ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు


Tue,July 23, 2013 12:03 AM

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ
అంటూ తెలంగాణ కోసం కలంతో కవితాశరథి సృష్టించిన దాశరథి (జన్మదినం జులై22) ఈనాడు బతికి ఉంటే నిజాం నవాబును కవితాక్షరాలతో శిక్షించినట్టే కాంగ్రెస్ పార్టీని అందులో ఉన్న సీమాంధ్ర నాయకులను అవే అక్షరాలతో తిట్టి ఉండేవారు. నిజాం రాజు బూజుపాలన కన్న, కాంగ్రెస్సో మరొకటో స్వయంపాలన మంచిదని దాశరథి అనుకున్నాడు. కాని ఇప్పడికీ తెలంగాణ మీద కురిపిస్తున్న ద్వేషాగ్నిని కనుక ఆయన గమనించి ఉంటే మరోసారి ఈ కుట్రల మీద అగ్నిధార కురిపించేవారే.
తెలంగాణ వస్తుందనుకుంటున్న ఈ తరుణంలో కూడా తీగలను తెంపడానికి అగ్నిలో దింపడానికి కుట్రలు జరుగుతున్నాయి.

ఎప్పుడో 1970లలో రావలసిన తెలంగాణ అనేక కారణాలతో దశాబ్దాల తరువాత కూడా మరొక దశాబ్దపు పోరాటం తరువాత కూడా భయ సందేహాల మధ్య, కనిపించని ద్రోహాల మధ్య, రాజకీయ స్వార్థ క్రీనీడల చాటున కొట్టుమిట్టాడుతున్నది. బాంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటు అందించి, పాకిస్తాన్ అన్యాయాలమీద సైనిక సమరం సాగించి యుద్ధాన్ని జయించి లక్షమంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయే విధంగా సమరాన్ని నడిపి చారివూత క విజయంతో ఇందిరాగాంధీ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. 1971 లోకసభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ప్రభంజనం వీచింది. దేశమంతటా అపూర్వ విజయం సాధించింది. కాని తెలంగాణలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలలో 11 స్థానాల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. బాంగ్లాదేశ్ విజయం ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. కారణం తెలంగాణ. అప్పడికి పదిహేనేళ్ల సమైక్యాంవూధవూపదేశ్‌లో కోస్తాంధ్ర నాయకులు తెలంగాణపైన సాగించిన దుర్మార్గపు పెత్తనం అణచివేత, ప్రత్యక్షంగా పరోక్షంగా చలాయించిన జులుం, నిధులు, నీళ్లు, ఉద్యోగాల మళ్లింపు తీవ్రనిరాశ కలిగించింది. ఉద్యమాన్ని రగిలించింది.

మధ్యలో వచ్చిన రాజకీయ ధురంధరుడు డాక్టర్ మర్రి చెన్నాడ్డి ఉద్యమ నాయకత్వం చేపట్టి, ఉద్యమాన్ని తనచతురతతో ఎన్నికల బరిలోకి నడిపించారు. అపూర్వమైన విజయం సాధించారు. జాతిమొత్తానికి తెలంగాణ వేరు రాష్ట్రం కోరిక ఎంత ప్రగాఢంగా ఉందో ఎన్నికల ద్వారా నిరూపించారు తెలంగాణ ప్రజలు. అప్పటి నుంచి తెలంగాణపైన కనిపించని కక్షలు, ఎత్తుగడలు, రాజకీయ కుయుక్తులు మొదలైనాయి. 1955 ప్రాంతంలో ఢిల్లీలో అబద్ధాలను తోచిన వ్యతిరేక కారణాలను ప్రచా రం చేసిన సీమాంధ్ర నాయకులు, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఏర్పరచుకున్న అభివూపాయాన్ని కూడా ప్రభావితం చేసి ఆంధ్ర-తెలంగాణ పేరుతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరువాత మళ్లీ తమ కుట్రల ద్వారా ఆంధ్రవూపదేశ్ అనే కొత్త పేరుతో రాష్ట్రాన్ని సాధించడానికి సాగించిన వ్యూహాలను మళ్లీ అనుసరించి ఢిల్లీలో చక్రం తిప్పి కోటి రతనాల వీణ తెలంగాణను తీగలను తెంపి అగ్నిలో దింపినారు. తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు మర్రిచెన్నాడ్డిని ఒప్పించి, లోక్‌సభలో 11 స్థానాలు గెలిపించిన తెలంగాణ ఉద్యమాన్ని గంగపాలు చేశారు.

అది తెలంగాణపైన కాంగ్రెస్ తీరని ద్రోహం. ప్రలోభానికి లొంగిన పాపం చెన్నాడ్డిదయితే, ఆ ప్రలోభాల కుట్రలను పన్నిన రాజకీయ పాపాత్ములు కచ్చితంగా సీమాంధ్ర నాయకులే, ఢిల్లీలో పెత్తనం చేసే దుర్మార్గులే.
విచివూతమేమంటే మళ్లీ అవే కుట్రలు జరుగుతున్నాయి. ఒకటో కుట్ర ఆలస్యం చేయడం, రెండో కుట్ర రాయల తెలంగాణవాదం రేకెత్తించడం, మూడో కుట్ర, సీమాంధ్ర వారికి అభవూదత అనే కొత్త గోబెల్స్ ప్రచారం, నాలుగో కుట్ర నక్సలైట్లు విజృంభిస్తారనడం, అయిదో కుట్ర తెలంగాణకు వ్యతిరేకంగా మజ్లిస్ వంటి పార్టీలను రెచ్చగొట్టడం. తెలంగాణ ఇచ్చి తీరుతారని నమ్మి సాగించే కొత్త కుట్ర ఆరోది. అదే తెలంగాణపై సాగించిన దోపిడీకి సంబంధించిన ఫైళ్లను ధ్వంసం చేయడం. తెలంగాణ ఏర్పాటు కోసం 215 రోజులు పడుతుందని ఎక్కడి నుంచో ఒక పుకారును సంపాదించి, దాని మీద మీడియా రెండుమూడు రోజులు హోరెత్తించింది. డిసెంబర్ 9, 2009 నుంచి తన కమిట్‌మెంట్‌ని కాంగ్రెస్ అటకెక్కించి ఎన్నికల కోసం దాన్ని దించింది. అయినా ఆ ప్రతిపాదన కదలనీయకుండా కావలసినన్ని ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రతీప శక్తుల ఆలస్య కుట్రను ఛేదించడానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇతర ఉద్యమనాయకులు కృషి చేయవలసి ఉంటుంది.

ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తారో చేస్కొండి అని అసెంబ్లీలో బాహాటంగా తన తెలంగాణా వ్యతిరేకతను చాటుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రోడ్‌మ్యాప్ పేరుతో లక్షలకోట్ల రూపాయల ప్యాకేజ్‌తో తెలంగాణ అభివృద్ధి చేస్తాననడం, ఆ అద్భుతమైన సమాచారాన్ని లీక్ చేయడం, మీడియాలోని కొన్ని కాంగ్రెస్ తానా తందాన చానళ్లు వారి ఉదారశీల విధానాలను వేనోళ్ల కీర్తించడం కూడా జరిగిపోయింది. ఏ ప్రకటనకైనా విశ్వసనీయతే ప్రాణం. లక్షలకోట్లు ఇస్తామంటే జనం నవ్వుకున్నారే తప్ప నమ్మలేదు.
రాయల తెలంగాణ అనే అర్థం పర్థంలేని ప్రతిపాదన ముందుకు తోయ డం, మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ నాయకులు రాయల తెలంగాణపైన జనం స్పందనను అంచనా వేయడం కోసం మీడియాకు కాంగ్రెస్సే ఈ లీకులు ఇస్తున్నది. తాజాగా ఈ ప్రతిపాదన ముగిసిపోయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణపట్ల తీవ్రమైన వ్యతిరేకతను, ఇటీవల ద్వేషాన్ని ప్రదర్శించడంలో కోస్తాకన్నా రాయలసీమ నాయకులేమీ తీసిపోలేదు. రాయలసీమ నుంచి ముఖ్యమంవూతులైన నాయకులు తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.

అనంతపురం కర్నూలు నుంచి కొందరు చేస్తున్న ప్రకటనలు వింటూ ఉంటే తెలంగాణ పట్ల ఇంత ద్వేషం ఉన్నవారు తెలంగాణతో కలిసి ఉండలేరన్న నమ్మకం కలుగుతుంది. నీళ్లకోసం ఈ ప్రతిపాదన వచ్చిందేమో. లేదా మైనారిటీ వర్గాలఆధారంగా పనిచేసే మజ్లిస్ వంటి పార్టీల ప్రభావం ఉందే మో తెలియదు. రాయలసీమ నాలుగు జిల్లాలను చీల్చి రెండు కోస్తాతో రెండు తెలంగాణతో కలపాలనే ఆలోచన ఏమాత్రం సమంజసం కాదు.

సీమాంవూధులకు అభవూదత మరొక ప్రచారసాధనం. సీమాంవూధులు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలోని అంతటా వ్యాపించి ఉన్నారు. సీమాంవూధలో తెలంగాణ వారిని బతకనివ్వకపోయినా, వారి అభవూదత గురిం చి ఎవ్వరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో సీమాంధ్ర వారి అభవూదత గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు బయలుదేరారు. తెలంగాణ ప్రజలతో సమైక్యమై సహజీవనం సాగిస్తున్న వారి భద్రతకు అనుమానం వచ్చే సంఘటన ఇంతవరకూ ఎక్కడా జరగలేదు. 13 సంవత్సరాల ఉద్యమంలో ఎక్కడాలేని అభవూదత గురించి మాట్లాడడం ఏదోరకంగా అడ్డుకునే ప్రయత్నమే. తెలంగాణ ఏర్పడినా ఇక్కడ ఉంటున్న ఇతర ప్రాంతాలవారు ఎవరూ ఎక్కడికీ వెళ్ల వలసిన అవసరం లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి ‘నమస్తే తెలంగాణ’ ఆత్మీయ రథంపైన దాడులు, సీమాంవూధలో జరిగిన మరికొన్ని అటువంటి సంఘటనలు పరిశీలిస్తే సీమాంవూధలో తెలంగాణ వారి భద్రత గురించి ప్రత్యేకమైన చర్యలు అవసరం అని తేలుతుంది. అక్రమంగా భూములు ఆక్రమించిన సందర్భాలలో ఆ అక్రమార్కులకు భద్రత కల్పించాలనడం అన్యాయమే అవుతుంది.

తెలంగాణ భూముల రికార్డులకు అభద్ర త తొలగించాల్సి ఉంది. ఈపరిణామాలు చూస్తుంటే రాజధానిలో తెలంగాణ వారికే అభవూదత ఉందనిపిస్తుంది. మతశక్తులకు ప్రలోభాలు కల్పించి మతకలహాలు సృష్టించిన చరిత్ర సీమాంధ్ర రాజకీయాలకు ఉంది. పాతబస్తీని కూడా బతకనీయని ఈ శక్తులనుంచి భద్రత కల్పించాల్సింది తెలంగాణకు.
తెలంగాణ ఇస్తే నక్సలైట్లు విజృంభిస్తారని ముఖ్యమంవూతితో సహా సీమాం ధ్ర నేతలంతా పనిగట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణను ఆపడానికి నిజాలో అబద్ధాలో, తోచిన కారణాలన్నీ ఏకరువు పెడుతున్నారు. మొట్టమొదట నక్సలైట్లు పెరిగిపోతారనే మాటకు ఆధారం లేదని గమనించాలి. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు రావడానికి కారణం ఛత్తీస్‌గఢ్ అనే చిన్నరాష్ట్రం ఏర్పడడం కాదు. అక్కడ గ్రామీణ జనజీవనాన్ని అభివృద్ధి పేరుతో అతలాకుత లం చేయడం వారికి అండగా నక్సల్ ఉద్యమం రావడం, జరిగిందని పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అసలు సిసలు అభివృద్ధి కోసం పోరాడిన నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి, గుట్లుమట్లు సేకరించి నకిలీ ఎన్‌కౌంటర్లతో అంతరింపచేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నా ప్రభుత్వాలు అందులోని పెద్దలే ఈ తప్పుడు వాదాన్ని అసమంజస కారణాలను ప్రచారంలో పెడుతున్నారు. తెలంగాణ ఇవ్వకుండా దోపిడీ సాగితే నక్సలైట్లు పెరిగే అవకాశం ఉంది.

మజ్లిస్ పార్టీ తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో కొత్తేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ అన్ని రకాల ప్రయోజనాలను పొంది మతద్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులను ఎదుర్కొంటున్న మజ్లిస్ తమ మతస్థుల కోసం పనిచేయడం తప్ప తెలంగాణ కోసం పనిచేసిందెన్నడూలేదు. వారి రాజకీయాలకు మతమే ప్రాతిపదిక. వారు ముస్లిం ఆధిపత్య పాతబస్తీకి మాత్రమే పరిమితం, ఏం చేస్తే మూసి దాటిన తరువా త కూడా తమ రాజకీయ ప్రభావం పెరుగుతుందా అని ఆలోచిస్తూ తెలంగాణను వ్యతిరేకించే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్న వారి అవకాశవాద రాజకీయాలను తెలంగాణ నిలదీయవలసి ఉంది. తెలంగాణవస్తే బిజెపి బలవత్తరమైన పార్టీ అవుతుందని వారి భయం. ముస్లిం మతం మాత్రమే ఆధారంగా రాజకీయాలు నడిపితే వారికి బలీయమైన ప్రత్యర్థిగా మరో మతం ఆధారంగా పనిచేసే పార్టీ తయారవుతుంది. అది తెలంగాణలోనూ సమైక్యాంవూధలోనూ జరిగే పనే.

సీమాంధ్ర ముఖ్యమంవూతులకు వత్తాసు పలుకుతూ తామే మొత్తం ముస్లింలకు ప్రతినిధులమనుకుంటూ వారు సాగించే విచ్ఛిన్నకర రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గమనించాలి. వారిని లాలించే చెత్త రాజకీయాలు వదులుకోవాలి. సీమాంవూధుల తెలంగాణ వ్యతిరేకత ఎంత బలమైందో, మజ్లిస్ హిందూద్వేషం కూడాఅంతే బలమైంది. కనుక ఆ రెండు శక్తులూ కలిసిన సందర్భా లు కూడా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌తో ఇన్నాళ్లూ కలిసి ఉండి ఈ మధ్య వేరు కావడం మజ్లిస్ వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. కనుక మజ్లిస్ వ్యతిరేకతను పరిగణించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు. కేవలం మతం పేరుతో మత వర్గం ప్రజలపైన కొన్ని దశాబ్దాలుగా వీరు సాగిస్తున్న మజ్లిస్ గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టే దాకా పాతబస్తీలో మతసామరస్యం అభివృద్ధి సాధ్యం కాదు. బిజెపిని మతపార్టీ అంటూ దూరంపెట్టే రాజకీయ పార్టీలు వామపక్షాలతో సహా మజ్లిస్‌ను సెక్యులర్ పార్టీగా పరిగణించడం ఒక విచివూతమైన విషయం. మత పిచ్చి తప్ప మరో ఎజెండాలేని ఇటువంటి మత పార్టీలకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదు. మత దురభిమానం అనర్హతకు దారితీసే నియమాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.

తెలంగాణ రెవెన్యూ ఫైళ్లు తగలబడం సీమాంధ్ర రాజకీయ నాయకులు వారి తాబేదార్లయిన సీమాంధ్ర ప్రభుత్వోద్యోగుల కుట్రలకు నిదర్శనం. ఈ సంధి సమయంలో దాయాదుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలనడానికి సచివాలయం ఫైళ్ల కాల్చివేత ఒక హెచ్చరికని గమనించాలి. ఉద్యమ రాజకీయా ల్లో మునిగి తేలుతున్న తెలంగాణ ఉద్యోగ నాయకులు ముందుగా దృష్టి సారించవలసిన కీలకమైన సమస్య, తెలంగాణ భూములను దుర్మార్గంగా ఆక్రమించుకున్న వారి మోసాలను రుజువుచేసే రికార్డులను భద్రంగా కాపాడడం.
ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మా
గాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని బో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే. ముసలినక్కకు రాచరికంబు దక్కునే అన్నారు దాశరథి. ఇప్పుడు ముసలి నక్క నిజాం నవాబు కాదు. జన్మజన్మల బూజు అనుకున్న నిజాం రాజు వదిలింది. కాని దశాబ్దాలనుంచి సాగుతున్న సీమాంధ్ర నేతల తెలంగాణ ద్వేషపు బూజు వదిలించుకునే దశ ఆసన్నమైంది. తీగలు తెగిన కోటి రతనాల వీణకు తీగలు సంధించి తీయని రాగాలు కురిపించడం, తెగిన గాలిపటం కాదు తెలంగాణ.తెలంగాణ తేనెసోన తెలంగాణ దివ్యవీణ అన్న దాశరథి మాట నిజం చేయడం ప్రస్తుత కర్తవ్యం.
‘తమ మంత్రం పారదింక ఉచ్చుతెంచుకొనెను జింక ఇక స్వేచ్ఛా
ప్రయాణము/ ఇదే తెలంగాణము’

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

243

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా