చర్చ జరగాల్సిందే!


Fri,January 10, 2014 02:11 AM

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా రాజ్యం వీళ్ళదే. అయితే ఎలా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.
చర్చ ఇప్పుడు ఈ ప్రశ్న నుంచే మొదలవుతున్నది. తెలంగాణ పరిరక్షణ ఉద్యమం
ఇప్పుడు పది జిల్లాల్లో కూడా మొదలుకావాలి.

‘నువ్వు చెప్పే విషయాన్ని నేను అంగీకరించకపోవచ్చు, కానీ చెప్పడానికి నీకున్న హక్కును మాత్రం నా ప్రాణం పోయేవరకు కాపాడతాను’ అంటాడు ఒక మహానుభావుడు.
ఏ మనిషికైనా మనసులో ఉన్న మాట చెప్పడాని కి స్వేచ్ఛ ఉంటుందని, అది అంగీకారయోగ్యం కాకపోయినా, అభ్యంతరకరమైనా సరే చెప్పడానికి ఆ మనిషికి ఉన్న స్వేచ్ఛను కాలరాయకూడదని దీని అర్థం. కానీ ఇప్పుడు అలాంటి మహానుభావులు ఎవరూ మిగిలి ఉన్నట్టులేరు. ఇప్పుడు చాలామంది చెప్పాల్సిన అవసరం లేనేలేదని అంటున్నారు. కొంద రు అడిగినా అభివూపాయాలు చెప్పడానికి నిరాకరిస్తుం మరికొందరు మాత్రం చెప్పే స్వేచ్ఛను హరిస్తున్నా రు. ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర విభజన సందర్భం గా జరుగుతున్న తతంగం అంతా ఇదే సూత్రం మీద నడుస్తున్నది. ఆలస్యంగానైనా సరే శాసనసభ తెలంగాణ బిల్లును చర్చకు చేపట్టింది. సభలో చర్చ జరిగి నా జరగకపోయినా తెలంగాణకు నష్టం ఏమీ లేదు.

ఎందుకంటే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాల్సిం ది దానిపై చర్చ జరగాల్సింది పార్లమెంటులో. అదొక పార్లమెంటరీ ప్రక్రియ. కేంద్రంలో ఉన్న అధికార కూటమి, ప్రతిపక్షం బీజేపీ రెండూ అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి అది ఫిబ్రవరితో పూర్తై మార్చ్ నాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందన్న విశ్వా సం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. మార్చ్ నాటికి రాకపోయినా ఎవరూ పెద్దగా దిగులు చెందనక్కరలేదు. ఎందుకంటే ఆ తరువాత రెండే రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వంకర టింకర మాటలు మాట్లాడిన వాళ్ళంతా మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తారు. ఇక వాళ్లను నమ్మించడానికి వేరే కొత్త హామీలేవీ ఉండవు. అందుకే తెలంగాణలో నూకలు చెల్లాయన్న నిర్ధారణకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ లాంటివి మినహా ఇప్పుడు ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. వ్యతిరేకిస్తే తెలంగాణలో అడుగుపెట్టలేరని వాళ్లకు తెలుసు. ఇప్పుడు ఈ నాటకమంతా కేవలం ఆంధ్రా ప్రేక్షకుల ను రంజింపజేయడానికి తప్ప దేనికీ పనికిరాదు.

ఇది గమనించే కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు చర్చ జరగాలని అంటున్నాడు. ఇక క్లైమాక్స్‌లో నాటకాన్ని రక్తికట్టించి కథా నాయుకుడిగా మిగిలిపోవాలని కలలుగంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కల లో ఉన్నాడు. వీళ్ళిద్దరి లక్ష్యం వీలయితే విడివిడిగా, కాదంటే కలివిడిగా జగన్ ఎజెండాను దెబ్బకొట్ట డం. ఈ సంగతి తెలిసే జగన్ చర్చ మొదలుపెట్టకుండానే సమైక్యాంధ్ర తీర్మానంచేసి పార్లమెంటుకు పంపాలని పట్టుబడుతున్నాడు. బయటకు అందరూ విభజన వద్దనే అంటున్నా విభజన జరగకపోతే తమ మనుగడకే ముప్పు అని అందరికీ తెలుసు. విభజన జరిగితేనే తమకు అంతే ఇంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఇంతగా వేధించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మొఖం చెల్లదని కూడా వాళ్ళకు తెలుస


చట్టసభల సంగతి, సీమాంధ్ర పార్టీల, ప్రతినిధుల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు మాత్రం చర్చ ను కోరుకుంటున్నారు. చర్చ జరగడం ద్వారానే భావవూపసారం జరుగుతుందని, తద్వారా సమస్య ఎలాంటిదైనా పరిష్కరించుకోవడం సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసపూరిత పట్టుదలే ఇవాళ తెలంగాణ ప్రక్రియను చట్టసభల దాకా తీసుకొచ్చింది. ఆ చర్చే రేపో, మాపో తెలంగాణ కలను సాకారం చేస్తుంది. నిజంగానే తెలంగాణ వస్తే ఇక చర్చలతో పని ఉండదా? తెలంగాణ ఏర్పడగానే చెట్టుమీది కాయ దించినట్టు సమస్యలన్నీమాయమైపోతాయా? అవునని ఎవరైనా అంటే అది మభ్యపెట్టి మోసపుచ్చడమే అవుతుంది.

ఇప్పుడు చట్టసభల్లో చర్చ జరుగుతున్నది కేవలం భౌగోళికం గా ఆంధ్రవూపదేశ్‌ను విభజించడం కోసమే. ఈ చర్చ ఫలవంతమై పార్లమెంటు బిల్లును ఆమోదిస్తే భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. తెలంగాణకు సంబంధించి అసలు చర్చ అప్పుడు మొదలవుతుంది. కొత్త రాష్ట్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలు ఎలా ఉండబోతాయి, ఏ పునాదుల మీద నవ తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అన్న చర్చ కీలకం కాబోతుంది. ఇప్పటికే కేసీఆర్ తనదైన శైలిలో ఒక పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించి వున్నారు. ఆ ప్రణాళికలో కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు, ఇంకొందరు ప్రత్యామ్నాయం చూపించవచ్చు. మరికొందరు అసలు దాన్ని తాము ఒప్పుకోమనే అనవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరనేది ఇప్పుడే తెలియదు. కాబట్టి పాలకవర్గాల ఎజెం డా కాసేపు పక్కన పెడదాం. పైగా తెలంగాణ సాధన విషయంలో కుదిరిన ఏకాభివూపాయం పునర్నిర్మాణం విషయంలో కుదరకపోవచ్చు.

ఎవరి అభివూపాయాలు వారికి ఉంటాయి. ఇప్పటికే ప్రజాస్వామిక తెలంగాణ అలాగే సామాజిక తెలంగాణ మీద లోతైన చర్చే జరిగి వుంది. ఆ చర్చలు ఇప్పుడు మళ్ళీ ప్రధానం కానున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం మొదలవ్వాల్సిన మొదటి చర్చ కూడా అదే. అయితే అది పాలకవర్గాల సమస్య కాదు, ముమ్మాటికి అది ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, మేధావుల బాధ్య త. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలు ఇచ్చింది వాళ్ళే కాబట్టి. తెలంగాణ రాష్ట్ర సమితి మొదలు ఇంతకాలం ప్రజలతో మమేకమై ఉద్యమించిన రాజకీయపార్టీలు రేపు ఎలాగో పాలక వర్గాలుగా మారతాయి, అటువంటప్పుడు ప్రజలు, ప్రత్యామ్నాయ వేదికలు ఈ చర్చను బలంగా ముందుకు తేవాల్సిన అవసరం ఉంటుంది.


ఈ బాధ్యతను ముందుగా గుర్తించింది జమ్మికుం ట. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు అటువంటి చరి త్ర ఉంది. అక్కడి ప్రజలు, యువత అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. తెలంగాణ తొలి ఉద్యమంతో పాటు, నక్సల్‌బరీ ప్రభావంతో నూతన ప్రజాస్వామ్య విప్లవంకోసం కలలుగన్న అనేకమందిని నిలబెట్టిన ఊరు జమ్మికుంట. తెలంగాణ బిల్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం పొందగానే అక్క డి యువకులు, మేధావులు సంబరాలు చేసుకోలేదు, సమాలోచన మొదలుపెట్టారు. తెలంగాణ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేదికలో అక్కడి డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాత్రికేయులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ బిల్లును రాజకీయపక్షాల నుంచి పరిరక్షించుకోవడం మాత్రమే కాదు, రేపు రాబోయే తెలంగాణను ఎలా కాపాడుకోవాలో వాళ్ళు సదస్సు లు ఏర్పాటుచేసి చర్చ మొదలుపెట్టారు. రేపటి తెలంగాణ ఎవరిదీ, ఎవరికీ చెందాలి అన్న కీలక ప్రశ్నను సంధిస్తున్నారు. తెలంగాణ అందరిది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళే. కానీ తెలంగాణను దోచుకున్న వాళ్ళలో కేవలం సీమాంధ్ర స్వార్థపరులే లేర

స్వప్రయోజనాల కోసం ప్రజలను ఏమార్చే నేతలు మనదగ్గర కూడా ఉన్నారు. ఇక్కడి వనరులను అడ్డగోలుగా సొంతం చేసుకుని వాగులు, వంకలు మొదలు కొండలు గుట్టల దాకా అమ్మేసుకుంటున్న వాళ్ళు, తెలంగాణ మొత్తాన్ని గుత్తకు తీసుకున్నట్టు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్ళు, కులం పేరుతో పెత్తనం చేస్తున్న వాళ్ళు ఇట్లా అనేకమంది ప్రజలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నా రు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా రాజ్యం వీళ్ళ దే. అయితే ఎలా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. చర్చ ఇప్పుడు ఈ ప్రశ్న నుంచే మొదలవుతున్నది. తెలంగాణ పరిరక్షణ ఉద్యమం ఇప్పుడు పది జిల్లాల్లో కూడా మొదలు కావాలి. ఇలాంటి చర్చలకు విసుక్కుంటున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వినే వాళ్ళూ కూడా ఉంటారు.

[email protected]

179

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ