ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?


Mon,December 31, 2012 11:42 PM

babuuతెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో ఇంకోసారి తేలిపోయింది. పాదయావూతల్లో వైఎస్‌ఆర్ పార్టీ తెలంగాణ పట్ల ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో కూడా తేటతెల్ల మయింది. తెలంగాణలో తిరుగుతూ వాగ్దానాలు చేస్తూ ఓట్లకోసం గాలం వేస్తున్న రాజకీయ పార్టీల అసలు సిసలు రంగులు తేలిపోవడానికి డిసెంబర్ 28, 2012 అఖిలపక్షసమావేశం ఉపయోగపడింది. తెలంగాణ కావాలనుకునే వారికి ఏ పార్టీ అండగా ఉందో తెలుసుకోవడానికి ఈ సమావేశం లో బయటపడిన రాజకీయపార్టీల నిజస్వరూపం ఒక సాధనం.
తెలంగాణ ఎంపీలు చాలా కష్టపడి సాధించిన చిన్న ముందడుగు డిసెంబర్ 28 అఖిలపక్ష సమావేశం.

తెలంగాణ ఇవ్వాలా వద్దా ఒక అభివూపాయం చెప్పండి అని అడగకుండా, ఇద్దరు రండి అని ఆహ్వానం పంపడం ద్వారా 2009 డిసెంబర్ 9 నాటి కమిట్‌మెంట్ తనకు ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. అన్ని పార్టీలు ఇద్దరు ప్రతినిధులను పంపినప్పడికీ ఒకే అభివూపాయం చెప్పిన పార్టీలు అయిదు. అందులో మూడు (టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి) తెలంగాణకు స్పష్టంగా అనుకూలత ప్రకటించాయి.సిపిఎం, మజ్లిస్ తెలంగాణకు స్పష్టంగా వ్యతిరేకం కాదు. స్పష్టంగా సమైక్యతకు అనుకూలం కూడా కాదు. ఆ రెండు పార్టీలు విభజనకు అనుకూలం అని వారేచెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండగానే 9 డిసెంబర్ 2009న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రకటనను స్పష్టంగా విడుదల చేసింది. అదే వరసలో అఖిలపక్ష సమావేశం పెట్టానని కేంద్రం ఇటీవలే మరో సారి చెప్పింది. నిజమైనా కాకపోయినా చెప్పిన విషయం అది.

తెలంగాణ ఏర్పాటుకు అనుకూ లం అని రెండు ప్రధాన పార్టీలు ఇదివరకే చెప్పాయి. తెరాసతో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ పొత్తుపెట్టుకోవడం, మానిఫెస్టోలో ఆవిషయం చెప్పడం, కలిసిపోటీ చేయడం దానికి సాక్ష్యాలు. అబద్ధాలు ఆడడమే రాజకీయమైతే దానికి రుజువులు చెప్పి ప్రయోజనం లేదు. ఈ లెక్కన సి పి ఎం, మజ్లిస్ తప్ప ఏపార్టీ కూడా సమైక్య రాష్ట్రానికి అనుకూలమని, తెలంగాణకు ప్రతికూలమని చెప్పలేదు. సిపిఎం సైద్ధాంతికంగా విభజనకు వ్యతిరేకమన్నా కేంద్రం నిర్ణయిస్తే అడ్డుకోబోమనడం ద్వారా షరతుతో కూడిన అంగీకారం తెలిపినట్టే. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని చెప్పినా మజ్లిస్ పార్టీ రాయల-తెలంగాణా ఏర్పాటు చేయాలని అనడం ద్వారా సమైక్యంగా ఉంచడానికి వ్యతిరేకం అని విభజనకు అనుకూలం అని వెల్లడించింది. వైఎస్‌ఆర్ పార్టీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయాధికారం కేంద్రానికి ఉంది కనుక తీసుకొమ్మని చెప్పింది. ఏకాభివూపాయం లేకపోయినా, అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానించినా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం, కొత్త రాష్ట్ర ఏర్పాటు చేయవ చ్చు. కనుక తెలంగాణకు అనుకూలం అనలేకపోయినా సమైక్యతకు వ్యతిరేకం అనలేము. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలు తెలంగాణకు అనుకూలం అనడానికి వారి చరిత్ర, వర్తమానాలలో ఏమాత్రం అనుకూలమైన వాతావరణం లేదు.

కేంద్రంలో రాష్ట్రంలో ఏలుతున్న కాంగ్రెస్ నెలరోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. ఎన్నికలలో ఉపయోగపడుతుందనే అవకాశ వాదం తప్ప ఆ పార్టీకి మరో విధానం కనిపించదు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని వారు నిర్ణయిస్తే అందుకు ఏకాభివూపాయం ఉన్నట్టే. రాజ్యాంగం ఆర్టికిల్ 3 కింద అధికారాన్ని వినియోగించడానికి పూర్తిగా అవకాశం ఉంది. రాజకీయంగా, రాజ్యాంగపరంగా అనుకూల నియమాలు ఉన్నాయి. అయి నా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి విచక్షణకు సంబంధించిన విషయం కనుక ఇవ్వకుండా కూడా పోవచ్చు. ప్రవర్తన, ప్రకటన, పరిస్థితుల ఆధారంగా నిజానిజాలను నిర్ణయించాలి. అయితే బయటకు కనిపించే పరిస్థితులన్నిటి కన్న కనిపించే రాజకీయ అవసరాలతోపాటు, కనిపించని రాజకీయ లక్ష్యాలు, రహస్యంగా ఉండే రాజ్యాంగ వ్యతిరేక, రాజకీయాతీతం, అవకాశవాద పూరితం, సంపద, అధికారం, వ్యాపార ప్రయోజనాలు అనేవే కీలకాంశాలవుతాయి. కనుక ఏ లెక్కలూ నియమా లూ పనిచేయకుండా కేవలం కనపడని అవకాశవాదం ఆధారంగా తీసుకు న్న నిర్ణయాలే పైకి కనిపిస్తాయి.

కనుక చర్చించవలసింది అవకాశ వాదం గురించి. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కాంగ్రెస్‌లో అవకాశ వాదం ఉంది. గెలుపోటముల సమీకరణాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారేగాని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఎవరికీ లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తెలంగాణను వ్యతిరేకించే కోస్తా, సీమ నేతలు కలిసి కట్టుగా ఉన్నా జాతీయస్థాయిలో తెలంగాణ వ్యతిరేకతలేని వారు ఉన్నారు కనుక, తెలంగాణకు న్యాయం చేయాలని అడిగేందుకు, న్యాయం కలిగేందుకు ఏదో ఓ మూల అవకాశం ఉంది. ప్రాంతీయ అవకాశవాద పార్టీలో ఆ ఆశలు ఉండవు.

టీడీపీ మరో అవకాశ వాద పార్టీ. కోస్తా, సీమ నాయకుల ఆధిపత్యం ఉన్న పార్టీ. ఆంవూధవూపదేశ్ నుంచి విడిపోవడానికి తెలంగాణకు ఏ కారణాలున్నాయో టీడీపీలోంచి బయటపడడానికి తెలంగాణ నాయకులకు కూడా ఆ పార్టీలో అవే కారణాలు ఉన్నాయి. పదవులపై కోరిక వల్ల బయటకు రారు. అవేవీ మిగలవన్నప్పుడు వస్తారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం నా బాధ్యత అన్న చంద్రబాబు మాట ఒక్కటే నిజం. మిగతా మాటలన్నీ ఆ ఇరుసుమీద ఆధారపడినవి మాత్రమే. తెలంగాణ విడిరాష్ట్రం అనే సమస్య టీడీపీకి లేనే లేదు. విడి రాష్ట్రం కాకుండా తెలంగాణ అనే పేరు, అంశం కూడా ఆ పార్టీకి ప్రాధాన్య తా క్రమంలో ఎక్కడ ఉందో వారు చెప్పలేరు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కోస్తాంధ్ర టీడీపీ నేతల వ్యతిరేకత స్పష్టం. బాబు సీల్డ్ కవర్‌లో లేఖను కోస్తాంధ్ర నేత యనమల రామకృష్ణుడు ద్వారా ఇప్పించారు. తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి ద్వారా రెండో స్థాయి బాధ్యతగా మౌఖిక సందేశం ఇప్పించారు. ఆ రహస్యాన్ని వీలైనంత కాలం దాచిపెట్టారు. ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం గురించి తప్ప అనేక విషయాలు ఉటంకించారు. రాజకీయ అస్థిరత, భారీ అవినీతి, అసమర్థ సర్కారు, భిన్న రంగాలలో రాష్ట్రం దెబ్బతినడం, ప్రగతి వెనకపడడం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి దారుణంగా ఉండడం, అద్భుతమైన ఆర్థిక ప్రగతితో అలరారే రాష్ట్రాన్ని కాంగ్రెస్ వారు పతనం చేయించడం, పేదలకు ఉపాధి లేకుండా పోవడం, వగైరా గొప్పగొప్పవిషయాలు ప్రస్తావించారు. తాను 18.10.2008 నాటి లేఖను ఉటంకిస్తూ ప్రధానికి 26.9.2012 నాడు రాసిన లేఖను మళ్లీ ఉటంకించడం గురించి రాసారు. మేం 18.10.2008 నాటి మాటకు కట్టుబడి ఉన్నాం.

ఆ లేఖను వాపస్ తీసుకోలేదు అంటూ మీరో నిర్ణయం తీసుకొని అస్థిరతను దూరం చేయండి అని రాశారు.
28 అక్టోబర్ 2008 నాటి లేఖకు ఆధారం టీడీపీ కోర్ కమిటీ తీర్మానం. ఈ లేఖలో అంతకుముందు రాసిన లేఖగురించి చెప్పారు. తెదేపా కోర్ కమి టీ చాలా సమక్షిగంగా చర్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానించిందని, ఆ తీర్మానం ప్రతిని జతచేసామని రాశారు. ఇది టీఆర్ ఎస్ 2009 ఎన్నికల్లో పొత్తు కోసం షరతు విధించడం వల్ల తెలుగుదేశం ప్రణబ్ ముఖర్జీకి తెదేపా నేత విధిలేక రాసిన ఉత్తరం. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఎటూ తేలని అయోమయం ఉంది. ఈ లేఖలోనిది తెలంగాణ పట్ల తెదేపా చేసిన తొలి సానుకూల ప్రకటన.

రెండోది 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఆతరువాత 2009 డిసెంబర్ 8న అసెంబ్లీలో మీరు తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తాం. మీకు ధైర్యం ఉందా అని స్వయంగా తెదేపా అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. తమ పార్టీలోని కోస్తాంవూధులు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా తెదేపా ఎందుకు ప్రకటన చేసింది? తెలంగాణకు అనుకూలంగా ఉంటే కోస్తాలో తుడిచిపెట్టుకుపోతామేమోననే భయం తనకు ఉన్నట్టే కాంగ్రెస్ కు కూడా ఉందని కనుక తెలంగాణ ఇవ్వబోదనే నమ్మకంతో ఇచ్చింది. కాని టీడీపీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ కు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం, కేసిఆర్ నిరశన విరమించడం జరిగింది.

కన్నడరాష్ట్రానికి చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన మరొకరు కలిసి ఆంధ్రకు ద్రోహం చేసారని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రణబ్‌కు రాసిన లేఖలో, పొత్తు ద్వారా, మానిఫెస్టోలో, డిసెంబర్ 7, 8 ప్రకటనల ద్వారా చేసిన అయిదు కమిట్‌మెంట్‌లను కాలరాసిన ఘనత టీడీపీది. ఉత్తుత్తి రాజీనామాల వ్యూహాన్ని రచించి, కోస్తాంధ్ర కాంగీయుల తో చేతులు కలిపి, తెలంగాణ వ్యతిరేకతకు మనసా కర్మణా కట్టుబడి పకటనలు వేరే రకంగా ఉన్నాయి కనుక వాచా అనలేము) వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణాను ఆపిన ఘనత వారిదని తెరాస అధ్యక్షుడు విమర్శించడంలో అతిశయోక్తి లేదు.

త్రికరణ శుద్ధిలో ద్వికరణ శుద్ధిని రద్దు చేసుకుని రెండు వైపుల చూసే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తెదేపా పాతిపట్టిన ఆ 18.10.2008 నాటి కమిట్‌మెంట్ ను, ఆ పొత్తు కమిట్‌మెంట్‌ను, ఆ డిసెంబర్ 7, 8 నాటి కమిట్‌మెంట్‌లను వదిలేయడం వల్లనే వచ్చే తెలంగాణ రాష్ట్రం రాకుండాపోయిందని కళ్లు తెరిచి ఉన్న సగటుమనిషి ఎవరికైనా అర్థం అవుతుంది. తాను ఇవ్వలేకపోయినా వచ్చిన రాష్ట్రాన్ని ఆపడానికి గాను వదిలేసిన ఉత్తరాన్ని, నీళ్లొదిలిన పాత పనికి రాని ఉత్తరాన్ని, వాపస్ తీసుకోకపోయినా నిర్వీర్యం చేసిన ఉత్తరాన్ని, ఆ ఉత్తరంలో చెప్పిన పాత కమిట్‌మెంట్‌ను పాటిస్తానని ధైర్యంగా చెప్పలేక రహస్యంగా సీల్డ్ కవర్ లో పెట్టి తెలంగాణ వ్యతిరేక నాయకుడి ద్వారా ఇప్పించిన పార్టీకి కమిట్ మెంట్ అంటే ఏమిటో తెలుసా? యనమల స్పీకర్‌గా ఉన్నపుడు తెలంగాణ ప్రతిని ధి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి మాట్లాడితే ఆ పదం వద్దని దాని బదులు వెనుకబడిన ప్రాంతం అనాలని పట్టుబట్టి రికార్డు నుంచి తొలగించాలని సూచించిన సభానాయకుడు చంద్రబాబు,

ఆయన ఆదేశం పాటించిన సభాపతి యనమల గార్లే, పాత లేఖలో ఉన్నదే మా కొత్త కమిట్‌మెంట్ అని చెప్పడం ఒక ఎత్తయితే, 2008 నాటి ప్రభుత్వం ఇప్పుడు లేదు కనుక ఆనాడు ప్రణబ్‌కు ఇచ్చిన లేఖ చెల్లదని చెప్పి తెలంగాణా వ్యతిరేకతను పదేపదే చాటిన యనమల తన మాట తానే దిగమింగి, ఆ పాత లేఖనే ప్రాణం ఉన్న లేఖ అంటూ హోంమంవూతికి కొత్తగా ఇవ్వడం మరొక ఎత్తు. 2008లో ప్రభుత్వం ఇప్పడి ప్రభుత్వం వేరయితే లేని ప్రభుత్వానికిచ్చిన చెల్లని ఉత్తరాన్ని ఇప్పడి ప్రభుత్వానికి ఇచ్చిన పార్టీ, ఏ కమిట్ మెంట్‌ను పూర్తిగా వదిలేసిందో అదే కమిట్‌మెంట్ చాలని కొత్తగా ఏమీ చెప్పబోమని చెప్పిన పార్టీ కమిట్‌మెంటును ఎవరు ఎందుకు నమ్మాల్నో ఎవరైనా చెప్పగలరా?


కొత్తగా ఇచ్చిన ఉత్తరంలో ఏవో సమస్యలు చెప్పిన టీడీపీ తెలంగాణ అంశం అని హోం మంత్రి లేఖలో భాగంగా ఉటంకించి ఇంకెక్కడా తెలంగాణ రాష్ట్రం అన్న మాట కూడా అనని టీడీపీ, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రె స్ సిధ్ధంగా లేదని తెలిసిన తరువాత ఉండీ లేనట్టు రాసీ రాయనట్టు రాసిన ఓ లేఖ ఆధారంగా తెలంగాణ ప్రజల్ని మభ్య పెడుతున్నట్టే, తాను తెలంగాణకు అనుకూలం అన్నది లేఖ వరసే మాటవరసే కాని పనివరస కాదని కోస్తాంవూధులకు రహస్యంగా హామీలు ఇవ్వలేదా, ఆ అస్పష్టతను కోస్తాలో వాడుకోరా? పాదయాత్ర సందర్భంగా ఒక బోనం కుండను ఎత్తి జైతెలంగాణ అని రాసి ఉన్నందుకు దించేసి జై తెలుగుదేశం అని రాసిన బోనంను ఎత్తుకున్న చంద్రబాబుకు తెలంగాణ కన్నా టీడీపీ ఎక్కువ అని రెండు కళ్లలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర లేవని, ఒక కంట్లో కోస్తాంధ్ర మరోకంట్లో తెలుగుదేశం ఉన్నాయని తెలంగాణ ఎక్కడా లేదని తెలంగాణ ప్రజ లు ఎందుకుభావించకూడదు? 2008న ఇచ్చిన మాటను డిసెంబర్ 10, 2009న తప్పడానికి యూ టర్న్ తీసుకున్న తెదేపా, డిసెంబర్ 27న తెలంగాణా గడ్డ (కరీంనగర్ పొత్కపల్లి) మీదనుంచి రాసిన లేఖ ద్వారా మరొక యు టర్న్ తీసుకుని తెలంగాణకు గుండుసున్నా పూర్తి చేసారు. దీన్ని సర్క్యులర్ రెఫన్స్ అంటారు. ప్రతిసారి ఎడమవైపు తిరుగు అని నేత ఒకే మాట చెప్తూ ఉంటాడు, ఆ మాట ప్రకారం ఎడమకే తిరుగుతున్న వ్యక్తి చివరకు మొదలుపెట్టిన చోటికే వస్తాడు. అదీ తెలంగాణకు టీడీపీ ఇచ్చిన నిండుసున్న.

బంగ్లా యుద్ధవిజేత అయిన ఇందిరాగాంధీకి 1971లో మొత్తం దేశం విపరీతమైన మెజారిటీతో ఓట్లు గుమ్మరించి, సీట్లు సంపాదించి పెడితే ఇక్క డి ప్రజలు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను పదకొండు స్థానాల్లో గెలిపించి తెలంగాణ రాష్ట్ర వాంఛను చాటి చెప్పారు. అయినా మోసం చేశా రు. మోసం చేయడానికి వీల్లేనంత మెజారిటీతో తెలంగాణలో తెలంగాణ పార్టీని గెలిపించడం.. మిగిలినవారిని మట్టిగరిపించడం ఒక్కటే కాంగ్రెస్ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ అవకాశవాదాలను అంతం చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోసగాళ్లనుంచి రక్షించుకోవలసిన అవసరం ఉన్నది.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త

38

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన