చల్ చలో అసెంబ్లీ


Thu,June 13, 2013 05:33 AM


తెలంగాణ ఉద్యమం మరో పర్యాయం ఉధృతం కావడానికి, ఉద్యమ స్ఫూర్తిని కాపాడుకోవడానికి చలో అసెంబ్లీ పిలుపునిచ్చింది. నిజానికి అసెంబ్లీలో కూర్చున్న వారు ప్రజల దగ్గరకు వెళ్లే ఆనవాయితే ఉంటే ప్రజా ఉద్యమానికి అసెంబ్లీకి వెళ్లవలసిన అవసరం ఉండేది కాదు. ఐదేళ్ల కొకసారి కేవలం ఎన్నికలప్పుడే గడక గడపకు వెళ్లి వినయంగా దండాలు పెట్టి, ప్రజల భక్తుల వలె పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని నటించి, ‘దక్షిణాలు’ కూడా సమర్పించుకొని ఎన్నిక కావడం తప్ప, ప్రజల అభిమానంతో తాము ప్రజలకు చేసిన సేవలతో వచ్చిన ‘గుడ్‌విల్’తో గెలవడం మానేసి చాలా కాలం అయ్యింది. వావిలాల గోపాల కృష్ణయ్య ఎన్నికల్లో ఓడిపోయేటప్పటికే ఈ మార్పు వచ్చింది. వావిలాల నిజాయితీగా ప్రజల కోసమే పనిచేశాడు. కానీ రాజకీయ సంస్కృతే మారితే ఒక్క వ్యక్తి ఏం చేయగలడు. మాఫియా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో వావిలాల లాంటి వాళ్ళకు స్థానమే లేకుండాపోయింది. నాయకులు ప్రజలకు ఎన్నికలప్పుడు కొంత డబ్బు దస్కం చెల్లించుకుంటే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చారు. ప్రజల ను చైతన్యవంతులను చేసే బదులు, చైతన్యవంతమౌతున్న ప్రజలను డబ్బుల ద్వారా మభ్యపెట్టి, ప్రజలు చెడిపోయారు అని వారి మీదే నిందలు మోపడం మొదలుపెట్టారు. వావిలాల ఓడిపోయినప్పుడు ఆయన మద్దతుదారులు ఎన్నికల కౌంటింగ్ గది వెనక ద్వారం గుండా వెళ్ళిపోదాం అని అంటే ‘నేను ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయారు’ అని తాను అన్నానని వావిలాల చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు.ఎన్నికల్లో ఓడిన ప్రజలు, ఎన్నికల మరునాటి నుంచి తమ సమస్యల పరిష్కారాల కోసం తాము గెలిపించిన ప్రతినిధులతో పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే వారు అసెంబ్లీకి చలో అంటున్నా రు. ప్రజలు అసెంబ్లీ దగ్గరికి రావడానికి ఎందుకు అభ్యంతరం? అనుమతి ఎందు కు ఇవ్వడం లేదు? అని అడిగితే పోలీసులను అడిగి చెబుతాను అని ముఖ్యమంత్రి అనడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ అవస్థ కు అద్దం పడుతున్నది. పోలీసులకు సమస్యలను శాంతిభవూదతల కోణం నుంచి తప్ప వేరే కోణం నుంచి చూడడం అలవా టు లేదు. మనం అలవాటు చేయలేదు. మీటింగ్‌లు పెట్టకపోతే శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటాయి అని అనుకుంటే, ఎమ్జన్సీ విధించి అన్ని మీటింగ్‌లను రద్దు చేస్తే అసలు పోలీసుల అవసరమే ఉండదు కదా! ప్రజాస్వామ్యబద్ధంగా వేలాది మీటింగ్‌లు జరిగినా వాటి నిర్వహణకు తోడ్పడం పోలీసుల విధి అంటే కానీ మీటింగ్‌లకు అభ్యంతరం చెప్పే అధికారం వాళ్లకు ఉండదు. తప్పకుండా పోలీసులు చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వరు. రాజకీయంగా ముఖ్యమంత్రే నిర్ణయిస్తే తప్ప, పోలీసులు సంప్రదిస్తే రాజకీయ నిర్ణయం చేసే అధికారం వాళ్లకు ఇచ్చినట్లవుతుంది. అప్పుడు ఇది ప్రజా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం అని అనడానికి అర్హత ఉండదు.

తెలంగాణ ప్రజా ఉద్యమం గత దశాబ్ద కాలంగా మన ఘనమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తూనే ఉన్నది. వ్యవస్థ పరీక్ష పాస్ కావడానికి ఏ ఉద్యమం కూడా ఇంత సమయం ఇచ్చి ఉండదు. ఉదార ప్రజాస్వామ్యంలో ఎన్ని రకాల నిరసనలు సాధ్యమో, అన్ని రకాల నిరసనలు తెలంగాణ ప్రజలు చేపట్టారు. ఇంతకంటే శాంతియుతంగా గాంధీ మార్గం ద్వారా ఇంకా ఎలాంటి ఉద్యమాలు చేపట్టవచ్చో తెలియదు. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు విపరీత నిర్బంధం మధ్య లక్షలాదిమందితో శాంతియుతంగా మీటింగ్‌లు జరిపారు. ఉద్యమం మిలిటెంట్ పద్ధతులను ఉపయోగించకూడదని చాలా బలమైన నిర్ణయమే తీసుకొని దానికి కట్టుబడి ఉన్నది. ఉద్యమ అగ్రభాగాన ఉన్న రాజకీయ నాయకత్వం కాని, లేదా జేఏసీల నాయకత్వానికి దీన్ని మిలిటెంట్ ఉద్యమంగా మార్చడం ఇష్టం లేదు. రాజకీయ నాయకత్వానికేమో అది ఎక్కడ ఎదురు తిరుగుతుందోనని భయం. జేఏసీ నాయకత్వానికి ముఖ్యంగా పౌరహక్కుల సంఘంలో పనిచేసిన కోదండరాంకు రాజ్యం అణచివేతను దగ్గరగా చూసిన వాడుగా, ఏ మాత్రం గాంధీ మార్గాన్ని తప్పినా, మొత్తం ఉద్యమం మీద మావోయిస్టు ముద్ర వేసి అణచివేసే ప్రమాదమున్నదన్న అవగాహన ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిలిటెంట్ పద్ధతులు పక్కకుపెట్టి కేవలం ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని కోరే తెలంగాణ జన సభ మీద లేదా తెలంగాణ ప్రజావూఫంట్ సభ్యుల మీద రాజ్యం తన చట్టాతీత అధికారాన్ని ఉపయోగిస్తూనే ఉన్నది. వాళ్ళ సభ్యులను కేసులలో ఇరికించి, వేధిస్తూనే ఉన్నది. కొందరిని ఎన్‌కౌంటర్ కూడా చేసింది. ప్రజాస్వామ్య తెలంగాణ శాంతియుత పద్ధతుల ద్వారా సాధ్యమౌతే సాయుధ పోరాట అవసరమే ప్రజలకు ఉండకపోవచ్చు. భూమిని పంచి, గిరిజనుల హక్కులు కాపాడి, దళితుల, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించి, ఇప్పుడున అసమానతలను తగ్గిస్తే తెలంగాణ ఇతర ప్రాంతాలకు ఒక నమూనాగా మారుతుంది కదా. హింస పాత్ర చాలా తగ్గుతుంది కదా. పాలకులకు ఎందుకు ఈ అవగాహన లేదు? తమ ప్రయోజనాలే తప్ప వేరే ఏ ఆలోచన లేని వాళ్లు, రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? మళ్లీ చలో అసెంబ్లీ ఉద్యమానికి వస్తే అనుమతి ఇస్తే స్పీకర్‌కు ఒక వినతి పత్రం ఇస్తారు. ఇవన్నీ శాంతిభవూదతల సమస్యలేం కావు. ఇవి దిగజారిపోతున్న వ్యవస్థకు చిన్న అడ్డుకట్టలు వేసే చర్యలు మాత్రమే. గాంధీ మార్గాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊదరగొట్టే రాజకీయ వ్యవస్థ, ఈ గాంధీ మార్గాన్ని గౌరవించలేదా? ఇంతకు మించి ఉద్యమకారులు ఏ చర్యలకు పాల్పడ్డా, దాని పర్యవసానమేమిటో వాళ్ళకు బాగా తెలుసు. గాంధీ ప్రాపంచిక దృక్పథాన్ని గౌరవించకుండా, మార్క్సి స్టు అవగాహనను పట్టించుకోకుండా, ఒక ప్రాంత ప్రజల సహనాన్ని దశాబ్ద కాలంగా అర్థం చేసుకోకుండా, ఈ పాలన ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజలు ఎలా నమ్ముతారు?

ఇందులో మరొక పిట్టకథ. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమెరికా ఒత్తిడి మేరకు నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెడుతూ, గాంధీయిజాన్ని కంపల్సరీ కోర్సుగా ప్రవేశపెట్టారు. ఈ కోర్సు అందరు విద్యార్థులు చదవాలి. ఈ కోర్సులో సత్య హరిశ్చంవూదుడి కథ, గాంధీ తల్లికి చేసిన వాగ్దానాలు, ఆయన దొంగతనం చేసిన వైనం, ఆయన పశ్చాత్తాపం, దక్షిణావూఫికాలో ఆయన ప్రయోగాలు పాఠ్యాంశాలుగా చేర్చారు. ఈ కోర్సు ఎవరు తయారు చేశారో తెలియదు. ఎక్క డి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు డిగ్రీ పిల్లలకు సత్యహరిశ్చంవూదుడి కథ ఎందుకో తెలియదు. సత్యహరిశ్చంవూదుడు భార్యను బజారులో ఆక్షన్‌కు, మన ఐపీఎల్ క్రికెటర్ల వలె, పెట్టిన కథను క్లాస్ రూంలో అధ్యాపకులు ఎలా చెప్పాలో తెలియదు. మహిళా విద్యార్థినులు ఎలా స్పందిస్తారో తెలియదు. గాంధీ మీద ఏం గౌరవం ఏర్పడుతుందో తెలియదు. తెలంగాణలో గత పదేళ్లుగా గాంధీ మార్గాన్ని పరిహాసం చేసిన మన దేశ కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గాంధీ తత్వాన్ని ఇలా ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహించడం ఆయనను చులకనగానే చూడడమే కాదు, యువతరాన్ని తెలంగాణ భాషలో చెప్పాలంటే ‘బేవకూబ్’లను చేయడమే.చలో అసెంబ్లీకి అనుమతిచ్చి, మార్చ్‌ను శాంతియుతంగా జరిగే చర్య లు తీసుకొని, వెనకబడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీలో చర్చించాలి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేస్తే, రాజకీయ వ్యవస్థకు విశ్వసనీయత ఏర్పడుతుంది. అంతేకాక, ఈ దేశంలో శాంతియుత ఉద్యమాల ద్వారా కూడా సమస్యలు పరిష్కారమవుతాయనే సందేశం ప్రజలకు చేరగలిగితే, మిలిటెంట్ పోరాటాలు కొంతకాలమైనా వాయిదా పడవచ్చు. అలా జరగకపోతే మిలిటెంట్ ఉద్యమాలు తప్ప, వేరే మార్గం ప్రజలకు మిగలకపోతే బాధ్యులు ఎవరు?

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల