తెగేదాకా లాగడమే మేలు..!


Tue,July 19, 2011 04:25 AM

-ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులుganta-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ముందు వరుసలో నిలబెట్టి వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉద్యమం ముందుకు సాగాలి. లేకపోతే ప్రజల బూచి చూపి ఆయా పార్టీలో వీళ్లు బేరసారాలు చేసుకో గలరు. రాజీ పడిపోగలరు.
సమైక్యాంధ్ర నాటకంలో ఇప్పుడు కొత్త అంకానికి తెరలేచింది. అదే కథ, అవే పాత్రలు. అయితే రంగం మాత్రం ఢిల్లీకి మారింది. ఢిల్లీ చేరుకు న్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల కారుకూతలు విన్న వాళ్లకు ఎవరికైనా ఇక ఈ రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజలు కలిసిఉండే అవకాశం ఎంతమాత్రం లేదని, అది శ్రేయస్కరం కూడా కాదని అర్థమైపోతుంది. ఢిల్లీలో ఉన్నవాళ్లకు కూడా ఈ సంగతి అర్థమయినా సీమాంధ్ర నాయకులను ఢిల్లీకి పిలుచుకొని మళ్లీ చర్చల పేరుతో కొత్త ఆటకు తెరలేపారు. తెలంగా ణ విషయంలో చాలా మంది తెలంగాణ మేధావులు కూడా ఇప్పుడు చర్చ లు జరగాలంటున్నారు. నిజమే! భిన్నాభివూపాయాలున్న ప్రతి సందర్భంలో చర్చలు వినా సమస్య పరిష్కారానికి మరో మార్గం లేదు.

కానీ ఆ చర్చలు ఎవరితో జరగాలి? ఎవరి మధ్య జరగాలి? ఏ ప్రాతిపదికన జరగాలి? అనే విషయాల పట్ల స్పష్టత లేకుండా చర్చలనడంలో అర్థం లేదు. విడిపోవడానికి సూత్రపాయంగా అంగీకరిస్తే చర్చలు షరతులు ఉంటాయి గానీ అందుకే ససేమిరా అంటున్న వాళ్లతో ఏమని చర్చలు జరపాలి? పైగా చర్చలకు పిలుస్తోన్న వ్యక్తులే ఏకపక్షంగా వాదిస్తోంటే చర్చించి మాత్రం సాధించేది ఏముంటుంది? తెలంగాణ విషయంలో ఇప్పటి దాకా జరిగినంత చర్చ బహుశా ఈ దేశంలో మరే సమస్య మీద కూడా జరగలేదు. యాభై ఏళ్లుగా చర్చలు, షరతులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండేళ్ల నుంచి రాష్ట్ర విభజన కు సంబంధించి చర్చ జరగని రోజు లేదనే చెప్పుకోవాలి. స్వయాన కేంద్ర ప్రభుత్వమే కొన్ని కోట్లు ఖర్చు చేసి శ్రీకృష్ణ కమిటీ పేరుతో ప్రజలతో చర్చించింది. అభివూపాయాలు సేకరించింది.

tdp-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆ నివేదిక పట్ల న్యాయమైన రీతిలో తీర్పు చెప్పాల్సిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు చర్చలని సాగదీయడం ఒక మోసపూరిత ఆలోచన. తీర్పు చెప్పాల్సిన సమయంలో మళ్లీ వాదనలు వింటామని పిలవడం వెనుక మోసం చేయాలన్న ఆలోచనే ఉండవచ్చు. నిర్ణయం తీసుకున్నాక ఎన్ని రోజులైనా చర్చించుకోవచ్చు. సర్దుబాట్లు చేసుకోవచ్చు. బహుశా అందుకేనేమో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చలకు రామని చెప్పారు.
అలా చర్చల ముచ్చటే లేదని తేల్చి చెప్పినందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలను అభినందించాలనిపించవచ్చు. కానీ వాళ్లు ఆ మాట మీద నిలబడతారో లేక తెల్లారే సరికల్లా రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలిపోతారో తెలియదు. కాబట్టి మనం ఆ పని చేయనవసరం లేదు. ఎందుకంటే రాజీనామాలు నామమావూతంగా ప్రకటించి పదవులు వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తోన్న మంత్రులు, రాజీనామాలు చేయకుండానే దబాయిస్తోన్న వాళ్లు, వాళ్లే అసలైన మగాళ్లని కీర్తిస్తోన్న ఆడవాళ్లు అదే పార్టీలో, తెలంగాణలోనే ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లో కొందరు నేతలు రాజీనామాలు చేసింది ప్రజల భయంతోనే తప్ప తెలంగాణ మీద భక్తితో కాదని తేలిపోయింది.

ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రెండాకులు ఎక్కువే చదివింది. కాంగ్రెస్ వాళ్లకంటే గంటో, అరగంటో ముందుగానో తమ రాజీనామాలు ప్రకటించి ఆ పార్టీ నేతలంతా తెలంగాణ బస్సు యాత్ర చేపట్టారు. పోయిన ప్రతిచోటా తాము ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను గడ్డిపోచల్లా వదిలేశామని చెప్పుకున్నారు. నిజమే కావచ్చు. కానీ వాళ్లను రాజీనామాలు చేయమన్నది రెండో కన్ను తెరిచి తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు చిత్రపటాన్ని తెలంగాణ ప్రాంతంలో ఊరేగించడానికి కాదన్న సంగతి తెలుగుదేశం నేతలకు ఎందుకు అర్థం కాలేదు? రాజీనామాలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, లేదా కనీసం ఆయా పార్టీల్లో రాజకీయ సంక్షోభాన్నయినా సృష్టించవచ్చని అనుకున్నం. తెలుగుదేశం పార్టీ సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ అధినేతకు కనువిప్పు కలిగించాలని తద్వారా ఆయన ఏదో ఒక అభివూపాయాన్ని చెబుతాడని అశించాం.

కానీ అందుకు భిన్నంగా ఆ పార్టీ ఇప్పు డు జెండా పండుగకు సిద్ధపడడం చూస్తోంటే వాళ్ల రాజీనామాలు ఎందుకు కోరామా అనిపించకమానదు. ప్రజల కోరిక మేరకే రాజీనామా చేశామని చెప్పుకుంటున్న ఈ నేతలు రాజీనామాలతో తమ మొక్కు చెల్లించుకున్నాం కాబట్టి ఇక ఏ పాపం చేసినా ఫరవాలేదన్నంత ధీమాగా ఉన్నారు. ప్రజలు రాజీనామా చేయమని అడిగింది ఈ నాయకులు తమతో ఉండాలనే తప్ప తమ సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేయడానికి కాదు కదా? నిజానికి తెలంగాణ ప్రజావూపతినిధులంతా రాజీనామాలు చేసి ప్రజలతో కలసి ఉద్యమాన్ని బలోపేతం చెయ్యాలని ప్రజలు కోరుకున్నారు. రాజీనామాల వల్ల ఆయా పార్టీలు దిగివస్తాయని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని, ఆ నిర్ణయం తెలంగాణ ప్రకటించడానికి కేంద్రం చూపిస్తోన్న అడ్డంకులను తొలగిస్తుందని ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం న్యాయబద్ధమైంది. ప్రజాస్వామ్యంలో జరిగేది అదే.

కానీ మన రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను, విశ్వాసాలను తమ మనుగడకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. తెలంగాణ చరివూతలో ఇది ఎన్నోసార్లు జరిగింది. చెన్నాడ్డి నాయకత్వంలో చర్చలు జరపడానికి ఏం చేశారో మనకు తెలుసు. అదే పరిస్థితి ఇప్పుడు జానాడ్డి వాళ్లకు రాదనీ చెప్పలేం.
ఇటు తెలంగాణలో అటు సీమాంవూధలో రెండు పార్టీలు తమ ఆధిపత్య రాజకీయాల కోసం ప్రజలతో జూదం ఆడుతున్నాయి. కాంగ్రెస్ రెండు ప్రాంతాల నేతలతో మంతనాలు సాగిస్తోంటే తెలుగుదేశం నాయకులు ఇక్కడ బస్సుయావూతలు, అక్కడ పాదయావూతలు చేస్తున్నారు. రెండు చోట్లా సోనియాగాంధీ, చంద్రబాబు వేరు వేరు భంగిమల్లో పోస్టర్లపైన, ఫ్లెక్సీలపైన దర్శనమిస్తున్నారు. ఇద్దరూ అనుకూలమో కాదో చెప్పకుండా మాకు రెండు ప్రాంతాలు సమానమే అని పాడిన పాటే పదే పదే పాడుతున్నారు. సంగీతానికి చింతకాయలు రాలవన్నది వాస్తవం. ఈ విషయాన్ని మనకంటే ముందుగా గుర్తించింది సీమాంధ్ర నాయకులే. నిజానికి మనవాళ్లకంటే సీమాంధ్ర నేతలే నయం. పార్టీలు వేరైనా పాట మాత్రం ఒకటే పాడుతున్నారు. టీజీ వెంక జేసీ లాంటి రాయలసీమ నేతలు, వర్ల రామయ్య, కోడెల వంటి టీడీపీ నేతలు తమ అధిష్ఠానాల ఆటపూలా ఉన్నా అడ్డుకుంటామని చెబుతున్నారు. అంతేకాదు కొత్తగా తెలంగాణ అంటే తలలు తీస్తామని, సైనిక దళంతో ఊచకోత కోస్తామని రెచ్చగొడుతున్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని చెప్తూ వచ్చిన వాళ్ల అధిష్ఠాన వర్గాలను ధిక్కరించి తెలంగాణ ఉద్యమాన్ని ఎదిరిస్తున్నందుకు వారిని అభినందించాలి. వాళ్లు గట్టిగా లాగితే తప్ప ఇది తెగేలా లేదు. పైగా రెండు వైపులా లాగితే తప్ప ఇదొక కొలిక్కొచ్చే విషయం కాదు. అందుకే ఇప్పటికైతే మనం వెంక పంపే సైనికులను స్వాగతిద్దాం. వాళ్లు వస్తే వీళ్లని సాగనంపడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పనుండదు. అయినా సైనిక దళాలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు సమైక్య దళాలొక లెక్క కాదు.
వ్యూహం ఏదైనా ఉచ్చు ఎవరిదైనా అన్ని పార్టీలు ఇప్పుడు రాజీనామాల చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాయి. ఆటను ఇంకా సాగదీయలేమని అర్థమైపోయింది. అందుకే కొందరు తత్తరపడుతోంటే, ఇంకొందరు త్వరత్వరగా పావులు కదుపుతూ పోతున్నారు. తెలంగాణరాకుండా రాజీనామాలను వెనక్కి తీసుకునే ధైర్యం లేదు. అలాగని ఎన్నికలకు వెళ్లే సాహసం చేయరు. ప్రజలిప్పుడు తెలంగాణ తప్ప మరొకటి కోరుకోవడం లేదు. తెలంగాణ కోసమే రాజీనామాలు చేసి ఉంటే వాళ్లంతా ఒక చోటికి చేరేవారు.

ప్రజలతో కలిసి పోరాడేవారు. అయినా వాళ్ల ప్రమేయం లేకుండానే ప్రజలు ఒక్కటిగా ఉన్నసంగతి గత వారం జరిగిన బంద్‌లు, రైల్‌రోకోలతో తెలిసిపోయింది. ఈ విషయాన్ని రాజీనామా చేసినవాళ్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్‌లు జేఏసీతో చేతులు కలపాలి. రాజీనామా చేసిన 141 మంది తెలంగాణ గొడుకు కిందికి చేరాలి. అంతే తప్ప ఎవరికి వారే అయితే ఎవరికీ కాకుండా పోతారని గుర్తించాలి. సకల జను లు సమ్మెకు సమాయత్తమవుతున్న ఈ తరుణంలో రాజకీయ లబ్ధి చూసుకుని ఎత్తులు వేయడం కంటే మీ మీ పార్టీలపై సమ్మె చేయండి. అలా చేయకపోతే వచ్చేవి ఎన్నికలే. బహుశా అవి మీకు చివరి ఎన్నికలు కూడా కావొ చ్చు. ఉద్యమం చివరి దశకు చేరిన ఈ తరుణంలో ఏదైనా జరుగవచ్చు. ఇంతకాలం విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు, న్యాయవాదులు ఇతర ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. నిజానికి వాళ్లు ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఇప్పటి దాకా ప్రజలను నడిపించారు. ఆ ప్రయత్నం వల్లే ఇవాళ ఈ దశకు చేరుకున్నాం.

ఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ముందు వరుసలో నిలబెట్టి వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉద్యమం ముందుకు సాగాలి. లేకపోతే ప్రజల బూచి చూపి ఆయా పార్టీలో వీళ్లు బేరసారాలు చేసుకోగలరు. రాజీ పడిపోగలరు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించగలరు. అందుకే మనం గద్దర్ చెప్పినట్టు వీళ్లకు కాపలా కాయాలి.

40

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Featured Articles