చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య


Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క ఉండదు. రైతు లు, తెలంగాణ రాష్ట్రం కోరుకునే యువకులు, ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం నిరాశ, భరించే హద్దు దాటిన నిస్పృహ. తెలంగాణ విషయంలో ఆత్మహత్యలను లెక్కించడం కష్టం. తెలంగాణేతర దోపిడీ కేంద్రం అయిన రాజధానిలో, తెలంగాణ వారి సంఖ్య నానాటికీ తగ్గుతున్న తెలంగాణ ఉద్యమ కేంద్రంలో చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి సంతోష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యాలేఖలో చదివి తెలుసుకోతగిన అంశాలు ఉన్నాయి.
‘ప్రభుత్వాలు, పాలకులు మారినా పరిస్థితులు మారలేదు. కారణం సమైక్య రాష్ట్రం, కష్ట నష్టాలకోర్చి ఉన్నత చదువులు చదివినా బతుకులు రోడ్డున పడుతున్నాయి. అందు కే ఈ త్యాగం.

తెలంగాణవాదులారా మేల్కొనండి. నా వంతుగా తెలంగాణ పోరాటమనే కాగడాకు చమురును అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. అమరుల కుటుంబాలను చూడండి, తోటి విద్యార్థులారా నా కుటుంబానికి ధైర్యాన్నివ్వండి. జైతెలంగాణ జైజై తెలంగాణ’ అని సంతోష్‌కుమార్ కళ్లుతెరిపించే వాక్యాలలో తన సందేశాన్ని నింపినాడు. 1969లో వందలాదిమందిని బుల్లెట్లతో చంపారు. ఇటీవల రాజిడ్డిని బాష్పవాయువుతో చంపారు. ఇవ్వాళ సంతోష్‌కుమార్‌ను నిరాశ విషం నింపిన మోసపు రాజకీయమనే ఫిరంగితో సంతోష్‌కుమార్ ఆత్మవిశ్వాసాన్ని పేల్చివేసినారు. ఆత్మహత్య చేశారు. ఇప్పుడు చంపడానికి అనేక మార్గాలను వాడడానికి ఉద్యమ వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేకులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అన్నిటికన్నా దుర్మార్గమేమిటంటే తెలంగాణ కోసం యువకుల ఆత్మబలిదానం పత్రికల్లో చిన్న వార్తగా మారిపోవడం. తెలంగాణ వాదులు తప్ప మరెవరూ పట్టించుకోకపోవడం. ఆత్మ హత్య చేసుకోవడం అనవసరం అని ఇంకా యువతరం తెలుసుకోకపోవడం.

ఆత్మహత్యా ప్రయత్నం నేరమని చట్టాలు ఘోషిస్తున్నా యి. ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నం చేసినా, ఆ నేరం చేయడానికి గాను ఏ చర్యైనా తీసుకున్నా ఏడాదివరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చున ని సెక్షన్ 309 ఇండియన్ పీనల్ కోడ్ నిర్దేశించింది. ఆత్మహ త్యా ప్రయత్నం నేరమని చెప్పడానికి ఈ సెక్షన్ ఉండడం అవసరమే. కాని ఇది నిరాశాపూరితులై మరణించడానికి ప్రయత్నించి, అక్కడ కూడా విఫలమై జీవంతో మిగిలిపోయి న వారిపైన ప్రభుత్వాలు, ప్రాసిక్యూషన్ వారూ, ఇతర ద్రోహులూ దుర్మార్గ ఆయుధంగా కూడా ఈ సెక్షన్‌ను వాడుకునే ప్రమాదం ఉంది. బతికే హక్కు ఉందో లేదో కాని చచ్చే హక్కు లేదనడానికి ఈ సెక్షన్ ఒక సజీవ ఉదాహరణ. రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మానసికంగా దెబ్బతిన్నాడు.

వంటిమీద కిరొసిన్ పోసుకుని చావబోతే ఆపి కేసు పెట్టినారు. 1987లో బొంబాయి హైకోర్టు 309 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం అని తీర్పుచెప్పి ప్రాసిక్యూషన్ కొట్టి వేసింది. 1985లో డిల్లీ హైకోర్టు సంజయ్ కుమార్ కేసులో ఆత్మహత్య ప్రయత్నంచేసిన వారిని ఆస్పవూతిలో నయం చేయడానికి ప్రయత్నిం చే బదులు జైల్లోకి తోసే ఈ సెక్షన్ తొలగించాలన్నది. 1994 లో నాగభూషణ్ పట్నాయక్, రతినం కేసుల్లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచి బొంబాయి, డిల్లీ హైకోర్టు తీర్పులను సమర్థిస్తూ 309ని కొట్టివేసింది. తరువాత జ్ణాన్ కౌర్ కేసులో (1996) ఆత్మహత్యావూపయత్నం నేరమే అంటూ 309 సెక్షన్‌ను మళ్లీ బతికించింది.
బతికే హక్కును వాడుకోవడానికి ఏ మాత్రం సహకరించని సమాజం, సర్కారు, చనిపోయే హక్కులేదని చాటిచెప్తూనే అందుకు అన్నివిధాలా సహకరిస్తున్నది. చస్తే పోస్ట్ మార్ట మ్ చేస్తుంది, బతికితే ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు కేసు పెట్టి చంపుతుంది.

ఆత్మహత్య నేరం కాదు అంటే దాని అర్థం ఆత్మహత్య చేసుకొమ్మని ప్రోత్సహించడం కాదు. సొం తంగా తమచేతుల్లోనే చనిపోయిన తరువాత ఆ వ్యక్తిని చట్టం ఏమీ చేయజాలదని అర్థం. కాని దానికోసం ప్రయత్నించడం నేరం. వంటిని సొంతంగా అగ్గి అంటించుకుని పూర్తి కాలకుండా చావకుండా ఆస్పవూతిలో కొట్టుమిట్టాడే సమయంలో పోలీసులు ప్రాసిక్యూష న్ కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది దుర్మార్గం అనడానికి ఆస్కారం ఉన్నా ఈ సెక్షన్‌ను తొలగించాలని డిమాండ్ చేయడం సమంజసం కాదు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి అది అనవసరమైన అనుకూల పరిస్థితిని సృష్టిస్తుంది.
ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్న వారిమీద, ఆ దీక్ష ప్రారంభించిన వారిమీద 309 ప్రాసిక్యూషన్ ఆయుధాన్ని సర్కారు వాడడం కొత్త విషయం కాదు. ఇంతకన్న దారుణం లేదు.


ఆంగ్లేయులు చేసిన ఈ చట్టాన్ని సెక్షన్ను, వారు రాజకీయ నాయకుల మీద వాడలేదు. ఎన్నోసార్లు నిరాహారదీక్షకు కూచున్న మహాత్మాగాంధీపైన కాని ఇతర జాతీయోద్య మ కాంగ్రెస్ నేతల పైన కానీ 309 సెక్షన్ ను ఉపయోగించిన దాఖలా లేదు. కాని ఎంత సిగ్గు చేటంటే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత, 309లో కామాలు చుక్కలు కూడా మార్చకుండా నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల మీద, జైల్లో హక్కుల కోసం నిరశనకు కూర్చున్న వామపక్ష నేతల మీద, తెలంగాణ కోసం దీక్ష చేసిన నేతలు, విద్యార్థుల మీద కోకొల్లలుగా 309 కేసులు పెట్టింది. బ్రిటిషర్లే నయం అనే మాట దీన్ని బట్టే అంటున్నారు. తెలంగాణలో ఆ నిజామే వీరికన్న నయం అనే మాట నానుడిగా మిగిలిపోవడానికి ఇటువంటి పనులే కారణం.
జన్యుమార్పిడి తెలివితో బిటి పత్తి విత్తనాలతో ప్రభుత్వం వేలం వెర్రిగా పత్తి పంటను ప్రోత్సహిస్తుంది. అప్పులు చేసిన రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. పెద్దవారికి కోట్ల రాయితీలు ఇచ్చి సామాన్యులునుంచి గొళ్లూడగొట్టి అప్పు రాబట్టే అమానుష బ్యాంకులు, లాభాపేక్ష కోసం బహుళ జాతికంపినీ మోసం లక్షలాదిమంది రైతుల ఆత్మహత్యకు కారణాలు. జాతీయ క్రైం రికార్డ్‌బ్యూరో (1997- 2005) ప్రకారం లక్షా యాభైవేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాని అనధికారికంగా ఈ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. జాతీయస్థాయిలో ఆత్మహత్యల పెరుగుదల రేటు 2.9 శాతం ఉంటే రైతుల ఆత్మహత్యల విషయంలో అది రెట్టింపు అంటే 5.33 శాతం ఉంది.

లక్షా యాభై వేలమంది రైతులు బలిదానం చేసుకున్నా ప్రభుత్వాల రైతు వ్యతిరేక బహు ళ జాతి కంపినీల లాభాలకు అనుకూల విధానాల్లో మార్పులేదు. హృదయంలేని రాజకీయ పార్టీలను, కరడు కట్టిన కఠిన ప్రభుత్వాలను ఆత్మహత్యలతో కరిగించలేమని చెప్పడానికి ఇంతకన్న ఏ ఉదాహరణ ఇవ్వగలం. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏ కంపెనీ బాధపడదు, ఏ ప్రభుత్వమూ కన్నీరుకార్చదు. పత్రికలు కూడా అంతగా పట్టించుకోవు. జన్యుమార్పిడి బిటి విత్తనాలను ఎవరూ ఆపరు. రైతులందరూ సంఘటితమై మోసపు విత్తనాలను వ్యతిరేకించి వాటిని నాటితే ఆత్మహత్యలను పండించుకోవడమే అనే తెలివి తెచ్చుకోవడం మాత్రమే దానికి జవాబు. తెలంగాణ విషయంలో కూ డా అంతే. ఈ జగమొండి ప్రభుత్వాలనే దున్నపోతుల మీద ఆత్మహత్యల జడివాన పనిచేయదనే విషయం సంతోష్ కుమార్‌కు తెలిసి ఉంటే ఆత్మహత్య చేసుకునే వాడు కాదే మో. ప్రభుత్వాన్నే కాదు ఈ ఆత్మహత్యలు ప్రతిపక్షాన్ని, పక్షపాత పత్రికలను, సమైక్యం చాటున తెలంగాణనుదోచుకుని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రాజకీయ వర్తకుల లంచాలు మెక్కిన తెలంగాణ ప్రజావూపతినిధులను కూడా కదిలించలేదు.

ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఈ మొండి వైఖరి ఇంకా దారుణంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఏ పార్టీ అయి నా తమకు లాభం ఉంటుందనుకుం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే నిజాన్ని జనం తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తమకు మనుగడ ఉండదనే భయం లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వ దు. ఇంకా అబద్ధాలుచెప్పి మోసం చేయవచ్చనే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీకి తెలిసేదాకా ఉత్త ఉత్తరాలు రాస్తూ మోసం చేస్తూనే ఉంటుంది. పార్టీలోనే ఉంటూ తెలంగాణ సాధిస్తామనే ఆశతో చూరుపట్టుకుని వేలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనికి రాని ఉత్తరాలు ఎవరూ పట్టించుకోని ఢిల్లీ యాత్రలతో కాలం గడుపుతూనే ఉంటా రు. వీరికి తోడు, తెలంగాణ గురించి చిదంబరం, గులాం నబీ ఆజాద్ వంటి వారు బాధ్యతారహితంగా మాట్లాడు తూనే ఉంటారు.

సంతోష్‌కుమార్ వంటి యువకులలో నిరాశ రగిలిపోయే విధంగా దురుద్దేశంతో వ్యాఖ్యానాలుచేసే టివీ మీడియా సంతోష్‌కుమార్‌లను ఎందరినో చంపేస్తున్నాయి. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపువూతిక పత్రిక అని శ్రీశ్రీ అన్నాడు. కొన్ని టీవీ ఛానెళ్లకు ఈ మాట అతికినట్టు సరిపోతుంది. కొందరు రాజకీయనాయకులు కొన్ని టీవీల్లో వాటాలు కొనుక్కుని, వాస్తవాలను తమకు కావలసిన రీతిలో మలచుకుంటూ నిజానిజాలతో పనిలేకుండా ఎన్ని ప్రాణా లు పోయినా మనకేమిటనే ధోరణిలో మావార్తలు మాఇష్టం అనే రీతిలో చర్చలను చేస్తూ సంతోష్‌కుమార్ వంటి యువకుల్లో నిస్పృహకు ఎరువులువేస్తున్నారు.
ఈ ఆత్మహత్యల వల్ల అమరవీరులుగా మిగలడం కూడా అనుమానాస్పదమే అని యువకులు గమనించాలి. బతికి సాధించాల్సిన రాష్ట్రం తెలంగాణ. అశ్రువులై రాలిపోకం డి, అస్త్రాలై చెలరేగండి అని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపునిచ్చారు. అస్త్రాలైనా కాకపోయినా అశ్రువులై రాలిపోవడం మాత్రం సరికాదు. ఆత్మహత్య అనవసరమైన బలిదానం. శాంతియుతంగా చైతన్యపూరితమైన ఉద్యమం సాగించడం, అసాధారణమైన సమైక్యత చాటడం నేటి అవసరం. ఎన్నికలొస్తే తెలంగాణ వ్యతిరేకులను, అనుకూలం అని నమ్మబలికే మోసపూరిత పార్టీలను మట్టిగరిపించడమే మార్గం. అంతేకాని ఆత్మ బలిదానాల వల్ల ఏ ప్రయోజనమూ లేదు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ యూనివర్సిటీలో ఆచార్యులు, మీడియా లా సెంటర్ అధిపతి

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన