బాలచంవూదుడికి బాసట కాలేమా!


Thu,February 21, 2013 10:50 PM


బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్నాడు. కానీ బుద్ధుని బోధనలకు నిలయం గా చెప్పుకునే శ్రీలంక ఇప్పుడొక రాక్షస రాజ్యంగా కనిపిస్తున్నది. దయ నిండి ఉండవలసిన అక్కడి మనుషుల హృదయాలు ఇప్పుడు క్రూరత్వంతో నిండిపోయి ఉన్నాయి. గడిచిన మూడు నాలుగేళ్ళుగా వస్తున్న వార్తలు వింటుంటే అదొక బౌద్ధ క్షేత్రంగా కాక యుద్ధోన్మాద క్షేత్రంగా మాత్రమే కనిపిస్తున్నది. నిజానికి దాన్ని యుద్ధమని కూడా అనలేం. నా దృష్టిలో అదొక జాత్యాహంకార హంతక ముఠా. కాకపోతే పసి పిల్లలను పనిగట్టుకుని వేటాడడం ఏమిటి? బ్రిటన్‌కు చెందిన చానెల్ 4 అనే టెలివిజన్ నెట్‌వర్క్ శ్రీలంకలో సాగుతున్న నరమేధాన్ని నాలుగు భాగాలుగా ఇప్పటికే ప్రసారం చేసిం ది. తాజాగా ఈలం పోరాట రూపశిల్పి వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడు పన్నెండేళ్ళ బాలచంవూదన్ ప్రభాకరన్‌ను చంపిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దృశ్యాలు మనసున్న ప్రతివారినీ కలచివేశాయి. ఇంతకాలం శ్రీలంక పాలకుల క్రూరత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వముసుగును ఈ వాస్తవాలు తొలగించనున్నాయి.

బాల చంద్రన్ యుద్ధరంగంలో ఉన్న సైనికుడు కాదు. ఎవరికీ హాని తలపెట్టినవాడు కాదు. కేవలం ప్రభాకరన్ కొడుకు కావడమే ఆ బాలుడు చేసుకున్న నేరం. ఆ లంక గడ్డ మీద ఒక తమిళుడుగా పుట్టడమే ఆ పసివా డు చేసుకున్న పాపం. ఆ పాపానికి పసివాడని కూడా చూడకుండా శ్రీలంక సైన్యం అతని ప్రాణాలు తీసింది. మామూలుగా కాదు పర మ కిరాతకంగా కాల్చి చంపింది. కాల్పులు జరపడానికి వీలులేని, యుద్ధరహిత ప్రాంతం ‘నో-వార్ జోన్’లో ఉన్న బాలచంవూదన్‌కు తినడానికి బిస్కట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని మరీ చంపి పారేసింది. ఇది అమానుషం. శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నదని చెప్తూ వస్తున్న అక్కడి ప్రభుత్వం కనీసం యుద్ధనీతిని కూడా పాటించలేదు. అసలు చంపడానికి వీలుకూడాలేని సందర్భం ఇది. ఇది మానవత్వం గురించి, హక్కుల గురించి మరీ ముఖ్యంగా ఒక ప్రాంతపు ప్రజ లు తమ అధికారాల గురించి పోరాడడం న్యాయం అని నమ్మే ఎవరూ హర్షించని, సమర్థించలేని సందర్భం. ఇప్పుడు ఈ హత్యా వెలు గు చూసి న తరువాత శ్రీలంక ప్రభుత్వాన్ని క్షమించడానికి కూడా వీలులేదు. శ్రీలంక చేసిన హత్యల్లో ఇది మొదటిది కాదు చివరిది అంతకంటే కాదు.12 రోజుల పసిపాపలు మొదలు పండు ముదుసలి తమిళజాతిలో ఒక్క ప్రాణి కూడా మిగల కూడదన్నది శ్రీలంక తీసుకున్న శపథం. అందు కే 2008-09 మధ్య తమిళులు నివసించే జాఫ్నా పరిసరాలను శ్రీలంక ముట్టడించి యావత్ జాతిని మట్టుపెట్టే పనికి పూనుకుంది. లంక నరమేథంలో ఇప్పటికే లక్షలాదిమంది చనిపోయారని, మరికొన్ని లక్షలమంది అక్కడి సైనికుల చేతుల్లో బందీలుగా ఉన్నారని మానవహక్కుల సంఘాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు పేర్కొంటున్నాయి. ఇంత జరుగుతుంటే భారతదేశం మాత్రం మౌనంగా చూస్తున్నది.పన్నెండేళ్ళుగా భారత్ మౌనముద్ర తమిళజాతి హననానికి ఆమోద ముద్ర వేసింది.

శ్రీలంక అతివూపాచీన బౌద్ధ సమాజాల్లో ఒకటి. క్రీస్తు పూర్వమే అశోక చక్రవర్తి కుమారుడు అరహత్ మహేంద్ర, కూతురు సంఘమిత్ర అక్కడ బౌద్ధానికి బీజం వేశారు. బుద్ధ గయ నుంచి తీసుకెళ్ళిన బోధి వృక్షాన్ని అక్కడ నాటి వచ్చారు. శ్రీలంక శాంతి కపోతమై విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. అప్పటి నుంచి శ్రీలంక అధికారికంగా ఒక బౌద్ధ దేశంగా ఉన్నది. కానీ బుద్ధుడి సందేశాన్ని మరిచింది. అశోకుడు త్యజించిన యు ద్ధాన్ని ఇప్పుడు లంక తలకెత్తుకున్నది. శ్రీలంక నరమేధాన్ని యుద్ధమని అనడానికి కూడా వీలులేదు. అది ఒక జాతిని నిర్మూలించే కుట్ర. లంక గడ్డమీద తమిళుల ఆనవాళ్ళు లేకుండా చేసే హత్యాకాండ. ఇది బౌద్ధానికి విరుద్ధం.ఈ సంఘటనల తరువాత అహింస బోధించిన బుద్ధుని అనుయాయులు సిగ్గుతో తలవంచుకోవాలి.శ్రీలంకను తమ మతం నుంచి వెలివేయాలి. కేవలం మతం నుంచే కాదు. హంతకుణ్ణి సభ్యసమాజం నుం చి వేలివేయాలని బౌద్ధం చెపుతోంది. బుద్ధుడు అహింసా సిద్ధాంతకర్త. ఆయన ప్రతిపాదించిన ప్రతిమోక్షాలలో హత్యలు ఒకటి. బుద్ధుడిగా మారాలనుకునేవాడు, బౌద్ధాన్ని ఆచరించేవాడు హత్యలకు దూరంగా ఉండాలి. చావడం చంపడం బౌద్ధం దృష్టిలో క్షమార్హం కాని నేరాలు. ‘బౌద్ధం ఆచరిస్తున్న వ్యక్తి ఎవరినైనా హత్యా చేసినా, హత్యకు ప్రేరేపించినా, సహకరించినా, సాయుధ సంపత్తి సమకూర్చినా, హత్యలను కీర్తించినా, హత్యలను చూసినా, మిన్నకుండినా, హత్యలను ఆమోదించినా, ఇతరుల చావుకు కారణం, సందర్భం, వాహకమైనా... అతడిని బౌద్ధం నుంచి వేలివేయాలని’ బుద్ధుడు పేర్కొన్నాడు. శ్రీలంకలో సాగుతున్న ఊచకోత అక్కడి రాజ్యం చేస్తున్న అరాచకం. కాబట్టి శ్రీలంకకు బుద్ధుడి పెరేత్తే అర్హతలేదు. దీనిపై బౌద్ధ పండితులు ముఖ్యంగా చైనా నియంతృత్వం మీద దండె త్తే దలైలామా నోరు విప్పాలి.

ఇక రెండోది, భారత ప్రభుత్వం శ్రీలంక మీద చర్యలకు పూనుకోవాలి. కనీసం ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని విరమించుకుని ఆంక్షలు విధించాలి. సాధారణంగా జాతి నిర్మూలనకు పాల్పడే దేశాలు, హింసను ప్రేరేపించే దేశాలను వెలివేయడం, ఆంక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం దౌత్యనీతి. అది ఏ దేశమైనా ఇంకొక దేశం మీద చేయవచ్చు. కానీ భారత ప్రభుత్వం మాత్రం శ్రీలంక విషయంలో ఆ సాహసం చేయడం లేదు. అక్క డ సైన్యం చంపుతున్నది భారతీయ సంతతిని. తమిళులను. అయినా ప్రభు త్వం స్పందించక పోగా సహకరిస్తున్నది. చరివూతలో అనేక సందర్భాల్లో శ్రీలంక తమిళులకు అన్యాయం చేసిన భారత్ ఇప్పుడు తన మౌనంతో మరో చారివూతక తప్పిదానికి ఒడిగడుతోంది. దశాబ్దాల పాటు శ్రీలంక తమిళులు తమ అస్తిత్వం, అధికారాల కోసం అన్నిరకాల ప్రజాస్వామ్య పద్ధతు ల్లో పోరాడారు. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో సమ సమస్యలను నివేదించారు. శ్రీలంక ప్రభుత్వం తమను రెండో శ్రేణి పౌరులుగా చూస్తూ, కనీస సౌకర్యాలు కల్పించక వేధిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేశారు. కొన్ని సాధించుకున్నారు. కొన్నిచోట్ల విఫలం అయ్యారు. అనేకమంది ఆత్మాహుతులకు పాల్పడ్డారు. అయినా అక్కడి పాలకులు తమిళులను మనుషులుగా గుర్తించలేదు. 1970వ దశకం నాటికి అది సాయుధ పోరాట మార్గం తీసుకున్నది. తమిళ ప్రాంత స్వయం పరిపాలనకు విముక్తి మినహా మార్గం లేదని, దానికి సాయుధ పోరాటం ఒక్కటే పరిష్కారమని ఎల్‌టీటీఈ భావించింది. ప్రభాకరన్ నాయకత్వంలో ఎల్‌టీటీఈ దీర్ఘకాలం పోరాడి 1980 ఆరంభం నాటికి తమిళ ప్రాంతాలను విముక్తి చేసింది. అప్పుడు ప్రభాకరన్ భారత ప్రభుత్వానికి వీరపువూతుడిగా కనబడ్డాడు. ఇందిరాగాంధీ హయాంలో టైగర్లకు అన్నిరకాలుగా భారత్ సహకరించింది. శ్రీలంక సైన్యాలతో పోరాడుతున్న తమిళ మిలిటెంట్లకు ఆహారం, మందు లు, ఆయుధాలు భారత్ నుంచే అందేవి. రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశంతో రాజకీయాలు మారాయి. ఆయన హటాత్తుగా శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. 1987లో భారత ‘శాంతిసేన’ పేరుతో శ్రీలంకకు సైన్యాన్ని పంపించి తమిళులను అణచివేసి అక్కడ శాంతి స్థాపించాలనుకున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి చివరకు ఆయనే 1991లో తమిళ టైగర్ల చేతిలో హత్యకు గురయ్యారు. బహుశా ఇప్పుడు మౌనం వహించడానికి తమిళుల మీది ప్రతీకారమే కారణమా! ‘శ్రీలంక తమిళులు రాజీవ్ గాంధీని చంపారు కాబట్టి మేం జోక్యం చేసుకొం’ అన్న ధోరణిలో భారత ప్రభుత్వం ఇంతకాలం ఉన్నది. కానీ చరివూతలోకి వెళ్లి పరిశీలిస్తే ఆ టైగర్లను పెంచి పోషించింది, ఆనక అణచి చంపింది ఎవరనేది అర్థం కాని విషయం కాదు. ప్రభుత్వాలకు రాగద్వేషాలు ప్రతీకారేచ్చ ఉండకూడదు. లేవనే అనుకుందాం. అలా అనుకోకపోతే మనకు రాజ్యం పట్ల ఏహ్యభావం కలుగుతుంది.

ఇప్పుడు భారత్ మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చింది. త్వరలోనే శ్రీలంకలో సాగుతున్న మారణకాండ, మానవహక్కుల హననం ఐక్యరాజ్య సమితిలో చర్చకు రానున్నాయి. ఇంతకాలం భారత్ మౌనాన్ని ఆసరాగా చేసుకుని శ్రీలంక తమిళజాతి నిర్మూలనకు పూనుకున్నది. ఒకవైపు చర్చలు సంప్రదింపులు చేస్తూనే శ్రీలంక్ ప్రభుత్వం తమిళ ప్రాంతాల్లో తన బలగాల విస్తరణకు పూనుకున్నది. ఎల్‌టీటీఈ చేసిన, చేస్తున్న హింసను సాకుగా చూపి దానినొక టెర్రరిస్ట్ సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. అప్పటి దాకా హింసను ప్రేరేపించిన దేశాలన్నీ హటాత్తుగా శాంతిమార్గం పట్టాయి. ఇట్లా ఎల్‌టీటీఈని ఒంటరిని చేసి శ్రీలంక సైన్యం 2008-09లో చేసిన చివరి ముట్టడిలో మొత్తం తమిళ ప్రాంతాన్ని ఆక్రమించి, టైగర్లను మట్టుపెట్టింది. లంక సైన్యం దాడుల్లో ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతో పాటు లక్షలమంది హతమయ్యారు. దాడుల్లో కొందరిని చంపితే వేలాదిమందిని నిర్బంధంలోకి తీసుకుని ‘నో వార్ జోన్’కు తరలించి చంపేశారని, శవాలను కూడా అత్యాచారాలు చేసి కసి తీర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పసిపిల్లలకు పాలు అందకుండాచేసి చంపేశారని, శరణార్థ శిబిరాల్లో క్షతగావూతులై ఉన్న ముసలివాళ్ళను, మహిళలను వైద్యం అందకుండాచేసి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అనేక ఆధారాలను చానల్ 4 సమకూర్చింది. వాటి మీద ఇప్పటికే అంతర్జాతీయ విచారణ సంస్థలు నిజనిర్ధారణ జరిపి శ్రీలంక ఆకృత్యాలను నిరూపించాయి. ఐక్యరాజ్య సమితి కూడా వాటిని నిర్ధారించిం ది. ఈ అంశాలన్నీ సాక్షాధారాలతో సహా ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అందాయి. ఆ అఘాయిత్యాలు చేసిన సైనికులు తీసిన ఫోటోలు, వీడియోలే ఇప్పుడు సమితి చేతికి అందాయి. అవి నిజమని నిర్ధారణ కూడా అయ్యింది. అందులో బాల చంద్రుడు కూడా ఉన్నాడు. అవును చానల్ 4 బాలచంవూదన్ హత్యోదంతం వీడియోను అక్కడ ప్రదర్శించనుంది. లంక సైనిక మూకల క్రౌర్యానికి బలైపోయిన ఆ వీరపువూతుడు జెనీవాలో జరిగే సదస్సులో తన జాతి హననానికి మూగ సాక్షిగా నిలువబోతున్నా డు.ఇప్పుడు ఆ సాక్షాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత భారత ప్రభు త్వం మీద ఉన్నది. భారత్ గట్టిగా నిలబడితే శ్రీలంక మీద చర్య తీసుకోవాలన్న డిమాండ్‌కు బలం చేకూరుతుంది.

ఇప్పటికే లంకలో తోటి భారత సంతతి మీద సాగుతున్న నరమేధం మీద చర్చ జరుగుతున్నది. తమిళజాతి గుండె పగిలి రోదిస్తున్నది. అంతటి విషాదంలోనూ తమిళ సమాజం తెలంగాణ ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించింది. శ్రీలంక తమిళుల ఊచకోతను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న ‘సేవ్ తమిళ్స్’ అనే వేదిక గత జనవరి 26 రిపబ్లిక్ డే నాడు చెన్నైలో ‘తెలంగాణ ఒక చారివూతక అవసరం’ పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం తరఫున కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీతారామరావు ఆ సభలో పాల్గొన్నారు. లిబరేషన్ పాంథర్స్ పార్టీ పార్లమెంటు సభ్యుడు తిరుమావలవన్ కూడా సభలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. తక్షణమే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సదస్సు తీర్మానిస్తూ తెలంగాణ ఉద్యమానికి తమిళ సమాజం తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించింది. వారికి కృతజ్ఞతగా మాత్రమే కాదు, జాతుల పోరాటాలకు మద్దతుగా, క్రూర, నియంతృత్వ అణచివేత ధోరణులకు, జాత్యహంకార ధోరణులు, జాతుల హననానికి వ్యతిరేకంగా మనుషులుగా నిలబడ వలసిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ దిశగా నడిపించవలసిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉన్నది.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

country oven

Featured Articles