అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?


Mon,April 15, 2013 11:58 PM


రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీసినా తప్పులేదన్నారు.వై.ఎస్.రాజశేఖరడ్డి ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో తనయుడు సాగించిన అవినీతి పనులకు అదే సరై న శిక్ష అని రామనారాయణ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ మంత్రి సమతుల్యంతో మాట్లాడతారని అనుకున్నాయన ఇంత తీవ్రస్థాయి లో జగన్‌పైన విరుచుకుపడడానికి కారణం ఆవేశమేనా? లేక ఇంకేమయినా అర్థాలున్నాయా? నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో, ఆ తరువాత పత్రికా విలేకరులతో ఆనం వారు ఇవే మాటలు రెండుసార్లు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. జగన్, రాజశేఖర్ రెడ్డి అవినీతి అడ్డూ అదుపులేని దని, ఇదివరకెన్నడూ ఇంత భారీ ఎత్తున అవినీతి జరగలేదని అక్రమాలు చట్టాల ఉల్లంఘనలు విపరీతంగా జరిగాయని, తండ్రి పాలనను ఆసరాగా తీసుకుని ఘోరమైన ఆర్థికదుర్మార్గాలకు పాల్పడ్డారని అంటున్నారు. మొత్తం రాష్ట్రాన్నే దోచుకున్నారని విమర్శించారు. జగన్‌కు ఈ భూమిపై బతికే అర్హత లేదని ఆనం అన్నారు. అయితే.. సీబీఐ వారే ముగ్గురు మంత్రులు అదే కేసు లో కూడా నేరస్తులని అంటున్నారు. సీబీఐ ఒక్క జగన్ విషయంలో వాస్తవాలు చెప్పి మిగిలిన వారి గురించి అవాస్తవాలు చెప్తున్నట్టా?

రాజకీయ ప్రత్యర్థిగా, జగన్ పార్టీతో పోటీపడుతున్న రాజకీయ నాయకుడిగా ఆనం మాట్లాడినా, వై.ఎస్. హయాంలో మంత్రిగా పనిచేసి జగన్‌తో సన్నిహిత సాహచర్యం ఉన్న వ్యక్తి అన్న మాటలను తేలికగా తీసిపారేయడం కుదరదు. జగన్మోహనడ్డి బావఅనిల్ కుమార్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇదిరకు ఎందరో చెప్పిన మాటలనే ఆయన ఉటంకించినప్పడికీ మంత్రిగా ఉన్నతస్థాయిలో ఉండి చెప్పిన మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది. ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అధికార పక్షంలోని మంత్రుల మీద విసుర్లు విసరడమే బాధ్యత అన్నట్టుచెప్పిన మాటలు కాకపోతే, ఈ మాటలకు పరిణామాలు కూడా కనబడాలి. పర్యవసానాలు ఉండాలి. అందువల్ల రాష్ట్రానికి మేలు జరగాలి. లేకపోతే ఈ మాటలు ఎందు కు అన్నారో చెప్పాలి. జగన్ నేరస్తుడా కాదా ఇంకా తెలియదు. ఆయన ఇంకా ఎంపీగా ఉన్నా రు. ఈ నేరం తేలేదాకా ఆయన ఎంపీ పదవి పోదు. మళ్లీ ఎన్నికలు జరిగితే ఆయన మీద అనర్హత లేకపోతే ఖచ్చితంగా పోటీచేస్తారు. పోటీలో గెలిచి తీరతారని కూడా చెప్పే వాతావరణం ఉంది.అటువంటి వ్యక్తికి బతికే అర్హత లేదని, ఉరితీసినా తప్పులేదని ఒక కేబినెట్ మం త్రి ఎందుకు అన్నారు. అనవచ్చా? అనకూడదా అనే వివాదం వేరే విష యం. కాని అంటే ఏం జరగా లి? పరిణామాలు ఎలా ఉండాలనేది అసలు సవాల్. ప్రభుత్వానికి జగన్ ఉరితీసే ఆలోచన ఏమయినా ఉందా? లేకపోతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించినట్టు జగన్ కేసు తీగలాగితే డొంకంతా కదిలి ఇంకెన్నికాంక్షిగెస్ అస్థిపంజరాలు బయటపడతాయోనన్న భయం ఆవరించి నిరాశతో నిస్పృహతో ఈ విధంగా మనసులో మాట బయటపడిందా? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విమర్శ తరువాత మంచి ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్‌లో నిరాశకు సంకేతంగా వారు ఈ విమర్శను పరిగణిస్తున్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి, ఇదివరకు మంత్రి ధర్మాన ప్రసాదరావును నిందితుడుగా జగన్ అవినీతి కేసుల్లో చేర్చినపుడు బహిరంగంగా విలేకరుల సమావేశంలో మంత్రులను సమర్థించారు. వారే తప్పూ చేయలేదని నినదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ని ఎదిరించే దమ్ము అప్పట్లో ఎవరికీ ఉండేది కాదని, పార్టీలో ప్రభుత్వంలో హైకమాండ్‌లో పలుకుబడి కలిగిన రాజశేఖరరెడ్డిని ఎదిరించడం సాధ్యమే అయ్యేది కాదన్నారు. మన ప్రజాస్వామ్యం ఎంత హుందాగా సాగిందో ఈమాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేసిన మంత్రులు అమాయకులని ఆయన వాదించారు. అంటే వారంతా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలని మనం అనుకోవాలి. ధర్మాన నేరం చేయలేదని ప్రకటించారు. అంత కుమించి వివరాల జోలికి పోలేదు. మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. మరొక మంత్రి సబితా ఇంద్రాడ్డిని కూడా నిందితురాలిగా ప్రకటించారు. సమన్లు జారీ చేస్తున్నారు. ధర్మాన, సబిత, మోపిదేవి ప్రజపూన్నుకున్న ప్రతినిదులు. ఎన్నికలలో గెలిచిన వారు. వారు నేరస్తులని ఇప్పుడే ఎవరూ నిర్ధారించలేరు. వారిని నిందితులు అనవలసిందే. కాని మరొక విశేషణం తగిలించడం సాధ్యం కాదు. సబితా ఇంద్రాడ్డి కూడా ఏ నేరమూ చేయలేదని ఆర్థిక మంత్రి రామనారాయణ రెడ్డి బహిరంగంగా చెప్పడం ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనం. మంత్రులకు ఎంతో ఊరట కలిగించే మాటలు మాట్లాడారు. అందుకే చాలామంది ఆయనను అభినందించారు. ఆయన సాహసానికి ముగ్ధులైనారు. ఆలోచించవలసిన విషయం ఏమంటే ఒకవేళ జగన్ ను ఉరితీయవలసి వస్తే, చట్టం ప్రకారం ఆయనపై సీబీఐ మోపిన ఆరోపణలు రుజువైతే, అదే కేసులో నిందితులైన ఈ ముగ్గురుమంవూతులకు శిక్షలు మరొక రకంగా ఉండడం సాధ్యం కాదు. కుట్ర రుజువైతే కుట్రలో భాగస్వాములందరి నిందితులకు ఒకే శిక్ష పడుతుంది.ఆనం రామనారాయణడ్డి ఒకవైపు జగన్‌కు ఉరి వేసినా తప్పులేదంటూ మరొక వైపు ఆయనతో పాటు నిందితులైన మంత్రుల తప్పేమీ లేదన్నారు. ఇది పొంతన లేని ఆలోచన. న్యాయపరంగా పొసగని అంశం. జగన్ కు ఉరి తప్పకపోతే మరి ఆ వ్యవహారాలలో పాత్ర ఉన్న పాలనాధికారుల సంగతేమిటి? ఒకొక్క మంత్రి నిందితుడు అవుతూ ఉంటే ఇటువంటి పెద్దలు ఈ విధంగా మద్దతు ఇస్తూ ఉంటే, ప్రజలు ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది? జగన్ వ్యవహారంతో సంబందం ఉన్నా లేకున్నా 26 జీవోలను రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జారీచేయడం వెనుక అనుమానాలు ఉన్నాయని, కనుక ఈ జీవోలలో నిర్ణయంతీసుకున్న పెద్దలు ఆరుగురు ఉన్నారని, వారిలో ముగ్గురు ఇప్పడికే చార్జషీట్లో పేరు నెంబరు సంపాదించుకున్నారని తెలుస్తున్నది. మిగిలిన ముగ్గురి గురించి అంచనాలే కాని వారిని నిందితులు అని అనడం కూడా కష్టమే.

ఇంకో ముగ్గురు మంత్రుల పేర్లు కూడా ఆరోపణా పత్రంలో చేరితే అప్పుడేంచేస్తారు? ఏం చేయాలని ఆనం వారి ఆలోచన? ఒకవేళ ఆనం వారి ఆలోచనే ప్రభుత్వం, పార్టీ ఆలోచన కూడా అయితే అదికూడా చెప్పడం మంచిది. అవసరం. మంత్రుపూవరికీ రాజశేఖర రెడ్డిని ఎదిరించే దమ్ము లేకపోతే అదే రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం కాదా? మేం సంతకాలు పెట్టాం కాని అందులో ప్రయివేటు వ్యక్తుల పరంచేసిన ప్రభుత్వ ఆస్తులకు మాకు సంబంధం లేదని అంటే అది ఎంతవరకు న్యాయం? రాజశేఖర రెడ్డి పెట్టమంటే ఎవవరు ఎన్ని సంతకాలు చేశారు? ఎక్కడెక్కడ చేశారు? ఎన్నె న్ని ప్రభుత్వ ఆస్తులను పంచారో, ఎవవరికి పంచారో చెప్పవలసిన బాధ్య త, సంతకాలుచేసిన వారిపైన ఉంది. ఆ వివరాలన్నీ చెప్పి, అందుకు ప్రజలను క్షమాపణ కోరవలసిన నైతిక బాధ్యత వారిపైన ఉంది. చట్టం ముందు నేరగాళ్లుగా మంత్రులు నిలబడుతూ ఉంటే అధికార పార్టీకి కూడా దాన్ని సమర్థించడం కష్టం అవుతుంది.
రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో ఉండి, ప్రస్తుతం కిరణ్ మంత్రి వర్గంలో కూడా కొనసాగుతున్న మంత్రుల పైన తాము వత్తిడికి లొంగి లేదా నాయకుడి ఆదేశాలు పాటించి చేసిన పనుల వివరాలన్నింటిని ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వహించడానికి మంత్రులు ముందుకు రావాలి. వారిని సమర్థించిన ఆనం వారు వారికి నాయకత్వం వహించాలి. అప్పుడు ఎవరు ఏ తప్పులు చేశారో, ఎంత అవినీతి దాగి ఉందో, ఎన్ని అక్రమాలు జరిగాయో ఎవవంతెంత దోచుకున్నారో బయటకు వస్తుంది.

రామనారాయణరెడ్డి సబితా ఇంద్రాడ్డిని సమర్థిస్తూ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సబితపైన ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ప్రధాన నిందితుడైన జగన్ పైన కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సత్యం రామలింగరాజు వలె ‘నేను వేల కోట్ల రూపాయల మేరకు కంపినీలను మోసం చేశాన’ని జగన్ కాని మరెవరు కానీ నేరాంగీకార ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక మంత్రిగారి ప్రజావూపయోజన వాజ్యంతో సీబీఐ విచారణ ఆరంభమైంది. అందులోనే రకరకాల సంచలనాలు, అక్రమాల వివరాలు బయటపడుతున్నాయి. కొత్త కొత్త నిందితులు చేరుకుంటున్నారు. బండారమంతా బయటపడుతున్నది.మంత్రులు నిందితులుగా మారుతున్న కొద్దీ, విస్తరించిన ఈ అవినీతి వటవృక్షానికి నీరు పోసి పంచడంలో జగన్ ఒక్కడినే నిందించడానికి వీల్లేదు. ఈదోపిడీలో చాలా మంది ఉన్నారనే అనుమానం ప్రజల్లో విస్తరిస్తున్న ది. ఒక్క జగన్‌ను మాత్రమే దోషిగా చూపి కాంగ్రెస్ వారిని తప్పించడానికి సీబీఐ విచారణ పరిమితం అవుతుందనుకుంటే అది సాధ్యం కాదని మోపిదేవి, ధర్మాన, సబితా పైన వచ్చిన నేరారోపణలు తేల్చి వేస్తున్నాయి. కాగితాలమీద సంతకాలతో చిక్కిన వారు కొందరయితే నోటి మాటల ఉత్తర్వుల వెనుక నక్కిన వారు చాలామంది ఉంటారు. బినామీ వ్యవహారాలలో కోట్లుగడించిన వారికి గోదాములుగా వ్యవహరిస్తున్న వారు కూడా చాలా మంది ఉండి ఉంటారు.ఎక్కడ చట్టం తన పని తానుచేసుకుని పోయింది? ఎవరు చేసుకోనిచ్చారు కనుక? కోర్టు కొరడా ఝళిపించిన తరువాతనే విచారణ మొదలైంది. అవినీతి చట్టాల, కింద ఐపీసీ నేరాల కింద మంత్రులు ఎంపీలు, ఐఎఎస్ అధికారుల పై ఆరోపణలను అనుమానాలను దర్యాప్తు చేయడానికి సీబీఐకి గానీ పోలీసులకు గానీ ముందస్తు అనుమతి అవసరం రాకుండా హైకోర్టు ఆదేశం ఉపయోగపడింది. అందుకే ధర్మాన, సబితా వంటి తాజా నిందితులను విచారించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని సీబీఐ వాదిస్తున్నది. ముందస్తు అనుమతి అనే నియమం ఉన్నంత కాలం అవినీతి పరులకు అది రక్షణగా నిలుస్తుంది. పిల్ వంటి ఆయుధాలు జనం వద్ద లేకపోతే ఏ అవినీతి రాజకీయ నాయకులూ చట్టానికి దొరకరు. అందుకే ముందస్తు అనుమతినిచ్చే బాద్యతను నీతివంతంగా నిర్వహించేందుకు లోక్ పాల్, లోకాయుక్త సంస్థలు రావాలని అన్నా హజారే కోరుకుంటున్నారు. ఉద్యమిస్తున్నారు. అవినీతి పరులను ఉరితీయాలని ఉరిమే నాయకులు లోక్ పాల్ ను, లోకాయుక్తలను ఎందు కు తేవ డంలేదు? పార్టీ పరంగా ఎందు కు వత్తిడి చేయడం లేదు? అం ద రూ లోక్‌పాల్ కు దొరికి పోతారని భయపడుతున్నారా? నిజం గా చట్టం తన పని తానుచేసుకుని పోయేందుకు వీలు కల్పిస్తే ఎంతమంది ఉరి కంబం ఎక్కుతారో!? అవినీతి దారుణాలు చేసిన నేరగాళ్లను ఉరితీయాలని చిత్తశుద్ధితోనే చెప్పి ఉంటే ఆనం గారు అన్నాహజారే అంతటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా జనం నీరాజనాలు పొందుతా రు. ఆయన అన్నట్టు జగన్‌ను ఉరితీయక తప్పని పరిస్థితే వస్తే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ, కుంభకోణాల్లో ఇరుక్కున్న 2 జి, సి డబ్ల్యుజి వంటీ లంచగొండి కేసుల్లో వేలకోట్లు మెక్కి, అందులో భారీ వాటాలు ఇచ్చి డిల్లీ పెద్దల కాళ్లు మొక్కి, కారాగారానికి చిక్కిన నేతలను ఉరి తీయకుండా వదిలేయడం న్యాయమవుతుందా? ఎవవరినీ ఉరి తీయాలో జాబితాలు రాసుకుని చట్టం పని చేసుకునేట్టు చేయ డం కదా కావలసింది.సబితా ఇంద్రాడ్డి రాజీనామాను ఆమోదించేది లేదని ప్రభుత్వం పక్షాన ప్రకటించిన ఆనం ప్రభుత్వం పక్షాన ఈ అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక శ్వేత పత్రాన్ని కూడా ప్రజలకు ఇప్పిస్తే ఎంతో బాగుంటుంది. అపుడు రాష్ట్రంలో అవినీతి ఉండకూడదని ఆయన తపన పడుతున్నారని ప్రజలకు కూడా అర్థం అవుతుంది.

మంత్రులు రాజ్యాంగాన్ని నమ్ముతామని, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తామని ప్రమాణం చేశారే గానీ ముఖ్యమంత్రిఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తామని ప్రమాణం చేశారా? నేరాన్ని అంతా ఎవరో ఒకరిమీద తోసి నిందితులను రక్షించుకోవాలనుకోవడం పొరబాటు. నిందలలో నిజానిజాలను తేల్చడానికి కావలసిన పరిస్థితి కల్పిస్తే అదే చట్టం పని చట్టం చేసుకోవడానికి అనుమతించడం అవుతుంది. అందాకా నిందిత మంత్రులు రాజీనామా చేయాల్సిందే. వారిని కూడా అరెస్టు చేయాల్సిందే. అది రాజ్యాంగ ధర్మం, రాజనీతి. అందరూ నిజంగా ఎదురుచెప్పలేక భయపడే వారే అయితే నిందారోపణలు కేవలం ముగ్గురుమంవూతుల మీద, కొంద రు అధికారులమీద మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఇంకా మంత్రుపూవరి మీద దర్యాప్తులు ఎందుకు జరగడం లేదు? వారు అవినీతిని ఎదుర్కొన్నా రా లేక వారికి ఆ మహత్కార్యంలో పాలు పంచుకునే అవకాశం కలగలేదా?

ఇక మిగిలింది బతికే నైతిక అర్హత గురించి. ఆ విషయం మాట్లాడితే ఎంతమంది సింహాసనాల మీద ఉంటారు? ఎంతమంది పడిపోతారు? ఎంత మందిని ఉరి తీయాలి? అవినీతి నేరాలకు కూడా ఉరి సరి కాదు. వారు తిన్న ప్రజాధనం కక్కించాలి. వారి డబ్బు వారికి ఇప్పించాలి. నైతిక అర్హతల గురిం చి మాట్లాడితే ఇంకా ఎంతో చెప్పవలసి ఉంటుంది. జైల్లో వేసినా వేయకపోయినా వారు మళ్లీ ప్ర.జాప్రతినిధులుగా చెప్పుకునే అవకాశం లేకుండా నిషేధించాలి. అసలు ఆరోపణలు వస్తేనే ప్రజావూపాతినిధ్యం రద్దయిపోవాలి. వందే ళ్ల నాటి కాంగ్రెస్ విలువలను మళ్లీ ఉద్ధరించడం సాధ్యం కాదేమో కాని కనీసం మీ అధీనంలో ఉన్న పోలీసులు మీరు అధికారంలో ఉండగా మీ సహచరుల పై సాక్ష్యాలు సేకరించి చార్జి షీటు వేస్తే అందుకుఅనుగుణంగా ప్రతిస్పందించడం న్యాయంగా వ్యవహరించడం అవసరం అని నేతలు గుర్తిస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఆనం గారూ.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి