ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?


Tue,May 14, 2013 12:01 AM


అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్నారు పెద్దలు. జనానికి పనికి రాని పార్టీని కూడా వదిలివేసే వస్తువులలో సుమతి శతకకారుడు చేర్చకపోవడానికి కారణం అప్పట్లో ధనస్వామ్యమూ నీతిమాలిన నాయకులు లేకపోవడమే. అసమ్మతి, నిరసన, విమర్శ, వ్యతిరేకత, విభేదం, కొత్త ఆలోచన, అనంగీకారం లేకుం డా ప్రజాస్వామ్యంలేదు. వీటికితావులేని రాజకీయపార్టీ ప్రజాస్వామ్యాన్ని ఇవ్వలేదు. ఇస్తానంటే అది అవాస్తవమే. ప్రజల ప్రయోజనాలు తప్ప అధికారమే పరమ లక్ష్యమని భావించే పార్టీని వదిలేయడమే న్యాయం.ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని తృణీకరిస్తూ మరోవైపు జనం మనసు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశానంటే వారిని ఏవిధంగా భావించాలి?ఇస్తానని ఇవ్వక మోసగించే పార్టీలో, నయవంచన చేసే కబుర్ల పార్టీలో ఉండి పదవులు అనుభవించేవారు, కొత్తగా పదవులొస్తాయని అనుకునే తెలంగాణవారికి 2014 ఎన్నికల పూర్వాంకమే ఆత్మావలోకన చేసుకోవడానికి సరైన సమయం. చరిత్ర సృష్టిస్తారా ద్రోహులుగా చరివూతలో మిగిలిపోతారా అనే కొత్తనినాదంతో టీఆర్‌ఎస్ వ్యూహాలను అల్లుతున్నది. తెలంగాణ ఇస్తామని ఒకరు, తెలంగాణతో పొత్తని మరొకరు 2009లో చేసిన మోసపు ఎత్తుగడలు నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. అది కనిపించకపోయినా వారు కళ్లున్న కబోదులు. రెండు కళ్ల సిద్ధాంతకర్త కన్నా వారి కాళ్లుపట్టుకునే కళ్లున్నకబోదులే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపి, ఆలస్యం చేసి, డబ్బు తీసుకుని సిగ్గును నిస్సిగ్గుగా వదిలేస్తున్నారు.

ఇప్పటి కాంగ్రెస్ ఎంత కాంగ్రెసో టీడీపీ కూడా అంతే టీడీపీ. స్వాతంవూత్యోద్యమం నాటి కాంగ్రెస్ గానీ, నిజలింగప్ప నాటి కాంగ్రెస్ గానీ ఇప్పుడు లేవు. దీనికి 125ఏళ్ల పైబడిన చరిత్ర ఉందనడం పచ్చి అబద్ధమే. అదేవిధంగా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ ఇప్పుడు లేదు. బయటి నుంచి వచ్చిన ఆయన బంధువులు వ్యవస్థాపకుడైన ఎన్‌టీ రామారావును అధికారం కోసం రాజకీయ కుట్రకు బలిచేసినప్పుడే ఆ పార్టీ చనిపోయింది. తెలంగాణకు తెలంగాణ వారే ద్రోహులైనట్టు, టీడీపీకి, ఎన్‌టీఆర్‌కు ఆయన కుటుంబసభ్యులే ద్రోహులైనారు. ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని విమర్శలు చేస్తూ ఎదిగిన ఆ పార్టీని అ ప్రజాస్వామికంగా కూలదోస్తే.. ఆంధ్ర కన్న, రాయలసీమ కన్న, తెలంగాణ ప్రజే ఎక్కువగా స్పందించింది. ఇప్పటి అధ్యక్షుడు అప్పుడు నాయకత్వం వహించి ఎన్‌టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడారు. మళ్లీ ఆవ్యక్తే కొన్ని సాకులు చూపి రామారావును పడగొట్టారు. లాబీయింగ్ మోసపు స్వామ్యాన్ని నిలబెట్టారు. జనాన్ని సమీకరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమం చేయడానికి పూనుకున్నప్పడికీ శక్తి ఉడిగిన రామారావు ప్రాణాలు కూడా కోల్పోవడంతో ఆ పార్టీ మాజీ కాంగ్రెస్ నాయకుల హస్తగతం అయింది. ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు కాంగ్రెస్‌లో కలిసి పదవులు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్‌ను కుక్కలు చింపిన విస్తరి అని తిట్టిపోసిన ఎన్‌టీఆర్ తనపార్టీ ఆ విధంగా కాకుండా కాపాడలేకపోయారు. అసలుకాంగ్రెస్ పోయి కుక్కమూతి పిందెలు మిగిలాయని ఎన్‌టీఆర్ అన్నా రు. కానీ అవి ఆయన పార్టీలోనే పుట్టడం మొదలైంది. ఎన్‌టీఆర్ కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే, అధికారంలో ఉన్న పార్టీని ఆక్రమించడమే రాజకీయం అయింది. ఆత్మగౌరవ నినాదం పరిఢవిల్లిన చోటే ఆత్మవంచన విస్తరించడం ఒక పతనావస్థ. 1982లో స్థాపించిన ఎన్‌టీఆర్ నాటి ఒరిజినాలిటీని టీడీపీ 1995లోనే కోల్పోయింది. ఇప్పుడు మిగిలిన పార్టీ పేరు టీడీపీ అయినా, ఇది కాంగ్రెస్ మాజీ మంత్రి చంద్రబాబు టీడీపీ మాత్రమే. అయితే అందరు ఆంధ్ర పాలకుల వలెనే ఎన్‌టీఆర్ కూడా తెలంగాణకు అన్యాయం చేశారు. ఆయనతో కొందరు మంత్రులు, అనుయాయులు, తెలంగాణ ద్రోహులు అన్యాయం చేయించారు. పదవులకోసం ఆయన పాదాభిషేకం చేసేవారు తెలంగాణకు గాని సొంత జిల్లాకుగానీ ఏం న్యాయం చేస్తారు? ఆయనను పడగొట్టిన తరువాత బాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ తీవ్రంగా దెబ్బతిన్నది.ఆ పాలన వల్లనే తెలంగాణ ఉద్యమం మళ్లీ వేళ్లూనుకున్నది, విస్తరించింది. ప్రపంచ బ్యాంకు ఎజెండాను ముందుకు తెచ్చిన అవకాశవాద పాలన, కొన్నాళ్లు వామపక్షాలు, మరికొంత కాలం బీజేపీ అండదండలతో బతుకుతూ ఏ ఎండకు ఆ గొడుగుపడుతూ రియల్ ఎస్టేట్, టూరిజం తప్ప మరే ఇజంలేని నైజంతో నియంతృత్వ పాలన సాగించి 2004 నుంచి అధికారానికి జనానికి దూరమవుతూ వచ్చింది. మోసపూరిత ఎన్నికల ఒప్పందాలతో చతికిలబడిపోయింది.

తెలంగాణ ఉద్యమం ప్రజాబలంతో ముందుకు సాగుతున్నా తెలంగాణ వ్యతిరేకుల డబ్బు బలం, అధికారబలం,ఢిల్లీలో ఎవర్నయినా పలోభంతో కొనగల శక్తి ముందు, తెలంగాణ ఉద్యమం ఢిల్లీకి తెలియకుండాపోతున్నది. హైదరాబాద్‌లో ఎక్కువగా, తెలంగాణ జిల్లాలలో ఆక్రమించి ఉన్న తెలంగాణ వ్యతిరేకుల దుర్మార్గపు బలం ఉద్యమాన్ని కనిపించకుండా నానా ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ చేస్తున్నది. తెలంగాణ వ్యతిరేకులు తమ అంతేవాసులుగా ఉన్న తెలంగాణ వారిచేత మాట్లాడించే మాటలతో చేతలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిరంతరం దెబ్బతీస్తూనే ఉన్నారు. వారితో వంతపాడు తున్న తెలంగాణ ద్రోహులు కూడా ‘జీ హుజూర్’ అంటూ వారి అడుగులకు మడుగులు ఒత్తడం వల్ల,వారి మధ్య తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుపూవరూ ఇమడడం సాధ్యం కాదు. వారు బయటకు పోతే వారి పైన తెలంగాణ నాయకుల చేతనే దిగజారుడు వాఖ్యలు చేయించే పార్టీలే అన్నీ. తెలంగాణ నాయకులు టీడీపీలో ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నారని శ్రీహరి చెప్పడం ఆలోచించవలసిన విషయం.బయట వారూ,అందులో ఉన్నవారూ కూడా ఆలోచించాలి. కనీసం ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసం కలిసిపోరాడాలన్న సొంత ఆలోచన, ఆ ఆలోచనను అమలు చేసే స్వాతంత్య్రం లేకుండా ఉంటే దాన్ని వ్యక్తిత్వం అనరు. పార్టీ తేడా లేకుండా కోస్తాంధ్ర నాయకులు తెలంగాణ ద్రోహపు ఎజెండాను అమలు చేస్తుంటే, పార్టీ రహితంగా తెలంగాణ సానుకూల ఎజెండాను తెలంగాణ నాయకులు అమలుచేయకపోవడం వల్లనే తెలంగాణ ఆలస్యమవుతున్నది. సొంత ప్రాం త అభివృధ్ది కోసం కృషి చేయలేని వాడు పదవులు ఇచ్చారని కొనసాగడం బానిసత్వమే. వీరు ముందు మనుషులు, తరువాత ఈ దేశ పౌరులు, ఆ తరువాత తమను ఓటేసి గెలిపించిన వారికి, తము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికి ప్రతినిధులు. ఆతరువాతే పార్టీ సభ్యులు అని వీరంతా గుర్తుంచుకోవాలి. పార్టీకన్న తనను ఎన్నుకున్న ప్రజ లు ముఖ్యమని గమనించాలి. టికెట్ మాత్రమే ఇస్తుంది పార్టీ. పౌరుడు ప్రతి ఒక్కడూ ఇచ్చిన ఓటు కన్న ఒక్కనాయకుడు, ఒక్కపార్టీ ఇచ్చిన టికెట్ ముఖ్యంకాదు. ఒక్క టికెట్ ఇచ్చినందుకే విధేయుడుగా ఉండాలని పార్టీ నాయకుడు, వారి బంట్లు అంటున్నారే.. అప్పుడు, అయిదు ఓట్లు ఇచ్చిన కుటుంబానికి, లక్ష ఓట్లు ఇచ్చిన నియోజకవర్గానికి ఆయన ఎంత విధేయుడుగా ఉండాలి? డబ్బుపెంచుకోవడానికి పదవులు పంచుకోవడానికి కాదు జనం ఎన్నుకునేది. ప్రజాభీష్టాన్ని తెలుసుకుని అందుకనుగుణంగా వ్యవహరించడానికి.

తెలంగాణకు తాము అనుకూలం అని చెప్పి టీడీపీ వారు తెలంగాణలో కొన్ని స్థానాలు గెలిచారు. తెరాసతో పొత్తును వారు నమ్మకపోయినా వారు నిజంగానే తెలంగాణకు అనుకూలమని తెలంగాణ ప్రజలునమ్మి ఓట్లేస్తే గెలిచారు. వారికి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కులేదు. తెలంగాణకు ద్రోహం చేసే వారితో కలిసిఉండే హక్కులేదు. ఒకవేళ కడియం శ్రీహరి ఏదై నా తప్పు చేస్తే అది తెలంగాణను వ్యతిరేకించి టీడీపీలో ఇన్నాళ్లూ కొనసాగడమే. అది ప్రజావూదోహం. ఆ తప్పును ఇప్పటికైనా ఎప్పటికైనా దిద్దుకోవలసిందే. ఇటువంటి తప్పు చేస్తున్న వారు ఇంకా తెలంగాణ వ్యతిరేక పార్టీల్లో ఉన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీకన్న మనిషి జన్మనిచ్చిన తెలంగాణ ముఖ్యమని శ్రీహరి చెప్పడం మంచి మాట. ఆయన ఎవరినీ పరుషంగా నిందించలేదు. ‘తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారే గాని తెలంగాణకు అనుకూలం అని చెప్పని నాయకత్వంలో పనిచేయలేకపోయా’నని వివరించాడు. ఆత్మవంచన చేసుకోలేనన్నాడు. కాని చేసుకోగలవారు ఆయన్ను నిందిస్తున్నారు. ఆవిధంగా వారిచేత అనిపిస్తున్నారు? పంజరంలో చిలుక అని సీబీఐని సుప్రీంకోర్టు ఇటీవల విమర్శించింది. సొంత గొంతుకతో సొంత మనసు చెప్పిన సొంత మాటలు చెప్పలేని చిలుకలు పార్టీల పంజరాల్లో ఉన్నాయి.బాధ ఏమంటే..కడియం శ్రీహరి కూడా ఇన్నాళ్లూ ఇదే పని చేయడం. ఇప్పుడు చేయనని చెప్పడం గొప్పే అయినా ఇన్నాళ్లూ చేయకుండా ఉండకపోవడం తప్పే. ఒక్క నాయకుడు సింహాసనం మీద కూర్చోవడం,మిగతా వారంతా బానిసల వలె వంగుతూ నంగుతూ అనుయాయులుగా ఉండడం, ఇది ఏపార్టీలో ఉన్నా దాన్ని డెమోవూకసీ అనరు. వారు రాజ్యాధి కారాలు చెలాయిస్తే దాన్ని నియంతృత్వం అనే అంటారు. తన జీవితాన్ని తానే నిర్మించుకుంటూ రాజకీయాల్లో ఎదిగి టీడీపీలో కూడా క్రమశిక్షణగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి పార్టీవల్ల లాభాలు పొందారని, పార్టీకి ఏమీ చేయలేదని ఆయన మాజీ సహచరులు అనడం ఆత్మవంచనలో భాగమే. భారీ నీటిపారుదల మంత్రిత్వ శాఖను తెలంగాణకు చెందిన వారికి ఇవ్వడం, వారిచేతనే తెలంగాణకు అన్యాయం చేయిం చడం కోస్తా ఆంధ్ర, రాయల సీమ ముఖ్యమంవూతులకు వెన్నతో పెట్టినవిద్య. అందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడానే లేదు. కడియం శ్రీహరి ఎక్కువ నరకం మానసిక సంఘర్షణ అనుభవించింది బహుశా భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేక పోయినందుకే కావచ్చు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులను ఆమోదించినందుకూ కావచ్చు. ఇక ఫిరాయించడం గురించి. ఒక పార్టీనుంచి మరొక పార్టీకి ఫిరాయించడం రాజ్యాంగ వ్యతిరేకమా, చట్టవ్యతిరేకమై నైతిక విలువలను దిగజార్చడమా? ఆయారాం గయారాం, కప్పల తక్కెడ రాజకీయాలు దేశాన్ని ఎంతదిగజార్చాయో తెలుసు. పదవికోసం లేదా డబ్బు తీసుకుని పార్టీ మార్చడం, లేదా విశ్వాస తీర్మానంలో ఓటు వేయడం కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవ్యతిరేకం, నీతిబాహ్యం. ఇంకా ఏమయినా అనొచ్చు. సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, కార్యవూకమాలు వేరయితే వాటిని వదిలేసి పదవులకు ఆశపడి ఫిరాయించడాన్ని సహించ డం కష్టం. కాని సిద్ధాంతాలు లేని అవకాశ వాద పార్టీల నుంచి ఉద్యమాలకు మళ్లడం మార్పేగాని ఫిరాయింపు కాబోదు. ప్రజాభీష్టానికి అనుగుణంగా మారడం ఫిరాయింపు అవుతుందా?


పార్టీపక్షాన ఎన్నికయిన ప్రజా వూపతినిధులయితే ఉద్యమపార్టీ వైపు మళ్లినా సరే రాజ్యాంగవ్యతిరేక చర్యే అవుతుందని చట్టం చెబుతుంది. రాజ్యాంగం పదో షెడ్యూలులో చేర్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఫిరాయింపులను నిషేధించలేదు. మూడింట ఒక వంతు మందికి తక్కువ కాకుం డా ఫిరాయింపులు కూడదని చెప్పింది. తరువాత రాజ్యాంగాన్ని సవరించి ఒక పార్టీలోని మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో కలవడానికి తీర్మానిస్తే అది విలీనం అవుతుందే గాని ఫిరాయింపు కాదని నిర్వచించారు. చిల్లర, ఒంటరి ఫిరాయింపులు నిషేధించి టోకు ఫిరాయింపులను ఆమోదించారన్నమాట. ఇదీ ఫిరాయింపు వ్యతిరేక(?) చట్టం అసలు రహ స్యం. విప్‌లు జారీ చేసి పార్టీ ఆదేశం మేరకు ఓటు వేయాలనడం కూడా భావవూపకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. అంతేకాదు, చట్టసభల్లో నేర విచారణకు భయపడి స్వేచ్ఛగా మాట్లాడే ప్రత్యేకాధికారాలు ఇచ్చిన రాజ్యాంగ ఇతర నియమాలకు వ్యతిరేకం అనే విమర్శలు నిష్కారణమైనవేమీ కాదు. అందుకే చట్టం ద్వారా దీన్ని చట్టబద్ధం చేశారు. కాని ఎన్నిక కాని రాజకీయ నాయకులకు ఈనియమాలు వర్తించవు.ఈ చట్టాన్ని చట్టుబండలు చేసి రాజకీయ పబ్బం గడుపుకున్న పార్టీ టీడీపీ. ఒక్కొక్కరు ఫిరాయిస్తుంటే వారిని సభాపతి అనర్హులని ప్రకటించడమే జరిగితే ఫిరాయింపులు ఉండబోవని పార్లమెంటు భావించింది.కాని మూడో వంతు మంది ఎమ్మెల్యేలు తమవైపు వచ్చేదాకా ఒక్కొక్కరు, ఇద్దరు ముగ్గురు ఫిరాయిస్తుంటే చర్యలు తీసుకోకుండా పక్షపాతంతో వ్యవహరించి చీలిక అనే టోకు ఫిరాయింపుకు ఏర్పా ట్లు చేసుకున్న ఘన చరిత్ర కలిగిన ఫిరాయింపుల టీడీపీకి, కడియం శ్రీహరి ని ఫిరాయింపుదారుడని అసభ్య పదజాలంతో నిందించడం ఎంతవింత! అధికార దాహం కోసం స్పీకర్ పీఠాన్ని దుర్వినియోగం చేసి ఫిరాయింపులను చీలికగా తీర్చిదిద్దిన కుట్రల గురించి చరిత్ర చదివితే తెలుస్తుంది. పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఎన్‌టీఆర్ ఈ ఫిరాయింపులకే బలైంది. జన బలం ఉన్నా కుయుక్తుల బలం లేకపోతే బతకడమే కష్టమని ఇప్పటి టీడీపీ నాయకులు ఆనాడే నిరూపించారు. జనబలం ఉన్నా తెలంగాణను అడ్డుకుంటున్నది ఇటువంటి ఫిరాయింపు శక్తియుక్తులు కలిగిన టీడీపీ వంటి పార్టీలే. కాంగ్రెస్ కూడా ఫిరాయింపుల పునాదుల మీద డబ్బుసంచుల పంపిణీ మీద ఆధారపడి జనబలాన్ని అపహాస్యం చేసి తనది జనస్వామ్యమని బుకాయిస్తున్నది. కాంగ్రెస్ తానులో ముక్క టీడీపీ, మరో ముక్క వైఎస్‌ఆర్‌సీపీ. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఈ ధనబలం, ఫిరాయింపు బలం పనికి రాదని చెప్పడానికి వారు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని పదవుల ఆశ జూపినా తెలంగాణ జనాభీష్టం వైపు కదలడమే కావలసింది. ఆత్మవంచన నుంచి ఆత్మగౌరవం వైపు నడవ వలసిన బాధ్యత తెలంగాణ ప్రజావూపతినిధులందరిపైన ఉన్నది. ఆ తరుణం ఆసన్నమైనది. తెలంగాణ నుంచి ఎన్నికై పదవుల్లో, పదవుల భ్రమలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు కాంగ్రెస్‌లో ఉన్నా, వైఎస్‌ఆర్ సీపీలో ఉన్నా, డూప్లికేట్ టీడీపీలో ఉన్నా తమను తాము అడుక్కోవలసిన ప్రశ్న ఆత్మవంచనా? ఆత్మగౌరవమా?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles