బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..


Tue,July 2, 2013 01:35 AM


వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసినారు. రెక్కలు వెనకకు విరిచి కట్టారు. కొన్ని చేతులు నా కడుపును చేతులు పెట్టి పిండేస్తున్నారు. నాకు ఏం జరిగిందో అర్థం కాకముందే నేను చేతుల మీద గాలిలో ఉన్నాను. గొంతు నులుముతున్నారు. ఊపిరి ఆడడం లేదు. చంపేస్తారా? ఇది ఎవరు చేస్తున్నారు? వారెవరో.. ఖాకీ బట్ట ల్లో లేరు. వారు పోలీసులా? కాదా? తరువాత చూస్తే వాళ్లు పొలీసు అధికారులని, మఫ్టీలో ఉన్నారని అర్థమైంది. చుట్టూ ఉన్న నా సహచరులను కొడుతున్నా రు. కొందరిని నేలమీద పడేసి తొక్కుతున్నారు. ఒక మిత్రుడిని రెక్కలు విరిచేసినంత పని చేసారు. ఇంకా చెప్పుకునేందుకు వీలులేని విధంగా కొట్టారు...’ ఇది చలో అసెంబ్లీ కార్యక్షికమంలో పాల్గొన్న ఓ తెలంగాణ కార్యకర్త చెప్పిన కథ కాదు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్వయంగా అనుభవించిన వేదన. చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చిన నాయకుడిగా ఆయన ప్రజాకోర్టు ముందు తనను పోలీసులు ఏ విధంగా వేధించారో వివరించారు. వయసులో పెద్దవాడినని కూడా పరిగణించకుండా గొంతునొక్కడం కింద పడేయడం, ఎత్తిపడేయడం జరిగిందని ఆవేదన చెందారు. ఒక్కడిని పది పదిహేను మంది మఫ్టీ పోలీసులు కింద పడేసి తొక్కడం తానుచూసానని,ఏ ఉద్యమంలోనూ ఇటు వంటి నీచమైన పనులను రక్షక భటు లని పిలువబడే వారెవరూ చేసి ఉండరని కోదండరాం వివరించారు.

మొత్తం జేఏసీ నేతల ఫోన్లన్నీ వరసగా టాప్ చేస్తూ నే ఉన్నారు. తమ లొకేషన్ తెలుసుకోవడం, మాటలు విని వెంటనే కొన్ని చోట్లకు వెళ్లి సోదాలు అరెస్టులు చేయడం సాగించారు. ఇదివరకు అసెంబ్లీ ముందు నిలబడి నినాదాలుచేసే స్వేచ్ఛ ఉండేది. దాన్ని టాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దాకా పరిమితం చేశారు. ఆ తరువాత కనీసం ఇందిరా పార్కు దగ్గర ఎవ్వరి అనుమతీ లేకుండా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎక్కడా ఎవరూ నిరసన చెప్పే హక్కులేదని కోదండరాం బాధ పడ్డారు. విద్యాలయాల్లో ప్రవేశించకూడదని పోలీసులపైన కోర్టునుంచి ఉత్తర్వులు తెస్తే సుప్రీంకోర్టు దాకా పోరాడాలి. ప్రహరీ గోడమీదినుంచి విద్యార్థుల మీద కాల్పులు జరుపుతారు. బాష్పవాయుగోళాలు పేల్చి గుంపును చెదరగొట్టడం, తరువాత మీద బడి కొట్టడం, చుట్టుముట్టడం, కింద పడేసి ప్లాస్టిక్ లాఠీలు విరిగేట్లు కొట్టడం, చెదిరిపోయి సందుల్లో దూరిన వారిని అడ్డుకుని కొట్టి అరెస్టు చేయడం.. జనం మీద ఇంత దౌర్జన్యమా? కాలం తీరిన బాష్పవాయుగోళాలు ప్రయోగిస్తారు. బాష్పవాయుగోళం తగిలి మూర్ఛపోయిన ఉస్మానియా విద్యార్థి కృష్ణా నాయక్ నాలుగురోజుల దాకా స్పృహలోకి రాలేదు.12రోజులు ఆస్పవూతిలో ఉండి అక్కడినుంచి నేరు గా ప్రజాకోర్టుకు వచ్చాడు.

ప్రజాకోర్టు ముందుకు అంతకు ముందు వెల్లడి కాని అనేక అంశాలు, వెల్లడైనా అంతగా మీడియా ముఖం మీదకు రాకుం డా లోపలి పేజీల్లో ‘సింగిల్ కాలం’ నాలుగు వాక్యాలకు పరిమితమైన అంశా లు వెల్లడడైనాయి. ప్రజాఉద్యమం మీద పోలీసులను అణచివేతకు వాడుకున్న వివరాలు ప్రజాకోర్టులో ప్రతిధ్వనించాయి. ఉద్యమాన్ని అణచి వేయడానికి 30వేల మంది పోలీసులను నియమించారు. కాని కావాలని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి పోలీసులను దించడం, తెలంగాణ పోలీసులను కేవలం పై అధికారుల ఆదేశాలను అమ లు చేయడానికి మాత్రమే నియుక్తులను చేయడం, తెలంగాణ వ్యతిరేక కుట్రకు సాక్ష్యం. శ్రీకాకుళం నుంచి వచ్చిన మహిళా పోలీసు అధికారిణి డీఎస్పీ రమాదేవి అమానుషంగా వ్యవహరించారు. ఆమె అధ్వర్యంలో మహబూబాబాద్‌లో మూడురోజుల ముందునుంచే అరెస్టులు చేశారు. తెలంగాణ అంటా రా అంటూ విరుచుకుపడ్డారు. మేం నక్సలైట్లం కాదని చెప్పుకుంటే మీరు నక్సలైట్లయితే కాల్చేస్తాంరా అన్నారు. 230 మందిని బంధించారు. మహబూబాబాద్, కేసమువూదంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ముందు రోజూ హాజరుకావాలని బైండోవర్ చేశారు. ‘రోజంతా దానికే సరిపోతుంది’ అని ఆర్ సత్యనారాయణ అనే లెక్చరర్ (మహబూబాబాద్ వరంగల్ జిల్లా) ప్రజాకోర్టుకు చెప్పారు. తెలంగాణ అని పేరెత్తిన వ్యక్తి భార్యా పిల్లలను రోడ్డు మీద నిలబెట్టారు.

రిటైరైన ఉద్యోగి ఉప్పు సుధాకర్ తనను ‘సీమాంధ్ర పోలీసులు అశోక్‌నగర్ దగ్గర ఎంతో కిరాతకంగా కొట్టార’ని వివరించారు. ‘మెడ బట్టి నొక్కినారు. ఊపిరి ఆడలేదు. చచ్చిపోతానేమోననుకున్నాను. నామివూతులు ఆ చేతిని బలవంతంగా తొలగించారు. నాకు ఆరోజు 68దెబ్బలు తగిలాయి’ అని సుధాక ర్ వివరించాడు. వికారాబాద్ నుంచి వచ్చిన వందమంది గాంధీనగర్ నాలా దాకా చేరుకున్నారు. అక్కడికి వందలాదిమంది పోలీసులు చేరుకుని ‘తెలంగాణా లం... కొడుకుల్లారా చెప్పుతో కొడతాంరా పండ్లు ఊడబీకుతాం రా’ అంటూ విరుచుకు పడ్డారు. ప్లాస్టిక్ లాఠీలు విరిగే దాకా కొట్టారు. ఒక్కడిమీద నలుగురు అయిదుగురు చుట్టుముట్టి కొట్టారని వికారాబాద్ నుంచి వచ్చిన బోడ జంగయ్య ప్రజాకోర్టుకు వివరించాడు. వారం దాటిన తరువాత కూడా జంగయ్య వంటిపై వాతలు కనిపిస్తున్నాయి. ‘ఇప్పడికీ కూచోలేకపోతున్నాను. 12 మంది కలిసి కొట్టారు, రెండు లాఠీలు నా మీద విరగ్గొట్టారు’ అని జంగయ్య చెప్పారు. ‘ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలిస్తావా’ అంటూ తనను ‘వికలాంగుడని కూడా చూడకుండా పోలీసులు బూతులు తిడుతూ కొట్టార’ని సంగాడ్డి నుంచి వచ్చిన సత్తయ్య వివరించారు. ‘స్కూలు టీచర్ వై ఉండి, జై తెలంగాణ అంటవా నీకేం పోయే కాలం అని తనను తిట్టి అరెస్టు చేసార’ని జూన్ 4వ తేదీ నుంచే తమ మీద దౌర్జన్యం చేశారని శుభవూపద పటేల్ చెప్పాడు. మహిళలు, విద్యార్థులు, వయోవృధ్దులు అనే విచక్షణ లేకుండా కొట్టారు. ‘జై తెలంగాణ అంటావా నిన్ను పెళ్లికి పనికి రాకుండా చేస్తారా’ అంటూ కావాలని మర్మాంగాల మీద బూటు కాళ్లతో తన్నారు.

వీరి లక్ష్యం చలో అసెంబ్లీని నిరోధించడం కాదు, తెలంగాణ ఉద్యమకారులపైన బహిరంగం గా ధర్డ్ డిగ్రీ హింస ప్రయోగించడం. వరంగల్ యాకూబ్ రెడ్డిని పోలీసుస్టేషన్లు తిప్పుతూ కొట్టి వెన్నుపూస దెబ్బతీసిన రీతిలో వందలాది మందిని తిప్పుతూ కొట్టారు. ‘నన్ను ప్రతిరోజూ కొడుతున్నారు. నా నడుము మీద ఎక్కి పోలీసులు నిలబడ్డారు. వెన్నుపూస బొక్కలు విరిచారు. పదినిముషాల కన్నా ఎక్కువ నిలబడలేన’ని యాకూబ్ రెడ్డి వివరించాడు. ‘ఎక్కడెక్కడ పట్టుకున్నారో చెప్పలేని స్థితి మాది’ అని వరంగల్ నుంచి వచ్చిన కమీరున్నీసా బేగం, రహీమున్నీసా బేగం ప్రజాకోర్టులో పోలీసులు తమను హింసించిన రీతి వివరించారు. రహీమున్నీసా బేగం మీద దాదాపు 150 కేసులు పెట్టారు. నోటికి వచ్చినట్టు తిట్టడం, బూతులు మాట్లాడడం, శారీరకంగా దౌర్జన్యం చేయడం, జై తెలంగాణ అన్నందుకు చావబాదడం మాకు ఎదురైందని రహీమున్నిసా బేగం చెప్పుకున్నారు. తనపైన 30మంది పోలీసులు దాడి చేశారనీ, ఒక్క ఆడ పోలీసు కూడా లేదని కొట్టరాని చోట కొట్టి, పట్టరాని చోట పట్టి, చెప్పరాని విధంగా కిందపడేసి తొక్కినారని ఆమె వివరించారు. ఇవన్నీ ఇటీవల సవరించిన క్రిమినల్ లా నిర్భయ చట్టం ప్రకా రం లైంగిక నేరాలు. కానీ చేసిన పోలీసులు ఎవరో తెలియదు, వారి పైన ఏ పోలీసులకు ఫిర్యాదుచేయాలో తెలియదు. ఏ పోలీసులు ఏ విధంగా దర్యాప్తుచేయగలరో వారిని చేయనిస్తారో తెలియదని ఆమె వాపోయారు.

‘బడులు తెరుస్తారు కనుక నేను చలో అసెంబ్లీలో పాల్గొనడం లేద’ని మంచిర్యాల గురిజాల రవీందర్‌రావు రాసిచ్చినా తనకు బెదిరింపులు, నిఘా, చుట్టూ పోలీసులు ఉండడం, మూడురోజుల ముందునుంచే పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలనడం, స్కూలు బస్సును తెలంగాణ వారికి ఇవ్వకూడదని బెదిరించారు. డ్రైవర్ భార్యను కొడుకును అరెస్టు చేశారు. ఈ విధంగా హింసించే అధికారం పోలీసులకు ప్రజావూపాతినిధ్య ప్రభుత్వనేతలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇది సాధారణ న్యాయస్థానంలో వాదించలేని నేరం. మానవహక్కుల ఉల్లంఘన. సిరిసిల్ల నుంచి వచ్చిన సుమలతా శర్మ (టీఆర్‌ఎస్ కార్యకర్త) బేగంపేటలో ఉంటున్నారు. జూన్ 12న ఉదయం 11 నుంచి 2 వరకు ఆమె ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పదినిముషాల్లో పంపుతామని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తరువాత మూడురోజులు ఇక్కడే ఉంచుతాం అన్నారు. అక్కడ వాతావరణం అసహ్యంగా ఉంది. రాత్రి పదిన్నర దాకా అక్కడే ఉంచి, అసెంబ్లీ దరిదాపుల్లో కనిపించరాదని బెదిరించి పంపారు. మళ్లీ తెల్లారగానే 5గంటలకు స్టేషన్ రావాలని వత్తిడి మొదలు పెట్టారు. బోయినపల్లి పోలీసు స్టేషన్, తరువాత మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.14 సా యంత్రం 7.30గంటలకు విడుదల చేశారు. తిండి లేదు, ఇతర కనీస వనరులు లేవు.దుర్భాషలు, అవమానకరంగా వ్యవహరించడం వారికి మామూలై పోయిందని సుమలతాశర్మ వివరించారు.

తమను పూజలు, వంటలు చేసుకోనివ్వలేదని సుమలత వివరిస్తే, ఉస్మానియా నుంచి, అసెంబ్లీ దారిలో అనేక చోట్ల వేలాదిమందిని శుక్రవారం నమాజు చేసుకోనివ్వలేదని హమీద్ మహ్మద్‌ఖాన్ వివరించారు. రాజకీయ ఉద్యమాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం, పోలీస్ యం త్రాం గం కఠినంగా వ్యవహరించడం, శాంతి భద్రతలు కాపాడడం లేదా ప్రభుత్వ ఆదేశాలను పాటించడం పేరిట రాక్షసంగా వ్యవహరించడం ఏ చట్టం ఆమోదిస్తుంది? తెలంగాణ ఉద్యమంలో 1969లో వందలాది మం దిని చంపడం కన్న, వేయిమంది ఆత్మహత్యలకు పరోక్షంగా కార ణం కావడం కన్న, మిలీనియం మార్చ్, తదితర కార్యక్షికమాలను ఎదుర్కోవడానికి పన్నిన వ్యూహా ల కన్న, చలో అసెంబ్లీ సందర్భంలో అనుసరించిన పద్దతులు దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగానికి, చట్టాలకు, హక్కులకు, ప్రజాస్వామ్యానికే కాకుండా కనీస మానవ విలువలకు కూడా భంగకరంగా వ్యవహరించారని అర్థమవుతున్నది. బూట్లు, బూతులు, లాఠీలు నిర్బంధాలు, నిరసన గొంతుమీద కాంగ్రెస్ ఆదేశాలతో గొంతు నొక్కే పోలీసు చేతులు చేసింది.. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ జనం మీద జరిగిన దాడి. విద్వేషం, విధ్వం సం హింసను ప్రయోగించి పోలీసుల్లో తెలంగాణ వ్యతిరేక ద్వేషాన్ని పెంచి పోషించి ప్రభుత్వం ఏ రకంగా విజయం సాధించినట్టు?

బాంబే నూలుమిల్లులో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపినపుడు కార్మికు లు చనిపోయిన సంఘటనను విచారించిన త్రిసభ్య సంఘం నివేదికను బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మార్చ్ 1939లో చర్చించినపుడు డాక్టర్ అంబేడ్కర్ అన్న విషయాలు గమనిద్దాం. ‘చట్టం దృష్టిలో సాధారణ పౌరుడు, పోలీసుఅధికారి, మిలిటరీఅధికారి సమానమే. రాజ్యాం గ పాలనా శాస్త్ర నిపుణుడు ఎ.డి.డైసీ పోలీసు మిలిటరీ అధికారుల పరిమితుల గురించి వ్యాఖ్యానిస్తూ .. వీరు పై అధికారులు కాల్చమని ఉత్తర్వలు ఇచ్చినపుడు వాటిని పాటించకపోతే కోర్టు మార్షల్‌ను ఎదుర్కొనాలి. కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీస్తే న్యాయస్థానంలో నిందితులుగా నిలబడాల్సి వస్తుంది. నూలు మిల్లు దగ్గర సమ్మెచేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారికి ఇతర పోలీసులకు 200 రూపాయలు ఇచ్చినట్టు ఖచ్చితమైన సమాచారం నాదగ్గర ఉంది. కాల్పులు జరగడానికి కారణం శ్రామికుల అనుచిత ప్రవర్తన కాదు, మిల్లు యాజమాన్యం ప్రోత్సాహమే. అలజడిని అరిక కు రాజ్యానికి స్వేచ్ఛ స్వాతంవూత్యాల పట్ల గౌరవం ఉండనక్కర లేదా, మనం కోరుతున్న స్వయంపాలన అంటే స్వేచ్ఛ స్వాతంవూత్యాలతో నిమిత్తం లేకుండా మన మంత్రులే మన ప్రజలను చంపే పాలనైతే అంతకన్నా దారుణమైన విషాదం మరొకటి ఉండదు. పొగలోంచి సెగలోకి పోయినట్టు అటువంటి స్వయం పాలన మన పాలిటి శాపంగా మారుతుందనడంలో నాకే సందేహం లేదు.

మనం స్వేచ్చా స్వాతంవూత్యాలకు చట్టబద్ద పాలనకు విలువనివ్వాలి’. 1939 నాటి ఈ అంబేడ్కర్ మాటలు 2013లో మన సర్కారుకు కూడా వర్తిస్తాయని వేరే చెప్పనక్కర లేదుపై అధికారులు అరెస్టు చేయమన్నారు కనుక చేస్తున్నాం అని ప్రతిపోలీసుఅధికారి చలో అసెంబ్లీ సందర్భంలో అన్నాడు. అది నిజం కూడా. ఈ పై అధికారి ఎవరు? డీజీపీయా లేక వారిపైన ఉన్న మంత్రా, ముఖ్యమంత్రా లేదా వారిపైన ఉన్న మరో శక్తా? తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సాగిన హింసాకాండ అధికార పార్టీని, ప్రభుత్వాన్ని సిగ్గుతో తలదించుకునేట్టు చేయాలి. కాని వారు సగర్వంగా విజయం సాధించినట్టు చెప్పుకుంటున్నారు. జూన్ 29న ప్రజాకోర్టు ముందుకు వచ్చిన కొన్ని వాస్తవాలు ఆరోజు అక్కడున్న వారి చేత కంట తడి పెట్టించాయి. బ్రిటిషర్లు, నిజాం నవాబుల కన్న దారుణమైన రీతిలో ప్రజా ప్రభుత్వం వ్యవహరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే అరెస్టులు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు వేసే నాడే వేలాది మందిని ఏ కేసూ లేకుండా ఎవరు అరెస్టు చేస్తున్నారో తెలియకుండా నిర్బంధించడం జరిగిపోయింది. ఇక్కడ పోలీసులు హింసతో బూతులతో బూటు కాళ్లతో ఉద్యమంలో పాల్గొన్న నేతలమీద, కార్యకర్తల మీద రాజ్యాంగ నేరాలు సాగించారు. డయ్యర్ బుల్లెట్లతో ప్రాణాలు తీస్తే వందేళ్ల స్వతంత్ర ఉద్యమ చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బూట్లతో ఉద్యమాన్ని కాల రాయడం సిగ్గుచేటు. ప్రజాకోర్టులో ప్రజాస్వామ్య ప్రభుత్వం సందేహాతీతం గా దోషి అని రుజువైందని తీర్పు రాసుకోవలసిందే (అసలు కోర్టు తీర్పులకే అమలు దిక్కు లేదు, దీన్నెవరడిగారు?)

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త
(చలో అసెంబ్లీ అణచివేతపై జూన్ 29న ప్రజాకోర్టు జడ్జిగా వ్యవహరించారు)

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన