నిద్రలేని రాత్రి


Thu,February 20, 2014 12:07 AM

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చారివూతక సందర్భంలో నేను యాదృచ్ఛికంగా వీవీ ఇంట్లో ఉన్నాను. అప్పటి వరకు రాజకీయాల గురించి, పాలక వర్గాలు తమ సంస్థలను తామే విధ్వంసం చేసుకుంటున్న విధానాల గురించి, సమకాలీన ‘డెవలప్‌మెంట’్ల మీద మాట్లాడుకుంటు న్న సమయంలో హేమలత గారు ‘తెలంగాణ బిల్లు పాస్ అయ్యింద’ని చాలా సంతోషంగా చెప్పారు. మేం కూడా వెళ్లి టీవీలో వార్తను చూశాం. అంతకు ముందు వనపర్తి నుంచి ఒక డాక్టర్ చాలా ఆందోళనగా సార్ ‘నాకు చాలా టెన్షన్‌గా ఉంది, బిల్లు పాస్ అవుతుందా లేదా’ అని అడిగితే, ‘ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు! తెలంగాణను చావుబతుకుల సమస్యగా ఎందుకు చూస్తున్నారు? తెలంగాణ వచ్చినంత మాత్రాన అంత సవ్యంగా ఉంటుందా?’ అన్నాను.

అంతలో ఒక టీవీ చానల్ వాళ్లు జరుపుతున్న చర్చలోకి నన్ను లాగారు. చర్చలో పాల్గొంటు న్న ఒక మహిళా ప్యానలిస్టు తెలంగాణ ఇలా రావడం సరైందేనా? మీరు పౌరహక్కుల నాయకుడిగా ఈ పద్థతిని సమర్థిస్తారా? అని చాలా ఆవేశంగా అడిగిం ది. బిల్లు పాస్ అయిన పద్ధతి బాగాలేదని, పార్లమెం టు మరింత హుందాగా నడిస్తే బావుండేదని అంటూ అసెంబ్లీ కూడా సరిగా జరగలేదు కదా అంటూనే, ఒక హత్య జరిగితే ఇంకొక హత్యను సమర్థిస్తారా అని ఆవేశంతో ఆమె అన్నప్పుడు చర్చలో పాల్గొన డం ఇక సాధ్యం కాదని సెల్‌ఫోన్ ఆపేశాను. అంత ట్లో హేమలత గారి సోదరుడు ఒకరు తెలంగాణ వచ్చేసిందని ఏడుస్తుంటే వీవీ సముదాయించాడు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి.

హేమలతగారి సంతోషంలో, తాను మూడు నాలుగు దశాబ్దాలు వీవీ సహచరిగా భరించిన బాధ ఉంది, భయం ఉంది. దాదాపు ఆ కుటుంబం చాలా ఆటుపోట్లను అనుభవించింది. వీవీ తన విశ్వాసాల కోసం చాలా హింసనే భరించవలసి వచ్చింది. బహు శా ఆమె ఆనందంలో తెలంగాణలో వీవీకి, తమ కుటుంబానికి, తమ లాంటి ఇతర కుటుంబాలకు భద్రత ఉంటుందనే ఒక విశ్వాసం అగుపిస్తున్నది. వీవీ ఇంటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా సహచరి వనమాల ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఒకటి రెండు రోజు లు మీరు బయట ఎక్కువ తిరగకండి, జాగ్రత్త గా ఉండండి అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి దేశంలో అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రమంతా తిరిగిన నాకు తెలంగాణ ప్రకటన వస్తున్న తరుణంలో జాగ్రత్తలు ఎందుకు అన్నాను. తెలంగాణలో మాలాంటి వాళ్లకు సంపూర్ణ భద్రత, ప్రజల మద్దతు ఉంటుందని వనమాల గారికి అనిపించకపోవడం వెనక నూతన రాష్ట్రంలో పూర్తి విశ్వాసం ఏర్పడకపోవడం గురించి కొంత ఆలోచించవలసిన అంశ మే. ఒక విధంగా తెలంగాణ ఏర్పడ్డా రాజ్య స్వభావంలో, పాలకుల దృక్పథంలో మౌలిక మార్పు రాదే మో అనే అనుమానానికి చాలా స్కోప్ ఉంది.

ఈ మొత్తం అనుభవాన్ని గత మూడు దశాబ్దాలు గా తెలంగాణ అనుభవించిన అరాచక, అమానుష పాలన నేపథ్యం నుంచి చూడవలసి ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూస్వాముల దాష్టీకం నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటం సాధారణమైనది కాదు. మెరికల్లాంటి యువకులు ప్రాణాలకు తెగించి తెలంగాణ అలగా జనానికి ఆత్మగౌరవం కల్పించడానికి రాజీ లేకుండా పోరాడారు. దొరలు పట్టణాల దారి పట్టారు. కానీ దొరల స్థానంలో పోలీ సు దొరలు వచ్చారు. ఒక్కొక్క ఎస్సీ కరీంనగర్ దొరల కంటే దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రజలను కంటినిండా పడుకోనివ్వలేదు. పౌరహక్కుల నాయకుల ను చంపిన ఘనత వీళ్లది. రాజ్యం అరాచకశక్తులను అదుపులో పెట్టే బదులు వాళ్లను ప్రోత్సహించి ఇతరుల మీదికి వదిలింది. నక్కలు,వేట కుక్కలు, పాము లు, పులులు చాలానే పుట్టుకొచ్చాయి. రాజ్య వ్యవస్థ మనిషికి భద్రత కల్పించే బదులు మనుషులను భయంలోకి నెట్టడం మన చట్టవ్యతిరేక పాలనకు పరాకాష్ట. బాలగోపాల్ లాంటి హక్కుల నాయకుణ్ని కిడ్నాప్ చేశారు. ఆయనతో చాలా అప్రజాస్వామికం గా ప్రవర్తించారుపజా సంఘాలను పని చేయనివ్వలేదు. సంఘాలను మూసుకోమని బెదిరింపులు, హత్యలు.. జరిగాయి. దీన్ని ఒక్క తెలంగాణ నాయకుడు ‘ఇది తప్పు’ అన్న పాపానపోలేదు.

ఈ మొత్తం అణచివేతకు మూలవిరాట్టు వెంగళ్‌రావు. ఆ తర్వాత దాన్ని మరింత ముందుకు తీసుకపోయింది ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాను అమలు చేసే క్రమం లో, పోలీసులను ప్రజాసంఘాల మీదికి రెచ్చగొట్టి, మిగతా అధికారులను ప్రజల ముందు అవమానపరిచి తన అధికారాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు. చివరకు రాజశేఖర్‌డ్డి అణచివేతను మరింత చాకచక్యంగా చేశాడు. అయితే ఈ అణచివేతను అమలుపరుస్తూ తెలంగాణ హోంమంత్రులను బృహన్నల్లా ముందు పెట్టారు. ఇంద్రాడ్డి, మాధవడ్డి, దేవేందర్‌గౌడ్, జానాడ్డి చివరికి సబితా ఇంద్రాడ్డిని ముందుకునెట్టారు. పౌరహక్కులలో పని చేయడం వల్ల వీళ్లందరినీ అనివార్యంగా కలవ వలసి వచ్చేది. వాళ్ల అసహాయతను చూసి జాలి వేసే ది. ఏ ఒక్క పోలీస్ అధికారి వాళ్ల మాటలను ఖాతరు చేసేవారు కాదు. వీళ్లందరితో శాంతిచర్చల సందర్భం లో కాస్త స్వతంవూతంగా ప్రవర్తించిన జానాడ్డిని రాజశేఖర్‌డ్డి మొత్తం కేబినెట్ నుంచి పక్కకు పెట్టాడు. అందుకే ఆంధ్ర పాలకులంటే తెలంగాణవాళ్లకు కోపం,ఆగ్రహం,అసహ్యం,ఆవేదన తెలంగాణ ఉద్యమంలో అంతర్లీనంగా పనిచేసింది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎదురు తిరిగారు.

తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతున్న సందర్భంలో అందరు ఆనందోత్సవాలలో ఉంటే, నాకెందుకో ఆందోళన కలిగింది. ప్రజలేమో తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో, ధైర్యంగా, భద్రతతో బతుకుతాం అనుకుంటున్నారు. కానీ చరిత్ర అటువైపు ప్రయాణిస్తున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణలో మతోన్మాదశక్తులు బలం పుంజుకుంటున్నాయి. ఇంత పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం జరుగుతున్న కాలంలో వికారాబాద్‌లో ఒక క్రిస్టియన్ పాస్టర్‌ను హత్యచేశారు. ఇది శాంపిల్ మాత్రమే.

అలా ఆందోళనతో ఉన్న నేను మా ఆర్‌కే (పర్‌స్పెక్టివ్)కు ఫోన్ చేస్తే మేం తేవాలనుకున్న ఒక పుస్తకం ఆలస్యమైందని చాలా బాధపడుతూ మాట్లాడాడు. ఆలస్యం నా వల్లే జరిగింది. ఇంతకీ మా ఇద్దరి మధ్య తెలంగాణ వచ్చిందన్న ఉత్సాహక సంభాషణ జరగలేదు. ఆర్‌కే కి తాను చేపట్టిన పని తాననుకున్న సమయంలో జరగకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఆ పట్టుదల వల్లే రెండు దశాబ్దాలలో యాభై పుస్తకాలు తీసుకురాగలిగాం. ఈ పట్టుదలే ఆర్‌కే బలం. ఆయన బలహీనత. అయితే మొట్టమొదట మేం ప్రచురించిన బాలగోపాల్ రచన ల మీద పోలీసుల నిఘా ఉంది. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటు వాళ్లు సంస్థ సభ్యుల వివరాలు కావాలని నా దగ్గరికి వచ్చి ఆరా తీశారు. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్‌లో పాల్గొని ఇంటికి వస్తే నా తొమ్మిది నెలల మనువరాలు ఒక పెద్ద రిలీఫ్. ఆమె తన ఆనందమయమైన ప్రపంచంలో ఉంటుంది. ఏది చూసినా ఆమెకు పులకరింతే. ఇంత అమాయకంగా, ఆనందంగా ఉండే ఈ పాప జీవించబోయే కొత్త తెలంగాణ ఎలా ఉంటుందో తెలియదు. ఈ పాప లాంటి పాప ల సంతోషాన్ని ఇనుమడింపజేసి వాళ్లు ఆనందంగా జీవించే తెలంగాణను మనం పునర్ నిర్మించగలమా అన్న ప్రశ్న నన్ను వెంటాడుతున్నది.

ఈ ఒక్కరోజు అనుభవంతో పడుకుంటే.. అసలు నిద్రపట్టలేదు. భవిష్యత్తు తెలంగాణ గురించి ఒక ఆరాటం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. శతకోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. దాని కి మనందరం బాధ్యులం. ఏ మాత్రం తెలంగాణ పునర్నిర్మాణం దారి తప్పినా ప్రజలకు మనం ఏం చెప్పాలి అనేది ఎందుకో నాకు చాలా భారంగా అనిపించింది. రాత్రంతా ఆ ఆలోచనలే..! తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అపరిమితమైన ఆశలను పెం చామా అనే ఒక ‘ఫీలింగ్’ వెంటాడుతున్నది. ఉద యం లేచి నా క్లాసుకు వెళ్లి అంబేద్కర్ తాత్విక దృక్పథాన్ని గురించి లెక్చర్ ఇచ్చి ఇంటికి వస్తున్నపుడు ‘నిన్న లేని అందమేదో నిదురలేచె నెందుకో.. నాలో నిదుర లేచె నెందుకో..’ అనే పాట అప్రయత్నంగానే మనసుకు తోచింది. ఏమో మానవీయ తెలంగాణ స్వప్నం నెరవేరుతుందేమో..!

292

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles