ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్


Tue,July 16, 2013 12:30 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు నీడ. ఆ కేంద్రీకృత అధికార కూడలిలో సోనియా, రాహుల్ గాంధీ తప్ప మిగిలిన వారంతా పాత్రధారులే. సోనియా తలచుకుంటే తెలంగాణ ఇవ్వడం సాధ్యమవుతుంది. కాని సోని యా కుటుంబానికి తెలంగాణ ఇవ్వక తప్పదనే సందేశాన్ని కరాఖండిగా చెప్పినవారు పోరాటశీలురైన తెలంగాణ ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వీరందరినీ కదిలించిన టీఆర్‌ఎస్. స్వరాష్ట్రం కోసం తెలంగాణ అంతటా పెల్లుబుకిన ప్రజా చైతన్యమే ఇవ్వాళ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. తెలంగాణ ఇచ్చిన ఘనతను ఇసుమంతైనా ఎవరికీ పంచకుండా కొట్టేద్దామని కాంగ్రెస్ జిత్తులన్నీ పన్నుతున్నది.

లోకసభ ఎన్నికలను నిర్వహించేందుకు తొందరపడుతున్న కాంగ్రెస్ అప్పటి దాకా తెలంగాణను ఆలస్యం చేయగల శక్తి కూడా ఆ పార్టీకే ఉన్నది. తెలంగాణ ఇస్తే అది టీఆర్‌ఎస్‌తో సహా ప్రజాసంఘాలు తెచ్చిన చైతన్యానిది. ఇవ్వకపోతే ఆ బాధ్యత తెలంగాణ విద్వేషానిది, కాంగ్రెస్ నక్కజిత్తులది. యూపీఏలోని ఇతర భాగస్వామ్యపక్షాలతో మాట్లాడాలని, తరువాత ప్రతిపక్షాలతో మాట్లాడలని కాంగ్రెస్ కొత్త పేచీ పెట్టింది. తరువాత దాన్ని పక్కకుపెట్టి హఠాత్తుగా సంప్రదింపులు పూర్తయ్యాయని, ఇక ఎవరినీ అడిగే పని లేదనడం మొదలుపెట్టింది.

కిరణ్ సమైక్యాంధ్రప్రదేశ్ ఉండాలని ప్రజెం చేస్తుంటే.. సమైక్యంగా ఉంటే ప్రయోజనాలేమిటని సోనియా కిరణ్‌ను అడిగారు. ఆయన జవాబేమిటో పత్రికల్లో రాలేదు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌లో ఉండే సీమాంవూధుల రక్షణేమిటని సోనియా మరో ప్రశ్న. కిరణ్‌దీ అదే ప్రశ్న. కాని జవాబు ఇచ్చింది దామోదర రాజనర్సింహ.

కొన్ని వందల సంవత్సరాలుగా గుజరాతీలు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు, తమిళులు జీవిస్తున్న హైదరాబాద్‌లో ఒక్క సీమాంవూధులకే సమస్య ఎందుకు వస్తుందని ఉపముఖ్యమంత్రి జవాబిచ్చారట.
జిత్తుల్లో భాగంగా రాజ్యాంగ సవరణ బూచిని ముందుకు తోస్తున్నది హైకమాండ్. రాజ్యాంగ సవరణ కోసం చాలా సమయం పడుతుందని ఆలస్యాన్ని సమర్థించుకోవడానికి మరో ప్రయత్నం. పార్లమెంటులో బిల్లు పెట్టడం, అంతకుముందు దాన్ని రాష్ట్ర శాసనసభ అభివూపాయం కోసం పం ప డం, రాజ్యాంగంలోని ఆర్టికల్-3లో నిర్దేశించిన పద్ధతి ఉన్న ది. దాని ప్రకారం వ్యతిరేక అభివూపాయమైనా, అనుకూల అభివూపాయమైనా పార్లమెంటు బిల్లు ఆమోదిస్తే రాష్ట్రం ఏర్పాటవుతుంది. రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లు ద్వారానే షెడ్యూలు 1, షెడ్యూలు 4లో అవసరమైన మార్పులు జరుగుతాయి.

ఆ విధమైన మార్పును రాజ్యాంగ సవరణ అనబోరు. అది రాజ్యాంగ సవరణ కాదు అని ఆర్టికల్ 4 చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఇప్పుడున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి సిఫార్సు చేసిన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే చాలు. కాని ఆర్టికల్‌లో రెండుచోట్ల రాష్ట్రం అనేమాట వాడారు. అందులో ఇచ్చిన ఒక వివరణలో ఆర్టికల్ 3 (ఎ) నుంచి (ఇ) వర కు రాష్ట్రం అంటే కేంద్ర పాలిత ప్రాంతం అని కూడా. కాని మినహాయింపులో మాత్రం రాష్ట్రం అంటే కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉండదని పేర్కొన్నారు. అంటే రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని, రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయడానికి ఈ విధానం సరిపోదని, అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అర్థం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని అనుకుం లేక కొత్తగా తెలంగాణకు స్వయం పాలనాధికార కేంద్రాన్ని ఏర్పాటుచేయాల ని అనుకుం రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేయ దలుచుకుందో?

తెలంగాణకు పనిచేయని రక్షణలు, అమలు కాని ఒప్పందాలు బోలెడు. పెద్ద మనుషుల ఒప్పందంతో మొదలైన మోసం ఆర్టికల్ 371-డి దాకా వచ్చింది. తెలంగాణ ఉద్య మం 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడింది. 1971లో బంగ్లా విజయం తరువాత దేశమం తా ఇందిరకు ఓట్ల నీరాజనం పట్టినా తెలంగాణలో మాత్రం 14 స్థానాలలో పదకొండింటిలో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను గెలిపించి తెలంగాణ జనం ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టుదలతో ఉందని చాటింది. కాని ఆనాడు చెన్నాడ్డి ప్రలోభాలకు ఉద్యమం బలైపోయింది. ఎనిమిది సూత్రాలు, ఆరుసూవూతాల పథకం వంటి పరిణామాలు ఏర్పడ్డాయి. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి పి వి నరసింహారావు భూసంస్కరణలు సంపన్నులకు భూస్వాములకు మింగుడు పడలేదు. ముల్కీరూల్స్ రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర హైకోర్టు అన్యాయమైన తీర్పు ఇచ్చింది.

దానిపైన అప్పీలులో సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ రాజ్యాంగ సమ్మతమేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టులో అసమ్మతి తీర్పు ఇచ్చిన జస్టిస్ కొండా మాధవడ్డి వాదాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా అంగీకరించింది. నాటి తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర కుట్ర రాజకీయాలకు బలైపోయింది. 371-డి కింద రాష్ట్రప తి ఉత్తర్వులను 1975లో రూపొందించారు. తెలంగాణ స్వయం పాలనాధికారాల సంగతి దేవుడెరుగు. అంతకు ముందున్న తెలంగాణ ప్రాంతీయ మండలి పోయింది. మూడు ప్రాంతాల రాష్ట్రం రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం ఆరు జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో 85శాతం అక్కడి వారే ఉద్యోగాల్లో ఉండాలని నియమాలు చేశారు. దుర్మార్గంగా హైదరాబాద్‌ను మరో జోన్‌గా పరిగణించి రాష్ట్రపతి ఉత్తర్వుకు తూట్లుపొడిచారు. మిగిలిన చట్టాల్లో ఏమి ఉన్నప్పడికీ 371డి మాత్రమే చెల్లుతుందని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కాని దానికి భిన్నంగా 14-ఎఫ్ అనే పేరాను చేర్చి, హైదరాబాద్ పోలీసు చట్టం కింద నియామకాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ పేరుతో హైదరాబాద్‌లో ఎక్కడెక్కడి ప్రాంతాల వారినో రప్పించి తమ వారి ద్వారా అధికారాలు చెలాయించారు. సీమాంధ్ర అధికారులను, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులను కీలకమైన శాఖల్లో సీమాంధ్ర మంత్రులు ముఖ్యమంవూతులు నింపుకున్నారు. ఇక్కడ తాగడానికి లేకపోయినా, నియమాలు వ్యతిరేకించినా నదీ జలాలను తమ ప్రాంతాలకు దొంగతనంగా తరలించుకుపోయారు. వరసగా అదే పని. అన్నిరంగాలలోనూ అంతే.

రాష్ట్రపతి ఉత్తర్వులు పేరా 14ఎఫ్ తొలగించాలని న్యాయమైన తీర్పును ఇచ్చింది హైకోర్టు. కాని దాన్ని సుప్రీంకోర్టు అన్యాయంగా కొట్టివేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులో ఏమావూతమైనా తెలంగాణ ప్రయోజనాల రక్షణ ఉందంటే దాన్ని 14ఎఫ్ ద్వారా తొలగించారు. ఆ నియమాన్ని తొలగించాలని తెలంగాణ ఉద్యమించాల్సి వచ్చింది. చిదంబరం చివరకు దాన్ని తొలగించారు. దీని గురించి కిరణ్ కుమార్‌రెడ్డి కోర్ కమిటీలో తెలంగాణకు కావలసింది 14ఎఫ్ తొలగింపు మాత్రమే అని దాంతో వారి కోరిక నెరవేరిందని ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పారని పత్రికలు రాశాయి.

ఇదో అన్యాయపు అన్వయం. నిజానికి రాష్ట్రపతి ఉత్తర్వు అనేది నీరుగారిన రక్షణ మాత్రమే అనడానికి ఇటీవల చలో అసెంబ్లీ ఉద్యమాన్ని అతి క్రూరంగా జుట్టు పీకి, కొట్టి, తన్ని, తొక్కి అణచివేయడానికి సీమాంధ్ర పోలీసు అధికారులను రప్పించడమే నిదర్శనం. చివరకు 371-డీ గానీ రాష్ట్రపతి ఉత్తర్వు గానీ 610 జీవోగా మారిపోయి, ఎందుకూ పనికిరాకుండా అమలు కాని జీవోలుగా మిగిలిపోయాయి. ఆ విధంగా 371-డీ ఆర్టికల్ ఒక నిరర్థక ప్రత్యేక నియమం. రాజ్యాంగంలో తాత్కాలిక, ప్రత్యేక నియమాలు 370 తో మొదలవుతాయి. పలు రాష్ట్రాలలో వెనుక బడిన, నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకోసం స్వయంపాలిత విభాగాలను ఏర్పాటు చేయడానికి నియమాలు 371ఎ, 371 బి, 371 సి 371 డి అధికరణాలు. వీటిలో మహారా ష్ట్ర, గుజరాత్, అస్సాం నాగాలాండ్, మిజోరం, ఆంధ్రవూపదేశ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 371-డీ పనికి రాదు. దాన్ని తొలగించడానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. కాని 371 వంటి అధికరణాలలో కొద్ది మార్పు లు చేయడానికి రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఆమోదించడం చాలు. పూర్తిగా అధికరణాన్నే మార్చాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. కాని 371డీ కోసం తెలంగాణ ఏర్పాటు ఆగవలసిన అవసరం లేదు.

మమ్మల్ని దొంగలనడం దోపిడీదారులనడం బాగా లేదని కొందరు కోస్తాంధ్ర ప్రజావూపతినిధులు ఆవేదన చెందారు. ఆమాట అన్నే వ్యక్తి దొంగ కాకపోవచ్చు, దోపిడీదారుకాకపోవచ్చు. సీమాంధ్ర నేతల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన దోపిడీలో వారు భాగస్వాములు కాకపోవచ్చు. కాని వాటిని సమర్థించడం, వ్యతిరేకించకపోవడం, కంటికి కనిపించే వాస్తవాలను చూడకుండా గుడ్డితనం నటించడం, బూటకపు మాటలు ప్రచా రం చేయడం అంటే దొంగలను సమర్థిస్తున్నట్టే. ఎవరూ చూడకుండా చేసేది దొంగతనం. బెదిరించి లాక్కునేది ఎక్సటార్షన్, దాన్ని దోపిడీ అంటున్నాం. అయిదారుగురు కలిసి తుపాకులతో బెదిరించి చంపి హింసించి సంపద ఎత్తుకుపోతే దాన్ని బందిపోటు దోపిడీ అంటున్నాం. కాని ప్రభుత్వ ధనాన్ని ప్రజల సొమ్మును, నదీనదాలను, గనులను ఖనిజాలను, ఉద్యోగాలను, పరిక్షిశమలను, పన్నుద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక్కడి జనం నోళ్లు కొట్టి, బీళ్లను బీళ్లుగా వదిలేసి మరో ప్రాంతానికి తరలించే దుర్మార్గం బందిపోటు దోపిడీ కన్నా దారుణమైంది.

అది చేసిన సీమాంధ్ర ప్రభుత్వాలను ఏమనాలి? తెలంగా ణ సొమ్ముతో తెలంగాణ నీళ్లతో, తెలంగాణ ఉద్యోగాలతో సోకులు చేస్తున్న తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాలను నిలదీయాల్సింది-నిజమైన సమైక్యవాదుపూవరైనా ఉంటే, తెలుగు వారంతా కలిసి ఉండాలనే కోరిక నిజంగా ఎవరికైనా ఉంటే వారు. తెలంగాణ నిధులు నీళ్లు ఈ ప్రాంతానికే అందాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తప్ప మరో మార్గం లేదు. దానికి రాజ్యాంగం మార్చాలో మార్చకూడదో, మార్చే అధికారం ఉందో లేదో బలం సరిపోతుందో లేదో చూసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజావ్యతిరేక చర్యలను నిలదీసేది ప్రజాచైతన్యమే. ద్రోహాలు చేస్తూ, చేతగాని ప్రభుత్వాలు నడిపే పార్టీలను ప్రజాచైతన్యమే ప్రశ్నించాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన