యుద్ధం అనివార్యం..!


Fri,April 25, 2014 01:07 AM

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది.
ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే వారినే ఎన్నుకోవాలి. ఎందుకంటే రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా యుద్ధం తప్పదు. అయితే ఈ యుద్ధం ప్రజలు చేయాల్సింది కాదు.

రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేయవలసి ఉంటుంది.
ఇప్పుడు యుద్ధం ముగిసింది, ఇక భాగస్వామ్యంతో కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పాలన ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదని ఆమె కరీంనగర్ ఎన్నికల బహిరంగ సభలో అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గానీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా చదివినవాళ్ళు గానీ యుద్ధం అప్పుడే ముగిసిందని అనుకోవడం లేదు. అసలు పోరా టం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే మొద లు కానుందని బలంగా నమ్ముతున్నారు.

తెలంగాణ తామే తెచ్చామనీ, తామే ఇచ్చామని చెపుతున్నవాళ్ళు, అరవై ఏళ్ళ కలను అరచేతిలో పెట్టామని అంటున్నవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి పార్లమెంటు ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చదివితే అందులో యుద్ధాలకు కావాల్సిన అన్ని ఆయుధా లూ కనిపిస్తాయి. నిజానికి ఇది భారత పార్లమెంటు ఆమోదించాల్సిన బిల్లుకాదు. బిల్లు లో అనేకాంశాలు రాజ్యాంగ నియమాలకు భిన్నంగా ఉన్నాయి. అవి యథాతథంగా కొనసాగాలంటే చట్ట సవరణలో, కుదరకపోతే రాజ్యాంగ సవరణలో చేయక తప్పదు. ఇవ న్నీ ఇప్పుడు కొత్తగా చెపుతున్నవి కాదు. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం (సీడబ్ల్యుసీ) చేసిన తీర్మానం చూసిన వెంటనే తెలంగాణ పౌరసమాజం బిల్లులోని లోపాలను గుర్తించింది. మామిడి పండు లో గుజ్జు ఆంధ్రా వాళ్లకు టెంక తెలంగాణకు ఇచ్చే కుట్ర చేస్తున్నారని జేఏసీ సారథి కోదండరామ్ పదేపదే హెచ్చరిస్తూనే వచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలమీద జేఏసీ ఒక నివేదిక కూడా మంత్రుల బందానికి, అన్ని రాజకీయపార్టీలకు ఇచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిమీద స్పందించలేదు. బిల్లు రూపొందే దశలోగానీ, పార్లమెంటులో చర్చకు వచ్చిన సందర్భంలో గానీ ఇప్పు డు ఎన్నికల్లో పోటీపడుతున్న ఎవరూ నోరు విప్పలేదు ఒక్క అసదుద్దీన్ ఒవైసీ మినహా.

మనం ప్రత్య క్ష ప్రసారంలో చూడకుండా కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి చర్చించిన సంగతుల రికార్డులను యథాతథంగా పార్లమెంటు సిబ్బంది ద్వారా సంపాదించిన ఒక జర్నలిస్టు ప్రముఖుడు నాకు మెయిల్ చేశాడు. ఇచ్చి న వారి తరఫున మాట్లాడిన వాళ్ళు అంతా అమ్మ దయ అంటూ అదే మహాప్రసాదమని కళ్ళకు అద్దుకుంటే, తెచ్చామని చెపుతున్న వాళ్ళు అదే భాగ్యం అన్నట్టుగా మౌనంగా భక్తిశ్రద్ధలతో విన్నారు తప్ప మాట మాత్రంగానైనా అభ్యంతరపెట్టలేదు. ఒక్క అసదుద్దీన్ మాత్రం అడుగడుగునా తెలంగాణ హక్కుల కోసం పోరాడాడు. పలుసార్లు సవరణలు ప్రతిపాదించారు. కానీ ఆయనకు సాటి తెలంగాణ సభ్యుల నుంచి కనీస మద్దతు రాలేదు. ఆ అన్యాయాలను యథాతథంగా ఉంచుతూ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు అవే తెలంగాణ అభివద్ధికి ప్రతిబంధకాలుగా మారి భవిష్యత్తులో ప్రజాపోరాటాల కు భూమిక కాబోతున్నాయి.
అందులో మొదటిది పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్.

ఉమ్మడి రాజధాని మానవీ యకోణంలో ఆలోచిస్తే మంచిగానే కనిపించ వచ్చు. కానీ దాని వెనుక అనేక సమస్యలకు అదే మూలం కాబోతోంది.దీనివల్ల ఆంధ్రాకు పాలనా పరమైన సౌకర్యం ఎంతమాత్రం లేకపోగా తెలంగా ణ పరిపాలనకు ఇదే పెద్ద ప్రతిబంధకం కాబోతున్నది. ఉమ్మడి రాజధానికి మౌలిక వసతులు తెలంగాణ ప్రభుత్వమే కల్పించాలి. ఉన్న భవనాలనే వాడుకోవాలి. ఉద్యోగులంతా ఇక్కడే ఉంటారు. వారి పౌర సరఫరాలు, సదుపాయాలూ అన్నీ తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలి. అలాగే కొందరు అక్రమంగా సంపాదించిన భూములు, ఆస్తులకు కాపలా ఉండి రక్షణ బాధ్యత కల్పించాలి. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేయలేదు కాబట్టి గవర్నర్‌కు దాని బాధ్యతలు అప్పగించారు. అంటే అరవై ఏళ్ళు ఆంధ్రా పాలనలో తెలంగాణ ప్రజలకులేని, అనుమానాలు, అభ్యంతరాలు ఇప్పుడు వారికి కలిగాయి.

తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇక్కడి ప్రజలమీద వాళ్లకు నమ్మకం లేదు. అయినా సరే అంతా సరే అని బల్లలు చరిచారు. ఈ ప్రతిపాదనవల్ల హైదరాబాద్ అస్తిత్వం శాశ్వతంగా సమాధి అయిపోతుందని అంటూ తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు ఎలా మౌనంగా ఉంటున్నారు. మీ ఆత్మాభిమానం ఏమైందని అసదుద్దీన్ నిండు సభలో నిలదీశారు. కానీ మనవాళ్ళు మాత్రం మౌనంగా కూర్చుండి పోయా రు. తెలంగాణకు వేరే గవర్నర్ ఉండాలన్న వాదనను కూడా వినిపించుకోలేదు. దేశంలో ఇలా ఏ రాష్ట్రం విషయంలోనూ జరగలేదు.ఇలాంటి డిమాండు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని భావన లేదని, ప్రజాప్రభుత్వం ఉండగా గవర్నర్‌కు శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలు ఇవ్వడానికి కుదరదని న్యాయకోవిదులు మొత్తుకున్నా వినలేదు. ఉమ్మడి రాజధాని వాంఛనీయం కాదని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల ఏర్పాటు సందర్భంగా డాక్టర్ అంబేద్కర్, మద్రాస్-ఆంధ్రా విభజన సందర్భంగా జస్టిస్ వాంచూ కమిటీ స్పష్టం చేశారు. ఇది భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలం కాబోతున్నది.

రెండోది ఉద్యోగుల పంపిణీ. వారి జీతాలు, పెన్ష న్లు. వీటికి జనాభాను ప్రాతిపదిక చేశారు. కానీ స్థానికత మాత్రమే చూడాలన్నది తెలంగాణవాదుల ప్రాతిపదిక. నిజానికి ఎప్పుడైనా జరిగేది అదే. కానీ తెలంగాణ విషయంలో మాత్రం అలా జరగలేదు సరికదా ఉద్యోగుల పంపిణీ విషయం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే పెట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు కూడా సంబంధం లేకుండా జరుగుతున్నది. దీన్ని ముందే గ్రహించిన అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు పాటించి బిల్లులోని 78వ క్లాజును స్థానికత, పుట్టిన ప్రాంతం, సీనియారిటీ పరిగణనలోకి తీసుకుని వారి వారి ప్రాంతాలకు పంపించాలని కోరారు.

గుడ్డి ఆప్షన్ ఉండకూడదని వాదించారు. ఉద్యోగాల మీది ఆశతో తెలంగాణలో ఎంతమంది బలిదానాలు చేసుకున్నా రో మీకు తెలియదు. వారి ఆశల్ని వమ్ము చేయకండి ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. తెలంగాణ నిరుద్యోగుల సమస్య కూడా. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాలులేక నిరుద్యోగులు వేసారి ఉన్నారు. వారే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి నిలబెట్టారు. నిజంగానే న్యాయంగా పంపిణీ జరిగితే ఒక్కరోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వవచ్చని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్ చెపుతున్నారు. మరి మన నాయకులు ఆ మాట ఎందుకు చెప్పడం లేదు. మరోవైపు ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని జైరాం రమేష్ ఆంధ్రా ఉద్యోగులకు అభయం ఇస్తున్నాడు. ఈ ఎన్నికలు ముగిసి, అక్కడ ప్రచారం ఊపందుకునే లోగా అటువంటి ఆదేశాలు అందినా ఆశ్చర్యం లేదు.

ఉద్యోగాలే ఇవ్వనప్పుడు తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకనుకున్నారో ఏమో ఉన్న కమిషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణకు కమిషన్ కూడా లేదు. ఈ విషయంలో అసద్ ప్రశ్నల పరంపరకు సమాధానం రాలేదు. ఇలాంటి విషయా ల్లో కోర్టుకు వెళ్ళే వెసులుబాటు కూడా లేదు. అసలు తెలంగాణకు హైకోర్ట్ కూడా ఇవ్వలేదు. అది ఉమ్మడిగానే ఉంటుంది. అక్కడి ఆంధ్రా న్యాయమూర్తులు అలాగే ఉంటారు. తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా దావాలు వేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది.

ఇక అత్యంత ప్రధానమైనది పోలవరం ముంపు గ్రామాలు. అసలు పోలవరం ప్రాజెక్టే వద్దని ప్రజలు, పర్యావరణవేత్తలు మొత్తుకుంటుంటే పార్లమెంటు మాత్రం దానికి జాతీయ హోదా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా 207 ముంపు గ్రామాలను అవశేష ఆంధ్రకు రాసిచ్చింది. ఇందులో తనకు తాను పదేపదే చెప్పుకుంటున్నట్టు వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర పోషించాడు. తమకు భద్రాచలం రాముడు వద్దని రాజ్యం మాత్రం రాసివ్వాలని పట్టుబట్టాడు. వెంకయ్య ఒత్తిడికి కాంగ్రెస్ తలొగ్గింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ రూపొందించింది. అది ఆమోదం పొందితే కనీసం మూడు లక్షల ఆదివాసు లు చెల్లాచెదురై పోనున్నారు, సీలేరు విద్యుత్ కేంద్రం ఆంధ్రా భూభాగంలో కలిసిపోతుంది.

బహుశా ఎన్నికలలోపే కేంద్ర మంత్రివర్గం సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఇంత జరిగినా తెలంగాణ నాయకులు పార్లమెంటులో మాట్లాడలేదు. అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మునిగేవాళ్ళు ఆదివాసులే కదా అన్నట్టు వ్యవహరించారు. కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఇవన్నీ చర్చకు వస్తాయని, కొంతవరకైనా హామీలు లభిస్తాయని తెలంగాణ సమాజం ఆశించింది. కానీ కూడబ లుక్కున్నట్టు ఒక్కరూ ఈ విషయాలను చర్చకు తేకుండా ప్రచారం మొత్తం తిట్లకు, శాపనార్థాలకు పరిమితం చేసేశారు. ఇవే కాదు ఇంకా జల వివాదా లు, ఆస్తుల పంపకాలు, హైదరాబాద్ నగరం మీద ఆధిపత్యశక్తుల ఆగడాలు భవిష్యత్తులో తెలంగాణ ప్రజల హక్కులకు అనేకచిక్కులు తేనున్నాయి. ఇవా ళ ఎన్నికల ప్రచారంలోనే హైదరాబాద్ అందరిదని ఎవరైనా పోటీ చేసి, ఎవరైనా పరిపాలన చేయవచ్చని కొత్త బిచ్చగాళ్ళు కొందరు కూనిరాగాలు తీస్తున్నారు. వారికి మరికొందరు భరోసా ఇస్తున్నారు. ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి.

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే వారినే ఎన్నుకోవాలి. ఎందుకంటే రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా యుద్ధం తప్పదు. అయితే ఈ యుద్ధం ప్రజలు చేయాల్సింది కాదు. రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం, తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎవరి పక్షంలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీలతో పనిలేదు. ప్రజలు విజ్ఞతను ప్రదర్శించి తమతో కలిసి యుద్ధం చేసిన వాళ్ళను, యుద్ధ సమయంలో తమతో ఉన్నవాళ్ళను, రేపు కూడా యుద్ధానికి సిద్ధం గా ఉండేవాళ్ళను మాత్రమే ఎన్నుకోవాలి.

504

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి