వృథా ప్రయాస!


Fri,January 3, 2014 01:17 AM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఆపేంత శక్తిమంతుడా! న్యాయంగా అయితే ఒక రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి అడ్డుకోవడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. అయినా సరే అడ్డు తగులుతున్నాడు. అడ్డదార్లు తొక్కుతున్నా డు. అడ్డు తొలగించుకోవాలని ఆరాటపడుతున్నా డు. యాభై ఏళ్ళకే, కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకుండానే ముఖ్యమంత్రి కాగాలిగిన ఆయన ఇప్పుడు మరో యాభై ఏళ్లకు రాజకీ య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అందు లో భాగంగానే ఆయన ఇప్పుడు తెలంగాణకు, తన కు కొత్త రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీకి అడ్డం తిరిగాడు. తాను కాంగ్రెస్ అధిష్ఠాన విధేయుడిని అని, ‘అమ్మ’ దయవల్లే ముఖ్యమంవూతిని కాగాలిగానని, పార్టీ వదిలి లేదని పదేపదే కిరణ్ చెపుతున్నారు. కానీ ఆయన దూకుడు గమనిస్తున్నవాళ్ళు మాత్రం ఆయన సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నాడని చెపుతున్నారు.

ఆపార్టీకి బలం పెంచుకోవడం కోసమే ఆయన ఇప్పుడు ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నాడని ఆయనను సన్నిహితంగా గమనిస్తున్నవాళ్ళు అంటున్నారు. రాజ్యాం గం మీద ప్రమాణంచేసి, మొత్తం ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా ఉన్న ఆయన ఇప్పుడు రాజ్యాంగ నియమాలకు నీళ్ళు వదలడమే కాదు వ్యక్తిగా నైతిక విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చా డు. ఇప్పుడు ఆయన పార్టీ సహచరులే చెపుతున్న ట్టు ఆయనలో ఒక నియంత కనిపిస్తున్నాడు. తాజా గా మంత్రి శ్రీధర్ బాబు విషయంలో ఆయన వ్యవహరించిన విధానం ఆయన మానసికస్థితిని తెలియజేస్తున్నది.


ఏ విలువకు, ఏ చట్టానికి, చివరకు ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండకుండా తన మాటే చెల్లుబాటు కావాలని హుకుం జారీ చేసే పాలకుడిని నియంత అనే అంటారు. తెలంగాణ విషయంలో ఆయన ముమ్మాటికి నియంతను మించి వ్యవహరిస్తున్నాడు. నియంతకు కూడా కొన్ని నియమాలుంటాయి. కొద్దోగొప్పో తనకంటూ ఒక సిద్ధాంత లక్ష్యం ఉంటుంది . ఈయనలో అలాంటివి కూడా కనిపించడం లేదు. కేవలం తెలంగాణ వ్యతిరేక స్వీయ మానసిక ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు సీమాంధ్ర ప్రశాంతంగా ఉన్నది. చాలామంది ప్రజలు వారికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులు ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి ఏమేం కావాలో రాష్ట్రం విడిపోయాక అక్కడికి ఎలాంటి వసతి సౌకర్యాలు తేవాలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పల్లంరాజు లాంటి మంత్రులు తమ ప్రాంతానికి ఏమేం కావాలో జీవోఎం నివేదికలో, తద్వారా ఆంధ్రవూపదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లులో పొందుపరచగలిగారు.
శాసనసభా వ్యవహారాలమంవూతిగా కిరణ్ శైలజానాథ్‌ను నియమించడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యం. ధర్మ విరుద్ధం. ఒకరకంగా ఇది దాదాగిరి. ఇది సభలో బిల్లును అడ్డుకోవడానికి పనికివస్తుందేమో కానీ తెలంగాణ ఏర్పాటును ఆపలేదు. ఇదొక వృథా ప్రయాస. తెలంగాణ తేలాల్సింది పార్లమెంటులో. బిల్లు వెళ్ళినా, ఆగినా పార్లమెంటు ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉంటే చాలు. దీనిగురించి ఆందోళనే అవసరం లేదు.

ఈ ముసాయిదా ద్వారా కేంద్ర ప్రభుత్వం సీమాం ధ్ర ప్రాంత అభివృద్ధికి అనూహ్యమైన ప్యాకేజీ ప్రతిపాదించింది. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఐఐటీ, ట్రిబుల్ ఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌లతో పాటు, కేంద్రీ య విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా వైద్య విద్యాశాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుకు వచ్చింది. అనేక పరిక్షిశమలు, రాయితీలు ప్రతిపాదించింది. ఇవన్నీ వచ్చే తొమ్మిది సంవత్సరాలల్లో పూర్తి కానున్నాయి. వీటిద్వారా ఎంత లేదన్నా కనీసం ఆరు లక్షలమంది చదువుకున్న నిరుద్యోగులకు రాబోయే పదేళ్ళలో శాశ్వత ఉపాధి దొరుకనుంది. కానీ కిరణ్‌రెడ్డి ఇప్పు డు తన ఉపాధి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా సీమాంధ్ర నేతలంతా పార్టీ ఆదేశాలు శిరసావహిస్తామని అంటుంటే ఈయన మాత్రం మానసికంగా అధిష్ఠానవర్గంతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దానికొక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. శాసనసభలో తెలంగాణ బిల్లు తేల్చకుండా రాజ్యాంగాన్ని రచ్చచేసి తీరాలన్న వ్యూహంతో ఉన్నాడు. అందు లో భాగంగానే ఆయన శ్రీధర్ బాబును తన లక్ష్యం చేసుకున్నాడు.

ఆయనను శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించారు.
తెలంగాణ బిడ్డలు ఎవరైనా ఏదో ఒక దశలో తమ నిబద్ధతను నిరూపించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం, అందులో ప్రజలు చేసిన త్యాగాలు ఎలాంటి వారినైనా మార్చివేస్తున్నాయి.నిన్నటిదాకా ప్రజలను, వారి ఆకాంక్షలను గౌరవించడం లేదని విమర్శలకు గురైన శ్రీధర్‌బాబు శాసనసభలో సభా వ్యవహారాలమంవూతిగా ధర్మంవైపు నిలబడ్డారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం, సభా సాంప్రదాయా ల ప్రకారం నడుచుకుని న్యాయంవైపు నిలబడ్డారు. ఇది ఇద్దరు మిత్రుల కుట్ర అని కొందరు అంటున్నప్పటికీ, అదే కిరణ్‌కు కోపం తెప్పించింది. ఇంకేముంది! ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. ఆ బాధ్యతలు సీమాంధ్ర జేఏసీ మిలిటెంటు నాయకుడు సాకే శైలజానాథ్‌కు అప్పగించారు. శ్రీధర్‌బాబు తెలంగాణ కోరుకున్నాడేమో కానీ ఒక ప్రాం తీయవాదిగా ఎప్పుడూ లేరు. ఆయన ఏనాడు శాస న సభలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కోసం కనీసం లేచికూడా నిలబడలేదు. బహుశా ఆయన తన రాజ్యాంగ ధర్మానికి కట్టుబడి ఉన్నాడో లేక తన చిరకాల మిత్రుడు కిరణ్‌ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడేమో.. కానీ ఆయన సభలో తెలంగాణవాదిగా ఏనాడూ లేరు. కానీ శైలజానాథ్ అలా కాదు. ఆయన మొదటి నుంచీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆర్టికల్ 3 చెల్లదని వాదించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును చిత్తు కాగితంగా చూడడమే కాదు, శ్రీధర్‌బాబు రాష్ట్రపతి ఆదేశాలు పాటిం చి బిల్లుసభలో పెడితే దానిని అడ్డుకోవడానికి అరిచి గీపెట్టారు.

బయటకువచ్చి సభలో బిల్లు చర్చకు రానీయనని శపథం చేశారు. అటువంటి పనిచేసి సభా నియమాలు తుంగలో తొక్కి అవమానించినందుకు ఆయనను సభ నుంచి బహిష్కరించాల్సిం ది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాల్సింది. కానీ ఇప్పుడు అదే సభావ్యవహారాలమంవూతిగా కిర ణ్ శైలజానాథ్‌ను నియమించడం ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యం. ధర్మ విరుద్ధం. ఒకరకంగా ఇది దాదాగిరి. ఇది సభలో బిల్లును అడ్డుకోవడాని కి పనికివస్తుందేమో కానీ తెలంగాణ ఏర్పాటును ఆపలేదు. ఇదొక వృథా ప్రయాస. తెలంగాణ తేలాల్సింది పార్లమెంటులో. బిల్లు వెళ్ళినా, ఆగినా పార్లమెంటు ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉంటే చాలు. దీనిగురించి ఆందోళనే అవసరం లేదు.
ghantapatham@gmail.com

393

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ