పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు


Thu,January 29, 2015 01:46 AM

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు
మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నా రు. జిల్లా వెనకబాటుతనం ఉద్యమంలో ఎజెండా మీదికి వచ్చింది. రాంచంద్రమూర్తిగారు నిర్వహించిన దశ-దిశ చర్చ ఆరంభంలో విశాఖ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణను సమర్థి స్తూ మాట్లాడిన సందర్భంలో పాలమూరు జిల్లా పరిస్థితులనుప్రత్యేకంగా ప్రస్తావించాను. అప్పుడు ఆంధ్ర ప్రాంత హేమా హేమీలు బలమైన సమాధానాలుచెప్పలేకపోయారు. తెలంగాణ డిమాండ్‌కు పాలమూరు అనుభవం ఆక్సిజన్‌లాగా పనిచేసింది.

చరిత్ర గమనంలో..అలాగే పరిణా మ క్రమంలో ఒక కీలక దశలో ఒకప్రాంతం చెందవలసిన అభివృద్ధి లేదా, జరగవలసిన మార్పు జరగకపోతే ఆప్రాంతం చాలా కాలం ఆ పర్యావసానాన్ని భరించవలసి ఉంటుంది.ఒక ప్రాంతం ఎందుకు అభి వృద్ధి చెందుతుంది? ఎందుకు వెనకబడి పోతుంది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా సూత్రీకరణలే చేశారు. చేస్తున్నారు. వెనకబాటు తనానికి అందరికి కనిపించే భౌతిక వనరుల లేమి ఒక కారణం కావచ్చు. కానీ భౌతిక వనరుల అభివృద్ధి మానవ చైతన్యం ఒక దానిని మరొక టి పరస్పరం ప్రభావితం చేస్తుంటాయి. నేడు మూడ వ ప్రపంచ దేశాలుగా పరిగణిస్తున్న దేశాలు ఒక కాలంలో నాగరికతకు నిలయాలుగా ఉండేవి.

gopal


నేడు అభివృద్ధిచెందినవి అంటున్న దేశాలు అప్పుడు చాలా వెనుకబడే ఉన్నాయి. ఈ రోజు ప్రపంచమంతా విధ్వంసం సృష్టిస్తున్న అమెరికా అప్పుడు ఇంకా పుట్టనే పుట్టలేదు. మూడవప్రపంచ దేశాల గొప్ప నాగరికతలు పారిశ్రామిక విప్లవ దశలో వెనకబడి పోవడంతో అభివృద్ధి కుంటుపడింది. పారశ్రామికీకరణ చెందిన దేశాలు వీటిని బానిస దేశాలుగా మార్చి, తాము లాభాలు మూట గట్టుకున్నాయి. వృద్ధిచెం దాయి. వెనకబాటు తనం నుంచి బయట పడడానికి చైనాలో మావో మరో మార్గం వెతికి పెట్టాడు. మూడ వ ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు తమ మార్గాలు తాము వెతుక్కుంటున్నాయి. వెనకబాటు తనానికి కారణాలను వెతికే క్రమంలో మూడవ ప్రపంచదేశ అర్థిక శాస్త్రవేత్తలు కునుకున్న ఒక రహస్యం.. ఒక ప్రాంత అభివృద్ధి మరొక ప్రాంతపు వెనకబాటుకు కారణమవుతుందని. దీనినే సెంటర్ పెరిఫెరీ(CENTER-PERIPHERY)సిద్ధాంతం అంటారు.

ఈ సిద్ధాంతం వెలుగులో తెలంగాణ, ఆంధ్ర ప్రాం త అసమానతలను కొంత వరకు విశ్లేషించవచ్చు. అలాగే హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ గ్రామీణప్రాంత వెనకబాటుకు దారితీసిందని వివరించవచ్చు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న నాలుగు జిల్లాలు మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో కొంత భాగం వెనకబడిన జిల్లాలుగా ఉండిపోయా యి. దానికి భిన్నంగా వరంగల్,కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం జిల్లాలు అంతా కాకున్నా కొంతైనా మెరుగ్గా ఉన్నాయి. ఈ జిల్లాల్లో రాజకీయ చైతన్య స్థాయికూడా ఎక్కువే. ఈ జాల్లాలన్నీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న జిల్లాలే.రెండు ప్రాం తాలు కలిసిన తర్వాత కూడా1960వ దశాబ్ది చివరి కాలంలో నక్సలైట్ ఉద్యమాన్ని నడిపిన జిల్లాలే ఇవి.

నేను పోలీస్ అధికారులకు, సైనిక అధికారులకు మావోయిస్టు ఉద్యమం మీద ఉపన్యాసాలిచ్చినప్పు డు.. ఒకసారి నక్సలైట్ల వల్ల అభివృద్ధి కుంటుపడింద ని, వాళ్లు అభివృద్ధికి వ్యతిరేకులనే ప్రశ్న అడిగినప్పుడల్లా..తెలంగాణప్రాంత అభివృద్ధి అనుభవాన్ని జవాబుగా ఉదహరిస్తుంటాను. నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువ ఉన్న ఉత్తరతెలంగాణ ఎందుకు ఎక్కువ అభివృద్ధి చెందింది!, ఆ పోరాటాల ప్రభావం చాలా తక్కువ ఉన్న దక్షిణ తెలంగాణ ఎందుకు వెనకబడి ఉన్నది అని అడుగుతుంటాను. చైతన్యం ఎక్కువ ఉండటం వలన అభివృద్ధి చెందిందా, లేక అభివృద్ధి జరిగినందుకు చైతన్యస్థాయి ఎక్కువయిందా..అనేది చెప్పడం చాలా కష్టం.

ఈ రాజకీయార్థిక నేపథ్యంలో పాలమూరు జిల్లా వెనకబాటు తనాన్ని విశ్లేషించ వలసి ఉంటుంది. ఈ జిల్లా అటు అభివృద్ధిలో, ఇటు చైతన్యంలో కింది స్థాయిలోనే ఉన్నది. అయితే భౌతిక వనరుల కోణం నుంచి చూస్తే.. ఇది విస్తృత వనరులుండి కూడా వెనకబడిన జిల్లా. ఈ జిల్లాలో.. ఆంధ్రాప్రాంతంలో 1852లో కృష్ణా, గోదావరి ఆనకట్టలు కట్టినప్పుడు అలాంటి మార్పు జరిగి ఉంటే.., ఇప్పుడు ఈ జిల్లా స్వరూప స్వభావాలు భిన్నంగా ఉండేవి. అలాగే ఈ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైతే కూడా పరిస్థితి వేరేగా ఉండేది. అలా గాక విశాలాం ధ్ర ఏర్పడ్డప్పుడు బూర్గుల రామకృష్ణారావు ఈ జిల్లా భవిష్యత్తు గురించి కొద్దిగ ఆలోచించినా కొంతైనా మార్పు వచ్చిఉండేది. బచావత్ ట్రిబ్యునల్ వేసినప్పుడు జిల్లా నుంచి బలమైన రాజకీయ వత్తిడి ఉన్నా కృష్ణానదిలో వాటా వచ్చేది. బచావత్ దయతలచి జూరాలను కేటాయించాడు.

హరితవిప్లవ దశలో బోరు బావుల సేద్యం రాకున్నా పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉండేది కాదు. కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నా రు. జిల్లా వెనకబాటుతనం ఉద్యమంలో ఎజెండా మీదికి వచ్చింది. రాంచంద్రమూర్తిగారు నిర్వహించిన దశ-దిశ చర్చ ఆరంభంలో విశాఖ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణను సమర్థి స్తూ మాట్లాడిన సందర్భంలో పాలమూరు జిల్లా పరిస్థితులను ప్రత్యేకంగా ప్రస్తావించాను. అప్పుడు ఆంధ్ర ప్రాంత హేమా హేమీలు బలమైన సమాధానాలు చెప్పలేకపోయారు. తెలంగాణ డిమాండ్‌కు పాలమూరు అనుభవం ఆక్సిజన్‌లాగా పనిచేసింది. దాదాపు 250 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కృష్ణానది లో ఈ జిల్లాకు ఎందుకు నీళ్లందలేదు? అనే ప్రశ్నకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఏమైతే నేమి తెలంగాణ రాష్ట్రం సార్థకం అయ్యింది.

పాలమూరు జిల్లాకు విశాలాంధ్ర ఏర్పడ్డప్పుడు జరిగిన అన్యాయం, నిర్లక్ష్యం, ఇప్పుడు జరుగకూడదు. ఈ కీలక దశలో నీటి వాటాలో తగిన న్యాయం జరగకపోతే ఇక సంపూర్ణ విప్లవం వచ్చేదాకా పాలమూరు ప్రజలు వేచి ఉండవలసిందే. పాలమూరు ప్రజలు ఈ చారిత్రక అవకాశాన్ని వదులుకోవద్దని, ఎంత వత్తిడైనా సరే.. వత్తిడిపెట్టి చరిత్రలో తమకు జరిగిన అన్యాయానికి తెరదించి ఒక కొత్త భవిష్యత్తుకు బాటలు వేయవలసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు అనే అంశంపై ఫిబ్రవరి1న పాలమూరు అధ్యయన వేదిక ఒక్క రోజు సెమినార్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ సెమినార్ మాసాబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించబడుతుంది. ఇందులో పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల గురించి చర్చించవలసి ఉంది. జిల్లాలో సాగునీరే కాక, తాగునీరు కూడా కరువై, మహబూబ్‌నగర్ పట్టణంలోనే తాగునీరు వారానికి ఒక్కసారి వదిలే పరిస్థితి ఉన్నది. జిల్లా నుంచి 10 నుంచి 12లక్షల మంది వలస కూలీలుగా మారి దేశంలోని నలుమూలలకు వెళ్లి, ప్రతి భారీ కట్టడంలో తమ శ్రమను ధారపోస్తున్నారు. దేశంలో ఏ పెద్ద నగరానికి వళ్లైనా కూలీలను పలకరిస్తే అందులో పాలమూరు లేబర్ తప్పక తగులుతారు. వర్షపాతం కొంచెం తగ్గినా ఆకలి చావులే. పంటలు పండక, అప్పులు తీర్చలేక తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆత్మహత్యలతో పాలమూరు రైతుల సంఖ్య గణనీయంగా ఉన్నది.

ఈ పరిస్థితిని లోతుగా చర్చించడమేకాక నిర్ధిష్ఠమైన చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకునేలా ప్రభుత్వం మీద వత్తిడి పెట్టవలసి ఉన్నది. అవసరమైతే ఉద్యమించవలసి ఉన్నది. వెనకబాటుతనం వల్ల సామాజిక సంబంధాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అంటరానితనం విస్తృతంగా ఉన్నది. దళితులపై హింస భిన్నరూపాల్లో కొనసాగుతున్నది. చేతబడిలాంటి మూఢనమ్మకాల వల్ల పేదల ప్రాణా లు క్రూరంగా బలి తీసుకుంటున్నారు. దేవదాసీ లాంటి దుర్మార్గమైన ఆచారాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక.. పిల్లలు, తల్లుల ఆరోగ్యం గురించి అడగవలసిన అవసరం లేదు. విద్యా, ఆరోగ్య ప్రమాణాలలో తెలంగాణలో పాలమూరు అన్ని జిల్లాల కంటే కిందిస్థాయిలో ఉన్నది. ఆ విధంగా మానవాభివృద్ధి సూచికలో దేశంలోనే అతి వెనకబడిన జిల్లాలలో ఒకటిగా మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నది.

ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న సెమినార్‌లో విశిష్ఠ వ్యక్తులు చాలా మంది పాల్గొనడానికి అంగీకరించా రు. ఇందులో ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌హెచ్.హన్మంతరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గారితో పాటు పెద్దలు చుక్కా రామయ్య, పొత్తూరు వెంకటేశ్వర్‌రావు తది తరులు కూడా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని వార్తాపత్రికల ఎడిటర్లు కూడా పాల్గొంటారు. అలాగే వివిధ తెలంగాణ జేఏసీ నాయకులు పాల్గొనడానికి తమ సమ్మతిని తెలిపారు. ఇంత విస్తృతమైన భాగస్వామ్యం ఉంటే తప్ప పాలమూరుకు భవిష్యత్తు లేదనేది స్పష్టమే. ఒక వెనుకబడిన జిల్లా పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ సెమినార్‌లో పాల్గొన వచ్చు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు చెందిన వారు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అందరూ ఆహ్వానితులే.

897

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

country oven

Featured Articles