అధ్యక్షా ! మన్నించండి...


Fri,February 17, 2012 01:40 AM

శాసనసభ స్పీకర్ ఎవరు? ఎవరైనా నాదెండ్ల మనోహర్ అనే చెపుతారు. అది నిజమే! కానీ శాసన సభలో గందరగోళం గమనిస్తున్న వారికి అలా అనిపించడం లేదు. నాదెండ్ల మనోహర్ చట్టసభల తీరుతెన్నులు తెలిసినవారు. ‘ఎంబిఏ’ చదివిన ఆయనకు నిర్వహణ శాస్త్రం తెలియదనుకోలేము. మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచీ సభ బయటి రాజకీయాలకంటే లోపలి వ్యవహారాల పైనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. గ్రంథాలయ కంప్యుటరీకరణ మొదలు ఆధునీకరణలో శ్రద్ధ చూపుతున్నారు. ఒక్కో సభ్యుడికి లాప్ టాప్, టాబ్లెట్ ఫోన్‌ల వంటి ఆధునిక సాధనాలు ఇచ్చి ఎలా వాడాలో శిక్షణ ఇప్పించారు. వారు సభలో చర్చల వల్ల అలిసి పోకుండా అత్యాధునిక హంగులతో కుర్చీలు, టచ్ స్క్రీన్‌లు, కొత్త మైకులు సమకూర్చారు. సభ్యులకు విజ్ఞానం, వినోదం అవసరమని కొందరిని ఆహ్లాదభరిత విడిది ‘అరకు’ తీసుకెళ్లారు. ఇలా శాసన సభకు సంబంధించిన అన్నింటిమీదా ఆయన ముద్ర కనిపిస్తున్నా, సభలోపలి వ్యవహారాలు మాత్రం అతని చేతిలో లేకుండా పోయినట్టు విమర్శలోస్తున్నాయి. కుర్చీలు మారాయి తప్ప ఆ కుర్చీల్లో కూర్చుండే సభ్యుల తీరు మారలేదు. స్పీకర్ సభను నిర్వహిస్తున్న తీరును, సభలో తమ పట్ల వ్యవహరిస్తున్న తీరునూ ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

సభలో చర్చ సరిగా జరుగుతుందన్న విశ్వాసం లేక ప్రధాన ప్రతిపక్షమే సభావ్యవహారాల కమిటీలను బహిష్కరిస్తున్నదంటే, ఆలోచించ వలసిన విషయమే! ఇది ఈ ఒక్క సమావేశంలోనే కాదు. రెండేళ్లుగా సభ తీరు ఇలాగే ఉంది. సభ్యులంతా శాసన సభ మీద, సభా వ్యవహారాల మీద విశ్వాసం ప్రకటించిన సందర్భాలు దాదాపు లేవు. ఇది ముమ్మాటికీ మంచిది కాదు. ఇందుకు సభాపతినే తప్పు పట్టలేం. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు పార్టీలు, సభా నాయకుడు, ప్రతిపక్షనేత ఇలా అంతా కూడబలుక్కునే సభను నిర్వీర్యం చేస్తున్నారని అర్థమవుతోంది. స్పీకర్ ఆ ఒత్తిడికి గురవుతున్నారని తెలిసిపోతోంది.

స్పీకర్ ఒత్తిడులకు తలొగ్గితే అది అతనికి, సభాపతి పదవికి ఉన్న గౌరవానికే కాదు, మొత్తం ప్రజల సార్వభౌమాధికారానికే తలవంపు అవుతుంది. స్పీకర్ వ్యక్తిగత రాజకీయ అభివూపాయాలు, రాగద్వేషాల ప్రమేయం లేకుండా ధర్మకర్తగా వ్యవహరించాలి. అందుకే తొలి ప్రధాని నెహ్రూ స్పీకర్ పదవిని దేశ స్వేచ్చా స్వాతంవూతాలకు ప్రతీకగా అభివర్ణించాడు. స్పీకర్ చట్టసభ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసన సభ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజల స్వేచ్చకు, స్వాతంవూత్యానికి అదొక నిజమైన నమూనాగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. సభానాయకుడుగా ఉండే ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల సభాపక్ష నేతలు, సభ్యులు అందరూ సభాపతి దృష్టిలో సమానమే. జాతీయ స్థాయిలో రాష్ట్రపతిని, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ వ్యవస్థ ను రాజ్యాంగ పరమైన సార్వభౌమాధికార ప్రతీకగా పరిగణస్తారు. సభా వ్యవహారాలను ప్రధానంగా సభ చేసే తీర్మానాలను, చట్టాలను స్పీకర్ ద్వారా రాజ్యాంగ ప్రతినిధికి నివేదిస్తారు. ఆ రకంగా స్పీకర్ స్థానం శాసన సభలో ఉన్నతమైనది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు స్వార్థంతో స్పీకర్ స్థానాన్ని మలినం చేస్తున్నాయి.

శాసన సభలో ఎవరి పాత్ర ఏమిటి, సభలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రసంగించాలి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి మొదలైన నిబంధనలు ఉన్నాయి. కానీ శాసన సభ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా నడుస్తోంది. అధికార పక్షం ప్రతిపక్ష పాత్రను, ప్రతిపక్ష పార్టీ అధికారపక్షం పాత్రనూ పోషిస్తున్నాయి. సభ వెలుపల మాత్రమే ఉండాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు సభలో ప్రవేశించడంతో సభాపతి చేతుపూత్తేయాల్సిన పరిస్థితిని చూస్తున్నాం.ఈ సంగతిని అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్సా కూడా సభ ఆవరణలోనే నిర్ధారించినట్టు వార్తలొచ్చాయి. సభ బయట ఎవరు ఎవరితో లాలూచిపడ్డా పట్టించుకోవాల్సిన పనిలేదు.కానీ సభలో ప్రతిపక్షనేత హోదా లో ఉన్న వ్యక్తి లాలూచి పడడం నిజమే అయితే అది ప్రజలకు ద్రోహం చేసినట్టే. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్షాన్ని ప్రజల గొంతుగా గుర్తిస్తారు. అందుకే సభానాయకుడితో సమానమైన హోదా ప్రతిపక్షనేతకు కట్టబెట్టారు. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి అధికార పక్షంతో లాలూచీ పడితే సభ చర్చల్లో, నిర్ణయాల్లో, చేసే చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు ఎలా ప్రతిబింబిస్తాయి? నిజంగానే అలా లాలూచీ పడాలనుకుంటే సభ వెలుపలే అయన టీడీపీని, చిరంజీవిలాగా కాంగ్రెస్‌లో విలీనం చేసి ప్రభుత్వంలో భాగం కావచ్చు. అలా చేస్తే సభకు మరో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఇచ్చినట్టవుతుంది. అంతేతప్ప శాసన సభను వంచనకు వేదికగా వాడుకోకూడదు.

అధికార పక్షంలో పరిస్థితీ అయోమయంగానే ఉన్నది. సభలోపల, వెలుపలా ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను ఆయన నాయకత్వంలోని మంత్రివర్గ సహచరులే విమర్శించే స్థితిలో ఉన్నారు. శాసన సభలో సభ్యులు కూర్చున్న తీరును గమనిస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో పోల్చుకోవడం కష్టం. నియమాల ప్రకారం స్పీకర్‌కు కుడి వైపున అధికార పక్షం, ఎడమ వైపున ప్రతిపక్షం ఉంటాయి. ముందు వరసలో సభాపక్షం నాయకులు, ఉపనాయకులు కూర్చుంటారు. తరువాతి స్థానాల్లో మంత్రులు, విప్‌లు ఉంటారు. మిగతా సభ్యులు ఎన్ని సార్లు ప్రాతినిధ్యం వహించారన్న సీనియారిటీని బట్టి స్థానాలు కేటాయించాలి.కానీ మన సభలో మాత్రం ముందు వరుసలో మెగా స్టార్ చిరంజీవి కనిపిస్తారు. ఆయన మొదటి సారే గెలిచినందున సాధారణ సభ్యుడిలా చివరి వరుసలో కూర్చోవాలిపజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఫరవాలేదు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయాక, ఆయన అనుచరులు కాంగ్రెస్ విప్పులై, మంత్రులై పోయాక ఆయనకు ముందు వరుసలో స్థానం ఇవ్వడం అమర్యాద కిందికే వస్తుంది. విలీనం ప్రక్రియ పూర్తికాలేదంటే ప్రజారాజ్యం సభ్యులు కాంగ్రెస్ ‘విప్’ లుగా ఎలా ఉంటారు? అలాగే విలీనం అయిపోయాక కూడా వంగా గీతను పీఆర్‌పీ ‘విప్’ గా ఎలా గుర్తిస్తారు. ఇక అన్నిటికీ పరాకాష్ట, జగన్ వర్గాన్ని అధికార పక్షం కింద లెక్కేసుకోవడం. వారు ఇప్పటికే స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చారు. వాటిని విచక్షణాధికారాలు ఉపయోగించి తిరస్కరించారనే అనుకుందాం.ఆ తరువాత అదే సభ్యులు ఈ ప్రభుత్వం మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సభలోనే స్పీకర్ ముందే వోటు వేశారు. వాళ్ళు అధికార పక్షం జారీ చేసిన విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు వేశారని అధికార పార్టీ, సభలో ఆ పార్టీ విప్ కూడా ఫిర్యాదు చేసారు. వారిని తొలగించవలసిందిగా వేడుకున్నారు. గౌరవ సభ్యులు కూడా అదినిజమేనని ఒప్పుకుంటున్నారు. అయినా వారి సభ్యత్వాలు రద్దుచేయకుండా సభలోకి అనుమతించడం,అధికార పక్షం స్థానాల్లో కూర్చోబెట్టడం విస్మయం కలిగించేది. సభ నిర్వహణ తీరు రాజ్యాంగ పరిధి దాటుతున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా స్పీకర్ మీదే ప్రతిఫలిస్తుంది. స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు, సభావ్యవహారాలు గమనిస్తున్నవాళ్ళు అంటున్నారు.

గతంలో తెలంగాణ శాసన సభ్యుల రాజీనామాల విషయంలో స్పీకర్‌గా నాదెండ్ల నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మూకుమ్మడి రాజీనామాలు చెల్లవనడంతో పాటు భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోనన్నారు. స్పీకర్ ఒక ప్రాంత ప్రతినిధిగా వ్యవహరిస్తూ సభ్యుల స్వేచ్చను హరిస్తున్నారని అనేక మంది సభ్యులు వాపోయారు. నాగం జనార్ధన్‌డ్డి రాజీనామా ఆమోదింపజేసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇప్పుడు జగన్ అనుకూల సభ్యుల విషయంలో ఆయన వ్యవహార శైలి గమనిస్తే విమర్శకుల వాదనే నిజమనిపిస్తోంది. విమర్శలు వచ్చినా స్పీకర్ ధోరణిలో మార్పు లేదంటే అతని వెనుక ఏదో ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఒత్తిడి రాజ్యాంగ పరమైనది కాదని, రాజకీయవూపేరేపితమైనదని అర్థమవుతున్నది.

ఇవన్నీ ఆలోచిస్తే బొత్స మాటల్లో సత్యమున్నదనిపిస్తోంది. సభానాయకుడు, ప్రతిపక్ష నేత కలిసి పోయారనే భావన కలుగుతోంది. ఈ లాలూచీకి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి జగన్ రూపంలో కనిపిస్తే, రెండోది తెలంగాణ రూపంలో వారిని వెంటాడుతోంది. ఈ రెండే ఆ ఇద్దరినీ ఒక్కటయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడు రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ జగన్ ప్రజాబలం ఏమిటో తెలిసిపోతుంది. ఒకవేళ మొత్తం జగనే గెలిస్తే, అది మధ్యంతరానికి మార్గం చూపితే, ఆ గాలిలో సీమాంధ్ర లో తమ ఆచూకీ మిగలకుండా పోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.రేపో మాపో, మిగతా జగన్ వర్గం ఎమ్మెల్యేల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మరో ఆరు నెలలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇటువంటి రాజకీయ వ్యూహానికి స్పీకర్ సహకరించడం విమర్శలకు దారితీస్తోంది.ఎన్నికలు జరిగే స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని వాతావరణం ఉంది. తెలంగాణ ఉపఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో, తెలంగాణ అంశం తిరిగి తిరిగి మళ్ళీ శాసన సభకు చేరుకుంది.ఈ సమావేశాల్లో తెలంగాణ తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ తో సహా మరికొన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక సభగా భావించే పార్లమెంటులో స్వయానా కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనకే దిక్కులేకుండా పోయిన నేపథ్యంలో ఇంకా చట్టసభల మీద విశ్వాసం ఉంచడంలో అర్థం లేదని అనిపించవచ్చు. పైగా శాసన సభ తీర్మానం అనేది ఒక అనవసర ప్రహసనంగా కూడా కనిపించవచ్చు. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రభుత్వాలయితే ఆర్టికల్ 3 లో సూచించినట్టుగా నేరుగా పార్లమెంటు తీర్మానం ద్వారా ఇప్పటికే తెలంగా రాష్ట్రం ఏర్పాటు చేసే వారు. అలా చేయకపోగా తెలంగాణ ప్రజల సహనానికి నిరంతరం పరీక్షలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు పదే పదే ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ శాసన సభ వేదిక ద్వారా అదేపని చేయబోతున్నారు. ఇది ఫలితం లేనిదని తెలిసినా ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితిని ఛేదించాలంటే తీర్మానం కోసం పట్టుబట్టడం తప్పనిసరని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ తీర్మానం ద్వారా ఎవవరు ఎటువైపో తేలిపోతుంది.సభలో తీర్మానం సందర్భంగా చర్చ జరుగుతుంది. చర్చలో వ్యక్తులుగా కాకుండా పార్టీలుగా అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది ప్రశ్న.

అధ్యక్షా!
రెండేళ్లుగా స్వార్థ రాజకీయ ఎత్తుగడల వల్ల రాష్ట్రం అతలాకుతలం అయింది. ప్రజాపాలన కుంటుబడింది. ఇప్పుడు అదే పరిస్థితి సభలోనూ కనిపిస్తోంది. ప్రజల అభిమతాన్ని మన్నించినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం. ప్రజాస్వామ్యానికే తలమానికమైన స్థానంలో మీరున్నారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంవూత్యాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమైన స్థానం అది. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా మీకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ పక్షాలను నడిపించాలి తప్ప రాజకీయాలు రాజ్యాంగ వ్యవస్థల మీద పెత్తనం సాగించకూడదు. ఇప్పుడు రెండవ ప్రయత్నం కనిపిస్తోంది. మీకున్న అధికారాలను ఉపయోగించి మీరు సభా సంప్రదాయాలను కాపాడగలరని అనడంలో సందేహం లేదు. ఆ శక్తి, స్వాతంత్య్రం మీకు రాజ్యాంగమే కల్పించింది.

ఇప్పుడున్న రాజకీయ సంక్షోభానికి మూలం తెలంగాణ సమస్య. తెలంగాణ ప్రజలు అర్ధ శతాబ్దికి పైగా స్వరాష్ట్రం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. ప్రజల మనోభావాలను మన్నించి భారత ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా, మనందరికీ శిరోధార్యమైన భారత రాజ్యాంగానికి లోబడి తన నిర్ణయాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఈ మేరకు తీర్మానం చేయవలసిందిగా మీకొక సూచన కూడా చేసింది. రెండేళ్లుగా మీ నిర్ణయంకోసం అటు పార్లమెంటు, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులో ఎందరో నిస్పృహకు లోనయి రాలిపోతున్నారు. రాజకీయ సందిగ్ధంలో పరిపాలన సాగదు. అది మీరు కూడా గమనించే వుంటారు. ఇటువంటి ప్రతిష్టంభన పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత శాసనకర్తలకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు పార్లమెంటుతో సంబంధం లేకుండా తమ మాటే చెల్లుబాటు కావాలని పట్టుపట్టడం లేదు. కేవలం మీ నేతృత్వంలో ఉన్న సభలో తమ ఆకాంక్షను చర్చించే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు. ఆ చర్చ సారాన్ని ఈ దేశ సార్వభౌమాధికారానికి నివేదించే ప్రతినిధిగా వ్యవహరించమని వేడుకుంటున్నారు. అది ఈ దేశ పౌరులుగా జన్మతా సంక్రమించిన హక్కు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం. దాన్ని కాపాడే ధర్మకర్తగా మీరొక నిర్ణయం తీసుకోండి. మీ విధిని మీరు రాగద్వేషాలకు అతీతంగా, త్రికరణ శుద్ధితో నిర్వహించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సభాపతిగా మీరు చరివూతలో నిలిచిపోతారు.

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈమెయిల్: [email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ