స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు


Mon,April 29, 2013 12:16 PM


చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మార్గాలమీద విమర్శలు కురిపించారు. వెంక అని ఒక యువకుడు పల్లెనుంచి పట్నానికి పోయి ఎం.ఏ. చదువుకొని వస్తా డు. ఊళ్లో అందరికీ తాను ఎం.ఏ. పాసైనానని చెప్పుకోవాలని అతనికి ఆరా టం. సొంత ఊరికి వెళ్తూ వెంట ఒక కుక్కను తీసుకుపోతాడు. ఊళ్లో ఎదురైన ప్రతివాడూ తన ఎం.ఏ. గురించి కాకుండా వెంట ఉన్న కుక్క గురించి మాట్లాడడం మొదలుపెడతారు. వెంక ఎంత కష్టపడి ఎం.ఏ. చదివినాడో ఎవరికీ పట్టదు, చివరికి ఇంట్లో కూడా అదే పరిస్థితి. తల్లి కొడు క్కు అన్నం పెట్టిన తరువాత అయ్యో కుక్కకు అన్నం పెట్టావా లేదా అంటూ కొడుకును వదిలేసి కుక్కను పట్టించుకుంటుంది. విసిగిపోతాడు. దీనంతటికి కారణం కుక్కే అనుకుని దాన్ని చంపేస్తాడు. పీడా వదిలిందనుకుంటా డు. మరునాడు మిత్రులంతా ఒరేయ్ వెంక నీవెంట నిన్నడిదాకా ముద్దు గా బొద్దుగా ఒక కుక్క ఉండేది ఏమైంది అనడుగుతూ ఉంటారు. వెంక పిచ్చెక్కిపోతుంది. ఇక లాభం లేదనుకుని ఊళ్లో ఎత్తయి న చెట్టెక్కి కిందకు దునికి చస్తానంటాడు. అందరూ గుమికూడతారు. వద్దంటారు, వినడు. ఏం కావాలని అడుగుతారు. తాను ఎం.ఏ. చదివి విషయం బాగా పాసైన విషయం అందరికీ చెప్పాలని తన కోరిక అనీ, కాని అందరు తన ఎం.ఏ. గురించి వినకుండా కుక్క గురించే అడుగుతున్నారని కనుక కుక్కను తానే చంపేయవలసి వచ్చిందని చెప్తాడు. కుక్క గురించి ఎవరూ మాట్లాడబోమని మీరు హామీ ఇస్తేనే చావకుం డా బతుకుతానంటాడు. జనం అంతా సరేనంటా రు. అతను దిగుతాడు. తరవాత జనం ఎవరూ ఏమీ అనరు. కాని అతను అటు తిరగగానే వీడే వెంక కుక్కకోసం చెట్టెక్కి చస్తానన్నాడు చూడు, అతను అంటూ ఉంటారు, ఆ విషయం అతనికీ తెలుస్తుంది. అమ్మ కూడా అందంగా ఉన్న ఆ కుక్క పిల్లను చంపడానికి నీకు మనసెట్లా ఒప్పిందిరా అని అడుగుతుంది. ఇక లాభం లేదనుకుని ఊరు వదిలిపోతాడు. వెంక ఎం.ఏ. అనిపించుకోవాలనుకున్నప్పటికీ చివరకు కుక్క వెంక పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఎంత చదువుకున్నా చేసిన పనుల వల్ల ఖ్యాతి వస్తుంది గాని కేవలం చదువుకున్నందువల్ల రాదు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. చెప్పదలుకున్న విషయం సూటిగా చెప్పడానికి అన్ని విధాలా ప్రయత్నించాలి.


ఒక థియేటర్లో సినిమా షో నడుస్తూ ఉండగా ఒక పోకిరి ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయని అరుస్తాడు. నిజానికి మంటలు లేవు. గందరగోళం జరిగిపోయింది. తొక్కిసలాటలో ఎందరో గాయపడ్డారు. సినిమా షో మధ్యలో ఆగింది. పోలీసులు వచ్చి కేసు పెట్టి జైల్లో తోస్తారు. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఫస్ట్ అమెండ్ మెంట్ రైట్ కదా. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని వాదిస్తాడు. అమెరికా రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది గాని పరిమితులేవీ నిర్దేశించలేదు. కొన్ని సిద్ధాంతాల ద్వారా సుప్రీంకోర్టు పరిమితులు సృష్టించింది. తక్షణ ప్రమాదం, పోలీసు అధికారాల సిద్ధాంతాలు అవి. శాంతి భద్రతల రక్షణ వారి బాధ్యత. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే స్వేచ్ఛ కాకుం డా జైలు తప్పదు. చెప్పే మాటల వల్ల వెంటనే తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడి అల్లర్లు జరిగే సమస్యలు వస్తే ఆ మాటలను ఆపే అధికారం, మాట్లాడినందుకు జైలు పాలుచేసే అవకాశం ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛపైన అచ్చమైన పరిమితి రెచ్చగొట్టకూడదనే నియమమే. బాగా చదువుకున్నవారికి ఈ విషయం తెలియకపోవడం విషాదం. తెలిసి చేస్తే చెప్పేదేమీ లేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురిం చి రకరకాల వాదాలు వివాదాలు వినిపిస్తున్నారు. కేవలం తెలంగాణ వ్యతిరేకతే లక్ష్యంగా, ద్వేషం కురిపించడమే ధ్యేయంగా పెట్టుబడి పెట్టి ఉద్యమం నడిపించే వారు ఉన్నారు. అది కూడా భావవూపకటనా స్వేచ్ఛే. జనస్వామ్యంలో విమర్శ, వ్యతిరేకత, పోటీ, ప్రతికూల భావాలు, విభిన్న అభివూపాయాలు ఉంటాయి ఉండి తీరాలి కూడా. ఏది సరైన ఆలోచనో ముందే ఎవరికీ తెలియదు. సమంజసంగా మాట్లాడుతున్నామో లేదో కూడా తెలియదు. అయినా అసమంజసంగా కూడా మాట్లాడే హక్కు ఉంది. అబద్ధాలు మాట్లాడే హక్కు కూడా ఉంది. మాట్లాడబోయేది అబద్ధమో కాదో తేల్చుకునే దాకా చెప్పడానికి వీల్లేదంటే ఇక ఎవరూ మాట్లాడరు. కవితలు, కథలు, కొందరు మహానుభావులు రాసే పుస్తకాలు, నవలలు, తీసే సినిమాలు అన్నీ అబద్ధాలే అవాస్తవాల పుట్టలే. అందుకని వారికి చెప్పే అధికారం లేదని ఎవరూ అనలేరు. కనుక అందరికీ అవాస్తవాలు చెప్పే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. మానిఫెస్టోలో తోచిన వాగ్దానాలన్నీ చేసి తోచిన మంచి మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోతే చట్టం ఏం చేస్తుంది? రాజ్యాంగం ఏం చేస్తుంది? అతని మీద కేసులు పెట్టడం, జైల్లో తోయడం సాధ్యం కాదు.


అయితే ఈ స్వాతంత్య్రం అంత విపరీతమైందా? ఎవరైనా ఏమైనా ఎక్కడైనా చెప్పవచ్చా అంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. సామాజిక పర్యవసానాలకు, పరిణామాలకు సిధ్ధపడి ఏమయినా చెప్పడానికి సాహసించవచ్చు. నేనేమైనా మాట్లాడతాను కాని నన్నేమీ అనవద్దు అంటే కొందరు వింటారు. ఏదో ఆయనకు తోచింది ఆయ న చెప్పుకుంటాడు. అని కొందరు అనుకోవచ్చు. కొందరు కోపంగా తిట్టవచ్చు. అబద్ధాలను నిలదీసి అడగవచ్చు. కోపం పట్టే ఓపిక లేని వారు కొట్టి నా కొట్టవచ్చు. ఆ విధంగా కొట్టిన వారిపైన కేసులు పెట్టవచ్చు. ఆ విధంగా ప్రజాక్షిగహాన్ని కావాలని కొనుక్కోవచ్చు. స్వేచ్ఛ మాట్లాడే వాడికి ఉన్నట్టే వినేవాడికి, వినకుండా ఉండే వాడికి, విమర్శించే వాడిని, తీవ్రంగా నిరసించే వాడికి కూడా హక్కు ఉంటుంది. ఉందని రాజ్యాంగం ఆర్టికల్ 19(1) (ఎ) భావవూపకటనా స్వేచ్ఛకు గ్యారంటీ ఇస్తున్నది. కాని దానికి పక్కనే సమంజసమైన పరిమితులు ఉంటాయని ఆర్టికల్ 19(2) వివరించింది. అబద్ధాలు ఆడే స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన అబద్ధాలే చెబుతానంటే వినే వారు ఊరుకోకపోవ డం కూడా అంతే సహజం. విశ్వసనీయతను పణంగా పెట్టి నైతిక విలువలను పాతిపెట్టి, ఒక కట్టుబాటు లేకుండా, చదువుకున్న చదువుకు సార్థకత లేకుం డా కూడా మాట్లాడవచ్చు. ఆ విధంగా కొందరు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే వారు దొరికితే డబ్బు ఇచ్చి వారితో రాయించి మాట్లాడించే వారు కూడా ఉంటారు. భావస్వేచ్ఛ ఈరోజు కొందరు రాజకీయ వ్యాపారుల చేతిలో అమ్ముడుపోయే సరుకు అయిపోయింది. అమ్ముకునే వారున్నారు. కొనుక్కునే వారూ ఉన్నారు. అదీ భావవూపకటనా స్వేచ్ఛలో ఒక భాగమే. కాదనలేం. పార్టీలు మారడం భావవూపకటనా స్వేచ్ఛలో భాగమే. ఏం ఒకే పార్టీలో ఉండాలని ఏమైనా నియమం ఉందా? సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీలు ఏం ఉన్నాయి కనుక, ఆ పార్టీకి కట్టుబడి ఉండాలని ఎక్కడుంది? పార్టీలను మారవచ్చు. ఎన్నికైన వారు పార్టీ మారితే సభ్యత్వం పోతుందని ఫిరాయింపు నిరోధక చట్టం చేసినపుడు అది భావ ప్రకటనా స్వాతంవూత్యానికి చేటు అని విమర్శించిన వారు ఉన్నారు, విప్‌తో నియంతృత్వం చెలాయించే అవకాశం రాజకీయ పార్టీలకు ఇవ్వడమే ఈ చట్టం లక్ష్యం. అసమ్మతి, నిరసన, వ్యతిరేకత, విభిన్న భావాలు చెప్పుకోవడం మొదలైన వాటికి పార్టీలలో చోటు ఉండాలి. వీటన్నింటినీ గౌరవించి పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాటించవలసిన పార్టీలు తమ పార్టీల్లో అంతర్గతంగా ప్రజాస్వామ్యం పాటించకపోవడం ఏమిటి? చట్టసభలో కూడా చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయని భయంభయంగా మాట్లాడితే ప్రజాసమస్యలు బయటకు రావని, విమర్శకు బతుకు ఉండదనే ఉద్దేశంతో పార్లమెంటరీ ప్రివిలేజ్ రూపంలో అపారమైన స్వేచ్ఛను రాజ్యాం గం గ్యారంటీ ఇచ్చింది. ఇది పౌరులకు 19(1)(ఎ) ఇచ్చిన భావవూపకటనా స్వేచ్ఛకన్న పెద్దది, విస్తారమైనది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నా కేసులు పెట్టుకోవడానికి వీల్లే దు. కనుక వారు సభల్లో అసభ్యంగా మాట్లాడుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అదే అలవాటయి బయట కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు పార్టీలన్నీ మారి, ఎంఎల్యేగానో ఎంఎల్సీగానో ఎన్నిక అవ్వాలని కలలు కని, కొత్త పార్టీలో దూరి, అక్కడా నిరాశ ఎదురైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచి గెలవలేకపోయి, చట్టసభలో ఎన్నికైన వారికి ఉన్నట్టు అపారమైన భావవూపకటనా స్వాతంత్య్రం ఉందనే భ్రమలో ఉండి బుర్రకు తోచిన విధంగా నోటికి వచ్చిన విధంగా మాట్లాడి దానికి ఊతంగా భావవూపకటనా స్వేచ్ఛ అనే సమాసాన్ని యథేచ్ఛగా వినియోగిస్తున్నా రు. నూటికి నూరు శాతం అటువంటి వ్యవహారం రాజ్యాంగబద్ధమైన వ్యవహారం, చట్టబద్ధమైన పని.


తెలంగాణ ఉద్యమం గురించి, కోస్తాంధ్ర నాయకుల కుట్రలకు బలైన కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర అభీష్టం గురించి, సీమాంధ్ర నేతల స్వార్థ పూరిత ప్రభుత్వాలు పదేపదే చేసిన మోసాల గురించి చెప్పుకునే స్వేచ్ఛకూడా ఇదివరకు లేదు. అవకాశం కూడా ఇవ్వలేదు. 1969 నాటి ఉద్యమంలో సీమాంధ్ర వ్యాపారుల మీడియా చేతిలో తెలంగాణ ఉద్యమవార్తలకు చోటేలేకుండా పోయింది. ఇప్పుడు ఆ విధంగా కాదు. ఉద్యమ వార్తలు పత్రికల్లో టీవీల్లో వస్తాయి. కాని వెంటనే దాన్ని కించ పరుస్తూ, నేతలను అవమాన పరుస్తూ, తెలంగాణ రానే రాదని పదేపదే అంటూ, వచ్చినా బతకలేర ని జోస్యం చెబుతూ, రాకుండా ఉండడానికి కారణాలు ఏర్చి పేర్చి కూర్చి, అల్లి, గిల్లి వాఖ్యానాలు చేస్తుంటారు. ప్రత్యేక కథనాలు రాస్తారు. ఉద్యమాన్ని మానసికంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫిరాయింపు మేధావులైతే అణచివేస్తామనే చెబుతారు. తెలంగాణ వనరులను దోచుకున్న కరడుగట్టిన సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ఉద్యమం మట్టికరిచిందనే దురహంకారపూరితమైన అవాస్తవ ప్రేలాపన చేయలేదు. అమ్ముడుపోయిన మేధావులను కాళోజీ మేతావులు అనేవారు. మేతకు తప్ప మేధకు పనికి రాని పనులు చేసేవారికి అదే సరైన పేరు. వీరి దృష్టిలో లేదా సృష్టిలో తెలంగాణ ఉద్యమం లేనే లేదు. కాని కొన్నాళ్ల తరువాత అది మట్టిగరచింది. ఎంత విచి త్రం. వారికి ఆ భావస్వాతంత్య్రం ఉంది. కాని పదిమందిలో ఆ మాట అన్నపుడు, దాని పర్యవసానాలు కూడా ఉంటాయి. మీరు అన్నట్టుగానే అవన్నీ అబద్ధాలు కాదనీ మీరే అబద్ధాలు ఆడుతున్నారనీ అంటారు. వారికి మీకున్న స్వేచ్ఛే ఉంది అని గమనించాల్సి ఉంటుంది. గమనించకుండా కళ్లుమూసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అయితే ఈ ప్రకటన కేవలం భావవూపకటన కాదు. రెచ్చగొట్టే ప్రకటన. ఎనభైరోజులు ఎవరినడిగి ఎదురుచూశారు? ఎవరో ఏదో రాయగానే వెంటనే తెలంగాణ నుంచి జవాబులు ఉప్పెనలై వచ్చిపడతాయా? తెలంగాణ ప్రజలకు కొన్ని అవాస్తవాలను, కొన్ని అసందర్భ వాఖ్యానాలను విస్మరించి తృణీకరించే స్వేచ్ఛ కూడా ఉంది. పదేళ్లుగా తెలంగాణ సమస్యల గురించి సీమాంధ్ర సాగిస్తున్న మోసా ల గురించి ఆధారాలతో సహా వాదిస్తున్నా రు. అవి అబద్ధాలు అనడం తప్ప, దానికి జవాబు ఇచ్చే వారు లేరు. నిజా ల ద్వారా జవాబులు చెప్పేవారు ఉండరు. ఎందుకంటే అవన్నీ పచ్చినిజాలు కనుక. వారి పక్షాన నిజాలు లేవు కనుక. కాని కొందరు సాహసవంతులు అబద్ధాలు చెప్పడానికి ముందుకు వస్తారు. నిజాల్లో జవాబులు లేనపుడు అబద్ధాలను ఆశ్రయించడం కొందరికి అవసరం, వారితో ఆ విధంగా చెప్పించడం మరికొందరికి అవసరం.


కొందరు బహిరంగంగా పుస్తకాలు రాస్తారు. అవాస్తవాలు వెబ్ సైట్‌లో పెడతారు. చాలా ఖరీదైన కాగితం మీద రంగురంగుల్లో ముద్రిస్తారు. లంచా ల డబ్బు, అక్రమార్జన, పన్ను ఎగవేసిన సొమ్ము, వాటాల పేరుతో దోచుకు న్న జనం సొమ్ము దండిగా ఉన్నవారు ఇంకా డబ్బు ఖర్చు పెట్టి స్వర్ణాక్షరాలతో అవాస్తవాలు అచ్చువేసి వదులుతారు. దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని తెలంగాణవారు అనుకుంటే అనుకుంటారు. జవాబు చెప్పాలనుకుంటే చెబుతారు. ఇదివరకు చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పవలసి ఉంటుంది. అదీగాక తెలంగాణపై ద్వేషం నరనరాల్లో పాకిపోయిన కొందరు వ్యక్తులను అట్లాగే ఉండనిచ్చి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించాలి. మాటలతో రాతలతో రెచ్చగొట్టి ఉద్యమకారులను ఉడికించి దారితప్పించే ప్రయత్నాలను గమనించాల్సి ఉంటుంది. ఇదిబాక్సింగ్ అనీ అందులో తెలంగాణ మట్టిగరచిందని చెప్పినప్పుడే అందులో రెచ్చగొట్టడం ఉంది. నవ్వుతూ చల్లగా రెచ్చగొట్టే తత్వంతోనే తెలంగాణకు గాని ఏ వెనుకబడిన ప్రాంతానికి కాని నష్టం ఉంటుంది. అమాయకులు ఆవేశపరులైన వారిని ఇటువంటి శీతల రక్త వ్యక్తులు రెచ్చగొట్టి రక్తపాతాన్ని సృష్టించగలుగుతారని ఉద్యమకారులు గుర్తు పెట్టుకోవాలి. ఈ పుస్తకాలు చదివితే గ్రామ గ్రామాన తెలంగాణవాదులను తరిమితరిమి కొడతార ని ఆయన అన్నట్టు పత్రికల్లో వచ్చింది. అది వారి ఆశ, కోరిక, ప్రగాఢ వాంఛ. గ్రామాన గ్రామాన పంచనీయండి. ఆ స్వేచ్ఛను కూడా అనుభవించనీయండి. అయితే ఈ మాటలో కూడా రెచ్చగొట్టే రొచ్చు లక్షణం ఉంది. మిమ్మల్నే తరి మి కొడతాం అని తెలంగాణవాదులు అనాలనే దురుద్దేశం ఉంది. అబద్ధాలను తిప్పి కొట్టే స్వేచ్ఛ తిప్పి కొట్టడం ఎందుకనుకుంటే ఊరుకునే స్వేచ్ఛ కూడా ఉంది. నిరసించడం, డౌన్ డౌన్ నినాదాలు చేయడం, నిలదీ సి అడగడం స్వేచ్ఛలో భాగాలే. అందుకు అద్దాలు పగుల గొట్టనవస రం లేదు. అప్పుడు కొట్టిన వారి చేతులకే గాయాలవుతాయి. ఆ మధ్య సియాసత్ ఎడిటర్ గారిపైన ఆయన వ్యతిరేకులు మలాన్ని విసిరారు. ఆయన తప్పించుకోగలిగారు. కాని అందులో చేతులు పెట్టిన వారి గతి ఏమిటో ఆలోచించండి. వీరు విసురుతున్న వాటినుంచి తప్పించుకోవాలి. వారి చేతులు ఎంత మురికిగా మారాయో వారికే తెలిసేట్లు చేయాలి. ఎలాగైనా గెలవాలనుకునే వారు ఏదైనా చేస్తారు. సమతౌల్యం దెబ్బ తినకుండా నిలబడి విజ యం సాధించడమే తెలంగాణ లక్ష్యం. అది నెరవేరితే, ఆ తుఫానులో శత్రువులు కొట్టుకుపోయినా గడ్డిపోచలు మిగిలే ఉంటాయి. వాటికేం కాదు. ఆ తృణాల ను తృణీకరించాల్సిందే. భావ ప్రకటనస్వేచ్ఛలో రెచ్చగొట్టే స్వేచ్ఛ లేదని వారికి తెలియాలి, రెచ్చగొడితే రెచ్చిపోవడం బాధ్యత కాదని వీరికీ తెలియాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles