‘మార్చ్’ రాజ్యాంగం హక్కు


Fri,December 14, 2012 05:11 PM

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ చేసే హక్కు కూడ అంతే రాజ్యాంగ సమ్మతం. ఆ స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు ఉంది. అది ప్రజాస్వామ్యపు ప్రాథమిక హక్కు. అందుకు పరిమితరూపంలోనైనా అనుమతించకుండా ప్రభుత్వానికి మరో మార్గం లేదు. పూర్వహైదరాబాద్ రాజధాని, ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్లు జనం అందరూ వినియోగించుకోదగిన ప్రజావూపదేశాలు. అక్కడ జైతెలంగాణ అని నినదించి ముందడుగు వేసే అధికారం, స్వేఛ్ఛ స్వాతంత్య్రం ప్రతి పౌరుడి కీ ఉంది. దాన్ని కాదనడం పౌరసత్వ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరే క, సంవిధాన విఘాతక చర్య అవుతుంది. మార్చ్‌ను పరిమితంగానైనా అనుమతించడం వివేకవంతమైన చర్య. తెలంగాణ వారే కాదు ఎవరైనా ఒక వూపత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరడం జాతి వ్యతిరేకం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని పాలకులు, మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, శాంతి భద్రతలు కాపాడేబాధ్యత ఉన్న పోలీసులతో సహా అందరూ అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రతి పౌరుడికి ఆర్టికల్ 19(1)(ఎ) భావవూపకటన స్వాతంత్య్రం ఉందని ప్రకటించింది. గ్యారంటీ ఇచ్చింది. పాలకులు ఈ స్వేచ్ఛను అభివూపాయ ప్రకటన అవకాశాలను ఆపరాదని, పలికే గొంతును నొక్కరాదని హెచ్చరించింది. పికెటింగ్, ధర్నా, ప్రదర్శన, సమ్మె కూడా భావవూపకటన రూపాల్లో భాగాలేనని అమెరికన్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు, చట్టాలను విమర్శించే అధికారం, పాలనను నిరసించే స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వా మ్యం నిలబడే అవకాశం లేదు. ఒక ఉత్తర భారతీయుడికి చెందిన దుకాణం ముందు ధర్నా చేస్తూ ఎవరూ ఆ దుకాణంలో వస్తువులు కొనకుండా ఆపడం ఈ స్వేచ్ఛలో భాగం కాదని మద్రాస్ హైకోర్టు వి వెంగన్ కేసులో (1951) తీర్పు చెప్పింది. ప్రధాన రహదారులలో ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని హిమ్మత్ లాల్ కె షా కోరితే కమిషనర్ ఆఫ్ పోలీసు నిరాకరిస్తారు. బొంబై పోలీసు చట్టం ప్రకారం అనుమతిని నిరాకరించి ఊరేగింపును నిషేధించే అధికారం ఉందని, ఆ చట్టం సమంజసంగానే భావవూపకటన స్వాతం త్య్రం పైన పరిమితులు విధించిందని పోలీసు కమిషనర్ వాదనను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. కాని అప్పీలులో సుప్రీంకోర్టు (1973)1 ఎస్.సి.సి 227 ఊరేగింపులను నిషేధించే అవకాశం ఉండే శాసన నియమాలు వాటికింద చేసిన నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన పౌర అభివూపాయ స్వేచ్ఛను హరించే పరిస్థితి ఉండకూడదని వివరించింది. రహదారిలో ఊరేగింపు జరపడం అంటే చాలా మంది జనం రహదారిమీద నడిచే స్వేచ్ఛను భావ వ్యక్తీకరణ అధికారంతో సహా వినియోగించుకున్నట్టు అవుతుందని, దాన్ని నిరాకరించడం అంటే ప్రాథమిక హక్కును వినియోగించనీయకపోవడమే అవుతుందని, ఊరేగింపులను క్రమబద్ధీకరించడం కోసం అనుమతి కోరే నియమం చేయడం సమంజసమేననీ, కాని దాని అర్థం దాన్ని నిషేధించే అధికారం పోలీసులకు ఇవ్వడం కాదని, సమయానికి, ప్రదేశానికి సంబంధించి పరిమితులు విధించడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు వివరించింది. ఒకే చోట బహిరంగ సభ జరప డం సభా స్వాతంవూత్యానికి సంబంధించిన అంశమైతే కదిలే జనవూపవాహం ఊరేగింపులో కనిపిస్తుందని, ఇది భావవూపకటనకు చెందిన స్వేచ్ఛఅవుతుందని రాజ్యాంగ నిపుణుడు డైసీ చేసిన వ్యాఖ్యానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

రహదారిని ఒకరు మరొకరు ఇంకొకరుకలిసిగానీ విడివిడిగా గానీ ఉపయోగించే వీలున్నపుడు అందరూ కలసి వినియోగించుకోవచ్చు. కదిలే ప్రజాసమావేశం వంటిదే ఊరేగింపు అనీ, ఇది సమావేశ స్వాతంవూత్యానికి భావ ప్రకటనా స్వేచ్ఛ కు సంబంధించిన అంశమని ప్రధాన న్యాయమూర్తి మాథ్యూ రాజ్యాంగ నిపుణుడు డైసీ వ్యాఖ్యానం ఆధారంగా వివరించారు. రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ),ఆర్టికల్ 19(1)(బి) కింద రెండు ప్రాథమిక హక్కుల వినియోగం ముడిబడి ఉన్నది ఊరేగింపు స్వేచ్ఛ. జనం వినియోగించే వీధిలో ఊరేగింపు జరపడం ప్రాథమిక హక్కులో భాగం అయిందనుకున్నా ఇతర జనులకు కూడా ఆ రోడ్డును పార్కును వినియోగించే హక్కు కూడా ఉంది కనుక వారి హక్కుల వినియోగానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకు క్రమబద్ధీకరించే అధికారం ఉంటుంది. కాని ఆ అధికారం దుర్వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కారణమూ చెప్పకుండా ఊరేగింపును నిషేధించే అధికారం లేదని, నియంవూతణలో భాగంగా సమంజసమైన కారణాల ఆధారంగానే పరిమితులు విధించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వివరించింది. హిమ్మత్ లాల్ షా కు పరిమితి నిరాకరించడం చెల్లదని తీర్పు చెప్పింది. ఫలానా చోటనే బహిరంగ సభ నిర్వహించే ప్రాథమిక హక్కు ఉందనే వాదన చెల్లదు. అయితే ఏ కారణమూ చెప్పకుండా అనుమతి నిరాకరించే అధికారం దఖలు పరిచే బొంబై పోలీసు చట్టం రూల్ 7 వల్ల కొందరికి అనుమతించి మరికొందరికి నిష్కారణంగా అనుమతి నిరాకరించే అవకాశం ఉందని కనుక ఆర్టికల్ 14 సమానతా హక్కుకు భంగకరమైన ఆనియమం చెల్లదని సుప్రీంకోర్టు చారివూతతాత్మకమైన తీర్పు చెప్పింది. ఊరేగింపు ఒక ఉద్యమ రూపమే. ప్రస్తుత ఉద్యమ భాషలో తెలంగాణ ఆందోళన నేపథ్యం లో ఇది మార్చ్ నిర్వహించే స్వేచ్ఛ. పూర్తి నిషేధించకుండా క్రమబద్దీకరించే అధికారం పోలీసులకు ఉంటుంది. కాని కేవలం కొందరికి అసౌకర్యం అనే కారణంగా ప్రజాఉద్యమాలను నిషేధించే అధికారం ఒకవేళ ఏ చట్టమైనా నియమమైనా ఇస్తే అది స్వేచ్ఛ పైన అసమంజసమైన పరిమితి అయి తీరుతుంది. తెలంగాణ మార్చ్‌కు ఏ విధంగా, ఏ పరిమితులతో అనుమతినివ్వాలని తేల్చే విచక్షణాధికారం పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఉందనడం ఉన్నమాటే. కాని రాజ్యాంగ స్వేచ్ఛా నియమాల పరిధికి లోబడి నిర్ణయించకుండా కేవలం రాజకీయ అవసరాలు, పార్టీ వ్యతిరేకతల ఆధారంగా నిర్ణయాలు తీసుకోదలచుకుంటే అది న్యాయబద్ధం కాబోదు. ప్రజాస్వామ్యం అన్నతరువాత జనం నిరసనలు తెలపడం, పని కి రాని విధానాలను వ్యతిరేకించడం అత్యవసరం. అసమ్మతి, నిరసనే జనస్వామ్యానికి ఆక్సీజన్. ఆందోళనచేయడం జనం హక్కు. ఆ మాటకొస్తే చట్టాన్ని పాటించడం బాధ్యతే అయినా పనికి రాదనుకుంటే దాన్ని ఉల్లంఘించడం ద్వారా వ్యతిరేకించాలనే ఆందోళన చేయడం అసలు సిసలు హక్కు. ఇది తాజాగా మనం చెప్పుకుంటున్న హక్కు కాదు. శతాబ్దం కిందట మహాత్మా గాంధీ పౌర అవిధేయత పేరుతో ఆందోళన ఆరంభించారు. ప్రజావ్యతిరేక శాసనాలను వ్యతిరేకించే ఈ ఆందోళనా సిద్ధాంతం అంతకుముందు చాలాకాలం నుంచే ఉంది. అయితే హింసాత్మక ఆందోళనలే ఎక్కువ కావడం వల్ల శాంతియుత పౌర అవిధేయత అనే ఉద్యమానికి గాంధీ ఇచ్చిన విధంగా శాంతిరూపు అహింసారేఖలు ఇచ్చిన వారు అంతకుముందుఎవరూ లేరు. హింసను హింసతో అణచడానికి ప్రభుత్వాలకు పాలకులకు పోలీసులు, సైన్యాలు, సాయుధ బలగాలు ఉన్నాయి. మొత్తం యంత్రాంగం వారి చెప్పుచేతల్లో ఉంటుంది. జనం డబ్బు, ఆ డబ్బుతో కొన్న ఆయుధాలు వాడుకుంటూ ఆ డబ్బుజీతంతో పనిచేసే వేలాదిమంది ఉద్యోగు లు, అధికారాన్ని వినియోగించుకునే పాలకులు విర్రవీగుతూనే ఉంటారు. ఉప్పు సత్యాక్షిగహంలో గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించే కార్యక్షికమం నిర్వహించారు. బ్రిటిష్ పాలకుల అసమంజసచట్టాలను ఉల్లంఘించడంద్వారా వారి అధికారాన్ని ధిక్కరించే శాంతియుత పోరాటం ఇది. దీన్ని సివిల్ డిసొబిడియెన్స్ (పౌర అవిధేయత) అన్నారు.

ప్రజాస్వామ్యం రాకముందు రాజులు రాణులు నియంతలై తమను సవాలు చేసిన వారిని వ్యతిరేకించారు. రాజవూదోహనేరాలు మోపి జైళ్లలో తోశారు. వారిని తోసి రాజని, ప్రజాపాలన ప్రారంభించిన ప్రజాస్వామ్యంలో కూడా సమ్మెలు ఆందోళనలు చేస్తున్న వారిని కటకటాల వెనక్కి తోస్తున్నారు. రాజరికాన్ని సవాలు చేసి వారి అధికారాన్ని ధిక్కరించి, వారి నియంతృత్వశాసనాధికారానికి బదులుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన బ్రిటిష్ రాజ్యాంగ చరివూతలో రాజవూదోహం ఉండే అవకాశం లేదు. ప్రజాస్వామ్యదేశంలో ప్రభుత్వాల దుర్విధానాలను సవాలుచేయడం ప్రభుత్వ ద్రోహంగా పరిగణించడానికి వీల్లేదు. నిజానికి ప్రజల పక్షాన నిలబడకుండా స్వార్థ ప్రయోజనాలకు విలువ నిచ్చే దుర్మార్గ విధానాలను ప్రజావూదోహంగా పరిగణించవలసి ఉంది. కాని మన పాత చట్టాలు రాజవూదోహ నేరాల నిర్వచనం ఉందే గాని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించని రాజకీయ ప్రభుత్వాలపైన నాయకులపైన అసమర్థ అధినాయకులపైన ప్రజావూదోహ నేరం మోపే వీల్లేదు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేసే నేతలమీద, విమర్శకులమీద, కార్టూనిస్టుల మీద జర్నలిస్టుల మీద రాజవూదోహ నేరం మోపడం ప్రజాస్వామ్య యుగంలో ఎంతమాత్రం సమంజసం కాదు. మహాత్మా గాంధీ అవిధేయతా ఉద్యమాన్ని నడుపుతూ ఆంగ్లేయ ప్రభువులను విమర్శించినందుకు రాజవూదోహ నేరారోపణకు గురికావలసి వచ్చింది. పౌర అవిధేయతలో పాలకుల ఆదేశాలను చట్టాలను, విధానాలను ఉద్దేశ పూర్వకంగానే చురుకైన కార్య శీలతతో వ్యతిరేకించి, వాటిని పాటించవద్దని ప్రజలను ఉద్భోదించి, చట్టాలు పనికిరానివని నిరూపించే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వాలపైన ద్వేషం కురిపించే నేరం కన్న నిజానికి ఇదే తీవ్రమైన నేరం అని పాలకులు భావించే అవకాశం ఉంది. కాని శాంతియుతంగా చట్టాలను ఉల్లంఘించి, అందుకు గాను వచ్చే పర్యవసానాలు ఎదుర్కొనడానికి జనం సిద్ధమైతే ఎంత బలీయమైన ప్రభుత్వమయినా ఏం చేయగలుగుతుంది? ఏ మాత్రం హింస ఉన్నా అణచివేసే అవకాశం దొరుకుతుందేమో గాని, శాంతియుతంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అది విమర్శా స్వేచ్ఛ అవుతుందే గానీ నేరం కాదు, తిరుగుబాటుకాదు, రాజ్యంపైన యుద్ధ ప్రకటన కాబోదు. 1919లో ఈజిప్షియన్లు వలసవాద బ్రిటిష్ ప్రభుత్వంపైన ఈ పౌర అవిధేయ ఆయుధాన్నే ప్రయోగించారు.

చెకోస్లవేకియా, తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వాల పైన ఈ ఉద్య మం విజయవంతంగాపనిచేసింది. జాతివివక్షమీద దక్షిణావూఫికాలో, అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం లో, సోవియట్ యూనియన్ నుంచి స్వేచ్ఛకోరుతూ బాల్టిక్ దేశాలు సాగించిన ఉద్యమాలలో అవిధేయత కీలకమైన ప్రశాంతనిరసన వేదికగా విజయం సాధించింది. జార్జియాలో సాగిన 2003 రోజ్ విప్లవం, ఉక్రెయిన్‌లో సాగిన ఆరెంజ్ విప్లవంలో కూడా ఈ అవిధేయతాయుధాన్నే ప్రయోగించారు. 1848లో హెన్రీ డేవిడ్ థోరో ప్రతిపాదించిన పౌర అవిధేయతా విధానమే ఆ తరువాత దశలో మహాత్మా గాంధీ ఊహలో సత్యాక్షిగహసిద్ధాంతమైంది. మెక్సికో అమెరికన్ యుద్ధం, అమెరికాలో విస్తరించిన బానిసల వ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ పన్నుల చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని ధోరో నడిపారు. కోపంపతీకారం, అసహనం ప్రదర్శించకుండా ప్రత్యర్థుల ఆదేశాలను పాటి స్తూ, అరెస్టులు అంగీకరిస్తూ చట్టపరంగా తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటూ, ప్రభుత్వం తమ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ప్రతిఘటించకుండా అందుకు సహకరిస్తూ, వారిని అవమానించకుండా చట్టాన్ని ఉల్లంఘించాలని గాంధీ ఈ సత్యాక్షిగహానికి నియమాలను రూపొందించారు. అధికారులకు సహకరిస్తూనే ప్రభుత్వ చట్టాలకు అవిధేయత చూపడం ఈ శాంతియుత ఉద్యమంలో విశేషం. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ ప్రభుత్వాలు తమ అధికారాల్ని కాపాడుకునే అవసరాలకు ఉపయోగపడని మంచిని కూడా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తూ, ప్రజల అభీష్టం, అవసరం, సంక్షేమం ఏ విధంగా ఉన్నా సరే తృణీకరిస్తూ, చేసిన వాగ్దానాలను, ప్రకటనలను, ఎన్నికల ఒప్పందాలను గాలికి వదిలేస్తుంటే జనం ఉద్యమించక ఏం చేస్తారు? ఆ విషయం పోలీసు అధికారులకు ఇతర పాలనాధికార యంత్రాంగానికి అర్థం కాకపోవడం కూడా విచిత్రం. తెలంగాణ వంటి ప్రజా ఉద్యమాలను వీధిలో సమస్య స్థాయిలో చూడడం, మార్చ్‌కు అనుమతి కోరితే నిరాకరించడం నుంచి రకరకాల రీతులలో అరెస్టులు సాగించడం దాకా ఉద్యమాలను విఫలం చేసే ఎత్తుగడలే. కాని ప్రజాభివూపాయం తెలుసుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలనే ప్రజానుకూల ఆలోచనే లేదని అర్థం అవుతుంది. ఇదంతా రాజకీయం అయితే కావచ్చు, కాని కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం కావడమే గాక, ప్రజాక్షిగహజ్వాలలకు ఆజ్యంపోయడమే అవుతుంది.

-ఆచార్య మాడభూషి శ్రీధర్
నల్సార్ విశ్వవిద్యాలయం

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన