సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర


Mon,July 29, 2013 10:51 PM

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోసం రాయలసీమను నిలువుగా చీల్చడానికి గొడ్డలి నూరి హైకమాండ్ చేతికి ఇస్తున్నారు. తెలంగాణ ఏవిధంగా తెలంగాణ ప్రజలదో, రాయలసీమ రాయలసీమ వారిదే. తెలంగాణకు ఉన్నట్టే రాయలసీమకు ఒక సంస్కృతి, ఒకఆత్మ, ఒక గుర్తింపు ఉన్నాయి. తెలంగాణ ఘోరంగా నష్టపరిచిన డిల్లీ కాంగ్రెస్ నాయకులు ఆంగ్లేయుల కుటిల నీతి అయిన విభజించి పాలించే విధానాన్ని అనుసరించడం కోసం రాయలసీమను చీల్చే ప్రతిపాదన చేస్తున్నారు. విఫలాంధ్ర అయిన విశాలాంధ్ర వలెనే రాయల తెలంగాణ అంటూ రాబోయే తెలంగాణకు పుట్టుక నుంచే కుల,మత తగాదాల ఆధారంగా వైఫల్యవిత్తనాన్ని నాటబోతున్నారా? ఎందుకీ ప్రతిపాద న? ఎక్కడి నుంచి వస్తున్నదీ ఆలోచన?

తెలంగాణ మాత్రమే తెలంగాణ ప్రజలది. రాయలసీమ తెలంగాణ వారిది కాదు. కోస్తా కూడా కాదు. తమది కాని ప్రాంతాన్ని, తమతో ఉండాలని కోరుకోని ప్రాంతాన్ని తమతో చేర్చుకోవడం తెలంగాణకు , హైదరాబా ద్ రాష్ట్రం నుంచి ఇతర భాష ప్రాంతాలను విడదీసి ఆయా భాషా రాష్ట్రాలలో కలిపిన తర్వాత మిగిలిన తెలంగాణ నామరూపాలు ఈ పది జిల్లాలు, వాటి రాజధా ని హైదరాబాద్. తెలంగాణ నామరూపాల్లేకుండా చేయడానికి దశాబ్దాల నుంచి సాగుతున్న కుట్రల్లో రాయల తెలంగాణ ఒక చివరి అస్త్రమా? రాష్ట్ర విభజన కోసం నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ అధిష్ఠానంపైన కోస్తా రాయలసీమకు చెందిన కొందరు పెట్టుబడి దారు లు వేస్తున్న కొత్త ఎత్తు ఇది అనే అనుమానం బలపడుతున్నది. కర్నూలు, అనంతపురం కలిపిన తెలంగాణను ఇవ్వమనడం ద్వారా రెండు జిల్లాల్లో ఒక వర్గం వారి ఆధిపత్యానికి వారి ద్వారా వర్తక, వాణిజ్య, కాంట్రాక్టరు రాజకీయ నాయకుల స్వప్రయోజనాలను హైదరాబాద్‌లో కాపాడడానికి రాయల తెలంగాణ ప్రతిపాతన అతికినట్టు సరి పోతుందనుకుంటున్నా రు. కృష్ణానదిలో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటాను కొల్లగొడుతున్న దుర్మార్గ జల అపహరణ కొనసాగడానికి, మిగిలిన గోదావరిని పోలవరంలో స్వాధీనం చేసుకుని తెలంగాణకు సున్న జుడతారని నీటి వనరుల నిపుణులు వివరిస్తున్నారు. మహబూబ్‌నగర్ నల్గొండ జిల్లాలను నీళ్లతో కాకుండా మళ్లీ సమస్యల్లోనే ముంచెత్తే అన్యాయం జరుగుతుంది.

తెలంగాణ ఇవ్వక తప్పని దశవచ్చే వరకు సమైక్యవాద నినాదాలు చేసిన వారు ఇప్పుడు తెలంగాణకు విభజన తర్వాత కూడా అన్యాయం చేయడం కోసం రాయలసీమను చీల్చే దుర్మార్గానికి ఒడిగట్టడం విచారకరం. రాయలసీమ నాలుగు జిల్లాలను సగానికి సగం చేసి కోస్తాకు తెలంగాణకు పంచాలనే ఈ బ్రిటిష్ తరహా ఆలోచనను తెచ్చే ముందు రాయలసీమ ప్రజలను అడిగారా? సీమనుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలిన నేతలు వారి నాయకత్వంలో మంత్రిత్వాలను సంపాదించిన నేతలు తమ నేలను ఎవరికో పంచి ఇస్తుంటే తమ అస్తిత్వం గురించి రాయలసీమ జనావళి అభివూపాయానికి విలువ ఇచ్చే ఆలోచనే వారికి రాదా? తెలంగాణ అస్తిత్వం కోసం సాగుతున్న పోరాటాన్ని దెబ్బతీయడానికి రాయలసీమ అస్తిత్వాన్ని మనుగడను గుర్తింపును భగ్నం చేస్తామనుకుంటుంటే ప్రధాన పార్టీల అధ్యక్షులుగా ఉన్న సీమ పెద్దలు ఎందుకు పెదవి మెదపడంలేదు. వారి సీమ పట్ల వారికున్న ప్రేమ ఇదన్నమాట. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక రెండు ప్రాంతాల అస్తిత్వాన్ని దెబ్బతీసే మంత్రాంగం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దశాబ్దాలపాటు ధ్వంసం చేసిన రాజకీయం ఇప్పుడు రాయలసీమ ప్రజల ఇష్టాయిష్టాలమీద అప్రజాస్వామిక అస్తిత్వ దాడికి పాల్పడుతున్నది. కనిపించే ప్రమాదాలకన్న ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక కనిపించని అన్యాయాలు ఇంకేవో ఉంటాయనిపిస్తున్నది. ఢిల్లీ పాలకులు ఇష్టం వచ్చినట్టు చీల్చి పీల్చి చేర్చి మార్చి పంచి తెంచి వంచించే ఆటబొమ్మలా తెలంగాణ రాయలసీమ ప్రజలు?

ఈ ప్రతిపాదన వైఎస్‌ఆర్ పార్టీ ప్రాబల్యం తగ్గించడం, టీడీపీని కకావికలు చేయడం కోసమో, తెలంగాణ కోసం పోరాడిన తెరాసను రాజకీయంగా దెబ్బతీయడం కోసమో తప్ప మరో ప్రాతిపదికేదీ కనిపించబోదు. రాయలసీమ ప్రజలు 1956లో తెలంగాణను కలుపుకోవడానికి కోస్తాతో చేతులు కలపడం వారే వారికి కూడా చేసుకున్న అన్యాయం. మౌనంగా విశాలాంవూధలో కలిసి తెలంగాణ తర్వాత రెండోస్థాయిలో విషాదానికి గురైన ప్రజ లు సీమ వారు. తమ ప్రాంతానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు ముఖ్యమంవూతులు, కేంద్రమంవూతులు అయిన సంబరం తప్ప వారికి ఆ నేతల ద్వారా దక్కిన అభివృద్ధి ఏమీలేదు. సీమ నుంచి వచ్చి ముఖ్యమంవూతులై సొంతంగా హైదరాబాద్‌లో ఆస్తుల సంపాదించుకున్నారే కాని వారు రాయల సీమకు చేసిందేమీలేదు. ఆ నేతలు హైదరాబాద్‌లో తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఏదో కులం ద్వారానో జిల్లా ద్వారానో తెలంగాణతో సంబంధం పెట్టుకోవాలని కల లు కంటున్నారు. ఆ క్రమంలో తమ సీమను నరుక్కునేందుకు సిద్ధ పడుతున్నారని అర్థం చేసుకోవాలి. మైకం కమ్మినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ పట్ల ద్వేషాన్ని చాటుకున్న కొందరు మైకాసుర నాయకుల నిజ స్వరూపాన్నిఈ ప్రతిపాదన బట్టబయలు చేస్తుంది.

రాష్ట్రం విడిపోవద్దని నీతులుచెప్పిన నేతలు, విడిపోతే రాయలసీమ విడిగా ఇవ్వాలని అడిగిన నాయకులు,కోస్తాతో కలిసి ఉండబోమని తమ కోస్తా వ్యతిరేక తీవ్రతను బాగా చాటుకున్నారు. కాని కొంతముక్క కోస్తాకు మరో ముక్క తెలంగాణకు తగిలించి కొందరు నేతలకు ప్రయోజనం చేకూర్చాలనుకోవడానికే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం లేద ని గమనించాలి. కృష్ణానదీ జలాల వినియోగంలో ఇప్పటికే తెలంగాణకు సీమాంధ్ర నాయకులు, అధికారులు, ఉద్యోగులు అన్యాయం చేశారు. ఈ అన్యాయాలు తెలంగాణ ఏర్పాటుతో ముగిసిపోయి, ఈ ప్రాంతానికి కేటాయించిన కృష్టా నదీజలాలను తెలంగాణలో వాడుకునే అవకాశం కోసం తెలంగాణ ప్రధానంగా ఉద్యమిస్తున్నది. కృష్ణానీటిని తరలించుకుపోవడానికి కోస్తా సాగించిన కుట్రలకు తెరదించేది తెలంగాణ మాత్రమే. ఈ ప్రయోజనాన్ని నిరాకరించడానికే ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన. ఇది నీరు కారని నీళ్లనిజం. రాయల తెలంగాణ - ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలవడానికి ఉపకారం చేస్తుందని, జగన్ పార్టీని దెబ్బతీయగలుగుతామని ఆ పార్టీ నేతల్లో కొందరు భ్రమలు కలిగిస్తున్నారు.కాని రాయలసీమ ప్రజలు ఈ ద్రోహాన్ని ఓట్ల ద్వారా తిప్పికొడతారు. తెలంగాణతో కలిపినందుకు కర్నూలు, అనంతపురం జిల్లా ల ప్రజలు, తమ సీమను చీల్చి, తమకిష్టం లేనికోస్తాతో కలిపినందుకు కడప, చిత్తూరు ప్రజలు కాంగ్రెస్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ కుట్ర అర్థమై కాంగ్రెస్ బోల్తా పడుతుందని ఊహించకపోవ డం అవివేకం.తెలంగాణలోని ఒక సామాజిక వర్గం రెండు రాయలసీమ జిల్లాలలోని తమ వర్గంతో కలిసి బలపడవచ్చని అనుకోవచ్చు, తెలంగాణ ఏర్పా టువల్ల ముస్లింల బలం తగ్గుతుందనుకునే మజ్లిస్ వారు రాయల తెలంగాణ ను సమర్థిస్తారని అనుకోవచ్చు. అది ఎంత భ్రమో అతి త్వరలో అర్థమవుతుంది.

ముస్లింల ఓటు బ్యాంకు కోసం సెక్యులరిజాన్ని బలిపెట్టే ములాయ ంసింగ్ యాదవ్ తెలంగాణను వ్యతిరేకించడానికి కారణం, మజ్లిస్ విధానమే అయి ఉండవచ్చు.
నెలరోజులుగా తెలంగాణ ఇచ్చేస్తాం అంటూ సొంత మీడియాలో గుసగుసల ద్వారా ప్రసార ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ తెరాసను దూరం పెట్టింది. తెరాస కూడా కాంగ్రెస్ రాజకీయ చాణక్యాన్ని చూస్తూనే ఉంది. రాయల తెలంగాణను చాలా స్పష్టంగా వ్యతిరేకించడమా లేక ఫరవాలేదు ఏదో రకంగా తెలంగాణ రానీ అని అనుకోవాలో తెలియని సందిగ్ధంనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనిపిస్తున్నది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణలో మాత్రమే తెలంగాణ నీరు తెలంగాణకు దక్కుతుందని, కనుక అది తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం చాలా స్పష్టంగా చెప్తున్నారు. బలవంతంగా రాయలసీమను చీల్చితే మొత్తం రాష్ట్రమంతటా ప్రజల అసంతృప్తి జ్వాలల్లో కాంగ్రెస్ దగ్ధమయ్యే ప్రమాదం కూడా ఉంది. కడప చిత్తూరులు తగులుకోవడం ఆ జిల్లాలవారికి, కోస్తా జిల్లా ల ప్రజలకు నచ్చుతుందని అనుకోవడానికి ఏ ఆధారాలూ లేవు. కచ్చితంగా వ్యతిరేకిస్తారనడానికి ఏ ఆధారాలూ అవసరం లేదు.

కీలకమైన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాజీ సభ్యుడు కె కేశవరావు, ఇద్దరు ఎంపీలు పార్టీని వదిలేసి జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను కలవరపెట్టిన తరువాత మొదలయిన ఈ తెలంగాణ కదలిక, రాయల తెలంగాణ ప్రతిపాదనతో స్తంభించి పోయే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఒక సామాజిక వర్గం తప్ప మిగిలిన వారంతా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తే కాంగ్రెస్ నుంచి తెరాసకు వలసలు ఆపలేని పరిస్థితి వస్తుంది. సమైక్యాంవూధను కోరుకుంటూ తెలంగాణను వ్యతిరేకించి కాళ్ల కింద నేలను కోల్పోతున్న వైఎస్‌ఆర్ పార్టీ కూడా ఈ అంశం మీద మళ్ళీ కాళ్లూనే అవకాశం కాంగ్రెస్సే అనుకోకుండా కల్పిస్తున్నది. అసలే వ్యతిరేక పవనాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ తెలంగాణలో తెరాసకు బిజెపికి, రాయలసీమ కోస్తాల్లో వైఎస్‌ఆర్ పార్టీకి బంగారు పళ్లాలలో ఎంపీ సీట్లను సమర్పించుకుంటుంది. అన్యాయం గా నివేదిక రాసిన శ్రీ కృష్ణ కమిటీ రాయలసీమ నాలుగు జిల్లాలను తెలంగాణకు కలపాలని ఆరు మార్గాల్లో ఒకటిగా రాయల తెలంగాణను పేర్కొన్నది. చీకటి అధ్యాయాల కుట్రలను రచించిన ఆ కమిటీకి కూడా తట్టని విధంగా రాయలసీమను చీల్చే దుర్మార్గ ప్రతిపాదనను ఢిల్లీ కాంగ్రెస్ రచించింది.

రాయల తెలంగాణ అప్రజాస్వామికమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ పై వేసిన తొమ్మిది కమిటీలు తెలంగాణ ఏర్పాటుపైన అవున నో కాదనో అన్నాయి కాని రాయలసీమను నిలువుగా నరకమని చెప్పలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఉత్తరాలు రాసిన పార్టీలు ఏవీ రాయలసీమ గురించి ఏమీ చెప్పలేదు. ఏపీ అసెంబ్లీ అభివూపాయం గానీ, కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ తీర్మానం గానీ అఖిల రాజకీయ పార్టీల అభివూపాయం గానీ, చిదంబరం డిసెంబర్ 9న ప్రకటించిందీ ఆ తరువాత ఉభయసభలకు చెప్పిందీ, కేంద్ర హోం మంత్రిగా చిదంబరం, ఆ తరువాత సుశీల్ కుమార్‌షిండే ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా తెలంగాణ ఏర్పాటు గురించే గాని రాయలసీమను ముక్కలు చేయడం గురించి కాదు. ఎవరూ ప్రతిపాదించని, ఎక్కడా చర్చించని, ఎవరూ సూచనవూపాయంగా కూడా ఊహించని రాయలసీమ చీలిక ఎక్కడి నుంచి వస్తుంది? కాంగ్రెస్ కుటుంబం లేదా అధ్యక్షురాలి కోటరీ అనుకుం సరిపోతుందా? తెలంగాణను బలిచేసిన కొందరు కోస్తా పెట్టుబడి నేతల కొత్త కుట్ర ఈ రాయల తెలంగాణ. వీరు ఈసారి కాంగ్రెస్ మీదనే పగ బట్టినట్టుంది, తెలంగాణ నామరూపాలు నాశనం చేయాలనే దుర్మార్గపు ఆలోచన ల్లో పడి వారు తమకు బతుకు నిచ్చిన కాంగ్రెస్ పార్టీని నిలువునా పాతేయడానికి ఈ ప్రతిపాదన తెచ్చినట్టుంది. ఇది రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి ఎంత పెద్దసవాలో, ఆ ప్రాం త నాయకులమని చెప్పుకునే వారికి కనీస స్థాయి తెలివి తేటలున్నాయా అలవిమాలిన అతి తెలివితేటలున్నాయా లేక అస లు ఆలోచించే మనసైనా వారి కుందా లేదా అని నిలదీసే అంతే పెద్దదైన సవాల్.

తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందనే ఆలోచనచేస్తే అర్థమయ్యేది ఏమంటే తెలంగాణ ప్రజలను తమ సోదరులని సీమాంధ్ర నాయకులు (సామాన్య ప్రజలు కాదు) ఏనాడూ అనుకోకపోవ డం, ఆత్మీయంగా సోదరులం అనే అభివూపాయాన్నీ ఏనాడూ కనీసం చూపనైనా చూపలేకపోవడమే కాకుం డా ఎపి కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపీ ల అధినేతలు, కాంగ్రెస్ తెలుగుదేశం పక్షాన ముఖ్యమంవూతులైన నేతలు, ముఖ్యంగా రాజశేఖరరెడ్డి తెలంగాణను వ్యతిరేకించి, ద్వేషించి తీరుతామని చాలా స్పష్టంగా చెప్పారు. చేసా రు. వీళ్ల నిజస్వరూపాలు మూడు ప్రాంతాల ముందుకు తేవడానికి మాత్రం రాయల తెలంగాణ అనే కాంగీయుల లీక్ వ్యూహం ఉపయోగపడుతుంది. కర్నూలు అనంతపురం జిల్లాలకు విడిగా తెలంగాణ పట్ల సాదర సోదరభావాలున్నాయనడానికి దాఖలాలు ఏవీ లేవు.. భారత పాకిస్తాన్ శ్రీలంక దేశాలు సమువూదంలో చేపలు పట్టుకునే వారిని బంధించి, శాంతి సంప్రదింపుల్లో విడుదల చేయడానికి అమానుషంగా వాడుకున్నట్టు బ్రిటిష్ పాలకులు, గోల్కొండ నేలిన కుతుబ్ షాహీలు ఆసఫా జాహీలు రాయలసీమ జిల్లాలను ఇచ్చిపుచ్చుకునే మారక వస్తువులుగా, రాజ్య విస్తరణ రాజకీయాల కోసం చాలా అన్యాయంగా వాడుకున్నారు. కోస్తాకు చెందిన సినిమా వ్యాపారులు ఇప్పడికీ రాయలసీమను సీడెడ్ అనే పిలుస్తారు. వాళ్లను పిచ్చిగా అభిమానించి, ఆహీరోలను దేవుళ్లనుకుని ఆరాధించి, రాజకీయాల్లోకి వస్తే ఓట్లేసి గెలిపించిన ఆ వెర్రి జనానికి వారు ఇచ్చిన ప్రతిఫలం ఈ చీలిక. అక్కడి ప్రజలు మనుషులనీ, వారికీ అభివూపాయాలు, ఆత్మలు, ఆత్మగౌరవాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయన్న ధ్యాస లేని ఇంగ్లిషు, తురక పాలకులకు తీసిపోకుండా కాంగ్రెస్ కూడా అదేవిధంగా వ్యవహరించాలని ప్రతిపాదించడం చూస్తే మనం అసలు ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది.

దశాబ్దాల తెలంగాణ ఉద్యమం -కాంగ్రెస్,టీడీపీ పాలనల మీద తిరస్కార సంతకం. ఎడారిగా మిగిలిన రాళ్ల రాయలసీమ, తల్లినేల మీద ఆప్రాంత నాయకులకున్న నిర్లక్ష్యానికి నిలు సాక్ష్యం. ఈ రెండు ప్రాంతాలను ఈ విధంగా వదిలేసిన వారు ముఖ్యమంవూతులైనా గవర్నర్లయినా రాష్ట్రపతులైనా సరే సొంత నేలకు ఏమీ చేయని వారిగా చరివూతలో అప్రతిష్టతోనే మిగిలిపోతా రు. రాయలసీమను విడిగా రాష్ట్రంగా రూపొందించమో లేక కోస్తాతో కలిపి ఉంచడమో చేయకుండా వారి అభీష్టానికి వ్యతిరేకంగా రాయలసీమను చీల్చి ఇచ్చే రెండు జిల్లాలు తగిలించుకోవడానికి తెలంగాణ అంగీకరిస్తే తెలంగాణ పోరాటానికి ఇన్నాళ్లూ వెన్నుదన్నుగా ఉన్న నైతిక బలం కూడా కరిగిపోతుంది. ఆత్మగౌరవ నినాదానికి అర్థం లేకుండా పోతుంది. తెలంగాణ ఉద్యమ నైతిక బలం మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, రాయలసీమ ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులన్న నమ్మకం లేశ మాత్రం ఉన్నా తెలంగాణ ప్రజలేకాదు మొత్తం సీమాంవూధులు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిందే.విడిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేయడానికి సరిపోని రాయల తెలంగాణను తిరస్కరించాల్సిందే. తెలంగాణతోపాటు రాయలసీమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు ప్రాంతాలూ ఉద్యమించాల్సిందే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

111

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన