తెలంగాణ ఇస్తారట!


Thu,July 11, 2013 12:09 AM

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతుందని మరోమారు ప్రజలు నమ్ముమన్నారు లేదా పాలకులు నమ్మబలుకుతున్నారు. తెలంగాణను ఇస్తున్నారా, తెలంగాణ తెస్తున్నారా,లేక తెలంగాణ ప్రజలు తెలంగాణను సాధించుకుంటున్నారా అన్న ప్రశ్నకు తెలంగాణ ఇస్తున్నారన్నదే ఇప్పటి వార్త. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన అంటూ వస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పట్ల ప్రజలకు కృతజ్ఞతాభావం ఏర్పడవచ్చు! ఈ ఆనందంలో వందలమంది యువకులు ఆత్మహత్యలు, లాఠీచార్జిలు, నిర్బం ధం, జైళ్ళు, కేసులు అన్నీ మరచిపోవచ్చు. అన్నింటికిమించి తెలంగాణ కోసం నిజాయితీగా ఏ రాజీ లేకుండా నిలబడ్డ కవులు, నాయకులు, విద్యావంతులు, రచయితలు, ఉద్యమకారులు, విద్యార్థులు, జేఏసీలు మరుగునపడిపోవచ్చు. నిజాయితీ కలిగిన జయశంకర్ కంటే రాహుల్‌గాంధీ కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు.

ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకొని కాంగ్రెస్ నాయకులందరీ ప్రతిష్ఠ పెరగడమేకాక మరో ఐదు సంవత్సరాలు వాళ్ల పాలనే కొనసాగవచ్చు. కొత్త సీసాకాదు, కొత్తసారా కాదు, సరే చరివూతలో ఇప్పుడున్న దశలో త్యాగం కంటే తక్షణ లక్ష్యసాధనకు ఎక్కువ బలం, పలుకుబడి ఉంది. అది ఇప్పుడున్న పరిస్థితిలో సహజం కూడా.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకత్వం, మినిష్టర్లు, ప్రతిపక్ష నాయకులు, వాళ్ల రాజకీయాలు, ఎత్తుగడలు, స్వార్థాలు, భాష అన్నీ అలాగే కొనసాగుతాయ నే అనుకోవాలి. తెలంగాణ వచ్చిందన్న సంతోషం తప్పకుండా మనందరికీ ఉంటుంది. కాని వచ్చిన తర్వాత ఏమిటి అనే సీరియస్ ప్రశ్న గురించి ఉద్యమాలు అంతగా పట్టించుకోకపోవడం వలన, వచ్చిన తెలంగాణలో మనం ఏం చేయాలి? ఏం చేయగలం అనే ది ఇప్పుడు నిజాయితీ కలిగిన ప్రజాసంఘాల, ప్రజాస్వామ్యవాదుల చారివూతక బాధ్యత. ఒక సందర్భంలో 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నాం అనే ఉత్సా హం మీడియాలో ఎగిసిపడుతున్నప్పుడు జయశంకర్ ‘20వ శతాబ్దం నుంచి 21లో ప్రవేశిస్తే ఉదయం అదే సూర్యుడు ఉదయిస్తాడు, ఒక్కరోజు క్యాలెండర్ మారుతుంది తప్ప 21 శతాబ్దంలో ప్రవేశిస్తూనే కొత్త ప్రపంచం వస్తుందా డాక్టర్ సాబ్’ అని అన్నారు.

అలాగే విశాలాంధ్ర నుంచి తెలంగాణ ఏర్పడి తే ఒక బలమైన ఆకాంక్ష సాకారమయ్యిందనే సంతృప్తి కొంత ఉంటుందేమో కాని, నవ తెలంగాణ నిర్మాణంలో ఉండే ఆ ఆనందం, సంతృప్తి వేరు. ఇది అలాంటి ప్రత్యామ్నాయ నిర్మాణానికి శుభ సందర్భం. అయితే ఉద్యమం ఉధృతంగా లేని సందర్భంలో ప్రకటన వస్తే ఉద్యమంలో నుంచి వచ్చిన కొత్తతరం నాయకులు, కొత్త విశ్వాసాలు, కొత్త సంస్కృతి ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఇప్పుడు ఉద్యమం లో నుంచి లేదా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకు న్నాం అనే భావన కంటే తెలంగాణను ఎవరో ఇస్తున్నారు అనే భావన తెలంగాణను ‘ఇచ్చేది మేమే తెచ్చేది మేమే’ అనే కాంగ్రెస్ నాయకుల మాట కొంత నిజమైనట్టు.

తెలంగాణ పోరాటంలో పాల్గొన్న అందరికి ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారుల, దురాక్షికమణదారుల, కాంట్రాక్టర్ల ఆధిప త్యం నుంచి బయటపడ్డామనే ఫీలింగ్ విస్తృతంగా ఉంటుం ది. ధన అహంకారాన్ని వెనుకబడిన ప్రాంత ప్రజలు కొంతవరకైనా ప్రశ్నించి విజయం సాధించారు అనేది నిజమౌతుం ది. ప్రజల బలమా, ఆంధ్ర ప్రాంత పెట్టుబడుల బలం గొప్ప దా ఇంకా తేలవలసి ఉంది. తెలంగాణ వస్తే ప్రజల బలం, తెలంగాణకు అడ్డుపడి ప్రజలను కన్‌ప్యూజన్‌గా చేసే భిన్నమైన పరిష్కారాలు ముందుకు వస్తే పెట్టుబడి గెలిచినట్లు. ఆవిధంగా తెలంగాణ ఏర్పడితే ఆంధ్రవూపాంత ప్రజలకు కూడా ఈ పెత్తందార్లపై ఉండే భ్రమలు కొంత తొలగి, తెలంగాణ ప్రజల ఉద్యమంపై గౌరవం పెరగవచ్చు, ఉద్యమాల ద్వారా ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ఎదుర్కోవచ్చు అనే కొత్త విశ్వాసం ఏర్పడవచ్చు. ఇది ఒక రకంగా కొత్త రాజకీయ సంస్కృతికి దారివేయవచ్చు.

తెలంగాణ ప్రాంతానికి దేశ చరివూతలోనే ఒక ఉజ్వలమైన చరిత్ర ఉంది. పోరాటాల చరిత్ర ఉంది. కాకతీయ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ప్రశ్నించిన సమ్మక్క సారక్క దేవతలే అయ్యారు. బందగీ నుంచి గంటి ప్రసాదం దాకా త్యాగానికి ప్రతీకలయ్యారు. గంటి ప్రసాదం తెలంగాణలో పుట్టినవాడు కాకపోవచ్చు, కాని తెలంగాణ ఆకాంక్షను బలపరిచినవాడే, మానవీయంగా ప్రజలను ప్రేమించినవాడే. ఆ మాటకు బాలగోపాల్ తెలంగాణ లో పుట్టినవాడేంకాదు. శంకరన్, పొత్తూరి వెంక జొజ్జా తారకం లాంటి వారు తెలంగాణ వారు కాదంటే ఎవరూ ఒప్పుకోరు. అలాగే శివాడ్డి మీరు తెలంగాణ కాదంటే ఆయన ఒప్పుకోడు. మనుషులు ఎక్కడ పుట్టారనడం కాదు, ఎలా జీవించారు అనేదే ముఖ్యం. మేము గంటి ప్రసాదం అంతిమ యాత్రకు బొబ్బిలి వెళితే బొబ్బిలి ప్రజలు మా పట్ల చూపిన ఆదరాభిమానాలు నాలాంటి వాళ్ల హృదయాన్ని కదిలించాయి.

తెలంగాణ సాయుధ పోరాటం రావి నారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డిని గౌరవించినంతగానే సుందరయ్యను గౌరవించింది. శ్రీశ్రీని మనసారా గౌరవించింది. శ్రీ శ్రీ కవిత్వ వారసత్వం నుంచి వచ్చిన తెలంగాణ కవులు, నాయకులు, ఉద్యమకారులు కోకొల్లలు.ఆ వారసత్వం నుంచే గద్దర్ కవిత్వం, పాటలు, అద్భుత ధ్వని పుట్టాయి. తెలంగాణ యువ త త్యాగానికి మారు పేరు. ఎన్ని వందల వేలమంది ప్రజల కోసం పోరాడుతూ అమరులయ్యారు. ప్రపంచంలో ఎక్కుడ కూడా ఒక ప్రాంతం నుంచి ఆరుగురు పౌరహక్కుల నాయకులు హత్య చేయబడి ఉండరు. చనిపోయిన ఒక్కొక్కరు అసాధారణమైన మనుషులు. ఒక సందర్భంలో బాలగోపాల్ తెలంగాణ ప్రాంతాన్ని గురించి విశ్లేషిస్తూ ‘అయ్యో పాపం’ అనే ప్రవృత్తి తెలంగాణ విస్తృతంగా ఉండడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నాడు. తెలంగాణలో మానవీయ, నిజాయితీ, నిర్భయంగా మాట్లాడ గల వారి సంఖ్య ఏ ప్రాంతంలో కూడా లేదు.

వరంగల్‌లో ఒక పోలీసు అధికారి అరవైమంది ఉపాధ్యాయులను రోజూ పోలీసుస్టేషన్‌కు రావాలని నిర్బంధం చేసినప్పుడు ఉపాధ్యాయలోకం భయవూబాంతులకు గురైన సందర్భంలో ఒక సదస్సు జరిపితే వందలమంది ఉపాధ్యాయులు సభకు హజరైన తమ సహసాన్ని ప్రదర్శించి, రాజ్య నిర్బంధాన్ని నిలదీశారు. ఆ సదస్సుకు కడియం శ్రీహరి మినిష్టర్‌గా ఉండి అతిథిగా వచ్చాడు. ఇలాంటి ఎన్ని సంఘటనల గురించి ఎన్నో రాయవచ్చు. సాహిత్య రంగంలో, విద్యారంగంలోనే కాదు జర్నలిజంలో చాలామంది చైతన్యవంతులైన పాత్రికేయులున్నారు. దాదాపు నాలుగు తెలుగు దిన పత్రికలకు ప్రజాస్వామ్య విశ్వాసాలున్న ఎడిటర్‌లున్నారు.

నేను ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాలలో కలెక్టర్ల అపహరణ సందర్భంలో చూసిన వాస్తవం అక్కడ ఒక్క వ్యక్తి, ఒక్కడంటే ఒక్కడు పోలీసులను రాజ్యాన్ని ప్రశ్నించేవాడు కనిపించలేదు. ఒరిస్సాలో అలా మాట్లాడే దండపాణి మోహంతిని జైళ్లలో తోసేశారు. కేంద్ర ప్రభు త్వం మా వోయిస్టు ఉద్యమాన్ని ‘రూపుమాపడానికి ఆంధ్రవూపదేశ్ నమూనాను అవలంబించాలని నిర్ణయం తీసుకుంది. మనరాష్ట్రంలో మావోయిస్టులు ఏదైనా చర్యకు పాల్పడితే దీనికి ప్రతిగా బహిరంగంగా రాజకీయ విశ్వాసాలతో జీవిస్తున్న వారిని హత్య చేయ డం ఒక ‘కళ’గా రూపొందించారు. మిగతా రాష్ట్రాల్లో అలా దొరికేవాడు ఎవడూలేడు. మరేం చేస్తారో తెలియదు.

ఒక సజీవ ప్రజాస్వామ్య సంస్కృతి వెల్లివిరించిన ప్రాంతాన్ని పాలించడం అంత సులభమేమీకాదు. ఈ ప్రాంతంలో అధికారానికి వచ్చేవాళ్ళు ఏమాత్రం అప్రజాస్వామికం గా, అహంకారంతో ప్రవర్తించినా, తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ఎదిగిన యువత సహించదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, మాలాంటి వాళ్ళను కొంత నిరాశకు గురిచేశారు. ఉద్యమం మొదటిదశలో ఉన్న పట్టుదల, సమష్టితత్వం, లక్షలమందిని సమీకరించగలిగిన పటిమ, లాఠిదెబ్బలు, తూటా దెబ్బలు తిన్న తిరుగుబాటుతత్వం, క్షికమేణ తగ్గుతూ వచ్చింది. విద్యార్థులు భిన్న అస్తిత్వాల మధ్య బాగా విడిపోయారు. చాలా ఆలస్యంగా రాజకీయ పార్టీ పెట్టామని ప్రకటించారు. నిజానికి ఈ పని ఉద్యమ ప్రారంభంలోనే చేస్తే ఉద్యమ స్వరూపం భిన్నంగా ఉండేది. అస్సాం గణ పరిషత్ తర్వాత తెలంగాణ మరొక పెద్ద రాజకీయ ప్రయోగమయ్యేది.

1969 ఉద్యమానికి భిన్నంగా ఈ పర్యాయం ఒక్క విద్యార్థి నాయకుడు కూడా రాష్ట్ర స్థాయికి ఎదగలేదు. భిన్న సందర్భాల్లో విద్యార్థులు తమ నిజాయితీని కోల్పోకూడదని హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం. ప్రధాన జనజీవన రాజకీయ సంస్కృతి విద్యార్థులు ఆదర్శాలను, యువతకుండే ప్రశ్నిం చేతత్వాన్ని చాలా వరకు మింగేసింది. అయినా ఉద్యమం నుంచి తాము పొందిన అనుభవాన్ని రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోగలిగితే వ్యవస్థ తత్వం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. తామేం పాత్ర నిర్వహించగలరో స్పష్టమవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ఈ తెలంగాణ ప్రజాస్వామ్య, పోరాట చరివూత ను గుర్తుంచుకోవాలి. ఇంతవరకు పాలించినట్టుగా పాలిస్తే ప్రజలు సహించరు. మనుషులను పట్టుకుపోయి చంపడం, సభలను పెట్టుకోనివ్వక పోవడం, విద్యార్థి రాజకీయాలను అడ్డుకోవడం, మతద్వేష రాజకీయాలను రెచ్చగొట్టడం, మహిళల మీద హింస, దళితుల మీద అరాచకాలు, గిరిజనుల భూముల అశ్వీకరణ, మైనారిటీల విశ్వాసాల విధ్వం సం లాంటి ఏ చర్యలను కూడా తెలంగాణ ప్రజలు సహించరు, సహించకూడదు. రాజకీయ నాయకుల జీవితాల్లో మంచి పనులు చేయడానికి అవకాశాలు ఒకేసారి వస్తుంటా యి. తెలంగాణ నాయకులకు ఇది మరొక అవకాశం. డబ్బుల సంపాదన, ఆస్తులు కూడపెట్టుకోవడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బావుంటుందని అనుకుంటే అది మీ భ్రమ.

నిజాయితీగా ఒక సామాజిక మార్పు లో భాగమైతే ట్యాంక్‌బండ్ మీద ఇటువైపు మీ విగ్రహలుంటాయి, అటువైపు ఉంటే పగులుతాయి. మేము చివరిసారిగా రాజశేఖర్‌డ్డిని కలిసినప్పుడు ఆయన భుజం మీద చేయివేసి రాజశేఖర్ ఈ ప్రపంచంలోకి వచ్చిన మనం చనిపోయేలోపల కొంచెం మెరుగైన ప్రపంచాన్ని, సమాజాన్ని భవిష్యత్ తరాల కు అందించాలి’ అని సలహా ఇచ్చాడు. అలా చెప్పే కన్నబిరాన్ లేడు కాని ఇయన ఇచ్చిన సలహా అన్ని తరాలకు, అందరి రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శకమని మనం గుర్తించాలి.. ఇది తెలంగాణ నాయకులకు మళ్లీ మళ్లీ గుర్తు చేయడం మా బాధ్యత.

పొఫెసర్ జి. హరగోపాల్


35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles