కాళోజీ బతికుంటే...


Sat,November 12, 2011 10:50 PM

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు లు చరివూతకు ప్రభావితమవుతారా? అనే అంశానికి కూడా సరియైన సమాధానం దొరకలేదు. అవుతే సామాజిక సమిష్టి జ్ఞాపకంలో కొందరు వ్యక్తుల జ్ఞాపకం చాలా కాలం ఎందుకు ఉంటుంది అనే ప్రశ్నకు బహుశ - గత తరాలు, తరతరాలుగా తమలో తాము పోరాడి, తమ చుట్టూ ఉండే పరిస్థితులతో పోరాడి సాధించుకున్న నాగరికత విలువలను , ఆచరణను బలంగా వ్యక్తీకరించి ఆ విలువలను సజీవంగా నిలుపడమే కాక, రాబోయే తరాలకు వాటిని అందించడంలో తమ పాత్ర నిర్వహించినందుకే సమాజం వాళ్ళను గుర్తు పెట్టుకుని, వాళ్ళన్న మాటలను మళ్ళీ మళ్ళీ చెప్పుకుని స్ఫూర్తి పొందుతుంటుంది. అలాంటి అరుదైన కోవకు చెందిన మన తరం మనిషి కాళోజీ. ఆయన జీవిత విధానమే అరుదైన ప్రయోగం. నిజాయితీగా మాట్లాడాడు. తను అనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టుగా వ్రాసాడు. తన లోతైన పరిశీలనని కవిత్వీకరించాడు. వ్రాసిన కవిత్వం సామాన్యుడి కొరకు, సామాన్యుడికి అర్థమయ్యేలా వ్రాసాడు. ఆయన కవిత్వానికి కాపీరైట్ సమాజానికిచ్చాడు. ‘పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అని ఆయన అన్న మాటలే ఆయనకు వర్తిస్తాయి. ఆయన జీవితాన్ని వర్ణించడానికి ఆయన మాటలే ఉపయోగించవలసి వచ్చింది!

కాళోజీ నిరంతరంగా చలనమున్న మనిషి. గాంధీ ఇజంతో ప్రారంభమై మావో ఇజం దాకా చేరుకున్న మారుతున్న మనిషి. అలాగే విశాలాంవూధను బలపరిచి, తెలంగాణ రాష్ట్రం కొరకు తపించిన మనిషి.. ఇది సమాజంలో వస్తున్న మార్పుల కు, వైరుధ్యాలకు స్పందించగలిగిన వ్యక్తికే సాధ్యమవుతుంది. విశాలాంవూధను బలపరిచినప్పుడు తెలుగు భాష, చరిత్ర, సాహిత్యం, విశాల రాష్ట్రం, సర్వత్రా అభివృద్ధి అనే భావన ఆరోజు కమ్యూనిస్టు పార్టీ కైనా, కాళోజీ కైనా ప్రమాణాలు: ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం వారు తమతో కలిసిన వెనుకబడిన ప్రాంతాన్ని గౌరవంగా చూసుకుంటారని, వాళ్ళ అభివృద్ధి కొరకు తమ వాటాలో కొంత తగ్గించుకొంటారని ఆశించారు. కాని గున్నార్ మిర్దాల్ అన్నట్లు మానవ సమాజానికి లేనిదాని కొరకు పోరాడడం తెలుసుకొని, తనకున్న ప్రివిపూజెస్‌ను వదులుకోవడం ఎలాగో తెలియదు. ఈ విషయం గత అరవై ఏళ్ళ అనుభవం రుజువు చేస్తున్నది. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ దోపిడీదార్లని ఎవరూ భావించడం లేదు. అలా భావించడం ఆంధ్ర ప్రాంత పేదలను అవమానించినట్టే. కేవలం కోస్తా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు రెండు పంటలకు సమృద్ధిగా నీళ్ళు అంది, వ్యాపార పంటల ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెనక వేసుకున్న సంపదను కొంత వెనుకబడిన ప్రాంతంలో, అలాగే దయనీయమైన జీవితాలు గడుపుతున్న పేద వర్గాల జీవితాలు మెరుగుపడడానికి ఉపయోగించడానికి బదులు, ఆ సంపదను ఎలా పెంచుకుందామనే ధ్యాస తప్ప ఏదీ లేకుండా ఈ రోజు వేలాది కోట్ల సంపద మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే రెండున్నర జిల్లాల రెండున్నర శాతం మందికి మాత్రమే విశాలాంధ్ర పనికొచ్చింది అని కాళోజీ వాపోయాడు. ఆర్థిక అసమానతలు వర్గాల మధ్య ప్రాంతాల మధ్య విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుతున్న అసమానతలు కాళోజీని కదిలించాయి. ఆయ చేత కవిత్వాన్ని వ్రాయించాయి.

ఈ అసమానతలు ఆధిపత్య భావజాలానికి దారి తీసి మనుషుల మధ్య అంతరాలను పెంచాయి. అంతరాలకు, అసమానతలకు, ఆధిపత్యాలకు కాళోజీ వ్యతిరేకి. తాను స్వయంగా చాలా నిరాడంబరంగా, ఏ సొంత ఆస్తి లేకుం డా, తన అన్న మీద ఆధారపడి ఈ ప్రపంచంలో తానొక అతిథిగా జీవించానని అనే ఒక గొప్ప అనుభవాన్ని సమాజానికి ఇచ్చాడు. వ్యక్తిగత నైతిక త, నిజాయితీ, నిరాడంబరత, సాహస ఆచరణ కాళోజీ చేత ఎలాంటి ప్రశ్నలనై నా సంధించే, ఎలాంటి నియంతలనైనా ప్రశ్నించే ధైర్యాన్ని ఆయనకు ఇచ్చాయి. పబ్లిక్ మీటింగ్‌లో ఆయన ముఖ్యమంవూతులను అన్న మాటలు చాలా మందికి సాధ్యం కాదు. ‘నేను పౌరుడిగా ముఖ్యమంవూతిని అడుగుతున్నా’ అని తన ప్రశ్నలను సంధించేవాడు. ఎవరినైనా నిలదీసే మనిషి ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో, అందులో పాల్గొంటున్న లక్షలాది మంది ప్రజల మధ్య ఉంటే ఉద్యమానికి తన మీద తనకు ఎంత విశ్వాసం కలిగేది. ఉద్యమం ముందుకు పోవడానికి ఎంత దోహదపడేది?

తెలంగాణ రాజకీయ నాయకుల నాటకాలు, రోజుకు ఒక మాట. మనసులో పదవీ కాంక్ష. మాటల్లో ప్రజాస్వామ్య జిమ్మిక్కులను కాళోజీ సహించేవాడు కాదు. ఒక్కొక్కరిని పేరుపేరున నిలదీయడమే కాక పాలక వర్గాల స్వభావం మీద చాలా గొప్ప కవిత్వం ఆయ న కలం నుంచి తప్పక వచ్చేది. అది కాళోజీ గోడు గానో గోసగానో ఉండేది కాదు, అది ఖడ్గసృష్టిగానే ఉండేది. అది నరసిం హ అవలోక ఆగ్రహంగానే ఉండేది. బహుశా ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలకు ప్రహ్లాదుడి కున్న విశ్వాసాన్ని కలిగించేది. అలాగే రాజకీయ నాయకులకు దడ పుట్టించేది. రాత్రిళ్లు కాళోజీ వాళ్లకు తప్పకుండా కలల్లో వచ్చేవాడు. ఎందుకంటే అదొక నైతిక స్వరం. అదొక నిజాయితీ నినాదం.

కాళోజీ బతికుంటే ఈ ప్రజా ఉద్యమాన్ని చూసి కదిలిపోయేవాడు. ఆనందంతో చాలా కన్నీళ్లే కార్చేవాడు. కాళోజీ కన్నీళ్లు ఒక నిరంతర కృష్ణా, గోదావరి ప్రవాహంలా ఉండేవి. మా చిన్నప్పుడు భూమిని కొంచెం ముట్టితే ఊటతో నీళ్లు వచ్చేయి. కాళోజీ కన్నీళ్లు అంతే. ఆయన తన ఏ అనుభూతినైనా కన్నీళ్లతో మాట్లాడేవాడు. పబ్లిక్‌గా ఇంత కన్నీళ్లు కార్చిన మనిషి చాలా చాలా అరుదు. తెలంగాణ చాలా కన్నీటి బాష్పాలను కోల్పోయింది. ఆయన ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అడిగేవాడు. ఢిల్లీ పెద్దలను గద్దించేవాడు. బహుశా ఆయన పద్మవిభూషణ్‌ను వాపస్ ఇచ్చేవాడేమో! పబ్లిక్‌గా ఏడ్చేవాడు. ప్రజావూపతినిధుల మీద మూడవ కన్ను తెరిచేవాడు. కాళోజీ లేకపోవడం ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చే మనిషి లేకపోవడమే. నిజానికి జయశంకర్‌కు కాళోజీ చాలా పెద్ద స్ఫూర్తి. కాళోజీ వరంగల్‌లో లేకుంటే జయశంకర్ తెలంగాణ కోసం పడ్డ ప్రయాసలో అలసిపోయేవాడేమో! జయశంకర్‌తో ఎప్పుడు కలిసినా, మాట్లాడినా కాళోజీ ప్రస్తావన తప్పకుండా ఉండేది. కాళోజీ హాస్పిటల్‌లో జీవిత చివరి అంకంలో దాదాపు మనుషులను గుర్తించని స్థితిలో జయశంకర్ కలిస్తే తెలంగాణ ఉద్యమం ఎట్ల నడుస్తున్నది అని అడిగేవాడు.

అంటే జీవిత చివరి దశదాకా తెలంగాణ ఒక స్వప్నంగా స్వప్నించినవాడు కాళోజీ. ఇప్పుడు కాళోజీ, జయశంకర్ ఇద్దరు లేకపోవడం ఒక పెద్ద లోటే. అయితే కాళోజీ జీవితం తెలంగాణ ఉద్యమానికే కాదు, తెలంగాణ భవిష్యత్తుకు చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలలో వ్యక్తుల గురించి ఉండే పాఠాలలో విద్యార్థులకు కాళోజీ మీద ఒక వ్యాసం తప్పనిసరిగా ఉండాలి. ఆ పాఠం చిన్న పిల్లల మనసు మీద ప్రభావం కలిగించి, వాళ్లు జీవితంలో కొన్ని విలువలకు, మానవత్వానికి నిలబడేలా మలిచితే మానవీయ తెలంగాణకు కాళోజీ వేసిన పిల్లదారి రహదారిగా మారినట్లే, మార్పుకు స్ఫూర్తి అయినట్లే.

పొఫెసర్ హరగోపాల్

35

HARA GOPAL

Published: Mon,February 10, 2014 12:31 AM

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

చ రిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. సంఘ్ పరివార్ జాతీయత, దేశభక్తిలాంటి నినాదాల ద్వారా వ్యాపించింది. దేశభక్తి అంటే ప్రజలందరిన

Published: Thu,January 23, 2014 05:01 AM

అన్ని పార్టీల తర్వాతే టీపై కాంగ్రెస్ నిర్ణయం: సీఎం

హైదరాబాద్: తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాతే తమ కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ నిర్ణయ

Published: Thu,September 27, 2012 12:39 AM

తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30

దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో ర

Published: Thu,September 20, 2012 12:33 AM

నిండమునిగిన వాడికి చలేమిటి?

చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అ