అవినీతి ఆచార్యులు


Fri,February 10, 2012 12:03 AM

Raju10 talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసిన ఖులీ కుతుబ్ షా పేరున ఆయన చనిపోయి నాలుగు శతాబ్దాలు దాటినా ఒక్క స్మారక చిహ్నం కూడా లేదు. కానీ బీపీ ఆచార్య పేరున మాత్రం ఆయ న బతికి ఉండగానే ఇప్పుడొక రోడ్డు ఉంది. ఆయన ఏ శతాబ్దపు రాజు అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం ఎమ్మార్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి. గచ్చిబౌలీలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు వెళ్ళే దారికి బీపీ ఆచార్య మార్గ్ అని నామకరణం చేశారు. ఆ రోడ్డు గుండా వెళ్తే మీరు నేరుగా వైఎస్‌ఆర్ భవన్‌కు చేరుకుంటారు. అది అధునాతన హంగులతో నిర్మించిన ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనం. వై.ఎస్. బతికుండగానే పునాది వేసినప్పటికీ ఆయన దుర్మరణం చెందిన నెలలోపే ఆ భవనాన్ని అప్పటి పరిక్షిశమశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి, వైఎస్‌ఆర్ భవనంగా నామకరణం చేశారు. అ సమయంలో సంస్థ చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆచార్య ఉన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ రూపకల్పనలో ఆచార్యుల వారి అకుంఠిత దీక్షకు, సహకారానికి కృతజ్ఞతగా ఎమ్మార్ సంస్థ ఆ రహదారికి ‘బీపీ ఆచార్య మార్గ్’ అని నామకరణం చేసింది. ఆ రహదారికి ఆయన పేరు చిరస్థాయిగా చరివూతలో నిలిచిపోతుందని భావించి ఉండవచ్చు. కానీ అది ఇప్పుడు ఆయనను చెంచల్‌గూడా జైలుకు చేర్చింది. ఎమ్మార్ కేసులో దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ఆచార్య అడ్డదార్లు తొక్కి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని నేరారోపణ చేస్తున్నది. ఈ సొమ్ము ఏ దారిగుండా ఎక్కడికి చేరిందో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేస్తోంది. ఇలా బీపీ ఆచార్య నడిరోడ్డుమీద అడ్డంగా దొరికిపోయినా ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం ఆయన అమాయకులని, సీబీఐ కావాలనే కక్ష గట్టి వేధిస్తోందని అంటున్నది. వెంటనే సీబీఐని కట్టడి చేయాలని ముఖ్యమంవూతికి మొరపెట్టుకున్నది. ఒక ఐఏఎస్ అధికారి పేరున ఆయన సర్వీసులో ఉండగానే హైదరాబాద్ మహానగరంలో ఒక రోడ్డు వెలిసిందంటే ఆయన ఎంతటి ఘటికుడో అర్థమైపోతుంది.

పాపం ఐఏఎస్ అధికారుల సంఘానికి మాత్రం అర్థం కావడం లేదు. కొందరు ఐఏఎస్ అధికారులు మంత్రులను, మాజీ ముఖ్యమంవూతుల ను కడిగిపారేస్తున్నారు. పనిలో పనిగా సీబీఐకి దురుద్దేశాలు అంటగడుతున్నారు. బీపీ ఆచార్య అవినీతిపరుడా కాదా అనేది న్యాయస్థానాలు తేల్చుతాయి. సీబీఐ తన దర్యాప్తులో కేవలం ఆధారాలే సేకరిస్తోంది. ఈ దశలో ఎవరైనా అడ్డు తగలవచ్చా? ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి, పరిపాలనకు వెన్నెముకగా ఉండాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా? ఇది తొందరపాటే కాదు, బాధ్యతా రాహిత్యం.

భారతీయ సివిల్ సర్వీసెస్‌కు ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. కలెక్ట ర్ కావడం అనేది దేశానికి సేవ చేయడంతో సమానం అనుకునేవారు. కొందరు కలెక్టర్లు నిజంగానే ప్రజాసేవకులుగా చరివూతలో మిగిలిపోయారు. అలాంటి వారిలో ఎస్‌ఆర్ శంకరన్ లాంటి అరుదైన అధికారులు నిన్న మొన్నటి వరకు మన మధ్య ఉన్నారు. రాజకీయాలు ముదిరిపోయిన ఈ కాలంలో, ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ మాత్రమే. రాజ్యాంగం ప్రకారం శాసన, న్యాయవ్యవస్థలు కూడా ప్రభుత్వ ప్రధాన అంగాలుగా ఉన్నప్పటికీ, పరిపాలనను రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా నడిపించే అధికారం, బాధ్యత కలెక్టర్ల వ్యవస్థది. కానీ ఇప్పుడు కొందరు కలెక్టర్లు ఆ బాధ్యతను మరిచిపోతున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకో, నాయకులకో ఏజెంట్లుగా మారుతున్నారు. మార్కెట్ వ్యవస్థ బలపడిపోతున్న ఈ కాలంలో కొందరైతే ఏకంగా కొన్ని కంపెనీలకు మేలుచేస్తూ వారిచ్చే కమీషన్‌ల కోసం కక్కుర్తిపడుతున్నారు. నిజానికి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కలెక్టర్ల వ్యవస్థ ఇలాగే ఉండేది.

అప్పుడు దానిపేరు వాణిజ్య పాలనా వ్యవస్థగా ఉండేది. వారిని ఆ కాలంలో కంపెనీ వ్యాపారులుగానే (మర్చంట్స్) పిలిచేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున దాదా పు నూటాయాభై సంవత్సరాల పాటు అన్ని రకాల వ్యాపార లావాదేవీలు ఈ మర్చంట్స్ చూసుకునేవారు. కంపెనీ పౌర పరిపాలన మొదలయ్యాక వ్యాపారం, వ్యవహారం వేరుచేయబడ్డాయి. అప్పటి మర్చంట్స్‌లో పేరుకుపోయిన అవినీతి ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని బ్రిటీషు పాలకులు రెవెన్యూ, న్యాయ వ్యవహారాలను మర్చంట్స్ నుంచి వేరుచేసి కొత్త పరిపాలన వ్యవస్థగా సివిల్ సర్వీసెస్‌ను నెలకొల్పారు. సివిల్ సర్వీసెస్‌లో ఉన్నవారు వ్యాపారాలు చేయడం, వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉండ డం నిషేధించారు. బ్రిటీష్ అధికారులలో ఉన్న బంధు ప్రీతి, అవినీతి పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్న తరుణంలో దేశంలో నూతన విద్యా వ్యవస్థ మెకాలే ఆధ్వర్యంలో రూపొందిందింది.

అదే ఆ తరువాత కలెక్టర్ల వ్యవస్థగా మారింది. చదువుకున్న యువకులు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు కలెక్టర్లుగా ఉంటే భారతదేశంలో శాస్త్రీయమైన సుపరిపాలన సాధ్యమని, అవినీతికి ఆర్థిక ప్రలోభాలకు తావుండదని మెకాలే భావించాడు. సివిల్ సర్వీసెస్‌లో అభ్యర్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేసే విధానం, శిక్షణ ను కూడా మెకాలే ప్రవేశపెట్టాడు. దీనివల్ల బ్రిటీష్ సింహాసనానికి దాసోహమయ్యే కొత్తతరం కలెక్టర్లు వచ్చారు.

భారతీయ పరిపాలన వ్యవస్థను సమూలంగా సంస్కరించే ప్రయత్నం 1930 తరువాత జరిగింది. బ్రిటీష్ కాలంలోనే పాలన సంస్కరణలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది, అయితే చరిత్ర రచయితపూవరూ దానిని గుర్తించిన పాపానపోలేదు. భారత సామాజిక వ్యవస్థ మౌలి క స్వరూపాన్ని బ్రిటీష్ పాలకులకు అర్థం చేయించడమే కాదు, పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలో అప్పటి ప్రభుత్వానికి సవివరంగా తెలిపారు అంబేద్కర్. రౌండ్ సమావేశాల చర్చలు పరిశీలిస్తే పరిపాలనను సామాజికీకరించి న్యాయబద్ధం, పారదర్శకం చేసి భూమార్గం పట్టించింది అంబేద్కర్ అన్నది అర్థమవుతుంది. పాలన వ్యవస్థను శిష్టవర్గం పెత్తందార్లు, రాజకీయ నాయకుల కబంధ హస్తల నుంచి ఎలా తప్పించాలో ఆయన సుదీర్ఘంగా వివరించారు. పరిపాలన, న్యాయ, సైనిక వ్యవస్థలతో పాటు మొత్తం ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా మలచాలంటే ఏం చేయాలో సూచించారు. ఆ సూచనలు చాలావరకు 1935 ఆక్ట్‌లో చోటుచేసుకున్నా యి.

ఆ అనుభవం ఆయనకు రాజ్యాంగ రచనలో చాలా వరకు ఉపయోగపడింది. ఆయన సివిల్ సర్వీసెస్‌ను రాజ్యాంగబద్ధం చేసి ఒక గౌరవనీయమైన, స్వతంవూతమైన వ్యవస్థగా నిలబెట్టారు. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కేవలం పార్లమెంటుకు, రాజకీయ పార్టీలకే సంపూర్ణ పరిపాలనా అధికారాలు ఇవ్వకుండా అంబేద్కర్ జాగ్రత్తలు తీసుకున్నారు. భారత్ సాంప్రదాయక దేశం. సామాజిక అసమానతల మూలంగా ప్రజాస్వామ్యం పేరుతో మళ్ళీ సంపన్నులు, కుల,మత, ఆధిపత్యశక్తులే అధికారం చెలాయిస్తారు కాబట్టి, పరిపాలనా అధికారాలను అధికార వర్గానికి ఇస్తూ రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ సభలో ఎందరు వ్యతిరేకించినా, పబ్లిక్ సర్వీసు కమిషన్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ సహా మొత్తం సివిల్ సర్వీసెస్‌ను, వాటి అధికారాలను రాజ్యాంగంలో రాసి పెట్టారు. దీనివల్ల రాజకీయాలు పెత్తందారీ సాంప్రదాయ వర్గాల చేతిలో ఉన్నా పరిపాలన నీతిమంతంగా, నిష్పక్షపాతంగా, స్వతంవూతంగా ఉంటుందని భావించారు.

కానీ ఇప్పుడు అదే వ్యవస్థ ఆధిపత్య రాజకీయ వర్గాలకు, పెట్టుబడిదారీ వర్గాలకు మోకరిల్లుతున్నది. పదవులకు, ప్రలోభాలకు లొంగిపోతున్నది. సంపాదనే ధ్యేయంగా కొందరు ఆ పదవికి ఉన్న చట్టబద్ధతను దిగజార్చి రాజ్యాంగ గౌరవాన్నే మంట గలుపుతున్నారు. గడిచిన పది పదిహేనేళ్ళలో ఐఏఎస్‌కు ఉన్న గౌరవాన్ని స్వయంగా కొందరు అధికారులే మంట గలుపుతున్నారు. 190 కాలం వరకు సివిల్ సర్వీసెస్‌కు ఎక్క డాలేని డిమాండ్ ఉండేది. కానీ ప్రపంచీకరణ మొదలై మార్కెట్ విస్తరిస్తూపోతున్న తరుణంలో చాలామంది ఐఏఎస్ కావాలనుకున్న వాళ్ళు, ఐటీ అలల మీద అమెరికా వైపో డబ్బులు కురిసే ఇంకో వృత్తిలోకో వెళ్ళిపోయా రు. కొందరు అధికారులు సైతం ఐటీవైపు, ప్రైవేటు సంస్థలవైపు ఆకర్షితులై ఆ హోదా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. కొందరు ప్రైవేటు కంపెనీలు, ఎన్జీవోలు ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళారు. ఇంకా వెళుతున్నారు.

రెండేళ్ళ క్రితం ఇండియా టుడే పత్రిక కథనం ప్రకారం గత పదేళ్ళలో దేశవ్యాప్తంగా 150 మంది ఐఏఎస్‌లు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నిబంధనల ప్రకారం యాభై ఏళ్ళ వయసు నిండిన వాళ్ళు లేదా ముప్ఫై ఏళ్ళ సర్వీసు నిండిన వాళ్ళు పదవీ విరమణ కోరుకోవచ్చు. అయినా వారికి పూర్తి పెన్షన్ లభిస్తుం ది. చాలా మంది దానినొక సౌలభ్యంగా మార్చుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకో, నాయకుడికో, కంపెనీకో అనుకూలంగా ఉండి పూర్తి పెన్షన్ అర్హత రాగానే రాజీనామా చేసి ఆ కంపెనీలో చేరిపోతున్నారు. పెన్షన్ రావాలంటే ఆదాయం వచ్చే ఉద్యోగాల్లో చేరకూడదనే నిబంధన ఉంది. కానీ కంపెనీలలో చేరిన వాళ్ళు చాలా మంది పెన్షన్ కూడా కొల్లగొడుతున్నారు. గతంలో చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉన్న అనేకమంది రాజశేఖర్ రెడ్డి రాగానే కొలువులకు తిలోదకాలిచ్చి బాబు గారి చలవతో బయటి కంపెనీలకు వెళ్ళిపోయారు. ఒక అధికారయితే ఏకంగా బాబు గారి హెరి కంపెనీలోనే చేరిపోయారు. ఒకప్పుడు కొన్ని వృత్తులకు, ఉద్యోగాలకు గౌరవం ఉండేది. ఆ వృత్తిలో చేరేందుకే చదువుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బే ప్రధానం అయిపోయాక డబ్బు వస్తే చాలు గౌరవం, హోదా దానంతట అదే వస్తుంది. ఏదీ కుదరకపొతే పదవీ విరమణ తరువాత ఏదో పార్టీలో చేరి పదవిని పొందడం సాధారణమై పోయింది. కొందరు అధికారులు దూరదృష్టితో ముఖ్యమంవూతులకు, కంపెనీల పెద్దలకు, పెట్టుబడిదారులకు గులాంగిరీ చేయడానికీ సిద్ధపడుతున్నారు.

అలాంటి వారి కోసం ఐఏఎస్ అధికారుల సంఘాలు రంగంలోకి దిగడం ఆశ్చర్యకరం. పైగా మేమొక్కరమే తిన్నామా? అని ఎదురు ప్రశ్న వేయడం విడ్డూరం. తమపై రాజకీయ ఒత్తిడులు ఉంటున్నాయని, మంత్రులు ముఖ్యమంవూతులు తమతో చట్టవిరుద్ధ పనులు చేయిస్తూ వాళ్ళు మాత్రం తప్పుకుంటున్నారని చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాధికారులు అందునా సివిల్ సర్వెంట్స్ ఏం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెపుతోంది. ప్రజా ప్రతినిధుల సభ చేసిన శాసనాల పరిధిలో జాతీయస్థాయి వ్యవహారాలు రాష్ట్రపతి ద్వారా, రాష్ట్రస్థాయి వ్యవహారాలు గవర్నర్ ద్వారా అమలవుతాయి. వాటిని అమలుచేసే బాధ్యతను రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థకు అప్పగించింది. ఇక్కడ కార్యనిర్వహణలో ఉండే రాష్ట్రపతి, గవర్నర్ మొదలు కలెక్టర్ వరకు రాజ్యంగా పరిరక్షకులుగా, శాసన పాలకులుగానే ఉండాలి తప్ప మౌఖిక ఆదేశాలకు తలలూపే బంట్రోతులుగా మారిపోకూడదు.

ఇది మన కల్లెక్టర్లకే కాదు. క్లర్కులకు కూడా స్పష్టంగా తెలుసు.అందుకే పాలకులు ఏ పని చెప్పినా, అది నోట్ ఫైల్ మీద రాసి సంతకం చేస్తేనే చెల్లుబాటు అవుతుంది. అలా అంటే లిఖిత పూర్వకంగా ఏది చెప్పినా వినాలని, ఏది రాసినా చేసి పెట్టాలని కాదు. అది చట్టబద్ధమా కాదా అని చూసి చట్టబద్ధమైతేనే చేయాలని రాజ్యాంగం చెపుతోంది. చట్టవిరుద్ధమైన పనులు చేయం అని చెప్పే అధికారం అధికార వ్యవస్థకు ఉంది. అంతేకాదు ప్రజా వ్యతిరేకమైన, చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు మంత్రులైనా, ముఖ్యమంవూతులైనా మరెవరైనా అదుపుచేసే బాధ్య త కూడా వారికి ఉన్నది. అలా చెప్పిన వాళ్ళు చరిత్ర పొడుగునా మనకు కనిపిస్తారు. కానీ మన అధికారులు మాత్రం అవినీతి పాలకులకు ఆచార్యులైపోతున్నారు. అయ్యా ఎస్ అని దేబిరించేస్థాయికి దిగజారుతున్నారు. అలాగని అందరూ అలాగే ఉంటారని అనలేం. మన రాష్ట్రంలో ఇప్పుడున్న అధికారులలో కనీసం ఒక ఇరవై శాతం నిజాయితీపరులున్నారని అంచనా!

రాజశేఖర్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన కొత్తలో అప్పటి విజిపూన్సు కమిషనర్ ఇచ్చిన నివేదికలో ఎనభై శాతం మంది ఐఏఎస్ అధికారులు అవినీతి పరులని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. దీనిపై 56 పేజీల నివేదిక కూడా ఇచ్చారు. రెడ్డిగారు అవినీతి అధికారులను తొలగించాల్సింది పోయి సమాల్ చెప్పిన సత్యాన్ని శాశ్వతంగా సమాధి చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. సమాల్‌ను పిచ్చివాడని ప్రచారం చేశారు. నిజంగానే 2007లో సమాల్ నివేదిక ప్రకారం అవినీతి ఐఏఎస్‌లపై చర్య తీసుకుని వుంటే వైఎస్‌ఆర్ పేరు అవినీతికి పర్యాయపదంగా ప్రచారం అయ్యేది కాదు. బహుశా ఆ నివేదిక ప్రకారమే ఆయన ఐఏఎస్‌లను కీలకమైన స్థానాల్లో వాడుకుని ఉంటాడు! ఇప్పుడు అధికారులు కూడా తమను ముఖ్యమంవూతులు, మంత్రులు వాడుకున్నారని వాపోతున్నారు.

నేరం చేస్తే ఒకటే తప్పు, కానీ నేరానికితోడ్పడడం, భాగస్వాములు కావడం, నేర సమాచారాన్ని ప్రభు త్వం దృష్టికి తేకపోవడం ఇవన్నీ ఐఏఎస్‌లు తెలిసి చేసిన తప్పులు. రాజకీయ నాయకత్వం తమను తప్పుదోవ పట్టించిందని చెప్పుకొస్తున్న ఈ అధికారుల సంఘం ఇప్పుడు ఏం చేస్తోంది? మళ్ళీ అదే రాజకీయ నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రిని కలిసి విచారణలో జోక్యం చేసుకోమని కోరుతోంది. ఈ ఒత్తిడి ఢిల్లీ పెద్దల వరకు పాకిందని తెలుస్తోంది. తమ ను విచారణ పరిధి నుంచి తప్పించకపొతే అందరి బాగోతాలు బయటపెడతామని హెచ్చరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే నేరస్తులకు సహకరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దానికంటే ఇదే పెద్ద నేరం అవుతుంది.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్ :[email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ