పౌర సమాజం.. పజలు.. ప్రజాస్వామ్యం!


Sun,October 23, 2011 01:52 PM

పొ. ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులుఅనుకున్నట్టుగానే జరిగింది. భారత పార్లమెంటు అసాధారణ రీతిలో బాబూరావు హజారే అలియాస్ అన్నా హజారేకు జీ హుజూర్ అంటూ సాగి ల పడింది. దీనివల్ల అవినీతిలో కూరుకుపోయిన తరువాత వ్యక్తులైనా, వ్యవస్థలైనా సమర్థించుకోవడం సాధ్యపడదని,ఎంతటి బలహీనుల ముందైనా తలవంచక తప్పదని మరోసారి రుజువయింది.వ్యక్తిగా,సిద్ధాంత పరంగా అన్నా హజారే పెద్ద బలవంతుడేమీ కాకపోయినా, ఎంచుకున్న ఎజెండా వల్ల ఆయన కొందరికి భగవంతుడి అవతారంగా కనిపిస్తున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా ఆయన ఇప్పుడు భారతీయ ఆధునికులకు కొత్త పాటలు నేర్పిస్తోన్న గురువుగా మారిపోయాడు. కంప్యూటర్లు కనిపెట్టాక ఇంట్నట్ (సైబర్ స్పేస్) మీద ఇంత తక్కువ కాలంలో అంత పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తీ ఇంకెవరూ లేరని ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణులు లెక్కలు గట్టి మరీ చెబుతున్నారు. పైగా ప్రపంచంలో ఇవాళ అన్ని దేశాల పత్రికల్లో అన్నా గురించి రాస్తున్నారు.

Anna-Ha-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaరేపో, మాపో అతని పేరును నోబెల్ ప్రైజ్ లాంటి అత్యున్నత పురస్కారానికి సిఫార్సు చేసినా ఆశ్చర్యం లేదు. ఇది అతని జీవితంలో ఊహించని విజయం. ఈ విజయం వెనుక నిరంతర కృషి, జీవితాంతం ఆచరించిన ఆదర్శమేదో ఉందనుకుంటే పొరపాటే. నిజానికి అతనొక సాధారణమైన పౌరుడు. అరవైయేళ్ల క్రితమే అత్యంత నిరాశాజనకమైన జీవితంతో విసిగిపోయిన యువకుడిగా తానిక జీవితంలో ఏమీ సాధించలేనని, బతకడమే దుర్భరమై, చావుతప్ప తనకు గత్యంతరం లేదని రెండు పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పూనుకున్న బాబూరావు హజారే తానే అన్నా హజారేగా అవతరిస్తానని ఊహించి ఉండడు. ఆత్మహత్య సంకల్పం నుంచి బయటపడ్డ హజారే తర్వాత భారత సైన్యంలో సాధారణ డ్రైవర్‌గా పదిహేనేళ్లు పనిచేసి పదవీ విరమణ చేసి తన స్వగ్రామంలో ఉంటూ సంఘ సేవకుడిగా మారిపోయాడు. అన్నాహజారే జీవితం, సాధించిన విజయం ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వాళ్లకొక పాఠం అవుతుంది.

అన్నా విజయం వెనుక కేవలం ఆయన వ్యక్తిగత కృషి మాత్ర మే కాదు. దేశ, విదేశాల్లో ఉంటూ అవినీతి అంతమైతే సమాజం బాగుపడుతుందనుకుంటున్న కోట్లాదిమంది ఆశలు, అలాంటి భావనకు బీజం వేసిన మీడియా మద్దతు, పౌర సమాజ ప్రయ త్నమూ ఉంది. మధ్య, ఉన్నత వర్గాల నుంచి అండ అన్నా ఉద్యమానికి లభించింది. మన రాజకీయ పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా అన్నా ఎజెండాతో ఏకాభివూపాయం లేకపోయినా ఈ ఒత్తిడి వల్ల పార్లమెంటులో తమ తమ అభ్యంతరాలను పక్కనపెట్టి అన్నా సూచనలకు ఆగమేఘాల మీద ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఎన్నికల సంస్కరణల పేరుతో పాలక వర్గాలకు అన్నా మరో కొత్త సవాలు విసురుతున్నారు. భవిష్యత్తులో ఎవలా స్పందిస్తారో వేచి చూ ద్దాం.

ఇప్పటికైతే అన్నా పుణ్యమా అని దేశంలో సమస్యలన్నీ మాయమైపోయి ఇప్పుడు పౌరసమాజమే ప్రధాన అంశమైపోయింది. జాతీయ మీడియా ఇప్పుడిప్పుడే అన్నా భక్తి పారవశ్యంలో నుంచి కాస్త బయటపడినట్టు కనిపిస్తున్నప్పటికీ, తెలుగు మీడియా మాత్రం తనదైన శైలిలో విడతల వారీగా కాసేపు అన్నా గురించి, మరికాసేపు జగనన్న గురించి తన వినోదాత్మక కథనాలతో ప్రజావాహినికి అవినీతి బోధ చేస్తోంది. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రజల్లో అవినీతి పట్ల ఏవగింపు ఉంది కాబట్టి మేము సైతం అవినీతికి వ్యతిరేకం అని క్రెడిట్ కొట్టేయవచ్చు. రెండోది తెలంగాణ అంశానికి తాత్కాలికంగానైనా తెరవేయవచ్చు. అందులో ఒక రకంగా మన మీడియాతో పాటు పాలక పక్షాలు సైతం పాక్షికంగానైనా విజయం సాధించినట్టే భావించాలి. తెలంగాణలోని సకల జనుల సమ్మెకు సమాయ త్తం కావాలని ప్రొఫెసర్ కోదండరాం కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచా రం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఏదో ఒక జిల్లాకు వెళ్లి ప్రజలను ఉద్యమ పంథాలోకి నడిపిస్తున్నారు.

చాలాచోట్ల ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వేలాదిమంది కూడా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని ఊరేగింపులు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న డాక్టర్లను గాడిదలని నోరుజారిన వైద్యశాఖ మంత్రి సుదర్శన్‌డ్డి చేసిన తప్పుకు చెంపలేసుకున్నారు. వరంగల్‌లో ఒక న్యాయమూర్తి తెలంగాణ న్యాయవాదులకు ఉద్యమాలు వద్దంటూ నీతిబోధ చేయాలని చూస్తే న్యాయవాదులం తా అతనికే హితబోధ చేసినట్టు వింటున్నాం. మరోవైపు తెలంగాణ అన్న ఉద్యోగులను, విద్యార్థులను, న్యాయవాదులను ప్రభుత్వం, పోలీసులు వేటా డి పట్టుకుని జైళ్లలో పెడుతున్నారు. ఇవేవీ తెలుగు మీడియా దృష్టికి రాలేదు. ఈ విషయాలపై చర్చ లేదు. ఈ వారం రోజుల్లో ఎవ్వరూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తాము తప్ప వేరే సమాజమే లేదన్నట్టుగా నిరంతరం విశ్వసించే మన మీడియా ఇప్పుడు పౌర సమాజం గురించి పెద్ద పెద్ద మాటలు చెపుతోంది.

మీడియా దృష్టిలో ప్రొఫెసర్ కోదండరాం పౌర సమాజ ప్రతినిధి కాదు. తెలంగాణ పౌరులందరి ఆకాంక్షలకు వేదికలుగా ఏర్పడ్డ జాయింట్ యాక్షన్ కమిటీలు పౌర సమాజం కాదు! గుడ్డిలో మెల్లగా ఈ అందరి ఆకాంక్షలకు ప్రతినిధులుగా రాజీనామాలు చేసిన వందలాది మంది ప్రజా ప్రతినిధులు కూడా పౌర సమాజం కాదు. స్పీకర్ గారి దృష్టిలో కూడా చిత్తశుద్ధి లేదు. ఒక్క మీడియానే కాదు, సమాజం గురించి ఏ ఒక్కరోజు కూడా అస్స లు పట్టించుకోని వాళ్లు ఇవాళ పౌర సమాజం గొప్పతనాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఇంతకీ పౌర సమాజం అంటే ఏమిటి? మన సమాజానికి (మానవ సమాజానికి) పౌర సమాజానికి తేడా ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలి. ఇటు పౌరులకు, అటు సమాజానికి జవాబుదారీగా ఉండలేని వాళ్లు ఎందుకు పౌర సమాజాన్ని నెత్తినెత్తుకుంటున్నారు? అన్న విషయాలూ ఆలోచించాలి.
సమాజం అంటే మనందరం. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న పౌరులంద రం కలిస్తేనే భారతీయ సమాజమో, తెలుగు సమాజమో, తెలంగాణ సమాజమో అవుతాం.

ఈ పౌరులంతా పరస్పరం సహకరించుకుం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటేనో దాన్ని సమాజం అంటాం. రాజ్యాంగం పుణ్యమా అని అందరికి సమాన పౌరసత్వం ఉంది గానీ ఇంకా సామాజిక భావనే పూర్తిగా మనలో లేదు. ఇంకా కుల సమాజంతోనో, మత సమాజంతోనో గుర్తింపు పొందే స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ చాలా ఉదారంగా మనదంతా ఒకటే భారతీయ సమాజం అనుకున్నా, భారతీయులంతా మన సహోదరులని భావించినా ఎవరి సంస్కృతులు, భాషలు, జీవన విధానాలు, అస్తిత్వాలు వారికున్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే మనం రాజకీయంగా ‘ప్రాతినిధ్య తరహా ప్రజాస్వామ్యంలో’ ఉన్నాం. అంటే అమెరికాలో లాగా అందరం ఒకే వ్యక్తికీ ఓటేసి ఎన్నుకోకుండా మన మన నాయకులను ఎన్నుకుని చట్టసభలకు పంపిస్తున్నాం. ఆ ప్రతినిధులు మన అవసరాలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అయినా ప్రభుత్వాలు మన ఆకాంక్షలకు అనుగుణంగా నడవడం లేదు. మన ప్రతినిధుల మాట చెల్లడం లేదు. మాట చెల్లనందుకు నిరసనగా రాజీనామాలు చేసినా అవీ చెల్ల డం లేదు. దానికోసం కూడా పోరాటాలు చేయవలసి వస్తోంది.

అటువంటి ది హటాత్తుగా నలుగురు వ్యక్తులు పౌర సమాజం పేరుతో తెరమీదకు వచ్చి, ఈ దేశ పౌరులందరికీ తామే ప్రతినిధులం అని చెప్పుకోవడం విడ్డూరం. విచివూతంగా వాళ్లు చెప్పుకున్నట్టే మనం కూడా వాళ్లను పౌర సమాజం అంటు న్నాం. నిజానికి పౌర సమాజం అనేది పాలకుల సృష్టి. సమాజానికి జవాబుదారులుగా లేని వాళ్లు సృష్టించిన వ్యవస్థ. ప్రజా జీవితంలో ఉండి, ప్రభుత్వేతరంగా ఉంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థలను పౌర సమాజంగా ప్రపంచ బ్యాంకు పిలుస్తోంది. ప్రభుత్వాలు ప్రజల విశ్వసనీయ త కోల్పోతున్న రోజుల్లో సమాజానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచబ్యాంకు పౌర సమాజాన్ని పెంచి పోషిస్తోంది. గతంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండే వి. సమాజ సేవా తత్పరత కలిగిన కొందరు సమాజంలో ఉన్న చెడు ధోరణులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. మంచిని బోధించేవారు. అటువంటి వ్యక్తులు, సంస్థలు కొన్ని ఆ తరువాత ఎన్జీవోలు అంటే ప్రభుత్వేతర సంస్థలుగా మారాయి. వీటికి ప్రభుత్వాల నుంచి, దేశ, విదేశాల నుంచి నిధులు అందుతాయి.

ఇక్కడి ప్రభుత్వాలు చేయలేకపోతున్న అభివృద్ధి పనులను ఈ సంస్థలు తమకు అందుతున్న నిధులతో చేస్తుంటాయి. అట్లా ఉన్న కొన్ని సంస్థలే అభివృద్ధి సంగతి పక్కనబెట్టి ఈ దేశాన్ని, చట్టాలను, పరిపాలన వ్యవస్థలను సంస్కరించాలన్న ప్రచారానికి పూనుకున్నాయి. చాలామంది చదువుకున్న వాళ్లు, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు ప్రభుత్వంలో ఉండి దేశ ప్రగతిలో భాగం కావాల్సిన వాళ్లు, ఉద్యోగాలు వదిలేసో, పదవీ విరమణ చేసిన తరువాతో ఇలాంటి పనికి పూనుకుంటున్నారు. ఇలాంటి పనిలో వారికి ప్రభుత్వంలో కంటే ఎక్కువ జీతం, గౌరవం, హోదా దొరుకుతున్నాయి. లోక్‌సత్తా కూడా పార్టీగా మారకముందు అలా పౌర సమాజంగా చెలామణి అయింది. జయవూపకాశ్ నారాయణ్ ఐఎఎస్ అధికారి అయి ఉండీ, పదవీ విరమణ చేసి పౌరసమాజ ప్రతినిధిగా మారినట్టే, కిరణ్‌బేడీ కూడా తనే స్వయంగా ఎన్జీవోలు ఏర్పాటు చేసుకుని పౌరసమాజ ప్రతినిధిగా అవతరించింది. హజారే జీవితంలో కూడా ఈ మూడు దశలూ ఉన్నాయి.

సైన్యం నుంచి తిరిగి వచ్చాక తన స్వగ్రామమైన రాలేగాం సిద్ధిలో స్థిరపడ్డ అన్నా, ఆ ఊర్లో మద్యపానానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి అనుకూలంగా ప్రచా రం చేసి స్వచ్ఛంద సేవకుడిగా ఉండేవాడు. ఆ తరువాత ఎన్జీవో ప్రారంభించి గ్రామీణ నీటి పారుదల రంగంలో పనిచేశాడు. ఆ తరువాత పౌర సమాజ కార్యకర్తగా సమాచారహక్కు బిల్లు రూపొందించిన వారితో కలిసి పనిచేశాడు.

ఇట్లా ప్రభుత్వ, దేశ, విదేశ ప్రభుత్వేతర సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుని ఇంతకాలం పాలకపక్షాలకు అనుబంధంగా, కొన్నిసార్లు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పనిచేస్తూ వస్తోన్న వాళ్లను ఇప్పుడు మీడియా పౌర సమాజమని అంటోంది. నిజానికి అటు పౌరుల్లో భాగంగా లేనివాళ్లు, ఇటు సమాజంతో సంబంధం లేనివాళ్లే ఇవాళ పౌరసమాజం పేరుతో ప్రభుత్వాల కు వణుకు పుట్టిస్తున్నారు. పాలసీలు చేస్తామని ముందుకొస్తున్నారు. ఇంతకాలం ఇటు ప్రభుత్వాలు, అటు ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలు వాళ్ల పనులకు, విధానాలకు జనామోదం ఉందని చెప్పుకోవడానికి ఈ సంస్థలను ఉమ్మడిగా వాడుకునేవి. ఇప్పుడు ప్రపంచీకరణ పేరుతో ప్రైవేటు రంగం విస్తరించాక అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంస్థలు, కార్పొరేటు సంస్థలు కూడా వీటిని వాడుకుని కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ఆయా దేశాల ప్రభుత్వాల మెడలు వంచి తమకు అనుకూలంగా ఉండే చట్టాలను తయారు చేసుకుంటున్నాయి.

గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నప్పు డు దాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రజా సంఘాలకు భిన్నంగా ఈ ‘పౌర సమాజమే భూసేకరణను చట్టబద్ధం చేయాలని వాదించింది. అలాగే ప్రపంచబ్యాంకు పారదర్శకత పేరుతో ప్రభుత్వం లోపల ఏమి జరుగుతుందో తనకు తెలియాలని శాసించినప్పుడు ఒకవైపు ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే పౌర సమాజం మాత్రం సమాచార హక్కు కోసం లాబీయింగ్ చేయడమే కాక ప్రత్యామ్నాయంగా చట్టమే రూపొందించింది. దాన్ని గుడ్డిగా ఆమోదించిన ప్రభుత్వం ఇప్పుడు లోక్‌పాల్ చట్టం విషయంలో పౌరసమా జం ఉచ్చులో పడి పరువు తీసుకుంది.

అన్నా హజారే పౌరసమాజ ఉద్యమం పేరుతో చేస్తున్న ఆందోళన రెండు ప్రధాన పరిణామాలకు దారి తీయనుంది. ఈ ఉద్యమం ఈ దేశంలో ప్రజలు వేరు, పౌర సమాజం వేరని, ప్రజా ఉద్యమాలకు బెదరని ప్రభుత్వం పౌర సమాజం పేరుతో సాగే పెట్టుబడిదారీ ఉద్యమాలకు వణుకుతుందని ఇప్పటికే నిరూపించింది. అలాగే అవినీతి అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మాత్ర మే సంబంధించిన అవలక్షణమని దీనితో కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థకు సంబంధం లేదని చెపుతోంది. నిజానికి ఈ దేశంలో మార్కెట్ వ్యవస్థ ప్రవేశించిన తరువాతే అవినీతి కోట్లకు పడగపూత్తింది. అన్నా ప్రతిపాదిస్తోన్న జన్ లోక్‌పాల్ బిల్లు కేవలం ప్రభుత్వ రంగానికి అవినీతి రంగు పూసి ప్రైవేటు పెట్టుబడిదారులను గాలికి వదిలేస్తోంది. అంటే భవిష్యత్తులో అవినీతికి ప్రజలను బాధ్యులని చేసి, ప్రభుత్వంలో భాగంగాలేని కోటీశ్వరులకు కొమ్ముకాసే చట్టం ఇవాళ రాబోతుంది. రాజ్యాంగం ద్వారా ప్రజలు ప్రభుత్వాలకు ఇచ్చిన అనేక హక్కులను, అవకాశాలను ప్రభుత్వ ప్రమేయంలేని వ్యక్తుల కూటమికి కట్టబెట్టే ఒక ప్రత్యామ్నా య వ్యవస్థను ప్రతిపాదిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి నిర్ణయాన్ని బట్టి మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తాయి.

అటువంటి ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలు వాటిని సరిచేయ ప్రయత్నిస్తాయి. అలాంటి ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాలను ప్రభుత్వాలు గౌరవించకపోగా, పౌర సమాజం పేరు తో ప్రజలకు సంబంధంలేని వ్యక్తుల కూటములకు దాసోహం అవడం సార్వభౌమాధికారానికే ప్రమాదం. ఇది అంతర్జాతీయంగా సాగుతోన్న కుట్ర. కాబ ప్రభుత్వం చేతుపూత్తేసింది. ఒక్క ప్రభుత్వానికే కాదు మన రాజకీయ పార్టీలన్నిటికీ ఈ సంగతి తెలుసు. అందుకే అన్నా జన్‌లోక్‌పాల్ అసంబద్ధం అంటూనే అతని పోరాటానికి మద్దతు ఇస్తామని అంటున్నాయి.

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇప్పుడు అవినీతి పోరాటానికి కూడా విస్తరించాడు. దృష్టి లోపం ఉన్నప్పుడు లోకమంతా రెండుగా కనిపిస్తుంది మరి. ఒకవైపు తన ఆస్తిని వెయ్యికోట్లకు పందెం కాసిన వ్యక్తే ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానంటున్నాడు. జగన్ ఎంతైనా ఈ తరం వాడు కదా! రెండెకరాలు కూడా లేని చంద్రబాబుకు వెయ్యికోట్లు ఉంటే అవినీతి కానప్పుడు వారసత్వంగా వందలాది ఎకరాలున్న తనకు లక్ష కోట్లు ఉంటే అవినీతి ఎలా అవుతుందని అడుగుతున్నాడు. ఢిల్లీ కేంద్రంగా సాగుతోన్న అవినీతిపై వ్యతిరేక పోరాటానికి సంఘీభావం పేరుతో హంగామా చేస్తోన్న వాళ్లెవరూ ఇక్కడ హైదరాబాద్‌లో బయటపడుతోన్న అవినీతి గుట్టల గురించి మాట వరసకైనా మాట్లాడలేకపోతున్నారు. ఈ మధ్య కొందరు సినిమా పెద్ద లు కూడా పాపం నిరాహారదీక్షలు చేసి మరీ తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.


తప్పులేదు. కానీ అదే తెలుగు సినిమా పరిక్షిశమలో సాగుతోన్న కోటానుకోట్ల అవినీతిపై వీళ్లెప్పుడూ పెదవి విప్పరు. ఈ మధ్య కాలం లో మన సినీ పెద్దలు కొందరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు పన్నులు ఎగ్గొడుతున్నట్టు, పబ్బులు నడిపిస్తూ అనైతిక ప్రవర్తన ప్రేరేపిస్తోన్నట్టు, డ్రగ్స్ వ్యాపారంలో దొరికిపోతున్నట్టు, ఇంకొంత మంది అసాంఘిక శక్తులతో కలిసి భూ ఆక్రమణలు, సెటిప్మూంట్లు చేయడమే కాక, హత్యలు, దోపిడీలకూ పాల్పడ్డట్టు అభియోగాలొచ్చాయి. కొందరిని పోలీసులు ఆయా నేరాల కింద ఆరెస్టు కూడా చేశారు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఇన్ని జరుగుతున్నా తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండే వాళ్లే ఇవాళ వీధుల్లోకొచ్చి సమాజానికి నీతిబోధ చేస్తున్నారు.

తామంతా పౌర సమాజమేనని తమకు ప్రశ్నించే హక్కు ఉంటుందని వాదిస్తున్నారు. సమాజం గురిం చి ఎన్నడూ ఆలోచించని వాళ్లకు పౌర సమాజం అని చెప్పుకునే హక్కు ఉండ దు. ఉండకూడదు. కానీ ప్రభుత్వం ఇవాళ సమాజంలోని అసలైన పౌరుల ఆకాంక్షలను అణచివేసి, పౌర సమాజం పేరుతో యాగీ చేస్తోన్న కొందరి అడుగులకు మడుగులొత్తుతోంది. ఈ రెండూ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు వ్యతిరేకమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా.

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Featured Articles