రజాకార్లు వస్తున్నరు..జర భద్రం..!


Mon,September 19, 2011 11:09 PM

మనలో చాలా మందిమి రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలంతా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి భూస్వామ్యానికి సమాధి కడుతున్న రోజుల్లో నిజాం రాజు రంగంలోకి దింపిన కిరాయి మూకలే రజాకార్లు. రజాకార్లు స్థానిక దొరలూ, భూస్వాముల అండతో గ్రామాల మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను హేయమైన పద్ధతిలో హింసించారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేశారు. రజాకార్ల ఆకృత్యాలు మనల్ని అరవయ్యేళ్ళుగా భయం కర పీడకలగా బాధిస్తూనే ఉన్నాయి. కొందరు రజాకార్లకు మతం రంగు పులిమారు గానీ రజాకార్లు అప్పుడు చేసింది మతపరమైన దాడులు కాదు. ప్రజ ల పోరాటాన్ని అణచి వేయడానికి రాజ్యం చేసిన కుట్రలో రజాకార్లు పావులుగా ఉపయోగపడ్డారు.

అంతగా సైనిక బలం లేని నిజాం రాజు బ్రిటీష్ పాలకులతో, భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో, అప్పటి హైదరాబాద్ ప్రధాని లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్‌కు ఇటు హైదరాబాద్ పాలకులకు కంటిలో నలుసులా తయారవుతున్న కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని అంతంచేసి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని ఈ స్వయంసేవకులను సృష్టించాడు. దానికి అప్పుడు మజ్లిస్ పార్టీ (ఎం ఐఎం) నాయకుడుగా ఉన్న ఖాసిం రజ్వీనీ ఎంచుకున్నాడు. ఖాసిం రజ్వీ అప్పటికే పేరున్న వక్త, న్యాయవాది. ఉత్తరవూపదేశ్ నుంచి అప్పటి నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న లాతూర్‌కు వలస వచ్చి న ముస్లిం ఛాందసుల్లో ఆయనొకడు. ఖాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్‌ను రక్షించడానికి మొదలైన రజాకార్ల ఉద్యమం తరువాత ఒక రాక్షస మూకగా మారింది. ముఖ్యంగా అప్పటికే ప్రజా ఉద్యమానికి వణికి పోతున్న దొరలూ, దేశ్ ముఖ్‌లు తమ అనుచరులు, తమకు నమ్మిన బంట్లను కూడా రజాకార్ల పేరుతో రంగంలోకి దింపి ప్రజలను తమకు విధేయులుగా మార్చుకోవడానికి గ్రామాలలో భయోత్పాతం సృష్టించారు. అందులో కేవలం ముస్లింలే కాదు హిందూ మతానికి చెందిన వాళ్ళు చాలా మంది కిరాయి సైనికుల్లా పనిచేశారు.
ఆ చరివూతంతా కథలు కథలుగా మనం చదువుతూనే ఉన్నాం. ఇప్పుడైతే సమైక్యవాదులు ఆ రజాకార్లను ఉటంకిస్తూ మొత్తం తెలంగాణ చరివూతనే మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ళ పాటు కొనసాగిన ఈ దాష్టీకం పోలీసు చర్యతో ముగిసింది అనుకున్నాం. కానీ అది ఉట్టి భ్రమేనన్నది తెలంగాణలోని ఉద్యమ కారులకు అనుభవంలోకి వస్తున్నది. సైనిక చర్య వల్ల మనం భారత దేశంలో భాగం అయ్యాం తప్ప మన పరిపాలన మనకు రాలేదన్న విషయం మనకు పదే పదే రుజువవుతూ వస్తున్నది. ఖాసిం రజ్వీ చరిత్ర ముగిసిపోయి ఉండవచ్చు. కానీ అరవయ్యేళ్ళ చరివూతలో అనేకమంది రజ్వీలు పుట్టుకొచ్చారు. రకరకాల వేషాల్లో రజాకార్లు ఇప్పటికీ ప్రజల్ని, ఉద్యమకారుల్ని తరుముతూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ పాలకులు నిజాం రాజుకంటే బూజు పట్టిన ఆలోచనలు ఉన్నవాళ్ళని అర్థమౌతోంది. అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పుకోసం పనిచేసే పోలీసులు రజాకార్ల కంటే దుర్మార్గంగా ప్రవర్తించగలరని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ఇప్పుడు సకల జనుల సమ్మెను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తోన్న పద్ధతులతో అది మరోసారి నిరూపితం అవుతోంది.

సకల జనుల సమ్మె భేరి ఇవాళ పాలకవర్గాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. వారం రోజులుగా సమ్మెకు నాయకత్వం వహిస్తోన్న ఉద్యోగులు ప్రభుత్వ పాలనను పూర్తిగా స్తంభింపజేసి ప్రజలను సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం చేశారు. దీనికి సింగరేణి బొగ్గు గనికార్మికులు నిప్పును రాజేసి హైదరాబాద్‌లోని పాలకులకు సెగ తగిలేలా చేశారు. ఒక్క వారం రోజుల్లోనే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించే శక్తిలేని పాలకులు ఇప్పుడు బలవూపయోగం చేయాలని చూస్తున్నారు. సమ్మె విరమించినట్టు కరపవూతాలు పంచడం, కార్మికులను బెదిరించి పనిచేయించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడంతో పాటు వాళ్ళ ఇళ్ళల్లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, పెళ్ళిళ్ళు కాకుండా చేస్తామనడం, జేఏసీ నాయకుల మీద జేఏసీల పేర్లతో ఉన్న కిరాయి మనుషులతో దాడులు చేయించడం ఇవన్నీ రజాకార్లు చేసిన పనులను పోలి ఉన్న వే. సమ్మె ఉధృతి పెరిగిన కొద్దీ పాలక వర్గం ఇలాంటి రజాకార్లను ఇంటింటికీ పంపే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది.

రెండేళ్లుగా పోరాడుతున్న ప్రజానీకానికి తమ సమ్మె ఉత్తేజాన్నివ్వాలని, చలనం లేని రాజకీయ వ్యవస్థను ఒక కుదుపు కుదపడానికి ఇది తోడ్పడుతుందనీ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న తాము సమ్మె చేసి సకల జనుల తరఫున ఆ పాలక వర్గాన్ని నిలదీయడం అవసరమని ఉద్యోగులు భావించారు. ఈ సమ్మె నిర్ణయం వెనుక సామాజిక స్పృహతో కూడిన సమరశీల చైతన్యం ఉంది. ఈ స్పృహ సాధారణ ఉద్యోగులకు, కార్మికులకు ఉండడం వాళ్ళ వివేకానికి తార్కాణం. రెండేళ్లుగా గొంతు దాటని మౌన వేదనకు ఇప్పుడు సమ్మె ఒక మార్గాన్వేషణ చేస్తున్నది. ఆ వర్గాల్లో సింగరేణి కార్మికులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సింగరేణి ఒక ఫ్యూడల్ సంస్థానంలా ఉంటుంది. సింగరేణి కార్మికులంటే మొత్తం కార్మిక రంగంలోనే అత్యంత అణగారిన వర్గం. నూటికి తొంభై మంది తమ జీవితాల్లో దోపిడీని వారసత్వంగా అనుభవించి, అవకాశాలు లేక చదువుకు దూరమైన వాళ్ళు, అందులో అత్యధికంగా దళిత, బహుజన పీడిత కుటుంబాల వాళ్ళే అక్కడ కార్మికులుగా ఉంటారు. అక్కడ పనిచేసే అధికారులలో అత్యధికులు ఆంధ్ర ప్రాంత చదువరులు. వాళ్ళు సింగరేణిలో దొరలుగా చలామణి అవుతుంటారు. వాళ్ళను నిన్న, మొన్నటి దాకా కార్మికులంతా దొరా అనే పిలిచే వాళ్ళు. దొరల్లాగే వాళ్ళూ కార్మికులతో నానా చాకి రీ చేయించుకుంటారు. ఇది 1980 దశకం దాకా కొనసాగింది. అప్పటి దాకా రాజ్యమేలిన విశాలాంధ్ర కార్మిక సంఘాలు కార్మికుల హక్కులకంటే యాజమాన్యాలు, అధికారుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యంఇచ్చేవి.

ఇలాంటి దశలో వేలాదిగా సింగరేణిలో చేరిన తెలంగాణ యువత కొత్త కొత్త కార్మిక సంఘాలతో మమేకమై ఒక దశాబ్ద కాలంలోనే అక్కడి పని పరిస్థితులను, సంస్కృతిని సమూలంగా మార్చివేసింది. ఆకాలంలో కార్మికులకు సమ్మె ఒక తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడింది. ముఖ్యంగా 1986-90 మధ్య కాలంలో సగటున ఏడాదికి వందకు పైగా సమ్మెలు జరిగాయి. ఒక్క 1989 - 1990 లోనే వరుసగా నెలల తరబడి సమ్మెలతో దొరతనాన్ని అణచివేసి సింగరేణిలో కొత్తతరహా పారిక్షిశామిక సంస్కృతిని నెలకొల్పిన ఘనత అక్కడి కార్మికులది. ఇప్పుడు సింగరేణి కార్మికులు అదే సమ్మెటతో ప్రభుత్వం దిమ్మదిరిగేలా చేస్తున్నారు. ఒక్క వారంలోనే వేల కోట్ల రూపాయలు నష్ట పరచడ మే కాక మొత్తం దక్షిణ భారతాన్నే చిమ్మ చీకటి చవిచూసే విధంగా చేశారు. ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి దొడ్డి దారిన వేరే రాష్ట్రాల నుంచి బొగ్గు తెప్పించుకుంటోంది. ప్రభుత్వం ఇప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలేవీ వెతుకుతున్నట్టు లేదు. బెట్టుగా వ్యవహరించడమే కాక ఇప్పుడు సింగరేణిలో కార్మికుల మీదికి సరికొత్త రజాకార్లను పంపుతోంది. ఇళ్లల్లోంచి కార్మికులను లాక్కెళ్ళి బొగ్గు తవ్వమని బావుల్లోకి తోస్తున్నారు. ఇంటికి కూడా వెళ్ళకుండా కార్మికులను గనుల దగ్గరే నివాసముండి పోలీసుల ఎస్కార్టుతో పని చేయాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి నిర్బంధకాండ సింగరేణి కార్మికులకు కొత్త కాదు. చరిత్ర పొడుగునా వాళ్ళు ఇటువంటి నిర్బంధాలను చాలానే చూశారు.

నరక కూపాల్లాంటి బొగ్గు బావుల్లో తాము పనిచేయలేమని కార్మికులు పారిపోయినప్పుడు ప్రతి గని దగ్గర ఒక సారా దుకాణం తెరిచి ‘ఫుల్లు’గా తాగించి పనిలోకి దించిన ఘనత సింగరేణి యాజమాన్యానిది. అసలు తాగడమే తమ దరివూదానికి కారణమని, తాము మద్యం ముట్టమని చెప్పి తమ ప్రాంతంలో మధ్య నిషేధం అమలు చేసుకున్నప్పుడు పోలీసు ఠాణాలనే సారా కొట్లుగా మార్చి తుపాకీతో బెదిరించి మరీ తాగించిన అనుభవం కూడా ఉన్నది వాళ్ల కు. ఒకానొక కాలంలో తీవ్రమైన అణచివేతనూ, నిర్బంధాన్ని, ఎన్‌కౌంట ర్‌లనూ ఎదుర్కొని ఒక నూతన ప్రజాస్వామిక సమాజం కోసం కలలుగన్న నాయకత్వం ఆ బొగ్గు గనుల నుంచే పుట్టింది. ఇవ్వాళ సింగరేణిలో పోరాడుతున్నది ఏ ఒక్క కార్మిక సంఘమో కాదు. తెలంగాణ కోసం సంఘటితమైన యావత్ కార్మిక శక్తి. రాజకీయంగా వాళ్ళల్లో సీపీఎంతో సహా అన్ని పార్టీలు ఉండొచ్చు. ఆ పార్టీల నిర్ణయాల ప్రమేయం లేకుండా ఇవాళ వాళ్ళం తా ప్రజల పక్షాన నిలబడడం వాళ్ళ పరిణతికి నిదర్శనం. ఇప్పుడు రవాణా ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. పన్నుల వసూళ్లు ఆగిపోయాయి. ఇలా డబ్బు వసూలు దారులన్నీ మూసివేస్తే ఈ ప్రభుత్వం నిలబడడమే కష్టం. ఇవాళ సకల జనుల సమ్మె ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు.


నిరంతర ప్రజాఉద్యమం ఈ ప్రాంతం లో రెండేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రజల్లో భాగంగా ఉద్యోగులూ గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతూనే వచ్చారు. ధర్నాలు, హర్తాళ్లు చివరకు సహాయ నిరాకరణ కూడా చేసి హెచ్చరించి చూశా రు. అయినా ప్రభుత్వం స్పందించకపోగా కాలయాపనకు పూనుకుంటోంది. అసలీ రాష్ర్టంలో ఏ సమస్యా లేనట్టుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి స్థితిలో బుద్ధి జీవులకు సమ్మె మినహా మరో మార్గం ఏముంటుంది? ఉద్యోగులు దీన్నొక చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించారు. రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమం తన అమ్ముల పొదిలోని అన్ని ఆయుధాలను వాడేసింది. అనేక సృజనాత్మక పోరాటాలనుకూడా సృష్టించగలిగింది. ఆట, పాటలతో మొదలుపెట్టి అనేక వైవిధ్యమైన రూపాలలో ప్రజలు తమ ఆకాంక్షను తెలుపుతూనే వస్తున్నారు. ప్రజల ఆకాంక్ష న్యాయమైనదని, అది నెరవేరుస్తున్నామని ఒక్క రూ రెండేళ్లుగా ప్రజలవైపు తిరిగి చూడ సరికదా!ఆ ప్రజల ఆర్తనాదాల ను వినలేకపోతున్నారు. పైగా అణచివేతకు అన్ని పద్ధతులనూ వాడుతున్నా రు. ఇలాంటి పాలకులకు జ్ఞానోదయం కలిగించాలంటే ప్రజలకు తెలిసినవి రెండే రెండు మార్గాలు. ఒకటి ప్రజాస్వామికంగా పోరాడి గెలవడం, రెండోది తిరగబడి అట్లాంటి ప్రభుత్వాలను కుప్ప కూల్చడం.

పాలకులు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాన్ని వదలకపోవడం గమనార్హం. ప్రభుత్వం దాన్ని తెలంగాణ ఉద్యమబలంగా కాకుండా, చేతగాని తనమని అనుకుంటున్నట్టుంది. అందుకే ప్రజలను భయపెట్టి, వినకపొతే హింసలకు గురిచేసైనా సరే ఉద్యమాన్ని నీరుగార్చే పథకాలను సిద్ధం చేసుకున్నట్టు అర్థమౌతోంది. సమ్మెలు ఎవరు చేసినా వాళ్ళతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చడం ప్రభు త్వ బాధ్యత. ముఖ్యమంవూతికి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి చేయాలి తప్ప ఆ పని చేస్తున్న ఉద్యోగులనో, కార్మికులనో బెదిరించడం కాదు.


నిజాం కాలంలో ఇప్పుడున్నన్ని హక్కులు లేవు. ఇలాంటి రాజ్యాంగమేదీ లేదు. రాచరికపు వారసత్వంతో సాగిన సాంప్రదాయ పాలన అది. ఇవాళ పరిస్థితి అదికాదు. సమస్య అంతా మన కాంగ్రెస్ నాయకులకు ఆ స్పృహ లేకపోవడమే. తెలంగాణ ఇస్తామని చెప్పినందు వల్లనే ప్రజలు ఓట్లు వేశార ని, తాము ప్రజల బలంతోనే గెలిచామని వాళ్ళు మరిచిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. వాళ్ళు నిజంగానే ఆత్మ గలవారైతే ప్రజలను మోసం చేస్తో న్న ప్రభుత్వాన్ని కూల్చేవారు. కానీ వాళ్ళు తాయిలాలకు,తాకట్టుకు అలవాటు పడ్డారు. అప్పుడు దొరలూ, దేశ్‌ముఖ్‌లు నిజాంనవాబ్‌కు జీ హుజూర్ అన్నట్టే, మన మంత్రులు ముఖ్యమంవూతికి జై కొడుతూ ఉద్యమకారులని పోలీసులకు పట్టిస్తున్నారు. అడ్డు చెప్పిన వాళ్ళను ఆడ పిల్లలని కూడా చూడకుండా రౌడీలతో కొట్టిస్తున్నారు. అప్పుడు రజాకార్లను దొరలు వాడుకున్న ఇప్పుడు పోలీసులను వాడుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా అధికారం లో ఉన్నవాళ్ళు ఆ అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న వాళ్ళు ఎలాగూ మాట్లాడరు. వాళ్ళను కదిలించాలంటే ముందుగా ప్రజలు కదలాలి. సమ్మె చేస్తున్నవాళ్లకు సమాంతరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇవాళ సమ్మెకు మద్దతుగా ఉన్న పార్టీలు హైదరాబాద్ వదిలిపెట్టి సమ్మె ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళాలి. అది సమ్మెలో ఉన్నవారికి ఆత్మస్థెర్యాన్ని నింపుతుంది. ఇప్పు డు కుడి ఎడమల తేడా లేదు. బీజేపీ కూడా నక్సలైట్ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పింది.

గత రెండేళ్లుగా జేఏసీలో అంద రూ భాగస్వాములుగా ఉన్నారు. సీపీఐ పూర్తిస్థాయిలో జేఏసీలో లేకున్నా ఉద్యమాన్ని ముందుకు తీసుకు ది. కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కేసీఆర్ ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. వీళ్ళంతా సమ్మె జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కార్మికులతోకలిసి సమ్మెలో పాల్గొనాలి. ఇవాళ ఇంకా జాతీయ స్థాయిలో చలనం రాకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి-ఉద్యమం స్థానికంగా పరిమతమైపోవడం, రెండోది-జాతీయస్థాయిలో ఎవ రూ దీనిపై మాట్లాడకపోవడం. పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం వేరు. తెలంగాణ ప్రజలపట,్ల ఉద్యమం పట్ల తపనతో తాము కూడా అందులో భాగమని చెప్పడం వేరు. గడిచిన వారం రోజుల్లో బీజేపీతో సహా ఏ ఒక్క పార్టీ ఢిల్లీలో దీన్నొక అంశం చేయక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మిగతా పార్టీలకు ఢిల్లీ జేఏసీ కి కూడా వర్తిస్తుంది. జాతీయ పార్టీలకు నిజమైన ప్రేమే ఉంటే అన్ని రాష్ట్రాల్లో కనీసం ఒక్క రోజైనా నిరసన తెలిపేవారు. కనీసం ఢిల్లీలోనైనా మీడియాతో మాట్లాడే వాళ్ళు. సద్భావన సభలో, సంఘీభావ ర్యాలీలో చేసేవాళ్ళు. ఇది బీజేపీ అలాగే సీపీఐ లాంటి పార్టీలు పూనుకుంటే తప్ప సాధ్యమయ్యే పనికాదు. ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగం. ఇలా విననప్పుడు ప్రజలు మిగిలి వున్న మరో మార్గంవైపు పోయే ప్రమాదం ఉంది. హింసాయుత తిరుగు బాటు ఒక్క మిగిలి ఉన్న మార్గం. అది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం ఎంతమాత్రం కాదు. విచివూతమేమిటంటే ఇవాళ పెద్దపెద్ద మాటలు చెప్పే వాళ్ళు న్యాయమూర్తులైనా, మీడియా అయినా, పాలకవర్గాల్లో ఎవరైనా అల్లరికి అలజడికి స్పందించినంతగా శాంతి సహనాలకు స్పందించడం లేదు. అస్సాంలోనో, కాశ్మీర్‌లోనో ఒక దుకాణం తగలబడిందని, రాజస్థాన్‌లో గుజ్జర్లు ఒక రోడ్‌ను, రైలు మార్గా న్ని ఆపారన్న వార్తలను దేశమంతా ప్రచారం చేసి ఒత్తిడి పెంచే జాతీయ మీడియా తెలంగాణలో రెండు సంవత్సరాలుగా నిరీక్షించిన ప్రజలు ప్రభు త్వం పై తిరుగుబాటు చేశారని, ఇక్కడ సకల జనులు సమ్మెకు దిగారని ఒక్క ముక్కయినా చెప్పలేకపోతున్నాయి. ఇలా మెలకువలో ఉండి నిద్ర నటించే వాళ్ళు, మొద్దు నిద్రలో ఉండి మెలకువతో ఉన్నట్టు మోసం చేస్తున్న వాళ్ళు ఉలిక్కి పడి లేచే విధంగా ప్రజలే ఈ సమ్మెను ఒక కొత్త మలుపు తిప్పాల్సిన అవసరం ఉంది. అది వెంటనే జరగక పొతే సీమాంధ్ర రజాకార్లు రెచ్చిపోయే ప్రమాదమూ పొంచి ఉంది.

పొ. ఘంటా చక్రపాణి
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి

Published: Fri,January 10, 2014 02:12 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 10, 2014 02:11 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 3, 2014 01:17 AM

వృథా ప్రయాస!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఆపేంత శక్తిమంతుడా! న్యాయంగా అయితే ఒక రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి అడ్డుకోవడం సాధ్యం కాదని ఆ

Published: Fri,December 27, 2013 03:02 AM

ఉద్యమాలే ఊపిరిగా..

చరివూతలో మనం అనేకమంది ఉపాధ్యాయులను చూసి, విని ఉండవచ్చు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని పలు సందర్భాల్లో మనకు తారసపడిన ఉపాధ్యాయులను

Published: Fri,March 1, 2013 12:05 AM

తెలంగాణమీది నిఘా టెర్రరిజంమీద ఏది?

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు మొత్తం దేశాన్నివణికించాయి. ఇది హైదరాబాద్ నగరానికి ఊహించని పెను విషాదం. మరణించిన వారిలో అంతా సామాన్యు

Published: Thu,February 21, 2013 10:50 PM

బాలచంవూదుడికి బాసట కాలేమా!

బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్న

Published: Thu,January 31, 2013 11:35 PM

ముమ్మాటికీ మూడు తరాల మోసం

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. నమ్మించి మోసం చేయడం ఆ పార్టీ నైజం. నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని యూపీఏ ప్రభుత్

Published: Thu,January 17, 2013 11:28 PM

కాంగ్రెస్‌ను నమ్మగలమా !?

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా? కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే సమయం దగ్గరపడుతున్నకొద్దీ సీమాంధ్ర మంత్రులు, రాజకీయ నా

Published: Thu,December 20, 2012 11:09 PM

నేరమే అధికారమయితే..!

క ళ్ళకు గంతలతో ఉండే న్యాయదేవత ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా దేనికీ ప్రభావితం కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా తీర్పు చెపుతుందని ఒక వ

Published: Thu,December 6, 2012 10:33 PM

ప్రజలు ప్రేక్షకులు కావొద్దు..!

అఖిలపక్ష భేటీకి ముందుగానే పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అ

Published: Thu,November 22, 2012 11:53 PM

చుప్..నోరు మూసుకుని బతకండి!

మీకు ఈ ‘ఘంటాపథం’ నచ్చితే మౌనంగానే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను ఫేస్‌బుక్‌

Published: Thu,November 15, 2012 11:10 PM

పాపం పురోహితులు...

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మ

Published: Fri,November 2, 2012 12:41 AM

చర్చలు జరపాల్సింది ఎవరితో?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావును చాలామంది కీలెరిగి వాతలుపెట్టే నేతగా పేర్కొంటారు. ఆయన వర్తమాన రాజకీయాలలో ఆరి

Published: Fri,October 19, 2012 03:06 PM

ఎనిమిదో చాప్టరే ఇప్పడు శాసనం !

చాలారోజుల కిందట సినీ నటుడు చిరంజీవి గారింట్లో ఆయన పెద్దకూతురు నిశ్చితార్థం జరిగింది. ఆయన ఆ కార్యక్షికమాన్ని తన ఇంటివరకే పరిమితం చే

Published: Fri,October 5, 2012 12:34 AM

ఈజిప్ట్‌ను తలదన్నిన మార్చ్

మేం ముందుగా చెప్పినట్టే మా మాటమీద నిలబడి ఉంటాం. మేం గడిచిన అరవై ఏళ్ళుగా మా తల్లి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన విద్యార్థులం.

Published: Thu,September 20, 2012 11:33 PM

తెలంగాణ మార్చ్‌ను ఏమార్చే కుట్ర !

తెలంగాణ మార్చ్ శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం పదేపదే చెపుతున్నా ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా మార్చ్‌క

Published: Fri,September 14, 2012 02:15 AM

సెప్టెంబర్ -17 ముందూ వెనకా...

సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్

Published: Thu,September 6, 2012 11:45 PM

తెలంగాణ: ఒక అనివార్యత

చాలా రోజుల స్తబ్దత తరువాత మళ్ళీ తెలంగాణలో కదలిక కనిపిస్తోం ది. తెలంగాణ జిల్లాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఢిల్లీలో భారతీయ జనతాపా

Published: Thu,August 30, 2012 11:14 PM

‘సర్వే’జనా సుఖినోభవంతు..!

నూటికి ఎనభై ఆరు మంది తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఎన్డీ టీవీ సర్వే తేల్చింది. ఈ వార్త విని చాలామంది సంతోష

Published: Fri,August 17, 2012 12:13 AM

బడుగుల నెత్తిన పిడుగులు !

ధర్మాన ప్రసాదరావు బీసీ అయినందువల్లే ఆయనమీద నేరాభియో గం మోపారా? ఇది బీసీలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమా? దీని వెనుక కుట్ర కోణ

Published: Thu,August 9, 2012 11:52 PM

సిగ్నల్ సిండ్రోమ్!

తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది.

Published: Sat,August 4, 2012 01:00 AM

ఒక బాబు.. రెండు కళ్లు.. మూడు రంగులు

ఆ మధ్య ఊసర పేరుతో ఒక సినిమా వచ్చినప్పుడు ఇదేం పేరని అనుకున్నా! అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఊసర చాలా అరుదైన కీటకం. పరిస్థితిని బట్

Published: Thu,August 9, 2012 08:45 PM

డబుల్ బారెల్ జ‘గన్’!

సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందు గా తెలంగాణ లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణవాదులంతా కృతజ్ఞతలు

Published: Thu,July 5, 2012 11:45 PM

రాయల తెలంగాణ రాగం వెనుక..?!

ఈసారి నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగ

Published: Fri,June 29, 2012 12:02 AM

అన్నీ డమ్మీ తుపాకులే సార్..!

ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ

Published: Fri,June 22, 2012 12:09 AM

జయశంకర్ సర్‌తో కరచాలనం!

ఆంధ్రుల దినపత్రికలను పెట్టుబడికీ కట్టుకథకు పుట్టిన విష పుత్రికలుగా శ్రీ శ్రీ అభివర్ణించారు. ఆంధ్రుల పత్రికలు గోరంతలు కొండంతలు చేస

Published: Fri,June 15, 2012 12:01 AM

జయశంకర్ స్ఫూర్తిని మరిచిపోయామా!

జ యశంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరు గౌరీశంకర్ ‘తెలంగాణ జాతిపిత సర్ జయశంకర్’ పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడు

Published: Fri,June 1, 2012 12:46 AM

దేవుడు చేసిన మనుషులు!

దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మేవాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు లేడని నిర్ధారించుకున్నాక ఆ చర్చకు కాలం

Published: Fri,August 31, 2012 07:12 PM

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. వాన్‌పిక్ పేరుతో వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిన

Published: Fri,May 11, 2012 12:52 AM

తెలంగాణ గళంలో కాషాయ గరళం!

బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ య

Published: Fri,April 27, 2012 12:21 AM

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ

ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరి

Published: Fri,April 13, 2012 12:29 AM

తెలంగాణకు కొత్త ఫేస్‌బుక్ కావాలి!

మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు’. ఇది తెలంగాణ విద్యార్థులకు

Published: Fri,April 6, 2012 12:11 AM

బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడదాం!

తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల అగ్గి ఎందుకు రాజుకుందో కానీ అదిప్పుడు అందరినీ కలచివేస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట ఎవ రో ఒకరు ఆత్మహత్యకు ఆ

Published: Thu,March 29, 2012 11:02 PM

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!

వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు.

Published: Thu,March 8, 2012 11:57 PM

ఈ విరామం ఇక చాలు...

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడ

Published: Fri,February 17, 2012 01:40 AM

అధ్యక్షా ! మన్నించండి...

శాసనసభ స్పీకర్ ఎవరు? ఎవరైనా నాదెండ్ల మనోహర్ అనే చెపుతారు. అది నిజమే! కానీ శాసన సభలో గందరగోళం గమనిస్తున్న వారికి అలా అనిపించడం ల

Published: Fri,February 10, 2012 12:03 AM

అవినీతి ఆచార్యులు

హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసిన ఖులీ కుతుబ్ షా పేరున ఆయన చనిపోయి నాలుగు శతాబ్దాలు దాటినా ఒక్క స్మారక చిహ్నం కూడా లేదు. కానీ బ

Published: Fri,February 3, 2012 01:37 AM

కోస్తాలో కుల ‘కరివేకాపులు’!

కోస్తా జిల్లాల్లో రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సందర్భంగా తెలంగాణ సమాజం స్పందించి న తీరు అభినందనీయం.

Published: Thu,January 19, 2012 11:25 PM

తెలంగాణలో పత్తి గత్తర!

సంక్రాంతిని రైతుల పండుగ అంటారు. కొత ్తపంటలతో రైతుల లోగి ళ్ళు కళకళలాడినప్పుడు చేసుకునే పండుగ అది. సంక్రాంతి సందర్భంగా సీమాంధ్రలో జర

Published: Thu,January 12, 2012 11:35 PM

విజయం కాదు.. వైఫల్యం!

రా జకీయాలు రణరంగం కంటే ప్రమాదకరం అంటారు చర్చిల్. చర్చి ల్ రాజకీయ అభివూపాయలతో మనకు ఏకాభివూపాయం ఉన్నా ,లేకున్నా బ్రిటీష్ పాలకుడిగా ఆ

Published: Fri,January 6, 2012 12:02 AM

మనుషులా? మృగాలా!?

ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సౌమ్యుడుగా కనిపిస్తారో అంతటి రాజకీయ చతురుడు. ప్రజల ఒత్తిడో, తెలంగాణ సాధన లక్ష్యమో

Published: Fri,December 30, 2011 12:44 AM

బాబు వెడలె రభసకు..

శనీశ్వరుడి మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నేను అలాంటివేమీ నమ్మను గానీ నమ్మిన వారి విశ్వాసాలు గౌరవిస్తాను. శని చాలా ప్రభావశీలి అన

Published: Thu,December 22, 2011 11:29 PM

మౌపమే మారణాయుధం!

మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ

Published: Fri,December 9, 2011 12:13 AM

‘రాజ’ద్రోహానికి రెండేళ్ళు!

కావూరి సాంబశివరావును తెలంగాణ కు విలన్ అని చాలామంది అనుకుంటారు. కానీ తెలంగాణ నేతల గుణగణాలు ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవని అన

Published: Thu,December 1, 2011 11:50 PM

తెలంగాణ తొలిపొద్దు..

ఇంట్నట్ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పే జీకి తీసుకెళ్తుంది

Published: Fri,November 25, 2011 12:00 AM

ఇద్దరూ దోచింది తెలంగాణనే!

నవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలం

Published: Thu,November 17, 2011 11:58 PM

పెనం వేడయ్యేదాకా వంట ’చెరుకు’ ను కాపాడాలి..!!

దాదాపు ఆరు నెలల క్రితం ‘టీ న్యూస్’ ఛానల్ లో ఉద్యమ తీరు తెన్నుల మీద ఒక చర్చ జరిగింది. నాతోపాటు ఆ చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి ఫైర్

Published: Thu,November 10, 2011 11:06 PM

నాయకులకు ఇది పరీక్షా సమయం!

తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చలేమని ఢిల్లీ పెద్దలకు అర్థమయిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఏదో ఒక ప్రకటన రావొచ్చనీ అంటున్నారు.

Published: Thu,October 27, 2011 11:46 PM

విద్రోహ పార్టీలకు బుద్ధి చెప్పాలె

దీపావళిలోగా తెలంగాణ పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కబుర్లు నమ్మిన వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దీపావళి

Published: Sun,October 23, 2011 01:38 PM

కాంగ్రెస్ లక్ష్యంగానే కార్యాచరణ

ప్రభుత్వోద్యోగులు భద్ర జీవులని చాలామంది అనుకుంటారు. ఉద్యో గం ఉంటే కడుపులో చల్ల కదలకుంటా పనిచేసుకోవచ్చని, నెలతిరిగే సరికి జీతం వస్త

Published: Mon,October 10, 2011 11:22 PM

కాలం వంతెన పై కవాతు..!

మీకు కోదాటి సుధీర్ గురించి చెప్పాలి. ప్రస్తుతం కెనడా రాజధాని ఒట్టా వాలో నివసిస్తోన్న సుధీర్ కొన్నేళ్లుగా తెలంగాణ కోసం తపస్సు చే

Published: Mon,September 26, 2011 11:06 PM

ఇపుడొక కొత్త ఆయుధం కావాలి..!

ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబోతోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంల

Published: Tue,September 13, 2011 12:05 AM

సమ్మె దెబ్బకు దిమ్మ తిరగాలి..

అమెరికాలో బోస్టన్ నగరంలో వెంకట్ మారోజు అనే మిత్రుడున్నాడు. అంతనొక వీర తెలంగాణవాది. వెంకట్ సొంతూరు వరంగల్ జిల్లా జనగా మ. ఉస్మానియా

Published: Tue,September 6, 2011 12:11 AM

వో సుబహ్ కభీ థో ఆయేగీ...!?

దాదాపు నూటా పదిహేనేళ్ల క్రితం ఒక ఆదివాసీ యువకుడు అప్పటి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికి సరిగ్గా ఇరవైయ్యేళ్లు కూడ

Published: Sun,October 23, 2011 01:52 PM

పౌర సమాజం.. పజలు.. ప్రజాస్వామ్యం!

పొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు అనుకున్నట్టుగానే జరిగింది. భారత పార్లమెంటు అసాధారణ రీతిలో బాబూరావు హజారే అలియాస్ అన్నా హజ

Published: Mon,August 22, 2011 11:18 PM

అన్నా ..అవినీతి..మనం

పెద్ద పెద్ద త్యాగాలతో పనిలేకుండానే వారం రోజుల్లో విప్లవం తేవచ్చన్న సంగతి అన్నా హజారే చెప్పేదాకా మన దేశంలో ఎవరికీ తెలియలేదు. ఔను! అ

Published: Tue,August 16, 2011 05:32 PM

తెలంగాణకు ఇంక తెల్లారనే లేదు..!

పొ. ఘంటా చక్రపాణి (సామాజిక పరిశోధకులు) భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడా

Published: Tue,August 2, 2011 03:33 PM

నాటి దోషి-నేటి ద్రోహులు

వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలో

Published: Thu,July 28, 2011 07:32 PM

బలిదానం తప్ప మరి దారే లేదా?

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణా లు. అతను ఇంజనీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం త

Published: Tue,July 19, 2011 04:25 AM

తెగేదాకా లాగడమే మేలు..!

-ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ము

Published: Wed,July 27, 2011 09:15 PM

వారు సరిహద్దులు గీస్తున్నారు..

ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సి

Published: Wed,July 27, 2011 09:27 PM

ఉమ్మడిగా ఉద్యమిద్దాం

పొ. ఘంటాచక్షికపాణి (సామాజిక పరిశోధకులు) ‘ఘంటా’ పథం పాలకవర్గంలో ఉన్న ఒక ప్రతినిధి రాజీనామా చేయడమంటే బాధ్యత నుంచి పారిపోవడం

Published: Wed,July 27, 2011 09:21 PM

మన తరం మార్గదర్శి

ప్రొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థి