నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?


Mon,August 12, 2013 11:50 PM

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలు కూడా ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ముందే తెలంగాణలో తొమ్మిది తెలుగు జిల్లాలు మిగిలాయి. తెలంగాణకు హైదరాబాద్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోనే పుట్టాను, నేను ఇక్కడి వాడినే అంటున్నారు. కాని ఆయన హైదరాబాద్ నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నిక కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా అధిష్ఠానంతో సహా ఎవరూ పరిగణించ డం లేదు.ఎవరో ఎందుకు ఆయన కూడా చిత్తూరు జిల్లా ప్రతినిధి అను కుంటున్నారనీ, తమ 13 జిల్లాల సీమాంధ్రకు అనుకూలంగా పలుకుతున్నా రని, పాలిస్తున్నారని తెలిసిపోతూనే ఉన్నది. విశాలాంధ్ర ముఖ్యమంత్రులు విశాల హృదయంలేని వారని, అందులో తెలంగాణకు స్థానమే లేదని, ఆయనను ఎన్నుకున్న పార్టీ నాయకులే అంటున్నారు. ఇక ఆయన సభా నాయకుని హోదాలో శాసనసభలో నిలబడి ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏంచేస్కుంటావో చేస్కో పో’ అని ప్రకటించడాన్ని తెలంగాణ మరిచిపోవడం కష్టం.అయినా సరే ఆయన హైదరాబాదీయే ఇక్కడి ముల్కీ నే. కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే ప్రతినిధిగా ఎంచుకోవాలో వద్దో ప్రజలు తేల్చుకోవాలి.

Charminar-Hyderabadప్రపంచంలో ప్రతి పౌరసత్వ చట్టాల ప్రకారం ఎక్కడ పుట్టిన వాళ్లు అక్క డి వాళ్లే అవుతారు. మొదట్లో ‘ముల్కీ’ అనే మాట ఉండేది. ముల్క్ అంటే నా దేశం. ముల్కీ అంటే ఈదేశం నాది అనుకునే వ్యక్తి. పదిహనేళ్లు నివసిం చి, తాను పుట్టిన ప్రాంతం కన్నా తాను పదిహేనేళ్లున్న ప్రాంతమే తన ప్రాం త మనుకునే వ్యక్తి, మళ్ళీ వెనుకకు వెళ్లాలనే ఆలోచన లేకుండా ఇక్కడే ఉండాలనుకునే వ్యక్తి, ఇక్కడి ప్రాంతం బాగోగులను కోరుకునే వ్యక్తి ముల్కీ అని మొదటి నిర్వచనం. పుట్టిన ఊరికి పోవడం ఆ ఊరు బాగుపడాలని కోరు కోవడం తప్పుకాదు. ఆ మాతృభావన లేకపోవడమే సమస్య. కాని తాము ఉన్న భూమిని పరాయి భూమి అనుకునే వారు, అక్కడ ఉన్నవారిని ద్వితీ య స్థాయి పౌరులనుకునే వారు, వారినెత్తిన పెత్తనం చేయడానికి తమకే అర్హత ఉందని అహంకరించే వారు, సక్రమంగానో అక్రమం గానో సంపాదించి విలాసాలు చేసుకునే వ్యక్తి, ఆ లాభాలను తాను పుట్టిన చోట మెట్టిన చోట కాకుండా విదేశీ బ్యాంకుల్లో దాచుకునే వారిని ముల్కీ అందా మా? లేక ఇంకా ఏ పదాలతోనైనా పిలుద్దామా? అని ఆలోచించుకోవాలి. హైదరా బాద్ గడ్డ మీద పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి పౌరులంతా తాము ముల్కీలో కాదో వారే తేల్చుకోవాలి.

జన్మనిచ్చి, చదువునిచ్చి, ఉన్నత పదవులిచ్చి, పాలకుడినిచేసి, గౌరవించి న హైదరాబాద్ కోసం ఆ నగరం ఉన్న తెలంగాణ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేశామో గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది. వారు తమ అం తఃకరణను అడుక్కోవాలి. అటు తాతల ఊరు చిత్తూరు, ఇటు జన్మనిచ్చిన హైదరాబాద్‌కు ఏంచేశామో ఆలోచించుకుంటే ఉద్యమ స్వరూపం అగుపడు తుంది. అవసరం అర్థమవుతుంది. అయిదుదశాబ్దాల ఉద్యమం విజయవం తం అయిన తరువాత ఆ ఫలాలు తెలంగాణకు అందనీయకుండా ప్రయ త్నాలు చేస్తున్న వారు తమ మనసుల్ని తరచిచూసుకోవాలి.

projects01ఏటా సంక్రాంతికి హైదరాబాద్ నగరం నుంచి ఎనిమిది లక్షల మంది సీమాంధ్రలోని సొంత ఊళ్లకు వెళ్లడానికి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అది తప్పు కాదు. ఆ ఏర్పాట్లు హైదరాబాద్ తెలంగాణ రాజధా నిగా ఏర్పడ్డ తర్వాత కూడా కొనసాగుతాయి. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో 2010లో రాష్ట్రానికి చెందిన ప్రయివేటు వ్యక్తులు పెట్టిన పరిశ్రమలు, వాటి పెట్టుబడులు 540 కోట్ల రూపాయలైతే, మన రాష్ట్రానికి చెందని వారు పెట్టినవి 665 కోట్లు. ప్రభుత్వానివి 442 కోట్లు. ప్రకటించిన పరిశ్రమలలో రాష్ట్రానికి చెందని వారివి 4448 కోట్లయితే, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారివి 1925 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 25శాతం పెట్టుబడుదారులు వేరే రాష్ట్రాల వారు. హైదరాబాద్‌ను మేమే అభివృద్ది చేశామని చేస్తామని చెప్పుకునే వారు, వారి మాటలు వినే వారు కళ్లుంటే ఈ అంకెలు చూడాలి. 75శాతం మంది వేరే రాష్ట్రాలవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టారని తెలుసుకోవాలి. వారికీ, వీరికీ హైదరాబాద్ తెలంగాణకు రాజధాని నగరమైనా, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరమైనా తేడా ఉండదు. భద్రతకు లోటు ఉండదు. కేవలం అక్రమంగా వక్ఫ్ భూములు ఆక్రమిం చుకున్నవారో, ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన వారో అయితే వారికి తెలంగాణ రాజధాని అయినా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే భయపడక తప్పదు. లేకపోతే భయపడాల్సిన పనేలేదు. సీమాంధ్రులు ఎందుకు భయపడుతున్నారు? ఆంధ్ర ప్రదేశ్ ప్రభు త్వం ఉంటే తమ ఆటలు సాగుతాయని, తెలంగాణలో సాగవు అనుకుంటే అది వాస్తవమే. దానికోసం తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండ కూడదనే అధికారం లేదు.

capital01పూర్తయిన ప్రాజెక్టులలో 25 శాతం రాష్ట్రానికి చెందిన వారివయితే, 40 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారివి. 20 శాతం ప్రభుత్వానివి. కేంద్రా నివి 14శాతం. అమలులో ఉన్నవాటిలో మూడో వంతు రాష్ట్రానికి చెందిన వారివి. అంతే వంతు రాష్ట్రేతరులవి. 26శాతం రాష్ట్ర ప్రభుత్వానివి. రాష్ట్రా నికి చెందిన వారి పరిశ్రమలు పెట్టుబడులు అంటే అన్నీ కోస్తాంధ్రులవే అనుకోవడానికి వీల్లేదు. ఇక ప్రకటిత పరిశ్రమల్లో 61శాతం రాష్ట్రేతర వ్యాపారులవి, కేవలం 14 శాతమే రాష్ట్ర పెట్టుబడిదారులవి.

ఈ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల్లో లాభాలు సంపాదిస్తే దానిమీద పన్నులు కడతారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయితే, పన్ను ఆదాయంలో సీమాంధ్ర ప్రభుత్వం వాటా అడగడం ఏ ఆర్థిక సూత్రాలు కూడా అంగీకరించని అసమంజసమైన ఆలోచన. 61శాతం పెట్టుబడులు పెట్టిన రాష్ట్రేతరులకు వాటాలు ఏ విధంగా ఇస్తారు? ఒకవేళ సీమాంధ్రకు గుంటూరో కర్నూలులో రాజధాని అయితే అక్కడ పెట్టుబడి పెట్టినవారు తెలంగాణ వారయితే తెలంగాణకు వాటా ఇస్తారా? ఆదాయం పంపిణీ అనేది పరాయి ధనం మీద కన్ను వేయడంతో సమానం.

హైదరాబాద్ ఆదాయం పంచాలనడం ఎంత అసమంజసమో, హైదరా బాద్‌ను వదిలిపోతున్నందుకు పరిహారం ఇవ్వాలనడం కూడా అంతే వింత. పరిహారం ఎప్పుడూ నష్టపోయిన వారికి ఇస్తారు. ఎవరికి నష్టం వచ్చింది? ఎంత నష్టం? పరిహారం ఎవరు ఎవరికి ఇవ్వాలి? పరిహారం ఎవరు లెక్కిం చాలి? ఏ విధంగా? ఒకవేళ నష్టపరిహారాలే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడితే ఇస్తారా? తెలంగాణ నుంచి తరలించుకుపోయిన ఇంధనాలు, ధనాలు, నీళ్లు, ఉద్యోగాలు, అందువల్ల వచ్చిన నష్టాలు, ఇక్కడ సాగించిన నష్టాలు, ఎవరు లెక్కిస్తారు? ఎంత పరిహారం ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? ఆదా యంలో వాటా పరిహారాలు అడిగే అధికారం ఒక వేళ ఉంటే గింటే నష్టపో యిన తెలంగాణకే ఉంది. హైదరాబాద్‌ను కోస్తాంధ్ర కోల్పోలేదు. ఇదివర కెవరిదో వారికే దక్కుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అది నష్టమూ కాదు కను క దానికి పరిహారమూ ఉండదు.

ఇక అభద్రత గురించి. తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు అభద్రత ఉందని వాదిస్తున్నారు. 1969లో వందలాది మందిని కాల్చి చంపి అణచివేసినా తెలంగాణ ఉద్యమం నాలు గు దశాబ్దాల తరువాత మళ్లీ పుంజుకున్నది. మనసుల్లో నాటుకుని ఉన్న తెలంగాణ ఆకాంక్ష, కొనసాగుతున్న అవమానాలు, అన్యాయాలు, వాగ్దా నాల ఉల్లంఘన, వనరుల తరలింపు, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల భాషను యాసను హేళనచేసే దురహంకారాలు, పైకి అన్నదమ్ములం అం టూనే వెనుక వెన్నుపోట్లు పొడిచే నాగరికత భరించలేక తెలంగాణ ఉద్యమం మళ్లీ విజృంభించింది. తెలంగాణరాష్ట్రసమితి ఉద్భవించి సాగించిన కార్యా చరణలో విస్తరించింది. కాని ఈ ఉద్యమంలో ఎన్నడూ ఎవరిమీదా దాడు లు జరగలేదు. పోలీసులు ప్రభుత్వం ఎంత దమననీతిని ప్రయోగించినా క్రూరంగా అణచివేసినా శాంతియుతంగానే సాగింది. చివరకు ఆ ప్రజా ఉద్య మం, సమైక్యత పేరుతో అనైక్యతను సాగించిన ఆ స్వార్థ శక్తుల మీద విజ యం సాధించింది.

రాజధాని వేరు, వ్యాపార అభివృధ్ది వేరు. రెండూ కలిసి ఉండడంలో నష్టం లేదు. హైదరాబాద్ సీమాంధ్రకు రాజధానికానంత మాత్రాన సీమాం ధ్ర పెట్టుబడి దారులు, ఉద్యోగులు అక్కడినుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. బొంబాయి నుంచి గుజరాతీలు తరలిపోలేదు. అహ్మదాబాద్‌లో పరిశ్రమ లన్నీ గుజరాతీలు మాత్రమే పెట్టినవి కాదు. మద్రాసు, బెంగుళూరు నగరాల లో సీమాంధ్రులు పెట్టుకున్న పెట్టుబడులు, కట్టుకున్న ఇళ్లు చేస్తున్న ఉద్యోగా లు ఎవరూ వదులుకోవడం లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుం చి కూడా వదులుకోవలసిన అవసరం లేదు. రాదు.

మరీ చిన్న కేంద్ర పాలితప్రొంతమైతే హైదరాబాద్‌కే లష్కరేతోయిబా లేదా బాంగ్లాదేశ్ తీవ్రవాద వర్గాలనుంచి నుంచి అభద్రత అనీ, చిన్న రాష్ట్రమైతే తెలంగాణకే అభద్రత అనీ వాదించే వారు కొందరు. చిన్నప్పడి నుంచి మా నగరం అనుకున్నాం మమ్మల్ని వదిలి వెళ్ల మంటారా అని మరి కొందరు. ఇక్కడే పుట్టాం ఇది మానగరం కాదనుకోవాలా అని ఇంకొందరు. వీరెవరూ నగరం వదిలి వెళ్లరు. వీరంతా ఏ ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ ఏం చేసినా ఇక్కడ ఉండే అధికారాన్ని హక్కును రాజ్యాంగం ప్రకారం కోల్పోయే అవకాశమే లేదు. హైదరాబాద్‌లో మాత్రం సీమాంధ్రుల రక్షణ కావాలని కోరుకునే వారికి తమ సీమాంధ్ర సహోదరుల మీద కూడా ప్రేమ లేదు. ఎం దుకంటే కొన్ని లక్షల మంది తెలంగాణ జిల్లాల్లో భూములు చాలా తక్కువ ధరకు కొనుక్కొని స్థిరపడి బతుకుతున్నారు. వారి భద్రత వీరికి పట్టదు.

దీని అర్థం ఏమంటే వీరికి కావలసింది హైదరాబాద్. దాని మీద పెత్తనం. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ మీద తెలంగాణకు ఇక్కడి ప్రజలకు పెత్తనం ఉండ కూడదు. సమైక్యం అనేది వట్టి నినాదం. దుర్మార్గపు ఆలోచనకు వేసిన మేక ప్. సోదర భావాలు సాదరభావాలు ఏమీ ఈ నినాదాల వెంట లేవు. కేవలం తెలంగాణకు హైదరాబాద్ దక్కకూడదనే సినీ విలనీ ఆలోచన తప్ప మరేదీ లేదు. ఈ దుర్మార్గం నిలబడదు. ఎందరెందరో మేధావులు, చాలా గొప్ప సంస్కర్తలమని చెప్పుకుని పబ్బంగడుపుకుంటున్న చిల్లర రాజకీయ నాయ కులు సెట్లర్లు చేస్తున్న కొత్త చెత్త రాజకీయాలు ఈ వాటాల పంపిణీ, అభద్రత అనే అబద్ధపు ప్రతిపాదనలు. తెలంగాణను ఆపడం కోసం, ఆల స్యం చేయడం కోసం, కొత్త నకాబ్ ద్వారా సాగుతున్న ఎత్తుగడలు వ్యూహాలు అన్నీ హైదరాబాద్ కోసమే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

252

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

country oven

Featured Articles