ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు


Tue,March 12, 2013 12:25 AM

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అన్నిచోట్లా మహిళలు అసమానులనే మాట నిజం. ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా సమానత అందుకోని మహిళలు బలహీన వర్గాలే. బాధితులే. నేరాలకు గురయ్యే అభాగ్యులే. ఇక భద్రత గురించి ఆలోచించేవారెవరు?
అత్యాచారాలకు రాజధాని ఢిల్లీ అంటున్నారు. ఆరుగురు కిరాతకులతో భయంకరంగా యుద్ధం చేసిన సాహస మహిళ నిర్భయ చాలాకాలం పోరాడి మరణించింది. ఆ తరువాతనైనా నిర్భయంగా బతుకుతుందనుకున్న ఢిల్లీ ఇంకా తల్లడిల్లుతున్నది. అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కదులుతున్న వాహనాలు అత్యాచారాల వేదికలవుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి వరకు లెక్కిస్తే రోజుకు సగటున నలుగురు అత్యాచారాలకు గురవుతున్నారు. నిరుటితో పోల్చితే రెట్టింపు నేరాలు జరుగుతున్నాయి. జనవరినుంచి ఫిబ్రవరి వరకు ఢిల్లీలో 181 అత్యాచారాలు జరిగాయి. ఢిల్లీలో డిసెంబరు 16 నాటి బస్సు అత్యాచారం తరువాత గస్తీ ముమ్మరం చేసినా నేరాలు ఆగలేదు.

నిర్భయ కుటుంబానికి ఎంత పరిహారం ఇచ్చినా వారికి జరిగిన నష్టం తీరదు. అయి నా జవాబుదారీ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. కాని ఆ కుటుంబానికి భారీ పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఇతర అత్యాచార బాధితులకు ఏం చేస్తుంది? అదేరోజు సామూహిక అత్యాచారం బాధితురాలైన పదేళ్ల దళిత బాలిక కు ఏమిస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్ అడిగారు. పత్రికలు కనీసం ఆ వార్తను మొదటి పేజీలో కూడా వేయలేదు. కొన్ని కేసులను ప్రముఖంగా చూస్తూ ఇంకెన్నో కేసులను అసలు పట్టించుకోకపోవడం ఎంతో అన్యాయం అని ప్రధాన న్యాయమూర్తి బాధపడ్డారు. బాధితుల మధ్య ఇది అసమానత.

స్త్రీ శక్తి పురస్కార్-2012 మార్చి 8న అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా నిర్భయకు ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డు ఇచ్చారు. అత్యాచారాలు తగ్గితే మా అమ్మాయి త్యాగం ఫలిస్తుందని నేను భావిస్తాను అని నిర్భయ తండ్రి ఆ సందర్భంగా అన్నారు. కన్నీరు మున్నీరైన ఆయన తన కూతురును చంపేసిన నేరగాళ్లను ఉరితీయాలని ఆకాంక్షించారు. అమెరికాలో కూడా అంతర్జాతీయ సాహస మహిళ పురస్కా రం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందేశంలో నిర్భయ సాహసాన్ని ప్రత్యేకంగా ఉటంకించారు. నిర్భయ తల్లిదంవూడులు పంపిన సందేశం వాషింగ్టన్‌లో ఉత్సవ వేదికలో చదివారు. నిర్భయ అంతరించింది. కాని అంతరించాల్సింది భయం.

లైంగిక చర్యలకు అంగీకారం తెలిపే వయసును 16కు పరిమితం చేయాలన్న జస్టిస్ వర్మ సూచన విమర్శలకు గురైంది. డబ్బు ఆస్తి సంబంధమైన మామూలు ఒప్పందాలు చేసుకోవడానికి 18 ఏళ్లు అవసరమనే చట్టాలు అమలులో ఉండగా మొత్తం జీవితాన్ని ప్రభావి తం చేసే లైంగిక సంభోగానికి అంగీకారం తెలిపే అర్హతను అమ్మాయికిచ్చే వయసును 16కు ఎందుకు తగ్గించాలి? అమ్మాయికి 18 ఏళ్లు వివాహం చేసుకునే వయసు అని చట్టాల ద్వారా ప్రకటించిన ప్రభుత్వం కామానికి వయసును 18 కన్నా తక్కువ ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నది. ఆర్డినెన్సులో ఈ నియమాన్ని మళ్లీ ఎందుకు మార్చాలి? మగవారికి 21ఏళ్ల దాకా వివాహ యోగ్యత రాదని ఆడవారికి 18కే వస్తుందనడంలో ఎంత మాత్రం సమంజసత్వం ఉందో చెప్పడం కష్టం. ప్రేమ పెళ్లి విషయాల్లో 18 లేదా 21 ఏళ్లు వచ్చినా వచ్చినా పరిణతితో నిర్ణయం తీసుకోగలరా అనే అనుమానం ఉన్న రోజు ల్లో అంగీకారం వయసును తగ్గించాలనుకోవడం అసంబద్ధం.

అంగీకారం అంటే ఏమిటి? వివాహం చేసుకుంటే మహిళ తన శరీరంపైన అన్ని హక్కులు కోల్పోయి వ్యక్తిత్వాన్ని వదులుకుని, ఎప్పటికీ ఏ సమయంలోనైనా సరే అంగీకారం తప్ప మరేదీ చెప్పలేని స్థితిని తెచ్చుకున్నట్టా అనే చర్చ మొదలైంది. జస్టిస్ వర్మ కమిషన్ వివాహ వ్యవస్థలో కూడా జరుగుతున్న రేప్ గురించి ఆలోచించాలని, ఆ నేరా న్ని గుర్తించాలని, అంగీకారంలేని సంభోగం ఇంట్లో కూడా మహిళకు అభవూదత తెచ్చిపెడుతుందని వివరించారు. ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. స్థాయి సంఘం వేరే వివరణ ఇచ్చింది. వివాహంలో రేప్‌ను శిక్షిస్తే దేశంలో కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఆచరణలో చాలా సమస్యలు కష్టాలు వస్తాయని, వివాహం చేసుకున్నారం అంగీకారం ఉందని అర్థమని స్థాయి సంఘం వివరించింది. మౌనంగా ఉండడం నిరసన తెలియజేయకపోవడం, కొన్ని రహస్యాలను కాపాడడం కోసం ప్రయత్నించడం వల్ల బాలిక, మహిళ, భార్య దుర్వినియోగాన్ని భరించడానికి దారి తీస్తాయని, అభవూదతను పోషిస్తాయని, అన్యాయాన్ని చట్టబద్ధం చేస్తాయనే వాదనలను అర్థం చేసుకోవలసి ఉంది. బాలి కగా ఉన్నపుడు ఇంట్లో లైంగిక దుర్వ్యవహారాలకు గురికావడం. ఇంట్లో భర్త కట్నం వేధింపులు లేదా శాడిస్టు హింసలకు గురిచేయడం, వీధిలో, కార్యవూపదేశాలలో లైంగిక వేధింపులు, ఇవన్నీ గాక దుర్మార్గుల అత్యాచారాల నేరాలు, కోర్టుల్లో, పోలీసు స్టేషన్‌లో ఆస్పవూతులలో లైంగికపరమైన చెడు చూపులను వ్యాఖ్యలను భరించే అభవూదతను ఏ విధంగా దూరం చేయాలనే సమస్యను విస్తారంగా చర్చించేందుకు నిర్భయ పై జరిగిన దారుణం కారణమైంది. మహిళల సమానత ప్రశ్నార్థకంగా ఉన్నంత కాలం మహిళలకు, సమాజంలో కొందరు బలవంతులై మరికొందరు బలహీనంగా ఉండే అసమానం ఉన్నంత దాకా బలహీనులకు భద్రత కొరవడుతుంది.

మార్చి 22లోగా కొత్త అత్యాచార నేర చట్టం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్డినెన్సు తొలగించిన రేప్ నేరాన్ని మళ్లీ ప్రవేశపెట్టడానికి అభ్యంతరం లేదని, బాలికల అంగీకార వయస్సును 18 నుంచి 16 కు తగ్గించాలన్న విషయం పైన ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రేప్ అనే పేరు ఆ అత్యాచారపు తీవ్రతను తెలియజేసే పేరు. ఆ పేరుతో నేరాన్ని శిక్షించడానికి చేసే ప్రయత్నాలు ప్రజలకు త్వరగా అర్థమవుతాయని జస్టిస్ వర్మ కమిషన్ వివరించింది. మరో ప్రధానాంశం ఉరి శిక్ష. అత్యాచారం ద్వారా మరణానికి, లేదా బాధితురాలు జీవచ్ఛవంలా మారడానికి కారణమయ్యే నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆర్డినెన్సు నిర్దేశించింది. ఈ నియమాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. శిక్షలు కఠినంగా ఉండాలనే నిర్ణయించింది. అత్యాచారానికి ఏడేళ్ల జైలు శిక్షను 20 ఏళ్లకు పెంచాలన్ననియమంలోనూ ఏ మార్పూ చేయకూడదని భావిస్తున్నది. లైంగిక వేధింపుల పరిహార చట్టాన్ని పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది.

లైంగిక వేధింపులు నేరాలుగా నిర్ధారించే చట్టం ప్రస్తుతం ఆర్డినెన్సు రూపంలో ఉంది. కొత్త బిల్లులో ఈ నేరాలకు శిక్షలు ఉండి తీరతాయి. బిల్లు మరిం త సమక్షిగంగా ఉండాలని, మహిళలకు భద్రతను కలిగించే విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందని చాటుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. భద్రతాభావం ఉందా లేదా అని ప్రభుత్వం పరిశీలించాలి. కేవలం ఆర్డినెన్సు చేయడం, తరువాత బిల్లు తేవ డం అనేది అనేక కార్యక్ర మాలలో కొన్ని భాగాలు మాత్రమే అని గమనించాలి.

తమపై జరిగిన నేరం గురించి చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. అత్యాచారానికి గురైన మహిళ గానీ వారి కుటుంబం గానీ వెంటనే ఫిర్యాదు చేయాలనుకునే వాతావరణం కల్పించినప్పుడే భద్రత ఉన్నట్టు. కోర్టులకు, పోలీసు స్టేషనుకు వెళ్లి న్యాయం కోరడానికి బాధితులకు అనుకూలమైన పరిస్థితులే లేవు. జస్టిస్ వర్మ కమిషన్ విచారణ చేస్తున్నపుడు కొందరు పిల్లలు ఒక మైనర్ బాలికను పోలీసు గస్తీ వాహనంలో వెంటాడి సామూహిక అత్యాచా రం చేసిన ట్టు ఆయనకు తెలియజేశారు. హిందీలో వారితో సాగిన సంభాషణలను జస్టిస్ వర్మ నివేదికలో అనుబంధంలో చేర్చారు. కొన్ని పత్రికలు బయటపె దాదాపు ఆ విషయా న్ని ఎవరూ గమనించలేదు. తీవ్రనేరం జరిగినట్టు తెలిసిన తరువాత బాధ్యతాయుతుడైన పౌరుడిపైన ఫిర్యాదు చేసే బాధ్యత ఉంటుందని చట్టాలు వివరిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వర్మ బాధ్యతాయుతులైన వ్యక్తి. కమిషన్‌లో ఇతర సభ్యులను సంప్రదించిన తరువాత పిల్లలను పోలీసులు చంపేసే పరిస్థితి నివారించడానికి ఆయన ఫిర్యా దు చేయకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం పోలీసులు ఆ తరువాత ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ గమనించ వలసిందేమంటే మాజీ ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం. ఇక భద్రత ఎక్కడ? ఎవరికి?

పిసిఆర్ వాహనం పోలీసుల సామూహిక అత్యాచారం కేసులో కీలకమైన సమాచారాన్ని లాగినట్టు పోలీసులు పై అధికారులకు నివేదిక ఇచ్చారు. 2000 సంవత్సరం వేసవిలో రిడ్జ్ పరిసరాల్లోని గోల్ మార్కెట్ ప్రాంతంలో మారుతీ జిప్సీ పిసిఆర్ వాహనం లోకి ఒక మైనర్ బాలికను ఎక్కించుకుని పరిసర అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అత్యాచారం తరువాత ఆ బాలికను ఎక్కడో వదిలేశారు. ఈ సంఘటనను ఇద్దరు పిల్లలు చూశారు. నేరాన్ని చూసిన ఆనాటి బాలుడు, ఈనాటి యువకుడు ముగ్గురు పోలీసుల భౌతిక లక్షణాలను వివరించాడు. సాక్షి చెప్పిన వివరాలను వీడియో రికార్డింగ్ చేశారు. సాక్షిని గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు వీడియో రికార్డింగ్ జరిగినప్పుడు అక్కడే ఉన్న షెల్టర్ అనే ఎన్‌జీవో నాయకుడు ఇందు ప్రకాశ్ వివరించారు.

నేరానికి సాక్షి అయిన మరోయువకుడు ముంబైకి తరలిపోయి ఆ తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే ఇంకా పరిశోధించి కీలకమైన సాక్ష్యాలు పట్టుకుంటే తప్ప అసలు నేరగావ్లూవరో తెలియదు. అది సాధ్యమో కాదో, పదమూడేళ్ల పాత నేరానికి కావలసినంత బలీయమైన సాక్ష్యాలు దొరుకుతాయో లేదో తెలియదు. అభవూదతకు మూలాలు ఈ అసమాన సమాజంలో ఉన్నాయి. దాన్ని పోషించి అందులో లబ్ధి పొందేది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలను శాసించే డబ్బు, కార్పొరేట్ వ్యాపార మాఫియా అసలు మూలాలు. దీన్నించి బయటపడేసేది చైతన్యం, దాన్ని కలిగించేవి ఉద్యమాలు మాత్రమే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన