చెరువులను మింగుతున్న వినాయకులు


Fri,December 14, 2012 05:14 PM

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలను కూడా వాడుకుంటారు. వినాయక చవితి కూడా నిజానికి చెరువును రక్షించి పూజించే పండుగే. మనిషిని బతికించే మంచినీటిని శుద్ధిచేసి గౌరవించే ఉత్సవం గణపతి నవరావూతుల ఉత్సవం. ఊళ్లో వాళ్లందరికీ చెరువులో పేరుకుపోయిన మట్టిని తీయడానికి వినాయక విగ్రహాల తయారీ ఒక వంక. తొమ్మిది రోజుల పూజల కోసం చెరువు అడుగులో బంక మట్టితీసి వినాయకుడి బొమ్మలు చేసి రకరకాల ఆకులతో మొక్కలతో పూలతో పూజించి వాటితో సహా అదే చెరువు లో నిమజ్జనం చేస్తారు. చెరువును శుద్ధి చేసేది, అందులో జీవం నింపి ఉంచేదీ కూడా ఆ మట్టే.

ప్రతి ఏడాదీ మూడు రకాల నవరావూతులు వస్తాయి. ఉగాదినుంచి శ్రీరామనవమి దాకా కొన్ని ప్రాంతాలలో శ్రీరామనవమి నుంచి తొమ్మిది రోజుల పాటు తొలి నవరావూతులు పండుగ చేస్తారు. గణపతి నవరావూతులు భాద్రపదంలో ఉత్సవాలైతే ఆశ్వయుజమాసంలో శరన్నవరావూతులు దసరానాడు ముగుస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా దసరా నాటికి ముగుస్తుంది. ఆ సందర్భంలో కూడా చెరువును రకరకాల పూలతో పూజిస్తారు. బంకమన్నుతో చెరువు అడుగులు కనుక పేరుకుంటే నీటిని నిలపడంతోపాటు భూగర్భంతో సజీవ జలసంబంధాలను కూడా ఆ మట్టి నిర్వహిస్తూ ఉంటుంది. బంకమట్టితో చేసిన వినాయక విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు నిమజ్జనంతో చెరువు అడుగున చేరతాయి. బొమ్మల కోసం మట్టితీసినపుడు చెరువు అడుగు కదలి అందులో కొత్త జీవం పుడుతుంది. కాని మనం ఇప్పుడు చేస్తున్న పనేమిటి? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలతో చెరువు అడుగును గట్టి గచ్చుఅడుగుగా మార్చేస్తున్నాము. చెరువులో జీవజలరాశికి భూమిలో జవజీవాలకు మధ్య బొడ్డు సంబంధాన్ని సిమెంట్ కవచంతో అడ్డుకుంటున్నాం. కాంక్రీట్ సమాధి నిర్మిస్తున్నాం. వాన నీటిని పట్టుకోవడం, చెరువులో నీటిని నిలిపివేయడం, బావుల్లో ఊటల ను ఊరింపచేయడం ఊళ్లో వాళ్ల నిరంతర కార్యక్షికమాలని చెప్పడానికి ఈ పండుగలు. ఏపండుగైనా పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని బతికించడానికే గాని విష రసాయనాల మెరుపు రంగులతో పాషాణాలుగా మార్చడానికి కాదు.

వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజించాలని జిల్లేడు, మారేడు, రాగి, బిల్వ పత్రాలు మొదలయిన ఆకులను ఏరి కోరి తేవాలని నియమం పెడితే అందుకోసమైనా మన వారు ఆ మొక్కలు పెంచుతారని ఆశించారు. ఇంటి పెరట్లో ఆ మొక్కలు ఉంటే వాటి ఔషధ లక్షణాలు, వాటిమీదుగా వీచేగాలి ఆరో గ్య రక్షణకు ఉపయోగపడతాయి. కాని మనం ఏం చేస్తున్నాం? కొమ్మలకు కొమ్మలే తెంచేస్తున్నాం. కసిగాయలతో సహా పూలు మొగ్గలతో సహా తెగ్గోసి మొక్కలను చంపేసి నడివీధుల్లో అమ్ముతున్నారు. కొంటున్నారు.గణపతి పేరున పెంచవలసిన మొక్కలను ఆ గణపతి పేరుతోనే చంపేస్తున్నాం. ఈ ఔషధ లక్షణాలున్న పత్రాలు చిగుళ్లు, పూలు, మట్టి వినాయకుడితో సహా చెరువులోచేరితే, వాటితో పాటు ఉండ్రాళ్లు కూడా పడితే చేపలు, కప్పలు తదితర జల చరాలు తింటాయి. బతుకుతాయి. అవి హాని కారక క్రిముల్ని తిని చెరువును బతికిస్తాయి. చెరువు శుద్ధి అవుతుంది. మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొన్నట్టు గణపతిని పూజించడానికి మొక్కలు పూలు, గణపతి బొమ్మను కూడా మార్కెట్లో కొనవలసి రావడం విషాదం. పల్లె ప్రాకృతిక జీవనానికి, పట్టణపు కృత్రిమ నాగరికతకు మధ్య ఉన్న భయంకరమైన అంతరానికి నిదర్శనం. ప్రస్తుతం మన కృత్రిమత్వం ఆకృతి మారి క్రూరత్వంగా రూపు దాల్చింది. నేలను, నీటిని కలుషితం చేసి బతుకు దుర్భరం చేసే దారుణ రసాయనాలను, రంగులను బొమ్మలకు పూసి దైవాల పేరుతో చెరువులో ఏం చేసినా కరగ ని దయ్యాలను తయారు చేస్తున్నాం. ఈ రసాయనాల విష ప్రభావానికి జలచరాలు చనిపోతున్నాయి. వాటికి కావలసిన ఆకులు, తిండి, పిండి పదార్థాల బదులు మనం మిఠాయిల్ని విసిరి అంతకు ముందు పొరబాటున బతికి ఉంటే వాటిని చంపేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలుసుకోవడం లేదు. వినాయకుని బొమ్మలమీద మెరిసే రంగుల్లో ప్రమాదకర రసాయనాలు, నూనె పదార్థాల వల్ల చెరువునీటిపై పొరలు ఏర్పడి, నీటిలో ఆక్సీజన్ కదలికలను కూడా స్తంభింపచేసి జలచరాలకు ఊపిరాడకుండా చేస్తున్నాం. ఇంత చేసినా జలజీవాలు ఇంకా ఉంటే, విగ్రహం నిమజ్జనం కాకపోయినా వాటిమీద రంగులు కరిగి రసాయనాలు విరిగి, విషమై వాటిని బలితీసుకుంటాయి. ఇదీ మన గత సంస్కృతి. ఇదీ మన ప్రస్తుత నాగరికత. ఊరి మధ్యనున్న చెరువులో జీవ వైవిధ్యం కాపాడుకోవడం మనకు పట్టదు కాని, ప్రపంచజీవ వైవిధ్య సమావేశాలకు వందల కోట్లు వ్యయం చేయడానికి మనం వెనుకాడం.

ఆకులు అలమలతో కలిసి బతకవలసిన మట్టిదేవుడిని మనం నికెల్, కాడ్మియం, క్రోమియం, ఆర్సెనిక్, లెడ్ (సీసం) వంటి రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్నాం. తళ తళ మెరిసే బంగారు రంగుకిరీటాలు, చీని చీనాంబరాల రంగులు పూస్తున్నాం. దానికి మెరిసే రసాయనిక కిరీటం పెట్టి జనం మురిసిపోతున్నారు. దానికి వేల రూపాయలు తగలేస్తున్నారు. ఏటేటా లక్షల సంఖ్యలో నిమజ్జనం అవుతున్న గణపతి విగ్రహాల పైపూతలు మన రాజధానిలో హుసేన్ సాగర్‌ను ప్రతి ఊళ్లో ఉన్న జీవజలాశయాలైన చెరువుల్ని కలుషితం చేసి చేపల్ని చంపడంతో ధ్వంసం ఆరంభమవుతుంది.హుసేన్ సాగర్ నిర్మితమై నేటికి 150 ఏళ్లయింది. 1562లో మూసీనదికి ఉపనదిగా ఉన్న కాలువ లేరు వాగుమీద 3.2 కిలోమీటర్ల పొడవు, 2.8 కిలోమీటర్ల వెడల్పుతో ఈ చెరువు నిర్మాణం జరిగింది. లోతు 2.5 మీటర్ల నుంచి 12.2 మీటర్ల దాకా ఉంటుంది. మొత్తం విస్తీర్ణం 445 హెక్టార్లు. నగరం మధ్య ఉన్న ఈ జలాశయం ప్రస్తుతం జలాశయం కాదు. దీని ఆశయం సౌందర్యసాధనం. దాని చుట్టూ సమాధులు, క్లబ్ల్ లు, సినిమా వినోద కేంద్రాలు, అందాల దారులు, తినుబండారాల వీధులు, బహిరంగ ఆడిటోరియంలు,మధ్యలో బుద్ధుడు,నౌకా విహారాలు, గుడులు, గోపురాలు, లుంబినీ పార్కులు చెరువును నాశనం చేశాయి. ఈ చెరువును తినేసినన భూ బకాసురులగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.సగం చచ్చిన ఈ చెరువులో నీటిని మనం నిమజ్జనాలతో పూర్తిగా చంపేస్తున్నామా?

హుసేన్ సాగర్ ఒకనాడు మంచినీటి చెరువు. సాగునీటి చెరువు. ఇప్పడు పెధ్ద మురికి గుంట. చేపలు కప్పలు కాదు, గుర్రపు డెక్క ఆకుకు కేంద్రం. పారిక్షిశామిక వాడల మురికికి కేంద్రం. దుర్గంధాలకు, మలేరియా దోమలకు, గున్యా దోమలకు పుట్టినిల్లు. కాడ్మియం, క్రోమియం, సీసం వంటి విషరసాయనాలకు మెట్టినిల్లు. ఇందులో భార లోహాల సాంద్రత ప్రమాదకరస్థాయిలో పెరిగిందని కాకతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇంతటి ప్రమాదానికి కారణం, విఘ్న నివారణ మూర్తి అయిన వినాయకుడు కాదు. ఆయన కోసం ఇది వరకు చేసిన మట్టిబొమ్మలు కాదు. గణపతి పేరుతో మనం విషంపూసి విసిరేస్తున్న ప్లాస్టర్ విగ్రహాలు. ఏటేటా కలుస్తున్న ఈరకం విగ్రహాల రంగుల వల్ల చెరువులో కాల్సియం, మెగ్నీసియం, మాలిబ్డినం, సిలికాన్, ఆర్సెనిక్, మెర్క్యురీ, ఐరన్, లెడ్ నిలువలు వందల రెట్లు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ఈ భారలోహాలకు నీటిలో మరింత పెరిగిపోయే లక్షణా లు ఉంటాయి. ఈ లక్షణాన్ని శాస్త్రీయ పరిభాషలో బయోఅక్యుములేషన్, బయోమాగ్నిఫికేషన్ అంటా రు. వీటివల్ల బుద్ధి మందగించి మెదడు కణాలు నశిం చి రోగాలు పెరుగుతాయి. ఈ నవరావూతులలో సిద్ధి బుద్ధి గణపతిని పూజిస్తే చదువొస్తుందంటారు. కాని వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతున్న హుసేన్ సాగర్ నీటితో పండిన గడ్డితిన్న పశువులు ఇచ్చిన పాలు తాగి బుద్ధి మందగించిన భక్తుల గతేమిటి?

ప్లాస్టిక్‌ను పర్యావరణ రక్షణ కోసం నిషేధించినట్టు, ఈ చెరువును రక్షించుకోవడానికి మట్టి వినాయక బొమ్మలనే చేయాలని విగ్రహాల తయారీ దారులకు నిబంధలను విధించాలి. మట్టిబొమ్మలను తప్ప మరే బొమ్మలను కొనకూడదని నిషేధించాలి. మట్టి బొమ్మలను భారీ ఎత్తున తయారుచేసే ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి. అలాగే హుసేన్ సాగర్‌ను చంపకండి, చావు కొనితెచ్చుకోకండి అనే ప్రచార కార్యక్షికమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. ఇది ఒక్క రాజధాని సమస్య కాదు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చెరువు మనుగడకు చెందిన సమస్య. జీవ వైవిధ్య రక్షణకు సంబంధించిన సమస్య. కేవలం దేవుడికి మతానికి పూజలకు పునస్కారాలకు సంబంధించిన విషయం కాదు. రాజకీయం చేయాల్సిన విషయం అంతకన్న కాదు. బతుకును నిమజ్జనం చేసి చెరువులనే మరుభూములుగా మార్చే ఈ దుర్మార్గాలను ఆపాలి. 60 లక్షల జనాభా ఉన్న భాగ్య నగరంలో ఈ చెరువు చుట్టూ ఉన్న 16 లక్షలజనం నివసించే ప్రాంతాల నుంచి వచ్చే విసర్జిత జలం, పరిక్షిశమల నుంచి వచ్చే కాలుష్య జలంతో హుసేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంగా చేస్తున్నాం. జపాన్ వారిని అప్పు అడిగి హుసేన్ సాగర్‌ను శుద్ధిచేసే ప్రతిపాదన ఉన్నది. అప్పట్లో 300కోట్ల రూపాయలు కావాలని అనుకున్నారు. కాని నిమజ్జనాల వల్ల టన్నుల కొద్దీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పేరుకుపోయిందని జపాన్ నిపుణులు గమనించి ఆశ్చర్యపోయారు. రకరకాల శుద్ధి కార్యక్రమాలు 30 ఏళ్ల పాటు జరిగితే హుసేన్‌సాగర్ పూర్వపు స్థితికి వస్తుందని అంచనా. కానీ నిమజ్జనాలు విసర్జితాలు, కాలుష్యాల సంగమాలు ఆపకపోతే శుద్ధి జరగదనే బుద్ధి ఎప్పుడు రావాలి? హుసేన్ సాగర్‌నే కాదు తెలంగాణలోని ప్రతి చెరువును ఈ విషపు రంగుల వినాయక నిమజ్జనం నుంచి రక్షించాలనే ఆలోచన ఎప్పుడు రావాలి?

-ఆచార్య మాడభూషి శ్రీధర్
నల్సార్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles