బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడదాం!


Fri,April 6, 2012 12:11 AM

తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల అగ్గి ఎందుకు రాజుకుందో కానీ అదిప్పుడు అందరినీ కలచివేస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట ఎవ రో ఒకరు ఆత్మహత్యకు ఆహుతి కావడం ఇప్పుడు ఉద్యమకారులను కూడా కలవరపెడుతోంది. సుదీర్ఘ పోరాట సంప్రదాయాలు ఉన్న నేల మీద నిరాశకు తావుండకూడదు. అది నిరాశ కాదు నిరసన అని సరిపెట్టుకున్నా నిరసన ఎప్పుడూ నిష్ఫలంగా మిగిలిపోకూడదు. వందలాదిమంది ఆత్మాహుతుల తరువాత కూడా తెలంగాణ రాలేదంటే రాష్ట్ర సాధన కు అది సాధనం కానే కాదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అసలది పోరా ట రూపమే కాదన్న సంగతి గుర్తించాలి. గతంలో, వర్తమానంలో ఎప్పుడూ ఆత్మహత్యలు గెలిచిన దాఖలాలు లేవు. ఆత్మహత్య ఓటమికి పరాకాష్ట. అది తెలంగాణ విషయంలో మరోసారి రుజువయింది. ఎప్పుడైనా ఎక్కడైనా పోరాటమే గెలుస్తుందనడానికి చరిత్ర పొడుగునా అనేక దాఖలాలు కనిపిస్తాయి. అలాగే పోరాటమంటే నల్లేరు మీద నడక కాదన్న సత్యమూ ఉద్యమాలను గమనిస్తే అర్థమవుతుంది.

మన పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ ఆదివాసులనే తీసుకోండి. వాళ్ళు ఎన్నో ఆటుపోట్ల మధ్య ఎత్తిన పిడికిలి దించకుం డా నడుస్తున్నారు. తమ భూమిని, అడవిని ఆ అడవి నిండా ఉన్న సహజ వనరులను, ఖనిజ సంపదను కాపాడుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరతుపాకులు మొదలు మానవరహిత యుద్ధ విమానాల దాకా వారిమీద ఎక్కుపెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకే కదులుతున్నారు. అంతేతప్ప వెనుదిరిగి పారిపోవడం లేదు. తమంతట తాము ప్రాణాలు తీసుకోవడంలేదు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, జార్ఖండ్ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ అడవిమీద, ఆదివాసుల మీద సాగిస్తున్న ఈ దాడిని ‘గ్రీన్‌హంట్’ అంటున్నారు. తెలంగాణమీద ప్రకటనల యుద్ధం చేస్తూ అమాయక జనాలను బలిగొంటున్న కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరమే గ్రీన్‌హంట్ సృష్టికర్త. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల ఉద్యమకారులు మొదలు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఎందరు వ్యతిరేకించినా యుద్ధోన్మాదం ఆగకుండా కొనసాగుతూనే ఉన్నది. ఈ పోరాటంలో వేలాదిమందిని సైన్యం చంపేసింది. కొందరిని నక్సలైట్లు అని ఇంకొందరిని వాళ్ళ సానుభూతిపరులని పేర్లు పెట్టి మరీ పొట్టనబెట్టుకుంది. అయినా అక్కడి ఆదివాసులు బెదిరిపోలేదు, బెంగపడలేదు. నిలబడి నిరసన తెలుపుతూనే ఉన్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుని చావాలని అనుకోలేదు. అదీ పోరాటమంటే!

ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ పోరాటానికి బస్తర్, దంతెవాడ కీలక కేంద్రాలు. తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఆనుకుని గోదావరికి ఆవల ఉండే ఈ అడవి ఒకప్పుడు తెలంగాణ విప్లవోద్యమ పాఠశాల. 1969 తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ప్రభుత్వం అణచివేసిన తరువాత చెల్లాచెదురైన యువతరానికి ఆ అడవే ఆశ్రయమిచ్చింది. అక్కడి ఆదివాసు లే వాళ్ళను ఆదరించారు. అప్పటి నుంచి భారతదేశ విప్లవోద్యమానికి ఆ అడవి కీలక కేంద్రమయ్యింది. ఆ అడవి నిండా అనేక వనరులున్నా ఆదివాసుల కడుపులనిండా ఆకలి తాండవిస్తుంది. దేశంలో ఉన్న ఇనుప ఖనిజంలో దాదాపు 19 శాతం ఆ అడవిలోనే ఉన్నది. దాదాపు 17 శాతం బొగ్గు నిల్వలు ఆ భూ గర్భంలోనే ఉన్నాయి. డోలమైటు, బాక్సైట్, తగరపు నిల్వలకు కొదువేలేదు. అన్నిటినీ మించి అది వజ్రాల గని. దేశంలోని వజ్రాలలో దాదాపు 29 శాతం ఆ అడవిలో ఉన్నాయి. సులభంగా చెప్పుకోవాలంటే తగరంలో దేశంలోనే మొదటి స్థానంలో, బొగ్గు లో రెండో స్థానంలో, డోలమైటులో మూడోస్థానంలో, ఇనుప ఖనిజంలో నాలుగో స్థానంలో, సున్నపురాయిలో ఐదో స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉంది. అయినా అక్కడి మనుషుల కు గుర్తింపులేదు, గౌరవంలేదు. అసలు మనుషులన్న స్పృహ కూడా పాలకులకు లేకపోయింది. దాదాపు 190వ దశకం దాకా అక్కడ ప్రభుత్వం అడుగు కూడా పెట్టలేదు. అలాంటి అడవిలో తొలితరం తెలంగాణ యువకులే ఆదివాసులకు అన్నలుగా నిలబడి వారికి ప్రపంచాన్ని పరిచయం చేశా రు. భూమిని సాగులోకి తెచ్చి జలవనరుల వినియోగం నేర్పించారు. విద్య, వైద్యం అందించి అక్కడ ఒక ప్రజాపాలనను అమలులోకి తెచ్చారు. సాధారణంగా పాలకులు ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రత్యామ్నాయం గా పరిపాలన చేస్తామంటే భరించలేరు. అక్కడికి మొట్టమొదటిసారిగా ప్రభు త్వం పోలీసుల రూపంలో ప్రవేశించింది. నక్సల్ ఏరివేత పేరుతో అడవిని అడుగడుగూ గాలించింది. ఆ అడవి కేవలం ఆదివాసుల స్థావరం మాత్రమే కాదు, అశేష ఖనిజ సంపదకు నిలయమని అర్థం చేసుకుంది. అదే సమయంలో నూతన ఆర్ధిక విధానాలను ఆవిష్కరించిన ప్రభుత్వం దేశ, విదేశీ పెట్టుబడిదార్లకు ఆ అడవిలోకి ఎర్రతివాచీ పరిచింది. ఛత్తీస్‌గఢ్ పారిక్షిశామిక, ఖనిజ విధానం పేరుతో గుత్త పెట్టుబడికి ద్వారాలు తెరిచిన ప్రభుత్వం ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలను పారిక్షిశామికవేత్తలకు, పెద్దపెద్ద కంపెనీలకు అప్పగిస్తూ.. దాదాపు నూట పదిహేను కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అక్కడి ఖనిజ సంపదను దోచుకునేందుకు ద్వారాలు తెరిచింది.

తరతరాలుగా ఆ అడవే లోకమై జీవిస్తున్న వారికి ఈ సంగతి తెలియదు. వారి అభివూపాయం తీసుకోలేదు సరికదా కనీసం వాళ్లకు సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళకింది నేలను కంపెనీలకు అప్పగించింది. ఆదివాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశా రు. వాళ్లు అలా ఎదురు తిరగడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవర పెట్టిం ది. నక్సల్స్ బలంతోనే వాళ్లు ప్రతిఘటిస్తున్నారని భావించిన ప్రభుత్వం సాయుధ దళాలతో అణచివేత చర్యలకు పూనుకుంది. ఆ అడవిలో కాలు కదపడమే కష్టం కాబట్టి ఆదివాసీ ప్రాంతాలు, గ్రామాలు తెలిసిన ‘ఆదివాసీ’ యువకులతో 2006లో సాల్వాజుడుం అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల ఊచకోత మొదలుపెట్టింది. ఆదివాసులను, ముఖ్యంగా ప్రతిఘటిస్తున్న యువకులను మట్టుబెట్టడం, దోపిడీలు చేసి ఆదివాసీ గ్రామాలను అల్లకల్లోలం చేయడం, ఆ గ్రామాలు ఖాళీ చేయించి ప్రజలను అడవి బయట స్థావరాలు, గుడారాలు ఏర్పాటు చేసి బానిసలుగా వాటిలో బంధించడం, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం ఇట్లా సల్వాజుడుం ఆరేళ్ళపాటు అడవిని అల్లకల్లోలం చేసింది. దాదాపు ఆరువందల గ్రామాలు ఖాలీ చేయించి ఆదివాసీ గూడాలను కాల్చివేసింది. ఇళ్ళను కూలగొట్టింది. ఈ దాడుల తరువాత ఇప్పటికీ దాదాపు యాభైవేల మంది యువకులు కనిపించకుండాపోయారు. వాళ్ళలో చాలామందిని సాల్వా జుడుం చంపేసి ఉంటుందని మానవ హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి. సల్వాజుడుంను రద్దు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశించే దాకా ఆ అడవి లో అరాచకం రాజ్యమేలింది. అడ్డుచెప్పిన మేధావులు, పాత్రికేయులు, న్యాయవాదులను అనేకమందిని నక్సలైట్లుగా ముద్రవేసి జైళ్లలో తోసేశారు. జాతీయ మానవహక్కుల సంఘం, ఇతర పౌరహక్కుల సంఘాలు, అంతర్జాతీయ మానవహక్కుల వేదికలు చేసిన నిరసనలన్నీ అరణ్యరోదనలే అయ్యాయి. ఈ తరుణంలో 2011 జూలైలో సుప్రీంకోర్టు సల్వాజుడుంను రద్దుచేస్తూ ఒక చరివూతాత్మకమైన తీర్పును వెలువరించింది.

ఆ తీర్పు అడవి కి అరాచాకం నుంచి విముక్తి కలిగించింది. యాధృచ్చికమే కావచ్చు. కానీ ఆ తీర్పును వెలువరించింది కూడా తెలంగాణ న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్‌డ్డి కావడం గమనార్హం. సల్వాజుడుం అనైతిక ప్రయోగమని అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆ తీర్పులో స్పష్టంగా చెప్పారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు భంగం కలిగించే రీతిలో పాలన ఉండకూడదని ఆ తీర్పు స్పష్టంగా చెప్పింది. తీర్పరిగానే కాదు మనిషిగా కూడా సుదర్శన్‌డ్డి రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు.

ఆదివాసీల ప్రతిఘటన, ప్రపంచవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆందోళన, చివరికి సుప్రీంకోర్టు తీర్పు చిదంబరానికి దెబ్బ మీద దెబ్బగా తగిలాయి. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌ను చిందర వందరచేసి పెట్టుబడిదారులకు కట్టబెట్టింది ఆయనే! ఆయన గతంలో ఆర్ధిక, వాణిజ్య శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడే దేశ, విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఆ అడవిని వారికి అప్పగిస్తూ ఒప్పందాలు చేయించాడు. వేదాంత లాంటి విదేశీ కంపెనీలు మొదలు, టాటాలు, జిందాల్, ఎస్సార్ వంటి వందలాది కంపెనీలకు ఆదివాసుల అడవిని, భూమిని వాటాలు పంచి ఇచ్చాడు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అడవుల మీద దాదాపు 90 ఇనుప ఖనిజం దోచే కాంట్రాక్టు కంపెనీలు, బొగ్గు తవ్వే మైనింగ్ కంపెనీలు, ఆ బొగ్గు ఆధారంగా నడిచే 59 విద్యుత్ కంపెనీలు వచ్చి వాలాయి. వాళ్ళ కోసం ఆదివాసులను అడవి నుంచి తరిమివేయడానికి ఇప్పుడు మళ్ళీ చిదంబరమే హోం మంత్రి వేషంలో రంగ ప్రవేశం చేశాడు. ఒక్క బస్తర్ జోన్‌లోనే ఇరవై బెటాలియన్‌ల సాయుధ బలగాలు ఇప్పుడు ఆ పనిలో ఉన్నాయి. ఇందులో పరిక్షిశమల రక్షణకోసం ఉండాల్సిన ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొదలు సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన భద్రతా దళాల దాకా ఉన్నాయి. ఈ దళాలు రోజూ ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతూ నక్సల్ ఏరివేత పేరుతో ఆదివాసీలను చెదర గొడుతున్నాయి. అడవిలో ఉండే జంతువులూ, సర్పాలు ఇతర విష జీవాల పేర్ల తో (కోబ్రా, స్కార్పియో, క్యాట్, టైగర్) దళాలను ఏర్పాటు చేసి ఈ దళాలు అడవిని మళ్ళీ అంగుళం అంగుళం గాలిస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకోవడాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి చిదంబరం పెట్టిన ముద్దుపేరు ఆపరేషన్ గ్రీన్ హంట్!

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆదివాసుల మనోధైర్యం మొక్కవోలేదు. వాళ్ళిప్పుడు ఏక కాలంలో అనేకమందితో పోరాడుతున్నారు. ఒకవైపు సాయధ దళాలను ఎదిరిస్తున్నారు. మరోవైపు తమ నేలను కబళిస్తోన్న భారతీయ, బహుళజాతి కంపెనీలను నిలువరిస్తున్నారు. ఇంకొకవైపు ప్రజాస్వామ్యయుతంగా దేశ రాజకీయ, న్యాయ వ్యవస్థలనూ కదిలించే రీతిలో కదులుతున్నారు. అందుకే ఇప్పుడు మారుమూల బస్తర్ గిరిజనుల సమస్య దేశ, విదేశాల్లో చర్చకు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. అది ఇప్పుడు వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నది. ఎప్పుడైనా సరే మనిషికి పోరాటం ఒక్కటే ధైర్యాన్ని ఇస్తుంది. పోరాడే వాళ్ళకే మద్దతు ఉంటుంది. అది బస్తర్ ఉద్యమం నిరూపించింది. అటు ఛత్తీస్‌గఢ్‌లో, ఇటు తెలంగాణలో ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నది ఒక్కడే! అక్కడా ఇక్కడా జనం తమ భూములు, తమ నీళ్ళు, తమ వనరుల కోసమే పోరాడుతున్నారు. రెండుచోట్లా అమాయక జనం ఆహుతవుతున్నారు. అక్కడ హత్యలకు గురైతే, ఇక్కడ ఆత్మహత్యల పాలవుతున్నారు.తెలంగాణ సమాజం కూడా ఛత్తీస్‌గఢ్‌వూపజల పోరాటానికి సంఘీభావం తెలపాలి. పోరాడడమే కాదు, పోరాడే వారికి బాసటగా నిలబడడం, సంఘీభావం తెలపడం కూడా కొత్త ధైర్యాన్ని తెగువను నేర్పుతుం ది. అది ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి చాలా అవసరం.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
రచయిత సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్: [email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ