అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు


Mon,February 18, 2013 11:13 PM

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యేవి. ఈ నేరాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీల్లేదు. దాడినేరంలో అఫ్జల్ ఉన్నాడా, దాని వెనుక కుట్రలు చేశాడా? దర్యాప్తులో పరిశోధనలో లోపాలు ఉన్నాయా? అసలు దాడిచేసిన వారెవ రో గుర్తించకుండానే కుట్రదారులను ఏ విధంగా నిర్ధారిస్తారు? పార్లమెంటు మీద మారణాయుధాలతోదాడిచేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనడంలోసందేహం లేదు. కాని అసలు కుట్రదారు ఎవరు? ఏ దేశం కుట్ర చేసింది. అది సందేహాతీతంగా తెలియదు. లొంగిపోయిన మిలిటెంట్ హోదాలో నిరంతరం స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) నిఘాలో కనుసన్నల్లో ఉన్న అఫ్జ ల్ పార్లమెంట్ మీద దాడికి ఎప్పుడు కుట్ర చేశాడు? అఫ్జల్ గురు నేరాన్ని పరిస్థితుల సాక్ష్యాల ఆధారంగా మాత్రమే నిర్ధారించినపుడు, ఆయనను ఇరికించారా లేక నేరంలో అతని కుట్ర పాత్ర చట్ట ప్రకా రం తేల్చారా అని ప్రముఖ రచయిత్రి కొన్నికీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. దానికి మరొక రచయిత ప్రవీణ్ స్వామి సమాధానాలు వెతికారు. డిసెంబర్ 13 దారుణం, దాని వెనుక కుట్ర అఫ్జల్ గురు పనే అనడానికి ఏ సాక్ష్యాలు ఉన్నాయో అరుంధతీ రాయ్ పరిశీలించారు. జిలానీ తమను గురు దగ్గరకు తీసుకు పోలీసులు చెప్పారు. కాని కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం జిలానీని కలవకముందే అఫ్జల్ అరెస్టుకు సందేశం పంపడం జరిగిపోయింది. డిసెంబర్ 14, 2001న రాత్రి 8 గంటల తరువాత జిలానీని మిస్ అఫ్సా న్ గురును అరెస్టు చేసి ఉంటారని నేర విచారణ చేసిన అదనపు సెషన్స్ జడ్జి ఎస్‌ఎన్ డింగ్రా తన తీర్పు 78 వ పేరాక్షిగాఫ్‌లో తేల్చారు. అంటే అరెస్టు చేసినట్టున్న రికార్డు సమయానికి 14 గంటల ముందే వారిని అరెస్టు చేసారన్నమాట. అంటే అప్జల్ గురు అరెస్టు కోసం సందేశం పంపే సమయానికి వారిద్దరూ కొన్ని గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉన్నా రు. సాక్ష్యాలలో ఇటువంటి లోపాలనెన్నింటినో అరుంధతీ రాయ్ ఎత్తి చూపారు.అరుంధతీ రాయ్ చేసిన మరొక విమర్శ ఏమంటే కీలకమైన దశలో అఫ్జల్ గురుకు సరయిన న్యాయవాదుల సహకారం లభించలేదని. న్యాయమూర్తులు పి వెంకటరాం రెడ్డి, పి పి నౌలేకర్ ఈ అంశంపైన చాలా వివరమైన వాదనలు విని, కింది కోర్టులో నిందితుడికి దొరికిన న్యాయ సాయం బలంగా ఉందని కనుక ఈ విమర్శలో పసలేదని తేల్చారు. అప్జల్ గురుకు నేర న్యాయశాస్త్రంలో ఉన్న చట్టపరమైన హక్కులలో జరిగిన లోపమేమీ లేదని సుప్రీంకోర్టు వివరంగా తేల్చింది. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ అతనికి నిస్సందేహంగా న్యాయవాది మద్దతు లభించలేదని భావించారు. పరిశోధనలో కూడా లోపాలు ఉన్నాయి. పార్లమెంటు పైన దాడికి వాడిన కారు వివరాలు జిలానీ ఇచ్చారని పోలీసులు వివరించారు. జీలానీని అందులో బాధ్యుడన్నారు. తరువాత అదే సాక్ష్యాన్ని అఫ్జల్ కు వ్యతిరేకంగా వినియోగించారు. కోర్టుముందుకు వచ్చిన రికార్డు ఆధారంగా నేరస్తుడని నిర్ధారించారు. తరువాత శిక్ష నిర్ధారణ ... జాతి అంతరాత్మను శాంతపరచడానికి మరణ శిక్షఅవసరం అని న్యాయమూర్తులు పేర్కొన్నారని జఠ్మలానీ వివరించారు.

పర్వేజ్ బుఖారి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఎస్‌పి దావిందర్ సింగ్ నేను నా క్యాంప్‌లో చాలారోజుల పాటు అఫ్జల్‌ను ఇంటరాగేట్ చేశాను. అతని అరెస్టును ఎక్కడా ఏ పుస్తకంలో కూడా మేము నమోదే చేయలేదు. నా క్యాంపులో చిత్రహింసలు పెట్టినట్టు అఫ్జల్ చెప్పిన వివరాలన్నీ నిజమే. ఆ పద్ధతులను మేము ఆరోజుల్లో అనుసరించాం. అతని జననాంగా ల్లో పెట్రోల్ పోశాం. కరెంటుషాకులు ఇచ్చాం. అయినా అతనితో ఏమీ చెప్పించలేకపోయాను. నాకు హింసించి నేరాలు ఒప్పించడంలో చాలా పేరుఉంది. నా ఇంటరాగేషన్ తరువాత కూడా ఏమీచెప్పడానికి లేకపోతే అతను ఏమీ చేయనట్టే. అతను నేరస్తుడుకాడని మొత్తం డిపార్ట్ మెంట్ ఒప్పుకుంటుంది కూడా.. అని దావిందర్ సింగ్ చెప్పాడు. కోర్టు అఫ్జల్ నేరాంగీకారాన్ని పరిగణించలేదు. నేరాంగీకారం నమోదులో బలవంతం లేకుండా చూసే భద్రతా నియమాలను అనుసరించకపోవడం, అందులో లోపాలు ఉండడం వల్ల అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు చెప్పిం ది.. తనను హింసించి నేరాంగీకారాన్ని రాబట్టారని నిందితుడు చెప్పడం ఇటువంటి నేరాల్లో సాధారణమే. కాని హింసించిన పోలీసు అధికారి అని ఆరోపణకు గురైన అధికారి అవును నేను హింసించాను అంగీకరించడం అసలైన నేరాంగీకారం. దీన్ని ఎందుకు విస్మరించారో?. డిసెంబర్ 23 దాడి ఎవరు చేసారో అసలు కుట్ర ఏమిటో ఇంకా పూర్తిగా తెలియదని అరుంధతీ రాయ్ అన్నారు.అది నిజం. అయిదుగురు సాయుధు లు కారులో దూసుకు వస్తుంటే పోలీసులు ఆపారు. వెంటనే వారు కాల్పులు జరుపుతూ బయటకు వచ్చి దాడి చేశారు. ఎనిమిదిమంది భద్రతా జవాన్లు మరణించారు. ఆ అయిదుగురూ కాల్పుల్లో చనిపోయారు. వారి పేర్లు మహ్మ ద్, రాణా, రాజా, హంజా హైదర్ అని గురు గుర్తించినట్టు అతను పోలీసుల కు ఇచ్చిన నేరాంగీకారంలో పేర్కొన్నారు. వారిగురించి ఇంతే తెలు సు. వారి రెండో పేర్లుగాని ఇతర వివరాలు గానీ తెలియదు. చెల్లని నేరాంగీకారంలోని ఈ పేర్లగుర్తింపునకు కూడా మరే ఆధారాలూ లేవు. వారు పాకిస్తాన్ వారా కాదా కూడా తెలియదు. ముందుగా ఆరుగురు ఉన్నారన్నారు. సిసి టివి కెమెరా రికార్డు చేసిందని చెప్పారు. కాని ఆ రికార్డులు ఎక్కడా ఎవరికీ చూపలేదు. ఎందుకని అరుంధతీ రాయ్ అడిగారు.

22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ రాంమోహన్ రాం, ఇతర భద్రతా దళ అధికారులు, వినయ్ గుప్త, దావిందర్ సింగ్ శాంతి సింగ్ అనే చిత్రహింసల నిపుణులు తనను హింసించినట్టు అప్జల్ వివరించాడు. చిత్రహింసలు భరించడం, అడిగిన డబ్బు ఇవ్వడం, ఎస్ టి ఎఫ్ అధికారులు చెప్పిన పని చేయడం తప్ప తనకు మరో గత్యంతరం లేదని అతను చెప్పుకున్నాడు. లొంగిపోయిన మిలిటెంట్ గా కశ్మీర్ లోని భద్రతా దళాల ఆదేశాల ప్రకారం పార్లమెంట్ పైన దాడిచేసిన వారికి తాను సౌకర్యాలు సమకూర్చానని గురు అనేక సార్లు చెప్పాడు. ఆ విధంగా సౌకర్యాలు కల్పించడం కుట్రలో భాగం అని అనుకున్నా ఆ కుట్ర చేయించిందెవరు అందులో భద్రతాదళానికి చెందిన కొందరి పాత్రగురించి ఆరా తీయనవసరం లేదా? గురు ని ఇరికించారా లేదా అతనే నేరస్తుడా? అరుంధతీ రాయ్ యుకె గార్డియన్ లో రాసిన వ్యాసంలో లేవనెత్తిన మరిన్ని ప్రశ్నలను పరిశీలిస్తే దర్యాప్తు చేయకుండా వదిలేసిన అంశాలు అనేకం ఉన్నట్టు అర్థం అవుతుంది. జైషె మహ్మద్ ముఖ్య నాయకుడు మౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్లో తన విలాసవంతమైన ఇంట్లో హాయిగా ఉన్నాడు.అతన్ని నిర్బంధించి విచారిస్తే తప్ప అసలు విషయం తేలదు. అప్జల్ గురు కుట్రలో భాగస్వాముడని సుప్రీంకోర్టు నిర్ధారణకు రావడంలో ఏ లోపం లేదని నమ్మవచ్చు. దాని అర్థం ఒక మాస్టర్ మైండ్ ఇంకెవరో ఉన్నారని, ఇతనొక్కడే కుట్రదారు కాదని, అతని వెనుక ఇంకేదో పెద్ద శక్తి ఉందని కదా? అప్పుడు ఇతనికి ఉరి శిక్ష వేయ డం ఎంతవరకు సమంజసం? మసూద్ అజర్, ఘాజీ బాబా, తారీక్ అహ్మద్ లు ఈ కుట్ర ఉన్న పెద్ద శక్తులనీ, వీరికి పాకిస్తాన్ లో సకల విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తున్నాయని పోలీసులే చార్జిషీట్ లో పేర్కొన్నారు. వారిలో ఒకరు పట్టుబడితే వారు చెప్పిన సాక్ష్యాన్ని సమర్థించడానికి అఫ్జల్ గురు బతికి ఉండాలి కదా? దొరికిన ఒక్క వ్యక్తిని చంపేసి అసలు నేరస్తులను టెర్రరిస్టులను పట్టుకునే మార్గాన్ని మూసి వేయడం ఎంతవరకు సమంజసం అని పియుసి ఎల్ ప్రశ్నిస్తున్నది.

అయితే కుట్ర కేసుల్లో విషయం ఉరి శిక్ష దాకా వెళ్లిన సంఘటన ఇందిర హంతకుల్లో కేహార్ సింగ్ తరువాత అఫ్జల్ గురు ఒక్కడే. రాజీవ్ గాంధీ హత్యకేసులో కుట్రదారులు ముగ్గురు మద్రాస్ హైకోర్టు స్టే వల్ల ఉరినుంచి తప్పించుకోగలిగారు. విపరీతమైన ఆలస్యానికి కారణాలు కూడా లేకపోవడం వల్ల వారి మరణ శిక్షను జీవిత శిక్షగా మార్చాలన్న వారి వాదన విని మరణశిక్షను నిలుపుదల చేశారు. అఫ్జల్ గురు కేసు కూడా విపరీతమైన ఆలస్యాలతో కూడుకున్నదే. అదే వాదం అఫ్జల్ గురుకు కూడా వర్తించాలి. ఆలస్యాలు న్యాయాన్ని నీరు కారుస్తాయి. అది అఫ్జల్ గురు అయినా మరొకరైనా అంతే. సమంజసమైన గడువులో నిర్ణయించిన కేసు ఒక అజ్మల్ కసబ్‌ది మాత్రమే అనుకోవ చ్చు. అసమంజసమైన ఆలస్యాలకు ప్రాణాలుతీయడం సమర్థనీయం కాదని న్యాయశాస్త్రం తోపాటు న్యాయనిర్ణయాలు అనేకం వివరిస్తున్నాయి. అయినా ప్రాణాలకు సంబంధించిన అంశాలను పెండింగ్ ఫైళ్ల వలె అటక ఎక్కించి మరిచిపోవడం క్షంతవ్యం కాని పాలనానిర్లక్ష్యం. ఆలస్యాలతో చంపేస్తున్నారు. ఆలస్యం చేసి చంపుతున్నారు. ఆలస్యం ముందు, రహస్యం ఆ తరువాత, చివరకు శరవేగంతో ప్రాణాలు తీయడం ఏ న్యాయానికి అందని సమస్య.అప్జల్ గురు ఒక్కరే దొరికినపుడు కుట్ర చేసారన్న ఆరోపణ పటిష్టమైన రుజువులు సంపాదించడం సాధ్యం కాదు. నేరస్తుడనే అనుమానం బలంగా ఉండవచ్చు. నేరస్తుడు అయి ఉండవచ్చు కూడా. కాని మరణ శిక్ష విధించడానికి తగిన స్థాయిలో నేరం సందేహాతీతంగా రుజువుకావడం అవసరం. ఎందుకంటే అతని పాత్ర ఏమాత్రం తక్కువ అని తేలినా, అప్పడికే అతన్ని చంపేస్తే తరువాత చేయగలిగిందేమీ ఉండదు. పూర్తి నిజం ఎప్పుడూ దొరకదు. కాని దొరికిన అంశాలకు పూర్తి సాక్ష్యం ఉండాలి. మన న్యాయం చట్టాన్ని బట్టి ఉంటుంది. నిజనిరూపణ సాక్ష్యాన్ని బట్టి ఉంటుంది. గట్టి సాక్ష్యం లేకుండా మరణశిక్ష న్యాయం కాదనీ, పరిసరాల సాక్ష్యం ఆధారంగా నేరం రుజువైతే మరణ శిక్ష వేయకూడదనే న్యాయసూవూతాలు ఉన్నాయి.

జస్టిస్ వెంకట్రాం రెడ్డి తీర్పు చదివితే అఫ్జల్ గురు నేరనిర్ధారణలో సరైన నేర న్యాయ శాస్త్ర విధానాలను అనుసరించలేదని అనడానికి వీలు కనిపించదు. కాని ఆ తరువాత ఉరి తీయడానికి అనుసరించిన విధానం, తొందరపాటు తనం, రహస్య వ్యవహారాలు, కుటుంబానికి, అతనికి చెప్పకపోవడం, స్పీడ్ పోస్ట్ లో వేయడమే సమాచారం చెప్పడమని వితండవాదం చేయడం, జాతి భద్రత దృష్ట్యా రహస్యం అవసరమని సమర్థించుకోవడం, కనీసం మృతదేహం కూడా కుటుంబానికి అప్పగించకపోవడం సమంజసమైన విధానాలు కావు.అఫ్జల్‌ను ఉరితీయడం న్యాయమని చట్టబద్దమని ప్రభుత్వం విశ్వసిస్తే ఆ పని అంత రహస్యంగా జరపాల్సిన అవసరం లేదు. బతికున్నపుడు అఫ్జల్ గానీ, చనిపోయిన తరువాత అతని శవం గాని ప్రభుత్వ ఆస్తి కాదు. హోం డిపార్ట్‌మెంటుకు సొంతం కాదు. రహస్య నిర్వహణ సమర్థతకు సంకేతం అనుకోవడం దురదృష్టకరం. జైల్ మాన్యువల్ ప్రకారం కూడా గురు కుటుంబానికి మరణ శిక్ష అమలు తేదీని సమయాన్ని తెలియజేయడం బాధ్యత. వ్యక్తి మరణించిన తరువాత మృతదేహానికి జరపాల్సిన అంతిమ సంస్కారాలు కూడా ప్రభుత్వం కార్యక్షికమం కాకపోగా, అది అతని కుటుంబానికి చెందిన మతపరమైన సొంత బాధ్యత. దాన్ని నిరాకరించడం ఏమాత్రం సమంజసం కాదు. మరణశిక్షనుంచి జీవితఖైదు గా మార్చమని అప్జల్ గురు తరఫున అతని భార్య కోరితే రాష్ట్రపతి ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవలసిన అధికారం ఆమెకూ, అతనికీ కూడా ఉంది. తిరస్కరించడానికి చూపిన కారణాలను సమీక్షించాలని సుప్రీంకోర్టును అడిగే హక్కు ఉంది. కొందరికి ఈ అవకాశం కల్పించడం మరికొందరికి నిరాకరించడం న్యాయం కాదు.

పార్లమెంట్ పైన దాడి వంటి సంచలన సంఘటనలు మీడియాకు నిరంతరం హైలైట్ చేసే అంశాలని వేరే చెప్పనవసరం లేదు. దొరికిన సమాచారాన్ని అతిశయోక్తులతో జోడించి పదేపదే ప్రసారం చేస్తూ సమాచారమే సాక్ష్యమన్నట్టు ప్రచారం చేయడం మామూలుగా జరిగే పనే. డిల్లీ హైకోర్టు ముందు 7 సెప్టెంబర్ 2011 న బాంబు పేలుడుసంఘటనకు వెనుక అప్జల్ గురు వర్గానికి సంబంధం ఉందంటూ వచ్చిన ఒక ఈమెయిల్ను మీడియా నిజమో కాదో తెలుసుకోకుండానే అఫ్జల్ గురు ను నిందిస్తూ పదేపదే వార్తా ప్రసారం చేసింది. కార్పొరేట్ మీడియా ఒక వ్యక్తినే పూర్తిగా నిందితుడిని చేసి ప్రజల్లో ఏకపక్షంగా అతనిపైనే నేరాన్ని మోపడం వల్ల నిందితుడిని అన్యాయం జరిగే అవకాశాలు కూడా పరిశీలించాలని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ రైట్స్ కోరుతున్నది. అప్జల్ గురు నిందితుడి హక్కులు కాపాడాలంటే అతని నేరాన్ని సమర్థిస్తున్నట్టు భావించి జాతి వ్యతిరేకులన్న అభివూపాయాన్ని కలిగించడం, అతన్ని ఉరితీయడమే సరి అంటే దేశభక్తులుగా కీర్తించడం కూడా జరుగుతున్న సంగతే. ఈ ప్రచారం ప్రభావం అంతో ఇంతో న్యాయనిర్ణేతల మనసులపైన కూడా ఉంటుందని, పి.యు.సి.ఎల్. వాదించింది. కశ్మీర్ పైన పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం అప్జల్ గురును ఉరితీయకుండా జైలుతో సరిపెట్టాలని మరొక వాదం. మరణ శిక్షను సూత్రవూపాయంగా వ్యతిరేకించడం, హిందూ ముస్లిం వంటి మత వ్యక్తులనే లెక్క ఆధారంగా న్యాయాన్యాయాల అంచనా వేయకూడదు అనేవి ఇతర ప్రధాన అంశాలు. కొందరిని తృప్తి పరచడానికి లేదా ఒక వర్గాన్ని మంచి చేసుకోవడానికి ఉరితీయడం అనే కార్యక్షికమాన్ని వాడుకోవడం సమంజసం కాదని కూడా వారి వాదం. ఇన్ని అంశాలలో లోపాలు, ఆలస్యాలు, నిర్ణయాధికారంలో విచక్షణ, సమాధానం చిక్కని సందేహాలు ఉన్నపుడు ఉరి తీయడం ఎంతవరకు సమంజసం అన్నదే అసలు ప్రశ్న.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles