తెలంగాణ యువత ‘ఎన్‌కౌంటర్’


Sun,April 21, 2013 01:54 AM


ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఎన్‌కౌంటర్’ లో దాదాపు పదిమంది మావోయిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఉత్తర తెలంగాణకు చెందినవారు. నెట్‌లో ‘ఉత్తర తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ పునరుద్ధరణ కల విధ్వంసం’ అనే శీర్షికతో వార్త కనిపిస్తుంది. తెలంగాణ విషాదం చాలా లోతైనది. ఒకవైపు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత, మరోవైపు సమాజాన్ని మౌలికంగా మార్చాలనే స్వప్నం కోసం త్యాగాలు చేస్తున్న యువత. ఇప్పటి తెలంగాణ ఉద్యమకారులు వీళ్లని తెలంగాణ యువత అంటే అంగీకరిస్తారో లేదో తెలియదు.అలాగే విప్లవోద్యమంలో ఒక ప్రత్యామ్నాయ సమాజం కోసం పోరాడుతున్న వారిని తెలంగాణ ప్రాం తానికి కుదించడం, విప్లవోద్యమం అంగీకరిస్తుందో లేదో అనుమానమే. కానీ తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమం. ఈ ఉద్యమంలో ఆర్.ఎస్.యు నుంచి ఆర్.ఎస్.ఎస్ వరకు ఎవ్వరైనా పర్వాలేదు, తెలంగాణ కోసం పోరాడుతున్నవారు లేదా తెలంగాణకు చెందిన వారందరూ ఈ అస్తిత్వ నిర్వచనంలో భాగం. ఇంతమంది యువత ఇందులో చాలామంది మహిళలు ఒక ‘బూటకపు ఎన్‌కౌంటర్’లో చనిపోవడం చాలా పెద్ద విషాదం. బూటకమని అనే సహాసం ఎలా చేస్తున్నారు! అం ఇప్పుడు ఇలాంటి ఎదురుకాల్పులన్నీ బూటకమని అందరూ భావిస్తున్నారు. దీనికి సాక్ష్యాధారాలు అవసరం అనే సందర్భం దాటిపోయింది. రాజ్యం కూడా ‘ఇవి బూటకం కాదు’ అని ఒప్పించడానికి ఏం ప్రయత్నం చేయడంలేదు. అంటే ‘ఉద్యమకారులను కాల్చి చంపుతాం’ అనేది సూటిగా చెప్పే వ్యూహం కూడా కావచ్చు.

ఈ మరణించిన వాళ్లు అందరూ నిజాయితీగా తాము నమ్మిన విశ్వాసాల కోసం ప్రాణాలిస్తున్నారు. చుట్టూ అవినీతితో కూడిన సమాజం, డబ్బుల కోసం ఆశపడుతున్న కొందరు యువత, అన్ని అంశాల్లో రాజీపడుతున్న మరొక రకం యువత, ఏ స్వప్నం లేని నిరాశలో జీవిస్తున్న యువతను చూస్తే ఇతరుల కోసం ప్రాణాలిస్తున్న యువతను కోల్పోవడం సమాజం తననైతిక వనరులను కోల్పోవడమే. ప్రకృతి వనరుల విధ్వంసం మానవాళికి ఎంత నష్టమో, నైతికంగా ఎదిగిన మనుషుల అసహజ మర ణం కూడా అంతే నష్టం. నిజానికి తెలంగాణలో ఇప్పుడు పెద్దగా విప్లవోద్యమం ఏమీలేదని, దాదాపు ఉద్యమం సమసిపోయిందని పాలకులు చెప్పుకొస్తున్నారు. ఇదే దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నది. ఆంధ్ర పోలీసులు మొత్తం దేశానికి ఒక ‘ఆదర్శ నమూనా’ అని చిదంబరం నుంచి వివిధ రాష్ట్రాల పాలకుల దాకా అంటున్నారు. అలాంటప్పుడు ఈ ఉద్యమకారులను అదుపులోకి తీసుకుం ఏం ప్రమాదం జరిగేది? రాజ్యం ఎందుకు ఇంత భయపడుతున్నదన్నదే ప్రశ్న. ఈ భయానికి కారణాలు వెతకవలసి ఉంటుంది.మావోయిస్టు ఉద్యమం, ముఖ్యంగా గిరిజన పోరాటాలు మొత్తం ‘దేశ భద్రతకు ముప్పు’ అని ప్రధాని ఈ ఉద్యమానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చేశారు. నిజానికి గిరిజన ఉద్యమాలు మన రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ కొత్తేం కాదు. దాదాపు అయిదారు దశాబ్దాలుగా ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంతో సమాంతరంగా గిరిజనులు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటాలకు, ఆ పోరాట వీరులకు మనదేశ చరివూతలో ఎంత స్థానముండాలో అంత స్థానాన్ని పాలకులు కాని, చరివూతకారులు కాని ఇవ్వలేదు. ఈ పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో కనీసం ‘షెడ్యూ ల్’ అనే పేరు చేర్చబడింది. ఇందులో గిరిజనులకు ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించబడినవి. కానీ స్వాతంవూత్యానంతరం రాజ్యాంగాన్ని గౌరవించడం, అమలు చేయడం మరిచిపోయిన పాలకులు గిరిజనుల జీవితాలను గుణాత్మకంగా మార్చడానికి చేసిన ప్రయత్నం చాలా తక్కువ. గిరిజన ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపద, అటవీసంపద ఉండడంతో ఆ సంపదే వాళ్లకు శత్రువయ్యిందని చాలాసార్లు రాశాను. ఆ సంపద కోసం బహుళజాతి కంపెనీలు, కాంట్రాక్టర్లు మాఫియా, రాజకీయ నాయకులు, దళారులు ఆశపడి గిరిజన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశారు. వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడే గొప్ప వారసత్వమున్న గిరిజనులు ఈ దోపిడీ పీడనలను సహించడానికి నిరాకరించారు. దీంతో ఆదివాసులపై యుద్ధం స్వాతంవూతానంతరం కూడా కొనసాగుతున్నది.

ఛత్తీస్‌గఢ్ విషయంలో, అక్కడ ఉండే చారివూతక, భౌగోళిక పరిస్థితులు అనుకూలించడం వల్ల మావోయిస్టు పార్టీ చాలా బలంగా ఉంది. మొత్తం విప్లవోద్యమ దశ,దిశ అక్కడి నుంచే వస్తున్నది అన్నది పాలకుల అవగాహన. చత్తీస్‌గఢ్‌లో విస్తారమైన ఖనిజ సంపద ఉన్నది. ఈ సంపదను దేశ కార్పొరేట్లు, విదేశీ కంపెనీలు తవ్వుకుని పోవడాన్ని గిరిజనులు అంగీకరించడం లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనుల అనుమతి లేకుండా ఆ సంపదను ముట్టే హక్కు ఎవరికి లేదు. ఈ రాజ్యాంగ ప్రమాణాలను పక్కకుపెట్టి బహుళజాతి కంపెనీలకు అటు బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తూ పోలీసు బలగాలను, గ్రేహౌం డ్స్ బలగాలను ఆదివాసుల మీద గ్రీన్‌హంట్ పేర ప్రయోగిస్తున్నాయి. చిదంబరం సైన్యా న్ని కూడా దించాలని ప్రయత్నం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు బలగాలకు శిక్షణ ఇవ్వడానికి సైన్యం ఒక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నది. నిజానికి నిరాడంబరంగా, ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసీల మీద పాలకులకు ఎందుకింత కక్ష, ఇంత యుద్ధం ఎందుకు? అనే మౌలిక ప్రశ్న దేశ ప్రజలంతా అడగాలి.ఛత్తీస్‌గఢ్‌లో ఉండే సంపద కొల్లగొట్టడం తప్ప అక్కడ ప్రభుత్వానికి ఏ ప్రయోజనాలున్నాయి? గిరిజనులు తమ స్వయం పాలన తామే చేసుకుంటామంటే, అధికార వికేంవూదీకరణ గురించి తాపవూతయ పడుతున్న ప్రభుత్వానికి ఏం సమస్య? దేశం నుంచి విడిపోతామని వారేం అనడంలేదు కదా! నిజానికి నూతన ఆర్థిక విధానాల పేర సామ్రాజ్యవాద శక్తులకు దేశ సరిహద్దులను బార్లా తెరిచి, మన అడవీ సంపదను దోచుకుపోండి అనే నినాదం చిదంబరం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం మరింత పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ‘ఎన్‌కౌంటర్’ జరిగిననాడు చిదంబరం కెనడా నుంచి అమెరికా చేరుకొని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసిస్తూ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని బతిమిలాడుకున్నాడు. రవాణా,బొగ్గును రెగ్యులేటరీ కమిషన్ కిందికి త్వరలో తీసుకొస్తామని వాగ్దానం కూడా చేశాడు. బొగ్గుగనుల్లోకి విదేశీ పెట్టుబడిని ఆహ్వానించడమేమిటి? అని అడిగేవారు లేరు. పెట్టుబడులను ఆహ్వానిస్తూ భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యమున్నదని, పారదర్శకత, చట్టబద్ధపాలన బ్రహ్మాండంగా వెల్లివిరుస్తున్నాయని కూడా అన్నాడు.ఈ తపనంతా కూడా విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికే! ‘పరిపుష్టమైన పాలన లేకపోతే పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు’? అని కూడా చెప్పుకొచ్చాడు.

నిజంగా మనదేశంలో పరిపుష్టమైన, సుస్థిరమైన, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నదా? ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాస్వామ్య చట్టబద్ధపాలన ఉన్నదా? అభివృద్ధి చెందిందని బాహాటంగా అబద్ధాలు చెబుతున్న గుజరాత్‌లో ప్రజాస్వామ్యమున్నదా? గుజరాత్‌లో మైనారిటీలు భద్రత కలిగి ఈదేశ పౌరులమని భావించే వాతావరణమున్నదా? పారదర్శకత ఉంటే.. ఛత్తీస్‌గఢ్ ‘ఎన్‌కౌంటర్’ ఎలా జరిగిందో పూర్తి వివరాలు బయటికి వచ్చే పరిస్థితి ఉన్నదా? చట్టబద్ధపాలన ఎంత పరిహాసానికి గురౌవుతున్నది? ఏ మనిషి ప్రాణా న్ని కూడా రాజ్యం చట్టబద్ధంగా తప్పించి తీయకూడదని చట్టంలో ఉన్న ది. మరి బూటకపు ఎన్‌కౌంటర్లు ఎలా సాధ్యం? వాస్తవాల మీద ఆధారపడని వాదనలు చాలా కాలం నిలవవు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ‘అభివృద్ధి’ అనే మాయాజాలంలో పడి తమను తాము మోసం చేసుకుంటున్నారు. మోసపు పాలన కొంత కాలం కొనసాగవచ్చు, కానీ ఎక్కువ కాలం నిలవదు. నరేంవూదమోడీ తప్పిదారి ప్రధాని అయితే.. అప్పు డు ఇది అభివృద్ధా, ప్రజాస్వామ్యమా, చట్టబద్ధపాలనా అర్థమౌతుంది. ‘సత్యం’ అనుభవంతో అర్థమైనంత స్పష్టంగా ‘వాదన’తో అర్థం కాదేమో?మొత్తంగా ఛత్తీస్‌గఢ్‌లో మరణించిన మావోయిస్టులు, అలాగే దారితప్పి చనిపోయిన పోలీస్ అధికారి ఎందు కోసం ప్రాణాలు కోల్పోయినట్టు? ఎందుకు ఇంత హింస జరుగుతున్నది? ‘వృది’్ధ రేటు మనుషుల శవాల మీదుగా తప్పించి, వేరే విధంగా లెక్కించలేమా? ఛత్తీస్‌గఢ్ గిరిజనులకు తమ భవిష్యత్తు మీద, తమ వనరుల మీద తమకంటూ ఒక నిర్ణయాధికారం కావాలి కదా! దేశాభివృద్ధికే ఈ ప్రయాస అని నమ్మితే, అది నిజమే అయితే.. దాని గురించి ప్రజలను ముఖ్యం గా గిరిజనులను ఒప్పించవచ్చు కదా? వాళ్లతో రాజకీయ వ్యవస్థ ఎప్పుడైనా మాట్లాడిందా? మన దేశ ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయవద్దు అనేది దేశభక్తి కాదా? కేవలం సామ్రాజ్యవాద దోపిడీకి సహకరిస్తున్న పాలకుల ప్రయోగంతో తెలంగాణ బిడ్డలు ఆహుతి అయ్యారు. తెలంగాణ ఉద్యమం వీళ్ల ఆశయాలను గుర్తిస్తుందా లేదా అన్నది ఉద్యమ దిశను దాని అభివృద్ధి నమూనా రూపురేఖలను నిర్ణయిస్తుంది. (ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఆధీనంలో ఉన్న ఆర్‌ఎస్‌ఐ వరవూపసాద్ మృతదేహాన్ని గౌరవవూపదంగా వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి స్పందిస్తారని ఆశిస్తున్నాను)

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles