చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట


Mon,May 20, 2013 11:53 PM

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడతారు. ఒక్కరే రెండు రకాలుగా మాట్లాడతారు. కాదంటారు. చివరకు మీడియా వక్రీకరించిందంటారు. అస్పష్టత, కట్టుబాటు లేమి, అవకాశవాదం, ఒత్తిడులకు లొంగే బలహీనత కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇంకోసారి కొత్త మాట చెప్పింది. తెలంగాణ విషయం రాష్ట్రస్థాయిలోనే తేలాలని పార్టీ అధికారిక ప్రతినిధి పీసీ చాకో వెల్లడించారు. ఆ విషయం ఢిల్లీ చెప్పాల్సిందే మరి. జనవరి 2013లో చాకో చెప్పిన మాట: ‘తెలంగాణ విషయలో కాంగ్రెస్ అనుకూలంగా ఉంది.

ఎప్పుడనేదే తేలవలసింది. రాజ్యాంగపరమైన ఆధారం ఉండాలి. ఆ ప్రక్రియను ప్రస్తుతం ముగించాల్సి ఉంది’. అప్పుడు కొత్తగా హోంమంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే నెలరోజుల్లో ఏ విషయం వెల్లడిస్తామని చెప్పిన నాటి పరిస్థితుల్లో పీసీ చాకో రాజ్యాంగ వూపక్షికియ మాత్రమే పూర్తి కావలసి ఉందన్న అభివూపాయాన్ని వెల్లడించారు. దానికి పూర్తిగా భిన్నంగా మే 18న చెప్పిన మాట: ‘తెలంగాణ విషయం యూపీఏ జాతీయ ఎజెండాలో లేదు. అది రాష్ట్ర వూపభుత్వానికి సంబంధించిన విషయం’. మే 19న చెప్పిన మాట: ‘తెలంగాణ పూర్తిగా యూపీఏ ఎజెండాలోఉంది. చర్చల వూపక్షికియ ముగియగానే నిర్ణయిస్తాం’. మానిఫెస్టోలో లేదన్నాను. మీడియా వక్రీకరించింది.

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ అది కచ్చితంగా కేంద్రానికి సంబంధించిన విషయమే కాదని చాలా స్పష్టంగా చెప్పారాయన. మార్చకముందు చాకో చెప్పిన ఈ మాట స్పష్టంగాచెప్పాలని ఎవరు ఆదేశించారో? తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, అన్ని రాజకీయపార్టీలు ప్రాంతీయపరంగా చీలిపోయినాయని చాకో కొత్తగా వక్కాణించారు.

ముఖ్యమంత్రి రాజధానిలో కళంకిత మంత్రుల విషయంలో తీసుకోవలసిన చర్యల గురించి మూడు రోజుల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోనూ ఇతర అధిష్ఠాన వర్గం నేతలతోనూ చర్చించిన తరువాత పిసి చాకో అటువంటి వాఖ్యానాలు చేయవలసి వచ్చిందని ఏఐసీసీ ఒక ప్రకటన జారీ చేసింది. ఇది వివరణా కాదు, ఖండనా కాదు. తెలంగాణ విషయం రాష్ట్ర పరిధిలో ఉంది అనేమాటను అట్లానే వదిలేసిందా తరువాతి ప్రకటన. తెలంగాణలో మంటలు రేగిన తరువాత, ముగ్గురు ఎంపీలు 30వ తేదీ గడువు పెట్టి పార్టీ వదిలేస్తాం అని హెచ్చరించిన తరువాత మీడియాను నిందిస్తూ మాట మార్చారు. తెలంగాణే కాదు, ఏ విషయమైనా రాష్ట్రస్థాయిలో తేల్చ డం సాధ్యమా? రాష్ట్ర స్థాయిలో కీలకమైన నిర్ణయాలు చేసే అధికారం ఇక్కడి ప్రజావూపతినిధులకు ప్రజాస్వామ్య పరంగా ఉండాలన్నది సూత్రం. లేదన్నది నిజం.

పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ విషయం రాష్ట్ర పరిధిలో లేదని, రాష్ట్ర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 22న జరుగుతున్నా అందు లో తెలంగాణ విషయం చర్చకు రాదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనేది ఎట్టి పరిస్థితిలో కేంద్రం తీసుకోవలసిన నిర్ణయమే అని మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోవలసి రావడం మన నేతల వివేక స్థాయికి నిదర్శనం. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గ త వ్యవహారం కాదు. యూపీఏ ప్రభుత్వానికి సంబంధించింది. యూపీఏకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ తన ఆ నిర్ణయానికి సాచివేత ధోరణి లేదా ఎవరి ఒత్తిడికి లొంగడమో చేస్తున్నందువల్ల ఎవరైనా ఏదైనా చెప్పే పరిస్థితి వ్యాపించింది. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తెలంగాణ విషయంలో గందరగోళం అయోమయం సృష్ఠించండి అని పాలసీని నిర్దేశించి ఉంటుంది.

వాయిదా వేయడాన్ని మించిన రాజకీయ నిర్ణయం వారికి తోచడం లేదు. గందరగోళమే ఒక విధానంగా అమలు చేస్తూ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నట్టుంది. తెలంగాణ విషయమే కాదు కళంకిత మంత్రుల విషయం కూడా రాష్ట్ర పరిధితో లేదు. ఢిల్లీ ఆదేశించిన తరువాత వారిద్దరినీ పిలిపించుకుని రాజీనామాను అభ్యర్థించారు. అందాకా ఆ ఇద్దరు మంవూతులు 420 కేసులో నిందితులుగా ఉండడం, శిక్షపడిన మరో మంత్రి కేబినెట్‌లో ఉండడం అవమానకరమైన అంశం. లోకాయుక్త సాక్ష్యాలతో సహా పట్టుకున్న యడ్యూరప్పను చాలాకాలం భరించిన బీజేపీ కర్నాటకలో ఘోరపరాజయం పాలైంది. ఓట్ల ను కులాలుగా విభజించే విధానాలు పాటించిన పార్టీలను పరాజయం చేసే చైతన్యం అవసరం. నిందితులైన మంత్రులను చివరిదాకా పోషిస్తూ కాంగ్రెస్ అదే దారిలో పయనిస్తున్నది.

కాంగ్రెస్‌లో కేవలం నిందితులైన మంత్రులే తప్పుచేశారనే భావన లేదు. వారు ఏ తప్పూ చేయని వారనే నమ్మకం కొందరికి ఉన్నది. వారు కళంకితులైతే కళంకం మొత్తం పార్టీకి వ్యాపించి ఉంది. రాజశేఖరరెడ్డిని ముఖ్యమంవూతిగా నియమించి ఆయన ద్వారా అన్ని లాభాలు పొందిన కాంగ్రెస్ పార్టీకి, ఆ విషయం తెలిసి ఆయన ఎక్కడ పెట్టమంటే అక్కడ ఫైళ ్లపైసంతకాలు చేసిన మంత్రులు, ఏం చేయమంటే అది చేసిన ఎమ్మెల్యేలు, ఎటువంటి నివేదికలు రాయాలంటే అటువంటివి రాసిన అధికారులు, వీరంతా కలసి రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములు, నీళ్లు, బొగ్గు, ఇనుప గనులు వంటి ఎంతో విలువైన వనరులను ధారాదత్తం చేసిన అధికార యంత్రాంగం, జీవోల మీద సంతకం చేసిన అధికారులు అందుకు అనుమతించిన మంత్రులు, మొత్తంగా ఆమోదించిన మంత్రివర్గం, అందువల్ల లాభాలు వచ్చినా రాకపోయినా వాటాలు అందినా అందకపోయినా అందులో ఉన్న ప్రతివారు కళంకితులే. తెలంగాణను మోసం చేయడంతో సహా పదేళ్ల కాంగ్రెస్ పాపాలే ఇవన్నీ. ఇందులో ఒకరిద్దరిని మాత్రమే కళంకితులనడం అవివేకం.

కళంకితులైన మంత్రుల ఆవేదన కూడా అదే. ఫైళ్లో ఉన్న నిర్ణయాల వల్ల, ముఖ్యమంత్రి కుమారుడు లాభం పొందే అవకాశం ఉందని తమకు సంతకం చేసేముందు తెలిసే అవకాశం లేదని, తరువాత ఆ ఫైళ్లు, సంతకాలు జీవోల వల్ల గనులు భూము ల బదిలీల వల్ల వారికి లాభం చేకూరితే తమ నేరం ఏమిటని కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన, సబితా వాదిస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి వాదన కూడా అదే. అయి తే చదువుకున్న వారు, సంతకాల పర్యవసానాలు తెలిసిన వారు, మంత్రులు గా తమ పరిమితులు, అధిష్ఠానం అనుమతులు అన్నీ అర్థమైన వారు ఇవన్నీ బయటకు తెలిసినప్పుడు కదా అని భవిష్యత్తు పరిణామాలకు ఆలోచనను వదిలేసి, పదవులు వదలకుండా సంతకాలు చేసినప్పుడు ఏంచేస్తారు? కళంకం వారి కే పరిమితమా లేక ఆ కళంకం అధిష్టానికి అంటదా అని వారూఅడుగుతున్నారు. వినడానికి బాగానే ఉన్నా ఇది చట్టం కోర్టు ఆమోదించే వాదం కాదు.

కాంగ్రెస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి. సీబీఐని శాసించి వారిమీద కేసులు తీసి వేయించే అవకాశం లేదు. ఇంకామిగిలిన ముగ్గురు నలుగురు మంత్రుల మీద ఆరోపణలు వస్తే అవి అభియోగాలయితే, ఛార్జిషీట్లుగా మారి వారికి కూడా నిందితుల నెంబర్లు తగిలితే మంత్రివర్గం ప్రతిష్ట మరింత దిగజారిపోతుంది. ఎన్నికల ముందు క్షీణదశ గురించి భయపడుతుండడం వల్ల రాష్ట్ర ముఖ్యమంవూతికి వారి రాజీనామాలు సేకరించే అధికారం, అనుమతి ఢిల్లీ ఇచ్చింది కేంద్రంలో ఇద్దరు మంత్రులను వదులుకోకపోతే ప్రధాని పీఠానికే ఎసరు వస్తుందని తెలుసుకుని రాజీనామా చేయాలని వారిని ఆదేశించిన వీరిద్దరిని భరిస్తే కళంకం తమది కూడా అని జనానికి తెలుస్తుందన్న భయంతో పార్టీని అధిష్ఠానవర్గంతో సహా పతనానికి నడిపిస్తుందని ఆలస్యంగా ఉదయించిన వివేకంతో రాజీనామాలకు సేకరించారు.

అంటే రాష్ట్రంలోజీవోలపై సంతకాలతో మొదలై రాజీనామాల దాకా ఒక్క మంత్రి, ఒక్క నింద ఒక్క కేసు కూడా కేంద్రం అనుమతి లేకుండా, సోనియా ఆశీస్సు లేకుం డా జరగలేదని అర్థం, అటువంటిది తెలంగాణ విష యం రాష్ట్రానికి వదిలేస్తారా?

తెలంగాణపై అస్పష్ట విధానాలను అమలు చేయడం లో కాంగ్రెస్, టీడీపీలు దొందూ దొందే. మంత్రులను మాత్రమే నిందించడం, వారిని తొలగించాలని ఉద్యమించడం టీడీపీ అధికార పార్టీకి చేస్తున్న మేలు. ఇప్పు డు కాంగ్రెస్ తన మచ్చ తొలంగించుకున్నట్టు చెప్పుకోవచ్చు. టీడీపీ తానే ఒత్తిడి పెంచి కాంగ్రెస్ మెడలు వంచినట్టు చెప్పుకోవచ్చు. ఇది కూడా బహుశా ఢిల్లీ స్థాయిలో ఇద్ద రూ చేసుకున్న వ్యూహ రచన కావచ్చు. ఆ విధంగా కాంగేయుల కళంకం భాగాన్ని తెలుగుదేశం పార్టీ కొంత తన ఖాతాలో వేసుకున్నది. తెలంగాణ వాదం, రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌పార్టీ ప్రభావం తమ మనుగడను సవాలు చేసే విషయం ఈ రెండు పార్టీల కు అర్థమైంది. కనుక ఇద్దరు కలిసి అనుకున్న వ్యూహాలను విడివిడిగా పాటిస్తున్నారు. అస్పష్టత వారి విధానం, అనిర్ణయం, నిరంతర వాయిదా వారి నిర్ణయాలు. తెలంగాణకు అనుకూలం అంటూనే ప్రతికూలంగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నారని తెలంగాణ వ్యతిరేక పార్టీలకు, నాయకులకు అర్థమైంది. వారే ఈ విధంగా పార్టీ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. లాబీయింగ్ చేశారు. అనుకూలంగా ఉందనుకున్న ప్రతిసారీ విజృంభించి డబ్బు గుప్పించి, ఇంకా ఏమేమో చేసి మళ్లీ కాంగ్రెస్‌ను సాచివేత విధానంలోకి తెచ్చారు.

ఇక అమాయకులు, అవకాశవాదులు, స్వార్థ పరులు ఎవరంటే ఆ పార్టీల్లో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులూ. వారిది కూడా అస్పష్ట విధానమే. తమకంటూ ఒక నిర్ణయం లేదు. పార్టీలోనే ఉంటూ పార్టీ ద్వారా వచ్చిన పదవులులో కొనసాగు తూ చివరి క్షణం దాకా అధికారం ఆనందంగా వాడుకోవడ మే ఈ ప్రజావ్యతిరేకుల లక్ష్యం. తెలంగాణపైన ఆ రెండు పార్టీల ద్రోహచింతనను, అస్పష్ట ప్రకటనలను వారు ప్రశ్నించడం లేదు. ఎదురు తిరగడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నంత కాలం ఉండాలనే స్వార్థ ధోరణిని వారు నిస్సిగ్గుగా చాటుకుంటూనే ఉన్నారు. వీరి వల్లే కాంగ్రెస్, టీడీపీ కలిసి రచించిన నాటకాలు విడిగా ఆడగలుగుతున్నాయి. ఇక మాటలు మార్చే చాకోని అని ఏం లాభం?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి