నవతరం ఆదర్శవాది


Thu,May 15, 2014 12:19 AM

-ప్రొఫెసర్ జి. హరగోపాల్

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలతో జీవించి, జీవితమంతా పేదల పక్షాన నిలిచి, నిరంతరం పోరాడి, నిరాడంబరంగా జీవించిన సునీల్ అకస్మాత్తు గా బ్రెయిన్ హామరేజ్ కారణాన ఏప్రి ల్ 21న మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది. 1991లో లడతా జారె (పోరాడుతూ ఉండు) అన్న వ్యాసంలో తాను రాజనారాయణ్‌తో మూడు నెలలు గడిపిన జైలు జీవితాన్ని గురించి రాస్తూ తామిద్దరం ఒకే కంచంలో తినేవాళ్లమని, జైలులో ఇచ్చిన ఆహారాన్ని కలిసి తినేవాళ్లమని, తమ ఇద్దరి దుస్తులు, గడ్డం, టైరుతో చేసిన చెప్పులను చూసి ఇద్దరిలో ఎవరు ఎవరో గుర్తించడంలో ఇబ్బందిపడేవారని రాజనారాయణ్ అకస్మాత్తుగా ఒక ప్రమాదంలో మరణించినప్పుడు రాసిన నివాళిలో సునీల్ పేర్కొన్నాడు. సునీల్ గ్రామంలో ఉన్నప్పుడు హామరేజ్ రావడం వల్ల , భూపాల్ హాస్పిటల్‌లో ఉండే పరిమితులతో ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కాకపోవడంతో విమానంలో ఢిల్లీకి తరలించినా ఫలితం లేకపోయింది. అనిల్ సద్‌గోపాల్ సునీల్‌పై రాసిన నివాళిలో ఏదో అద్భుతం జరిగి ఆయన బతుకుతా డని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, స్నే హితులు, సహచరులు భావించారు.

దేశంలోని పట్టణాలు మొదలు మధ్యప్రదేశ్‌లోని గ్రామాల దాకా ఆయ న బతకాలని కోరుకున్నారు. కానీ అద్భుతాలలో సునీల్‌కు ఎప్పుడూ విశ్వాసం లేదు. ఆయన ఈ ప్రపంచాన్ని శాస్త్రీయ దక్పథంలోనే అర్థం చేసుకున్నాడు. అలాంటి దఢమైన విశ్వాసాలతోనే జీవించాడని పేర్కొంటూ.. అందరూ ఆశించిన అద్భుతం జరగలేదని రాశాడు.
సునీల్ తన విద్యను మధ్యప్రదేశ్‌లోని రాంపురా గ్రామంలోని హైస్కూల్, కాలేజీలలో, ఎం ఏ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి, తన పరిశోధనను ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త కష్ణ భరద్వాజ్ దగ్గర చేస్తూ, మధ్యలోనే పరిశోధనకు స్వస్తి చెప్పి, ప్రజలతో పనిచేయాలని నిర్ణయించుకొని గ్రామాలకు చేరుకున్నాడు.

మన రాష్ట్రంలో సునీల్‌తో పోల్చదగ్గ వ్యక్తి గొర్రెపాటి నరేంద్రనాథ్. ఆయన కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేసి, చిత్తూర్ జిల్లా గ్రామాలలో జీవితమంతా పనిచేశాడు. దుస్తుల విషయంలో , చెప్పుల విషయంలో, జీవనశైలి విషయం లో వీళ్లిద్దరికి చాలా పోలికలున్నాయి. యాదచ్ఛికమే అయినా ఇద్దరూ జబ్బుపడి చిన్న వయసులో (55 ఏళ్లు) చనిపోయారు. ఈ రోజుల్లో 55 ఏళ్లు చాలా చిన్న వయసే. ప్రజల మధ్యన పనిచేస్తున్న వారు ఇలా మరణిస్తే, అది వ్యక్తికో, కుటుంబానికో చెందిన దుఃఖం కాదు, అది సామాజిక దుఃఖం.
సునీల్‌తో అఖిల భారత విద్యా హక్కు ఉద్యమం లో నేను, ఇతర మన రాష్ట్ర ఉపాధ్యాయ నాయకు లు, రమేష్ పట్నాయక్ కలిసి పనిచేశాం.

ఆయన ఈ ఉద్యమానికి ప్రాణం పోసిన వాళ్లల్లో ఒకడు. ఒక ఫౌండర్ మెంబర్ గానే కాక ప్రిసీడియంలో సభ్యుడు. నరేందర్‌నాథ్ లాగే ఏ విషయాన్ని అంత సులభంగా అంగీకరించేవాడు కాదు. ఏ అంశంలో ఏ మాత్రం అనుమానమున్నా చర్చకు పెట్టేవాడు. తీసుకున్న నిర్ణయం క్షుణ్ణంగా చర్చించాకే తీసుకోవాలనే బలమై న అభిప్రాయమున్నవాడు. ప్రకటనలో కొన్ని వాక్యా ల గురించి, భాష గురించి కూడా పట్టింపు ఉండేది. ఈ దేశంలో ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలుండాలని విశ్వసించి, చిత్తశుద్ధితో కషి చేసేవాడు. ఆల్ ఇండియా ఫోరాన్ని సునీల్ లేకుండా ఊహించడం కష్టం.

మన దేశం కామన్‌వెల్త్ దేశాల ఆటలకు అతిథ్యం ఇస్తున్న సందర్భంలో సునీల్ మధ్యప్రదేశ్‌లోని గిరిజనులను సమీకరించి భోపాల్‌లో ఆ ఆటలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాడు. నేను భోపాల్ జ్యుడీషియల్ అకాడమీలో ప్రసంగించడానికి అదేరోజు వెళ్ల డం వల్ల, నేనూ ధర్నాలో పాల్గొన్నాను. ఆ సందర్భం లో మీడియా వాళ్లు ఒక గిరిజన మహిళను ధర్నా గురించి అడిగితే మా గ్రామంలో మా పిల్లలకు ఆడుకోవడానికి స్కూళ్లో ఆట స్థలం లేదు, ఒక బంతి కూడా లేదు. మరి ఈ ఆటలు ఎవరి కోసమని ప్రశ్నించింది.

ఈ చైతన్యం సునీల్ చేసిన కషి ఫలితమే. సునీల్ తరం మీద సోషలిస్టు ప్రాపంచిక దక్ప థ ప్రభావం చాలా ఉంది. ఆ దక్పథాన్ని త్రికరణశుద్ధిగా నమ్మడంవల్ల వాళ్ల ఆలోచనలకు ఆచరణకు మధ్య తేడా కనిపించేది కాదు. మనిషి ఎంత నిరాడంబరంగా ఉండే వాడంటే చూసే వాళ్లెవరూ ఆయ న జె.ఎన్.యులో ఎకనామిక్స్ పరిశోధక విద్యార్థిగా ఊహించడానికి సాధ్యపడేది కాదు. తన విశ్వాసం మేరకు హిందీలోనే మాట్లాడేవాడు. చాలా అవసరం ఉంటే తప్ప ఇంగ్లిషులో మాట్లాడడానికి ఇష్టపడేవాడుకాదు. ఇది మనం మన కేశవరావ్ జాదవ్‌లో చూడవచ్చు. కానీ సునీల్.. జాదవ్ తర్వాత తరం మనిషి. సునీల్ మరణం ఆలోచించిన కొద్దీ, ఇప్పు డు వస్తున్న రాజకీయ పరిణామాలను చూస్తుం నష్టం చాలా తీవ్రమైనదనిపిస్తుంది. బహుశా రెండు, మూడు దశాబ్దాల కిందట ఇది ఇంత పెద్ద నష్టంగా కనిపించేది కాదేమో! భారత సమాజం ఫాసిజం వైపు చాలా వేగంగా పోతున్నది.

దేశ యువత ముఖ్యంగా ప్రొఫెషనల్స్ తమ సమతౌల్యాన్ని కోల్పోయారు. గ్రామీణ యువతకు ప్రజాస్వామ్యానికి, నియంతత్వానికి తేడా తెలియని పరిస్థితి. స్వేచ్ఛను ఉపయోగించే వాళ్లకే స్వేచ్ఛ విలువ అర్థమౌతుంది. ఆవేశం, ఆగ్రహం, ద్వేషం కలగలిసిన యువకులకు ఒక మానవీయ, ప్రజాస్వామ్య సమాజం గురించి కాని, సమభావం, సౌభ్రాతత్వం లాంటి సమున్నత విలువల పట్ల గౌరవం లేకపోవడమే కాదు, ఈ విలువలు ప్రసవించడానికి మానవాళి పడ్డ ప్రసవ వేదన చాలామందికి తెలియదు. ఇది లౌకికవాద రాజకీయాల వైఫల్యమే కాక మొత్తం విద్యా వ్యవస్థ వైఫ ల్యం. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ అవలంబించిన ఆర్థిక విధానాలు, సెక్యులర్ విలువలకు తిలోదకం, విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడం ఈ విధ్వంసానికి రహదారులు వేసింది.

ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు, సినిమా నటులు ఎంత ఆవేశంగా మాట్లాడితే అంతపెద్ద ఎత్తున హర్షద్వానాలు! వాదవివాదాలు, పదానికి భిన్న అర్థాలు వెతకడం, తప్పులు చేయడం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం ఒక తంతుగా మారింది. ఎన్నికల కమిషన్ ఎవరి మీదా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. మనరాష్ట్రంలో నూటాయాభై కోట్ల డబ్బు పట్టుకున్నామంటున్నారు. ఆ డబ్బులు ఎవరివి? పంచుతున్న వారి మీద ఏ చర్య తీసుకున్నారో! ఎమ్మెల్యేకు 10 కోట్లు, ఎంపీకి 30 కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. ప్రజా ప్రతినిధులు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల వ్యాపారంలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నట్లు? ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ అవినీతిపరుడు కాదని వాదన.

అది మనం మన్‌మోహన్‌సింగ్ విషయంలో కూడా అన్నాం, రాజీవ్‌గాంధీ విషయంలో క్లీన్ ప్రైమ్‌మినిస్టర్ అ న్నాం. అంత నిజాయితీ పరుడైన మన్మోహన్ సింగ్ ప్రజల మధ్యకు ఎందుకు రాలేదు? నాకు తెలిసి సోనియాగాంధీ అవినీతి పరురాలు అని ఎవ్వరు అన్నట్లు గుర్తులేదు. మోడీ వ్యక్తిగతంగా అవినీతిపరుడు (అవినీతి అంటే డబ్బులు తీసుకోక పోవడమే అనే అర్థంలో) కాకపోవచ్చు. కానీ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గెలిచిన బీజేపీ ఎంపీల సంగతేమిటి? అలాంటి సభ్యులతో కూడిన పార్లమెంటు ప్రజలకు ఏం మేలు చేస్తుంది? నిజాయితీగల పారదర్శక పాలనను ఎలా అందిస్తుంది?
ఈ ఎన్నికల్లో సునీల్ విశ్వసించిన విలువలన్నీ కూలిపోయాయి.

సోషలిజం, అటుంచి పేద ప్రజల పట్ల కన్‌సర్న్ కాని, పెరుగుతున్న అసమానతలు కాని, నయా ఆర్థిక విధానం కాని, చిదంబరం దేశం మీద రుద్దిన విధానాలు కాని, ఆవేశంతో మోడీ చెప్పే ఉద్యోగ అవకాశాల గురించి కాని, వ్యవసాయం గురించి కాని చర్చలేదు. రాజ్యాంగంలోని సోషలిస్టు, డెమోక్రటిక్, సెక్యులర్ విలువలు ప్రస్తావనకు కూడా రాలేదు. సునీల్ పేదల మధ్య పనిచేసే వాడు కనుక ఈ కూలిపోతున్న విలువలను కాపాడడానికి, సజీవంగా ఉంచడానికి అహర్నిశలు కష్టపడేవాడు. ఒక ప్రత్యామ్నాయ సామాజిక స్వప్నాన్ని ఆరిపోకుండా ఆపేవాడు. చరిత్రలో బహుశా సునీల్ లాంటి వ్యక్తుల అవసరం మన సమాజానికి ఇప్పుడున్నంత మరెప్పుడూ లేదనే అనాలి. అందుకే సునీల్ మరణం సమాజానికి, సామాజిక పరిణామానికి ముఖ్యంగా విద్యాహక్కు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ.

456

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల