పాలకులకు పట్టని పాలమూరు గోస


Wed,January 16, 2013 11:49 PM

తెలంగాణ పరిష్కరించడం కోసం ఢిల్లీలో చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కరం అయిపోతుందని ఆశిద్దాం. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులకు ఉండే ప్రభావం చాలా కీలకమైనది. వారు చివరి క్షణంలో కూడా నిర్ణయాన్ని, రాజకీయ ప్రక్రియ మరో తోవపట్టించే ప్రమాదం కూడా ఉన్నది. తెలంగాణ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్పితే దేనికి కూడా అంగీకరించే స్థితిలో లేరు.తెలంగాణ రాష్ట్రంలో ఏరూపంలోనూ సమస్యలన్నీ పరిష్కా రం అవుతాయని ఆశించటం అత్యాశయే. నీళ్ల సమస్య, కరువు, వలసల సమస్య పరిష్కారం అవుతుందని భావించకూడదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం లో ఎవరిపైనయినా పాలమూరు ప్రజలు నిరంతరంగా వత్తిడి పెట్టవలసి ఉంటుంది. ఈ సమస్యను మొత్తం ప్రాంత ప్రజలకు అలాగే దేశ రాజకీయ నాయకుల దృష్టికి తేవడానికి పాలమూరు అధ్యయన వేదిక రెండు రోజుల ధర్నా చేయాలని నిర్ణయించింది. పాలమూరు సమస్యలన్నీ ఈ ధర్నా ద్వారా పాలకుల దృష్టి తీసుకెళ్లుతున్నాము.

దశాబ్దాల తరబడి ఒకే పోరాటం. అలజడి,ఆందోళన, ఊరేగింపు, ధర్నా, పాదయాత్ర నిరహరదీక్ష, వ్యక్తులు, సంఘాలు, పార్టీలు ఒకే నినాదం మాకు నీళ్ళు కావాలని, మా గొంతులు తడపాలని. చూడవు, వినవు, కదలవు ప్రభూత్వాలు మొద్దుబారినయి. అయినా మేం అడుగుతూనే ఉన్నాం. న్యాయం చేయమని మొత్తుకుంటూనే ఉన్నాం.

ఎప్పుడైనా ఎవడైనా కరుగుతాడేమోనని ఆరాటపడుతూనే ఉన్నాం. పొలాలలో మా రైతులు రాలిపోతున్నారు. రైతులు, సమస్తవూశామికులు వలసలు పోతున్నారు. కేవలం పొట్టకూటికోసం పోయినచోట ప్రమాదాలకు, అత్యాచారాలకు, హత్యలకు బలై శవాలై తిరిగివస్తున్నరు. జిల్లాలో వలస శవాలు రాని పల్లెలేదు. లేబర్ మిస్సింగులకు, వలసచావులకు, ఆకలి చావులకు, ఆత్మహత్యలకు మొత్తంగా అసహజమరణాలకు ఈ జిల్లా నెలవైంది. అన్ని వసతులు ఉండి ఏవీ నోటికందక ఒక లేబర్ రిజర్వుగా మిగలింది. ఇది ఇవాల్టి పాలమూరు జిల్లా దీనస్థితి. ఒంటరి స్త్రీలు, ఒంటరి పిల్లలు బతుకునెట్టుకొస్తున్న స్థితి.

అమానవీయమైన ఈ స్థితి మారాలని మేం పోరాడుతున్నాం. అందుకు తక్షణం చేయాల్సిన పని జలవనరులు కల్పించటం. పాలమూరు జిల్లా మీదుగా కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు పారుతయి. దుందుభి, ఊకశెట్టివాగు, కాకరవాణి, ధారవాగు, మానువడ్డవాగు ఇలా ఎన్నో వాగులు పారుతయి. కురిసిన ఏ కోద్దిపాటి వాన అయి నా కృష్ణలోకే పోతుంది. తరాలనాడు కట్టిన చెరువులు, కుంటలు తలపూడినయి. పాతవి కాపాడింది లేదు. కొత్తవి కట్టిందిలేదు. భూమి మీద వత్తిడి పెరిగింది. భూమి దురావూకమణకు గురవుతున్నది. అన్ని వనరులు తరలింపబడుతున్నవి. తరలించటం సాధ్యంకాని భూమి పరాధీనమౌతున్నది. ఏవీ ఆగటంలేదు.

చెరువులు, కుంటలు, గుట్టలు అన్నీ అధికారవ్యవస్థల తోడ్పాటుతో ప్రజలకు దూరమవుతున్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పెద్దపెద్ద సాధనాలతో సమస్తాన్నీ సంపన్నవర్గాల గుప్పిట్లోకి మారుస్తున్నది. ఆ గుప్పిట్లో పాలమూరు జిల్లా నలిగిపోతున్నది. అనేక సమస్యలు కాదు. ఒక్క జలవనరుల అంశం చూసినా ఈ దుర్మార్గం తేటతెల్లమవుతుంది.
జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ జడ్జియే మొత్తుకున్నడు. అంతకు ముందే జస్టిస్ ఫజల్‌అలీ నీళ్ళు, భూములు, నిధులు, వనరుల విషయంలో తెలంగాణ దోపిడీకి గురవుతుందని తెలంగాణ వాండ్లు అనుమాన పడుతున్నరని రాసిండు. అదే నిజమైంది.

అందుకే బచావత్ మహబూబ్‌నగర్ పట్ల కనికరంగా మాట్లాడిండు. పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం అప్పగించిన విధి విధానాలకు లోబడి ఇచ్చిన కొద్దిపాటి నీరు కూడా తీర్పు కాలపరిమితి ముగిసినా నేలమీద పారించలేదు. నైజాం కాలం నాటి అప్పర్‌కృష్ణా, భీమా ప్రాజెక్టులు నిర్మాణమై ఉంటే దాదాపు 200టీఎంసీ నీటి వినియోగంతో మహబూబ్‌నగర్ జిల్లా డెల్టా జిల్లాతో పోటీ పడగలగి వుండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణను మింగింది. ఆ దుర్మార్గానికి పాలమూరు బలైంది. ఇక్కడి వ్యవసాయమంతా మోటర్లతో నీరు ఎత్తిపారించుకునేదే. ఈ అనుభవంలోంచే పాలమూరు ప్రజలు ఎత్తిపోతల పథకాల సాధన పోరాటాలు మొదలు పెట్టారు.

ఆంధ్రపాలక వర్గం, దానికి లోబడిన తెలంగాణ పాలకవర్గం, మంత్రులు, శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు తీవ్రమైన ద్రోహం చేసింరు. పాలమూరు నీటి డిమాండ్లు ముందుకు తెచ్చినప్పుడల్లా దారి మళ్ళించే ఉద్యమాలు ముందుకు తెచ్చింరు. బరితెగించి పాలమూరు జిల్లాకు ఇవ్వటానికి కృష్ణా నదిలో నీళ్ళే లేవన్నరు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలది ఈ విషయంలో గట్టి అనుబంధం. ఆర్డీఎస్‌ను సర్వనాశనం చేసి ఇక్కడి నీళ్ళు తరలించే సుంకేసులను ప్రాజెక్టుగా నిర్మించింరు. శాసన సభ్యులే దాడిచేసి పాలమూరుకు కేటాయించిన నీటిని దారి మళ్ళించింరు. పాలమూరు విషయంలో న్యాయం పనిచేయలేదు. దేశవ్యాపితంగా అన్ని భారీ నిర్మాణాలకు మట్టిమోసి చెమట, రక్తం ఇచ్చిన పాలమూరు ప్రజలు ఈ రాష్ట్రం లో నిర్మాణ కృషి చేయని ప్రాజెక్టు గానీ, తవ్వకాలు గానీ లేవు. నీళ్ళు తరలించే కాలువలు తవ్వించి, కట్టలు నిర్మించి వాటిని పాలమూరు కన్నీళ్ళతో నింపుతున్నారు. ఇది ఉద్వేగం కాదు వాస్తవం.

కరువు నివారణ పోరాటాల తీవ్రతకు తట్టుకోలేక పాలక వర్గాలు పాలమూరు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను ఎన్నికల హామీలలో చేర్చింరు. ఒకడు రాళ్ళు నాటి, మరొకడు చెట్లునా టి ఊరించింరు. మరోవైపు రాయలసీమలో కనీసం 350 టీఎంసీల నీరు నిలిపే నిర్మాణాలు పూర్తి చేసింరు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్ళు తరలించటానికి పోలవరం పూర్తి చేస్తామని, పులిచింతల పూర్తి చేస్తామని కృష ్ణనీరు కొంత కరువు జిల్లాలకు మళ్ళిస్తామని అంటున్నరు. ఆదివాసీ జీవితాలను, వనరులను అంతం చేయడానికైనా వెనకాడటం లేదు. ఉన్నంతలో కృష్ణనీరు అంతర్జాతీయ జలసూవూతాలు పాటించి పంచమంటే అందని పొందని వాదనలు చేస్తున్నారు.

ఎట్టకేలకు పాలమూరు జిల్లా ఎత్తిపోతల పథకాల పనులు ఏడేండ్ల కితం మొదలు పెట్టినా అవి నేటికీ పూర్తికాలేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలలో మూడేసి, రెండేసి స్థాయిలలో నీరు లిఫ్టు చేయవలసి ఉంటుంది. చివరి స్టేజీ పూర్తి అయితే తప్ప ఎక్కువ ఆయకట్టుకు నీరు అందదు. అన్ని స్థాయిలలో నీరు ఎత్తిపోసే నిర్మాణాలు, ఎత్తిపోసిన నీరు పారవలసిన కాలువలు పూర్తి కాలేదు. నీరు నిల్వ చేయవలసిన నిర్మాణాలు మొదలు పెట్టలేదు.అవి ఎప్పటికి పూర్తయ్యేది ప్రభుత్వానికే తెలియదు. అసంపూర్తిగానే ముఖ్యమంత్రి 2012 సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో జిల్లాలో తిరిగి జాతికి అంకితం చేసి చూసి మురవాల్సిన పరిస్థితే మిగిలించి వెళ్ళాడు. కోయిల్‌సాగర్ పథకం, భీమా ఫేజ్-1 పథకాలలో మొదటి పంపు పనిచేసే స్థాయి పనులు కూడా పూర్తికాలేదు.

సెప్టెంబర్ 2012లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సమయంలో 15, 16 తేదీల లో పాలమూరు అధ్యయన వేదిక రెండురోజులలో 30 గంటలు పాలమూరు జలసాధన దీక్ష చేపట్టింది. ప్రజా సంఘాలు, ప్రముఖులు ఈ దీక్షలో పాల్గొన్నారు. గద్దర్ నేతృత్వంలో జేఏసీతో కూడిన ఒక ప్రతినిధి బృందం ముఖ్యమంవూతికి లేఖ ఇచ్చి ప్రాతినిధ్యం చేసింది. పరిశీలిస్తానని, పథకం చేపడతామని ముఖ్యమంత్రి హామీ వెలువడింది. ఎన్నికల హామీ అధికారి హామిగా మారింది. 2012 ముగిసి పోయినా ముఖ్యమంత్రి కనీసం సర్వేకు కూడా ఉత్తర్వులివ్వలేదు. ఇంతలో ఈ పథకం కష్టమని అధికారులు ఒక సన్నాయి నొక్కారు. ప్రభుత్వం వాళ్ళని అదుపు చేయలేదు.

భూములు బీడు పడిపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. బతుకులు బీడుపడతాయి. గత్యంతరం లేక ప్రజలు భూములమ్ముకుంటారు. కొనేవాళ్ళకు, రియల్ ఎస్టేట్ దందాగాళ్ళకు, దళారీలకు లాభాలుంటాయి. సామాన్య ప్రజలకు ప్రభుత్వాలు భూములు పంచుడేమోగానీ ఉన్న భూములన్నీ పోతాయి. ఇప్పుడదే జరుగుతున్నది. ప్రజలు నిరాధారులవుతున్న కొద్దీ హింస వ్యవస్థీకృతమవుతున్నది. ప్రభుత్వాలు హింసను వ్యవస్థీకృతం చేస్తున్నాయి. జలవనరుల సాధన పోరాటం పాలమూరు ప్రజల జీవితాలలో శాంతిసాధన పోరాటం. పాలమూరు బతుకు కన్నీళ్ళు కృష్ణలో పారుతున్నయి. భూగర్భజలం లోలోతుకు పోయి పాలమూరు ప్రజలు నీళ్ళుకాదు విషం తాగుతున్నారు.

ఫ్లోరైడ్ తాగుతున్నారు.వ్యాపారపు కలుషిత జలాలు కొని తాగలేని వాళ్ళు విషమే తాగుతున్నారు. శరీరంలో సున్నితమైన ముఖ్యమైన భాగాలు దెబ్బతిని చస్తున్నారు. ఇవన్నీ చెప్పకుండా చేసే హత్యలు. వాళ్ళ చేతులతోనే వాళ్ళను చంపేయటం ఈ పరిస్థితి ఏమాత్రం మారాలన్నా పాలమూరు రంగాడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి తీరవలసిందే. దుస్థితి అర్థమైన ఎవ్వరమైనా మౌనంగా ఉండవలసిన సందర్భంకాదిది. ఇలాంటి స్థానిక సమస్యలలోంచే, కుత కుత ఉడుకుతున్న బతుకు ఎతలలోంచే తెలంగాణ పోరాటం పుట్టింది. ఇప్పుడు తెలంగాణ పోరాటం తీవ్రమైంది.

ఇంతగా పోరాటం జరుగుతున్నా ప్రభుత్వం వనరుల దోపిడీ ఆపలేదు. విధ్వంసం ఆపలేదు. దురావూకమణ ఆపలేదు. సంక్షేమంపేరు తో ఎవరినైతే ఆదుకుంటున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయో, ఏ ప్రజల రెక్కల ఫలితం మీద పెత్తనం చలాయిస్తున్నాయో ఆ దళితులు, ఆ ఆదివాసు లు, ఆ వెనుకబడిన కులాల పేదలు, ఆ మహిళలు మొత్తంగా సమాజంలోని పేదలు బలవుతున్నారు.పాలమూరు జిల్లాలో ఈ విధ్వంసం మరింత తీవ్రంగా ఉంది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు వల్ల చాలా ఎక్కువగా నష్టపోయిన జిల్లా అనుభవిస్తున్న భీభత్సం ఇది.
ఈ దుస్థితి నుంచి పాలమూరు జిల్లాను కాపాడగలిగే దగ్గరి దారి జలవనరులు అందించటమే. వనరుల తరలింపు, దురావూకమణ ఆపటమే.

ఎంతగా అభివృద్ధి జరిగిందని, పారివూశామిక ప్రగతి సాధించామని చెప్పుకుంటున్నా జిల్లాలో నేటికి నూటికి ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం మీదనే బతుకులీడుస్తున్నారు. వ్యవసాయ సంక్షోభ ఫలితమే వలసల తీవ్రత. వ్యవస్థీకృతమైన చిత్రహింసల కొలిమిలోంచి పాలమూరును కాపాడాలనే డిమాండ్‌తో మేం హైదరాబాదులో సచివాలయం ముందు ఇందిరా పార్కు దగ్గర 30 గంటల జలసాధన దీక్షచేయ తలపెట్టినం. మాకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలందరికి, ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిపి సంఘీభావం కూడగట్టి ప్రభుత్వం మీద వత్తిడి పెంచాలని మేం దీక్షకు పూనుకున్నాం.


మేం గొంతెమ్మ కోరికలు కోరడంలేదు. మనిషికో విమానం కావాలనటంలేదు. కనీసావసరాలకు, తాగటానికి, సేద్యానికి నీళ్ళడుగుతున్నాం.మొత్తం నీళ్ళు తమకిస్తే రాష్ట్రం విభజించటాన్ని అంగీకరిస్తామని డెల్టా మేధావులు ప్రకటిస్తున్నారు. నెనరులేదు. న్యాయం లేదు. ఈ అన్యాయం విప్పిచెప్పటానికి పాలమూరు అధ్యయన వేది క చేసున్న 30 గంటల పాలమూరు జలసాధన దీక్షలో పాల్గొనాలని ప్రజాస్వామిక వాదులను, తెలంగాణ వాదులందరినీ పేరుపేరునా కోరుతున్నాము. హైదరాబాదు లో నివాసం ఉంటున్న, బతుకుతెరువు చూసుకుంటున్న పాలమూరు బిడ్డలందరూ మన జిల్లాకు జరిగిన అన్యాయం చర్చించాలని ఉద్యమంలో భాగం కావాలని కోరుతున్నాము. జనవరి 18,19 శుక్ర, శని వారాలలో 30 గంటల పాలమూరు జల సాధన దీక్ష జయవూపదం చేయండి.

పాలమూరును చూసియైనా ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లు ఈ జిల్లా ఎంత వెనుకబడిపోయిందో ఆంధ్ర ప్రజలు ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకోవాలి. వెనుకబడిన జిల్లాకు మద్దతుగా వాళ్లందరు కూడా నిలబడ్డాలి. తెలంగాణ ఉద్యమం సాధారణంగా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంత పేద ప్రజలు, తెలంగాణ ప్రాంత పేద ప్రజలతో కలిసి నూతన ఆర్థిక విధానాలకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమష్టిగా పోరాటం చేయవలసి ఉంటుంది. రెండు ప్రాంతాల పేద ప్రజలు, పరస్పర సహకారంతో ఈ సమాజాన్ని సమ సమాజం వైపు తీసుకు కలిసి పోరాటం చేయాలి.

పొఫెసర్ జి.హరగోపాల్
పాలమూరు అధ్యయన వేదిక గౌరవ అధ్యక్షులు
(జనవరి 18,19 తేదీలలో పాలమూరు జల సాధన దీక్ష సందర్భంగా..)

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల