రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం


Fri,December 14, 2012 05:16 PM

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్తే తెలంగాణ’లో రాసిన వ్యాసం చదివి ఉద్యమాన్ని అణచివేస్తుంటే ఎవరిది బాధ్యత అనీ, ఆ నిర్ణయం వల్ల, ఆలస్యం వల్ల ప్రాణా లు పోతుంటే ఎవరు బాధ్యత వహిస్తారని పెద్దలు, యువకులు ఫోన్ చేసి అడిగారు. ఉత్తరాఖండ్‌లో ఉద్యమించిన వారిని ఊచకోత కోసినట్టే ఇక్కడ కూడా హింసిస్తున్నారని, దానికి పరిష్కారం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడి ఉద్యమాన్ని వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉన్నా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా అదేమీ లేదని అబద్ధాలు నివేదిస్తున్న వారికి ఎవరు బాధ్యత అని అడిగారు. ఆవేదనతో కూడిన ఆ ప్రశ్నలకు సమాధానం అవసరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొరుకునే హక్కు జనులకు ఉన్నది. అదే విధంగా శాసనసభ ఆమోదం లేదా తీర్మానం గానీ లేకుండానే, రాష్ట్ర ప్రభుత్వఅంగీకారం గానీ, మెజారిటీ మద్దతు గానీ అవసరం లేకుండానే తెలంగా ణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజ్యాంగపరమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. తెలంగాణ కోసం ఉద్యమించే రాజ్యాంగ హక్కు, సహాయ నిరాకర ణం చేసే అధికారం కూడా ఉన్నదని రాజ్యాంగ నియమాలు వివరిస్తున్నాయి. అంతేకాదు ఈ స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు తీసుకోవడం న్యాయం కాదని, అటువంటి సంఘటనలను సవాలు చేసే అధికారం న్యాయ స్థానాల్లో చర్యలు తీసుకొనే అవకాశం చట్టపరంగా ఉన్నది.

అలాగే ఉద్యమకారులను ఎదుర్కొనే సమయంలో నడిరోడ్డుమీద ప్రదర్శనలు మార్చ్‌లలో పాల్గొనే జనంమీద హింసాత్మకం గా వ్యవహరించకూడదనే నైతిక సూత్రాలతోపాటు, అటువంటి సందర్భాలలో నష్టపోయిన వారి కి పరిహారం చెల్లించే బాధ్యత చట్టపరమైన విధి అని చట్టాలు తెలియజేస్తున్నాయి. ఎన్నో కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వాలు ఏవిధం గా బాధ్యత వహించాలో, దురుద్దేశంతో, అతిగా, తీవ్ర నిర్లక్ష్యంతో పోలీసులుగానీ ఇతర అధికారులు గానీ వ్యవహరిస్తే అందుకు వారుకూడా వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని చెప్పాయి. వారితోపాటు ప్రభుత్వానికి పరోక్ష యాజమాన్య బాధ్యత ఉంటుందని , పోలీసులు ఇతర అధికారులు న్యాయబద్దంగా వ్యవహరిస్తూ ఉద్యమాలను ఎదుర్కొన్నపుడు, అనివార్యంగా జనానికి నష్టం జరిగినపుడు ఆయా అధికారులు వ్యక్తిగతంగా బాధ్యులు కాకపోయినా ప్రభుత్వం నైతికంగా, రాజ్యాంగపరంగా కూడా పరోక్ష బాధ్యత వహిం చి ఆ విధంగా నష్టపోయిన పౌరులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అనేక తీర్పులలో వివరించింది.

ప్రభుత్వపాలనపైన రాజ్యాంగ విధించిన పరిధులు ఇవన్నీ. ఈ పరిధుల కు లోబడి నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతున్నది. కానీ ఈ నష్టానికి ఎవరిని బాధ్యులను చేయా లో, ఏవిధంగా బాధ్యులను చేయాలో రాజ్యాంగం నిర్దేశించలేదు. అది సాధ్యం కూడా కాదు. ఫలానా సమస్యపై మీరు నిర్ణయం వెంటనే తీసుకోకపోవడం వల్ల ఇంత భారీ నష్టం జరిగిందనీ, కనుక ఫలానా వారికి ఇంత పరిహారం చెల్లించాలని ఏవిధంగా నియమం రూపొందిస్తారు? అది ఏవిధంగా అమలవుతుంది?స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఎంతో వేగంగా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన జాతీయ కాంగ్రెస్ నాయకులు, ప్రధాని, మంత్రివర్గం వెను నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జాతి ఇప్పటికీ నష్టపోతూనే ఉన్న ది.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు మరుసటి సంవత్సరం సెప్టెంబర్ 17 దాకా స్వేచ్ఛాస్వాతంవూత్యాలు రాలే దు. స్వాతంత్య్రం ఆలస్యం కావడం మాత్రమే కాదు, జనంపై ఊచకోత సాగుతున్నా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడూ ఇప్పుడూ అంతే. తెలంగాణ ఇవ్వడానికి ఆలస్యం జరుగుతుంటే వందలాది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాణాల గురించి ఎవరికీ లెక్కలేదు. ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు ధ్వంసమైతే మళ్ళీ అక్కడే నిలబెట్టడానికి చర్యలు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలకు జరిగిన నష్టానికి పరిహారం, పరిష్కారం లభించింది. కాని దాదాపు 1000 మంది ప్రాణాలు బలిగొన్న దుర్మార్గానికి పరిష్కారం లేదు. పరిహారం అంతకన్నాలేదు. ప్రాణంలేని బొమ్మలను నిలబెట్టడానికి లక్షలు ఖర్చు చేస్తారు. కాని మరొక ప్రాణమైనా నష్టపోకుండా చూడాలన్న తపన లేదు. జీవించే హక్కు బతికున్న మనుషులకే పరిమితమైనా వారి ని ఆ నిర్ణయంతో చావకుండా ఆపడానికి ఉపకరించడం లేదు.

నిజాం నవాబు అండదండలతో రజాకార్లు సాగిస్తున్న మానభంగాలు, హత్యల నుంచి హైదరాబాద్ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదు. సమైక్యభార త రాజ్యంలో చేరాలన్న హైదరాబాద్ ప్రజల ఆకాంక్షను అనవసరంగా అన్యాయంగా తొక్కిపెట్టింది నాటి కేంద్ర ప్రభుత్వం. కేవలం ఆలస్య నిర్ణయమే దానికి కారణం. అందువల్ల కొన్నివేల గ్రామాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని, జమీందార్ల దుర్మార్గాన్ని సవాలు చేసిన వారిని ఊచకోత కోశారు. నెత్తురు పారించారు. తెలంగాణలో ఉన్న కుటుంబాలు పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితి ఉందంటే అందుకు అప్పుడు దేశాన్ని పాలిస్తున్న స్వాతంత్య్ర సమరయోధులు సిగ్గుతో తలదించుకోవలసిన తరుణం అది. కమ్యూనిస్టుల సాయుధపోరాటం అండగా లేకపోతే ఈ మరణాలు మానభంగాలు దారుణ హత్యలు ఇంకా మితిమీరి పోయేవి. కాని తరువాత వచ్చిన ప్రభుత్వాలు జమీందార్లకు అండగా నిలబడి, ఆ కమ్యూనిస్టులను కూడా దారుణంగా అణచివేయడానికి చేయరాని పనులన్నీ చేశారు. ఆనాటి హైదరాబాద్ రాజ్యానికి నవాబు పాలనలో, బ్రిటిష్ పాలనలో, స్వతంత్ర భారతంలో అదేగతి. చివరకు 2012లో ఈనాటి విశాల విషాదాంవూధవూపదేశ్‌లో తెలంగాణకు అదే అధోగతి. ఇక్కడ అక్రమవ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించుకుని ఇక్కడి ప్రజల్నే రకరకాలుగా అవమానించే దుర్మార్గానికి కొందరు పాల్పడుతున్నారు.

అప్పళంగా వచ్చిన వేలకోట్ల రూపాయలను తెలంగాణ వ్యతిరేక నిర్ణయాల కు లంచాలిస్తున్నారు. కేంద్రంలో తెలంగాణ వ్యతిరేక నిర్ణయం లేదా సానుకూల నిర్ణయం వాయిదా జరిగిన ప్రతిసారీ ఈ లంచగొండి వ్యాపార రాజకీ యవేత్తల నల్ల డబ్బు లంచాల రూపంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది. సుపరిపాలన సంగతి దేవుడెరుగు అసలు పాలనే లేకపోతే. దండిగా సొమ్ము దండుకోవడం, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఆ డబ్బు ఖర్చుచేయడం తప్ప మరో ఎజెండా ఎవరికీ లేదు. తెలంగాణ అడిగేవాడు లేడని అబద్దాలు రాసే మీడియా, తెలంగాణ ఉద్య మం లేదని డిల్లీకి నివేదికలు ఇచ్చే ప్రభుత్వ ప్రతినిధులు, అధికార పార్టీ అధిష్ఠాన దూతలు, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అన్ని రకాల నేలబారు చర్యలకు పాల్పడే పాలకులు, పోలీసులు, ఎంత అణచివేసినా ఉవ్వెత్తున జనం వస్తే, రాలేదని వాదిస్తూ టీవీల్లో మాట్లాడే మేధావులు, గ్రాఫులు గీసి వారు వందలో వేలో అని నిరూపించడానికి ఆపసోపాలు పడే తెలంగా ణ వ్యతిరేక లాబీయిస్టులు ఇక్కడి జనం హక్కులను కాలరాస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి జనం వెన్ను మీద విరుగుతున్న లాఠీలతోపాటు, డిల్లీవీధుల్లో లంచం డబ్బు లాబీలు, కుహనా మేధావుల లాలూచీలు, తెలంగాణ కాంగ్రెస్ ఖాదీలాల్చీల లాలచ్‌లు కూడా పనిచేస్తున్నాయి.

ఈ విషాదాంవూధలో కోస్తా రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమించే స్వేచ్ఛ ఉంది. దాన్ని డబ్బిచ్చి పుట్టించి, పోషించే నేతలూ ఉన్నారు. అక్కడ పోలీసుల, అధికారుల అండదండలు ఎన్నో. వారి సాయంతో విద్యార్థులు ధర్నాలు చేస్తారు, బస్సులు తగల బెడతారు. యూనివర్సిటీ డబ్బుతో, యుజిసి ప్రాజెక్టు కింద ప్రొఫెసర్లు సమైక్యాంధ్ర సెమినార్లు నిర్వహిస్తారు. పక్షపాత మీడియా దాన్నే కొన్ని రోజులపాటు హైదరాబాద్ లో పదేపదే ఫోకస్ చేస్తుంది. వెంటనే సిడీలు చేసి పుస్తకాలు రాసి, అందమై న ఫోల్డర్లలో నివేదికలుగా మార్చి హోంమంత్రికి, అధిష్ఠాన దేవతలకు ముడుపులతో సహా సమర్పిస్తారు. ఇక్కడ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ పోలీ సు క్యాంప్‌గా మారిపోతుంది. గేట్లు మూసేస్తారు. హాస్టళ్లో ఉండనీయరు. ఆర్ట్స్ కాలేజీ పనిచేయకపోయినా హాస్టళ్లు మూసినా పోలీసు క్యాంప్ మాత్రం ఉంటుంది. వారికి లాఠీలు, కవచాలు, బాష్పవాయు గోళాలు, తుపాకులు, తూటాలు సిద్ధంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వెంటనే అది ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే గేట్లు మూయడం, లోపల విద్యార్థులను, అటుగా వచ్చిన నేతలను, అందులోంచి ప్రయాణించే జనాలను కొడుతుంటారు. హాస్టళ్లనుంచి బయటకు రానీయరు. వారు అక్కడ ఉండి చదువుకోకుండా, తిని ఉద్యమిస్తున్నారని నిందిస్తారు. బయటకు వస్తే లాఠీలతో కొడతారు. ఎంత మంది తెలంగాణ విద్యార్థుల నెత్తురు ఉస్మాని యా యూనివర్సిటీలో పారుతున్నదో ఎవరూ చూడరు. మీడియా వారు రారు. వచ్చినా ఆ దృశ్యాలు చూపరు. ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులు చిత్రీకరించనీయరు.

వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ కూడా పోలీసు శిబిరమే. కానీ హైదరాబాద్ కాదు కనుక, అక్కడ కోస్తాంవూధకు చెందిన తెలంగాణ వ్యతిరేకుల సంఖ్య తక్కువ కనుక అణచివేత ఉన్నా అంత తీవ్రంగా ఉండదు. అక్కడ కూడా తెలంగాణ ద్రోహులు, రాజకీయస్వార్థపరులు, పదవి కోసం అధికార కేంద్రాల్లో దూరేవారు ఉన్నారు. కనుక మొత్తం పోలీసు శాఖ నిఘా విభాగం, అందరూ ఉస్మానియా మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. డబ్బులో మునిగి తేలి ఆర్థిక నేరాలతో సుసంపన్నలై తరువాత రాజకీయాల్లోకి వచ్చిన దుర్మార్గపు ప్రజా ప్రతినిధులు, వితండ వాదం చేసే కుహనా మేధావులు, అధికారంలో ఉండి బాధ్యతా రహితంగా మాట్లాడుతూ, ఆమాటలను ప్రత్యక్ష ప్రసా రం చేసేందుకు మీడియా వారికి లక్షల రూపాయలు ఇచ్చే డబ్బుజబ్బుపడిన వారు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మూసి వేయమంటారు. బ్రిటిష్ కంపెనీ పాలకులకన్న ఈకార్పొరేట్ రాజకీయ ప్రతినిధులు అధములు. అప్ప టి విద్యావిధానం గుమాస్తాలను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని మనం అంటున్నాం. కాని విశ్వవిద్యాలయాలను మూసివేయాలనే ఈ కుహనా మేధావులు వారికన్న దారుణమైన శక్తులు. ఈ దుష్టు లు దుర్మార్గుల నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రసాధనే. ప్రజల హక్కులను డబ్బుకోసం కాలరాచే నియంతలు వీరు. ప్రజాస్వామ్యం అంటే వీరికి డబ్బు అధికారం సంపాదించి పెట్టేందుకు ఉపయోగపడే ఒకయంవూతాంగం.

మరో వైపు ఉద్యమాన్ని అణచివేయడానికి తెర తెరముందు అనేక ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తారు. నిర్దేశించకపోయినా ఆపనులు చేస్తారు. ఢిల్లీకి పిలిపించి మరీ ఏ విధంగా అణచివేయాలో చెప్తారు. చివరినిముషంలో అనుమతి ఇస్తారు. మార్చ్‌కు జనం తరలి రాకుండా రైళ్లు నిలిపివేస్తారు. అందువల్ల ఎన్నిలక్షల రూపాయల నష్టం వచ్చినా సరే. బస్సు లు కూడా నిలిపివేస్తారు. ప్రజారంగంలో ఉన్న రైల్వే, ఆర్టిసి సంస్థలను రాజకీయ ప్రయోజనం కోసం దుర్వినియోగం చేయడం అంటే ఇదే. తెలంగాణ వ్యతిరేక మేధావులు ఎవ్వరూ దీన్ని ప్రశ్నించరు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసి కొందరిని చంపైనా సరే మార్చ్‌లను ఆపేయాలని ఉచిత సలహా ఇస్తారు. ఆ రోజు జనం రోడ్ల మీద నడవకుండా చేస్తారు. బారికేడ్లతో ఆపుతారు. జన నిర్బంధం వీరే చేస్తారు. అయినా వస్తే లాఠీలతో కొడతారు, నేతలను ఈడ్చుకుపోతారు, మహిళలను జుట్టు పట్టుకుని లాక్కుపోతారు. వారి కొంగులను, చున్నీలను లాగి అవమానిస్తారు. ఉద్యమ కారులను సామాన్లవలె ఈడ్చి పోలీసు వాన్లోకి విసిరేస్తారు. యుద్ధంలో శత్రువులను కూడా సగౌరవంగా చూడాలని అంతర్జాతీయ హ్యుమాని లా నియమాలు ఉన్నాయి. కానీ తెలుగు సినిమాలో విలన్ల వలె మనుషుల్ని విసిరి పారేస్తారు. ఇది అమానుషం.

బ్రిటిష్ పోలీసులు కూడా ఇంత అమానుషంగా వ్యవహరించలేదు. తెలంగాణ పట్ల ద్వేషంతో ఉద్యమకారులను హింసిస్తున్నారు. వారి వాహనాలను తగల బెట్టి దాని మీద మూత్రవిసర్జన చేస్తారు. ఎమ్మెల్యేలయినా, అధ్యాపకులైనా వారి దృష్టిలో మనుషులే కాదు. ఈ లాబీయుస్టులంతా జాతి సమైక్యత కోసం కంకణం కట్టుకున్న జాతి పితలు. తెలంగాణ అడిగిన ప్రతివాడూ ఒక ద్రోహి అన్నట్టు పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారాన్ని లాఠీని తుపాకీని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు.
రాజ్యాంగానికి ఈ దుర్మార్గపు రాజకీయం తెలియదు. పాలకుల డబ్బు ప్రలోభ ప్రభావాలను రాజ్యాంగం నిరోధించలేదు. కుహనా మేధావులకు మానవ విలువలు తెలిపే, రాజకీయనాయకులను పరిపాలనా నీతివంతులు గా, ప్రజాహక్కులు కాపాడే నాయకులుగా తీర్చిదిద్దే వ్యక్తిత్వ వికాస గ్రంథం కాదు రాజ్యాంగం. నీచ రాజకీయాలకు రాజ్యాంగంలో సమాధానం దొరకదు. నిజమైన ప్రతిఘటన, ఉద్యమ చైతన్యవ్యాప్తితో తెలంగాణ జనులను ఉద్యమానికి ఉత్తేజితులను చేయడం తప్ప పరిష్కారం చట్టాల్లో, కోర్టుల్లో ఉంటాయనడానికి వీల్లేదు. అయితే పాలకులకు బాధ్యతలు గుర్తు చేయడానికి రాజ్యాంగ నియమాలను, సుప్రీంకోర్టు తీర్పుల విలువలను గురించి చైతన్యం కలిగించడం, హక్కుల పట్ల అవగాహన కల్పించడం అవసరం.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ యూనివర్సిటీలో ఆచార్యులు, మీడియా లా సెంటర్ అధిపతి

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి