కొ ని పోరాడారు. ఈ ఉద్యోగులు, విద్యార్థు లు, ప్రజలు, తెలంగా ణ రాష్ట్రసమితి పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏపీఎన్జీవోలు ఏ సమస్యలూ వివరించలేదు. ఏ డిమాండ్లూ లేకుండా, సరైన ఆలోచనేదీ చేయలేదు. తమకు సీమాంధ్ర సర్కారు అండదండలున్నాయని, సీమాంధ్ర సీనియర్ అధికారులు, సీమాంధ్ర పోలీసులు, సీమాంవూధులతో నిండిన మీడియా, ఆయాకులాల నేతలు, సీమాంధ్ర నాయకులే అధినేతలుగా ఉన్న ప్రతిపక్ష, కుడి ఎడమ పార్టీల అనుకూలతతో ఏమైనా చేయవచ్చుననే ఆలోచనతో ఏక వాక్య నోటీసు ఇచ్చారు.

ఏపీఎన్జీవోల సమ్మెకు తెలంగాణ ఎన్జీవోల సమ్మెకు చాలా తేడాలున్నాయి. తెలంగాణ ఎన్జీవోలు న్యాయంగా, తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేశా రు. ఏపీఎన్జీవోలు తమకులేని సమస్యలు, తమది కాని సమస్య గురించి, మరొ క ప్రాంతానికి సమస్య సృష్టించడం కోసం సమ్మె చేస్తున్నారు. చరివూతలో ఎక్క డా ఇటువంటి సమ్మె లేదు. కనుక ఇది చరిత్రలో ఒక అన్యాయపు సమ్మెగా నిలిచిపోతుంది. ఏపీఎన్జీవోలకు తమ ప్రభుత్వం, తమ ప్రతిపక్షం, తమ వామపక్షం, తమ సీనియర్ అధికారులు, తమ పోలీసులు తమ మీడి యా అండగా ఉన్నాయి. వారందరితో కలిసి వారు తెలంగాణకు అడ్డుగోడగా నిలబడుతున్నారు. తెలంగాణ వారు ఆత్మహత్యలు చేసుకోనవసరం లేదు, హత్యలే జరుగుతాయి అని విలేకరుల సమావేశంలో చెప్పిన దుర్మార్గం వారి ది. వారి పిలుపులో చట్టం, రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యం, న్యాయం మానవత్వం అనేవి ఏ కోశాన లేని అమానుషత్వం పగ బుసలుకొడుతున్నది. మరొకవైపు తెలంగాణ ఎన్జీవోలు న్యాయమైన తమ సమస్యలకోసం, దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయంపైన, తమ ప్రాంతంపైన దోపిడీ సాగిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులపైన వారి ప్రభుత్వ దుర్మార్గ పాలనపైన పోరా టం సాగించారు. వీరి పోరాటం చాలా కష్టతరమైన పోరాటం ఎందుకంటే ప్రభుత్వం, పోలీసులు మీడియా, రాజకీయ పార్టీలు, సంఖ్యాబలం, దుర్మార్గపు ఆలోచనలు కుట్రలు పబ్లిసిటీలు ఇచ్చే మేధావుల అండదండలున్న శత్రువుమీద పోరాటం కనుక. ఇటువంటి అండదండలు ఏవీ లేకుండా అందరిమీదా పోరాడాల్సిన దారుణమైన పరిస్థితుల్లో, న్యాయమైన డిమాండ్లే బలం గా ప్రజాబలమే అండగా తెలంగాణ ఉద్యోగుల సమ్మెజరిగింది. సకలజనుల సమ్మెను ఎంత అణచివేసినా ప్రజల వెన్నుదన్నుతో విజయం సాధించింది. వారు ఏపీఎన్జీవోలు కాదు, ఆంధ్రా జీవులు. వారు సమైక్య వాదులు కాదు, వారు ఉద్యోగుల్ని జనాన్ని చీల్చే వేర్పాటు వాదులు. వారు తెలంగాణా ఎన్జీవోలకు మాత్రమే వ్యతిరేకం కాదు, తెలంగాణకు ఈ ప్రాంత ప్రజలకు కూడా వారు వ్యతిరేకం. వారి సమ్మె రాష్ట్ర సమైక్యత కోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని నిరోధించడానికి. ఒకప్పుడు జై ఆంధ్ర సమ్మె చేసి, ఇప్పుడికైనా విడిపోవడం మంచిదనే న్యాయమైన ఆలోచన కలిగిన సీమాంధ్ర ప్రజలకు కూడా వీరు వ్యతిరేకం. తమకు వీరు అప్రతిష్ట తెస్తున్నారని సీమాంధ్ర ప్రజలు కూడా గుర్తించాలి. మూడున్నర కోట్ల నిరాయుధులైన తెలంగాణ ప్రజమీద సాగుతున్న ప్రభుత్వ పోలీసు, మీడియా సహిత పోరాటం ఇది. అయిదున్నర కోట్ల ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకుంటూ గుప్పెడు మంది బలీయమైన శక్తులు సాగిస్తున్న అనైతిక పోరాటం ఇది. ఈ శక్తులపైన తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకూ ఈ ప్రాంత ప్రజలు పోరాడాల్సిందే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

199

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన