తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి


Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రాజకీయాలకు ప్రజా వ్యతిరేక దిగజారుడు తత్వాని కి నిదర్శనం అనుకోక తప్పదు. తెలంగాణ పట్ల ఆవేదన ఉన్న కొందరు విద్యావంతులు కేంద్ర మంత్రి వర్గంలో క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్న తెలంగాణ ప్రజావూపతినిధి జైపాల్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ కోసం కృషి చేయండి. మీ అధిష్ఠాన వర్గాన్ని ఒప్పించి తెలంగాణ సాధించండి లేదా మంత్రి పదవి వదలి పోరాటంలో చేరండి అని డిమాండ్ చేశారు. యువ మేధావిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జైపాల్ రెడ్డికి మంచి పేరున్నది. యూపీఏ ప్రభుత్వంలో ఉంటూ కూడా అవినీతి మచ్చలు అంట ని మంత్రి ఆయన. కాంగ్రెస్ పార్టీలోనే చాలాకాలం కొనసాగినా ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం జనతాపార్టీలో పోరాడిన రాజకీయ నాయకుడిగా, వక్తగా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి జైపాల్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకుంటున్న నేతలలో ఆయన ఒకరు. అధిష్ఠాన వర్గానికి సన్నిహితుడైనా, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్నా ఆయన మౌనంగా ఉంటున్నారనే విమర్శ, ఆవేదన తెలంగాణవాదుల్లో ఉన్నది. ఆ అభివూపాయాన్నే ఈలేఖలో తెలంగాణవాదులు వ్యక్తం చేశారు. వీపీ సింగ్ కాలంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలలో సమాచార మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి ప్రసారభారతికి ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ ఇవ్వడానికి చట్టాలు చేయడంలో కీలకభూమిక వహించారు. పత్రికా స్వేచ్ఛ, ప్రజానుగుణపాలన, ప్రజాస్వామ్య సిద్ధాంతాల గురించి పోరాడిన జైపాల్ రెడ్డి, తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షల గురించి పట్టించుకోవడం లేదా, ఇంకేమయినా ప్రతిబంధకాలు ఉన్నా యా? దారితప్పిన అధికారం, అవినీతి చుట్టూ తిరుగుతున్న రాజకీయాల పట్ల అనేకసార్లు తన వ్యతిరేకత వ్యక్తం చేసిన జైపాల్ రెడ్డి, ఒక్కోసారి విరక్తి కూడా ప్రకటించారు. మళ్లీ ఎన్నికల బరిలో దిగడం గురించి కూడా విముఖత ప్రదర్శించారు. తెలంగాణ కోసం పుష్కర కాలం నుంచి సాగుతున్న ఉద్యమం జైపాల్ రెడ్డి వంటి నాయకులను కదిలించడం లేదా లేక ఆయనే ఉద్యమానికి ఆకర్షితుడు కాలేకపోతున్నాడా అని ప్రశ్న తపూత్తుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని 2009 డిసెంబర్ 9న ప్రకటించిన ఆనాటి హోమంత్రి చిదంబరం ఆ తరువాత పార్లమెంటు ఉభయ సభల్లో అధికారికంగా ప్రకటించి కూడా అమలు చేయకపోవడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లేదని, అది అన్యాయమని జైపాల్ రెడ్డి గారికి అనిపించడం లేదా? డిసెంబర్ 2012లో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నెలలోగా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పి ఎగవేయడం అసమంజసమని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మరొక మోసం అని తెలియడం లేదా? అయినా మౌనంగా భరించడం ఎందుకు అనే ఆలోచనే జైపాల్ రెడ్డికి విద్యావంతులు కొందరు ఈ బహిరంగ లేఖ రాయడానికి కారణం. సన్నిహితంగా ఉండి లోపలనుంచి తెలంగాణా పట్ల సానుకూల నిర్ణయం సాధించడానికి ప్రయత్నించడమో లేక బయటకు వచ్చి ఉద్యమాల ద్వారా వత్తిడి పెంచడమో ఎందుకు చేయడం లేదు. ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేయండి. తెలంగాణ పోరాటానికి కొత్త ఊపు ఇవ్వడానికి ప్రయత్నించండి. నెహ్రూ తెలంగాణ ఆంధ్ర కలయిక ఒక ప్రయోగ మే అని, అది కుదరకపోతే విడిపోవచ్చుననీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉంది. విలీనాని కి ముందున్న తెలంగాణను హైదరాబాద్ రాజధానిగా వేరు చేయడం సమంజసమే అని కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాలు ఎన్నికల అవగాహనలు. కమిటీ నివేదికలు. ప్రకటనలు. ప్రసంగాలు అనేకం సమర్థిస్తున్నాయి. కాని వాటినన్నింటినీ కాదని, పైరవీలకు లొంగిపోయి ప్రజలకిచ్చిన మాటను తప్పడం మీకు బాగనిపిస్తున్నదా? లేకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదు? అని లేఖలో అడిగారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి, ప్రజల ఆకాంక్షలతో ఆవేదనలతో చెలగాటమాడుతున్నదనీ కాంగ్రెస్ పార్టీ అసలు రంగులు బయటపడ్డాయని, ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎవరూ నమ్మడం లేదని వారు హెచ్చరించారు. ఈ విధంగా పదేపదే కాంగ్రెస్ తెలంగాణను మోసం చేయడానికి కారణం-తెలంగాణ వ్యతిరేకుల పైరవీ, డబ్బు, ప్రలోభాలు బెదిరింపులూ కూడా. వాటితో పాటు తెలంగాణ ప్రజావూపతినిధులు పూర్తిగా లొంగిపోవడం ఏమాత్రం ఆత్మగౌర వం లేకుండా అధికారం కోసం అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తడం మరొక కారణం.

నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి యూపీఏ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్న తరువాత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 వరకు 13 మంది ప్రాణాలు తీసుకున్నారు. అంతకు ముందు డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనను ఉల్లంఘించిన తరువాతనే తెలంగాణ యువకుల ఆత్మార్పణ మొదలైంది. కాంగ్రెస్ వారి బాధ్యతారహిత అన్యాయా లే తెలంగాణలో వేయిమంది ఆత్మహత్యలకు కారణాలు. మాటతప్పినందుకు నిరాశ పడిన వారు ప్రాణాలు సైతం తీసుకున్నారంటే వారి నిస్పృహ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయనుకోవడం ఎంత తప్పుడు అంచనా అని అర్థం చేసుకుంటారా? ఇటీవల పి సి చాకో అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతారహితంగా అసందర్భంగా, తెలంగాణ యూపీఏ ఎజెండాలో భాగం కానే కాదని చేసిన ప్రకటన బహుశా నిజం కావచ్చు. అందుకు నిరాశ చెందిన యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవూపాణం పోయిన తరువాత చాకో మాట మార్చడం అతని బాధ్యతారాహిత్యానికి ఉదాహరణ. ప్రజావూపభుత్వంలో ఈ విధంగా ప్రజలను చంపుకుతినే ప్రతినిధులు అధికార ప్రతినిధులుగా చెలామణి కావడం అన్యాయం. జైపాల్ రెడ్డి నియోజక వర్గం నుంచి ఒక యువకుడు యాదిడ్డి ఈనెలలోనే బయలుదేరి డిల్లీచేరుకుని పార్లమెంటు దగ్గర ఆత్మాహుతి చేసుకున్నాడు. తన ఆత్మహత్యా లేఖలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు కూడా రాసుకున్నాడు. కావూరి, లగడపాటి తదితర ఎంపీలతో పాటు చాకో, రేణుకా చౌదరి వంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు ప్రజల ప్రాణాలంటే విలువ లేదు. మాటలతో చంపగల క్రౌర్యం వీరికే చెల్లు. తెలంగాణ నేలపై ఉంటూ వనరులను, నీళ్లను, భూములను ఆక్రమించి, తెలంగాణ పట్ల ద్వేషాన్ని గుమ్మరించే ఈ నాయకుల పక్కన కూర్చుని అధికారాన్ని పంచుకొనే వారి సంగతేమిటి. జైపాల్ రెడ్డి వంటి మంత్రులు ఈ అన్యాయాలను ఎందుకు, ఏ విధంగా భరిస్తున్నారు, ఎంత కాలం భరిస్తారు? అన్నది ప్రశ్న. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి జైల్లో కూచున్న అవినీతి రాజకీయ నేరగాళ్ల కన్న మౌనంగా మాటలతో తెలంగాణ ప్రజల చేత ఆత్మహత్యచేయిస్తున్న దుర్మార్గ రాజకీయాలను భరించడం తీవ్రమైన నేరమే. వారే తెలంగాణ వారిని చూసి అవమానకరంగా నవ్వుతున్నారు. మానావమానాలు వీరి ఆత్మగౌరవం మాటేమిటి అన్నది మరొక ప్రశ్న.

తెలంగాణ వ్యతిరేకులైన కోస్తాంధ్ర పైరవీకారుల కన్న తెలంగాణ పక్షాన కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గాలలో కొనసాగే ప్రతినిధులు తమ ప్రజల ఆకాంక్షలను సరిగ్గా ప్రతిబింబించకపోవడం వల్లనే తెలంగాణ ఏర్పడడానికి వూపతికూలం అవుతున్నదని ఇక్కడి ప్రజలు ఒక నిర్ణయానికి రాకతప్పడం లేదని ఈ లేఖలో పేర్కొన్నారు. ఉన్నత అధికార పదవుల్లో ఉన్న తెలంగాణ నాయకులు ఘోరంగా వైఫల్యం కావడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని కూడా నమ్ముతున్నారు. అయితే ఈ నాయకులు ఇప్పడికీ తెలంగాణకు చేస్తున్నవూదోహం వదిలేసి తెలంగాణ రుణం తీర్చుకునే మంచి పని చేసే అవకాశం ఒకటి ఉన్నది.అదే మంత్రి పదవులను వదిలేసి తెలంగాణకోసం పోరాడడం. ఢిల్లీ, హైదరాబాద్‌లలో తామెక్కిన గద్దెలు దిగడం ద్వారా తెలంగాణ ద్రో హం చేస్తే సహించేది లేదని అందుకే ప్రభుత్వాల నుంచి వైదొలగుతున్నామని ఒక పటిష్ట సందేశం అధిష్ఠానానికి అందుతుంది. వీరు మంత్రి పదవుల్లో ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏదోరకంగా మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్టీ వ్యూహకర్తలు నమ్మే పరిస్థితి ఉంటుంది. మంత్రి పదవుల్లో వీరు కొనసాగడమే తెలంగాణ సాధనకు కీలకమైన అవరోధం అవుతున్నది. జైపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే, రాష్ట్రంలో మంత్రి పదవుల్లో వెలుగుతున్న అమాత్యులు కొందరైనా సిగ్గుపడి తొలిగే అవకాశం ఉన్నది. రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉన్నది. రాబోయే ఎన్నికల సందర్భంగా తెలంగాణను అలక్ష్యం చేయడానికి కాంగ్రెస్ భయపడే పరిస్థితి వస్తుంది. లేకపోతే కేంద్రంలో జైపాల్ రెడ్డి కొనసాగడం లేదా మేమెందుకు రాజీనామా చేయాలి అనే వాదించే తెలివితేటలు చాలా ఉన్నాయి. జైపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటే సీమాంధ్ర పైరవీకారులకు పైరవీ చేసేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టు సంకేతాలు అందుతాయి అని కూడా వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

జైపాల్ రెడ్డి ఇంకా మంత్రివర్గంలో కొనసాగితే వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు కూడా భంగకరమని, ఆయన వ్యక్తిత్వానికి అది వ్యతిరేకమనే అభివూపాయాన్ని కూడా ఈ లేఖలో తెలిపారుఅంతా ప్రశాంతంగా ఉన్నపుడు ప్రజాస్వామ్యం, విలువలు, సిద్ధాంతాల గురించి భారీ ఎత్తున గంభీరమైన ఉపన్యాసాలు ఇవ్వడం వేరు. అవసరం ఉన్నపుడు ప్రజల పక్షాన నిలబడడం వేరు. ఉద్యమానికి తోడ్పడి చరివూతలో నిలిచిపోవడమో లేక పదవులే పరమావధిగా భావించి అధికారం చివరి క్షణం దాకా అనుభవించాలనుకుని చరివూతలో కలిసిపోవడమో మంత్రులు నిర్ణయించుకోవాలని జనం పదేపదే అడుగుతున్న దశ ఇది. తెలంగాణ జేఏసీ అసెంబ్లీ మార్చ్ పిలుపు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి పదవులు వదులుకోవాలని ఈ లేఖలో జైపాల్ రెడ్డిని కోరారు. లేకపోతే తెలంగాణ ద్రోహిగా జనం భావించే ప్రమాదం ఉన్నదని, ఆ అపకీర్తి జైపాల్ రెడ్డికి రాకూడదని తాము కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆలస్యానికి తెలంగాణ వ్యతిరేకుల ఐక్యత, డబ్బు, పైరవీ సామర్థ్యం ఎంత కారణమో తెలంగాణ నాయకుల అనైక్యత, అధికార ప్రీతి, స్వార్థం కూడా అంతే బలీయమైన కారణం. తెలంగాణ ఓటర్లకు అబద్ధపు హామీలు ఇచ్చి, తెలంగాణకు మేం అనుకూలం అని కొందరు, తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అని మరికొందరు మభ్య పెట్టి గెలిచి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి పదవులు సంపాదించి ఎన్ని అన్యాయాలు జరిగినా అధికారంలో కొనసాగితే ఆ అన్యాయాలను ఆమోదించినట్టే. దురదృష్టవశాత్తూ తెలంగాణ ప్రజలు అందరివూదోహాలకు గురైపోతున్నారు. తెలంగాణ వ్యతిరేకుల ద్రోహాలు, మోసాలు, ఒప్పందాల ఉల్లంఘనలు, వనరుల మళ్లింపులు చేయడమేగాక పదేపదే ఆఖరి తేదీలని ప్రకటించి ఉద్యమాలను చల్లార్చే కుట్రలనుకొనసాగిస్తూ ఉంటే వాటిని ఎదుర్కొంటున్నారు. వారికన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే చేస్తున్న పెద్ద ద్రోహాలను కూడా జనం ఎదుర్కొనవలసి వస్తున్నదని ప్రజలకు తెలియజేయ వలసిన అవసరం వచ్చింది.

తెలంగాణ పేరు చెప్పి ఓట్లకు వచ్చే పార్టీలు అభ్యర్థుల మోసాలను, కుట్రబుద్దులను జనం గమనించాలి. తెలంగాణ కోసమే జనం ముక్తకం నినదిస్తున్నారని చెప్పడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా వినియోగించుకోవడం ఒక ప్రయత్నం, ఈలోగా తెలంగాణ ప్రజావూపతినిధులకు కొంత సిగ్గు తెప్పించడం ఒక వ్యూహం అవుతుంది. తెలంగాణ ఆత్మహత్యలను ద్రోహులు, స్వార్థ పరులు పట్టించుకోవడం లేదు. వారిలో చలనమే కలగడం లేదు. మరి తెలంగాణవాదులు కూడా ఎందుకు కదలడంలేదు? దీన్నుంచి మనం తెలుసుకోవలసిన అంశాలు రెండు. ఆత్మహత్యలు ఎవరినీ కదిలించవు కనుక ఆత్మహత్యలు చేసుకోకూడదనేది ఒకటవ పాఠం. జనం ఆత్మహత్యచేసుకుంటున్నా పట్టించుకోని వాడు నాయకుడు కాదు, వారిని ఓటర్లు పట్టించుకోకూడదను అనేది రెండవదిపాంతేతరుడే ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తం అని కాళోజీ నారాయణ రావు చాలా ఆవేశంతో ఉద్యమ సమావేశాల్లో గేయం వినిపిస్తుంటే చప్పట్లు మార్మవూమోగేవి. కవిత గేయమయితే ఫరవాలేదు కాని ఆ విధంగా చేయడం సాధ్యం కాదు. చేయకూడదు కూడా. ఎవరూ ఎవరికీ ద్రోహం చేయకూడదు. కాని చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవులు వదలండి అని జైపాల్‌రెడ్డికి లేఖ రాసిన వారిలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ రమామేల్కోటే, డాక్టర్ గోపాల కృష్ణ, ఎం వేదకుమార్, మహబూబ్ ఆలంఖాన్, జహీరుద్దీన్ అలీ ఖాన్, ప్రొఫెసర్ శ్రీధర స్వామి, ప్రొఫెసర్ ఇ రేవతి, ప్రొఫెసర్ బూర్గుల నర్సింగ్‌రావు, ప్రొఫెసర్ హరినాథ్ పొలాస, ప్రొఫెసర్ జి లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరడ్డి, డిపిరెడ్డి, డాక్టర్ బిక్షం గుజ్జా, ఆర్. శైలేశ్‌రెడ్డి ఈ రచయిత కూడా ఉన్నారు.

పొఫెసర్ మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles