పాలమూరు నీళ్లకు ప్రచారయాత్ర


Thu,May 23, 2013 12:48 AM

పాలమూరు అధ్యయన వేదిక ఈ జిల్లాకు న్యాయంగా రావలసిన నీళ్ల కోసం ప్రజలను చైతన్యపరచడానికి, చలో అసెంబ్లీకి జనాన్ని సమీకరించడానికి ప్రచార యాత్ర చేపట్టింది. అధ్యయన వేదిక అధ్యయనం చేయాలి కానీ ప్రచారమెందుకు అని కొందరు పండితులు అనవచ్చు. అధ్యయనము, ఆలోచన, ఆచరణ కలిస్తేనే విజ్ఞాన లక్ష్యం నెరవేరుతుంది. మార్క్స్ అన్నట్లు ప్రపంచాన్ని చాలామంది తత్వవేత్తలు విశ్లేషించారు. కానీ సమస్యల్లా ఈ ప్రపంచాన్ని మార్చడమే. ఇంకొక సందర్భంలో మార్క్స్ విజ్ఞాన అంతిమ లక్ష్యం ఆచరణ. ఆచరణ నుంచి విజ్ఞాన ఫలాలు పండించడం అని వ్యాఖ్యానించాడు. ప్రజల నుంచి, వాళ్ల అనుభవం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంటుంది.అందరికి స్పష్టం గా విశ్లేషించే శక్తి లేకపోవచ్చు. కానీ అందరికీ ప్రత్యేకంగా సామాన్యుడికి సంపన్నమైన జీవిత అనుభవముంటుంది. అనుభవము, ఆచరణ కంటే మించిన విజ్ఞానమేదీ ఉండదు. అంటే సర్వవిజ్ఞానం మానవ అనుభవం నుంచే పుడుతుంది. మేధస్సుకు విజ్ఞానాన్ని అందించేది అనుభవమే. ఆ అనుభవం రెండు చేతుల నుంచి ప్రవహిస్తుంది.

నిజానికి మనుషులు ఇత ర జీవరాసుల కన్నా భిన్నంగా ఎదగడానికి ప్రధాన సాధనం చేయూత. ఒకవేళ మనిషి చేతులను కూడా నడవడానికే ఉపయోగించవలసి ఉంటే, మానవచరిత్రే లేదు. ప్రచారయావూతలో ఆ మనుషుల అనుభవాన్ని అధ్యయనం చేసి, వాళ్ల అనుభవంలో అంతర్లీనంగా ఉండే కార్యాకరణ సంబంధాలను అర్థం చేసుకోవడమే అధ్యయన వేదికలకు ప్రమాణం కావాలి.

ఈ ప్రచార యాత్రను తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రారంభించాడు. ఇందులో అన్ని జేఏసీలు తమ తమ స్థాయిలో పాల్గొంటామని ప్రకటించాయి. ఈ ప్రారంభ సమావేశంలో అధ్యయన వేదిక ఈ ప్రచార యావూతను చేపట్టడానికి ప్రధాన కారణాల్ని చెబుతూ, తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా ప్రజలు ఏ స్థాయిలో పాల్గొనాలో ఆ స్థాయిలో పాల్గొనడం లేదేమో అని కూడా అన డం జరిగింది. దీనికి జిల్లా ప్రజల చైతన్యస్థాయి ఉండవలసిన స్థాయిలో లేదే మో, అలా లేకపోవడమే జిల్లా వెనుకబాటుతనం, వలసలు, కరువు రాజకీ య వెనుకబాటుతనానికి కారణం కావ చ్చు. దీంట్లో ఏది కార్యము, ఏది కారణమో చెప్పడం చాలా కష్టం. ఆర్థిక వెనుకబాటు తనం పోవాలంటే ప్రజలు చైతన్యవంతంగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ పాల్గొనడం కేవలం భౌగోళిక తెలంగాణ కోసమే కాక తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసి ఉంటుంది. తమ సమస్యలను ఉద్యమం ముందు ఉంచా లి. అలాగే ఇతర తెలంగాణ జిల్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి.

తెలంగాణలో అన్ని జిల్లాలలో అతి ‘దురదృష్టమైన’ జిల్లా మహబూబ్‌నగర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మిగతా తెలంగాణ జిల్లాల కంటే పాలమూరు జిల్లాకు అత్యంత అవసరం. విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఈ జిల్లాకు జరిగినంత అన్యాయం మరే జిల్లాకు జరగలేదు. విశాలాంధ్ర ఐక్యత కోసం చాలా కష్టపడుతున్నామని, ఆ మహబూబ్‌నగర్‌కు ఏ అన్యాయం జరగలేదని గ్రామక్షిగామాన తమను తిరగనిచ్చే, ప్రచారం చేసే స్వేచ్ఛ తమకు లేకుండా పోయిందని ఆంజనేయడ్డి మొదలు పరకాల ప్రభాకర్ దాకా చాలా బాధపడిపోతున్నారు.

తమ స్వేచ్ఛ హరించబడినదని చాలా దిగులుతోనే కాదు, ఆగ్రహంగా ఉన్నారు. ఆ ఆగ్రహం పౌరహక్కుల ఉద్యమాన్ని కూడా వదలలేదు.పౌరహక్కుల ఉద్యమం కార్యకర్తలు ఆరుగురు పరకాల ప్రభాకర్ మాట్లాడే స్వేచ్ఛ కోసమే చనిపోయారు. పాలమూరు జిల్లా పురుషోత్తం,కనకాచారి, మునెప్ప దీనికోసం తమ ప్రాణాలు అర్పించారు. అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ కోసం ఆయన ఏమైనా చేశారా అని అడగక తప్పేట్లు లేదు. ఇతరుల స్వేచ్ఛ హరించుకపోతుంటే మాట్లాడని వాళ్లకు తమ స్వేచ్ఛ పోయిందని మాట్లాడే అర్హత ఉండదు. నిజంగానే పాలమూరు జిల్లాల్లో సమైక్యవాదులను తిరగనిస్తే వాళ్లకు జ్ఞానోదయమయ్యేదేమో తెలియదు. పాలమూరు గురించి కూడా తెలంగాణ ఉద్యమం అబద్ధాలు చెబుతుంది అని అంటారేమో. ఆదిశంకరుడి ‘సర్పవూభాంతి’ సిద్ధాంతాన్ని కూడా ఉపయోగించవచ్చు. సర్పవూభాంతిలో తాడును పాముగా భ్రాంతిపడవచ్చు. కానీ పామును తాడుగా భ్రమిస్తే ప్రమాదమే.

పాలమూరులో మరి విశాలాంవూధవాదులు ఏం ప్రచారం చేసేవారో వినాలని ఆసక్తి ఉన్నవాళ్లలో నేను కూడా ఒకడిని. ఎదురుగా వలసలతో తమ తల్లిదంవూడులను పోగొట్టుకున్న అనాథ పిల్లలను చూసి ఏం అనేవారో. ఇళ్లన్ని మూతపడి ఉంటే విహారయావూతకు వెళ్ళారని భ్రమించే వాళ్ళేమో. అధ్యయన వేదిక ప్రచారం ప్రజ ల సమస్యల గురించే ఎదురుగా చూస్తున్న విషాద అనుభవాన్ని, మళ్లీ ఒకసారి మరింత పట్టుదలతో పోరాడడమే. నిజానికి మహబూబ్‌నగర్ జిల్లా అలాంటి జిల్లా ప్రజల న్యాయమైన సమస్యల గురించి మాట్లాడని వారికి కలిసి ఉందాం అనే ధైర్యం ఎలా వస్తుందో మనుసు ఎట్లా వస్తుం దో ఊహించడం చాలా కష్టం.

కోస్తా జిల్లాలకు వెళితే అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. భూమి ఎంత దూరం కనిపిస్తే అంతా పచ్చగా ఉంటుంది. కన్నుల పండుగగా ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి పచ్చదనం ఈ ప్రాంతంలో కూడా ఉంటే ఎంత బావుండేది అని అంటే అది మీ స్వార్థం అని సమైక్యవాదులు అంటే, మనిషి స్వార్థపరుడు అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్లు వీళ్లే కదా! సంపద పంచాలని, భూములను పంచాల ని, సమసమాజం కావాలని రాజ్యాంగమే అంటున్నది. ప్రాంతీయ అసమానతలు ఎలా తగ్గిస్తారు. నీళ్ళలో ఎక్కువ వాటా అనుభవిస్తున్న వాళ్లు పక్కనున్న మనిషికి తాగడానికి కూడా నీళ్లు లేకపోతే బాధపడని వారిని ఏం అనాలి. మా నీళ్లు మాక్కావాలి, మా అధికారం, మాక్కావాలని, మా వనరులు మాకు దక్కాలి. పాలమూ రు రంగాడ్డి ఎత్తిపోతల పథకాన్ని అంగీకరించాలి. పునాది రాళ్లు వేసిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలి. చెరువు లు, కుంటలకు మరమ్మతులు చేయా లి. పడ్డ ప్రతినీటి బొట్టును వ్యర్థం కానీయకూడదు. భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ఇసుక తరలింపును ఆపాలి. ఇవన్నీ సత్యాలో, అబద్ధాలో అనే చర్చ అనవసరం. ఇవి కన్నీళ్లను తెప్పించే కఠోర వాస్తవాలు.

పాలమూరు జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు, యావత్ రైతులు, అంతకుమించి మహిళలు ముందుం డి ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవాలి. మొత్తం తెలంగాణ ఉద్యమం లో మహిళల పాత్ర చాలా తక్కువ. సాయుధ పోరాటాలలో పాల్గొనడానికి సిద్ధపడ్డ మహిళలు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. ఉత్తరాఖండ్‌కు చెందిన పూనం పాఠక్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీళ్ల కరువు వలన తమ చదువులు కూడా పోగొట్టుకొని నీళ్ల కోసం కష్టపడే వాళ్లమని, అంటూ దాంట్లో భాగంగా ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని, తమ నీళ్ల సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కారమయ్యింది అని మరికల్‌లో సభను ఉద్దేశించి మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. మా చెల్లెలి అత్తగారు 95 ఏళ్ల వృద్ధురాలు తమ చిన్నప్పుడు నీళ్లు ఎంత సమృద్ధిగా ఉండేవో చెప్పుతూ బావుల్లో బకెట్లతో నీళ్లను తోడుకునే వాళ్ళమని చెప్పింది. ఉన్న భూగర్భ జలాలు ఇమికి, నదీజలాల్లో వాటా రాకపోతే పాలమూరు ప్రజలకు పోరాటాలు తప్ప ఏమీ మిగలలేదు. అధ్యయన వేదిక ప్రచారానికి మద్దతిస్తూ పెద్దసంఖ్యలో స్పందించడమే ఇక పాలమూరు ప్రజల అవసరం.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles