మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి


Sat,December 1, 2012 11:47 AM

Freedom-of-Expressionఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర్కూట్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్లలో తమకు వ్యతిరేకంగా పరువు తీసే విధంగా కొన్ని వాక్యాలు రాసారని, చంపుతామని బెదిరించినారని, జాతీయ పతాకాన్ని అవమానించారని వారిపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 66-ఎ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, 200cc నాటి సవరణ కింద, కేసు నమోదుచేసి ఇద్దరు సీనియర్ ఉద్యోగులు జగన్నాథరావు, మయాంక్ శర్మలను అరెస్టు చేసి 12 రోజుల పాటు జైలు పాలుచేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

నిజానికి వారి మీద ఫిర్యాదు దాఖలైనపుడు 66-ఎ కింద ఆరోపణలున్నట్టు‘ఎఫ్.ఐఆ.ర్’లో రాయలేదు. తరువాత ఈ సెక్షన్ కింద చాలా సులువుగా జైలు పాలు చేయవచ్చని పోలీసులకు ఆలస్యంగా అర్థమైంది. 12 రోజుల వరకు వారికి బెయిల్ కూడా దొరకలేదు. అసలీ సెక్షన్ ఏమిటి? ఇది న్యాయమా కాదా? దీనికింద ఆరోపించిన నేరాలు జరిగాయా, చేయగలరా? వీరిని అరెస్టు చేయకుండా కేసు నడపలేమా? అని పోలీసులు ఆలోచించడం లేదు. కోర్టులో ఆ విషయాలు అవగాహన అవుతాయో లేదో తెలియదు. కాని వారంతా జైలుకు తరలిపోతుంటారు.

ఈ రోజుల్లో ఎవరినైనా మూసేయాలంటే టెర్రరిస్టు చట్టం అవసరం లేదు. ‘ఐటీ’ చట్టం సెక్షన్ 66-ఎ చాలు. 200ccలో చట్టాన్ని సవరించి ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టినపుడే ఈ రచయితతో సహా పలువురు పరిశోధకులు ఈ సెక్షన్ తీవ్రతను, దుర్మార్గంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలను వివరించి వ్యతిరేకించినా ఎవరూ పట్టించుకోలేదు. నాలుగేళ్ల తరువాత దాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చని అర్థమయి న పెద్దలు, రాజకీయ పలుకుబడి గలిగిన వారు, అధికారంలో ఉన్న వారు, పోలీసులను ప్రభావితం చేయగలవారు, తమ ప్రత్యర్థులమీద దాడి చేయడానికి 66ఎను వాడుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మొదట 66 ఎ ను కోల్ కతా ప్రొఫెసర్ మీద ప్రయోగించి జైలుకు పంపారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షాన రైల్వే మంత్రిని ఉన్నట్టుండి దింపినందుకు వ్యంగ్య చిత్రం తయారు చేసి ఈ మెయిల్ చేయడమే ఆ ప్రొఫెసర్ చేసిన నేరం. అతను మార్క్సిస్టు పార్టీకి చెందిన వ్యక్తి అని కోపించి 66 ఎ కింద కేసు పెట్టారు. ఇది అక్రమ అరెస్టు అని, దీనికి నష్టపరిహారం 50 వేలు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ మాన వ హక్కుల కమిషన్ ఆదేశించింది.

కేంద్ర ఆర్థికమంత్రి పుత్రుడి గురించి ఓ వాక్యం విసిరినందుకు మరొక అమాయకుడు జైలు ఊచలు లెక్క బెట్టాడు. పుదుచ్చేరిలో రవి శ్రీనివాస్ ఒక చిన్న వర్తకుడు, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ సంస్థలో కార్యకర్త కూడా. తన ట్విటర్‌లో వ్యాఖ్యానాలు చేయడం ఈయనకు అలవాటు. ఒకసారి వాద్రా కన్న, కార్తీ చిదంబరం (చిదంబరం కుమారుడు) ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించారు అని ఓ విసురు విసిరినాడు. ఇందుకే అతను జైలు పాలవుతాననుకోలేదు. కార్తీక్‌కు ఆ వాక్యం కోపం తెప్పించింది. ఢిల్లీ నుంచి ఈ మెయిల్ ద్వారా ఆదేశాలు అందాయి. సీబీసీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను పట్టుకోవడం, కటకటాల వెనక్కి తోయడం జరిగిపోయింది. అతను ఏ నేరం చేసినట్టు? వాద్రా కన్నా ఎక్కువ ఆస్తిసంపాదించాడంటే కార్తీక్ పరువు తీసినట్టా? లేక అతనికి అవమానకరంగా మాట్లాడినట్టా? రాజ్యాంగం ప్రకారం ఈ రాతలు రాయడం నేరం కాదు. అయినా ఎందుకింత దౌర్జన్యం చేశారు?

బంద్‌ను బలవంతంగా నిర్వహిస్తే పార్టీలు ప్రజల భావస్వేచ్ఛకు జీవన స్వేచ్ఛకు భంగంకలిగించినట్టేనని, వారు అందుకు బాధ్యత వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని ప్రభావం వల్ల కొన్ని పార్టీలు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి కూడా వచ్చింది. ఇటీవల బాల్‌ఠాక్రే మరణించినపుడు రెండు రోజులు బంద్ పాటించారు. బలవంతంగా మూయించారో లేదో, కేసులుపెడతారో లేదో అన్నదికాదు ప్రస్తుతం సమస్య.

షాహీన్ ధాడా, రేణు శ్రీనివాస న్ అనే యువతులు యథాలాపంగా ఫేస్‌బుక్‌లో బంద్ వల్ల తమకు కలిగిన అసౌకర్యం గురించి రాసుకున్నారు. రోజూ వేలకొద్దిమంది మరణిస్తున్నారు. కాని ప్రపంచం ఆగదు. అని షాహీన్ రాస్తే, ఫేస్‌బుక్‌లో ఆ వాక్యం బాగుంద ని రేణు పేర్కొంది. ఒక రాజకీయవేత్త సహజంగా మరణిస్తే మొత్తం స్తంభించాలా? మనమంతా మౌనంగా ఉండిపోయింది బలానికి భయపడేగాని మన కు ఆ పని ఇష్టపడడం వల్ల కాదు కదా. ఇటీవల భగత్ సింగ్, సుఖదేవ్ వర్ధంతి రోజున ఒక్క రెండు నిమిషాలు ఎవరైనా మౌనం పాటించారా? నిజానికి వారి వల్ల కదా మనకీ స్వాతంత్య్రం వచ్చింది బలవంతంగా గౌరవాన్ని ఎవరూ పొందలేరు. మర్యాద గౌరవాలు ఇచ్చిపుచ్చుకునేవి. ముంబై స్తంభించిందంటే భయంతోనే కాని గౌరవంతో కాదు అని రేణు రాసింది.

ఇక దీనికి ప్రతిస్పందన మరీ బాగుంది. పోలీసులు ఏమంటారంటే, శివసేన కార్యకర్తలు ఈ యువతుల మీద విరుచుకుపడతారేమోనని వారి మీద కేసులు పెట్టి అరెస్టు చేసి వారిని భద్రంగా జైల్లో పెట్టారట. మీడియా స్పందిం చి విపరీతమైన ప్రచారం కల్పించి, నిరసనలు వినిపించిన తరువాత గానీ వారికి స్థానిక కోర్టు ద్వారా బెయిల్ రాలేదు. మరోవైపు భారతీయ పత్రికా మండలి చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ సాహసోపేతంగా ఒక వ్యాసం హిందూ లో రాస్తూ, బాల్ ఠాక్రే చెప్పిన మరా ఠా భూమి మరాఠాలకే అనే వాదం రాజ్యాంగ వ్యతిరేకమని, ఆయనకు తాను నివాళులర్పించలేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాసం హిందూ పత్రిక వెబ్‌సైట్‌లో కూడా ఉంది. యాంత్రికంగా అన్వయిస్తే 66 ఎ కింద జస్టిస్ కట్జూ పైన కూడా కేసు పెట్టి అరెస్టు చేయడానికి వీలుందని, శివసేన నుంచి ఆయనను రక్షించేందుకు అరెస్టు చేస్తామని పోలీసులు అనగలుగుతారా? అయినా కట్జూగారు ముంబైలో కాకుండా ఢిల్లీలో ఉండి తన భావాలను ధైర్యంగా చెప్పగలిగారు. అయినా మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కాని ఎవరైనా ఆ మాట ముంబైలో అని ఉంటే శివసైనికుల పాల బడడమో పోలీసుల చేతిలో షాహీన్ రేణుల వలె అరెస్టు కావడమో జరిగి ఉండేది. అంటే పెద్దలకొకరీతి, మామూలు పౌరులకొకరీతి.

ఇదెక్కడి రాజ్యాంగ నీతి?
ఈ సంఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. ఇదివరకు మీడియా లో పనిచేస్తున్నవారి మీద ఇటువంటి చట్టాలను వినియోగిస్తే పత్రికా స్వేచ్ఛకు భంగం అని గగ్గోలు చేసేవారు. ప్రదర్శనలు జరిగేవి. పత్రికలకు భయపడి ప్రభువులు పెద్దలు, అధికారులు దిగి వచ్చి క్షమాపణలోతోనో, విచారణ కమిషన్లతోనో సర్ది చెప్పేవారు. కథ ముగిసేది. కాని భావవూపకటనా స్వేచ్ఛనుంచే పత్రికా స్వేచ్ఛ వచ్చిందని, దాన్ని దెబ్బతీయడానికి 66 ఎ పనిచేస్తున్నదని మీడియా ఇంతకుముందు గమనించలేదు. నిజానికి 66ఎ కింద పత్రికల మీద కేసులు పెట్టడం ఆరంభిస్తే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పత్రిక ఈ రోజుల్లో వెబ్ సైట్లలో కూడా ప్రచురితమవుతున్నది.

66 ఎ ఆ రకంగా ప్రతి పవూతిక మీద కూడా ఆయుధం వలె దుర్వినియోగం చేయవచ్చు. పౌరులు కలిసికట్టుగా ఉండరు కనుక మీడియా వారికి ఉన్నట్టు వారికిసంఘాలు ఉండవుకనుక, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. వారి పక్షాన మీడియా పోరాడకపోతే, 66ఎ ను వీరి మీద ప్రయోగించే ప్రమా దం ఉందని పాత్రికేయులు తెలుసుకోవాలి. టీవీ మీడియా కేబుల్ ద్వారా కంప్యూటర్‌లలో సైట్లలో స్ట్రీమింగ్‌చేసే అవకాశం ఉంది కనుక, టీవీలో వార్త లు, వ్యాఖ్యలు, పత్రికా ప్రకటనలు, చర్యలు రచ్చలు కూడా 66ఎ దారుణానికి బలయ్యే ప్రమాదం ఉంది. పౌరుల భావ స్వేచ్ఛను రక్షించకపోతే మీడి యా వారి పత్రికా స్వేచ్ఛకు కూడా అదే సమయంలో రక్షణ కరువవుతుంది.

మామూలుగా సమాజంలో గానీ, పత్రికలో గానీ, సినిమాలో గానీ ఒక మతాన్ని ద్వేషించినా, కులాన్ని అవమానించినా, పార్టీ పరువుతీసినా వెంటనే అది నేరమైపోదు. ఆ మాటల పర్యవసానంగా జరిగిన నష్టం గానీ అల్లరిగానీ, ఘర్షణలు గానీ రుజువు చేస్తే శిక్షలు ఉన్నాయి. కాని ఇవే రాతలు ట్విటర్, ఫేస్ బుక్ వంటి సైట్లలో రాస్తే జైలు పాలు చేయడానికి వీలుంది. ఈ ఒక్క వాక్యం అతన్ని ఇనఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 66ఎ నేరస్తుడిని చేస్తున్నదని పెద్దలు, పై అధికారులు అంటున్నారు. పోలీసులు వింటున్నారు.

సెక్షన్ 66ఎ ప్రకారం ఎలక్షిక్టానిక్ మెయిల్ మెసేజ్ ద్వారా తీవ్రంగా నేరపూరితమైన వాక్యం, అల్లరిపెట్టే వాక్యం, తప్పుడు సమాచారమని తెలిసి కూడా ప్రసారం చేసిన వాక్యం, బాధ, అసౌకర్యం, ప్రమాదం, అవరోధం, అవమానం, గాయం, నేరపూరిత బెదిరింపు , శత్రుత్వం, చెడు భావం, కలిగించే వాక్యాలు కంప్యూటర్ సాధనం ద్వారా లేదా వనరు ద్వారా పంపడం నేరం. దీనికి మూడేళ్ల దాకాజైలు శిక్ష, జరిమానా విధించే అధికారం ఉంది.

దీంతోపాటు సెక్షన్ 499 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పరువునష్టం నేరం కూడా చేశాడని ఆరోపణ. 3655 మంది ఫాలోయర్లు ఉన్న కార్తీ తన పరువు రక్షించుకునే అధికారం తనకు ఉందని పరోక్షంగా రవి శ్రీనివాసన్ తన పరువు తీశాడనే నేరారోపణ చేయడమే కాకుండా అతన్ని అరెస్టు చేయించి జైలుపాలు చేశారు. ఈ విధంగా తనపై నేరాలు చేశారని శ్రీనివాసన్ ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు చిదంబరం కుమారుడిని అరెస్టు చేస్తారా? చట్టం ప్రకారం చేయకూడదు. ఇటువంటి కారణాల మీద శ్రీనివాస్‌నే కాదు కార్తీక్‌ను కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇది కేవలం ఇంట్నట్ వాక్ స్వాతంవూత్యానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. పత్రికల రాతలను, టీవీ వార్తలను, బ్లాగ్‌లో పెట్టినపుడు, పత్రికలో వచ్చిన వ్యాసాల కింద వ్యాఖ్యానాలు జోడించినపుడు, వెబ్‌సైట్ వార్తావాహినిలో రాసినందుకు కూడా 66 ఎ ను ప్రయోగిస్తారు కనుక, ఇది అందరికీ సంబంధించిన సమస్య అయిందని గమనించాలి.

ప్రియురాలిని చూద్దామని పాల్ చాంబర్ ఆతృతగా విమాన ప్రయాణాని కి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కాని పొగమంచు వల్ల చెప్పాపెట్టకుండా రాబిన్ హుడ్ విమానాక్షిశయం మూసివేయాల్సి వచ్చింది. చేసేదేమీ లేక ట్విటర్‌లో వారం రోజుల్లో మనం కలుసుకోవాలి లేకపోతే ఈ ఎయిర్‌పోర్ట్ పైన ఆకాశం నుంచి బాంబులు వేస్తాను అని రాశాడు. అతని మీద కేసు పెట్టి రెండేళ్లు జైలుశిక్ష వేశారు. కమ్యూనికేషన్ల చట్టం 2003 సెక్షన్ ప్రకారం ఎలక్షిక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా తీవ్రంగా గాయపరిచే సమాచారం పంపడం, అశ్లీల, అసభ్యకర సందేశాలు ఇవ్వడం అనే నేరం కింద ఈ శిక్ష పడింది. ఇది మన 66 ఎ వలెనే ఉంది. అదృష్టవశాత్తూ అప్పీలులో గెలిచి విడుదలైనాడు కనుక సరిపోయింది. ఇంట్నట్‌లో భావ స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు కూడా ఈ తీర్పు కొంత బలం కలిగించింది. సందర్భాన్ని బట్టి మాటలు నేరాలా కాదా అని నిర్ణయించాలి కాని ఎవరికో ఇబ్బంది కలిగిందని జైలుకు పంపడం ఏమిటి?

పౌరులకు స్వేచ్ఛగా మాట్లాడుకునే స్వాతంత్య్రం ఉందా లేదా? భావవూపకటనా స్వేచ్ఛ ఇంట్నట్లో కూడా ఉండదా అనే తీవ్రమైన అనుమానాలకు ఈ సంఘటన దారితీస్తున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం ఆర్టికల్ 19(1) (ఎ) కింద గ్యారంటీ ఇచ్చింది. కాని అనేక పరిమితులతోపాటు పరువునష్టం ఆధారంగా పత్రికా స్వేచ్ఛమీద పరిమితి విధించవచ్చునని భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(2) నిర్దేశిస్తున్నది. కాని అల్లరిపెట్టడం, అసౌకర్యం, అవమానం, ఇబ్బందిపెట్టే రాతలు అనే పేరుమీద భావవూపకటన స్వేచ్ఛను అరికట్టడానికి రాజ్యాంగం అనుమతించదు. అందుకే సమాచార సాంకేతిక చట్టం (ఇనఫర్మేషన్ టెక్నాలజీ చట్టం) 2000 సెక్షన్ 66ఎ అసౌకర్య, అవమానకర, అల్లరి లేదా ఇబ్బందికరమైన రాతలను కంప్యూటర్ వనరుల లేదా పరికరం ద్వారా పంపితే మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చనడం కచ్చితంగా భావస్వేచ్చకు భంగకరం కనుక రాజ్యాంగ వ్యతిరేకం. ఇబ్బందికరం అంటే ఎవరికి, అసౌకర్యం అవమానం అంటే ఏమిటో ఈ చట్టం నిర్వచించలేదు. నిజానికి ఆ అంశాలు నిర్వచించడం కూడా అసాధ్యం.కాని రాజ్యాంగ వ్యతిరేకం అని హైకోర్టులేదా సుప్రీం కోర్టు నిర్దేశించేదాకా ఈ సెక్షన్ చెల్లుబాటవుతుంది.

అసలీ వాక్యాలు నేరపూరితమైన వాక్యాలా? అల్లరి పెట్టే వాక్యాలా? అనేవూపశ్న ఒకటి. బాధ కలిగించే వాక్యాలు కూడా నేరాలు ఎట్లా అవుతాయనేది మరో ప్రశ్న. బాధ కలిగించడం అంటే ఏమిటి? అసౌకర్యం కలిగించే సమాచారం ఇవ్వడం కూడా నేరమవుతూ అసలు ఎవరైనా ఏమైనా చెప్పడానికి గానీ రాయడానికి గానీ వీలుండదు. కొన్నాళ్లకు జైళ్లలో- దొంగలు, కుంభకోణాల దొరలు కాకుండా పత్రికల్లో రాసిన వారు, ట్విటర్‌లో విసుర్లు విసిరిన వారు, ఫేస్‌బుక్‌లో రాసి బుక్ అయిన వారు టీవీ చర్చలలో పాల్గొన్నవారు మాత్రమే ఉండాల్సి వస్తుందేమో. మొత్తం ఐటి చట్టంలో ఇదే సెక్షన్ ను రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు.

మనకు స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ పాలకులు చేసిన చట్టం ఇండియన పీనల్ కోడ్. 150 ఏళ్లు దాటిపోయిన, ఈ శిక్షాస్మృతిని రూపొందించిన మెకాలే తదితరులే మన స్వతంవూతభారత శాసనకర్తలకన్న నయం అనిపిస్తుంది. భావ స్వేచ్ఛమీద ఐటి చట్టం విధించిన దారుణమైన పరిమితులు శిక్షాస్మృతిలో లేవు. ఉద్దేశపూర్వకంగా పరువు తీస్తేనే నేరం అని అటువంటి పరువుతీసే రాతలు రాసినందుకు రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చునని సెక్షన్ 499 ఐపిసి వివరిస్తున్నది. కాని ఇబ్బందికరమైన రాతలను శిక్షించే అధికారం ప్రభుత్వాలకు పోలీసులకు ఇవ్వలేదు. ఆ విధంగా ఐటి చట్టం రాజ్యాంగం ఆమోదించడానికి వీల్లేని పరిమితులను విధించే ప్రయత్నం చేసింది.

మాజీ ఐఎఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్, ఆయన భార్య డాక్టర్ నూతన్ ఠాకూర్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచిలో 66ఎను రాజ్యాంగ వ్యతిరేకం గా పరిగణించి కొట్టి వేయాలని, ఇది ఆర్టికిల్ 19(1)ఎ ను ఉల్లంఘించే సెక్షన్ అని రిట్ పిటిషన్లో సవాలు చేశారు. అయితే మమతా బెనర్జీ, కార్తీ చిదంబరం, శివసేన నేతల వంటి వ్యక్తుల కోసం 66 ఎ ను దేశ వ్యాప్తంగా దుర్వినియోగం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో సవాలు చేయడం 66ఎ ను దేశవ్యాప్తంగా చెల్లకుండా చేయడం అవసరం.
-మాడభూషి శ్రీధర్
(రచయిత నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయలో ఆచార్యుడు,
మాధ్యమ న్యాయ శాస్త్రపరిశోధనా కేంద్రం సమన్వయకర్త)

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles