తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌ను వదిలిపోవడానికి సిద్ధంగా లేరు. ఉద్యోగులు అధికారం కోసం, మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్లు అపార్ట్మెంట్ల కోసం, విద్యార్థులు చదువుల పేరిట, నాయకులు ఇక్కడ పెంచుకున్న ఆస్తుల కోసం, భూ ఆక్రమణదారులు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల కోసం హైదరాబాద్‌ను విడిచి వెళ్లరు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరూ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర రాజకీయ నాయకులు, సచివాలయ కార్యాలయ సిబ్బంది తప్ప. వారు కూడా అందరూ వెళ్లరు. కొన్ని వేల మంది మాత్రం తిరుగు ప్రయాణం కావచ్చు. అదీ పదేళ్ళ గడువు తరువాత. ఉద్యోగా లు చేస్తూ ఉంటే పదవీ విరమణ చేసేంత వరకు సీమాంవూధలో ఉండి తరువాత హైదరాబాద్‌కు రావచ్చు. కనుక వారికి సమస్యే లేదు. మరెవరికి ఇబ్బంది? దోపిడీదారులకు రాజకీయ నాయకులకు భయం. ఇక్కడ అక్రమాస్తులు సంపాదించిన వారికి భయం. వేలాది ఎకరాల భూమిని రైతుల నోళ్లుగొట్టి అన్యాయంగా తక్కువ ధరలకు కొని లాభ పడ్డ దుర్మార్గులకు భయం.
హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల ప్రజలది అని కొందరు మంత్రు లు అంటున్నారు. హైదరాబాద్ ఆంధ్రవూపదేశ్ రాజధానిగా ఉంటే ఈ మాట కొంత వరకు వాస్తవం. అప్పుడు కూడా హైదరాబాద్‌లో ఉన్న వారిదే హైదరాబాద్ అవుతుంది కాని అందరిదీ అయ్యే అవకాశం లేదు. హైదరాబాద్ నగరం హైదరాబాద్‌లో ఉన్న అందరి దీ వారెవరైనా సరే. మొత్తం రాష్ట్రం తమదే రాజధాని అని భావించినా, రాష్ట్ర విభజనతో వారి భావనకు కూడా స్థానం ఉండదు. తెలంగాణది హైదరాబాద్. అది కాదనేందుకు తెలంగాణను కూడా అణచివేయడానికి సిద్ధపడుతున్నారు. తిరుపతి హుండీ లో కోటి రూపాయలు వేసిన సంపన్నుడు తిరుపతి నాదే అంటే, కొన్నేళ్లు ముఖ్యమంవూతిగా పాలించిన వ్యక్తి సచివాలయం నాదే అంటే, పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి లాభాలు సంపాదించిన వర్తకుడు, ఆనగరం నాదే అంటే, హైదరాబాద్‌లో భోగాలు అనుభవించే రాజకీయ నాయకులు హైదరాబాద్ నాదే అంటే ఎంత అసమంజసమో.., హైదరాబాద్ మాదే అనే ఈ కోస్తాంధ్ర నేతల మాట అంతే అసమంజసం. అది అసలు దుర్మార్గం.
చంద్రబాబుతో సహా హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే అధికారం నైతికంగా ఎవరికీ లేదు. హైదరాబాద్ అందమైన నగరం. శతాబ్దాలపాటు రాజధాని. కాని దాన్ని పారిక్షిశామిక కాలుష్య కేంద్రంగా మార్చి, రియల్ స్టేట్ భూముల వ్యాపారానికి తెరదీసి, వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అమ్ముకుని, కొనుక్కుని వ్యాపారాలు చేసుకునే రాజకీయ నాయకులు, సొంత కాలనీలు నిర్మించి దాన్ని అభివృద్ది అనడం కన్న సొంతలాభం అనుకోవడం కరెక్టు. అభివృద్ది నమూనా ఇది కాదు. సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచకుండా కాంక్రీట్ జనారణ్యాలు నిర్మించడాన్ని సుస్థిర అభివృద్దిగా పరిగణించరు. హైదరాబాద్‌ను కావాలనుకునే వీరికి హైదరాబాద్ మట్టిమీద ఏ విధమైన ప్రేమ లేదు. హైదరాబాద్ కోసం త్యాగాలు చేసిన ప్రజలది హైదరాబాద్. ఒకనాటి మంచినీటి సాగరం హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారం చేసి, విగ్రహాలు పెట్టి అదే అభివృద్ధి అంటే అది అభివృధ్ది కాదు తిరోగమనం.
అనేక దేశాలలో రాజధాని నగరం మహానగరం కాదు. చిన్న పాలనా పరమైన ప్రధాన కేంద్రం. ఇతర నగరాలు వ్యాపారం కోసం, పారిక్షిశామికి ప్రగతి కోసం కట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆంధ్రవూపదేశ్ వంటి సువిశాల రాష్ట్రానికి ఒక్క హైదరాబాద్ మాత్రమే నగరంగా ఉందంటే నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం ఇంకా అయిదా రు నగరాలు హైదరాబాద్‌తో సమానమైన స్థాయిలో ఉండాలి. అందుకే ఇవ్వాళ కోస్తాం ధ్ర రాయలసీమలకు రాజధాని నగరం లేకుండాపోయింది. ఎంత సేపటికీ హైదరాబాద్ పోతున్నదనే విలాపం మానేసి ఇన్నాళ్లూ ఏ నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయామే అని ఆత్మపరిశీలన చేసుకోవడం ఈ నేతలు చేయవలసిన పని. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు సంపాదించి అభివృద్ధి చెందాయో ఈ నాయకులు తెలుసుకోవాలి. పోటీ పెట్టుకోవలసింది హైదరాబాద్‌తో కాదు. పొరుగున ఉన్న రాష్ట్రం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇప్పడికీ తెలంగాణ మీద హైదరాబాద్ మీదా ఆధారపడి అభివృద్ధి చెందాలనే దురాశాపూరిత విధానాలను అనుసరించడం తెలుగు ప్రజలకు ఒక శాపమే.
లాహోర్ పంజాబ్‌కు అసలైన రాజధాని. కాని దేశ విభజన తరువాత పాకిస్తాన్‌కు లాహోర్ దక్కింది. మనదేశంలో మిగిలిన పంజాబ్ ముక్కకు రాజధాని లేకుండా పోయింది. అప్పుడు నెహ్రూ అపురూపమైన మహానగరం ఇంకెక్కడా లేని రీతిలో నిర్మిస్తామని ప్రకటించి ఆ కల నెరవేర్చారు. చండీఘర్ మహానగరం నిర్మాణం అనుకున్నట్టు అపురూపంగా పూర్తయింది. కాని ఆ సమయానికి పంజాబ్ హర్యానా విభజన ఉద్య మం ఉధృతమైంది. అప్పుడు చండీగఢ్ ఎవరిదనే ప్రశ్న మొదలైంది. అంబాలా జిల్లా లో ఖరార్ తాలూకాలో చండీగఢ్ ఉంది. విభజన చేయాలని నిర్ణయించిన తరువాత కేంద్రం జస్టిస్ జేటీ షా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఏయే జిల్లాలు ఏయే రాష్ట్రంలో ఉండా లో చెప్పాలని కోరింది. చండీగఢ్‌తో సహా మొత్తం అంబాలా జిల్లాలో హిందీ మాట్లాడే వారే ఎక్కువ కనుక హర్యానాకు ఇవ్వాలని షా కమిషన్ సూచించింది. కేంద్రమే సర్దార్ హుకుంసింగ్ అధ్యక్షతన మరో కమిటీని వేసింది. ఆ కమిటీ చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇవ్వాలని సిఫార్సు చేసింది. రెండు వైపులా చండీగఢ్ కోసం తీవ్రమైన పోటీ ఏర్పడిం ది. చేసేది లేక కేంద్రమే తన అధీనంలో చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచుకుని రెండు రాష్ట్రాలకు రాజధానిగా నిర్ణయించారు. దీంతో హర్యానా ఒకవైపు పంజాబ్ మరొక వైపు అతికి ఉన్నాయి. కనుక చండీగఢ్‌లో ఇరు రాష్ట్రాల రాజధానులున్నా అభ్యంతరం లేకుండా పోయింది.
హైదరాబాద్ సంగతి వేరు. హైదరాబాద్‌తో పోల్చడానికి తగిన వాతావరణం నేపథ్యం చండీగఢ్‌కు లేదు. శతాబ్దాల చరిత్ర లేదు. అందరికీ ఆశ్రయమిచ్చిన సంస్కృతి లేదు. తరతరాల వారికి హృదయపూర్వకమైన అనుబంధం ఉన్న నగరం హైదరాబాద్. ఆంధ్రవూపదేశ్ అనే రాష్ట్రం ఏర్పరచడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు హైదరాబాద్ ఒక దేశం, ఒక స్వతంత్ర రాజ్యం. నిజాం వారు భారతదేశానికి లొంగిన తరువా త ఒక రాష్ట్రం. తరువాత మిగిలిన భాషా ప్రాంతాలను వేరే రాష్ట్రంతో కలిపిన తరువాత మిగిలిన తెలుగు రాష్ట్రం. మధ్యలో వచ్చి, కొన్ని పెట్టుబడులు పెట్టిన కొందరు, ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చిన కొందరు, ప్రజాస్వామ్యం పుణ్యమా అని కాంగ్రెస్ సీల్డుకవరు రాజకీయాల పుణ్యమా అని పైరవీలు చేసి ముఖ్యమంవూతులైన కొందరు తమదే హైదరాబాద్ అంటే కుదరదు.
ఇక హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని మంత్రి చిరంజీవి అంటున్నా రు. ఆయనకు ఎవరో రాసిచ్చిన డైలాగ్ అయి ఉంటుంది. దాని అర్థమేమిటో ఆయనకు తెలియకపోవచ్చు. తమకు దక్కకపోతే దాన్ని ఎదుటి వాడికి దక్కనీయకపోవడం సినిమా విలన్ క్యారెక్టర్. హైదరాబాద్ తమకు దక్కకపోయినా ఫరవాలేదు, తెలంగాణకు దక్కకుండా ఉండాలనడమే ఆ విలనీ. దాన్ని ఈ మెగాస్టార్ సొంతం చేసుకోవడం ఒక విషాదం. హైదరాబాద్ వదులుకుంటున్నందుకు గాను లక్షా అరవై వేల కోట్ల రూపాయల ప్రపంచబ్యాంకు రుణం తెలంగాణ భరించాలని యలమంచిలి శివాజీ అన్నా రు. హైదరాబాద్ వంటి రాజధాని నిర్మాణానికి అయిదులక్షలు కోట్లు ఇవ్వాలని, అత్యంత సమర్థుడైన ముఖ్యమంవూతిగా ప్రపంచమంతా ప్రచారం చేసుకోగలిగిన తెలివైన నాయకుడు చంద్రబాబు గారన్నారు. ఇక 20 ఏళ్ల పాటు హైదరాబాద్ రెవెన్యూలో మూడింటి రెండు వంతులు సీమాంవూధకు చెల్లించాలని మరొక నాయకుడు అన్నారు. వీరి దురాశకు అంతు లేదా? ఇదేనా వీరి వివేకం అని ఆశ్చర్యపోతున్నారు సామాన్యులు.
తెలంగాణకు చెందిన హైదరాబాద్ నగరాన్ని ఈ ప్రాంత రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. కొంతకాలం పాటు మాత్రమే సమష్టి రాజధానిగా హైదరాబాద్‌ను ఉండొచ్చని అంగీకరించాలే గాని దశాబ్దాల పాటు నగరాన్ని మరొక ప్రభుత్వంతో పంచుకోవడంలో అర్థం లేదు. కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఏ నగరమూ లేదు. అసలు పక్క రాష్ట్రంలో రాజధాని పెట్టుకోవాలనే ఆలోచనే అసమంజసం. పదేళ్ల కాలంలో పాలన పైన, ఆదాయం పైన పూర్తి అధికారం తెలంగాణకే ఉంటుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి. హైదరాబాద్ సహా తెలంగాణ పది జిల్లాలు తప్ప మరే జిల్లా ఎక్కువా తక్కువా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షకు అనుగుణంగానే చర్యలు ఉండాలి. పదేళ్ల ఉమ్మడి రాజధాని అసలు మర్మం ఏమిటో చెప్పాలి. కేంద్ర పాలిత ప్రాంతం కాకపోయినా గవర్నర్‌కు పాలనాధికారాలు ఇచ్చేవిధంగా చట్టాలను రాజ్యాంగాన్ని సవరించే విచివూతమైన కొత్త విధానం ఏదీ ఉండడానికి వీల్లేదు అని తెలంగాణ గట్టిగా చాటి చెప్పాలి.
సీమాంధ్ర సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉండే రాజధానిని నిర్మించుకుని హైదరాబాద్ నుంచి వెళ్లిపోయే వరకు ఇక్కడ వారికి రాజధాని నడుపుకునే సకల సౌకర్యాలు చేయాలి. తెలంగాణకు అది గౌరవప్రదం కూడా. ఎక్కడ ఎంత వేగంగా రాజధాని నిర్మించుకుంటారనేది వారి సమర్థతకు నిదర్శనం. ప్రజా ఉద్యమాలను అణచడం, కృత్రిమ ఉద్యమాలను సృష్టించడం సులువు కావచ్చు. కాని సుస్థిరతమైన ప్రగతి సులువు కాదు. అందుకు దూరదృష్టి అవసరం, దురాశ కాదు. లక్షల కోట్ల అక్రమార్జన చేయడం సులువు కాని తరతరాలకు విలువైన అభివృద్ధిని సాధించడం అంకిత భావం తో కష్టపడి చేయవలసిన పని. జై తెలంగాణ. జై ఆంధ్ర. జై రాయలసీమ.
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త