కోస్తాలో కుల ‘కరివేకాపులు’!


Fri,February 3, 2012 01:37 AM

కోస్తా జిల్లాల్లో రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సందర్భంగా తెలంగాణ సమాజం స్పందించి న తీరు అభినందనీయం. అంబేద్కర్ పట్ల అతని విచారధార పట్ల తెలంగాణ ప్రజలకున్న అవగాహనకు, అతనిపట్ల ఉన్న గౌరవ భావానికి అది నిదర్శనం. నిజానికి ఉద్యమాలు ప్రజల్లో అటువంటి భావజాల చైతన్యాన్ని కలిగిస్తాయి. తెలంగాణలో అంబేద్కర్ ఇప్పుడు కేవలం దళిత వాడలకే పరిమితం కాలేదు, గడిచిన రెండేళ్ళలో ఆయన ఆలోచనా విధానాలు ఊరూరా విస్తరించాయి. పల్లె పల్లెనా ప్రతిధ్వనించాయి. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉద్యమంలో ఉన్నవారికి అంబేద్కర్ అత్యంత ప్రీతిపావూతుడుగా మారడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది ఆయన రాష్ట్రాల ఏర్పాటుపట్ల ప్రదర్శించిన స్పష్టమైన వైఖరి. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది సామాజిక పునాదుల మీద జరగాలన్నది ఆయన ప్రతిపాదనల్లో మౌలికమైనది.

అందునా పీడిత వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించే విధంగా ఉండాలని ఆయన పలు సందర్భాలలో సూచించారు. ఈ విషయం మీద ఆయన సుదీర్ఘమైన వాదనలు చేశారు. భారత దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయనన్ని ప్రామాణిక ప్రతిపాదనలు చేశారు. ఆయన ప్రతిపాదనలే తెలంగాణవాదానికి కొత్త బలాన్నిచ్చాయి. గడిచిన దశాబ్దకాలంలో తెలంగాణవాదం ఆయన చూపిన మార్గంలోనే తన వాదనకు పదును పెట్టింది. ఇక రెండోది ఆయన చూపిన చట్టబద్ధమైన పోరాటం. అది తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకత్వం చేసింది. అంబేద్క ర్ సమకాలికులు చాలామందే స్వాతంత్ర సమరయోధులో, దేశభక్తులో ఉండిఉండవచ్చు. కానీ ఆయనకున్న సామాజిక నిబద్ధత ఉన్నవాళ్ళు, వివిధ సామాజిక సమస్యలపైన పోరాటాలు చేసిన వాళ్ళు అరుదు.

ఆయన తన పోరాటంలో చట్టాలను ఎప్పుడూ ఉల్లంఘించకపోగా చట్టబద్ధమైన, ధర్మ బద్ధమైన సమాజం కావాలని తపించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి భారతీయ సామాజిక వ్యవస్థ మౌలి క స్వరూపాన్ని అర్థం చేయించి తదనుగుణ విధానాలు రూపొందించి ఇచ్చారు. అలాగే భారత ప్రభుత్వం కూడా అటువంటి చట్టబద్ధపాలన అందించాలని కలలుగన్నారు. ఆయన ఒక్క కులం గురించే కాదు. కులంతో పాటు మత, ప్రాంత, లింగ వివక్షల ను వ్యతిరేకించారు. వివక్ష, దోపిడీ, అణచివేత, ఆధిపత్యం ఏ రూపాల్లో ఉన్నా విముక్తిపొందే హక్కు అవకాశాలు ఉండాలని, అది పోరాడి అయి నా సరే.. పొందే శక్తి ప్రతి వ్యక్తికీ, సామాజిక వర్గానికి ఉండాలని కోరుకున్నారు. అంతేకాదు ఆ హక్కులను రాజ్యాంగబద్ధం చేశారు.

ఆ రాజ్యాంగ బద్ధమైన హక్కు కోసమే తెలంగాణ ప్రజానీకం చట్టబద్ధమైన సుదీర్ఘ పోరాటాన్ని చేస్తున్నారు. కాబట్టే అంబేద్కర్ అంటే అంతటి గౌరవం తెలంగా ణ అంతటా వ్యక్తమయ్యింది . ఆ గౌరవంతోనే తెలంగాణవాదులు అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇది కచ్చితంగా అభినందించదగ్గ విషయమే.

కులతత్వం వైరస్ కంటే ప్రమాదకరం. కోస్తాలో మొదలైన ఈ విద్వేషం తెలంగాణ ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నది. కాకతాళీయమే కావచ్చు కాని కాం గ్రెస్ పాత కాపు డి.శ్రీనివాస్ సొంత ఊరిలో ఇది వెలుగుచూడడం కలవరపరుస్తున్నది. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఆయన విగ్రహాలను ఒక పధ్ధతి ప్రకారం రోజుకొక చోట కూలగొడుతున్నారు. అలాగని ఈ ధ్వంస రచనను మొత్తం ప్రాంతానికి ఆపాదించలేం. ఆంధ్రాలోనే అంబేద్కర్‌వా దులు, ఆయన పోరాట వారసులు ఎక్కువ. అంబేద్కర్ స్వయంగా ఉద్యమాలు నడిపిన కాలంనుంచి ఇప్పటి వరకు ఆయనను పూజ్యనీయంగా ఆరాధిస్తూ అనుసరించే వాళ్ళు అనేకమంది అక్కడ ఉన్నారు. దేశంలోనే మొదటిసారిగా అక్కడి దళితులు తమ జీవితాలకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని అన్వయించుకున్నారు.

తమ పోరాటాలకు ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము తిన్నా తినకపోయినా ఒక్కో పైసా పోగుచేసుకుని తమవాడల్లో, వీధు ల్లో ఆయన ప్రతిమలను నిలబెట్టుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచివచ్చిన తొలితరమే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ పోరాటాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఆ విలువలు ఆచరించేవాళ్ళు కాబట్టే ఆంధ్రా దళి త బలహీన వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నారు. విగ్రహాల విధ్వంసం అక్కడి అగ్రవర్ణాల కుట్ర అని కొందరు అం టున్నారు. అది కూడా నిజం కాదు. కూలగొట్టిన వాళ్ళు, కుట్ర పన్నిన వాళ్ళు అగ్రవర్ణం వాళ్ళే అయి ఉండవచ్చు. కానీ ఆ నేరాన్ని అందరిమీదా తోసేయలేము. ఇది అర్థమయ్యే దళితులు దాన్నొక కులాల ఘర్షణగా మార్చకుండా సంయమనంతో ఉన్నారు.

ఆంధ్రా అగ్రవర్ణాల్లో కూడా మొదటినుంచి ఆదర్శాల కోసం, సామాజిక న్యాయంకోసం నడుంకట్టిన సంస్కర్తలు ఎందరో వచ్చారు. గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు అగ్ర కులాల నుంచి వచ్చినప్పటికీ ఆంధ్ర సమాజాన్ని మానవీకరించే ప్రయత్నం చేశారు. తమ కులాల్లోని దురాచారాలతో పాటు, సామాజిక దుర్మార్గాలను రూపుమాపేందుకు ఆజన్మాంతం కృషి చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర తప్ప మరోటి కాదు.

ఈ కుట్ర టార్గెట్ 2014. అప్పటిదాకా తెలంగాణ తేల్చకపోతే ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని కాంగ్రెస్‌కు తెలుసు. రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా సీమాంవూధలో కాంగ్రెస్‌ను నమ్మేవారు కరువవుతున్నారు. అక్కడ ఇప్పుడు అంతో ఇంతో వై.ఎస్.జగన్ హవా నడుస్తోం ది. జగన్ పార్టీ పెట్టి, జనాన్ని ఓదారుస్తూ వెళ్తున్న క్రమంలో సీమాంవూధలో కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు, వారిలో ప్రముఖంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆయన వైపు మొగ్గుచూపారు. అదే బాటలో కొం దరు దళితులు, క్రిస్టియన్‌లు కూడా వెళ్లారు. జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఈ రెండు కులాల నుంచే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఇది సామాజిక ఓటు బ్యాంకు కాబట్టి అంత తేలిగ్గా చెక్కు చెదిరే అవకాశంలేదని కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది. ఇప్పటికే జగన్ వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వా సం ప్రకటించి కూల్చే ప్రయత్నం చేసింది. ఇది ముందుగానే పసిగట్టిన కాం గ్రెస్ పార్టీ చిరంజీవిని అక్కున చేర్చుకుంది.

అలాగే బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించి మంత్రిగా కూడా కొనసాగిస్తోంది. ఇప్పుడు బొత్స ముఖ్యమంవూతి కంటే ముఖ్యుడైపోయారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అసలు ముఖ్యమంత్రి అభ్యర్థనను పెడచెవిన పెట్టిన అధిష్ఠానం బొత్సకు తలొగ్గి కొత్తగా ఇద్దరు కాపులను కేబినేట్‌లోకి తీసుకోవడం ఒక ఎత్తయితే, శంకర్‌రావును తొలగించడం దళితుల్లో కొందరికి పుండుమీద కారం చల్లినట్టయింది. ఇవన్నీ గమనించే అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఏకంగా ఆజాద్ మీదే విరుచుకుపడ్డారు. హర్షకుమార్ ఢిల్లీకి దగ్గరివాడు. హస్తిన అండతో గతంలో రాజశేఖర్‌డ్డినే ఎదిరించినవాడు. అతన్ని ధిక్కరించి టికెట్ తెచ్చుకున్నవాడు. ఈ కుల చిచ్చును రాజేసి రగిలిస్తున్నది ఢిల్లీ ఏజెంటుగా ఉన్న ఆజాదే ఆన్న సంగతి అతనికి తెలిసే కుండబద్దలు కొట్టా డు. హర్షకుమార్ మాటల ప్రకారం కాపులను కాంగ్రెస్ పార్టీ తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి ఉద్రిక్తతలే కొత్త సమీకరణాలను ముందుకు తెస్తాయి. ఇప్పుడు హర్షకుమార్ విమర్శలకు నేరుగా సమాధానం చెప్పలేని వాళ్ళే అంబేద్కర్ విగ్రహాల మీదపడ్డారు. సామాజిక వ్యవస్థలు బలహీనపడిపో యి, పౌరసమాజం రాజకీయ ఛట్రంలో చిక్కుకుపోయినప్పుడు ఏ సమాజానికైనా ఈ చిక్కులు తప్పవు. ఇప్పుడు ఆంధ్రాలో అదే జరుగుతోంది. ముందే చెప్పినట్టు ఇది సామాజిక నేరం కాదు. రాజకీయ నాయకులు రాజేసిన చిచ్చు. ప్రభుత్వం చెప్తున్నట్టు విగ్రహాల ధ్వంసం నలుగురు తప్పతాగి చేసిన తప్పిదం కానే కాదు. ముమ్మాటికీ దళితుల మీద ఆధిపత్యం చేసేందుకు ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు స్వార్థపరులు చేసిన కుట్ర అని దళిత సంఘాలు అంటున్నాయి. దాడుల మూలాలు బహిరంగంగానే కనిపిస్తున్నా మన మీడియా, పాలక వర్గాలు ఈ తతంగాన్ని గుర్తుతెలియని దుండగుల చర్యగా కొద్దిరోజులు ప్రచారం చేసి చిట్టచివరికి తాగుబోతుల తుంటరి పనిగా తేల్చేశారు.

మన రాష్ట్రాన్ని మద్యం వ్యాపారులే పరిపాలిస్తున్నందున మద్య సంబంధమైన నేరాలకు పెద్దగా శిక్షలుండవు.
కాంగ్రెస్ పార్టీ ఈ కులచిచ్చు ద్వారా కోస్తాలో కాస్తో కూస్తో బలంగా ఉన్న కాపులను మచ్చిక చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పోయిన ఎన్నికల్లో కూరకు కొరగాని చిరంజీవిని ఇప్పుడు కరివేపాకుగా మార్చుకుంది. చిరంజీవికి గ్లామర్ ఉంది. కానీ పాపం రాజకీయ గ్రామరే లేదు. రాజకీయ ఎత్తుగడల్లో నూరేళ్ళ పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి సామాజిక వర్గం మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. చిరు బ్రాండ్ కరివేపాకుతో కొత్త ఘుమఘుమలు తీసుకురావాలని చూస్తోంది. ఈ ఎత్తుగడను రెండుకళ్ళతో గమనిస్తోన్న చంద్రబాబు నాయు డు కూడా కుల పురాణం మొదలుపెట్టాడు. స్వయంగా కమ్మ సాంప్రదాయ ఓట్లను సమీకరించుకునేందుకు తన వియ్యంకుడు బాలకృష్ణను బరిలోకి దించాడు. ఆయన ఆ పనిలో ఉండగానే చంద్రబాబు స్వయం గా కాపులకు కరివేపాకు సంగతి గుర్తు చేశారు. చాలాకాలం ఆధునికుడిగా, హైటెక్ పొలిటీషియన్‌గా పేరున్న చంద్రబాబు కూడా ఇప్పుడు కులమే బలమని నమ్ముకుని కాపులకు కాకా పడుతున్నాడు. సంఖ్యా బలం, స్థానిక ఆధిపత్యం ఉం డి కూడా ఆంధ్రా రాజకీయాల్లో ఇప్పటివరకు సంఘటితశక్తిగా ఎదగనిది ఒక్క కాపులే.

వందేళ్ళకు పైగా ప్రయత్నించినా ఆ కులం నుంచి ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో రాజకీయాలు శాసించే నాయకుపూవరూ రాలేకపోయారు. వంగవీటి మోహనరంగారావు ఆ ప్రయత్నం చేసినా అది సైద్ధాంతిక పునాది లేకపోవడం వల్ల నిలబడలేకపోయింది. చిరంజీవి కూడా అదే ప్రయత్నం చేశారు. సామాజిక న్యాయం పేరుతో అత్యంత గంభీరమైన సిద్ధాంత పునాదిని ప్రతిపాదించి దానిమీద ఒక గాలిమేడను నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ అది పేకమేడై కుప్పకూలింది. ఇప్పుడు ఆ శిథిలాల మీద కాంగ్రెస్ ఒక కొత్త సౌధాన్ని నిర్మించాలని అనుకుంటున్నది.

సాధారణంగా చదువు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధి, మనుషుల్ని సమాజాన్ని ఆధునీకరిస్తాయని, ఆధునికత ఉదార విలువలను, లౌకిక ధోరణిని పెంపొందిస్తుందని, ఈ విలువ లు కుల మతాలు,సనాతన విలువలు అంతరిస్తాయని వాటి స్థానంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం పట్ల గౌరవభావం, ప్రజాస్వామిక విలువలు అంకురిస్తాయని సామాజిక పండితులు అంటారు. కానీ చదువు, సంపద, అభివృద్ధిని సొంతం చేసుకున్న ఆధునిక సమాజంగా పేరున్న ఆంధ్రాలో కొందరిలో సంకుచిత ధోరణి కనిపించడం ఆందోళన కలిగించే పరిణామం. తెలంగాణ విషయంలో కనిపించిన సంకుచిత ధోరణే అంబేద్కర్ విషయంలో కూడా చూడవచ్చు. విగ్రహాలు కూలగొట్టడం కంటే, ఆ సంఘటనలకు సరై న రీతిలో అక్కడి పౌర సమాజం స్పందించకపోవడం ఇప్పుడు కలవరపరిచే విషయం.

ఇదే మాట సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక అధ్యాపక మిత్రుడితో అన్నాను. ఆయన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఏది ఏమైనా తాను మాత్రం సమైక్యవాదినని పదే పదే చెప్పేవాడు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వాదిస్తుండేవాడు. నా ప్రశ్నకు ఆయన తీవ్రంగా స్పందించాడు. ‘ట్యాంక్ బండ్ మీది విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు తెలంగాణ పౌర సమాజం ఎందుకు స్పందించలేదు’ అని ఎదు రు ప్రశ్నించాడు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు పెట్టింది. అంబేద్కర్ విగ్రహాలు దళితుల సొత్తు. ఇక్కడ తెలంగాణ విగ్రహాలు లేకపోవడం ఒక సంస్కృతిక వివక్ష. ఏర్పాటు చేయాలన్నది ఉద్యమం ముందుకు తెచ్చిన ఒక న్యాయమైన రాజకీయ డిమాండు. మిలియన్ మార్చ్‌ను అడ్డుకుని అణచివేసిన ఆగ్రహంలో కూల్చివేత జరిగింది. అంతటి ఆగ్రహంలో కూడా సామాజిక స్పృహ కనిపిస్తోంది.

శ్రీ శ్రీ, గుర్రం జాషువా, పోతులూరి వీరవూబహ్మం, వేమన, మొల్ల ఇలా అనేక విగ్రహాలను ఆందోళనకారులు కాపాడుకున్నారు. కోస్తాలో జరిగింది అప్పటికప్పుడు ఆవేశంలో జరిగింది కాదు. ఒక పథకం ప్రకారం రెండుమూడు రోజుల పాటు జరిగిన విధ్వంసం. ట్యాంక్‌బండ్ విధ్వంసాన్ని కర్కట, మర్కట, ముష్కర మూకల పనిగా ప్రచారం చేసిన తెలుగు మీడియా, అంబేద్కర్ విగ్రహాల విషయంలో అంటీముట్టనట్టు ఉండడం ఆశ్చర్యం. విగ్రహాలు ఏవైనా విధ్వంసం ఒక పాపమని ప్రవచించిన ఆంధ్రా పండితులు అక్కడి పాపానికి పరిహారం చేసుకోకపోగా కులాల మధ్య అనైక్యతను తలవంచుకుని ఆమోదించడం సంకుచిత వాదం. సమైక్య వాదాన్ని కొత్తగా తామే కనిపెట్టినట్టు, అదే ప్రాణ వాయువన్నట్టు ప్రచారం చేస్తున్న వాళ్ళు ముందుగా అక్కడ సామాజిక సమైక్యత సాధిస్తే.. ఒక్క వాళ్ళకే కాదు మొత్తం సమాజానికి మంచిది. సామాజికంగా సక్యత లేనప్పుడు ఇంకే సమైక్యతా నిలబడదు. అంబేద్కరే చెప్పినట్టు ‘కులం పునాదుల మీద నిలబడి మాట్లాడేవాళ్ళు జాతిని నిర్మించలేరు. నిలబెట్టలేరు’.

ఫొఫెసర్ ఘంటా చక్రపాణి
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈమెయిల్:ghantapatham@gmail.com


35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

country oven

Featured Articles